సౌగంధిక జాజరలు!! స్రవంతి ఐతరాజు!! !!మోహిని!! అటుచిరునవ్వులు..ఇటు హాహాకారంబులు మధ్యన మేరువువోలె మంధర కవ్వము వాసుకి తానాయె చిలికెడిరజ్జు తెల్లతెల్లని తేనియల పాలసముద్రంబుబికె... హాలాహలము వచ్చె కల్పతరువూ వచ్చె కామధేనువు క్షీరతెలితరగల పైపైకొచ్హ్చె ఐరావతమునూ, జాబిలయ్యయు వచ్చె అందాల సిరుల అలరారు మహలక్ష్మియు వచ్చె మధి ఇంప మధి ఇంప అమృత భాండంబును వచ్చె సుమనోహరియై "హరి" తానల అలరారె మోహినియై పలు మోహాలు కురిపించె మధుబాండంబు చిలుక అమరుల అలరించె దుష్టశిక్షణముచేసి శిష్టరక్షకుడాయె హరీ! ఓ శ్రీహరీ!... నీ కరుణామృతపు చినుకులీ భువిని జల్లుమా.. దీనుల రక్షింపుమా! దురితాల మాపుమా!
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAmZuB
Posted by Katta
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAmZuB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి