పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మే 2014, శుక్రవారం

Ravela Purushothama Rao కవిత

కలలకాలం =============రావెల పురుషోత్తమరావు కలకాలం గుర్తుండిపోయేది కల కాదుకదా క్షణభంగురమూ బుద్బుద ప్రాయమైనదేకదా కలంటే. నిద్రపట్టని దశలో కనేకలలకన్నా జాగృదావస్థలోని కలలే వాస్తవానికి దగ్గరగా మసలుతాయని కొందరి భావన. తెల్లవారు ఝామున వచ్చేకలలన్నీ నిజమౌతాయని కొందరి ఊహ. కలల మీద మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎన్నో వాస్తవాలు చెప్పారట. ఏదిఏమయినా కలలో అప్రాప్తమనోహరి దర్శనమిచ్చే యవ్వనం అమూల్యమైనది. యముని మహిషపు లోహ గంటల శబ్దం కలలలో వినబడనంతవరకూ కనేకలలకు ఓ పరమార్ధముందని నా ప్రతిపాదన. కలంటే వాస్తవ జీవనయానంలో కనబడని నైరూప్యచిత్రమేమోకూడా! ===========================================

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kASAgB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి