పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మార్చి 2014, ఆదివారం

Narayana Sharma Mallavajjala కవిత

ఈనాటికవిత-74 __________________________ పనసకర్ల ప్రకాశ్-వేశ్యావాటిక కవిత్వం కొత్త అంశాలను ఆవిష్కరించాలి,కొత్త చూపుని జీవితాలపై ప్రసరింపజేసి లోకానికో కొత్త చూపునివ్వాలి.జీవితమైనా ,ప్రకృతి అయినా కొత్తదనం లేకపోతే కవి ఎక్కడో ఒకచోట గడ్డకట్టుకుపోతాడు.పనసకర్ల ప్రకాశ్ అలాంటి అంశాన్నొకదాన్ని కవిత్వీకరించారు.వేశ్యల జీవితాల్లోని చీకటీని,ఆ అంతరంగం నుంచే ఆవిష్కరించారు. సాధారణంగా వ్యక్తంచేస్తున్నప్పుడు మూడుకారకాలు ఉంటాయి.భావాన్ని వ్యక్తం చేస్తున్న పద్ధతి,వస్తువును వ్యక్తం చేస్తున్న పద్ధతి,రూపాన్ని అందిస్తున్న పద్ధతి ఈ మూడిటి సమగ్రతే కవిత్వంగా కనిపిస్తుంది.వస్తువుని వ్యక్తంచేస్తున్న పద్ధతి దర్శనం వల్ల,భావనని వ్యక్తం చేస్తున్న పద్ధతి ఙ్ఞానం వల్ల,రూపాన్ని వ్యక్తం చేస్తున్న పద్ధతి పఠనం వల్ల రూపొందుతుంది. ప్రకాశ్ లో భౌతిక మైన స్పృహనించి వ్యక్తం చేస్తున్న బలమైన వాక్యాలున్నాయి.ఇవి కవి తానుగమనించిన దైన్య స్థితిని అందిస్తాయి. "ఈ శరీర౦ గర్భగుడికాదు.. దేవుడొక్కడికే తలవ౦చడానికి" "మే౦ పెట్టుకునే పూలకి నలిగిపోవడమే తప్ప వాడిపోవడ౦ తెలీదు" "మే౦ నలుగురూ నడిచే దారిలో కాసిన చెట్ల౦ ఆకలితో ఎవరు రాళ్ళేసి మమ్మల్ని గాయపరచినా తలవ౦చి ఫలాలనివ్వాల్సి౦దే..." వ్యథాభరితమైన జీవితాన్ని చిత్రించేందుకు బరువైన ప్రతీకలతో,తాత్వికంగా కవిత్వాన్ని దిద్దారు ప్రకాశ్.భావన,వస్తువు బలమైనవే.వ్యక్తీకరణ కూడా బలైమైందే.ఇందులో త్యాగభావన అనే అంశాన్ని ఒకదాన్ని ప్రక్షిప్తం చేసారు.యూంగ్ ఉమ్మడి అచేతనాన్ని(Colective unconcious ness) గురించి చెప్పాడు.అందులో కొన్ని మూలరూపాలగురించి(Archetypes)ప్రస్తావించాడు.అందులో త్యాగభావన మొదటిది.చాలావరకు కవులు చెట్టుని,దధిచిని త్యాగానికి చూపడం ఇలాంటిదే.ఈ వర్ణన నుంచి ప్రకాశ్- ఇలాంటి ప్రస్తావనని ఒకటి చేసారు. "మేమ౦టూ లేకపోతే ఈ కామ౦ధుల చూపుల రాళ్ళు తగిలి ఎన్ని పెరట్లో చెట్లు గాయపడేవో........... మా బతుకులు చిద్రమైనా ఫరవాలేదు మావలన కొ౦దరి బతుకులైనా భద్ర౦గా ఉన్నాయి ఈ ఒక్క ఆత్మ స౦తృప్తి చాలుమాకు కళ్ళు తెరవని ఈ సమాజ౦ము౦దు ప్రశా౦త౦గా... కన్ను మూయడానికి.." ప్రకాశ్ గారు వస్తువుని ఇంకా అనేక కోణలలో చిక్కించుకోవడానికి దర్శనాన్ని,పాఠకుడికి మరింత బలంగా చేరడానికి రూపాన్ని సాధనచేయాలి.ఇతరుల కవిత్వాన్నిగమనించడంవల్ల ఈ అవకాశం కలుగుతుంది.ఒకింత సామాజిక స్పృహతో మంచి కవితను ఆవిష్కరించినందుకు అభునందనలు.

by Narayana Sharma Mallavajjalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLCCmb

Posted by Katta

Sree Kavitha కవిత

!!శుభరాత్రి!! నెస్తాలు ....@..'శ్రీ'

by Sree Kavithafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eh9gEH

Posted by Katta

Chakra Pani Yadav కవిత

/హైకూ/ గది నిండా విధ్యార్థులు గురువు "మజ్జిగ కవ్వం"

by Chakra Pani Yadavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dFoLcw

Posted by Katta

Sateesh Namavarapu కవిత

***జీవితం*** జీవితంలో అన్నీ కష్టాలే అనుభవించామనుకుంటే.. సుఖాలు ఇంకా మిగిలి ఉన్నాయనీ, అన్ని సుఖాలూ అనుభవించామనుకుంటే.. ఇకపై కష్టాలు ఎదురు చూస్తున్నాయనీ గుర్తు.! కష్టసుఖాలు రెండూ కలగాపులగంగా అనుభవించాల్సిందే అనుకుంటే.. జీవితమంటే జంట కవిత్వమనీ.. జీవితమంటే.నిరంతరం ప్రవహించాల్సిన విద్యుత్తు అనీ.. జన్మతోనే సంక్రమించే విద్వత్తు అనీ.. ధన,ఋణ ఆవేశాలు రెండూ లేకుండా జీవితం "బల్బు" వెలగదనీ అర్ధమౌతుంది..!!..09MAR2014.

by Sateesh Namavarapufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iqk2zJ

Posted by Katta

Katta Srinivas కవితby Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6GVWe

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || ఆకాశం చూరు క్రింద || నా ఏడుపు వినిపిస్తుంది కదూ! ....................... నిజంగా నిర్లక్ష్యం కాకపోతే .... ఎంతో ముఖ్యమూ, ప్రాముఖ్యమూ లేకపోతే ఈ ప్రపంచంలో ఎందుకు ఈ రక్త స్రావము? ఎందుకు శాంతిపై ఈ అనాశక్తత!? .......................... నేను, ఈ ప్రపంచాన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పుకోగలను. కానీ, అలా చెప్పడంవల్ల గాయం తగ్గి నొప్పి మాయం కాదు, మనశ్శాంతి దొరకదని తెలుసు. అందుకే, ప్రతి రోజూ ప్రార్ధిస్తున్నాను .... దయ కోసం సుమ సుఘందాలు వర్షించినట్లు నా కన్నీళ్ళు .... నా ఆత్మను చిల్లులు పొడుస్తూనే ఉన్నా, ...................... ఆ సూర్యుడు ఏమయ్యాడో? ఆ వెన్నెల రేడు, ఆ నక్షత్రాలు ఏమయ్యాయో? ....................... నేను, ఇంటి పైకప్పుపై కూర్చుని, జారి క్రిందపడ్డ వివేకము, రెక్కలూ లేని ఒక నీచజాతి పక్షిని. పాదరక్షలలో గులక రాయిలాంటి వాడిని. దారి లో కాళ్ళకు అతుక్కుపోయే మెత్తటి దూళి లాంటి వాడిని. రక్షింప దగని పాపాత్ముడ్ని! .................... పాడేందుకు పాట, తోడూ లేని, ఒంటరి పక్షిని .... నేను ఏమీకాని, ఏమీలేని శూన్యం పదాలే ఆస్తిగా ఊపిరిలేనట్లు వీస్తున్న గాలికి వ్యతిరేకంగా ఈకలు ఊపుతున్న .... ఒక నిట్టూర్పును. ............................. అదిగో వినిపించే ఆ ఏడుపు నాదే! ఆకాశం నుంచి రాలుతున్న ఆ వర్షపు చినుకులు సంకుచిత మానసిక స్థితి లో కొట్టుకుంటున్న ఒక సామాన్యుడి కన్నీళ్ళు అవి. నీరులా, విషాదం లా ఈ ప్రపంచాన్ని తడిపేస్తూ, ...................... ఆ ఏడుపును చూడకుండా దృష్టి మరల్చుకోలేవు. నీవు మూయలేవు .... నీ ఎద కిటికీ తలుపులు తుడిచెయ్యలేవు .... ఈ నా కన్నీళ్ళ తడిని, .................... నేను ఏడ్చాను . ఒక నది లా .... ప్రతి రోజూ చీకటి రాత్రుళ్ళను తడిచేస్తూ .................... నేను ఏడుస్తున్నాను ఎవరి ఓదార్పూ దొరకని ఒక పసిబాలుడిలా ........................ నేను ఎడుస్తూ ఉంటాను .... ఎవరూ పట్టించుకోరని తెలిసీ నన్నూ, నా ఏడుపునూ తొలకరి వర్షానికి తడిసిన మట్టివాసననూ. 09MAR14

by Chandrasekhar Vemulapallyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O8VvRK

Posted by Katta

Jayashree Naidu కవిత

అన్ని ట్రిక్కుల కన్నా మంచి ట్రిక్కు - సత్యం చెప్పడం నీటిలో ఈదే చేపపిల్ల తత్వం చందో రహిత కవిత్వం ఇవన్నీ కలగలిపిన మోహన్ ఋషి అక్షరాలు అవలీలగా జీరో డిగ్రీలో నిలుచోబెడతాయి. ఇవేళ ప్రొద్దున్న సింపుల్ గా హుందాగా జరిగిన జీరో డిగ్రీ పుస్తకావిష్కరణ కవి మిత్రులందరి కలయిక అదో పండగలా జరిగింది. The pace at which the poetic activity catching up is an encouraging mark.

by Jayashree Naidufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3mzur

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ప్రేమస్మృతి ఓ సఖీ సమయం అలా ఆగిపోయి వింతగా మనల్నే చూడనీయ్ మన ఉచ్చ్శ్వాసలో కరిగిపోయి మన గుండెల్లో నిలిచిపోనీయ్ కళ్లని గుసగుసలాడుకొనీయ్ అధరాలని దగ్గరగా ఆడుకోనీయ్ మనసుల్ని కౌగిలించుకోనీయ్ ఆత్మల్ని హాయిగా హత్తుకోనీయ్ ఆకాశం తన హృదయంలో మనల్ని భద్రంగా దాచుకొనీయ్ ప్రకృతి తన ప్రేమ పరిష్వంగంలో మనల్ని ఇముడ్చుకొనీయ్ నీ గుండెలోకి నన్ను వంపుకొనీయ్ నా గుండెనే నీకు అర్పించనీయ్! 09MAR2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dEtVFM

Posted by Katta

Krishna Mani కవిత

లోకం ****** తెలిసిన లోకముకన్నా , తెలియని విషయాలెన్నో ? గడచిన కాలముకన్నా , గడవని రోజులెన్నో ? కలిగిన సుఖముకన్నా , కలచిన దుఃఖాలెన్నో ? మానిన పుండుకన్నా , మాయని గాయాలెన్నో ? గెలిచిన ఓటమికన్నా , ఓడిన విజయాలెన్నో ? కరిగిన మనసుకన్నా , కాలిన గుండెలెన్నో ? చెదిరిన బతుకుకన్నా , చెరచిన మానాలెన్నో ? జరిగిన ఘోరంకన్నా , జరగని న్యాయాలెన్నో ? నిండిన కడుపుకన్నా , నిండని కేకలెన్నో ? తడసిన నేలకన్నా , మునిగిన భూములెన్నో ? కృష్ణ మణి I 09-03-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dEiQVe

Posted by Katta

Sai Padma కవిత

నెప్పుల నెమలీకలు..!! ~~~~~~~~~~~~~~ పల్చగా సుతారంగా, కేవలం స్పర్శ మాత్రమే కాదు నెప్పి కూడా ప్రయాణిస్తుంది.. ఒకానొక సమయంలో సహస్ర ఘంటికానాదం గుండెల్లో కొట్టుకొని, తెగని శ్లేష్మంలా ఎంత ఇబ్బంది పెడుతుందో, ఆగక చూసే కాంక్షా చూపులా బాధ ఎంత బాధిస్తుందో చెప్పలేము.. కలుస్తారు ఎవరో, నమ్మకంగా చెప్తారు, నెప్పిలో కూడా నీతోడుంటాం అని.. ఎలా ఉంటారో అర్ధం కాకపోయినా వినటానికి బాగుండి, కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఆ భావం కొంచం ఎక్కువ అవగానే, కొంచం భారంగా ఉంటుంది, మరో కొత్త నెప్పి మొదలవుతుంది. ఎందుకొచ్చిన ప్రయాసలే ఇదంతా ! ఆణువణువూ విచ్చుకోవటం, శృంగారంలోనే కాదు, శారీరక బాధలో కూడా తెలిసొస్తుంది. అలాగే ఉన్నాడో లేడో తెలీని దేవుడి జాడ కూడా.. కనబడని దేవుడు , వినపడని ఆకాశవాణి , నరనరాన ముంచేసి ... కదనరంగం చేసే ఒకానొక సమయాన ... భలే యాతన వంటి నవ్వు కూడా వస్తుంది ... నిజమే.. మానసిక బాధ ముందు శరీరం ఏముంది ? ఈక ముక్క అంటారా ? కానివ్వండి. కొత్తగా చెప్పేదేముంది.. ఒక్కోచోట ఒక్కోబాధ, ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ, వొళ్ళంతా నేప్పెట్టే సూదుల మయమై, మనమంటే శరీరమే అనిపించే ఓ క్షణాన .. పొడి దగ్గు కి ఒకటే హడావిడి పడి మందు తీసుకుంటున్న స్నేహితురాలిని అడిగాను.. ఎందుకంత గాభరా పడుతున్నావు? కొంచం టైం ఇవ్వు తగ్గుతుంది’ నా టైప్ మోటివేషన్ కొంచం అరగదీసి పోసి, నేనేదో ఇరగదీద్డామనుకున్నా..!! సిగ్గుపడి, మొహమాటపడి, అసహ్యపడుతూ చెప్పిందామె... నన్ను దగ్గరకి తీసుకుంటే , నా దగ్గు మావారి మూడ్ ని పాడుచేస్తోందట.. తిట్టే తిట్లకు, ఎదిగిన పిల్లలముందు అభాసు అవుతోంది.. ఆహా ..ఆడతనమా, నువ్వంటే ఎంత మర్యాద! ఆహా మనిషితనమా, మగాళ్ళకి వచ్చిన దగ్గులు వొగ్గు కథలు కాబోలు, ఓ రెండు తగిలించాలన్నంత కోపం వచ్చింది. దగ్గు రావటం ఏదో , పాతివ్రత్యం లా కనబడని విషయం కోల్పోయినట్టు బాధ పడుతున్న ఆ ముగ్ధ సుందర నారీమణి ని చూస్తే, తరతరాలుగా మేము బానిసలమే, కుక్క గొలుసులాగ, సూత్రపు పటకా అక్షయ తృతీయ నాడు కొనుక్కున్నామంతే అని .. ఇల్లెక్కి కూస్తున్న మోడరన్ మహాలక్ష్మిలను తలచి, వగచి, గతించితిని..!! నెప్పి సీతాకోక చిలుక లాంటిది కూడా... భరించలేని లార్వా దశ భరించాలంతే ... మూలన పెట్టి మూల విరాట్వి , మూల పుటమ్మవి అంటూ మెడ పాశాలు పెడుతూ ఉంటె భరించటం లేదూ.. ఇది కూడా అలాంటిదే..!! కొన్ని నెప్పులు నెమలీకల లాంటివి, ఎంత సమయం పుస్తకాల్ల్లో పెట్టినా ,అలానే ఉంటాయి. పిల్లలు పెట్టవు, అది ఎంత పెద్ద హాయో అనుభవిస్తే గానీ తెలీదు..!! చురుక్కుమనిపించే మాటల తోటల్లో, రాలిన పిందేల్లా అపర్ణాహ వేళల్లో, కళ్ళముందు కదలాడే నిశిలా శరీర స్పృహ తెలిసే నెప్పులు , కాస్సేపు మనసు మనస్సాక్షి లాంటి పడికట్టు మంత్రజాలాల్లోంచి మనల్ని బయట పడేస్తాయి శరీరం లేనిది మనసెక్కడుంది? చెంపదెబ్బ కొట్టి , మాటలతో అనునయిస్తే నేనే , సర్వ జగన్నియామక భవానీ భర్గ పాదాంబుజ ధ్యానైకాత్మికనేని .. ఇలా ఎన్ని శపధాలు చేస్తే ఏం లాభం ? అర్ధమవుతోందా... శమించని శరీరమా ? --సాయి పద్మ

by Sai Padmafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fW6Avv

Posted by Katta

Shamshad Mohammed కవిత

గమ్యం దారి తప్పింది చేరుకోవాల్సిన గమ్యం ఒకటి చేరుకున్నది మరొచోటుకి గమ్యం దారి తప్పింది పలకాల్సిన స్వాగాతాలన్ని దాటిపోయిన సమయాన్ని శంకిస్తున్నాయ్ సముద్రం అడుగునుంచి ఎగసి పడ్డ ఆకర్షణ శక్తి నీ రెక్కల బలాన్ని లాగేసుకుంది ఆనవాళ్ళు ఆయిల్ తెట్టెలై సముద్రం పై తేలుతూ నీ వారి గుండెల్లో ఆశ అనుమానమై వేధిస్తుంది నువ్ బ్రతికే వుంటావని [కౌలాలంపూర్ నుండి బీజింగ్ వెల్తున్న విమానం సముద్రం లొ పదిందన్న వార్త విని] షంషాద్ 3/9/2014

by Shamshad Mohammedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKr0QA

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

నా హృదయశిల్పం (కవిత)-కెరె జగదీష్@ రసాత్మకమైన కవితాత్మను చైతన్య పరిచే నీ చూపులు వెన్నల రాత్రుల్ని పలకరించాయి మసక మబ్బుల్లో కదలని కాలం కటిన శిలల నీడల్లో నిరీక్షణా వేదనను కళ్ళచాటున దాచుకుంది వెంబడిస్తున్న ఒక అందమైన సీతాకోక రెక్కలపై నా హృదయ శిల్పం అతుక్కుపోయింది ఆ రెక్కల కింద నీ జ్ఞాపకాల చిరుగాలి మధురమైన పరిమళాన్ని విసురుతుంది పలకరిస్తున్న ఆ తీయని క్షణాలు సప్తవర్ణ చిత్రాలై కనుపాపలతో స్నేహం చేస్తూ కన్రెప్పలకు సంకెళ్ళు వేశాయి నిరీక్షణలో బరువెక్కిన విరహవేదన జాలువార్చిన అక్షర సమూహమే నా ప్రేమగీతమయ్యింది.......... " కెరె జగదీష్@గ్మైల్.చొం//9440708133

by Vempalli Reddinagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVXFu9

Posted by Katta

Sai Anveshi కవిత

అన్వేషి // వాడు వెళ్ళిపోయాడు... // వాడు వెళ్ళిపోయాడు... ఈ మజిలిలో కొన్ని క్షణాలను జ్ఞపకాలుగా మార్చేస్తూ... ఇకపై కొన్నిఅడుగులలో నన్నొంటరిగా వదిలేస్తూ... వాడు వెళ్ళిపోయాడు నా భావాలపై కొన్ని సిరాచుక్కలు జల్లుతూ... నా రేపటిపై కొంత నిరాశలను అద్దుతూ.. వాడు వెళ్ళిపోయాడు... విడిపోతామనే కలని నిజంచేస్తూ... విడిపోయామనే నిజాన్ని కలతగా మారుస్తూ... వాడు లేకపోతేనేం??? ప్రశ్నించాను మనసుని... ఇకపై మన మేడమీద వెన్నెల నా ఒక్కడి గ్లాసులోనే కురుస్తుంది.. ఇకపై నా యాష్‌ట్రే సగమే నిండుతుంది.... కొన్ని సాయంత్రాలు నన్ను ఒంటరిగా నడిపిస్తాయి... కొన్ని ప్రదేశాలు నా ఒక్కడితోనే సంభాషిస్తాయి... అవున్నిజమే...వాడెళ్ళిపోయాడు అయితేనేం... తనలాగ నేను మారిపోయాక, తనలా మారిన నన్నొదిలి ఎంత దూరం వెళ్ళగలడు ??? ఎక్కడో దూరంగా అస్పష్టంగా వినిపిస్తోంది " యే దోస్తీ హం నహీ ఛోడేంగే...". కొన్ని పదాలని దూరం మింగేసినట్టుంది.. ఇక్కడ నేను కొన్ని క్షణాలను బూడిద చేస్తున్నాను సిగరెట్ పొగతో రింగులొదులుతూ.. -09 మార్చ్ 2014

by Sai Anveshifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fdNYMi

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

త్తిమండ ప్రతాప్ ||మనసు లోతుల్లో|| ===================== గతాలు తవ్వుదామని మనసును గునపం చేసుకున్నా ఎన్నో జ్ఞాపకాల నడుమ గుండె గాయాలు వెక్కిరించాయి తవ్వే కొద్దీ అతికిన బతుకులు చితికిన చిత్రాలై కనిపిస్తున్నాయి దిగుతున్న గునపం దిగంబర జీవితాల లోతులను చీలుస్తుంది శిధిలాల నడుమ ఎన్నెన్నో పొరలు ఛారల్లా చరిత్రను తిరగ రాస్తున్నాయి ఆశల జీవితాలు నిరాశావాదాన్ని గేలి చేస్తున్నాయి తవ్వే కొద్ది గతాలు గులకరాల్లై మనసుకు గుచ్చుకుంటున్నాయి లోతుల్లో ఎన్నో మజిలీలు అందంగా కనిపిస్తున్నాయి అందమైన అనుభూతులు గతాల జ్ఞాపకాల్లో లోతుగా స్వగాతాలై తొంగి చూస్తున్నాయి =================== మార్చి 09/2013

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hXajh4

Posted by Katta

Jagadish Yamijala కవిత

వచ్చీపోయే రోజులు ------------------------- ఎంత తేలికగా దాటేస్తున్నానా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడూ ఒక్కొక్క రోజునీ అయితే కొన్ని సందర్భాలలో అంతులేని ప్రేమా నిన్నటి రోజున ఎదుర్కొన్న ఒక ద్రోహామూ కన్నీరూ ఇలా మాటల్లో చెప్పలేని అనుభూతులూ అనుభవాలూ ..... ఇంకా మరెన్ని రోజులను దాటాలో తెలియడం లేదు ఎవరి దగ్గర ఉంది రేపటి నా కథంతా...? ఎక్కడికి వెళ్లి ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఇప్పటికే అడిగాను కొందర్ని వాళ్ళేమీ చెప్పడం లేదు.... అయినా రోజులు ఆగవుగా నా కోసం, జవాబు కోసం... సాగిపోతూనే ఉన్నాయి ... --------------------------- యామిజాల జగదీశ్ 9.3.2014 --------------------------

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVOkm3

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

//పాదాభివందనం// (కవిత)-కెరె జగదీష్ గారి '' సముద్రమంత గాయం '' కవితా సంపుటి నుండీ అమ్మ స్పర్శలొ ముంగారు వానల తొలకరిజల్లుల పరిమళం బంగారు వన్నెల కాంతికిరణాల సంతకం గోరుముద్దలు తినిపిస్తూ నా అంతరంగంలో వయోలిన్ రాగాలను వినిపించిన అమ్మ చనుబాలనందించి మానవత భాష్యానికి జీవం పోసింది జన్మజన్మాంతర బంధాన్ని గుర్థు చేసింది ఆగి ఆగి నడుస్తున్న చిన్ని చిన్ని పాదాలకు చిటికెన వేలితో చేయూతనిచ్చి నడకలు నేర్పిన అమ్మ...వొడి తొలిబడిగా కళ్ళు తెరిచింది గుండెపై చిరుపాదాల స్పర్శతో పులకరిస్తూ పలకరిస్తూ చిలకరిస్తూ పురివిప్పిన నెమలిలా అమ్మ హాయిగా నవ్వడం కళ్ళలో మెదులుతూనే వుంది అక్షరాల పక్షులతో ఆడుకోవడం నేర్పిన అమ్మ శిక్షిస్తూ రక్షిస్తూ రెండుబొట్ల కన్నీటిని కనురెప్పల చాటున దాచుకుని నిశ్శబ్ద దుఖానికి నవ్వులు అతికించడం అమ్మతనానికి నిదర్శనం మనిషితనానికి ఆదర్సం ప్రేమ తత్వంతో ఉద్వేగాన్నీ ఉత్చాహాన్నీ అమ్ర్య్త వర్షిణిలా కురిపించిన అమ్మతత్వం అనిర్వచనీయం తొమ్మిది నెలల భారాన్ని భరిస్తూ పునర్జన్మ వాకిళ్ళను తీస్తూ గాయపడి బాధపడి కన్నీటి జలపాతాన్ని గుండెలో దాచుకుని శతవసంతాల ఆనందంతో ధరిత్రిలా పులకరించిన అమ్మకు పాదాభివందనం* (-25-04-2010) )

by Vempalli Reddinagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVOn18

Posted by Katta

Sasi Bala కవిత

వేదిక !!!!!!...............శశిబాల...9 march 14 .................................................... లలిత కళల సుమహార మాలిక రాజకీయ వాక్రణాలకది స్థానిక నవరస నాట్య హేలలా డోలిక సకల కార్యాచరణ భూమిక ఈ వేదిక సంగీతపు సుమజల్లు కురిసేదిక్కడ సాహితీ సౌరభాలు విరిసేదిక్కడ కవనాల కధనాలు మ్రోగేదిక్కడ రసరాజ్య మకుటాలు మెరిసేదిక్కడ జనగళం ప్రభు గళం వినిపించేదీ స్థానం ధన బలం జన బలం కనిపించేదీ స్థానం నటనకు పుట్టిల్లౌ రంగాస్తలమీ స్థానం ప్రజాపతుల ప్రమాణాల సాక్ష్యం ఈ స్థానం సుమధుర భాషామతల్లికాస్థానం ఈ స్థానం వివిధ జాతి సంస్కృతులకు పీఠమైనదీ స్థానం తరతరాల ప్రగతి మార్గ ప్రస్తానం ఈ స్థానం కుల మతం జాతి రీతికతీతమీ స్థానం కృష్ణ రాయబారమైన ..సత్య హరిశ్చంద్రమైన ఏ కథనమైనా ఏ నాటకమైనా పదుగురి మెప్పించే ప్రదర్శనా స్థలము ..నటనను గుప్పించే రంగస్థలము ..ఈ వేదిక

by Sasi Balafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cFFvlQ

Posted by Katta

Rvss Srinivas కవిత

||జీవన సంగీతం || నీ మదిలో నాకు స్థానమున్నా లేకున్నా నీ కలలో కాసింత చోటిస్తే నా కలవరాలు తీర్చే 'కల'...వరమై నన్నుగ్రహించినట్లే నీ మదిలో రవంత చోటిస్తే నా మనసులోని ప్రతిపరమాణువును నీవు ప్రణయవిస్ఫోటనం చేసినట్లే నన్ను మనస్పూర్తిగా ఒక్కసారి ప్రేమిస్తే నా ప్రేమకి ప్రతిరూపంగా నీవు మదిలో కొలువై ఉండిపోయినట్లే నీరాకతో సాధారమైన మదిగది... అపురూపమైన ప్రేమమందిరంగా మారిపోయినట్లే జీవనయానంలో నీతో నడిచే భాగ్యమున్నా లేకున్నా నీ అడుగుల చప్పుళ్ళలో ఒక్క రవాన్నైతే చాలు నా జీవితమాసాంతం మధురసంగీతమాలపించినట్లే ...@శ్రీ 09MAR14

by Rvss Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lipLF8

Posted by Katta

Raghava Raghava కవిత

"నెగడు"( 2-3-14 ఆదివారం ఆంధ్రజ్యోతి లో వచ్చింది) "నెగడు" ….. మంటని ఎగదోయడమే మన పని మంటలార్పమంటూ మాటలు చెప్పే వాళ్ళు కొంపలార్పుతున్నారని నా భావన- ఊడల్ దించుకుంటూ రాక్షసవృక్షం పచ్చదనమంతా మింగేసి బలిసిపోతుంటే ఎలా ఉంటాం మౌనంగా మన గూళ్ళలో మనం ముడుక్కుని మన ఫైళ్ళలో మనం ఇరుక్కుని అటూ ఇటూ కాకుండా ’మధ్య’తరగతి గిరి గీసుకుని ఎలా ఉంటాం స్తబ్దంగా...? . . . -రాయ్యా రా! ఒక పుల్లో పుడకో పాటో పద్యమో కధో వ్యధో తీసుకురా ఏదో ఒకటి నీ వంతుగా వెయ్ మంటలో వెయ్ మంటను ఎగదొయ్ చితుకులేరు పోగుబెట్టు గియ్ పుల్లగియ్ -పైకెగిసే కనకాంబరాల ఫౌంటెయిన్ ఇపుడు మంటంటే ఒక మహోజ్వల సౌందర్యం! నయగారాలూ నంగిమాటలూ సుభాషితాలూ నీతిపద్యాలూ మర్యాదలూమప్పితాలూ మంటకు నప్పవు . . .చూడు ఎలా ఉంది మంట వీరుల గాయాల నెత్తుటి పంట ఆ రంగు ఎక్కడిది చెప్పు కడుపులెండుతున్న తమ్ముళ్ళ కళ్ళది గదూ.. వెతలోడుతున్న చెల్లెళ్ళ పిడికిళ్ళది గదూ -గళమెత్తిన చెమటచుక్కల గానం ఇపుడు మంటంటే ఒక మహాయుద్ధనాదం! . . . కొందరుంటారు కావాలని కళ్ళూ చెవులూ మూసుకుంటారు ఉదయం జాడను గుర్తించలేక ఉసూరుమంటారు తమకు చీకటయ్యిందని సూర్యుడు మరణించాడంటారు ..పట్టించుకోకు వాళ్ళను నిన్ను గూడా నిద్రబుచ్చుతారు- రా! మంటను గనగనమనిపించేదేదో ఒకటి మనవంతుగా తెద్దాం వేద్దాం మంటలో వేద్దాం మంటను ఎగదోద్దాం శివుడాఙ్న ను ధిక్కరించే చీమలకు జై కొడదాం- ..విరబూసిన మోదుగుపూల వనం ఇపుడు మంటంటే ఒక మహోద్రేక పరిమళం.. -----రాఘవ 9-3-14

by Raghava Raghavafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k5kmBd

Posted by Katta

Santosh Kumar K కవిత

||ఎడారిపూలు|| శీర్షిక : నవ సమాజంలో వేశ్యని చూస్తున్న తీరుని.. తన జీవితాన్ని ఆవిష్కరించే కోణాన్ని విపులంగా వివరంగా విన్నవించే ప్రయత్నమే నా ఈ కవితామాలిక.. "ఎడారిపూలు" దేవుణ్ణి పూజించి దారుణాల్ని ప్రోత్సహిస్తాం, మూగజీవాలను బలిచ్చి మొక్కుబడులని చెప్పుకుంటాం, దిక్కులేని బీద బాలికలలో దేవదాసీలను సృష్టిస్తాం, బలిపశువలను చేసి బరితెగించారని హేళన చేస్తాం, విధి వంచితలైన వనితలను వేశ్యలుగా మారుస్తాం, జీవితమనే పదానికి వికృతమనే అర్దాన్ని నేర్పిస్తాం, అయినాసరే మనుషలం మనం.. మంచివాళ్ళమని చెప్పుకుంటాం!! చీకటి నీడల్లో విరక్తిని మింగి మెతుకులకోసం బతుకుని వేలం వేసి ఋతువేదైనా రతీ రాణి తానై ఋతుక్రమమైనా రక్తిని పంచుతూ రాకాసి రోగం ఱంకెలు వేసినా, రక్తం విరిచినా రోదన చూపక రెక్కల కష్టాన్నే నమ్ముకుంటుంది.. వేశ్య కదా పాపం, ఎవరితోను చెప్పుకోదు!! ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని వినం..!! తోడులేని ఒంటరితనంలో దిక్కులేక మౌనంతో కేకలు వేస్తుంటే వీచే గాలి సైతం జాలితో చూసి తన పైటంచుతో కల్లు తుడుస్తుంటే నడ్డినంటిన నాభిని చూడగ జాతిలేని వీధి కుక్కల గుంపు గుమ్మిగూడి మాంసపు ముద్ద ధరని అడిగి అంగటిలో సరుకని పదే పదే గుర్తుచేస్తున్నపుడు ప్రశ్నించలేదు.. వేశ్య కదా తన కష్టాయణం వినపడదు ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని మాట్లాడం..!! చిగురించే విత్తుకి సూరీడే అండ కానీ తన ఆశలపైరులో కీచక పర్వాలు దుశ్శాసన దుర్మార్గాలే దారినిండా.. డబ్బిచ్చి కులుకు మగాడు రసికుడని దేహకూలీ అయిన తను జాతిహీనమని ఆధునిక సమజమిచ్చిన తీర్పుకి లెక్కలేనన్ని కన్నెరికాలను కానిచ్చింది వేశ్యే కదా తన గోడుని పట్టించుకోము ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని చూడం..!! వికసించే మందారమే ప్రతి మగువ రంగులు వేరైనా అందానికి నిలయమే అతివ కానీ ఎంతందమున్నా.. ఎన్ని రంగులున్నా అంతులేని అంతరంగాల గతాలను మింగి తుమ్మెదలతో వ్యాపారం చేసే ఈ ఇంతి పెళ్ళిచేసుకోని ఒక గొప్ప పతివ్రత అవే లక్షణాలున్నా వివక్షకు గురై వాటి ఉనికినే మరిచాయి ఈ విరులు.. తేనెని కాక కన్నీటిని చిందే ఎడారిపూలు!! #సంతోషహేలి 09MAR2014

by Santosh Kumar Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ioArVc

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || ఎదనిండా ఖాళీ.. ..భర్తీ చేయలేని శూన్యం..|| --------------------------------------------------------------------------- గుండె లోపల? మది లోపల? నువ్వు నేను అన్న నిజం అబద్దమై ఆక్రోసిస్తున్న వేల మిగతా అంతా మిథ్య జరిగింది జరుగుతున్నది అక్షరాలు కూడదీసుకొని రాసే కవిత్వంలో? నిజాలు దాగున్నాయి గాయపడ్డ కలం నాది కలాన్ని విదిలించి మనసు గలాన్ని విప్పి మనసులోప;అ దాగున్న నిజాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారి ...ఎవరో గొంతును నొక్కేస్తున్నారు నరాలను చిట్లగొడుతున్నారు నిజాలు బైటికి రాకూడాదనేమో వెర్రిగా మనసు రహస్యాలను..విప్పి హృదయాంతరాల దగిన భాదను నేలమాళిగల్లో ఛేదించలేని చిక్కుముడులు విప్పి చెప్పుకునేందుకు ఇంత విశాలమైన ప్రపంచంలో ఒక్కమనిషి లేడా చూస్తే ఇంత మంది కనిపిస్తున్నారు మనుసులకు మనసుంటుందట మరి మీరేంటి మరమనుషుల్లా తయారయ్యారు ఎదనిండా ఖాళీ.. భర్తీ చేయలేని శూన్యం.. ప్రశాంతతను ఎవరు భగ్నం చేసారు? తరచి తరచి వెతికి వెతికి తొంగిచూస్తావెందుకు? చిన్న గాయాన్ని పెద్దది చేస్తున్నారెందుకు నన్నిలా బ్రతకనీయవా నీ జ్ఞాపకాలు ఎవరెవరొ నా లోపలికి చూసి మరీ మనసును ఏడారి చేసిపోతున్నారు ఏంటో నీలో నీవు చూడగల లోతెంత? నిన్ను నువ్వు వెతుక్కుంటూ వెలుతున్నావు గాణి నేనెక్కడున్నాను అని ఒక్కసారి కూడా ఆలోచించవ అలొచించేత సమయంలేదేమొ కదా పాపం

by Aduri Inna Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVvJqe

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 24 . సారా టీజ్డేల్ అసాధారణ ప్రజ్ఞావంతురాలయిన కవయిత్రి. చాలా చిన్న సందర్భాన్ని గాని, సంఘటనని గాని, అనుభవాన్ని గాని తీసుకుని, దానితో ఒక గంభీరమైన తాత్త్వికప్రతిపాదన చెయ్యగలదు. ఎక్కువసార్లు, ఆమె చేసే ప్రతిపాదనలని ఒక చక్కని తిరుగులేని అర్థాంతరన్యాసంతో సమర్థిస్తుంది. మనం ఒక ప్రక్రియలో భాగం అయినప్పుడు మన ఆలోచనలు దానితోపాటే పోతుంటాయి తప్ప, ఈ ప్రక్రియతో సంబంధం లేని వాళ్లు ఆలోచించినట్టు ఆలోచించలేము. అలా ఆలోచించగలగడమే Out-of-the-box thinking. దీనికి తాత్త్విక పరిణతి కావాలి. మనం ఒక సుఖాన్ని తనివి తీరా అనుభవిస్తున్నప్పుడు, "ఈ సుఖము శాశ్వతము కాదు" అన్న ఆలోచన అనుభవిస్తున్న క్షణంలో కలుగుతుందా? ఆ స్పృహతో సుఖాన్ని అనుభవించగలిగినపుడు అందులో అనుభవమే గాని, అందులో indulgence (lAlasa) ఉండదు. అటువంటి indulgenceలేనపుడు, ఫలానా అనుభవమే కావాలన్న కాంక్ష ఉండదు. అలాటప్పుడే, జీవితాన్ని అనుభవిస్తూ, అందులోని సత్యాలని గ్రహించగల మానసిక స్థితి కలుగుతుంది. ఈ స్థితిని చేరుకున్న గొప్ప కవయిత్రి సారా టీజ్డేల్. ఒక సామాన్యమైన అనుభవాన్ని తీసుకుని, అందులో ఎంత తాత్త్విక భావనని కలగలిపిందో చూడండి. పాతరాగాలు … తోటలో గాలి పెద్దగా వీచనప్పుడు గులాబులు, సూర్యముఖులనుండి వచ్చే పరిమళపు తెమ్మెరలు మనమీద తేలియాడి ఎక్కడికి సాగిపోతాయో తెలీదు . అలాగే, ఒక పాతరాగంకూడా గుండెలో గుసగుసలాడి జాడ తెలుపకుండా నా నుండి చల్లగా ఎక్కడికో జారుకుంటుంది మంద పవనాలు చడీచప్పుడులేకుండా మోసుకుపోయే సుగంధంలా. . కానీ, ఆ పరిమళాలు నా మీద వీస్తున్న క్షణంలో నాకు తెలుస్తునే ఉంటుంది, ఆ క్షణంలో అనుభవించే ఆనందమూ, విషాదమూ మరి తిరిగి రావని. . అందుకే, చీకటి మడుగుపై 'రాక' నుండి రాలి పడి విరిగిన వెలుగురేకలు ఏరుకున్నట్టు దొరికినన్ని రాగాలు చేజిక్కించుకుందికి ప్రయత్నిస్తాను . కానీ అవి తేలి వెళ్లిపోతాయి... అయినా, అసలు ఎవ్వడాపగలడు యవ్వనాన్నీ, సుగంధాన్నీ, వెన్నెల వెలుగునీ? . సారా టీజ్డేల్. August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . Old Tunes... . As the waves of perfume, heliotrope rose, Float in the garden when no wind blows, Come to us, go from us, whence no one knows; So the old tunes float in my mind, And go from me leaving no trace behind, Like fragrance borne on the hush of the wind. But in the instant the airs remain I know the laughter and the pain Of times that will not come again. I try to catch at many a tune Like petals of light fallen from the moon, Broken and bright on a dark lagoon, But they float away -- for who can hold Youth, or perfume or the moon's gold? . Sara Teasdale August 8, 1884 – January 29, 1933 American

by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k4eybe

Posted by Katta