అమ్మ ఒడికోసం.. అక్షరాలకు అందనంత ఆవేదన ఉన్నప్పుడు కళ్ళలో కన్నీరు తప్ప గుండెల్లో కవిత్వమెలా పుడుతుంది ఎంత ఏడ్చిన తరగని శోకమున్నప్పుడు తోడుగా ఏకాంతం తప్ప పెదాలపై చిరునవ్వెలా అందుతుంది రాత్రంతా కలలు రంపాలై నా మనుసును కోస్తున్నప్పుడు అంతులేని అంధకారం తప్ప దారంత వెలుగు ఎలా నిలుస్తుంది పుట్టినప్పుడు బంధుత్వాలేమ్ తెలియవు ఇప్పుడు గుండెల్లో నిలిచిపోయిన అనుబంధాలు తప్ప ప్రేమ పంచె అనురాగాలేం లెవ్వు నేను పోరాడుతున్న ప్రతిసారి కన్నీరు నన్ను గెలుస్తూనే ఉంది కొత్తగా చిగురిసున్న ప్రతిసారి నిరాశ నన్ను లొంగదీసుకుంటూనే ఉంది ఎప్పటికప్పుడు సంతోషపు రంగువేసుకుంటున్న దుఖపు వర్షానికి వెలిసిపోతూనే ఉంది విశాలమైన సంద్రంలో మిక్కిలి అలలుండడం సహజమే కాని ఈ చిన్ని మనుసులో అంతులేని బాధల అలలు ఎందుకని? తప్పటడుగులు వేస్తూ పడి దెబ్బతగిలి ఏడుస్తున్న నన్ను ఎత్తుకొని ముద్దాడుతుందని ఎదురుచూసాను ఆకలై గుక్కపెట్టి విలపిస్తున్న నా నోటికి వెన్నముద్దై అందుతుందని ఆశపడ్డాను నిద్రలేక రోదిస్తున్న నన్ను ఒడిలోకి చేర్చుకొని జోలపాట పాడుతుందని అనుకున్నాను పదం మాత్రమే మిగిల్చి పలకరింపు లేక నా ప్రాణంగా మారిపోయింది అనురాగాన్ని అంధకారంగా మార్చి ఆయువై నాలో చేరిపోయింది అమ్మ పదం అంటరానిదిగా చేసి అలజడిని జీవితాంతం అందించి వెళ్ళిపోయింది నేనిప్పుడు అమ్మ ఒడికోసం వేచిచూస్తున్న పసి హృదయాన్ని అమ్మ అలింగనం కోసం ఆరాటపడుతున్న కుమిలిపోతున్న కొడుకుని గాయాల గనిని ఏకాంతపు మదిని..
by Garige Rajesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fjVIZG
Posted by Katta
by Garige Rajesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fjVIZG
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి