ఒకానొక ప్రేమకవిత - కాసుల ప్రతాపరెడ్డి నీళ్లు లేని చోట నా నెత్తురు వాగులై పారుతుంది చాలాసార్లు చావు దాకా పోయి తిరిగి వస్తుంటా మరణించిన ప్రతిసారీ పునర్జన్మ ఎత్తుతా అమ్మ గుండెల మీద ఆడుతున్న పిసిపోరన్ని నేను ఎండిపోయిన పాలిండ్లు ఎల్తి గరిశెలు అమ్మ కన్నీరు మంచుశిలలవుతూ నా చెంపలపై రాలిపడుతూ ఉంటాయి జీవితం చుక్క చుక్కా జుర్రుకునే మద్యం ఏదీ అంతం కాదు ఏదీ మొదలు కాదు నీ రాక కోసం తలుపులు తెరిచే ఉంటాయి బుద్ధి ఎటు పోతుంది? లోపల గడియ వేశారనుకుంటావు పిచ్చోడివో, ఎర్రోడివో జీవితం రుచి తెలియనివాడివో లెక్కలూ పత్రాలూ ఉండవు మాయలూ మర్మాలూ ఉండవు గుండె ఒక్కటే ఉంటుంది నీకు లేనిదీ, నాకు ఉన్నదీ అదొక్కటే రా! తలుపులూ, తలంపులూ తెరిచే వున్నాయి నెత్తురు రుచి మరిగినవాడా! నా నెత్తురు ధారలై పారుతున్నది మోదుగాకు డొప్ప పట్టు నీకు మద్యం, మగువ, మత్తు అంతా నా నెత్తురే కదా! రిజర్వాయర్ల నిండా పట్టుకో దఫాలు దఫాలుగా జుర్రుకో సిగ్గుసెరం లేనోడా! నా మొల్దారాన్ని దండెం కట్టి నా కండకండనూ దోర్నాలు కట్టినోడా! నీ కన్నా పసురం మేలు
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SPZzcf
Posted by Katta
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SPZzcf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి