పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Sivaramakrishna Valluru కవిత

నీలోకి...! ।। వల్లరి ॥ ----------- ---------------------- ఎడారిలో నీటి చెట్టు దాహార్తిని తీర్చినట్టు గొంతు దాటి నీటి బొట్లు జారి పడుతున్న భ్రాంతి.... తడారిన గుండె తల్లడిల్లే వేళ తన్మయత్వంతో నీలోకి తొంగి చూసిన భ్రాంతి.. అల్లంత దూరాన ఆకాశ దీపమై అనుక్షణం దేహాన్ని తడుముతున్న భ్రాంతి.... ఒక్కొక్క జ్ఞాపకం వదిలి వెళ్ళిన సంతకమై ఓదార్చుతున్న భ్రాంతి... తెలవారని రేయిలో తోలిచుక్కవై నీవు తోలకరిస్తావని భ్రాంతి.. ! ----------------------- - వల్లరి. -12-03-2014. ------------------

by Sivaramakrishna Valluru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nMVXCd

Posted by Katta

Sivaramakrishna Valluru కవిత

నీలోకి...! ।। వల్లరి ॥ ----------- ---------------------- ఎడారిలో నీటి చెట్టు దాహార్తిని తీర్చినట్టు గొంతు దాటి నీటి బొట్లు జారి పడుతున్న భ్రాంతి.... తడారిన గుండె తల్లడిల్లే వేళ తన్మయత్వంతో నీలోకి తొంగి చూసిన భ్రాంతి.. అల్లంత దూరాన ఆకాశ దీపమై అనుక్షణం దేహాన్ని తడుముతున్న భ్రాంతి.... ఒక్కొక్క జ్ఞాపకం వదిలి వెళ్ళిన సంతకమై ఓదార్చుతున్న భ్రాంతి... తెలవారని రేయిలో తోలిచుక్కవై నీవు తోలకరిస్తావని భ్రాంతి.. ! ----------------------- - వల్లరి. -12-03-2014. ------------------

by Sivaramakrishna Valluru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmwHG3

Posted by Katta

Abd Wahed కవిత

గుండెనేల సరికొత్తగ పచ్చికేదో మొలిచింది చిరుగాలే తొలకరినీ ఆత్రంగా పిలిచింది ఎండల్లో నీడలను వెదుకుతున్న సెలయేరు గట్టుచేయి పట్టుకుని ప్రాణంగా వలిచింది గోడమీద చిరునవ్వుల మాట్లాడని చిత్రమే కంటిలోన కలల ఇంటి పునాదిగా నిలిచింది పెనుచీకటి భావాలను తొలికిరణం ఛేదించి రాతిశిలను స్వచ్ఛమైన అద్దంలా మలిచింది ఏకాంతం గూటిలోన పక్షిలాంటి జ్ఙాపకం చెట్టులాంటి మౌనాన్నే మాటలుగా తొలిచింది వెన్నెలనే దుప్పటిగా కప్పుకున్న తోటలో మంచులాంటి దియాతలపు పూలమనసు గెలిచింది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmwEtW

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | అనుకోని ఘటన ------------------------------- దీపాలు ఆర్పుతూ వస్తుంటావు నిన్ను అనుసరిస్తూ చీకటి పాదాలు ఇంకాస్త తెల్లగా వెక్కిరిస్తుంది వీధివాకిట్లో సందె ముగ్గు సర్దని పక్క మీద మడతల్లో చీకటి వానపాముల్లా కదులుతుంటుంది, నిన్ను అలుముకుంటూ చిక్కని గుబులు. మిగిలిన ఆ చిరుదీపపు నీలి కాంతి లావాలా నీ గదిలోకి ప్రవహిస్తుంది ఎక్కడా ఆధారాలు వదలని మార్పు ఇక్కడే దాగివుంది ఎప్పటిమాదిరే అద్దం వైపు చూసుకుంటావు నీలాంబరం జాడలు మాయమౌతున్నాయివాళ నిన్న పగిలిన అద్దపు ముక్కల్లో నెత్తుటి ప్రతిరూపం చీకటి చాటున నీ మరుపుకి కట్టిన రుసుం ఆర్తనాదాలు ఇక్కడ ప్రతిధ్వనించవు సౌండ్ ప్రూఫ్ గుండె మార్పిడీ జరిగింది మధ్యనే- ఇకిప్పుడు, ఆ నిర్జన వాడల్లో వసివాడిన పూదోటలు, నిర్దయ జాడల్లో చిన్నబోయిన నీ కనుపాపలు 12/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmwEu0

Posted by Katta

Sriramoju Haragopal కవిత

నువ్వే నా.......? ఇంత మనసైపోతావని అనుకోలేదు ఇంత మమతవై పేరుకుంటావనుకోలేదు ఇంత గుండె చిలికి వెన్నచేస్తావనుకోలేదు నన్ను ఇంత దయచూపి నా కన్నీళ్ళు అద్దుతావనుకోలేదు అసలు నువ్వెవరు? ఎప్పటి నావేదనలకవతల నీవా వుంది ఎప్పటి నాబాధలకంతం నీ తలపా మందు ఎప్పటి నా బతుకు నిండా నీదా కొంగుగొడుగు ఎప్పటి నా వెర్రిపాటల్లో నీదేనా నుడుగు అసలు నువ్వెవరు? నిన్ను చూడబోయే వెలుగుదే అందం నిన్ను ముడుపులుకట్టుకున్న కళ్ళదే వైభవం నిన్ను కలవరిస్తూ నిద్రబోయే రాత్రిదే ఆనందం నిన్ను పలవరించే గుండెదే సంతోషం అసలు నువ్వెవరు?

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fuJocF

Posted by Katta

Renuka Ayola కవిత

రేణుక అయోల //నాట్యం// ఎప్పుడైనా ఒంటరిగా నర్తించావా పాదాలతో మట్టిని తాకుతూ లోపలి గానానికి బీజాలు వేస్తూ రాలిన గింజలు నునులేత చిగురుతో ఆకుపచ్చని కాంతితో అల్లుకుంటాయి జంట సర్పాలు పెనవేసుకుంటాయి శ్వాస జీవితం నిద్ర ఉలికిపడతాయి సన్నిని సవ్వడితో మొదలైన గానం గుమ్మడి తీగలా అల్లుకుంటుంది పచ్చనిపూలు తాటాకు కప్పుమీద నిల్చునట్లుగానే వుంటుంది గానం నగ్నంగా మట్టిని నీరుని ఆకాశాన్ని తడుముతుంది అప్పుడే ఆకాశంలో కలుస్తున్నప్పుడే గాలితో, కొండలతో ఇసుకతో పరిచయం పరిచయం ఒకపిలుపు కోరిక, వాగ్దానం నిశ్శబ్ధ తాకిడికిలో పాదం వెనక పాదం పాటని నింపుకున్న వేణువు అప్పుడు నీకు నాట్యానికి తేడావుండదు గాలికి ఊగుతున్న పూలకోమ్మలుగా కనిపిస్తావు.

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nMvWTl

Posted by Katta

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ //వ్యసనం // దీంతో గొప్ప చిక్కొచ్చి పడింది చీటికి మాటికి అలిగి పడుకుంటోంది ఎంత బ్రతిమలాడుతానో ఒక్కోసారి వింటేనా..అస్సలు... నాకేమో తనతోటిదే లోకం ఉదయం సాయంత్రం డ్యూటీకి వెల్లేముందూ.. వచ్చిన తరవాత కాసేపన్నా తనముందు కూర్చొని కబుర్లాడకపోతే తోచదు తన ముఖంవిప్పారితే చాలు ప్రపంచం నాకళ్లముందు కదలాడుతుంది తనేమో తరచూ ముఖాన నల్లదుప్పటి కప్పేస్తుంది ఏం చేస్తాం చెప్పండి రెండు మూడు రోజులు ఓపిక పడతాను చివరికి విసిగి తనగురించి బాగా తెలిసిన డాక్టరుకి కబురు పెడతాను ఎక్కడ లింక్ తప్పిందో చూసుకోండి అంటాడు నాకు తెలిసి ఏపొరపాటూ.. కనపడదు అతనొస్తాడు చుట్టూచూస్తాడు ఎక్కడ వుండవలసిన సామాన్లన్నీ అక్కడే వుంటాయి మనసులోపలెక్కడో ఇన్ ఫెక్షన్ చేరి వుంటుంది ఒక ఇంజక్షన్ చేయాలి.. ఐదు వందలు అవుతుందంటాడు తప్పేదేముంది సరే అంటాను ………….. అంతే లోపల ఎక్కడో బల్బు వెలిగి తన ముఖంలో కాంతి చీకటి గదికి తలుపు తీసినట్టు నామనసంతా వెలుగు నిండిపోతుంది ..... ...... అబ్బ ఈ కంప్యూటర్ వుందే మహా వ్యసనం సుమా ***** 12/03/2014

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1es8HYu

Posted by Katta

Soma Sunder Rao Nimmaraju కవిత

నా ప్రయత్నం..... కాలం తో పోటీ చేసే వేగం కోసం ప్రపంచాన్నే జయించాలనే లక్ష్యం కోసం ఎంతటి సమస్యనైనా పరిష్కరించే మేధస్సు కోసం ఎటువంటి పరిస్థితులైనా ఎదురునిలిచే ధైర్యం కోసం ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శరీర ధారుడ్యం కోసం మొదలు పెడుతున్నా నా ప్రయత్నం సోమ సుందర్ రావు నిమ్మరాజు || 12/03/2014

by Soma Sunder Rao Nimmaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1njTIte

Posted by Katta

Kranthi Kumar Malineni కవిత

తడి ఆరని తలపులు || క్రాంతి కుమార్ మలినేని || 12.03.2014 నాది అని చెప్పుకునే ఈ జీవితంలో గతం అని చెప్పబడిన దాంట్లో కొంతకాలం నేను అచ్చంగా నాలాగే బతికాను అది నీ దగ్గరే అని చెప్పుకోడానికి నాకు ఏ సందేహం లేదు నా కోపాన్ని నువ్వు చూసావు ప్రేమనీ చూసావు నవ్వునీ, ఏడుపునీ బలాన్నీ, బలహీనతనీ దేన్నీ నీ దగ్గర దాచుకోకుండా బయటపెట్టాను. శత్రువు అనుకున్నోల్లకంటే గొడవెక్కువ పడింది నీతోనే అందరికన్నా ఎక్కువ కసిరినా, తిట్టినా నిన్నే తప్పు నాదైనప్పుడూ నీదే నీదైనప్పుడూ నీదే అన్నిటినీ నువ్వు నీ మంచి మనసుతో చూసావు నన్ను మంచివాడ్ని చేసావు అంతే అప్పటిలా ఉండలేక పోయినా కాలం మన మద్య దూరాన్ని పెంచినా నువ్వు పెంచిన మంచి నాలో ఎప్పుడూ అలాగే ఉంది నీతో నడిచిన గతం తాలూకూ జ్ఞాపకాల్ని మనసూ మెదడూ కలిసి తరచుగా నెమరేస్తూనే ఉంటాయి నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా స్నేహం మనిద్దరినీ అనుసరిస్తూనే ఉంటుంది పలకరిస్తూనే ఉంటుంది ఏదో ఇంకొంత కాలం నువ్వు నాకో, నేను నీకో చెప్పకుండ వెళ్ళిపోయే వరకూ ఈ స్నేహం ఇలా సాగిపోవాలని నీ నేస్తం

by Kranthi Kumar Malineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OlwIdu

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

కన్నెగంటి లిమరిక్కులు ...5వ భాగం . *చిరిగి పోద్ది* అర్థాంగి మనసు పరిమళించే సుకుమార సంపంగి అనుమానం ఆవహిస్తే తిరగబడే సివంగి గుండెలపై గురిపెడుతుంది మాటల ఫిరంగి ఇక చిరిగిపోక తప్పదు అయ్యగారి లుంగి. ___________________________________- *గొడవల బడవలు* గొడవలు కక్ష్యలూ కార్పణ్యాలు రగిలించే నిప్పుల నడవలు కొన్ని పరిష్కారపు దరిచేర్చే జిత్తుల పడవలు కొన్ని మాత్రలను గుటకేసే మంచినీళ్ళ కడవలు ప్రాణాలను చిక్కుల్లో పెట్టే అడవుల బడవలు. 12.3.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ftzEPK

Posted by Katta

Manjunadha Reddy కవిత

నీదుర ఎందుకు రాలేదొ నాకి నాకంబలి మత్రమే తెలుసు మనస్సు ఎందుకు అవేదన పడుతుందొ నాకి అవేదన పడిన ఆ క్షణలకు తెలుసు అకర్షణ ఎందుకు దగ్గుతుందొ నాకి అనురగం లేని భంధనికి తెలుసు అనందము ఎందుకు దురమౌతుందొ నాకి మంచిగా అలొచించలేని అలొచనలకు తెలుసు ఆశ కొరికలు ఎందుకు ఎక్కువ అవుతునయొ నాకి వాటిని కొరుకునే అవసరలకు తెలుసు

by Manjunadha Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N67X3P

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

కలలోసుందరి -------------- నేను తల ఎత్తి చూశా నాకు తన చెంగు చివర వేళ్ళాడుతున్న ఒక దారం తగులుతోంది.. తన అందం ముందు నేను చిన్నవాడ్నైపోయా.. తను నడుస్తోంది.. దొరుకుతుందో లేదో అని పోకిరీలో మహేష్ లా పరిగెత్తి ఆ దారాన్ని పట్టుకున్నా.. అలా ఆ దారానికి వేళ్ళాడుతూ పైకి ఎకి ఎక్కు తన భుజం మీద నిల్చుని ఈలలేస్తున్నా నన్ను చూడమని.. అదేంటో అప్పుడు ఈలలు తప్ప మాటలు రావట్లేదు మరి.. కానీ తను అప్పుడే కాలుకి ఏదో అడ్డుతగిలి పడబోయింది.. ఎక్కడ పడుతుందో అని కంగారు పడుతూ పడిపోకుండా పట్టుకుందాం అని చేతులు చాచాను.. కాళ్లకింద పడిన తన చీర అంచుని సరిచేసుకునే లోగా నేను అమాంతం జారి అలా పడిపోతూ లేచాను.. నిదుర లేచాను..! - ఇట్లు నీ నేను సత్యం గడ్డమణుగు, 12-03-2014, 18:34

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cxlRbA

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ••జల్లెడ పట్టు •• రంద్రం పడిన భూమి కల- ఔను, నువ్వే వొక వేషం కోతో బర్రో గాడిదో చివరికొక పామో ఐ- నవ్వే లోకం చప్పుడు నీ గుందేకాయపై ముల్లై- రంద్రం పడిన భూమి కల ఐనా నీ వెంటే, కల్లోలం నీ బుజాల స్వారీ తిమ్మిరి మైకమో మాటల మోసాలో నీ మెదడొక సుతిమెత్తని పూబంతి- ఐనా, నువ్ చేనిగేల బుట్టకింద ఉప్పు కన్నీరు మింగేస్తూ- ఐనా , రంద్రం పడిన భూమి కల కనడం మానీ అందర్లో అందరిలా అనాధగా అంటరానోడికంటే హీనంగా నువ్ సహజంగా గోడమీద పిడకలా నువ్- ఇంకో రంద్రంకి నువ్ మరో దారి యిప్పుడు- 12-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OkZWJm

Posted by Katta

కాశి రాజు కవిత

పురిటి దుఃఖం మాయమ్మ భాదలాటి వరదగూడు మా నానలా మాటాడలేనట్టి సందురూడు అయేల సీకటిలో దుఃఖమంతా నక్షత్రాలవుతున్నట్టు వొట్టి ఊహనాది. వరిసేల మీద గాలి ఊగుతావుంది గడపమ్మీద్దీపం వొణుకుతూ వుంది. చిరు సీకటిలో అన్నమెట్టి పెద్దదానికి నెలలు నిండాయి, రేపో మాపో కరుసుంది అత్తమాటూ తాగొద్దు సత్తియ్యా అంటుంటే అన్నం తినడం ఆపలేదాడు. చిరాకొచ్చి, "పెంచలేనోడివి ఎందుక్కన్నావ్" అని అడిగితే గుండె బరువెక్కి,కల్లలోనీలు గొంతులోకొచ్చి మెదబడిందాడికి తప్పుడుమాటని తెలీకుండానే తరవాత నేను నిద్దరోయా ! మా నానకి ముందుగా తెల్లారినట్టుంది మొకం దుఃఖంతో కడుక్కుంటున్నాడు. చూడలేక పొద్దున్నే పొలాలమీదకి పొతే గడ్డిపరక్కి ఏలాడే మా ఊళ్ళోని మంచుబిందువులన్నీ ఆ రాత్రి దుఖ్ఖాలే ఆ గడ్డిపరకేమో రాత్రంతా మెలితిరిగి పోయిన మానాన గుండె.

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ft4vw5

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dPCHke

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/­ తెలియని నిర్మాణం -------------------­-- ఈ ఉదయపు నీరెండలో కొన్ని పచ్చని కాంతులేవొ చెట్ల కొమ్మల గుండా ప్రసరిస్తూ వాటి ఆకులపై సున్నితంగా కూర్చున్నాయి అప్పుడే కళ్ళు తెరిచిన కొన్ని పిచ్చుకలు గూటి కిటికిలోనుండి తల బయటకు పెట్టి కంటున్నాయి అప్పటిదాకా కనని కొత్త లోకాన్ని ఇసుకరేణువుల్లాంటి వాటి కనుపాపల్లో ఎన్ని ఆశలో రోజూ కొత్తగా ఎగరాలని కొన్ని రోజులను వాటి రెక్కలకింద పాతేసుకుంటూ వాలిపోతుంటాయి మబ్బుల తెరచాపల కిందుగా ఊళ్ళు దాటి వనాలను వయ్యారంగా పరికిస్తూ కొత్త రంగులను ఏరోజుకారోజు అద్దుకుంటూ అన్వేషణ పగిలిన బాణాలు కొన్ని గుచ్చుకోని గులాబి రెక్కలుగా చేరినప్పుడు మంచు హృదయాలను మళ్ళా కొన్నిసార్లు విదిలించుకుంటూ చేరిపోతుంటాయి చిరునామా తెలియని తీరాలకు పిలవని చుట్టంలా... మళ్ళా ఇప్పుడొక కొత్త గూటిని కట్టుకోవాలి రాలిపడకుండా... తిలక్ బొమ్మరాజు 12.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1njiPfN

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //చివరికి ఏం పీకాం?// బతికేందుకు ఇంకా ఏం చేయగలం బతకటం తప్ప వేలి చివర వెలుతురులతికించుకొని జీతమిచ్చే జీవితం తో వేటాడబడుతూనే ఉంటాం గుడిమెట్లదగ్గర రూపాయ్ కో రెండ్రూపాయలకో పుణ్యం కొనేస్కున్నాక పాదాలని భుజాలపై ఉంచి తిరుగుతూనే ఉంటాం ఇక్కడెవరూ బతికించలేరు బతకనిస్తారంతే వెన్నెల రాత్రులూ, చల్లని గాలులూ,ఆకలి కోరికలూ మొదలగు సుందర దృశ్యాల్లేని కళ్లతో ఖాలీ గ్లాసుల్లా ఒక్కొక్కడూ తమతమ టేబుళ్ళపై కదలికల్లేక ప్రాణం లేని దేహంలా కదులుతూంటారు ఎక్కడా ఉండని ముద్దుల్లో చక్కెర శాతాలూ కౌగిళ్ళ స్వాంతనలూ, మనుషుల మద్య ప్రేమలూ, దేవుడి కరుణా కటాక్ష వీక్షణల కోసం వెతికీ...,వెతికీ..., తీరా చివరికి అవన్నీ శూణ్యాలని తెలుసుకొనీ బట్టతలల్తో దువ్వెన చేతిలో పట్టుకొని తమ సమాధి పై కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చే మనుషులని చూస్తూ మనమూ కదుల్దామనే అనుకుంటాం చిత్రంగా అప్పటికే మనలని దారాలతో భందించిన సాలె పురుగొకటి మనవైపే పరుగెత్తుకొస్తూంటుంది.... బతికున్న శవపు జీవితానికి నామ సార్ధకత లభించాక.. అప్పుడరుస్తాడు కాట్లో కాటమ రాజు గంజాయి దమ్ము లాగుతూ,తోలు గోచీ లోంచి పృష్టాన్ని గోక్కుంటూ, నాగు పాము కళ్లతో నవ్వుతూ "చిచ్చా అబ్ ఖేల్ ఖతం దుక్నం బంద్ వచ్చి నీ సమాధిలో పడుకో నేన్నీకు విశ్రాంతినిస్తాను...." అని 12/03/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cPPaqh

Posted by Katta

Vimala Morthala కవిత



by Vimala Morthala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hbnB7G

Posted by Katta

సుధ కొనకళ్ళ కవిత

మా ఊరు బడి దగ్గర హేచ్చురామయ్య తాత బడ్డి కొట్టు బూబమ్మ అత్త సెంటరులో మిషను మామయ్య పుల్ల ఐసు హుస్సేన్ అన్న మేమంతా ఓ కుటుంబంలా ఇపుడా పిలుపుల జాడే లేదు మా వూరి మల్లెపూల వాగులో అల్లి పళ్ళ జాడ ఏది ? చింతల వాగులో దెయ్యాల కధలు వాటి తాలుకు భయం జాడలు మాత్రం ఇంకా ఉన్నాయి సుమీ దొరగారి దివాణం లో ఉసిరికాయ రుచి ఇంకా మరవలేదు కనకమ్మ అత్త పెంకుటిల్లు మాత్రమే మా ఊరి అతిధి ఉద్యోగస్తులకు పెద్ద వైట్ హౌస్ లాంటిది మా ఇంటి ముందర చేతి పంపు అక్కడే పెద్దవాళ్ళ ముచ్చట్లు కన్నెపిల్లల వయ్యారాలు నీళ్ళ వంతు వచ్చిన కావలసిన వాడి రాక కోసం కళ్ళలో ప్రాణంగా ఎదురు చూపులు బిందె నడుముపై వయ్యారంగా అసలా దృశ్యం ఎంత మనోహరం ప్రేమ కోసం తొట్టిలో నీళ్ళు పారబోసి మల్లి నీళ్ళు తేస్తున్నాడని తిట్టుకుంటూ తిరిగే సూరమ్మ అత్త చాకలి అప్పయ్య ఇంటి ముందర ఎంత పెద్ద దోర అయిన వరుస కట్టవలసిందే సీతాఫలాల అమ్మె చిట్టెమ్మ ఇంటింట నవ్వులే పుయించేది లైసేన్న్సు కూలి బోడయ్య తాత వస్తే పిల్లలకు ఎంత సంబరమో దొరగారు రోడ్డు పై వెళుతా ఉంటె వంగి వంగి దణ్ణాలు ఇపుడా దొరా లేదు దోర తనము లేదు బ్యాండు మేళం బోగాలు లేని పెళ్ళే లేదు మా ఉళ్ళో డప్పు అప్పన్న లేకుండా పంచాయితి వార్తే లేదు మరి ఇప్పుడు మా ఉళ్ళో వంతెనపై అంచు పంచెతో నాన్న లేరు ఆ పిలుపులు లేవు టివి సీరియళ్ళలో పడి మమతలే మాయం పట్నం మోజులో పూల జడలు కాదు కదా జడల జాడలె లేవు అంకమ్మ తిరునాళ్ళలో పూనకం వచ్చిన వాళ్ళలా విరబోసుకుని తిరుగుతున్నారు పరికిణి ఒణిలు లేవు అంత మాయం కాని నేను నా జ్ఞాపకాలు మాత్రం ఇంకా పదిలం $ సుధ కొనకళ్ళ $ 12.03.14

by సుధ కొనకళ్ళ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsa7GN

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

నువు నవ్వితే వెన్నెలే_సిగ్గుతో జాబిలమ్మ జారిపోతుంది ..@శర్మ \12.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N5fznh

Posted by Katta

Em Es Naidu కవిత

:: ఆఖరి ఖాళీ :: ఎందరో నిద్రపోతున్న సమాధుల్లో ఇష్టంలేని నిద్రతో ఎందుకు వెళ్ళానో కన్నీటికైనా తెలిసిందా ఖాళీశ్వాస అక్షరాలతో ఖాళీయోని ప్రేమతో అద్దంలో చూడని అద్దంలో అందం ఏ శ్మశాన సువాసనో నీటి ఎముకలు పగిలి

by Em Es Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N5fz6W

Posted by Katta

Annavaram Devender కవిత

తొవ్వ ...............అన్నవరం దేవేందర్ 12.03.2014 మొస మర్రనియ్యని మురిపాలు ,వశం గాని సంబురాలు వశం గాని వాన పడుతే ఎట్లుంటదో మనకేరుకే .వశం గాని మురిపాలు అంతే ,పట్ట వశం గాని ఆనందాలు అంతే .ఎగిలివారంగ అయిదు గొట్టంగ మొదలైన ఫోన్లు రాత్రి పదకొండుకు బంజేత్తే బందు అయినయి.పొద్దుగాల ఎనిమిదింటికి ఇంటికి రాక పోకలు మొదలైనయి.ఇటు మనుసులు అటు ఫోనులు అబ్బబ్బ ....అన్నం తినుడు అవుతలి ఇవుతలికి పోవుడు ఏడ .....మంది ఎనుక మంది ఫోనుల ఎనుక ఫోను ...అయితే కొన్ని వందల ఫోన్లు వశం గాక ఎత్తలే ..అన్ని మిస్సుడ్ కాల్స్ అయ్యి ఉంటయి ... ఇదంతా నిన్న కరీంనగర్ లో డాక్టర్ నలిమెల భాస్కర్ ఇంట్ల జరిగింది .ఆయనకు కేంద్ర సాహిత్య ఎకాడమి అనువాద లో పురస్కారం ప్రకటించింది .దీంతో ఈ శుభాకాంక్షల వాన పడ్డది .తను మలయాళం నుంచి 'స్మారక శిలలు ' నవల ను అనువదించిండ్రు .ఈ పురస్కారం ఏమో గని మిత్రుల ,బందువుల ఆత్మీయత తోని ఉక్కిరి బిక్కిరి అయిన దేవేందర్ అని అన్నడు .నలిమెల భాస్కర్ గురించి ఇదే కాలం ల ఒకసారి రాసిన .దానిని మల్లోసారి సదువొచ్చు.అది దొరుకక పోతే నా 'పెద్దర్వాజ '(http://ift.tt/1lyyNOh) ల సూడొచ్చు .ఎకాఎకిన భాస్కర్ సార్ మీద Narayana Sharma Mallavajjala .Ramakrishna Kalvakunta ,Boorla Venkateshwarlu కవిత్వం వర్షమే కురిపించిండ్రు .అవ్వి సుత ఇస్తున్న ..... 1. ఏ మట్టి పొత్తిళ్ల నుంచి ఈ ఙ్ఞానం నడక నేర్చిందో ఈ పాలపిట్ట ప్రపంచగొంతుకని పాటకట్టి ప్రసారం చేస్తుంది ఏ వాగుగిన్నెల అమృతాన్ని పులుముకుందో దెశపు నాలుగుచెరగుల మట్టివాసనకి దోసిలి పట్టింది పదునాల్గుభాషలు ఒక్కపుస్తకమైనడిచినట్టు పదిభాషలు ఒక రామచిలుకల గుంపై ఊరేగినట్టు పదిదిక్కుల ఉద్వేగాలు ఒక గుండెగా కొట్టుకున్నట్టు ఈ గొంతుకొక్కటే దేశానికి నిలువుటద్దమౌతుంది అనేక భాషల పిల్లవాయువులు అక్కడక్కడి సరస్సుల శీతల సమీరాలు ఆయా ఉద్యమాలవెలుగురేఖలు ఈ కిటికీ నుంచేమమ్మల్ని చేరుతాయి కాగితాలకి కళ్లతికించుకున్న బుద్ధుడిచేతిలో ఏ గొంతులూ మాగడపలో మూగ బోకుండా భోధి వృక్షాలౌతాయి ---------యం.నారాయణ శర్మ .11/03/2014 2. పద్నాలుగు భాషలభాస్కరుడు నారాయణపురం మట్టిపువ్వు తనహృదయకోశాన్నిజల్లెడపట్టి జానుతెనుగుసొగసు తెలంగాణా పదాల్నిఏరి కుప్పవోసి,కడుపులున్నమాటల్ని అక్షరబాణాలుగా ఆలోచనల్ని ఎక్కుపెట్టి మౌనంగా మహాకార్యాలు చేసేమొండి పట్టుదలకు పర్యాయ పదం రక్తమాంసాల నిండా నాయిన రామచంద్రం సారుని తనలోకి వొంపుకున్న మట్టి బిడ్డ స్వరాల్ని శ్రుతి కలిపి గుండె పియోనోపై ఆత్మీయతల్నివర్షించే ఆక్షర భాస్కరుడు దివారాత్రాలు కండ్లను పుస్తకాల పుటల్లో మాగవెట్టి ,కథల పండ్లనురసపరిపుష్టం చేసినోడు తెలుగు మట్టిపొత్తిళ్లల్ల అనువాదపు కొత్త పంటలు పండిస్తున్న నిత్యకృషీవలుడు ఆనువాదపునవనీతం నలిమెల భాస్కరుడా! నజరానా అందుకో! నాలుగుకోట్ల తెలంగాణా జనం సాక్షిగా!! ..............కలువకుంట్ల రామ కృష్ణ .11/03/2014 3. ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలిపడే కళగల్ల మొకం పత్తిపాన్పులకెల్లి బొర్లచ్చినట్టు గుండెలకెల్లి పలికే రామసక్కని మాట మీగడ పెర్గు గిలకొడితె పేరుకున్న నవనీతం మనుసు అక్షరమక్షరం కండ్లకద్దుకుంటడు ఆత్మగల్ల భాషేదైనా అర్థం జేసుకుంటడు అతని పేరు నలిమెల భాస్కర్ అదిప్పుడు తెలుగు భాషల ముత్యాల పేరు పేరీ పేరీ అట్టుగట్టిన భాషల పరమాన్నం తెలంగాణ కడుపు సల్లగ జేసిన పదకోశపు సల్లకుండ ఒక్కటే తొవ్వ ఒక్కటే పట్టు మాటమీద నెనరు మనిషిమీద పావురం పనిమీదేసుకుంటే పరమాత్మనైనా పక్కకు పెట్టుడే పదామడైనా పాదాల పదాలు సుట్టుడే మానేరు పదనంత కరెక్కినట్టు దినదినం గల్లర గల్లర ఉరుకుడే బొళ్ళర బొళ్ళర కురుసుడే కుల్లంకుల్లం జేసుడే ఆ కాళ్ళకింది మట్టిని ముట్టుకుంటే సాలు ప్రపంచమంతా అనువాదమైతది అజ్ఞానమంతా సాగిలబడి సల్లు సల్లైతది. ...........బూర్ల వెంకటేశ్వర్లు 11/03/2014

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cw2S0T

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb || a టెస్ట్|| నా ముఖంలోకి చూస్తూ, నువ్వు బానిసవి కదూ అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. మళ్లీ అన్నాడు కాస్తంత కోపంగా,. నువ్వు బానిసవే కదూ అని కాస్త జేవురించిన ముఖంతో, తల పక్కకు తిప్పుకున్నాను. అతను మరింత గట్టిగా కేకలేసాడు,. నువ్వు బానిసవే, బానిసవేనని. ఆగ్రహంతో అతన్ని,.కొట్టి నెట్టేసాక ఆ పిచ్చివాడు నవ్వుతున్నాడు. అతని మాటను స్థిరపరుచుకొని. ---------------------------------12/3/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g7cLgv

Posted by Katta

Pusyami Sagar కవిత

శ్రీ వెంకటేష్ గారు రాసిన కవిత !!---మరణం---!! కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ మరణం జీవితానికి ఆఖరిమెట్టు. వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని అది అన్నిటికన్నా అద్బుతమని తాత్విక భావన ల తో సాగుతుంది . ప్రతి మనిషికీ మరణం తప్పదు దాన్నుంచి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు, కాని అసలు మరణం అంటే ఏమిటి, మరణం తరువాత జీవితం వాటి తో ఉన్న బందం తెలుసుకోవచ్చునా ? మరణం దేవుడిచ్చిన వరం.. మరణం అనేది ఈ జీవితానికి చివరి దశ ఒక రకం గా గమ్యం (destiny) అని చెప్పొచ్చు , మరణం కూడా నిద్ర లాంటిదే ...బతుకున్నపుడు తాత్కాలికం, అది మరణం తరువాత శాశ్వతం మరణం ఒక గమ్యం//చేరితే నిద్రలో దొరికే సుఖం శాశ్వతం పునరపి జననం, పునరపి మరణం జీవి పుట్టటం గిట్టటం ...కాల చక్రం లో జరుగుతూ ఉండేదే కదా, తాత్విక ఆలోచనలో చూస్తే నిజమే మనిషి పుట్టుక తరువాత మలి ప్రయాణం మరణం వరకే, అది సత్యం కూడా... మరణం ఒక జననం//జన్మించాక మళ్ళీ మన గమ్యం మరణం మరణాన్ని ఎవరైనా చూడగలరా తమకు తాము ఫీల్ కాగలర , అదో అద్బుత ప్రపంచం కను మూసే వరకు జరిగే సంఘటనల సమూహం, మరణం ప్రతి మనిషి ని నడిపించే సైన్యం వంటిదా కావొచ్చు .....ఓ జీవితాన్ని గురించి ఎంత నేర్చుకోవచ్చో, ఒక మరణాన్ని చూసి కూడా అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇది వాస్తవం మరణం ఒక సైన్యం//ఒకరికి మాత్రమే కట్టుబడి పని చేసే సైన్యం మరణం ఒక ప్రపంచం..కనురెప్పల ఎడబాటులో కనపడని//కనురెప్పల స్థిర కలయికలో దాగలేని ఒక అద్భుత ప్రపంచం// మరణాన్ని ప్రేమించాగలిగే గొప్ప తాత్వికత వుంది అంటే అది అద్బుతమే, మరణాన్ని ప్రేయసి గ ఉహించడము కొంచం కష్టమే. మనిషి పోయాక కాల్చేసిన కట్టే నుంచి పుట్టే జీవితపు అనుభవాల బూడిద నే మరణం, మరణం ఒక మన్మధయాగం//కాలే కట్టె రగిలే శరీరపు రాసక్రీడలో బూడిదను జన్మింపజేసే ఒక మన్మధయాగం నిజంగా మనిషి కి ఇచ్చన గొప్ప వరం మరణం....ఈ లోకం లో ఎన్నో ఘోరాలను నేరాలను , కుళ్ళు ను , అబద్దం మోసపూరిత లోకానుంచి దూరం చేసేది ఏది అయిన వుంది అంటే అది మరణమే. మరణం విడదీయరాని బందం మరణం ఒక అదృష్టం//మనిషిని చంపి//అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం......// పుట్టుక, మరణం రెండూ మనిషిలోని అంతర్భాగాలు.మొదటిచూపు ఎంత అవసరమో ` ఆఖరి చూపూ అంతే అవసరం. ఈ కవిత ని చదివినపుడు రాజేందర్ గారు రాసిన "ప్రస్తావన" గుర్తుకు తెప్పిస్తున్నది ....మనిషి లో ని అంతరంగాన్ని , మరణ భావన అనేది భయపడే వస్తువు కాదని చాల చక్కగా వివరించారు వెంకటేష్ గారు. వారి కవితల్లో మంచి కవిత ఇది. విబిన్న కోణాలను స్పృశిస్తూ మరిన్ని మంచి కవితలను అందిచాలని కోరుతూ .. అబినందనలతో .. మార్చ్ 12, 2014 మరణం ఒక గమ్యం చేరితే నిద్రలో దొరికే సుఖం శాశ్వతం మరణం ఒక జననం జన్మించాక మళ్ళీ మన గమ్యం మరణం మరణం ఒక సైన్యం ఒకరికి మాత్రమే కట్టుబడి పని చేసే సైన్యం మరణం ఒక ప్రపంచం కనురెప్పల ఎడబాటులో కనపడని కనురెప్పల స్థిర కలయికలో దాగలేని ఒక అద్భుత ప్రపంచం మరణం ఒక మన్మధయాగం కాలే కట్టె రగిలే శరీరపు రాసక్రీడలో బూడిదను జన్మింపజేసే ఒక మన్మధయాగం మరణం ఒక బంధం మనతో పాటే పుట్టి మనతో పాటే చచ్చే విడిచి వెళ్ళని విడదియ్య సాధ్యం కాని మర్మబంధం మరణం ఒక అదృష్టం మనిషిని చంపి అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం...... మరణం ఒక బంధం మనతో పాటే పుట్టి మనతో పాటే చచ్చే విడిచి వెళ్ళని విడదియ్య సాధ్యం కాని మర్మబంధం మరణం ఒక అదృష్టం మనిషిని చంపి అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం......

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1frAEnC

Posted by Katta

Bhaskar Palamuru కవిత

ఏదో ఒక రోజు వెళ్లి పోవాల్సిందే కదూ అందుకే ఈ ఆరాటం వద్దుకున్నా అదేదో గుండెను కెలుకుతూనే ఉంటుంది ఓ కొక్కెంలా గాలిపటంలా రివ్వుమంటూ దూసుకుపోతూ కవ్విస్తూ కలవరించేలా చేస్తూ పలకరిస్తుంది! అంతిమ యాత్రలో ఎన్ని ఆలోచనలో ఒక పట్టాన ఉండనీయవు ఒకే చోట కుదురుగా నిలువనీయవు ఒక్కోసారి ఉన్నట్టుండి ఆగిపోతాం అనుకోకుండానే మనలోకి ఆహ్వానిస్తాం అంతలోపే తెలియకుండానే ఊహల్లో విహరిస్తాం బంధనాలు లేని లోకం కదూ ఒక్కోసారి తప్పదనుకున్నా అభిమానిస్తూ.. ప్రేమిస్తూ రాలిపోతాం.. ఇదేనేమో బతుకంటే ! సాంగత్యం కంటే సాహచర్యం చాలా కష్టం కుడురుకోవటం మరీ కష్టం అప్పుడప్పుడు చిన్ని చిన్ని ఆనందాలు ఆవిరై పోతున్నప్పుడు లోలోపట దాచుకున్న మనుషుల రూపాలు వాళ్ళతో గడిపిన క్షణాలు ఏకాంతంలో ఒక్కటై పోయిన జ్ఞాపకాలు అన్నీ దారాల్లా కదలాడుతై ! ఓ నవ్వు ఓ చూపు పెదవుల అంచున రాలిన మాటల మూట కొనదేరిన కనురెప్పల్లో దాగిన మొహమాటం స్వాంతన చేకూర్చే గుండెలు మళ్ళీ మళ్ళీ వెంటాడే కళ్ళు విడిచి ఉండలేని స్థితికి చేర్చే దేహ భాష అందుకే బతుకంటే ఇష్టం నువ్వంటే చచ్చేంత మోహం!!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lTPCXb

Posted by Katta

Buchi Reddy కవిత

3-11-2014 ******** మతం-- కులం దేనికి ?? ఎంధుకు ???మనిషి బ త క డా ని కి అవసరమా ??????????????? క ర సేవలు పాధాసేవలు ఆర్చనలు చక్ర తీర్థాలు ప్రెయర్లు నోము లు యజ్ఞాలు రథోత్సా వాలు మంత్రాలు జ్యోతి ష్య౦ మూడాచారాలు అంటరాని తనం తక్కువ ఎక్కువ కులాల తేడాలు ఇవన్ని బ్రహ్మ నీ క౦ ఏళ్ల తరబడి మతం పేరుతో దేవుని పేరుతో మా య మాటలు వల్ళిస్తూ నడిపిస్తూ నడుస్తున్న తతంగం- బ్రాహ్మ నియా బావ జాలం బలం గా ఇంకిపోయిన సమాజ౦ మన ధీ ఏళ్లతరబడి కోట్లాజనం మూడనమ్మకాలతో జ్జీర్ణించుకపోయి తరాలు గా పాటిస్తూ అమలుచేస్తూ--- స్వర్గానికి షార్ట్ కట్ చూపిస్తామని ప్రజల్ని బ్లాక్ మైల్ చేస్తున్న బాబాలు---సన్నాసులు---జియ్యం గార్లు మతం పేరుతో మన ష్యులను మరింత అజ్ఞా నం లో కి దింపుతున్న పీఠాధిపతులు---స్వాములు ?? కు లా ల పట్తింపులు తేడాలు అంటారాణితనం గుల్ల ల్లో ప్రవేశానిషేధాలు చూపుల్లో ఆచరణ లో తక్కువ-- ఎక్కువ బావాలతో ఎంధుకు ??? దేనికి ?? badly seriously deeply honestly rightly----- నేడు సమాజం లో చూస్తున్న నిజాలు సత్యాలు--- కులం-- మతం మనిషి బతకడానికి అవసరమా ?? పూజలు ధైవ ధర్షనాలు డిస్‌కౌంట్ సేల్స్ -- ప్రకటన ల తో నడుస్తున్న తీరు లో మనిషి బలహీన తల్ని ఆసరాగా తీసుకొని ఆడుకుంటూ మోసగిస్తూ---???? ఎంతకాలం వర్షాల కోసం పూజలు-- భజనలు యజ్ఞాలు అబద్దాలకు పాలిష్ కొట్టి అమ్ముకునే పత్రికల్లో టి వి ల లో పలానా తా యత కొంటె డబ్బు -- పధవులు సమకూరుతాయం టూ ప్రకటనల తో--- ఆచారాలూ--నియామాలు నిర౦కు శత్వ౦ తో సిద్దా౦ తా ల వ క్ర భాష్యం తో మనిషిని కీలుబొమ్మగా చేస్తూ--- మారుస్తూ--- మతాన్ని రాజకీయం చేస్తూ మతాన్ని వ్యాపారం గా మారుస్తూ--- ఎంధుకు ?? దేనికి --ఎంతకాలం ప్రజల పా లీ ట మతం మత్తు మంధు---మార్క్స్ మాటల్లో నిజం ఉంధీ--సత్యం ఉంధీ బ్రహ్మనిజం బలహీనమయనా రోజు దేశ స్వరూపం మారుతుంధీ- యువతులూ తరం మీ ధీ భాధ్యత మీ ధీ భావి మీ ధీ లేవండి--- పోరా డ౦ డి సాంఘిక ఆర్థిక విప్లవం రావాలంటే ప్రజల్లో చైతన్యం తేవాలి---రావాలి తెండి-- కదలండి మార్పు అవసరం ---------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g6qwfo

Posted by Katta

R Rama Krishna M కవిత

ll వొస్తనే వుంటరు ll -ఆర్. ఆర్. కే. మూర్తి 12/03/14 ఇగ ఆడొస్తడు ఈడొస్తడు అడ్డమైన కొడుకులంతా వొస్తరు నువ్వు తలుపుతియ్యంగనే దండం పెడ్తరే పెద్దయ్యా ఇటు ఇటు జూసి నీ కాల్లు భీ మొక్తరు యాదిలే? ఐదేండ్లకింద రాలే ? గాల్లే గిప్పుడు మల్లచ్చిండ్రే పెద్దయ్యా ! పైసలిస్తరు మస్తు జెప్తరు పాపమంటివా బతుకు పాయిఖాన జేస్తరు ఈల్లు మడుసులుగారే పెద్దయ్యా కండువలు కప్పుకున్న మెకాలు.. మకురాలు చెప్పు చేతులవట్టుకోని ఆడు నీకేం జేసిండో అడుగు ఆడు గప్పుడెట్టుండె మరి గిప్పుడెట్టుండు అడుగు నా కొడుకుని ఇయ్యన్ని ఏడికెల్లి వొచ్చినయో మల్ల గనపపడితే మక్కెలిర్గుతయని చెప్పు ________________________

by R Rama Krishna M



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH1Tg3

Posted by Katta

Sree Kavitha కవిత

శుభరాత్రి ....@ "శ్రీ" .

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nhppDB

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // కుక్క పిల్లలూ, దేవుడూ చల్లనివారే! // రాస్తాన్నేనొక కుక్క పిల్లను గురించి, ఈ రాత్రి, మిత్రులారా. ఎందుకొచ్చిందో తెలీదు. నా పక్కనే నడవడం మొదలుపెట్టింది. నా భయాలు నాకున్నాయి. నాకు మించిన సమస్యలేవో దానికున్నట్లుగా అడుగు అడుగులోనూ తెలియవచ్చింది. విచిత్రమే. పక్కన నేనున్నానన్న భరోసాతో నడుస్తుందది. నా దారిని గురించిన అంచనాల్తో అటూ, ఇటూ పరుగెడ్తుంది. తనను తాను తిట్టుకుంటూ మళ్ళీ వచ్చి పక్కన చేరుతుంది. తన భాషను నేనూ, నా బాడీ ల్యాంగ్వేజుని తనూ అర్థం చేసుకునే ప్రయత్నం. నాలుగు సర్కిళ్ళను దాటిపోయినా, విడిచిపోదే. నా సర్కిల్లోకొచ్చి కూచున్నిలబడి, నడుస్తూ దీనంగా చూస్తుంది, ఇక నువ్వే నా దిక్కన్నట్లుగా ఉంది. ప్రయాణం బాగానే ఉంది.కానీ ఇల్లు దగ్గర పడింది. గేటు ముందర నేనూ, నా ముందర తనూ. ఇక ఈ విషమ పరీక్షను దాటుడెట్లు? దరిద్రపు అపార్ట్మెంట్ బతుకు, పొమ్మనలేను, రమ్మనలేను. ఈ కరకు అర్ధరాత్రి ఒకర్నొకరం చూసుకుంటూ నిలబడ్డాం. ఎవరన్నా వచ్చి ఈ రెండు కుక్క పిల్లలూ ఒక్కచోట ఉండగలిగే ప్రదేశానికి తీసుకుపోతే బాగుణ్ణు. 12. 3. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PponGQ

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు "ఏడుకొండల స్వామీ.." _ స్రవంతి ఐతరాజు ఏడుకొండలస్వామీ నిను ఎలుగెత్తిమ్రొక్కెద అడుగడుగు దండాలతో గండాలు దాటింప నీ నామ స్మరణము..నీ "నామ"ధరణ చేసెద తనదు ఏడెడూ జన్మాల పాపంబుల బాపింప వ్రేడెద పిలుపు వినవా నా స్వామీ! ఏలుకొన రావేమీ? అందాల నా విభుడు అస్వస్థుడైనాడు.. జన్మజన్మాంతర పాపకర్మల బాధింపబడుచున్నాడు కావవా మము ఓ కావేటి రంగా! నీకల్యాణపురిని మా కల్యాణము గావించితివి ముడుపుగట్టితినీకు మా ముద్దుమురిపాలు నా సగమాయువు నా రేనికి బోయుమా అనిల అనుమానపు అవమానపు చాయల అలసిసొలసిన ఆ గుండియకీయగరాదె నీ అమృత శీతల కర స్పర్శ కరుణింపగరాదె పాపుల నీ పద పద్మముల సేవింప ఏడెడు కొండలెక్కి నీ నగుమోము గాంచెద నాదుముడుపులు చేకొని నాధుని రక్షింపుమా నాధా శ్రీనాధా జగన్నాధా పాహిమాం పాహి పాహి!!!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ppolyz

Posted by Katta