Please like the page and participate http://ift.tt/1kfO0pW అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం " ...................... ............... ............. ............... ................... ప్రియమైన స్నేహితులారా ! నమస్కారం !! మన మంతా కలసి ఒక దివ్యమైన పద్య కవిత్వ యజ్ఞం చేద్దాం. దాని పేరు " లక్ష పద్యార్చనం" మీరు పృచ్ఛకులుగా, ప్రశ్నల పుష్పాల సౌజన్యం ప్రకటిస్తే ఈ " లక్ష పద్యార్చన " ప్రారంభమౌతుంది , "లక్ష పద్యార్చన" స్వరూపం ---------------------------- సాధారణంగా అష్టావధానం లో 8 మంది పృచ్చకులు ,ఒక కొన్ని వందల మంది ప్రేక్షకులు , ఓ రెండు లేక మూడు గంటల సమయం 10-15 కొత్త పద్యాలు రచించబడతాయి . అదే శతావధానం లో 100 మంది పృచ్చకులు ,వెయ్యికి పైగా ప్రేక్షకులు ,2-3 రోజుల సమయం , 100 కు పైగా కొత్త పద్యాల సృష్టి . సహస్ర , పంచ సహస్రావధానాల లో సుమారు 1000 మంది పృచ్చకులు. నాలుగు వారాల సమయం , 1000-5000 పద్యాల సృష్టి. వీటికి ₹10,000/ నుండి ₹25,00,0000/ వరకు ఖర్చు ! ఇంకా ఎన్నో శ్రమలు ! ప్రస్తుతం మనం ఫేస్ బుక్ ద్వారా చేసే ఈ "లక్ష పద్యార్చన" లో వేలాది పృచ్చకులు ప్రపంచం నలు మూలల నుండి ఖర్చు శ్రమ లేకుండా పాల్గొనవచ్చు ! లక్ష కొత్త పద్యాలు సృష్టించ బడతాయి! విషయ వైవిధ్యం ఉంటుంది ! ప్రశ్నల విభాగాలు : 1)సమస్యలు 2)దత్తపదులు 3)వర్ణనలు 4) అనువాదాలు 5)అప్రస్తుత ప్రశంసలు ఒక్కొక్కరు ఏ అంశం పైన అయినా ,ఎన్ని ప్రశ్న లైనా అడగ వచ్చు , సమస్య : ఛందో బద్ద్ధమైన పద్యపాదమై ఉండాలి .అసంబద్ధమైన అర్ధం ఉండాలి . దత్తపది :శబ్ద లయ గాని, భావలయ గాని, అర్ధ లయ గాని గల , నాలుగు పదాలు ఇవ్వాలి . కోరిన ఛందస్సు లో కోరిన అంశంపై పద్ద్యం చెప్పమని అడగాలి వర్ణన :ఏదైనా ఉదాత్తమైన అంశం పై కోరినఛందస్సులో వర్ణనాత్మకమైన పద్యం అడగ వచ్చు. అనువాదం :ఇంగ్లీషు లేదా సంస్కృతం లోఏదైనా పద్యాన్ని లేక శ్లోకాన్ని ఇచ్చి పద్య రూపం అనువదించమని అడగ వచ్చు అప్రస్తుత ప్రశంస :చమత్కారమైన ప్రశ్నలు అడిగితే చురుకైన సమాధానాలు పద్య రూపం లో ఇవ్వబడతాయి . ఇవన్ని మీ లక్ష ప్రశ్నలు ! నావి లక్ష పూరణలు !!!! ఇది మనం కలసి వాగ్దేవికి చేసే లక్ష పద్యార్చన !!!! ప్రశ్నలు మానవ జాతికి ఉపయోగ పడేలా ఉండాలి . సమకాలీన సమాజాన్నిప్రతిబింబించేవిగా ఉండాలి. ఉత్తమ సంస్కృతినిర్మాణానికి దారి వేసేవి గా ఉండాలి. విజ్ఞానం కలిగించేవి గా ఉండాలి. మీ ప్రశ్నలు మీ ప్రతిభని ,సంస్కారాన్ని ,జిజ్ఞాసని తెలియజేసేవిగా ఉండాలి. మీ ప్రశ్న కింద మీ పేరు .చిరునామా. ఫోను నెంబరు .ఈ మెయిలు . తప్పనిసరిగా ఉండాలి. ఈ లక్ష పద్యార్చన గురించి మీ స్నేహితులకుచెప్పండి. ఫేస్ బుక్ లో. షేర్ చెయ్యండి. లక్ష ప్రశ్నలువచ్చేలా సహకరిచండి ! ఈ క్షణం నుంచే పూరణలు ప్రారంభిస్తున్నాను !! ప్రశ్నలు సంధించండి !! వాగ్దేవీ కటాక్షం తో 1000 రోజులలో పూర్తిచేయాలని సంకల్పం . "ఆకాశ వీణ పై అక్షర రాగాలు సృష్టించు వాణి ఆశీస్సులిడగ ! వాయువీచికలన్ని భావ వీచిక లౌచు శ్వాస కవిత్వయశస్సు లిడగ! పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞామహాయజ్ఞ వేదిక దివ్యహవిస్సు లిడగ! రసవదమృత పద్య రాజీవ బృందమ్ము బ్రాహ్మికి కావ్య సరస్సులిడగ! భూమాత హృదయమ్ము పూర్ణ కుం భమ్ము నై శ్రీం కార శబ్ద రోచిస్సు లిడగ! రమ్య సంకల్ప మీ శివరాత్రి వేళ లక్ష పద్యార్చనము సేయ లక్ష్య మొకటి వెట్టితిని ముఖ పుస్తక వేది పైన వేగ ప్రశ్నింప రారండి విజ్ఞులార ! పంచ భూతాలు సాక్షి ! గీర్వాణి సాక్షి ! ...... ..... ...అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం "
by Phani Madhav Kasturi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfO0pW
Posted by Katta
by Phani Madhav Kasturi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfO0pW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి