.................................................................
ఇప్పటివరకూ 'కవిసంగమం' లో కేవలం ప్రశంసల పద్ధతిలోనే వ్యాఖ్యలు కానీ,సూచనలు కానీ చేస్తూ, ప్రోత్సహించడమే పద్దతిగా సాగాం.
ఒకవిధంగా కవిత్వాన్ని రాసేందుకు ఎంతోమంది ముందుకు వచ్చేట్లుగా కామెంట్స్
లోనూ,ప్రశంస లోను జాగ్రత్తలు తీసుకుంటూ కవిత్వవిమర్శ చేయగలిగినవాళ్ళు కూడా
ఆచితూచి వ్యవహరించారు.
ఇకపై కవులు ఇంకా మెరుగైన కవిత్వం రాయడానికి ,ఆయా కవితల విశ్లేషణలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
'' కొందరు బాగులేదనగానే, అలాంటి విమర్శలకు ఎంత మాత్రం స్పందించరు. లేదా
ఆవేశంతో సమాధానాలిస్తుంటారు" అని నవుదూరి మూర్తి గారు భావించినట్లు ఆ
రకమైన పద్ధతులు కవులకు అనుసరణీయం కాదు..ఆవేశంతో సమాధానాలు ఇచ్చేవారితో
ఇకపైన నోచ్చుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.కవిసంగమానికి కూడా
అటువంటివారి వారి కవిత్వమూ అవసరమూ లేదు.
నిజంగా కవిత్వంపట్ల ఇష్టమూ,పాఠకులపట్ల గౌరవమూ లేనివారిని వదిలేయడమే భవిష్యత్తులోచేయాల్సినపని.
'కవిసంగమం' కవిత్వవేదికగా,కవిత్వవిమర్శ వేదికగా ఎదగాలని నా ఆకాంక్ష.
నవుదూరి మూర్తి గారు,కర్లపాలెం గారు, అఫ్సర్, బివివిప్రసాద్, కరీముల్లా
ఘంటసాల, హెచ్చార్కె, సతీష్ చందర్, వసీరా, శ్రీనివాస్ వాసుదేవ్, పులిపాటి
గురుస్వామి, కాసుల లింగారెడ్డి, నందకిషోర్, కట్టాశ్రీనివాస్, కిరణ్ గాలి,
నరేష్ కుమార్, కుమార్ వర్మ, రామకృష్ణ, మెర్సీ, జయశ్రీ నాయుడు,
రోహిత్,-ఇంకెందరో కొత్త పాతతరం వారు కవిత్వవిమర్శపై దృష్టిపెట్టాలని నా
మనవి.
కవిసంగమం లోని కవుల్ని,కవిత్వాన్ని సాహిత్యంలో సుస్థిరంచేసే దిశగా ఇది తప్పనిసరి అవసరం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి