పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మే 2014, శుక్రవారం

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/పోర్న్ పిక్చర్ ..................................................... ఈ దేశం పోర్న్ పిక్చర్ అయి చేతుల్లోకి రావడానికి ఎ0తో సమయం లేదు. చికటిలోని కంపుని బెడ్గా మార్చుకొని చేస్తున్న భీకరం. సభ్యత సంస్కారం అని పండితులు రాస్తున్న దైవ గ్రందాలు సమిక్షల్లో గొప్పలై యూజ్ మి బాక్సుల్లో చేరడం. సమాజంపై తెలివి అనే అ0ధకారం పుట్టల్లా మొలకెత్తడం. తిరగలబడి వరసు తప్పుతున్న సంస్కృతి. కొ0డలా0టి సా0ప్రదాయాలు నిశ్శబ్ధంగా పగిలి మట్టిలో కలిసిపోవడం. శార్ట టె0పర్ శరీరాలు నడిరాత్రి రోడ్లపై చేస్తున్న నేరాలు. వైద్యశాల ఎనకాల పాపపు పి0డాల దిబ్బలు. దేవుడు కనికరం లేని మీడియాలాగ (దేవుడి మిదికి తొసేయట్లేదండి ఆయన జడ పదార్దంలా ఉ0డేసరికి లేపడానికి అలారం పెడుతున్న) విలయం జరుగుతు0టే వీడియో తీస్తున్నట్టు. మొత్తంగా మౌనంగా ఉ0డి జనం మద్య టాపిక్ అయి టిఆర్పి రేటి0గ్ పె0చుకోవాలని చూడటం. ఈ దేశం పోర్న్ పిక్చర్ అయి చేతుల్లోకి రావడానికి ఎ0తో సమయం లేదు. 16-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sy5b5B

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి