పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఏప్రిల్ 2014, మంగళవారం

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు స్రవంతి ఐతరాజు 8.4.14 "కల్యాణం కమనీయం" ప్రతి తల్లీ కౌసల్యే.. ప్రతి వూరూ అయోధ్యయే! ప్రతి గడపా మిథిలా నగరియే.. ప్రతి పడుచూ రామునికై వేచే పడతి సీతమ్మయే.. ఏ శుభ ఘడియలకై ప్రకృతి కన్య వేచి చూస్తుందో అవి రానే వచ్చాయి.. శ్రీ రాముని వరునిగా తెచ్చాయి సుందర ఉద్యనాలన్నీ మిథిలా నగర అంతఃపుర స్థలాలయ్యాయి ప్రతి తీగె సీతమ్మ ఒంపుసొంపులద్దుకున్నాయి ప్రతి పందిరీ రామయ్య మగసిరుల మరిగాయి ప్రకృతి అంతా శ్రీ సీతారామమయంగా మారింది! అడుగడుగో ఆ ఆజానుబాహుడు.. అరవిందదళాయతాక్షుడు శ్రీరాముడు. మన్మధుడు మాటేసిన మగసిరితో.. ధనుర్భాణాలు చేతబూని సీతను వెదకుచున్నాడు తాకిన కందే నెమ్మోవితో సిగ్గుసింగారించిన విశాల నేత్రి సీత క్రీగంట చూస్తోంది రఘువీరుని చూపుల తూపుల శరములు ఇరువురి హృదయాలను తాకి మన్మధయుద్ధం ఆరంభించగా ఫెళఫెళ విరిచెను శివధనువును రాముడు వరుడై కళ కళ సీతా వధువు మోము చంద్రబింబమై కనులతో పిలిచె రాఘవుడూ తమకమున చేరె వైదేహి ఇనకులుడు తాను సూర్యుడు కాగా భూమిజయై సీత తనననుసరింప చూసినవారికి జన్మతరింపగ తలచినవారికి వలపు జనింపగ వూరూరా సీతారామ కల్యాణం కలిల్గించు సకల జనులకు నిత్య కల్యాణం పచ్చతోరణం!!!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0xg3d

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి