పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మార్చి 2014, గురువారం

Sriramoju Haragopal కవిత

యాదిగంప నెత్తి మీద సుట్టబట్ట లెక్క నీ తలపుల్ని పెట్టుకుని ఎన్ని బతుకుబరువుల్నైనా మోస్తుంటాను కంటిపాపల్ల రూపులతీరు నీ ఎన్నీల నింపుకుని ఎంత కాలమైనా సరే చూస్తుంటాను మనసులోపట మనాది లెక్క నీ మీద కై కట్టుకుని బతికినంతకాలం రాస్తుంటాను జొన్నచేన్లో పాలపిట్ట లెక్క నీ పాటల్నే పాడుకుంటు ఎప్పటివరకైనా బతికుంటాను

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NBxjrd

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | పాణిబంధం -------------------------- కిటికీ అవతల కొమ్మల్లో విశ్రాంతి తీసుకుంటున్న నీరెండ కిటికీ గట్టు మీది కుండీలో మొక్క నీడ గది మధ్యన నా వ్యాహ్యాళికి సమయం, చివరి గుక్క తేనీరు, చేతిలోని దినపత్రిక నెమ్మదిగా జారవిడిచి, గుమ్మం దాటటానికి ఉద్యుక్తుడనయ్యాను… “మర్చిపోయారా?” మందలింపులో చిరుకోపం చలవ కళ్ళజోడు చేతికిచ్చిన స్పర్శలో ‘అమ్మ’దనం పది, పాతిక, వంద... అడుగులు లెక్క పట్టుకోవటం అదో వెర్రి హాయి దోవపక్కన వేప చెట్టుకి ఏడాది పొడుగునా ఏదో ఒక పని సర్వకాల సర్వావస్థల్లోనూ అది ఏదో ఒకటి రాలుస్తూనే వుంటుంది. ఆకులూ, పూతా, కాయలూ, పిచ్చుక గూళ్ళ పూచికపుల్లలూ... ఇక, ఇక్కడ ఎదురవ్వాలి ఆ ఇద్దరూ, పచ్చ గళ్ళదో, ఎర్ర అంచున్నదో, ఓ నేత చీరలో నవ్వు మోముతో ఆవిడ, బట్ట కట్టటంలో బద్దకాన్ని దాయలేక ఆ పెద్దాయన నాకెప్పుడూ సమాధానం లేని ప్రశ్నే, “ఏమి ముచ్చటించుకుంటుంటారు?” గుక్కతిప్పు కోనన్ని ఊసుల్లో మునిగితేలు తుంటారెపుడూ... ఒక్కరోజూ పలకరింపు నవ్వు మానదా సిరి మొగము అవును ఏరి కనపడరేమీ? చేతి గడియారం నా సమయపాలన తప్పలేదన్నది. ఒకటి, రెండు, అరవై రోజులు వాళ్ళు కనపడక అరవై ఒకటో సాయంత్రము నడకలో నా అడుగుల లెక్క వేస్తున్నాను ఎదురెండకి చేయి అడ్డం పెట్టుకుని పెద్దాయన నా ముందు నడుస్తున్నాడు వెనగ్గా సాగిన నీడ ఆయన నీరసపు నడక లో వంకర్లు పోతూంది... వేప పూవొకటి నా చెవి మీదుగా నేలకి రాలిపడింది తెలియకుండానే తల ఎత్తి చూసాను ఊగుతున్న రెమ్మకి, రేకల్లేని తొడిమ ఒకటి వేలాడబడి ఉంది పెద్దాయన్ని దాటుకుని వచ్చేసా “ఆవిడ ఎక్కడ?” మనసు నన్ను నిలదీస్తుంది వెనుదిరిగి ఇంటి ముఖం పట్టాను ఇపుడు నాకెదురుగా పెద్దాయన ఏదో మార్పు, వడిలిన ముఖం, వణుకుతున్న చేతులు, ఒక్కడూ గొణుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు నన్ను దాటుకుని ఒక్కసారిగా నా వెన్ను అదిరింది, విదిలిస్తున్నా ప్రశ్నలు ముసురుతున్నాయి భయం, బెంగ వంతులు వేసుకుని నా గుండెని నొక్కుతున్నాయి ఇంటి కి చేరే సరికి నా కోసం ఆరాట పడే మనిషి ఉండాలి ఎప్పుడూ... మంచినీళ్ళ గ్లాసు చేతికిస్తూ ఆరాలు తీసే తోడు ఉండాలి. ఉంటుందా? ఒంటరితనం కొక్కానికి చిక్కుకోబోయేది తనా, నేనా? కాలం వేసే కొత్త మేకప్పుకి సిద్దపడేది ఎవరు మా ఇద్దరిలో (2012 నాటి ఈ వచనానికి 'పూర్ణా...పూర్ణా అంటూ మా చిన్న అమ్మమ్మ వెనుక తిరిగి ఆమె మరణం వెంబడే తనూ ఈ లోకాన్ని వీడిన మా కొవ్వూరు తాతగారు, తను ప్రేమగా "సీతాయ్ సీతాయ్" అని మురుసుకున్న మా అమ్మ భౌతికం గా దూరమైనా ఒక దశాబ్దం గా ఒంటరి యాతన పడుతున్న నాన్నగారు ప్రేరణగా రాసాను...క్రౌంచ మిధున వారసులు ఎందరెందరో కదా!?) 06/03/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cdriMp

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || ఓ నిజం మరొ నిజాన్ని దాచాలను చూస్తోంది || --------------------------------------------------------------------------- నాలో నేను మాట్లాడుతుంటా వెన్నులో వచ్చే అలజడిలో నిన్ను చూడాలనే ఆరాటం గుండెల్లోంచి తన్నుకొస్తుంది నీతో మాట్లాడాలనే ఉద్వేగం అధరాలపై ఆత్రంగా నీపేరును పలుకుతొంది నీ జ్ఞాపకాల ఆలోచనలు ఉత్తుంగ తరంగమై ఎగసిపడుతుంటే నేనేం కోల్పోయానో ఇప్పుడర్దం అవుతోంది మనిద్దరి మధ్య జరిగిన మాటలన్నీ పోగేసి గుట్టలుగా చేసి నీ దగ్గరకొస్తే దగ్గరితనం దూరం అవుతోంది నన్ను నేన్ దూరం అయ్యేలా చేస్తుంది ఓ నిజం మరొ నిజాన్ని దాచి ఎవ్వరూ చూడలేరు అనుకొంటుంది అవమానంతో మడత పడిన నాలుక మౌనం దాల్చి నాలుకపై పన్ను దిగి రక్తం కారుతోంది పోగేసుకొచ్చిన మాటలన్నీ ఎర్రగా మారాయి రక్తాక్షరాలుగా మారాయి కాని నాగుండెల్లో ఉన్న నీ చిరునవ్వులు తెగిన దండలోని ముత్యాల్లా రాలిపోతున్నాయి కాని పట్టుకుండామంటే దొరకలేదు ఆ ముద్యాలను ఎవరో ఏరి నీమెడలో దండగా చేసి నిన్ను అలంకరిస్తున్నారు నీవు సిగ్గుపడుతున్నావు లిపి లేని చూపులైనా సూటిగా భావాన్ని అర్దం చేసుకొవాలని నా మనసు పుటలు వెతికినా అంతా చీకటిగా ఉంది ఏం కనిపించడంలేదు నా మనో వేధనను కళ్ళల్లో నింపుకుని నీ ముందుకొస్తే నీ చూపుల ఉప్పెనలో పడి నా చూపులు కొట్టుకు పోతే ఒణికి తొణికిసలాడే మనసును ఉగ్గపట్టుకుని గొంతు పెగల్చుకుని మాటలు రూపం దాల్చేలోగా కనుమరుగై పోతావు గుండె గొంతుకలో నలిగి పోయిన భావాలు నిశ్శబ్ద గీతాలై నన్ను వెక్కిరిస్తున్నాయి. ఈ నిశ్శబ్డం ఇక శాశ్వితమనిపిస్తుంది అందుకే చీకటిలో ఒంటరిగా ఉండాలనిపిస్తోంది

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NBf2dI

Posted by Katta

Chakra Pani Yadav కవిత

"మా తెలుగు తల్లికి మల్లెపూ దండ" గేయంలో "మల్లమ్మ పతి భక్తి" యేమిటొ తెలపండి ప్లీజ్ ... ఎవ్వరికీ తెలియదా !?

by Chakra Pani Yadav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oujTZA

Posted by Katta

Pusyami Sagar కవిత

!!బతుకు!! ____పుష్యమి సాగర్ రెక్కలు విప్పిన ఆలోచనలు గిరికీలు కొట్టిన పక్షులు !! తెల్ల కాగితం పై ఒలికిన సిరా జీవితం చిందర వందర..గా కుదురుగా...!!! అనుభవాలు రోడ్దేక్కుతాయి కష్టాలను కుట్టుకుంటూ .. కాసులను లెక్కపెట్టుకుంటూ !!! నమ్మకం అమ్ముడు జన సంత లో పచ్చ నోటు కి ..!!! గొర్రెలు లైన్ గా గుడ్డితనపు తప్పులకి బానిస లు గ ఐదు వత్సరాలు !!! తర తరాలు కాలం వొడి లో మారని బతుకులు ఆశ నిరాశ కి వేలాడుతూ ...!!! త్రిశంకు స్వర్గం భూలోక నరకాన ... మధ్య తరగతి లో న ... ప్రతి నిత్యం పుడుతూ ...!!! మార్చ్ 7, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NBf1X2

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ఆట మొదలయింది ^^^^^^^^^^^^^^^^^^ రావెల పురుషోత్తమరావు వెంటాడి వేధిస్తూ విసిగించే వేటగాళ్ళొస్తున్నారు అందరూ తమతమ కలుగుల్లోకి వెళ్ళి దాక్కోండి ఆకాశాన చంద్రుణ్ణి కూడా మేమే సృష్టించామని చెప్పే పిట్టల దొరలు వీళ్ళు వాళ్ళ వాగ్దానాలనీ నీటిమీద ంఊటలని నమ్మండి. వంచనాశిల్పంలో వాళ్ళకు వాళ్ళే సాటిసుమా రద్దుల చిట్టాలో రాని అప్పులేమీ మిగలవండీ సంతకాల సంతలో కాగితాల వెనక గమనించండి తామర కొలను తక్షణం గుర్తుకు తెచ్చుకోండి అది ఎవరి స్వేదఫలమో మీరే గమనానికి తెచ్చుకోండి ఎవరి బాబు సొమ్ము ఎవరూ దానంచేయరు సిమ్హాసనం ఎక్కెదాకా సిమ్హాలమని సంభాషిస్తారు ఆతర్వాత గ్రమ సిమ్హాల మాదిరిగా పిచ్చెక్కి ప్రవర్తిస్తారు. వోటు విలువైందేకాదు అమూల్యమైన రత్నమని గ్రహించండి మనో నిబ్బరంలేనివాడి చేతిలోకెళితే మన సంగతి ఇంతే సుమండీ అయిదేళ్ళ దాకా ఆపాపం అనుభవించాలి సుమండీ. ఇకపై విశ్వవిఖ్యాతుడినిసైతం వీధికెక్కిస్తారు వారి వారి అవసరాలకు వారినెలా ఉపయోగించుకోవాలో తెలుసుగదండీ ఇదే ఆఖరి అవకాశం. చేజార్చుకోకండి. మాయల ఫకీరులచేతుల్లో శునకాలంకాకుండా జాగ్రత్త వహించండి.06-03-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fb7mVr

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

--- చిరాశ // 30. గోముఖ వ్యాఘ్రాలు // *************************************** కౄరమృగాలన్ని కలిసి కూడబలుక్కు౦టున్నై మేకవన్నె వచ్చునట్లు మేకప్ వేసుకు౦టున్నై మ౦దజేర మెకములన్ని గోవు మాస్కు దొడుగుతున్నై ర౦గులన్ని వెలసిపోగ కొత్తర౦గు లేసుకు౦టున్నై ఊసరవెల్లులె వి౦తగ వీధుల ఊరేగుతున్నై కప్పలతక్కెడ ఎప్పుడు ఎటుమొగ్గోనో?! అని పాములు లొట్టలేస్తున్నై **************************************** ---- {06/03/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dvOCn7

Posted by Katta

Pranayraj Vangari కవిత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MQQtbF

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఆది మానవున్నించి అంతరిక్షవాసివై ఎంత మారావయ్య మనిషీ..! రాతి యుగం నుంచి రాకెట్ యుగం దాక ఎంత ఎదిగావయ్య మనిషీ..! ఆకాశం అందుకున్నావు.. ఓజోను పొర చింపేసావు.. జాబిల్లిపై షికారు చేసావు.. జాజిపూల వాసన మరిచావు... ఎంత ఎగిరావయ్యా మనిషీ. . .! అరణ్యాలు చేధించావు కౄర మృగాల చెరపట్టావు . . నువ్వే అజీర్తి మృగానివై అగ్నిలా పచ్చదనాన్ని మింగేసావు . . ఎన్ని కాల్చావయ్యా మనిషీ . . ! చలువ రాతి మేడల కోసం గుట్టల్ని తొలిచేసి వర్షానికి తలుపులు మూసేసి పంట పొలాల్నీ పచ్చికబయళ్ళనీ బీడు భూమిగా మార్చేసి ఎన్ని కూల్చావయ్య మనిషీ . . ! పుడను తల్లి మేనంతా కాంక్రీటు పరిచేసి వాన చుక్కలకు వాకిళ్ళు మింగేసి . . ఆనక నీ తీరని దాహానికి అవని గుండె నిలువునా తూట్లు తూట్లు పొడిచేసి పాతాళగంగ ఇలకు తెచ్చిన కలియుగ భగీరధుడివై ఎన్ని నేర్చావయ్యా మనిషీ. . ! ఎ.సి. గదుల్లో గాలిని బంధించి మినరల్ ప్లాంటుల్లో నీటిని విడగొట్టి కడుపు నింపే వంట మంటతో మానేసి కడుపు కోత పెట్టే విస్పోటనాల్లో వాడేసి . . సూర్యున్ని ధిక్కరించి . . చీకటిని వెక్కిరించి . . దివారాత్రాలు ఏకం చేసి ఎంత మురిసివావయ్య మనిషీ . . ! పంచభూతాలతో పరాచికాలాడి ఏం బావుకున్నావయ్యా మనిషీ . . ! తింటే ఆయాసం తినకుంటే నీరసం . . పాంటాప్రజోల్ తో భోజనం ఆల్ఫజోమాల్ తో నిద్ర . . ఎన్ని దాచావయ్య మనిషీ . . ! ముప్పై ఏళ్ళకే కళ్ళ జోళ్ళు మెడ పట్టీలు . . నలభైలో పడి నడుము నొప్పులూ అరిగిన మోకాలి చిప్పలూ . . ఏం సాధించావయ్య మనిషీ . . !!? తొలిపొద్దు మేలుకొలుపు మరచి వాలే పొద్దుల్లో జోల పాటలు విడిచి సహజంగా పుట్టలేక సహజంగా బ్రతక లేక చివరికి సహజంగా చావనూ లేక ఏం మిగిల్చావయ్యా మనిషీ . . ! ప్రకృతిని గెలిచానని పగలబడి నవ్వకు . . వికృతంగా ఓడానని పొగిలి పొగిలి ఏడ్వు . . ! అవును . . అప్పుడు నీకెవరూ లేరు . . ఇప్పుడు నీకు నువ్వే లేవు ... ! నిర్మలారాణి తోట [ తేది: 06.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fKWc9T

Posted by Katta

Gajulapalli Madhava Reddy కవిత

గాజులపల్లి ||శూన్యం|| ఏమున్నది ఏమున్నది నీకైనా నాకైనా ! నువ్వున్నది నేనున్నది నేలతల్లి ఒడిలోన !! గొంతునరం తెగనరికితే నీకైనా నాకైనా కారేది నెత్తురే పారేది నెత్తురే ఉరికొయ్యకి ఊగిస్తే నిన్నైనా నన్నైనా పోయేది ఊపిరే పోయేది ఊపిరే బ్రతకాలని ఆశలతో కబళించే ఆకలితో బ్రతిమాలే బానిసగా బ్రతుకంతా బాసటగా నీ యాతన నాకెరుకే నా దిగులు నీకెరుకే ఐశ్వర్యం నీకుంటే ఔదార్యం నాకుంది నీకున్న ఐశ్వర్యం నీ ఆయుస్సు పెంచినదా నాకున్న ఔదార్యం కష్టాలను కడతేర్చిందా ఏమున్నది ఏమున్నది నీకైనా నాకైనా ! నువ్వున్నది నేనున్నది నేలతల్లి ఒడిలోన !! .....................................................06/03/2014

by Gajulapalli Madhava Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gUsaTz

Posted by Katta

Venugopal Rao కవిత

ఎక్కడ నుండో వింత వింత శబ్దాలు పెద్ద బండరాయి దొర్లి పడ్డట్లు ప్రమాధమేదో తరిమినట్లు నక్కల ఊలలు ఎందుకో ఏమో కారణం తెలియదు ప్రకృతి పాటం చదివేదెవరు చదివినా అర్ధం చేసుకున్నదెవరు అంతా తమకే తెలిసినట్లు పెద్ధఫోజు తాము చెప్పిందే ప్రకృతి అంటూ వ్యాసాల రాతలు నా మనసే నాకిప్పటికీ అర్ధం కావటం లేదు వీళ్లేమో ప్రకృతిని జయించాం అంటున్నారు రోజులాగే పొద్దెక్కుతుంది నేను కూడా నిద్ర లేస్తా ఒకరోజెంతో ఉషారు, మరో రోజు నిరుత్సాహం నన్ను మించిన మొనగాడు లేడనె భావన ఒక దినం కొండలు పిండే శక్తి వుందని ఒకరోజనిపిస్తే మరో రోజు అంతా నైరాశ్యం జగమంతా చీకటి అందరికి అన్నీ ఉన్నాయి నాకే ఏమి లేవనిపిస్తుంది మెదడు మొద్దుభారినట్టు మరెంతో దిమ్మెక్కినట్లు ఎందుకో ఒక రోజు చైతన్యం మరో రోజు చైతన్యం అంతా ప్రకృతి... అర్ధం కాని తత్వం... అంతే..

by Venugopal Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cEC0qd

Posted by Katta

Padma Sreeram కవిత

March 3rd Andhraprabha లో ప్రచురితమైన నా ఆర్టికల్ http://ift.tt/1ieQmpa

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ieQmpa

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఆవకాయ,One Demand// చింతనిప్పుల్లాంటి నాన్న కళ్ళు ఎర్రబడ్డ కంచం చూసి ఎలా మెరుస్తాయో నాకు మాత్రమే తెలిసిన వారసత్వకధ చెబుతా విను.. రక్త పోటు 160/100 ఉంది కదా పిప్పళ్ళ బస్తాలా ఉన్నావ్ చస్తే ఎలా మొయ్యాల్రా నిన్ను అని ఉమ్మూసుకొచ్చిన మధు రెండు ముద్దలు పెట్టించుకుందామనుకున్నాను అప్పుడే కాళీ చేసావా అన్నప్పుడు బొసి కంచం నేనూ నవ్వాము మజ్జిగలోకి దాచుకున్న ముక్కలేమో ఎక్కిరించాయ్ ఇల్లాలా! ఇక ఆవకాయ పెట్టు విధానం చూద్దాం గోలెంలో తిరగబోసి కాయలు అటక మీద నుంచి ఆవకాయ కత్తిపీట తీస్తారు ఆరడుగుల నాన్నకి కత్తి పీట లోకువో కత్తిపీటకి మావిడికాయలు లోకువో సంవత్సరం పాటూ గుడ్డకట్టి అటక మీద దాచినా కత్తి పీట తగ్గని పదును వెనుక గండికోట రహస్యం నా మట్టిబుర్రకి చిక్కదు జీడి తీసి ముక్క తుడిసి పిల్లలంతా తలో చేయీ వేస్తే సీతమ్మగారి కూర వెక్కిరించే అమ్మ సుబ్బరాయుడికి ఏమొచ్చులే డెకారించే నానమ్మ అకస్మాత్తుగా స్నేహితురాళ్ళై పోతారు ఆవపిండి, వెళ్ళుళ్ళి గుళ్ళు, ఉప్పూ కారం పప్పు నూనె ఆవకాయ ముక్క కలవగానే పింగాణీ జాడీకి పెళ్ళి కూతురు కళ వస్తుంది మేనత్తల వాటాలు చుట్టు పక్కాలకి పంపకాలు చాకలికి, మంగలికి, పాలేర్లకి సర్దుబాట్లు జరుగుతావుంటే ఆవకాయ పడితే ఆరోజు కూర వండటం నిషిద్దం అప్పుడు అమృతం పట్టుకొస్తుంది నానమ్మ సీతమ్మ వేడి వేడి నూకలన్నం కంచంలో కుప్ప పోసి మద్యలో గుంట పెట్టి నిండా వెన్నపూస వేసి కొత్తావకాయ వేసుకొని తింటుంటే....అబ్బా అలా గుటకలేయకు నీకు నోరూరితే నాకు సంభందం లేదు ఆవకాయ తినని జన్మ జన్మా కాదు పైన అమృతం దొరుకుతుందో లేదో పద ముందు ఆవకాయన్నం తిందాం. ఉగాదికి సెలవు ఇచ్చినట్టే ఆవకాయ పట్టిన రోజూ సెలవివ్వాలని నా చిన్నప్పటి డిమాండ్....06.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUwAg7

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

తను నా అభిమాని తను నన్ను అనుసరిస్తుంది.. నా ప్రతీ కదలిక పరికిస్తుంది.. పరిక్షిస్తుంది.. నా తప్పుల్లో తనకేదో ఒప్పు కనిపిస్తుంది.. దానిని కూడా మహా ప్రసాదం లా స్వీకరిస్తుంది.. నాతో మాట్లాడుతుంది.. నాతో పోట్లాడుతుంది.. మిగిలిన పనులకు ఎందుకు ఆలస్యం చేస్తున్నానని.. నన్ను ప్రోత్సహిస్తుంది.. నాకు బలాన్నిస్తుంది తనెంత అభిమానిస్తోందో చెప్పి తనలాగే ఎంతమంది అభిమానిస్తున్నరో చెప్తుంది.. ఇంక ఎందర్నో అభిమానులుగా చేసుకునేందుకు ఊతంలా తన మధురమైన మాటల మల్లెలు నాపై కురిపిస్తుంది.. నాకు తెలియకుండానే నాపై తన మదిలో ఓ పుస్తకాన్ని రచిస్తుంది.. ఆ పుస్తకాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకుంటుంది.. తన మార్గదర్శకం ఆ పుస్తకమే అని నాతో గర్వంగా చెప్తుంది.. నాకెవరున్నారని నేను ఆలోచించే సమయాన నాకై తన దగ్గర ఒకటి ఉన్నదంటూ తన లో దాక్కున్న "అభిమానా"న్ని కొంత వొలకబోస్తుంది.. నాకు తను వొలికించిన అభిమానం కల్ప తరువుగా గోచరిస్తుంది.. ఇక అక్కడ్నుంచి నాకు కనక యోగం పట్టుకుంటుంది.. బంగారు ఆలోచనలు బయలుదేరుతాయి. అవి ఒక గమ్యాన్ని చేరే క్రమంలో వాటికి మళ్ళీ తనే ప్రేరణగా నిలిచి ఆయువై చేవందించే నీలాకాశం గా నిలుస్తుంది. క్రమంగా తనలో నా అలోచనల్ని నింపుకుంటుంది.. ఆలోచనలు కాస్తా అంతర్ముఖంగా నన్ను అనుసరిస్తుంటాయి. ఇంకేముంది చివరికి ఒక్కో ఆలోచన ఒక్కో నేనుగా పరిణితి చెంది నా అభిమానే నేనైపోయి నేనైన వేలమంది నా అభిమానుల్ని తయారు చేస్తుంది. - సాట్నా సత్యం గడ్డమణుగు, 06-03-2014, 16:30

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f0qZEd

Posted by Katta

Madhav Murthy కవిత

నిజమే - నిన్ను చూసింది క్షణమే ... చిలిపిగా నన్ను చూసింది .., చిలిపిగా నువ్వు నవ్విందీ.. క్షణమే. అనుక్షణం నేను తలచుకునేది ఆ క్షణమే .. నాకు ఆనందమంటే ఏంటో తెలిసింది ఆ క్షణమే ... నీ నవ్వును నే మరువలేను... నీ నడకను నే మరువలేను... నీ రూపుని నే మరువలేను.. నీ చూపుని నే మరువలేను... మచలేని నీ మనసుని నే మరువలేను .. మోనాలిస లాంటి సొగసుని నే మరువలేను... కల్మషం లేని నీ కన్నుల బాష ని నే మరువలేను... కలలా వచ్చే నీ జ్ఞాపకాన్ని నే మరువలేను... నిను చేరుటకు యుద్దమైన చేయగలను... వద్దనుకొని మాత్రం తిరిగి వెళ్ళలేను... ప్రేమ నువ్వు కనిపిస్తే అడగాలనుంది... నన్నెందుకు చేరావని... చేరాక ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్ళావని..

by Madhav Murthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1duJLma

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~ శ్రీరామకవచం సాగర్ | పెంకుటిల్లు ....................................... పెంకుటిల్లు గోడలు సగర్వంగా ఓ పాత చిత్ర పటం ముందు ఆ ఇల్లూఅంతే ఆనందంగా, పురాతనంగా * * * తాతయ్యని వెతుక్కుంటా వేపచెట్టు. చెరువులో నీళ్ళు అలలు అలలుగా అద్దమో వెన్నెలో అంతే ఒయ్యారంగా ఒడ్డుపై తపస్సు చేస్తున్న రావిచెట్టు * * * చుట్టపు చూపుగా వచ్చీరానీ వలస పక్షులు. ఒంటి స్తంభం మేడ ఆగిపోయిన గోడగడియారం దిగులుగా అమ్మకానికి పెట్టిన వారసులు * * * ఆ యింట్లో మనుషులని వెతుక్కుంటున్న పాత వుత్తరాలు పాత పెంకుటిల్లు ఓ జ్ఞాపక చిహ్నంగా కూడా అక్కడక్కడ మొల్చిన పిచ్చి చెట్లు * * * రేపోమాపో అక్కడ పెద్ద అపార్ట్ మెంట్.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1otlLSm

Posted by Katta

Kavi Yakoob కవిత

నెలనెలా వెన్నెల బ్లాగులో 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' పోస్టింగ్ ~ http://ift.tt/1cbUNOW

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cbUNOW

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~ నూర్జహాన్ Posted on April , 2013 by ఇక్బాల్ చంద్ 1 ఉన్మాద ప్రణయ ఇతిహాసానికి తొలి పలుకు నేను- మర్మ సౌందర్యానికి చిరునామా నేను- అహంకారం నాకు అలంకారం- 2 జగద్విఖ్యాతమైన నాప్రేమ కథనంలో ఎవరూ తొంగి చూడలేని అర పేరు బీభత్సం - గాఢ నిదురలోంచి ఆకస్మికంగా మేల్కొని తప్పనిసరి నడుస్తున్నప్పుడు జలదరిస్తున్న దేహంలా సౌభాగ్యం నౌకను దౌర్భాగ్యం తుఫాను నడిపిస్తుంది 3 అంతః పురం పూతోట దీపాన్ని ముట్టించిన నేను లోక దివ్వేనైనాను- నే పాడిన భ్రమర గీతాలన్నీ భ్రమలేనా? నా కలలు యవ్వనం శిల్పీకరించిన విలాస మోహాల్ని కోట గోడలు చెరిపేసాయి - నా యవ్వనం, నెత్తురు రుచి మరిగిన బెబ్బులి బాహువుల్లో దాచిన గులాబి. లోక దివ్వెలోని ప్రేమ తైలం ఇంకి పోతుంటే ఇక నుండి రుధిరంతో వెలగమని విధాత ఎందుకు రాశాడో గాని స్వార్ధం నా మనోగాయాలకు మందు -పులిమి కసిరేపింది. 4 నా వొక్కొక్క వైఫల్యం నా లోలోన నిద్రిస్తున్న వొక్కొక్క శాంతి మందిరాన్ని ధ్వంసం చేసి పరిహసిస్తుంటే ‘యాసిన్ ‘ ను చదువుకొని నిప్పుపై నివురుని కప్పుకొన్నాను కాలం కోసం పొంచి చూస్తూ - అహం ఆకలి తీర్చడానికి అందం వల పరిచాను ఇక నేనో మంత్రగత్తెను , నా సౌందర్యపు బానిసే నాకు మంత్రదండం ఈ లోకం నా చేతిలోని ఆట బొమ్మ- 5 బహుశ రేపటి కాలానికి వొక స్మృ తి గీతమై మిగులుతాను, కాకపోతే - చిర్నవ్వుల నా తైల వర్ణ చిత్రాలు వొక పంట చేను రూపంలో నిర్జీవంగా గోడలకు వేలాడుతుంటాయి - వృద్ధ రసికులు చిత్తరువుల్లోని నా నిడు సిరి బుగ్గల్ని రహస్యంగా తడిమి తమకమవుతారు - చంచలమతి యువకులు దొంగచాటుగా నా పెదాలపై తమ పెదాల్ని ఆనించి మెరుపు తీగలౌతారు. గడప దాటలేని విరహకన్యలు దారి తప్పి సంచరిస్తున్న నేను విడిచిన మదన నిట్టూర్పుల్ని చలిమంటగా రగుల్చుకొని ప్రేమ చలిని కాగుతుంటారు . మరో సూఫీ మింగుతున్న నల్ల మందులో నా వెలుగును స్వప్నిస్తాడు ఇంకో కవి తాను తాగుతున్న మధుపాత్రకు నాపేరుతో పిలుచుకొంటాడు చివరికి నన్ను తాకక తప్పదని తెలుసుకొని మృత్యువు రోదిస్తుంది- నేను మాత్రం రోదసీ మండలంలో కాటుక వర్ణం మేలిముసుగు ధరించి ఇంకా దొరకని దాని కోసం వెతుకుతూ పిచ్చి గాలినై వీస్తూంటాను- 6 నేనొక నిప్పుని - ఆరిపోయిందాక నన్ను తాకిన ప్రతిదాన్ని రగిల్చాను- - ఇక్బాల్ చంద్ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~http://ift.tt/1ienSM9

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ienSM9

Posted by Katta

Kavi Yakoob కవిత

తెలుసుకుందాం :తెలుగుకవులు

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ienQEd

Posted by Katta

Om Prakash కవిత

--- నువ్వూ / నేనూ --- నీ ఊహల్లో నిత్య సంచారినై ..... నేను గత జ్ఞాపకాలు చెరుపుకుంటూ ..... నీవు కడవరకూ నీతో కలిసి నడవాలనే ప్రయత్నంలో ..... నేను ప్రతి అడుగులోనూ నను తప్పుకుని తిరగాలనే పంతంలో ..... నీవు మరుపేరాని హృదయంతో వేగిసపడుతూ ప్రత్యక్ష నరకంలో ..... నేను మరుపుకు విలాసాలతో వెలకడుతూ పరోక్ష స్వర్గంలో ..... నీవు ఈ గింజులాటలో మనం విధి చేతిలో పావులమయ్యాము నేస్తమా... విధి వికటాట్టహాసపు కోరలలో చిక్కి విగత జీవులుగా మారేంతవరకైనా కలిసి నడుద్దాము ప్రియతమా. .............................................. oms

by Om Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ot4iJy

Posted by Katta

కాశి రాజు కవిత

నిండుగా తిన్నాసరే నిండని రాత్రులుంటాయ్ కంచంనిండా పెట్టుకున్నా కొన్ని కబుర్లుండాలి పప్పో పెరుగో ఎప్పుడూ సరిపోదు సరిగ్గా నాకేసి సూసాక కదా కడుపు నిండేది ఏమీ మాట్లాడకుండా తినమన్నపుడో, మొకం సూపించకుండా వడ్డిస్తున్నపుడో ఆ నిండిన కంచం , ఆ నీళ్ళ గ్లాసూ నాతో మాటాడవు అప్పుడే ఒంటరితనపు నిర్వచనాలు, ఎంగిలి కంచంలో ఏళ్లతో రాస్తాను. నేనెందుకూ నీకందరూ ఉన్నారు అంటుంటావు ఒక్కోసారి సమూహంలో ఒంటరవుతాం , లేదా ఒక్కరమే సమూహమవుతాం తెలీదా! కొన్ని మాటలు కేవలం కరచాలనాలకి కల్పితాలు కొన్ని గుండె సెరువులో పడ్డ గులక రాళ్ళు మాట్లాడు నీ స్నేహం చేరువయ్యాక నువ్విసిరే మాటల రాళ్ళకు, నా గుండె సెరువవుద్ది. నేను మాట్లాడకుండా తిండం పూర్తిసేసాక మనసు నిండక మాఅమ్మ గుర్తొస్తది అపుడేమో ఆగకుండా కన్నీలొస్తయి 06/03/2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e4eDqr

Posted by Katta

Kavi Yakoob కవిత

భాషాసిద్ధి లోకంలో జరిగితే, కవిత్వ భాషను కవులు తయారు చేసుకుంటారు. సాధారణభాష కవిత్వ భాషగా మారే క్రమం ఒకటుంటుంది. ఆ క్రమంలో జరిగే పరిణామాలను గుర్తిస్తే కవిత్వ భాషాస్వరూపం అర్థం అవుతుంది. ఇవి చేరాగారు “కవిత్వభాష” అన్న వ్యాసంలో చెప్పిన మాటలు. వ్యవహారంలో ఉండే మామూలు మాటలనుంచి కవిత్వాన్ని సృష్టించవచ్చు కాని, ఆ మామూలు మాటలే కవిత్వం కాదన్న సంగతి కవిత్వాన్ని రుచిచూసిన ఎవరికైనా తెలిసిన విషయమే. సాధారణ వ్యవహారంలో ఉన్న భాషకీ కవిత్వంలో ఉన్న భాషకీ కొంతైనా వ్యత్యాసం ఉండడం సహజం. కవిత్వంలో భాషకి స్థూలంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మామూలు విషయాన్నైనా చదివేవాళ్ళ (వినేవాళ్ళ) మనసులకి బాగా హత్తుకొనేట్టు చెప్పడం. మామూలు వ్యవహారంలో మనం వాడే భాషకి యీ ప్రయోజనం సాధారణంగా ఉండదు. మన భావాన్ని ఎదుటివాళ్ళకి వ్యక్తం చెయ్యడం వరకే సాధారణ భాష చేసే పని. ఒకవేళ నొక్కి చెప్పాల్సిన సందర్భం వచ్చినా, ఉచ్చరించే స్వరమూ, హావభావాలూ వంటి భాషేతరమైన ప్రక్రియల సహాయం తీసుకుంటాం (పిల్లల మీద కోపాన్ని ప్రదర్శించే సందర్భం దీనికి మంచి ఉదాహరణ!). కవిత్వంలో అది కుదరదు. చెప్పే విషయాన్ని హత్తుకొనేట్టు చెప్పడానికి కవికి ఉన్న పరికరం భాష ఒక్కటే. కాబట్టి భాషలోంచి కవిత్వాన్ని పుట్టించే ఆల్కెమీ కవికి తెలిసి ఉండాలి. రెండవ ప్రయోజనం – ఒకోసారి కవి చెప్పాలనుకున్న విషయం మామూలు విషయం కాకపోవచ్చు. కవి ఊహలోంచి పుట్టిన ఒక విచిత్రమైన కల్పన కావొచ్చు. లేదా మాటలలో చెప్పలేని ఒక గాఢమైన అనుభూతి కావొచ్చు. ఇలాటి సందర్భాలలో సాధారణ భాష పనిచెయ్యకపోవచ్చు. అప్పుడు కవి తనదైన భాషని సృష్టించుకుంటాడు. కవిత్వభాష వ్యవహార భాషకన్నా ఎందుకు భిన్నమైనదో చేరాగారి “కవిత్వభాష” అన్న వ్యాసం మరింత విస్తృతంగా చర్చిస్తుంది.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ie8MX1

Posted by Katta

Uma Pochampalli Goparaju కవిత

ఆవేదన కాదా? ఆనందభాష్పాలే ఇవి? ఒక కంట కన్నీరు ఒక కంట కన్నీరు కన్నీరు మున్నీరు ఎత్తులూ జిత్తులూ రంపాన కోసిరే కన్నతల్లిని నేడు రక్తతర్పణ చేసి సాధించిరీనాడు శోకించిన నాడు శోధింతురేనాడు? సాధించిరా నాడు? సాధించిరా మనదు మానసమునందు సంధ్యా వేళల నాడు శోకాల నెన్నడూ అగుపించని నాడు?? ఏ నోట విన్ననూ ఏ మాట విన్ననూ కనిపించకుండునా కనుల కాలవల లో కరుగు తిమింగలాలతో తిరుగు దు:ఖ భాండాలు, ముఖ ప్రీతి వచనాలు... ****. *****. ****** ఎందుకని నా కనులు ఆగక వర్షిస్తున్నాయి? తెలుగు తల్లికిపుడిద్దరు అల్లారు ముద్దుబిడ్డలని హృదయానికి నచ్చజెప్పి ఆనందించాలనే ఉంది, ఆ అందమైన తల్లి రెక్కలు విరిచి, విహంగాలతో ఎగరమంటే ఎగరేందుకు శక్తి లేక యాతన పడుతుంటే ఏమని ఆనందము తెలియగలను? తెలుప గలను? భాషేదైనా, భావన ముఖ్యం, అమ్మ కు బిడ్డకు తీరేదా పాలిచ్చిన ఋణానుబంధం? పేగుల్లో దాచి సాకిన మనిక ఋణం తీర్చేదా? ఏ జన్మయినా, అమ్మా నీవే నా తల్లివి నీ తీయని పాల మధురిమ ఇంకా నా నాలికపై ఆడుతుంది ఏండ్లు పూండ్లు దాటిపోతే పంతాలకు, పట్టింపులకుబోతె తీరునా అమ్మా, నిను కనని ఆవేదన? ఆది నుండి నీవే కదే ముగ్గురమ్మల యమ్మవు, శ్రీ లలితా, శుభదాయిని మాటలతో మమత పంచు మహిమాన్విత మల్లెపూల తెలుగు తల్లి, మమ్మందరనూ గాచే కడుపు చల్లని బతుకమ్మ తల్లి, నేడే మీ నీడలో తలంటుకునే శుభదినం, హారతులందుకొనవమ్మా మా కన్నతల్లి నీవు.. ముగ్గురమ్మల యమ్మా జయము నీకు కన్నతల్లి జయము జయము జయమే! జయము పలికేమే మాతృభాషా శుభ దినమున!

by Uma Pochampalli Goparaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fJLCQz

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కావడి కుండలు॥ జననం మరణానికీ మరణం మళ్ళీ జననానికీ కారణం అయినట్లు ఆకాశాన్ని అందుకున్న సముద్రపు నీరు,మేఘాల్లోంచి దూకి మళ్ళీ నడిసంద్రం లోకి జారినట్టు గమనం నిశ్చలమై నిలిచి ఆ స్థిరత్వం మళ్ళీ చలనమవుతూ నిలకడని నడక పూరించినట్టు మిగలముగ్గి నేలరాలిన ఓ పండు చిరు మొక్కగా ప్రాణం పోసుకుని మరెన్నో పళ్ళకి సృష్టికర్త అయినట్టు అలిగి దూరమై ,అంతలో చేరువై సూర్యుడి చుట్టూ భూమి పదే పదే ప్రదక్షిణలు చేసినట్టు నిశిరాత్రిలోకి నిష్క్రమించిన వెలుగు వేకువై వికసించి మళ్ళీ చీకటి వైపుకి పయనం ప్రారంభించినట్టు ఆకుపచ్చని వసంతగానం నిశ్శబ్దంగా శిశిరం లోకి రాలి పడి మరలా సరికొత్త రాగాన చిగురించినట్టు ఒకే కర్రకి కట్టబడిన కావడి కుండల్లా ఒకే నాణంలో ఇమిడిన రెండు ముఖాల్లా రూపాలు మార్చుకుంటాయి మంచి చెడులు ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేస్తూ !!! పోస్ట్ చేసిన తేది :06. 03. 2014 (వాకిలి మార్చి సంచికలో వచ్చిన నా కవిత http://ift.tt/1fJLArN)

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fJLArN

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు /Dt.6-3-14 రోజూ నా గుండె తలుపులు తెరచి దీపం పెట్టేదానివి నువ్వు రానంటే చీకటి లో బ్రతికేదెలా ప్రియా! కళ్ళు తెరచి నిన్ను చూసే నేను నీవు లేక మూసిన కళ్ళతో చూస్తున్నాను అంధుడనై పోతానేమో! నీవు రాకపోతే సరి- విలువైన వస్తువుని తీసుకుపోయావు నా హృదయాన్ని తిరిగివ్వమంటే మొండికేస్తున్నావు నీ తోడు లేని దారంతా చీకటే నీ నవ్వుల రతనాలను ఏరుకొని నా చీకటి బ్రతుకులో వెలుగు నింపుకుంటా

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1osXxYn

Posted by Katta

Swatee Sripada కవిత

ఇంకేం చెయ్యను? మాటల్లేకుండా మౌనయుద్ధం చేద్దమనుకు౦టానా కొంగట్టుకులాగి వెనువెంటే తిరిగే తప్పటడుగుల బుడిబుడి నడకల పాపడి పలవరి౦తల్లా నీ తలపులు నిశ్శబ్దాన్ని సాగదీసి నీకూ నాకూ మధ్యన గాలివంతెన వేద్దామనుకు౦టాను రివ్వురివ్వుమంటూ అటూ ఇటూ పరుగులుపెడుతూ హోరెత్తించే ప్రవాహమవుతు౦ది అదృశ్యంగా నీ ఉనికి మంకు నేర్చిన చిన్నరిలా దొర్లిదొర్లి మారాం చేసే మనసును గట్టిగా కసిరి ఓ మూలను౦డమని గదుముతానా కళ్ళనిండా నీళ్ళు నింపుకు ఎర్రబడ్డ కళ్ళను వేళ్ళవెనకవైపుతో తుడుచుకునే చంటి కూనను ఓదార్చే మెత్తని చేతుల్లా నీ మాటల ప్రతిధ్వని 2. నిజమే అయినా కష్టంగానే ఉంటుంది అనుక్షణమూ దూరమవుతూ మరింత దగ్గరవడం మాటి మాటికీ తొంగి చూసే మధురోహల మాలలల్లుకుని ఏమ్చేయ్యాలో తోచని వేళ పక్కన లేకపోవడం నరకంగానే అనిపిస్తుంది ఉదయాలూ మధ్యాన్నాలూ సాయంత్రాలూ ఇంటిచుట్టూ మూగిన పావురాళ్ళు గా బలవంతాన విసిరే శబ్ద గరిమల లోంచి అడుగు తీసి అడుగు వేసే యుగసంధి మధ్య పాక్కుంటూ రావడం ఎంత కష్టం మరి 3. తీరికలేని ఖాళీ జీవితాన్ని చివరి బొట్టు వరకూ ఒంపుకు తాగి మసకబారుతున్న సచేతనత నీడలో సేదదీరే౦దుకు క్షణం పాటు ఒరిగి స్థబ్దతలో కాస్సేపు ఒదుగుదామనుకు౦టానా పొట్టమీద పాకే ముని వేళ్ళ పలకరింపులు నిలువెల్లా పులకరింతల నదులై పూర్తిగా తడిపెస్తాయి తెప్పరిల్లిన ఊహలు కొత్త మొలకలై తలలెత్తుతాయి వద్దన్నపుడు కురిసే అల్లరి వానలా ఓ జల్లు చల్లగా ఏ మూల నుండో ఎదపై వాలుతుంది 4. ఇదీమీ కొత్తకాదుగా చూసే కళ్ళకు టేబుల్ పై మోచేతులాంచి పెనవేసుకున్న వేళ్ళపై తలనుంచి కళ్ళు మూసుకున్న పనిలేని తనమే కనిపిస్తుంది. ఓ ముగింపులేని నిరంతర కధనంలో నా పాత్ర అంతేనని ఎవరికీ తెలుసు?

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e469zG

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ** ఐ ** సమస్తం మంచుముద్ద ఐ - మేఘం ఒడిలో నేనో చినుకు బొట్టు- గింజల్ని మింగు పావురం దప్పిక నేను- నేలంతా బురదగుంతల చిక్కదనం నేను- ఎండ ముద్దు పెట్టి కరిగించు రాత్రి నేను- గుండె పిండు యేడుపులో చిన్న నవ్వు నేను- ఐ , ఒక దారి ఇంకో దారీ పరుచుకున్న కలల నిప్పుపై నడక నేనై- ఐ - 05/03/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAnCHP

Posted by Katta

Balu Vakadani కవిత



by Balu Vakadani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAhCPq

Posted by Katta

Kapila Ramkumar కవిత

Vadrevu Ch Veerabhadrudu నేను రాజవొమ్మంగి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో నా పాతపుస్తకాల్లో 'క్షేత్రయ్య పదములు ' (1963) కనబడింది. విస్సా అప్పారావుగారు సంపాదకత్వం చేసిన పుస్తకం. రాజమండ్రిలో సరస్వతి పవర్ ప్రెస్స్ వాళ్ళు అచ్చువేసింది. 1986 లో రాజమండ్రి పుస్తకప్రదర్శనలో పాల్గొన్నందుకూ, కార్యకర్తగా పనిచేసినందుకూ, ఆ కమిటీ వాళ్ళు నాకా పుస్తకం ఇచ్చారని ముందు పేజీలో రాసుకున్నాను. ఆ పుస్తకం నాకు చాలా విషయాలే గుర్తుచేసింది. 1983 నుంచి 86 దాక రాజమండ్రి పుస్తక ప్రదర్శనల్లో మేమంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. ప్రతి ఏటా డిసెంబరులో జరిగే ఆ వేడుకల్లో మేం వక్తలం,కార్యకర్తలం, సంస్కర్తలం కూడా. అద్దేపల్లి అండ్ కో వారి తరఫున సరస్వతీ పవర్ ప్రెస్ అచ్చువేసిన అపురూప గ్రంథాలెన్నో, రాజమండ్రీ, తక్కిన తెలుగుప్రపంచమూ మర్చిపోయినవాటిని నేనే మళ్ళా నలుగురికీ పున: పరిచయం చేసాను.కేంద్రసాహిత్య అకాదెమీ కోసం ప్రచురించిన గోపినాథ మొహంతి 'అమృతసంతానం ', కాకాసాహెబ్ కాలేల్కర్ 'జీవనలీల ', విభూతిభూషణుడి 'వనవాసి ', పురిపండా అప్పలస్వామి అనువాదం చేసిన 'విశ్వకథావీథి 'ఆరుసంపుటాలులతో పాటు శ్రీపాదవారి చిన్నకథలు కూడా. క్షేత్రయ్య పదాలు చదువుతూంటే మళ్ళా మరొక కొత్త లోకమేదో సాక్షాత్కరించినట్టే అనిపించింది. పారశీకకవుల్నీ, ఉర్దూకవుల్నీ, టాగోర్ నీ ఇంగ్లీషులో చదివి పరవశిస్తున్న మనం ఈ తెలుగు మహాకనినెట్లా మర్చిపోయేమా అనిపించింది. అయితే ఇందుకు కారణమూ లేకపోలేదు. ఉర్దూకవులకి ముషాయిరాలున్నాయి. ప్రసిద్ధ గజల్ గాయకులు ప్రతి రోజూ ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతి రోజూ మీర్ నీ గాలిబ్ నీ పాడుతూనే ఉంటారు. నస్రత్ ఫతే ఆలీఖాన్ లాంటి మహనీయుడు అమీర్ ఖుస్రోని లారీ డ్రైవర్లకు కూడా సన్నిహితుణ్ణి చేసేసాడు. ఇక టాగోర్ సంగతి చెప్పనక్కర్లేదు. రవీంద్ర సంగీతం సప్తసముద్రాలమీదా పయనించింది.కాని క్షేత్రయ్యని తలుచుకోవడానికి. ఆ పదాలు పున:పున: స్మరించడానికి దారేదీ? ఈ ప్రశ్న నేను కాదు, ఈ పుస్తకానికి సుమారు అరవయ్యేళ్ళకిందట ముందుమాటరాసిన జమ్ములమడక మాధవరాయశర్మగారు కూడా వేసుకున్నాడు. ఆయనేమన్నాడంటే క్షేత్రయ్య పదం కేవలం సాహిత్యం కాదు, కేవలం సంగీతం కాదు, కేవలం నృత్యం కాదు.కేవలం అలంకరణ కాదు. అన్నిటి సామరస్యంతో విలసిల్లే సాహిత్యం. ఇప్పుడు సంగీతం, సాహిత్యం,నృత్యం, రంగాలంకరణ వేరువేరుగా విడిపోయినకాలంలో క్షేత్రయ్య పదానికి పూర్తి న్యాయం చేయగలిగినవారేవ్వరు? సాహిత్యకృతిగా తీసుకున్నా కూడా క్షేత్రయ్యని అర్థం చేసుకోవడానికీ,ఆస్వాదించడానికీ రసజ్ఞహృదయాలకు తగిన శిక్షణ ఇవ్వగలిగినవారెవ్వరు? తమిళసంగం కవుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తొల్కాప్పియం చెప్తుంది. ఆధునిక కవిత్వాన్నెలా అర్థం చేసుకోవాలో న్యూక్రిటిక్స్ వివరిస్తారు. కాని ఒక అమరావతి శిల్పాన్ని, ఒక క్షేత్రయ్య పదాన్ని ఆస్వాదించడమెలానో ఎవరు చెప్తారు? అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పదమే చూడండి. ఈ పదం తెలుగు కవిత్వంలోని అత్యంత సుందరమైన కృతుల్లో అగ్రశ్రేణికి చెందిందని తెలుగురసజ్ఞ లోకం గుర్తుపట్టగలిగిందిగాని,ఆ సౌందర్య రహస్యమెక్కడుందో ఇప్పటికీ తెలుసుకోలేకపోయింది. మగువ తన కేళికామందిరము వెడలెన్ వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు /మగువ/ విడజారు గొజ్జంగి -విరిదండ జడతోను కడుచిక్కుబడి పెనగు-కంటసరితోను నిడుదకన్నులడెరు-నిదురమబ్బుతోను తొడరి పదయుగము-దడబడెడు నడతోను /మగువ/ సొగసిసొగయని వలపు-సొలపుజూపులతోను వగవగల ఘనసార-వాసనలతోను జిగిమించి కెమ్మోవి-చిగురుకెంపులతోను సగముకుచముల విదియ-చందురులతోను /మగువ/ తరితీపు సేయు సమ-సురతి బడలికతోను జరుత పావడ చెరగు-జార్పైటతోను ఇరుగడలకైదండ-లిచ్చు తరుణులతోను పరమాత్మ మువ్వగో-పాల తెల్లవారెననుచు /మగువ/ అత్యంత రమణీయమైన నీటిరంగుల చిత్రంలాంటి ఈ పదం మీద రసలోకం ఎప్పటికీ ఎడతెగని చర్చ జరుపుతూ ఉండొద్దా? ఈ పదం తమని ఎందుకు సమ్మోహపరుస్తోందో ఎంతచెప్పుకున్నా తనివి తీరడంలేదని భావుకులు నిస్పృహకి లోనుకావలసిన అవసరంలేదా? తెలుగుపదాల్ని కొన్నింటిని ఇంగ్లీషులోకి When God is a Customer అని ఎ.కె.రామానుజన్, వెల్చేరు నారాయణరావు అనువదించినప్పుడు అందులో క్షేత్రయ్య పదాలు కూడా కొన్నింటిని అనువదించినప్పుడు, ఈ పదాన్ని ఎందుకు వదిలిపెట్టేసారో వాళ్ళని అడగక్కర్లేదా? అన్నమయ్య పాడిన పదం 'పలుకుతేనెలతల్లి పవళించెను 'ఈ పదానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చునని విస్సా అప్పారావుగారు చక్కగానే నిదానించేరు. కాని ఆ పదంలో అన్నమయ్య 'కలికితనమున విభుని కలసి ', 'పరవశంబున పవళించిన తల్లి 'ని స్తుతిస్తే, ఇందులో క్షేత్రయ్య 'కేళికామందిరం వెడలుతున్న మగువ ' నెందుకు చిత్రించాడు? అక్కడ తల్లి, ఇక్కడ మగువగా ఎందుకు మారిపోయింది? విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలోకి చేరుకోక ముందు వచ్చిన ఆ పదంలోనూ, విజయనగర సామ్రాజ్యం ధ్వంసమై, రాజకీయంగా దేశం బలహీనపడ్డకాలంలో వచ్చిన ఈ పదంలోనూ కూడా పదలాలిత్యం, భావనాసౌకుమార్యం, సురతస్మరణ ఎందుకు ప్రధానమయ్యాయి? ఇట్లాంటివే ఎన్నో ప్రశ్నలు ఈ రోజంతా మీకూ, నాకూ.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nfRZSd

Posted by Katta

Katta Srinivas కవిత



by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f9SRkU

Posted by Katta

Vani Koratamaddi కవిత

మనోగతం..... మాసిపోదు మనోగతం మది చేరదు ఆశాకిరణం చెరిగిపోని చేదు నిజం చేరువవదు చిరు దీపం జ్ఞాపకాల నిట్టూర్పులు మదిదాటని భావాలు ఆరిపోని ధు:ఖాలు ఆగిపోని బాష్పాలు మరువలేని అనుభవాలు మరలిరాని ఆశలు పెదవిదాటని మాటలు కనుమరుగైన బాటలు స్వర్గంలో నువ్వు శోకంలో నేను స్వప్నంలో నువ్వు శూన్యంలో నేను అమరమై నువ్వు అవనిలో నేను స్పర్స లేక నువ్వు స్మరిస్తూ నేను నీ రూపం నిజం.... నీవన్నది అమరం.. అంకురమే... అంతిమమై...! వాణి కొరటమద్ది 6/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXdXwJ

Posted by Katta

Panasakarla Prakash కవిత

సాగుమూల౦ ఒక శరీర౦ విత్తన౦ నాటే రైతు మరొక శరీర౦ విత్తనాన్ని పొదుగుతున్న నేల‌ స౦సారపు సాగులో... ఒక ఆత్మ సహన౦ మరొక ఆత్మ బాధ్యత‌ వాటిని మరి౦త బ౦ధీ చేస్తూ.. మరో ఆత్మ పుట్టుక.. రె౦డు హృదయాలు ప్ర్రాణ౦పోసిన మొక్క‌ నెమ్మదిగా చిగురులు తొడిగి.. నేలలో౦చి..నేరుగా ఈ లోక౦లోకి విచ్చుకుని కళ్ళు తెరుస్తు‍‍‍‍‍‍‍౦ది... ఆలన పాలనల ఒడిలో అన౦త విశ్వమై ఆడుకు౦టూ... నిస్వార్ధమైన దు:ఖానికి ఆన౦దానికి సిసలైన చిరునామాగా విలసిల్లుతూ అ౦దరి హృదయాలను అ౦దుకు౦టు౦ది.. భేద౦ ఏమీ లేదు సృష్టిలో.. జీవి ఏదైనా..సరే విత్తన౦ ఎక్కడ పడుతు౦దో... దేహ౦ అక్కడే పుడుతు౦ది ఒక శరీర౦ మరొక శరీరాన్ని గాయ౦చేసే సమయ౦లోనే ఒక ఆత్మ మరొక ఆత్మను వెలిగి౦చడానికి సిద్దమౌతు౦ది అదే బ౦ధ౦............. పనసకర్ల‌ 6/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MPdrQz

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb||ఇక, ఆ తరువాత.....|| పీల్చుకుపోయిన బుగ్గల మీద జారుతున్న ఒకానొక నూత్న మృత్యునీడల్లో కూడ, కాస్తంత దయ కనపరుస్తూ, ఎండిన కళ్లల్లో కాస్తంత మెరుపుని కూడతీసుకుంటున్న ప్రయత్నాన్ని, ఫలప్రదంగా అనువదిస్తూ చిరునవ్వుగా నాకందిస్తూ, అదే ఘోషను చెవుల్లోకి పదేపదే ప్రతిఫలింపచేసే ప్రాణపు ఉనికి తాలూకు గసలో ఓ ఆదిమ లయకి ఊపిరూదితూ, నా ముఖానికి తన రెండు అరుచేతులనద్ది, ఇక తన నోరు, నిజానికి ఓ కోరిక కూడ కోరక తెరవబడే వుండిపోయింది,. మూతలుబడని కనుల సాక్షిగా. ఎలాంటి మార్పులేని, పాతకాలపు అరిచేతులు గర్భాశయపు గోడల మీద పారుడుతున్న శబ్ధపు జాడల్లో ఓ దుఃఖం. అది ఒక సందర్భం, బహుశా నన్ను నేను నిరాకరించుకునే సందర్భం. ---------6/3/2013.

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Nyqhn6

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

శుభోదయం నిదురోతుంటే కల్లోకొస్తా_కనులుతెరిస్తే నీముందుంటా ..@శర్మ \6.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NyqgQf

Posted by Katta

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || మాతృమూర్తి || కడుపులో దాచుకుని భద్రం గా తొమ్మిది మాసాలు .... ఓ మాతృమూర్తి కన్నావు నన్ను .............. భూమ్మీద పడ్డాక కూడా నా బ్రతుకును నేను నేనుగా బ్రతకగలిగేలా అవసరమైన సమయస్పూర్తిని, విజ్ఞతను, ధైర్యాన్ని నా రక్తనాళాల్లో నింపి ............. అక్కడ, ఆ ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక జీవితాన్ని ఆవిష్కరించావు నీ ప్రేమను ఉగ్గుపాలు గా చేసి ఎంతో శ్రద్ధగా, మురిపెం గా నన్నో ధైర్యవంతుడ్నిలా దిద్దావు. .......................... నా అవసరాలు, నా ఆలోచనలు నన్ను పక్కదోవ పట్టించకుండా దిశా నిర్దేశం చేసావు .................... ఒక పరిపూర్ణ మాతృముర్తి లా శ్రమ, సహనం, స్వేదం, నమ్మకానివై నా ఎదుగుదలలో అమూల్యం .... నీ పాత్ర ................... అప్పుడప్పుడూ నీలో బాధను గమనిస్తున్నాను.. నీ పెంపకం లో లోపం ఉందేమో అని నీలో నీవు అనుకోవడమూ విన్నాను. ................... లోపరహిత జీవనం సాధ్యమా అమ్మ ఈ ప్రపంచం లో ..... పరిపూర్ణత అనేదే లేదు. ఆ దిశగా నడుస్తున్నాను. అదే చాలు!. అమ్మా! నీకోసమే ఈ కవిత రాసుకుంటున్నాను. . నీకు తెలియాలని కాదు.. నా మనసు మాటలివి. ................ నీ ప్రేమ లో పుత్ర మోహాన్ని మించిన దేవతాతత్వాన్ని చూసానని, నీ ప్రతి చర్యలో అంకితభావనను గమనించానని, ................ నీకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చూడాల్సిన బాధ్యతే ఒక వరం అని, మనసు మాటకు అక్షర రూపం ఇస్తున్నా! అంతే! ................. నీ అనురాగం, నీ మమకారం నీ రూపం నీవు కాదా కారణం? .... అమ్మా! ప్రతి స్త్రీలోనూ ..... పవిత్రతను, తాపసి నే చూడగలగడానికి .... నీ ఆశిస్సులు శ్వాసగా .....!! 06MAR2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ospJum

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/స్పురిస్తూ నేను --------------------­-------- ఇక నిన్ను ముగిద్దామని చూస్తుంటే అనంతమయ్యావు మనసు పొరల్లో చెమ్మగిల్లిన దారులన్నీ నీ గురుతులే ప్రకృతి అంతటా నీ వదన కుసుమాలే అల్లుకుపోయాయి నీ ఊహల తరంగాలు మది దర్పణం గుండా ప్రసరిస్తున్నపుడు వక్రీభవించని నా చూపుల కోణాలను లెక్కించేదెలా ఆరాధనో ఆవేశమో మోహమో వ్యామోహమో నిలువెల్లా కమ్ముకున్న ప్రేమ పొర చలించే కాలంలో కొన్ని జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయి ఇంకా. తిలక్ బొమ్మరాజు 05.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P2kEyM

Posted by Katta

Nvn Chary కవిత



by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hNdqbV

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-69// ******************** 1. కవరుపేజీ చెప్పగలదా, కహానీ మొత్తం, చూసినంతనే అంచనాలెందుకు? 2. తినలెదేచెట్టు పళ్లెప్పుడూ, కారణాలెందుకోయ్, సాయం చెయ్యాలనుకున్నప్పుడు 3. గెలుపన్నది సులభమే, అల ఒచ్చినప్పుడు, తలొంచడం తెలిస్తే... 4. తప్పుదారి తగులుతుంది, ప్రయాణంలో చాలాసార్లు, కొత్తదారి పరిచయానికి 5. కాలమంటే గడియారమా, నచ్చినప్పుడు సరిజెయ్యడానికి, పరిగెత్తయినా సరే... అందుకోవాలంతే 6. ప్రతిమెట్టు అనువే, కులాసాగా కూర్చోవడానికి, నువ్వు లొంగొద్దు ఆ మోసానికి 7. వర్షంలో తడుస్తున్నప్పుడు, ఆగాక నడుస్తున్నప్పుడు తేడాలేదా, జీవితమంటే రెండూ కలిపేకదా 8. కాలకూటంలా అడ్డుతగిలే, తడిగుడ్డ వాక్యం, "అదిసరే... కానీ" 9. నీకధ చెప్పడానికి సిగ్గెందుకు? అయితే ఆడికో పాఠం, లేదా గొప్ప గుణపాఠం. 10. అవసరాన్ని మించి, మనిషి ఖర్చుపెట్టేది ఏమిటో, అబ్బో... అది విశ్రాంతే అనుకుంటా. ==================== Date: 06.03.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2puBp

Posted by Katta

Sri Modugu కవిత

//శ్రీ మోదుగు // చెప్పగలవా?..... // ప్రభువు సన్నిధిలో వింతైన జ్వాలతో వెలిగే సూర్యుడా ఇచ్చుకోవడానికి కొన్ని పూలని నివేదించు కోవడానికి కొన్ని నీళ్ళని ఇంకొంచం తీసుకోవడానికి హృదయాన్ని తెచ్చుకుంటాను ఐనా ఏమవుతావని ఒక సారి ఏమీకావని మరో సారి అంతా మనమే అని ప్రతీ సారీ కలుసిపోతూ, విడిపోతూ, త్యజిస్తూ,భ్రమిస్తూ….. దోసిళ్ళలో పూవులకై వేగిర పడుతూనే ఉంటాను …. మరి ఇక మరింత హత్తు కునేదెలా చెప్పగలవా? 05/03/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1iTlg

Posted by Katta

Shaik Meera కవిత

ఎద గూటిలో ఎరుపెక్కినది...... కనుల్ని కోవ్వోత్తులై మలచి చూపుల్నిచుక్కాల్లా చేసి మనసుని మల్లెల్లా పరచి వయసుని కత్తుల్లా ఉయ్యాల్లా కట్టి కలల్నికాంతుల్లా రంగుల్లా అల్లి జల్లి ఆశల్నిఅలల్లా లేపి కలిపి గుండెల్నినీ బందీకి కోటగా నా వలపుకు గెలుపుగా నా జన్మకు బహుమతిగా నిత్యం నాలో విరిసే ప్రణయ పుష్ప పరిమళమై నా ఎద గూటిలో ఎరుపెక్కిన నే చెక్కిన అపురూప లావణ్యమే నువ్వే చెలి......షేక్ మీరా ...... 06/03/2014

by Shaik Meera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mXy9

Posted by Katta

Abd Wahed కవిత

చిరుగాలిల ఊహ ఒకటి వెన్ను చరిచి పోయిందీ కంటిలోని కలలవాన కురిసి కురిసి పోయిందీ మరణించిన నిన్నలోన, బతికి ఉన్న నేటిలోన మొలకెత్తని రేపు కూడ సైగ చేసి పోయిందీ చేయిపట్టి నడిపించే నీడకూడ చీకటిలో మంచులాగ కరిగి కరిగి నన్ను వదిలిపోయిందీ అంతరంగ గగనంలో మబ్బులాంటి భావమేదో చినుకులాగ నేలపడి మదిలో ఇంకి పోయిందీ ఎండలోన చెట్టునీడ విశ్రాంతిగా నిదురిస్తే యుద్ధాశ్వం బతుకు కూడా గడ్డిమేసి పోయిందీ సెలయేటికి ఎదురీదే చిరుచేపల కరవాలం మెరుపు చూసి దియా, మేను పులకరించి పోయిందీ

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mRXr

Posted by Katta

Sriramoju Haragopal కవిత

తను వొచ్చే దారిలో... కంతల్లపడ్డ చూపులకు తగిలి శేరడుకొరిగిన కన్నీళ్ళయాదిని, కావులిచ్చుకుని అడిగింది కడప ఆమెతోని వాకిట్ల యాపశెట్టు ఆకులురాలిన ముచ్చట్లు వాడొస్తడా యాల్లకు, వాడిపొయ్యొస్తడా ఈ కాలానికి మునగదీసుకున్న ఆకాశం మబ్బుల్ని కప్పుకుంది ఎండపూట చలినెగళ్ళు దారి నిండా వూరేగింపు గోగుపూలు తానమాడి ఎర్రనీళ్ళు పోసుకున్నయి ఎవరికో వాగ్దానం చేసినట్లుంది వసంతం లేలేత చిగుళ్ళువాలిన చెట్లకొమ్మలు ఆమె నడిచిపోయిన తొవ్వనిండ నవ్వులమడుగులు పూతపిందెల మామిళ్ళలోగిళ్ళు రుతువు నవనవోన్మేషమంత ఆమె దోసిట్ల -హరగోపాల్ శ్రీరామోజు 05.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mUmb

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: షరామామూలే..: షరామామూలే నా అలుకలు నీ కులుకులు..! షరామామూలే నా గుసగుసలు నీ రుసరుసలు..! షరామామూలే నీ గర్జనలు నా తర్జనభర్జనలు..! షరామామూలే ప్రణయ బృందావనమున నేను ప్రళయ ఝంఝామారుతము వోలె నీవు..! షరామామూలే సంపెంగ మొగ్గల నవ్వుల విరివాన నేను అర విరిసిన కెంపు గులాబీ బుగ్గల తోయజాక్షి నీవు..! షరామామూలే పరుచుకున్న పచ్చదనపు సౌభాగ్యం నీవు వెచ్చని నీ కౌగిలిన ఒదిగిపోయిన కొత్తదనం నేను..! షరామామూలే నాలో నిండిన నీవు నీలో మిగిలిన నేను..! 5/2/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUNDTO

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

శ్రీ శ్రీ ఒక ప్రయోగం,ఒక మలుపు,ఒక యోధా,మేధాక్షరం.అయన 'ప్రజ' నేలవిడిచి సాము చేయదు. సమాజాన్ని విడనాడదు. పద్యంలో 'ప్రాసక్రీడ' లా, గద్యంలో వాక్బాణం 'ప్రజ' అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇవి హాస్యం, ప్రయోజనాల మేలు కలయిక. విజ్ఞాన వికాసాల మేళవింపు. సమాచారం, విశ్లేషణల సహజరూపం. మహాకవి శ్రీశ్రీ విశ్వరూపం 'ప్రజ'. ఇంతకూ ప్రజ అంటే ప్రశ్న జవాబులు .శ్రీశ్రీ సాహిత్యసర్వస్వం - 19, విరసం ప్రచురణ : డిసెంబర్ 1990.ఆ గ్రంధం లోంచి కొన్ని .................... 1.మీకు నచ్చిన కవి ఎవరు? * జపాన్ చక్రవర్తి . ఈయనఏడాదికో పద్యం రాస్తాడు .( జపాన్ చక్రవర్తి షోవా రాజవంశానికి చెందిన హిరోహిత ( 1901-89). రాజ్యాదినేతగా1926నుంచి చనిపోయేవరకు కొనసాగాడు .మంచి మెరైన్ బయలజిస్టు.గొప్పకవి). 2.మీరు రష్యాని ఎక్కువగా పొగడుతారు. ఎందుకు? * నాది భట్రాజు పొగడ్త కాదు. యాభై ఏళ్లకిందట ఇప్పుడు మన దేశంలో లాగే రష్యాలో దరిద్రం,అజ్ఞానం ,అనారోగ్యం తాండవిస్తూఉండేవి. ఈ స్వల్ప కాలంలో ప్రప్రంచం లోని అగ్రరాజ్యాలలో ఒకటిగా రష్యాదేశం మారింది. ఇందుకు కారణమేమిటో మిరే ఆలోచించుకోండి.ఇది మెచ్చుకోదగిన విషయం అవునో, కాదో మేరె తేల్చుకొండి. 3.మీరు దేవుణ్ణి నమ్ముతారా? * మానవుణ్ణి నమ్ముతాను. 4.రచయిత మానవ బలహీనతల్ని చిత్రించగలడు. కానీ అవే బలహీనతల్ని తనే ఎందుకు ప్రదర్శిస్తుంటాడు ? * రచయితకూడా మానవుడే కాబట్టి. 5.కవిత్వానికి ఏది గీటురాయి ? * జ్ఞాపకం వుండేది కవిత్వం. మరచిపోయేది కవిత్వం కాదు.ఈ అభిప్రాయం చెళ్ళపిళ్ళ వరూ అన్నారు. అంతకుముందు అల్లసాని పెద్దన కూడా "రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ " అని అన్నాడు. 6. యువరచయితలకు ప్రాచీనసాహిత్య అధ్యయనం అవసరమా ? * పాట కవిత్వం ఎందుకు చదవాలంటే అది ఇపుడు ఎందుకు వ్రాయ కూడదో (why not to write) తెలుసుకోవడానికి . 7.జనసామాన్యాన్ని కవిత్వంతో మార్చవచ్చునంటారా ? * ఇది కొంచెం గడ్డుప్రశ్నే . జన సామాన్యానికి ఇది ఎంత చేరువలో వుంటుంది అన్నదానిపై ఆధారపడివుంటుంది.మనకి ముప్పూటలు కాదు. రెండు పూటలు కూడా తిండి దొరకడం లేదు. జనసామాన్యం కవిత్వాన్ని భోగ ద్రవ్యం గానే చూస్తున్నర. మినిమం అవసరాలు తీరాకనే కవిత్వం . మయకోవస్కి కవిత్వాన్ని ఇరవై ఏళ్ళ కిందటికన్నా ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఆస్వాదిస్తున్నారు .ప్రజలలో కవిత్వాభిరుచి ని పోషించుకుంటూ రావాలి. 8. ఈనాడు సాహిత్యానికి రాజకీయాలకి వున్నదూరమెంత ? * ఇదివరకు మైళ్ళలెక్కన వుండేది. ఇప్పుడు సెంటిమీటర్లలో కొచ్చింది.రాజకీయ దృక్పధం సరిగా లేనివాడు సాహిత్యంలో రాణించలేని స్థితి వచ్చింది. 9. మహాకావ్యం ఎప్పుడొస్తుంది ? * అసాధ్యాన్ని సాధించడానికి మార్గాలు అన్వేషిస్తున్నప్పుడు కళాశీలి అనుభవించే అశాంతి లోనే మహాకావ్యం ఆవిర్భవిస్తుంది. 10. మీ కవిత్వానికి marxism కు సంభందం ఏమిటి ? * " మహాప్రస్థానం " అన్న గీతం రాసేనాటికి నాకు marxism ను గూర్చి తెలియనే తెలియదు. నేను marxism ను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే గని రాజకీయాల ద్వారా కాదు. 5-3-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mRqs

Posted by Katta