చాలి చాలని బ్రతుకులు మావి
పేదవాళ్ళం మేము నిరు పేదవాళ్ళం
రెక్క అడితే గాని డొక్క అడని జీవితాలు మావి
రెండు చేతుల కష్టపడి సంపాదించిన సరిగ్గ
అన్నం తినని బ్రతుకులు మావి
దరిద్ర రేఖ దిగువన బ్రతుకు తున్నము మేము
బ్రతుకు పోరులో కష్టాల కొలిమిలో
నేలరాలుతున్న నిరు పేదలం మేము
ఈ బంగారు లోకంలొ కష్టాలు తప్ప
సంతోషానికి నోచుకోని బ్రతుకులు మావి
ఈ లోకంలొ చీడ పురుగుల్ల కన్న హీనంగ
బ్రతుకుతున్న గాధలు మావి
ఒక్కోసారి గంజి నీళ్ళతో కడుపు నింపుకునే
బ్రతుకులు మావి
పేదరికం నిరు పేదరికం
కడలి నింగిలొ జాలువారిన మా ఫ్రాణాలు
ఈ నిరుపేద జీవితంలొనే బుగ్గిపాలు అవ్వల్సి వస్తున్నాయి
మేము పడిలేచిన హ్రుదయ గోష అ దేవుడికి వినిపిస్తుందా
అ నుదిటిరాతను రాసిన భగవంతుడు మ సంతోశాన్ని దూరం
చేస్తున్న మాపై జాలి కరుణ రావడం లేదాయె ఎవరికి
మా ఆశలకు రెక్కలు వచ్చే రోజు లేనే లేదాయే
పేదవాడిగ పుట్టడం మేము చేసిన తప్ప
మా రేఖలను మర్చేది ఎప్పుడు మ గుండె గాధ ఇంకేన్న్నాల్లు
ధరని దద్దరిల్లుతున్న లోకంలొ పెను మార్పులు సంభవిస్తున్న
మా జీవితంలొ కొత్త వెలుగులు రావడం లేదు
*13.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి