కనబడని ఎజండా బయటకుచూస్తే మెరుస్తూ మండుతున్న ఎండ కానీ...లోపలంతా ముసురు పట్టినట్టుంది చిన్న చిరుగాలి తగిలినా కళ్ళు వర్షించేట్టున్నాయ్ దృశ్యం వెంట దృశ్యం కళ్ళను కబ్జా చేస్తున్న ఫీలింగ్ కొన్ని రంగులు...మరికొన్ని పదాలు గుండెని చీలుస్తున్నంత కరకుగా అనిపిస్తున్నాయ్ నా అక్షరాలను నా వెనక నించి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది నా దుస్తుల్ని ఎవరో జల్లెడ పడుతున్నత్తుగా ఉంది నా అలోచనల్ని ఎవరికో తాకట్టు పెడుతున్నట్టుగా అనిపిస్తోంది ఉండుండి నా స్వప్నం ఉలికి ఉలికి పడుతోంది కోట్ల మంది సంబరాలు ఎన్ని లక్షల గొంతుల్ని నొక్కేసాయో భయం నీడన ఎన్ని గుండెలు గడ గడ లాడుతున్నాయో కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్న కార్పొరేట్ మీడియా కటిక చీకటి కోణాలను ఎందుకు చూపిస్తుంది ??? రాజకీయం,మతమౌడ్యం,మీడియా చింత్రంగా నా కళ్ళకి ఒకేలా అనిపిస్తున్నాయి కార్పొరేట్ ప్రపంచం చుట్టూ కేంద్రీకృతమవ్వబోతున్న పాలన ఇప్పటికే అంచుల్లో మునివేళ్ళ మీద నిలబడిన బడుగు జనం అతి త్వరలో ఈ కార్పోరేట్ల ధనదాహానికి సమిధలు కాబోతున్నారు కోట్ళాది రూపాయల్ని ఊరికే ఖర్చుపెట్టారా మరిన్ని కోట్లు దండుకోవడానికే కదా లాభాల వేటలో రాజకీయాన్ని నడిపించిన ధనస్వాముల కళ్ళకి కనిపించేవి కాసులే... అవ్వా పచ్చీ లాగా మోసుకొచ్చి అధికారం లో కూర్చోబెట్టడం వెనక కనబడని ఎజండా...నా కంటి మీదికి కునుకు రానీయకుండా చేస్తోంది.
by సత్యవతి కొండవీటి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kb5AKB
Posted by Katta
by సత్యవతి కొండవీటి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kb5AKB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి