కొన్ని కాఫీ సమయాలు
నాలుగో సన్నివేశం: ఖాళీతనం డొల్లతనమో/బోలు తనమో కాదు, చాలా సార్లు అది నిలదీస్తుంది, తలపోతకి తలుపు తీస్తుంది. నీతో నువ్వు కలబడడానికి స్థలాన్ని, కాలాన్ని సృష్టిస్తుంది. ఈ సృష్టిలోంచి నువ్వు నువ్వవవుతావ్, వొక చిరునవ్వవుతావ్! ఈ గుట్టు విప్పడం తెలియకపోతే వికల కలకల మవుతావ్!
1
ఈ కఫే నన్నెంత కలవరపెడ్తుందో! దీని కప్పూ సాసర్ల కలుపుగోలు గలగలల్లో నా వొంటరితనమో/ రికామీ తనమో/ ఏమీ కానీ/ ఏమీ లేనితనమో ఎంత దయలేకుండా మోగుతుందో?
వొక ఏకాకి కాఫీ కప్పు ముందు నేను.
నా ఆలోచనల్నీ, ఆవేశాల్నీ, వుద్వేగాల్నీ(శాంతమో/అశాంతమో!) అన్నీట్నీ ఆ కప్పులోకి దాని పరిమళపు నురగలోకి వొంపుకొని
అందులోకే నా చూపుల్ని తదేకంగా ముంచుకుంటూ
ఎంత సేపని
ఎంత
సేపని
ఇలా----
కూర్చుంటాను నన్ను నేను కూర్చుకుంటూ రెప్పలార్పక ఏమార్చి చూసుకుంటూ.
2
ఈ
కఫే
నన్నెంత నిలదీస్తుందో?
నిటారుగా నిలబడ్డ ఈ జావా కాఫీ కప్పు వొక్కో సారి వొక్కోలా
కనిపిస్తుందీ అనిపిస్తుందీ
వొక ఎడతెగని – తెంపడానికి మనసొప్పనే వొప్పని, తెంపే సమయానికి నవనాడులూ తెగిపోయే – సంభాషణ తరవాత నువ్వొదిలి వెళ్ళిన చిలిపి నవ్వులా-
3
నా వీపెనక వొక అదృశ్య గుయెర్నికాలోని వెయ్యేసి ముఖాలన్నీ
నన్ను గుచ్చి గుచ్చి చూస్తూండగా
పగలబడి నవ్వుతూండగా
ఇక్కడలేని నీతో నీలో నేను మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ
ప్రతిసారీ అనుకుంటా ఇప్పుడే ఇక్కడికి నువ్వొచ్చి వెళ్ళావని
నీవున్న క్షణాల భారాన్ని ఈ కుర్చీ ఇంకా మోస్తోందనీ..!
4
వొకరినొకరం దాటుకుంటూ వెళ్లిపోయాక గుండెలదిరేలా పాడుతుంది పిచ్చి Adele అదే పాట
సెల్ఫోన్ అలల మీంచి!
ఎవరు చెప్పారామెకి నాలోపలివన్నీ?
కప్పులో కాఫీ చల్లారి గొంతులోకి వెళ్లిపోతుంది ఎలాగో!
ఎప్పటికప్పుడు కప్పు ఖాళీ కావాల్సిందే
నీ లోపల ఎంత ఖాళీ వుందో నీకు తెలియడానికి,
నువ్వందులో ఏం నింపుకోవాలో తెలుసుకోడానికి.
5
అయినా తెలుస్తుందా చెప్పు,
ఈ ఖాళీ ఎంత ఖాళీనో?
05-09-2012

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి