@ రాజకీయ పార్టీలు @ అసలే గుర్తులు కరువు అయినై నాయినల్లార అంటే గడియకో పార్టీ వెట్టి గందరగోళం జేయ్యవట్టే సర్కార్ ను ఏరి కోరి తీసుకుంటే కుదురధనొ ఏమో ఆఖరికి చెప్పు శీపుర్లకు గూడా మంచి గిరాకి అచ్చి పాడయింది ఏత్త..తీత్త అని ఉరికచ్చిన గా సారుకు ఇగ వట్టుమని జెప్పి ఊడ్సుడు పని అప్పజేప్తే ఊరంతా తిరుక్కుంట చెంప దెబ్బల పాలయిండు. నీతి నిజాయితి తెలియని నిబద్దత లేని నత్తి నల్లికుట్లోల్ల సంఘానికి గట్టి దెబ్బ తగిలింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఆ సంఘం పెట్టిన పార్టీకి ఆ గుర్తే ఇచ్చారు. అదేదో గాలి అట అదే ఫ్యాను గాలి అట ఆ గాలి అట ఏదో దులిపెస్త ఊపేస్త అంటుందటా ఏమో,?చెర్ల పెల్లి జైలు గోడల దుమ్మేమోనట అని అందరు అనుకుంటున్నారట ఇగ,ఈకలు ఈకలు కలిపి తయారయ్యిందోక తోక పార్టీ . తల లేదు...మొండెం కనిపించదు కాని మెదడున్న పార్టీ అని తెగ డబ్బాలు కొట్టడం ఇగ,దాని కథ జూడు రాజకీయ పార్టే కానీ పోటీ జేసుడు లేదని చెప్పుక తిరుగుడు. ఇవన్ని గట్లుంటే ముసలోనికి పడుసు పెండ్లమన్నట్లు ఏండ్లకేండ్లు దేశాన్ని మేమే ఏలుతం...అని పాత సంచిల కొత్త సరుకు జబ్బకేసుకుని ఒక తిరుగుడు గాదు జేజమ్మ ల పేర్లు జెప్పుకుంట. నేను అటు జూత్త..ఇటు జూత్త ఎటు వడితే ఆటే జూత్త నా దారికి అడ్డం అచ్చిండ్రనుకో ఎనుకకేలి అచ్చి ఈపుల గుద్దుత అని రెండు మూడు సిద్ధాంతాల కామెర్ల రోగాపోల్ల లొల్లి ఒక దిక్కు ఇగ గవ్వైతే గవ్వే అటోల్లకి ఆ దిక్కు మేమే ఇటోల్లకు ఈ దిక్కు మేమే అనుకుంట,. ఒగలకొగలను పడనిచ్చేది లేదు ఎవల జాగల వాళ్ళను ఉండనిచ్చేది లేదు. ఎవని తోని మాకెందుకు బై మాది మాకు గావలె అని ఒక కొట్లాట సరే.,మనది మనకు వచ్చింది గాని మల్ల అండ్లకేలి మాది మాకు గావాలంటే గుండె వలిగి సత్తం దొర జనం మొర పెట్టవట్టే. ఎనుకటి లెక్కనె గడ్డి కుప్ప కాడి కుక్క పార్టీలు అధికారం లకు రారు అచ్చినోల్లను పనిజేయ్యనియ్యారు. ఇగ గా రంగు జూత్తే, ఎవనికైన ఉచ్చ వడుతది. గిన్ని లోల్లుల నడుమ ఇంట్లకెళ్ళి బైలెల్లుతే.. ఒగడు వెయ్యిత్త నంటాడు ఇంకోగాడు క్వటరిత్తానంటాడు ఏది ఇత్తేంది ఇయ్యాక పోతేందని గట్టిగనే గుద్ది వచ్చిన రాజకీయ బ్రోకర్ల మాట ఇనకుంట పొయ్యి దేశాన్ని దోసుకునేటోల్లకు మొస మర్రకుంట _ కొత్త అనిల్ కుమార్ ( 16 / 5 / 2014 )
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mYMMSw
Posted by Katta
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mYMMSw
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి