పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, అక్టోబర్ 2012, మంగళవారం

బహుదూరపు బాటసారి ॥ తల్లా ! పెళ్ళామా !***



వేసానండి మొత్తానికి మూడు ముళ్ళు
అమ్మ కళ్ళల్లో ఆనందం
బిడ్డ ఓ ఇంటివాడయ్యాడని..!

తాళి కట్టిన నా ఇంతి కళ్ళల్లో ఆనందం
నాకో తోడూ దొరికిందని,

ఎంత దాయాలన్న దాగని నా కనురెప్పలపై గర్వం
నచ్చిన చిన్నది అలైనందుకు
నాకంటూ ఒకరు
మనసు పంచుకునే తోడూ దొరికినందుకు ..!

పేరు పెట్టి పిలుస్తోందిరా నీ పెళ్ళాం నిన్ను
నలుగురు వింటే ఏమవ్తుంది మన గౌరవం
అంటూ కోపంగా అమ్మ ,

నిన్నే అత్తయ్య చెప్పింది
పేరుపెట్టి పిలవకోడదంట
ఈ కాలపు ఆడదాన్ని
పాతచింతకాయ్ పచ్చడిని కానంటూ పెదవి విరుస్తూ తను
మధ్య నలుగుతూ నేను ..!

జీతం వచ్చిన మొదటి రోజు
మూరమల్లెలతో పడగ్గదిలోకి వడివడిగా నేను
వయ్యారం ఒలకబోస్తూ సింగారపు చీరకట్టి
నా కోసం తను..!

ఇంతకాలం మాటేమోగాని
మిమ్మల్నే నమ్మి మీ వెంట వచ్చినందుకు
జీతమంతా నాకే కావాలంటూ చెవిలోసన్నగా ...!
మనసులోనే నవ్వుకున్నా
అమ్మ కడుపు చూస్తే ఆలి జేబు చూస్తుందని..!

భాద్యతలంటే
బంధాలతో కూడిన అనుబంధాల ముడులే కదా
నా కోసం వచ్చిన తనకోసం
నా కోసమే బ్రతుకుతున్న అమ్మకి చెప్పగలనా ఈ నిజం...!

దుప్పడి కప్పుతూ నేను , జీతం లెక్కల్లో తను ... 26-10-12

1 కామెంట్‌:

  1. నిద్ర లేచి౦ది మహిళా లోక౦...అన్నిట్లోనూ సై అ౦టున్నారు...
    ఎదుగుతున్న భారతాన్ని చూసి నలుగుతున్న స౦స్కృతి అని చా౦ధసులు ఆడి పోసుకు౦టున్నారు.
    భావి భారత పోరగాల్లకు హృదయ వైశాల్య౦ పె౦చుకొని వారి ఎదుగుదలకు తోడ్పడటానికి కొన్ని చిట్కాలు.
    సూచన: ఇది పాత చి౦తకాయ పచ్చళ్ళను ఉద్దేశి౦చినది కాదు...కేవల౦, ఎదిగిన ఈ కాల౦ మహిళా శిరోమణులను, అర్థ౦ చేసుకోలేని ఛా౦దసవాదులకు మాత్రమే...
    ఇ౦ట్లో

    వ౦టచేయమ౦టే....వ౦టమనిషిని చేసారని సాధి౦పులు
    ఇల్లుచూడమ౦టే....పనిమనిషిని చేసారని వేధి౦పులు
    పడకమీద...ఇ౦దుకు తప్ప నేనె౦దుకూ పనికిరానా అని చీత్కరి౦పులు
    చిట్కా: మీ జీత౦ మొత్త౦ భార్యకిచ్చి, వేరు కాపుర౦ పెట్టడ౦. వీలైతే పుట్టి౦టి వాళ్ళు(అబ్బాయి తరపు) మీ వైపు రాకు౦డా చూసుకోవడ౦. వీలుకాకపోతే, మళ్ళీ సాధి౦పులకు రెడీగా వు౦డట౦.

    ఆఫీసులో/బయట

    మ౦దు కొడతారు...సిగరెట్లు కాలుస్తారు...పోరగాల్లను వె౦టేసుకుని ఏదేదో చేస్తు౦టారు.
    కాస్త విషయఙ్ఞాన౦ ఉ౦టే, మహిళా స౦ఘాల్లో, ముదిరితే రాజకీయాల్లో చేరి తోటి మహిళల్ని ఉద్దరిస్తు౦టారు.

    చిట్కా: వీలైతే జన జీవన స్రవ౦తిలో కలిసిపోవట౦ లేకు౦టే నోరుమూసుకోవట౦.

    రిప్లయితొలగించండి