పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జూన్ 2014, శనివారం

Sai Padma కవిత

సాయి పద్మ // గరకు సమయాలు .. కొన్ని నీవీ, కొన్ని నావీ .. వెరసి మనం అనుకునే ఒక సందిగ్ధత కనిపించేదేదీ నిజంలా అనిపించదు నిజంలా తెలిసేదీ .. అబద్ధం అని ఎవరన్నా చెప్తే బాగుండు నిర్ణయాధికారం లేనిది కూడా ప్రేమే నంటావా అద్దంలో నమ్మని శరీర జాడలు.. రెండు కాన్పులు , పాతవన్నెలు గోడెక్కి కట్టిన ఫోటో ఫ్రేములు నీ కళ్ళద్దాలు.. నిర్లక్ష్యాల గడ్డాలూ సాయంరాత్రి.. స్వప్న సుందరితో పోలికలూ మాట్లాడుకోవటానికి ఏమీ లేకపోవటాలూ నిజం మాట్లాడుకకోవటానికి అద్దెకి తెచ్చుకున్న పరదాలూ అసహనపు నిశ్శబ్దాన్ని కూడా బంధమేనంటావా ? చందమామ కూడా డైటింగ్ చేస్తున్నాడేమో గరకు సమయాలలో తనను తాను ఆరగతీసుకుంటున్నాడో తడారి ఆవిరైన సంద్రం .. నీ వైపు సగం ఖాళీ మంచం లా పోడారని కళ్ళు .. ఆవిరి మధ్యాహ్నపు ఆశల్లా నీకోసం నిలుపుకున్న ప్రాణాలూ.. వదులుకున్న బంధాలూ బంధాలని ఎంత అరగదీసినా పోనీ గరకుతనాలు Oh.. We are going through Rough times .. you see..!! --Sai Padma

by Sai Padmafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmQDHw

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి