విరామమెరుగక
నిరంతరం ప్రవహించే
జీవన నది నాన్న
విషాదాలను మోస్తూ
సంతోషాలకై అన్వేషిష్తున్న
బాటసారి నాన్న
కుండపోత వరదలా దుఃఖం ముంచెత్తి
గుండె రేవును గండికొడుతున్నా
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం నాన్న
గుండెనిబ్బరానికి నిలువెత్తు చిరునామ నాన్న
నాన్న ప్రతీక్షణం
కష్టాలను కౌగిలించుకుంటడు
కన్నీళ్ళతో కరచాలనం చేస్తడు
నిజంగా
నాన్నకు కన్నీళ్ళొచ్చినా
నాన్న ఏడ్వలేడు
నాన్న ఏడిస్తే
ఇల్లు ఇల్లంతా కన్నీటిసంద్రమే
జీవన గమనంలో అలసిపోయిన బిడ్డలకు
నాన్నిచ్చే దైర్యం
ముందుకెళ్ళడానికి ఓ కాన్ఫిడెన్స్
నడవడం నేర్చిన బిడ్డలకు
నడిపించే దారౌతడు నాన్న
ఓటమితో అనుక్షణం పోరాడుతు
గెలుపునే పంచే నాన్నే
ప్రతీ బిడ్డకి మొదటి హీరో
సంతోషాలను సంపదను వాటాలేసే
నాన్న గుండెలోతుల్లో దాగున్న
కన్నీటి దొంతరలను
గుర్తించేదెవ్వరు
నాన్న బతుకంతా
మన జీవితమే కదా
ఎన్నని చెప్తం_
ఏమని చెప్తం_
సముద్రమంత ప్రశాంతం
అంతర్గత బడబాగ్ని నాన్న
నాన్నైతేనే తెలుస్తది
నాన్నంటే
31.08.2102
ఒక్క పూట నువ్వు కనిపించక పొతే వెతుక్కునే నాన్న
రిప్లయితొలగించండితన బనీను చిరిగివున్నా నీకోసం టీషర్టు కొనుకొచ్చే నాన్న
నువ్వు అలిగి అన్నం తినకపోతే అమ్మను కోప్పడే నాన్న
తన ముసలితనంలో కావలసిన pf ని నీ ఇన్గానీరింగ్ సీటు కోసం ఖర్చు చేసిన నాన్న
మర్చిపోకు అమెరికా కు ఎగిరిపొయిన మిత్రమా!
- ఓ మిత్రుడి కొడుకు గుర్తుకొచ్చి - కోటంరాజు లక్ష్మిప్రసాద్