1
నీతోనా నీలోనా
నాతోనా నాలోనా
మాట్లాడుకుంటూనా
మాట్లాడకుండానా
మాటల్నీ మాటల్లేని క్షణాల్నీ కలిపేసి
ఈ చీకటి కింద రాలిన మల్లెల్లో కుప్పపోసుకుంటూ కూర్చున్నా.
2
వొక రాత్రి తరవాత
కొన్ని పరిమళాల క్రితం నువ్వెళ్ళిపోయావా
వొక నవ్వే నవ్వి వెళ్లిపోయావా
ఆ పరిమళంలో నేనొక పువ్వునై రాత్రంతా విచ్చుకుంటూ కూర్చున్నా.
ఆ నవ్వులో నేనొక చిన్ని తరగనై సుడి తిరుగుతూ వున్నా.
3
చివరి వాక్యం ఏమవుతుందా అని
వింటూ వింటూ వుంటానా
అదే నీ నిష్క్రమణ తరవాత నాలోపల మొదటి వాక్యమై
నన్ను తిరిగి రాస్తూ రాస్తూ ఈ రాత్రిని నా కంటి కింద దీపంలా వెలిగిస్తుంది
వద్దన్నా వచ్చి వెళ్లిపోయే నీ నీడల నిషా పహరాలో
ఈ దీపం వెలిగే గదిలో నిద్రపడుతుందా చెప్పు!
5
నీ నిట్టూర్పులు నా చుట్టూరా గాలి పటాలయి
ఎగిరెగిరి దిక్కులన్నీ చుట్టేసిన బిగి కెరటాలయి
ప్రతి గాలి అలకీ వొక కౌగిలి ఇచ్చేద్దామనుకుంటానా
వాటికీ నీ వయ్యారాలే తెలిసి, విస విసా ఎటో పారిపోతాయి.
దొరకనే దొరకవు కదా, ఎంత దూరమో పరుగెత్తించీ...
నా వొడిలో నువ్వు పేంచ్ పడిపోవే పతంగమా...?
అనుకుంటూ పగటి కలలోకే నా ప్రవాసాలన్నీ.
6
ఇంకేమీ తెలియదు ఎప్పటికీ తెలియదు
ఇది గుబులో దిగులో సుఖమో సంతోషమో!
ఎన్ని భాషలని నేర్చుకోను,
నిన్ను నాలోకి వొంపే ఆ కల కోసం!?
*12-07-2012

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి