పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, జూన్ 2014, శుక్రవారం

Sriramoju Haragopal కవిత

వానకాలం ఎనుకటిసంది వొస్తున్నదే మనుష్యుల నడుమ తడుముకునే ఆత్మీయతల తడిజాడ బీరుపోయిన చూస్తున్న పొడిమబ్బుల లెక్క దున్నిన దుక్కులు బిక్కమొగాలు పెట్టుకున్నట్టు గంపల్ల,సంచుల్ల ఒంటికాళ్ళమీద నిలబడి చూస్తున్న విత్తుల లెక్క రుతువు రాంగనే ప్రాణం పచ్చిగైపోతది మనుష్యులు మొలకలపండుగలైతరు చింతకొమ్మలకు కట్టిన సద్దిమూటల్ల పొలం ముచ్చట్లుంటయి కాలువపొంటి జాలువారిన నీళ్ళు తొవ్వలెతుక్కుంటయి నాగలికొండ్రేసుకుని నడిచే ఎద్దుల్ని బాట ముద్దుపెట్టుకుంటది తొలుతవానల్ల తడువాలని రైతు కొప్పెర తెచ్చుకోడు చిటచిటకొట్టే ఎండను చూసి, ఉబ్బరాన్ని చూసి ఇగ వొచ్చె వాననుకుంటం మనుష్యులు తడిస్తె బాగుండు మనసులల్ల ఇంత పాఁవురం పుడితె బాగుండు వాన కాలిస్యమే, మనుష్యుల నెనరు కాలిస్యమే ఎట్ల బతుకుతం మనం బువ్వకే అనుకుంటం చెలిమల నీళ్ళు పుట్టినట్టు ప్రేమలు వూరాలె బావుకంవానలు గొట్టాలె తడువాలె అందరం భూమి,చెట్లు,చేమలు, మనుష్యులు తడిస్తేగాని ఎరుకకాదు ఎవలెట్లనో,ఏదెట్లనో ఎందుకు బతుకుతమో

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkYR1d

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి