అన్ని క్షణాలు మెలొడీగా
ఒక హృదయంగా
రాలిన బూడిదలో, కాలిన పొగల్లో
ఒక స్నేహరాగ మెలోడీ
బతికిన క్షణాలు బతకడం నేర్పే సంగీతాలు
టేప్ స్వరపేటికలోంచి పొంగి ప్రవహించిన
జీవిత మాధుర్యం.
గడియారం ముందు మోకరిల్లిన నిముషాలు
బతకడాన్ని నిర్వచించిన సంగీతం
గాలి చల్లబడి జెండాలా ఎగరటం
మొదలుపెట్టింది
నాలోపల దాగిన సంగీతజ్ఞానమంతా
నా ఎదుట సాక్షాత్కరిస్తున్న సందర్భం
ఒక టీకప్పు, ఆపై మరో టీకప్పు
మరికొంత జీవితాన్ని ప్రసాదించి
వెనక్కి మళ్ళాయి.
మా చెవుల వెనుక
మెహదీ హసన్
గులాం అలీ
పంకజ్ ఉదాస్...
......................!!
*10.7.2012
**బతికిన క్షణాలు బతకడం నేర్పే సంగీతాలు
రిప్లయితొలగించండిటేప్ స్వరపేటికలోంచి పొంగి ప్రవహించిన
జీవిత మాధుర్యం.
గడియారం ముందు మోకరిల్లిన నిముషాలు
బతకడాన్ని నిర్వచించిన సంగీతం**
ప్రతి పదం వెనుకా ఓ జ్ఞాపకం మనసు లో ఘజల్లా మోగుతొంది.. Your selection of words always intrigues me Yakoob ji.. I read them Feel I understood some part of it.. Again to understand some more from the feel of them
bagumdamdi..
రిప్లయితొలగించండి' మా చెవుల వెనుక
రిప్లయితొలగించండిమెహదీ హసన్
గులాం అలీ
పంకజ్ ఉదాస్... '
మన చెవుల వెనుక, గుండెల మాటున..కూడా కదా!
అభినందనలతో-
ఆర్.దమయంతి.