జాస్తి రామకృష్ణ చౌదరి వస్తువు నా వస్తువొకటి పోయింది ఎవరైనా చూశారా? ఒక వేళ ఎవరైనా తీస్తే దయచేసి తిరిగి ఇచ్చేయండి... అది లేకుండా నేను బ్రతకలేను నేను లేకుండా అదీ బ్రతకలేదు మీకెలాగూ అది పనికి రాదు అలాగని చెత్తబుట్టలో పారేశారు కనక.. దానిలో ప్రాణం ఉంటుంది... అది మీకు ఆగుపించకపోవచ్చు ఇక్కడ నేను బ్రతుకుతున్నది ఆ ప్రాణంతోనే! అది నా చెంతకి చేరాలి దాన్ని తనివి తీరా ముద్దాడాలి... మీరు నా దగ్గరకి రానక్కర్లేదు ఒక్క సారి దాన్ని గాల్లోకి ఎగరేయండి చాలు తనే వచ్చేస్తుంది నా దరికి! 27May2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oG57B1
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oG57B1
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి