పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఆగస్టు 2012, గురువారం

కొత్త కిక్కు - John Hyde Kanumuri

ఓ పదిహేను ఏళ్ళక్రితం నాకున్న మద్యపాన వ్యసనాన్ని మానడానికి చేసిన ప్రత్నాలలో సాహిత్యం ఒక ఆలంబన అయ్యింది. అందులోనూ కవిత్వం ఒక ఒడ్డుకు చేర్చింది.

సంవత్సరంన్నర క్రితం నాగుండెకు బైపాస్ ఆపరేషన్ అయ్యి, సమయాన్ని, దేహానికి మధ్య సంఘర్షణ పడుతున్నప్పుడు పేసుబుక్కు పరిచయం అయ్యింది. కొత్త కొత్త మిత్రులు కవిత్వం మధ్య ఎంత త్వరగా కోలుకున్నానో, డాక్టర్లకే ఆశ్యార్యాన్ని కలిగించింది.

ఈ మధ్య మళ్ళీ దేహం సహరించకపోవడంతో మళ్ళీ ఆసుపత్రి పాలై కవిసంఘమంలో జరిగే పనులలో నేనేమీ చేయలేకపోయాను. కొంచెం అసంతృప్తి.


ముందుబెంచీలో మధ్య కూర్చోవడంవల్ల ఇటూ అటూ కదలలేక కొందరిని కలవలేకపోయాను.

మనసు వుత్సాహమూ దేహం సహకరించనితనమూ మధ్య సంఘర్షణ జరిగినా ఓపిగ్గానే చాలా సమయం వెచ్చించాను అనే చెప్పాలి.

కిక్కిరిసిన హాలుమధ్య
స్పందనలకు హోరెత్తిన చప్పట్లు
కొత్త కిక్కునివ్వకుండాఎలావుంటుంది

నే బయటకు వెళుతున్నప్పుడు
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాను
నా వెంటొస్తున్న స్వరాల చప్పుళ్ళు నే ఒంటరినిగా లేనని పదేపదే గుర్తు చేసాయి

నే చేస్తున్న వానసంకలనం గురించి రెండు ముక్కలు చెబుదామనుకున్నా
చాలా ఆలస్యంగా దొరికిన నా తరుణం కొన్ని వాక్యాలను మింగేసింది

కొందరిని నేను పలకరించడం సంతోషం
కొందరు నన్ను పలకరించలేదనేది అసంతృప్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి