పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జులై 2012, శనివారం

జయశ్రీ నాయుడు॥నాలో(లే)ని నేను॥


ఎదో ఎటో వెళ్ళిపోతోంది
ఆగమంటున్నా వినదు

ధూళికన్న దూరంగా
వెన్నెలకన్న వేగంగా

మబ్బుకన్నా తేలికగా
చినుకుకన్నా చిక్కులుగా..

చుక్కలకన్నా చెల్లా చెదురై
దిక్కుల్లోకి దూసుకుపోతూ..

ఆపమంటూ నిన్నల్లుకున్నా
దూరమొద్దంటూ దిగులుపడుతూ
ముత్యాలుగా మారని ఆ తడి
గుండెకి ఇంకా గుర్తుంది..

ఎదొ బరువుగా
ఆపుతోంది
యేమిటది..
వెళుతూ..
ఓ నిముషం వెనక్కు చూస్తే..

నన్నాపుతూ నేనే
ఆశా నేనే
ఆ.. వేదనా నేనే
నిశీ , శశీ అన్నీ
వెళ్ళిపోతే తిరిగి రావేమొ అవి !

నీ సడే లేదనీ
అలిగి అలిగి..

ఆకాశంలా రివ్వున
అందనంత శూన్యాన్ని
అక్కున చేర్చుకుంటూ..వెళ్తున్నా
*13.7.2012

2 కామెంట్‌లు:

  1. ఓ పరుగు, ఓ వేదం, ఓ ఆశ, ఓ మధనం ఇవన్నీ కలగలిపితే మీ కవిత్వం..ఇలా చదువుతూనె ఉండాలన్పించే కవిత్వభాష.అది కొంతమందికే చెల్లు మీకులా. మీకొన్ని వాక్యాలు గుండెల్ని తాకాయి జయాజీ

    రిప్లయితొలగించండి
  2. దేవ్ జీ..
    మీరు ఇచ్చే స్పందనలు మరో అక్షర చిత్రాన్ని సృజించడానికి మనసుకు ఊతమిస్తాయి.
    I really look forward very much for your responses.

    రిప్లయితొలగించండి