పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మే 2014, శనివారం

Mercy Suresh Jajjara కవిత

|మేఘా రూఢుఢ రమ్ము| Mercy Margaret ------------------------------------ చీకటి ముంచుకొస్తుంది భయం తరుముకొస్తుంది ఈ దేశం నాదికాదని నా అస్థిత్వం కోసం చేస్తున్న యుద్దాన్ని గేలిచేస్తూ వెక్కిలిగా నవ్వుతుంది ఓట్లకోసం సెక్యులర్ ముసుగు తొడిగిందేమో అక్కడక్కడ చినిగిన ముసుగులోంచి నా వాళ్లను నిలువునా కాల్చిన దృశ్యాలు కత్తిపోట్లతో నిట్టనిలువునా చీల్చిన రక్తపు చారలు కనిపిస్తున్నా అమాయకత్వాన్ని కొని, ముఖానికి అంటించుకుంటున్న దాన్ని నమ్మిన నా తోటి గొర్రెలకు రాబందదని ఎలా చెప్పాలి నా గొంతుకు వోట్ల కోసం చేసిన తోడేల్ల గాయాలు సమూహంగా నన్ను అంతం చేయాలని వారు అరిచే అరుపుల్లో నేను మీ మట్టి వాన్నే నా ఉనికి ఈ నేలదే మీరంతా నా మనుషులే అన్న నా గొంతెందుకో వారికి వినబడదే?? చీకటి ముంచుకొస్తుంది భయం తరుముకొస్తుంది ఈ దేశం నాది కూడా అని అరిచే కొన్ని శరీరాలు తగలబడుతూ రక్తం చిందించనీ విత్తనాల్లా మారుతున్న వారి తెగువ వెనక విస్తారంగా ఎదిగే పంటను త్వరలోనే చూస్తారు చీకటిని చీలుస్తూ మధ్యాకాశంలోకి కొదమసింహం తిరిగిరాబోతుంది ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.!!!! -------------------------- ( 17/5/2014)-----------------

by Mercy Suresh Jajjara



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6TTE0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి