యశస్వి|| సింధూరం|| తల్లి గర్భంలో తనయులు ఇద్దరు ఇద్దరివీ వేరు- వేరు మతాలు ‘ప్రసవానంతరం జీవితం ఉంటుందా! ’అడిగిందొకప్రాణం ‘నమ్ముతున్నా.. అది అందుకోవడానికే సిధ్ధమౌతుతున్నా’ వచ్చింది సమాధానం.. అదీ ఒకజీవితమేనా! అందుకుంది మాటని.. "ఏమో! అక్కడేదో ఉంది ఇక్కడికన్నా భిన్నంగా.. ఎక్కువ వెలుతురుంటుందట.. కాళ్ళతో నడిచి నోటితో తినగలం మనం.. " మళ్ళా సమాధానం "నడకా!.. వల్లకాని పని.. తిండా..! బొడ్డుతాడే.. పోషించు.. పుట్టాక ఈ జీవితాన్ని వదిలేయాలి మనం పుట్టినోళ్ళెవరూ మళ్ళా తిరిగిరాలేదు.. పుట్టడమంటేనే జీవితానికి అంతం ఆ వెలుగుల చీకటి కాటికి పంపి మళ్ళా ఇక్కడికే తెస్తుంది మనల్ని.. మొన్నెప్పుడో బొడ్డుతాడు చెప్పిందిలే" "..ఏమోలే.. నీ మాటలు కనీసం అమ్మనైనా చూడగలం బయట తలపెడితే.. తనూజులను బాగా చూసుకోవడంలో తల్లి తరువాతే ఎవరైనానట.. తెలుసా!" "అమ్మను నమ్ముతున్నావా!.. నీ చుట్టూ ఉన్నది అమ్మకాదా అమ్మంటే ఉమ్మనీరు.. ఆమె కనిపించడం లేదు కాబట్టి ఆమె లేనట్టే.. అమ్మ అనేది దేవుడిలానే ఒక భావన అంతే.. " ప్రపంచం 'మాయిపొర'లో ఇరుక్కున్న సహోదరుడితో అనునయంగా ఇలా అన్నాడు అన్న. "ఇప్పుడైనా.. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమెను వినగలం.. అనుభూతి పొందగలం. ఈ గర్భానికి అవతల ఒక వాస్తవం ఉందని నమ్ముతాను పుట్టాక అమ్మ ఒక వాస్తవం.. ఆమె ప్రేమ ఒక వాస్తవం విడిగా జీవించడం ఒక వాస్తవం కష్టం, నష్టం, ఇష్టం.. ఇవన్నీ వాస్తవాలే అవుతాయప్పుడు అప్పటి కన్నా ఇప్పుడే బాగుందని చీకటిలో అనుకోవద్దు. చూడని వెలుగులోకాన్ని కాదనవద్దు ఒక జీవితకాలపు ప్రయాణం చెయ్యాలి మనమిద్దరం తట్టుకోలేక రోదిస్తాం.. అయినా సరే వెలుగు చూడాలి.. విడివిడిగా మరణిస్తాం.. అయినా సరే .. ముందో-వెనకో కలిసి నడవాలి ..పద" మంటూ బయల్దేరిందా సమాధానం ఆ తల్లి.. కర్మభూమి ఆ తొలిబిడ్డ సింధూరం ==17.4.2014==
by Yasaswi Sateesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hOtw70
Posted by Katta
by Yasaswi Sateesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hOtw70
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి