ఏం జెయ్యాలె ? **************** గడిగడికో గండం నా మొగుడు యదల మంటలు మాన్పె తొవ్వల నేను ! ఏం జెయ్యాలె ? మాటముచ్చటకు ముందే సరసమాడమనే ! ఇంట్ల అన్నలదెలిసి ఆగమాగామయ్యి లగ్గమొద్దనె బావకిచ్చిన మాట జవదాటని మా నాయిన అడుగు ఎంకవడితే అవమానమైతదని ఆగలేనికాడ పెండ్లిజేశిచ్చె అత్తమామల మొక్కి ఆ ఇంట్ల కాలుపెడితే కాటికైయిన నయమని ఇయ్యల్ల తెలిశొచ్చె ! బయటిశోకుల నా మొగుడు ఆడినాటలు ఇని మన్సుకాలి బుడిదాఎ ఆడపిల్లలు పుడితె ఇద్దరే ముద్దని ఎంతజెప్పిన ఇనక ఆప్రీషను జేపిచ్చె ! కాలం గడిశిన కాడ పాత గుణము లేశె బరితెగిమ్పున బామాటలకు బయలుదేరె కొడుకుపుడితె అన్నకు నాకెందుకు లేరని మల్ల కోపిచ్చే నా పాణం పోయ్యిరాంగ దవాఖానల నేవంతె నా ఇంట్ల భోగమాటలు అవి తెలిశి అడుగంగ ఊర్ల ఎవడు సోక్కం నేను జేస్త ఎవడు అడ్డమనె సవితిని తెస్త ఒప్పుకో లేదంటే తప్పుకో అని నడిరాతిరి సీసవలిగే నెత్తిన కారేది కన్నీరా లేక నేత్తురాని తెలియని రాత్రులు ఎన్నో గడిశె ! కాలయమున్ని కట్టబెట్టిన అమ్మానాయిన ఊరంతటిని ఒకటి జేస్తే ఎంత జెప్పిన ఇనక ఊరకుక్క తిరిగి మొరగవట్టె నలుగురిలవెట్టి నవ్వులాట చేశినానని పానం తింటనని కత్తి ఎత్తి రాంగ పోలిసొళ్ళ కాడ పంచాదులు చెయ్యంగ పైసలు తినే కాడ నాయమేక్కడుంటది ? యాడాది గడిశిపాయే తిండి తిప్పలెట్ల ? నా పిల్లల సదువులెట్ల ? ఎంతగనమని మావోల్లు పెడ్తరు ? మొగునికి రోగామన్న రాదాయే శావ జేస్కుందమంటె ! బరువై లోకానికి ఎండమాయి బతుకున నా గుడ్డుల తోవ్వేదీ ? ఏ ఏట్ల నేవడుదు ? ఏం జెయ్యాలె ? ఏం జెయ్యాలె ? ఏం జెయ్యాలె ? కృష్ణ మణి I 15-02-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkZEwq
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkZEwq
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి