మొయిద శ్రీనివాసరావు //సముద్రమంత . . .చెమటచుక్క// లోకం. . . వెలుగు చీరను విడిచి చీకటి పాతను చుట్టుకుంటున్న సమయం తన పిల్లలను తానే తినే ఆకలిగొన్న పాములా అలల నాల్కులతో బుసలుకొడుతుంది సముద్రం శ్రమ రెక్కలను సాగదీసుకుంటూ. . . సముద్రంపై ఒంటరి పక్షిలా అతడు తీరంపై. . . పగిలిన దాకలాంటి గుడిసెలో ఎండు రొయ్యల్లా వుండచుట్టుకు పడుకున్నారు పిల్లలు వారి కడుపాకలి కంట్లో ఇసుకై కరకరలాడుతుంటే నెత్తిన గంపెడాశతో ఒడ్డున ఒంటరి దీపస్తంబంలా అతగాడికై ఎదురుచూస్తూ. . .ఆమె నీటిపై తాబేలులా కదలాడిన పడవను అతడు తెడ్డు సాయంతో ఒడ్డుకు చేర్చేసరికి చచ్చిన ఏనుగులా చతికిలబడింది చితికిన బతుకై వెక్కిరిస్తున్న వలను విదిలిస్తే చాలీచాలని చిల్లరకాసులై రాలిపడుతున్న చేపలను చూసి వీచే గాలి సైతం విషాదగీతాన్నాలపిస్తుంది ఇంతటి సముద్రాన్ని ఈదుకొచ్చినతడు ఇంటి సముద్రాన్ని ఈదాలంటే ఒడ్డున సైతం పిడికిట్లోకి తెడ్డును తీసుకోవాల్సిందే! 2.5.14 * * *
by Srinivasa Rao Moida
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWsLKT
Posted by Katta
by Srinivasa Rao Moida
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWsLKT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి