|| రా జ హం స లు || మహేశ్వరి గోల్డి 1. మధుకరా...!! ఉదయ రవి కిరణాలు పలికే సంధ్యావందన గీతపు స రి గ మ ల స్వరమున రాలిన అక్షర విరుల మౌన భాషలు నిను మురిపిస్తూ .... మైమరపిస్తూ .... ప్రభాతాన అభినవ తుషారాలు అద్దిన వేణుపూల కుంచెలతో గీస్తున్న రేఖా చిత్రాలు వైతరణి దివిలో సుహాసిని లతలతో నిర్మించిన సుజమల్ సంస్థాన సౌదామిని రూపు సంతరించుకుంటూ.....!! 2. కలల అలలపై పిలుపునిస్తున్న సుప్రభాతాలు చందన సమీరపు గగన వాకిలి పై అందంగా పొదిగిన రేవతి నక్షత్ర సిందువులతో జీవం సేవిస్తూ రాలుపూల రహదారి పై వెలసిన ప్రాణ శిలల ఊపిరి ఊహలు తగిలి మలిసంధ్య మౌనపు లాలనలో నిదురిస్తున్న సౌగంధికా విరుల ఓ వనమాలికి నే పంపిస్తున్న మౌన లేఖలు అద్దాల పల్లకిలో రాజహంసలయి శ్వాసిస్తుంటే ...!! 3. నవదీప కిరణాలతో ముస్తాబయిన పగడాపు ప్రమిదల కాంతిలో విరిసిన చంద్రమతి కలువలు రాజసమంత్రాల సాక్షిగా .... మోహమకరందాలు వాలిన నైషధీ వనమున మన ప్రేమకధను హృద్యంగా మలచి అబినవ పత్రికల పై నిన్నూహిస్తూ కొలువు చేస్తున్నవి...........!!30/05/2014
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1knqa6c
Posted by Katta
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1knqa6c
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి