యాకూబ్ | నువ్వు వచ్చివెళ్ళాక .................................... నువ్వొచ్చావని చెప్పాక గానీ తెలియలేదు నేను లేనని ; నువ్వున్న స్థలంలో నేను లేను , నేనున్న కాలంలో నువ్వు లేవు నేనొక దారిలోకి ప్రయాణం మొదలుపెట్టి, ఇంకా అక్కడికి చేరుకునేందుకు మధ్యన ఆగుతూ సాగుతున్నాను నువ్వేమో నేను లేని శూన్యంలోకి ప్రవేశించావ్ .. కొన్నేళ్ళ క్రితం నువ్విప్పుడు బతుకునేల మీదే నేనూ బతికాను, నువ్వోచ్చావంటే నా నేల వచ్చినంత సంబరం. ఆ సంబరం నిన్ను కలుసుకోలేనందుకు కోల్పోయానని లోపల్లోపల అదనపు బెంగ. అన్నీ బెంగలే దూరంగా బతకడం బెంగ ; ఇన్నేళ్ళ తరవాత కూడా ఇక్కడే అని చెప్పుకోలేని బెంగ ; ఎంచక్కా ఆకాశం కింద ఆరబోసుకున్నట్లు జీవించలేకబోతున్నందుకు బెంగ ; జేబుల్లోనే కుదించుకుపోయిన బతుకు బెంగ ; ఇవాల్టిని రేపటిలోకి పొడిగించే బెంగ; మాటల్ని బిగబట్టుకుని ,లోపలే కుక్కుకుని వొళ్ళంతా ఒక యంత్రంలా మారిపోయిన బెంగ; దినదిన గండంలాంటి మనసులోని బెంగ నేను లేను ,నువ్వు మాత్రం వచ్చి వెళ్ళిపోయావు కూడా ! అపుడపుడూ నాలోకి వొంపిపోయే ఊరిని ఈసారి నీతోనే వెంటపెట్టుకు తిరిగెళ్ళిపోయావ్ మళ్ళీ ఎప్పటికో నాలో ఆ సంబరం ! 31.1.2014
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvYAZI
via IFTTT
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvYAZI
via IFTTT
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి