స్టేజిమీదున్నప్పుడు
నటుడైనా, గాయకుడైనా, కవి అయినా ఒక entertainer గా మారకతప్పదు.
ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యక తప్పదు.
కవితాపఠనాలలో దీర్ఘకవితని చదవడం గురించి నిఖిలేశ్వర్ గారు అన్యాపదేశంగా
చేసిన హెచ్చరిక దాని గురించే. ప్రేక్షకులకున్న సమయాన్ని, అటెన్షన్ స్పాన్
ని, గ్రాహకస్థాయిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కవితల్ని ఎంచుకోవడం
అవసరం. వాటిని కేవలం చదివెయ్యడంతో సరిపెట్టకుండా, వాటి ముందూ... వెనకాలా...
వీలైతే మధ్యమధ్యలో కూడా కవిత గురించో, కవిగా తమ గురించో, అనుభవం గురించో,
విశేషం గురించో విశ్లేషణ గురించో వ్యాఖ్యానిస్తూ చదవడం ఒక టెక్నిక్.
కవిత్వం రాసుకోవడం వేరు, రాయడం వేరు. చదువుకోవడం వేరు, చదవడం వేరు. ఆ
చదవడం ఒక సభలో అయితే, మరీ ముఖ్యంగా సాటి కవులున్న సభ అయితే మరీ వేరు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చదివే కవితల్ని ఎంచులోవడం అవసరం. కవిపెద్దలు
శివారెడ్డి, నగ్నముని, నిఖిలేశ్వర్ గార్లు ఈ కవితల ఎంపిక కవితాపఠన
శైలుల్లోకూడా అందరికీ గురుతుల్యులే. వారి దగ్గరనుంచీ యువకవులు
నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కవిత్వం రాసుకోవడం వేరు, రాయడం వేరు. చదువుకోవడం వేరు, చదవడం వేరు. ఆ చదవడం ఒక సభలో అయితే, మరీ ముఖ్యంగా సాటి కవులున్న సభ అయితే మరీ వేరు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చదివే కవితల్ని ఎంచులోవడం అవసరం. కవిపెద్దలు శివారెడ్డి, నగ్నముని, నిఖిలేశ్వర్ గార్లు ఈ కవితల ఎంపిక కవితాపఠన శైలుల్లోకూడా అందరికీ గురుతుల్యులే. వారి దగ్గరనుంచీ యువకవులు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి