బస్ స్టాప్ *********** సమయం పదిన్నర బస్ స్టాప్ లో నేను వస్తానన్న మిత్రుడికై ఎదురుచూపులు అన్న టైముకు ముందుగానే నాకై ఉంటాడని ఆశ పడితి కాని వెయిట్ చేయిస్తాడని అనుకోలేదు రింగ్ చేస్తే పది నిమిషాల్లో అన్నాడు ! అసలే టిఫిను పడలేదు వస్తాడులే అని అటు ఇటుగా వస్తున్న యవ్వన పరిమాలలను కన్నులతో ఆస్వాదిస్తూ రెప్ప తెరచి కళలు కంటున్నాను వేసుకున్న పౌడరు చమటతో తడిసి చారలు పడ్డాయి పక్కన పానిపూరి పిలుస్తుంది ఆకలేస్తుంది వాడొస్తే లేటుగా వచ్చినందుకు టోపీ పెడతానని ధీమ ! మల్లి రింగ్ చేస్తే ఇంకో పది అన్నాడు అంతలనే ఎదురుగా బిచ్చగాడు చెయ్యి స్టైలుగా ప్యాంటులో దూరింది చినిగిన పర్సు తీసి చిల్లర వెతికి ఒక్క రూపాయి అని పక్కన అమ్మాయిని చూస్తూ బొచ్చలో వేస్తె ‘’యాబై పైసలకే ఇంత పొజా ‘’అంటూ మొహం చిట్లించాడు బెగ్గరు సారు ! చెదిరిన ఇంషర్ట్ ను సర్దుతూ ఇంతకీ రాలేడని వచ్చే పోయే ఆటోల్లోకి తొంగి చూపులు ‘’ఎక్కడికి సార్’’ అని ఒక ఆటో డ్రైవర్ ఏమని చెప్పను వాడికి నా బాధ ‘’పోయిరా సామి’’ అని సాగనంపాను ఆ నల్ల చొక్కవాడు మావాడేనా ? ఈ పచ్చ చొక్క వాడేనా ? జనాలకేసి చూసి చూసి కండ్లు మండుతున్నై అయినా రాడు ! పక్కన ఓ బుల్లి పాప ఐస్క్రీం తింటుంది నా చూపులకి ఎక్కడ అడుగుతానేమోనని భయంతో ‘’మమ్మీ’’ అని ఏడుపు తల్లి నాకేసి ‘’దొంగ కోడుకులు’ అని తిడుతుంది ఏమి నా కర్మ మావాడు రాడు ! ఇప్పుడైతే ఫోన్ ఎత్తట్లేదు తల్లోంచి చమట నూనె తెల్ల చొక్కని మురికి చేస్తుంది అసలే ఫ్రెండు పెళ్లి పదకొండు గంటలకి ఇప్పుడు దాదాపు ఒకటి మావాడు రాడు ! తిరిగి వెనక్కి వెళ్దాం అంటే మనసు వినదు రూముకెళ్తే వంట చేసుకోవాలి పెల్లికి ఎల్తె పంచ భక్ష పరమాన్నాలు ఆకలి సమయం మొహం పీక్కుపోయింది ఏదైనా కొనుక్కు తిందాం అంటే జేబులో గల గల మని చిల్లర శబ్దం ఎక్కిరిస్తుంది ! మొత్తానికి వచ్చాడు మావాడు అదిరిపోయే ఎత్నిక్ డ్రెస్సులో పల్సర్ బండిపై వస్తూనే ఎక్కడ తిడతానని ముందుగానే ‘‘సారి రా మామ’’ అంతలోనే ఇంకో సటైరు ‘’ఏం డ్రెస్సురా మామ నీది ‘’ చిత్రమైన స్తితిలో తర్వాతి విషయం ఇక చెప్పలేను ! కృష్ణ మణి I 28-02-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oaSA6g
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oaSA6g
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి