kavi sangamam
Jayaho Kavitvam, Jaya Jayaho Kavitwam
పేజీలు
Home
Poets ||
' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
14, జులై 2012, శనివారం
కలం పేరు అవసరమేనా ?
Katta Srinivas
కలం పేరు అవసరమేనా ? మీరేమంటారు మిత్రులారా ?
http://www.facebook.com/groups/kavisangamam/permalink/421125381273553/
అస్సలు అవసరం లేదు స్వంత పేరు చాలు
కొన్నిసార్లు అవసరమే
అవును అవసరమే
ఏమో చెప్పలేను
అప్పటికి ఏది ప్రాచుర్యముంటే అదే వాడుకోవచ్చు.
Like
·
·
Unfollow Post
·
July 12 at 11:42am
Rakshita Suma
,
Naveen Rjy
,
Varnalekha Varu
and
4 others
like this.
Katta Srinivas
• రచయితలు పేర్లను ఎన్నుకోవడంలో అనేక దృష్టి కోణాలుంటాయి.
• సరళంగా ఉండి, సులభంగా ప్రచారంలోకి వచ్చే పద్ధతిలో పేర్లు. ఆత్రేయ, ఆరుద్ర, అజంతా, ఎల్లోరా, ఓల్గా
• గౌరవం పెరగడం, జనామోదం పొం
దడం కూడా పేర్లను ఎన్నుకోవడానికి కారణాలవుతున్నాయి.
• పేరు నాగరికంగా లేదని కొందరు పేర్లు మార్చుకుంటే, మల్లయ్య పేరుతో పంపిన రచనలు తిరిగి వస్తే నవీన్ అని పేరు పెట్టుకున్నారు అంపశయ్య రచయిత.
• కొందరు తమ గుర్తింపును కప్పిపుచ్చుకోవడానికి కలంపేర్లు పెట్టుకుంటారు.
• కులం తెలియకుండా ఉండడానికి నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య అన్న పేర్లు పెట్టుకున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు.
• . మతం తెలియకుండా పెట్టుకున్న పేర్లు రుద్రప్రియ, సుగమ్‌బాబు, కౌముది.
• ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలో
• ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. పోలీసు శాఖలో పనిచేసిన మోహనరావు స్పార్టకస్ పేరుతో నవలలు రాశారు
• ఎక్కువగా శృంగారాన్ని గుప్పించే రచయితలు కూడా తరచుగా మారుపేరుతోనే రచనలు చేస్తారు.
• ఒకే పేరు ఇద్దరు రచయితలకు ఉన్నప్పుడు వాళ్లను గుర్త్తించడానికి వేరు వేరు పద్ధతులు అనుసరించడం కనిపిస్తుంది. ఇస్మాయిల్ పేరుతో ఇద్దరు రచయితల ప్రసిద్ధులు. ఒకరు స్మైల్ అయినాడు. ఒకే కుటుంబానికి సంబంధించిన వారైతే సీనియర్, జూనియర్ అని చేర్చడం కనిపిస్తుంది. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, వేదం వేంకటశాస్ర్తీ జూనియర్ ఇలాంటివే.
• బీనాదేవి భిన్నమైన పేరు. భార్యాభర్తలు ఇద్దరూ రచయితలే. బి.నరసింగరావు సంక్షిప్త నామం ‘బిన’, భార్య పేరులో చివరి భాగం ‘దేవి’ కలిసి బీనాదేవి అయింది. రచయిత్రి ఆనందరామం పేరులో తన పేరు సగం భర్త పేరు సగం కలిసి ఉంది.
• ఇంటిపేరుతో కొందరు రచయితలు ప్రచారంలో ఉంటారు. ఉదాహరణకు కందుకూరి, గురజాడ, దేవులపల్లి, విశ్వనాధ, అనిశెట్టి, గొల్లపూడి, మునిమాణిక్యం, ఏల్చూరి, దాశరథి, కుందుర్తి, కాళోజీ, కొవ్వలి, నార్ల, సలంద్ర.
• జంటకవుల సంప్రదాయం ఉదాహరణకు తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవులు
• ఇద్దరి కంటే ఎక్కువమంది కవులు కలిస్తే గుంపు కవులు, సమూహ కవులు, నయాగరా కవులు, దిగంబర కవులు, పైగంబర కవులు, తిరుగబడు కవులు, విపశ్యన కవులు.
కొన్న కలం పేర్లు అసలు పేర్లు
1.ఆత్రేయ ( కిళాంబి వెంకట నరసింహాచార్యులు)
2.ఆరుద్ర ( భాగవతుల శివశంకరశాస్త్రి )
3.ఓల్గా ( పోవూరి లలిత కుమారి )
4.అంపశయ్య నవీన్ ( డి.మల్లయ్య )
5.బుచ్చిబాబు ( శివరాజు వెంకటసుబ్బారావు )
6.కరుణశ్రీ ( జంధ్యాల పాపయ్యశాస్త్రి )
7.దేవీప్రియ (ఖాజా హుస్సేన్ )
8.వడ్డెర చండీదాస్ ( చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి )
9.పురాణం సీత (పురాణం సుబ్రహ్మణ్యశర్మ )
10.శ్రీరమణ (వంకమామిడి రాధాకృష్ణ )
(ఆంధ్రభూమి లోని కె.కె.రంగనాథాచార్యులు గారి వ్యాసం, కె.పి.అశోక్‌కుమార్, ఎ.ఎన్.రాజు ‘‘ తెలుగులో మారుపేరు రచయతలు ’’ఇంకా మరికొన్ను)
July 12 at 11:43am
·
Like
·
9
Kiran Gali
this is so valuable information. being from non literary background i am surprised getting to know so many reasons and motivations in writers choosing pen name.
July 12 at 11:50am
·
Unlike
·
2
Praveena Kolli
Thank you
Katta Srinivas
garu, this is valuable info.
Kavi Yakoob
garu, It would be good idea to post this kind of info in our blog, I guess..
July 12 at 11:59am
·
Unlike
·
1
Kavi Yakoob
రుద్రప్రియ కాదు-దేవిప్రియ...
July 12 at 12:00pm
·
Like
·
2
Katta Srinivas
సి.నా.రె షార్ట్ ఫాం లోనే ప్రసిద్ది. గజల్స్ లో మరీ అనుకూలంగా వాడుతున్నారు.
సింగిరెడ్డి వారికి యస్ రాకుండా సి రావడానికి చిన్న కధ వుంది.
మల్లారెడ్డి గారు చిన్న సి.నా.రె ను బడిలో చేర్చ
ేప్పుడు ఇంటిపేరు అడిగారంట ఈయనగారు ఆ ఇంగ్లీషోళ్ళ మాటని ఎలాగోలా అర్ధం చేసుకుని ‘‘సింగిరెడ్డి ’’ అని చెప్పారట. నో మాన్ ఒన్ లెటర్.. ఫస్ట్ లెటర్ ..ఫస్ట్ లెటర్ .. అని హడావుడీ చేస్తే
ఈయన సింగిరెడ్డిలో మొదటి అక్షరం అని ‘‘సి’’ చెప్పారు. వాళ్లు దాన్ని ఆంగ్లం సి గా రాసి పడేసారు. దాంతో నారాయణ రెడ్డి గారు ఇలా సి.నా.రె గా రాస్తున్నాను అని అప్పుడెప్పుడో ఇంటర్యూలో చెప్పిన విషయం ఈ సందర్బంగా మీతో పంచుకోవాలనిపించింది.
July 12 at 2:46pm
·
Like
·
2
Katta Srinivas
అవును సార్ నేను తడబడినట్లున్నాను. పూర్తిగా పరిశీలించి సవరించారు. నేను మరికొంచెం జాగ్రత్తగా చూసుకుని పోస్టు చేసివుండాల్సింది. ధన్యవాదాలు.
ప్రింట్ లో కూడా అదే వుండటంతో యధాతదంగా తీసే
సుకున్నాను. అవును సార్
దేవీప్రియ (ఖాజా హుస్సేన్ ) సరైనదిగా పరిగణించాలి.
కలం పేరు ఏర్పటు చేసుకొవటంలో కేవలం ఓటింగ్ గానే కాకుండా
మిత్రులు వివరణాత్మక స్పందనలు అందిస్తే ఉపయోగకరంగా వుంటుందని ఆశిస్తున్నాను. మీ వద్ద ఏదైన సమాచారం లేదా ఆలోచన వుంటే పంచుకోండి.
July 12 at 3:38pm
·
Like
·
1
Kodanda Rao
నా ఉద్దేశ్యం లో కలం పేరు చాలా అవసరం. కారణాలు
1. ఏ వర్గానికి ప్రతినిధి అన్నది తెలియదు,కనుక ప్రత్యేకాభిమానాలు ఉండవు.కువిమర్శలు ఉండవు
2. పేరును ఉపయోగించి సెటైర్లు వేసే అవకాశం ఉండదు
3. గుర్తింపు చాలా సులభం సాహిత్యం లో పసవుంటే
July 12 at 4:38pm
·
Unlike
·
3
Katta Srinivas
కె.కె గారూ ఓటింగ్ లో కూడా టిక్ చేయగలరా ? రెండొది లేదా మూడోది లేకుంలే మీ ఆప్షన్ రాసి టిక్ చేయండి. ఇప్పటి వరకూ వచ్చిన ఓటింగ్ ప్రకారం 66.66 శాతం మంది కలం పేరు అస్సలు అవసరం లేదు అంటున్
నారు. 33.33 శాతం మంది మాత్రం కొన్ని సార్లు అవసరమే అంటున్నారు. కాని ఖచ్చితంగా అవసరమే అన్నవారు లేరు. ఇతర అభిప్రాయాలూ రాలేదు
July 12 at 5:03pm
·
Like
·
1
Katta Srinivas
ఎవరి సంగతో తెలియదు కానీ కె.కె గారూ మీరు పెన్ నేమ్ లేదా మీ స్వంత నేమ్ షార్ట్ గా చేసింనతర్వత నాకైతే చాలా సులభంగా వుందండీ. నందా మీరు చెరో ఓటుతో మిగిలిన రెండు ఆప్షన్లకూ సపోర్టు ప్రారంభించారన్న మాట
July 12 at 5:19pm
·
Like
Kodanda Rao
హ,హ,హా... నేను కలం పేరు పెట్టుకొని రచనలు చేసే స్థాయి ఇంకా సంపాదించలేదండి. కాని అది అవసరం అని నాకు అనిపిస్తుంది. లేదంటే ఒక ముద్రకి గురి అయిపోతారు. సినిమా టైటిల్స్ లాగ దీనికి అంతే ఇం
పోర్టెన్స్ ఉంది. ఇక నా సంగతికి వస్తే కేవలం నన్ను సంభోదించేవాళ్ళు కోదండ రావుని ...కొండల రావుని చేసేస్తున్నారని. షార్ట్ కట్ చేసా. అంతే అది కలం పేరో ..మరొకటో కాదు.
July 12 at 5:27pm
·
Like
·
1
Katta Srinivas
మీరు చెప్పిన మకతిక నేనూ పడ్డాను మీ పేరు విషయంలో మనసు తెలిసిన విషయాన్నే పర్షెప్షన్ గా అందిస్తుంది అందుకే మాకు అలవాటైన పేరునే మొత్తం మీపేరు చదవకుండానే పూర్తిచేస్తున్నాం. కంపెనీలు కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ ఇచ్చుకుంటేనే నిలబడుతున్నాయి. మొదడుతో సంసర్గ తేలికగా ఏర్పడటం వల్ల పున:శ్చరణ సులభం అవుతుంది కావచ్చు.
July 12 at 5:34pm
·
Like
Narayana Swamy
సీరియస్ రచయితలుగా లబ్ధ ప్రతిష్టులైన వారు ఏదైన జాన్ర రచనలు చెయ్యాలనుకున్నప్పుడు కలం పేరు (మారుపేరు) తో చెయ్యడం జరిగింది.
July 12 at 6:02pm
·
Unlike
·
1
Katta Srinivas
Narayana Swamy
garu ‘‘‘ జాన్ర రచనలు ’’’’ అంటే ..
July 12 at 6:25pm
·
Like
Narayana Swamy
Katta Srinivas
, genre. డిటెక్టివ్, థ్రిల్లర్, హారర్, వ్యంగ్యం - ఇలా ఏదో ఒక రసానికి ప్రాధాన్యతనిచ్చేవి.
July 12 at 6:57pm
·
Unlike
·
2
Katta Srinivas
1) 62.50 Percent
2) 25.00 Percent
3) 06.25 Percent
4) 06.25 Percent
( ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ మేరకు )
అంటే కలం పేరు ఏమీ అవసరం లేదు. స్వంత పేరుతో రాస్లే చాలు. అదే మేలు అంటున్నవారు సగానికి మించే వున్నారన్నమాట.
July 12 at 11:03pm
·
Like
·
1
Katta Srinivas
గజల్ లో మొదటి షేర్ ను మత్ లా, ఆఖరి షేర్ ను మఖ్ తా అంటారు.
మఖ్ తా లో కవి తన తఖల్లుస్ (కలం పేరు) ను ఉపయోగిస్తాడు.
July 13 at 5:06pm
·
Like
Jyothirmayi Malla
తఖల్లుస్ ను మఖ్తాలోనే కాక ఏ షేర్ లోనైనా ఉపయోగించవచ్చు
July 13 at 5:49pm
·
Unlike
·
1
Jyothirmayi Malla
మత్లాలోనే వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి
July 13 at 5:50pm
·
Unlike
·
1
Katta Srinivas
ధన్యవాదాలు
Jyothirmayi Malla
garu
అవును అతివ సౌందర్య వర్ఘన, ప్రియురాలితో ప్రేమ సంభాషణ స్థాయి నుంచి, నేటి సామాజిక అంశాలను స్ప్రుశించటం వరకూ ఎంతో, ఎన్నో మార్పులు.
మీ స్పందన కు చాలా సంతోషం
July 13 at 10:33pm
·
Like
·
1
Vinjamuri Venkata Apparao
Peru marchi pattkulanu emarchadamu enduku. Dheryamuga mana manobhavalu cheppa gala vade nijamuga kavi.
July 13 at 10:39pm
·
Unlike
·
1
Katta Srinivas
ఈ రోజు ఓటింగ్ తర్వాత నిన్నటి తో పోల్చతూ మార్పును చూద్దాం
1) 62.50 Percent నుంచి 51.14 ( 11.36 తరుగు )
2) 25.00 Percent నుంచి 23.81 ( స్వల్పంగా 1.19 మెరుగు )
3) 06.25 Percent నుంచి
09.52 ( 3.25 పెరిగింది కేవలం ఒక ఓటు పెరిగటంతో )
4) 06.25 Percent నుంచి 09.52 ( 3.25 పెరిగింది కేవలం ఒక ఓటు పెరిగటంతో )
కొన్నిసార్లు వుంటే బావుంటుందేమోనన్న దిశగా మొగ్గు చూపుతున్నట్లు ఈ రోజు ఫలితాలు చూపుతున్నా. ఇప్పటికీ... సగానికి పైగా కలం పేరు అవసరంలేదనే గోడగుద్ది చెపుతున్నారు.
ఈ ఓటింగ్ ప్రక్రయను తెలుగు సీరియల్ లాగా సాగదీయకుండా రేపటితో ముగించుకుందాం. రేపు శనివారం సాయంత్రం వరకూ రాబోయే ఫలితాలలో కూడా పెద్ద మార్పుండక పోవచ్చేమో. చూద్దాం మిగిలిన మిత్రులు స్పందనలు అబిప్రాయాలను బేరీజు వేసుకుని..
July 13 at 10:50pm
·
Like
Jagannadh Velidimalla
i feel it is must just to own the feeling that were vented out in the form of kavita and tomorrow no should claim the ownership of the same and this amply proves by giving a name say penname.
July 13 at 10:52pm
·
Unlike
·
1
Katta Srinivas
ఏదో తమాషాకోసంమో, బ్రమతోనో, ట్రెండు కాబట్టో కలం పేరు పెట్టుకోవలసిన అవసరం లేదేమో కనీ, కొన్ని తప్పని సరి పరిస్థితులు కూడా కలం పేరు తీసుకోవలసిన అవసరాన్ని చెపుతున్నాయి. మరి అసలు కలం పేర
ు అవసరం లేదు అనుకునే వారి నుంచి వీటికి స్వంత పేరుతోనే ప్రత్యామ్నాయం చూపగలమేమో చూడండి.
నేనను కుంటున్నాను కాబట్టి అంతే వేరు. ఈఈ కారణాల వలన ఇది సరైంది అనుకొవటం ఇంకా బావుంటుంది కదా.
కలం పేరు పెట్టుకోవడంలో ఒప్పుకోదగ్గ కారణాలు కొన్ని వున్నాయి. మరి వాటిని కొట్టేయగలమా ?
చూడండి...
1) Your real name is hard to remember and/or spell correctly.
( సులభంగా గుర్తుంచుకొవటం ఎలా ?)
2) Your real name sounds silly, stupid or obscene. If your real name suffers from any of these problems, you'll have a harder time getting readers to accept your work.
( స్వంత పేరు మరీ బాగాలేకపోతే ఎలా ?)
3) Your real name is the same as, or similar to, another author or a famous figure.
( ఇంకెవరి పేరుతోనో పోలికలున్న పేరుంటే మీ ప్రత్యేకత ఎలా చూపుతారు ?)
4) కులం, మతం తాలూకూ చిహ్నంగా పేరు వుండకూడదనుకోవటం సమంజసం కాదా ?
5) కలం పేరుతో రాయడాన్ని తప్పగా పరిగణించాల్సిన అవసరం వుందా ?
oo--(0)__oo
July 14 at 4:52pm
·
Like
·
1
Naveen Rjy
(నా పరిమిత పరిజ్ఞానం ప్రకారం) ఒక రచయిత రాసిన అన్ని రచనల సామర్ధ్యమూ ఒకేలావుండదు. రచననే పూర్తకాలపు వ్యాపకంగా పెట్టుకున్న వారికి (మార్కెట్ భాషలో) బ్రాండింగ్ అవసరం. ఇపుడు రచనలమీద ఆదాయా
...
See More
July 14 at 7:40pm
via
mobile
·
Unlike
·
5
Katta Srinivas
** రచనలో సత్తావుంటే ఆత్రేయ అసలు పేరుతో పనిలేదు.యండమూరికి కలం పేరు అవసరం లేదు **
Naveen Rjy
garu baagaa chepparu. If possible plz vote. on your choice.
July 14 at 9:00pm
·
Like
·
1
Karlapalem Hanumantha Rao
కలం పేరుతో కొన్ని రచనలు వుండి... అసలు పేరుతో కొన్ని రచనలు ఉండి..రెండు ఒకరివే అని తెలియక పొతే రచయిత పరిణామ క్రమాన్ని అంచనా వేయడమ్ కొంచెమ్ కష్టమ్.
July 14 at 9:25pm
·
Unlike
·
1
Lugendra Pillai
గుండె ధైర్యం ఉంటే చాలు ఏమి చెప్పాలనుకున్నా స్వంత పేరుతోనే చెప్పవచ్చు. అక్షర సైనికుడికి వెరపు ఉండరాదు.
July 14 at 9:28pm
·
Unlike
·
4
Jyothirmayi Malla
కలం పేరు అవసరం అస్సలు లేదనేది నా అభిప్రాయం. ఘజల్ లోని తఖల్లుస్ విషయానికొస్తే అక్కడ కూడా తఖల్లుస్ గా స్వంతపేరులోని ఏదో ఒక భాగాన్ని వాడడాన్ని మనం చూస్తాం. అది కలంపేరు కానక్కరలేదు. ఉదాహరణకి "రెంటాల" (రెంటాల శ్రీవేంకటేశ్వర రావు), "పెన్నా" ( పెన్నా శివరామక్రిష్ణ)," రాజా" (తటవర్తి రాజగోపబాలం),..ఇలా.
July 15 at 8:09am
·
Unlike
·
3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి