పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మే 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

అస్త్రం ______అరుణ నారదభట్ల తాజాగా ఎగిరింది సీతాకోక చిలక! మట్టిగూటిని తొలిచివేసిన గొంగళీపురుగు! తేయాకు తోటలో గుప్పుమన్న పొగ మెదడునరాల్లో చిక్కింది! నాట్లు వేసే రైతు పదికాలాల తరువాతి కొత్త చినుకు! పొడిబారిన లోకానికి గొంతు తడిపే వానలా తను! వారసత్వపు కోరల్లో చిక్కిన మువ్వన్నెలను పిడికిట బంధించిన మట్టివాసన...! అంతర్వాహిని పెల్లుబికి పంటకాల్వలుగా విస్తరించింది! కలం..గళం స్వర్ణకమలమై విరిసింది! కొలనులోని పువ్వు.. సరస్సులో నవ్వులు ఆకాశాన మెరిసిన తారాజువ్వలా చీకటిలో వెలుగో.... కళ్ళు చీకట్లు కమ్మే మెరుపో కాలం ఇచ్చిన అస్త్రం వాడే విధానంలోనే గురి....గురుతు తెలిసేది! ఏమైనా అది మట్టి గొంతుక కన్నీళ్ళూ...మంచినీళ్ళూ.. అన్నింటీ రుచి తెలిసిన పచ్చని ఆకుల విస్తరి! 27-5-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oFZhQa

Posted by Katta

Pusyami Sagar కవిత

పనసకర్ల ప్రకాష్ గారు రాసిన కవిత !!చావు తరువాత !!//కవిత్వ విశ్లేషణ// _______పుష్యమి సాగర్. చావు అంటే శరీరంలోనుంచి జీవుడు పైకి పోవుట అని అర్ధం చెప్పబడింది ...పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు.. మృత్యువు గురించి తాత్వికంగా చెప్పటం అంటే కొంచం కష్టమే...చావు తర్వాత కవిత లో కొన్ని నిజాలు ను చెప్పి జ్ఞాన భోధ కలిగించేలా మనసు ను తాకుతాయి ...నిజంగా చావు అంటే ప్రతి వారికి ఎందుకు భయం కలగాలి , చావు అంటే ఉదయం నుంచి సాయంత్ర్హం వరకు ఆడుకునే ఒక ఆట లాంటిది కదా....నిజమే జీవితం లో ఎవరు గుర్తు చేసుకోరు వచ్చే చావు కోసం... చావంటే ఏంటి ...? పురాతనకాలం నుంచి చెప్తారు మరణం మనిషికే కాని ఆత్మ కి కాదు ...ఇది ఒక దేహం నుంచి మరో దేహానికి విడిచి వెళ్ళే వాహకమే ..ఒకే ఒక వాక్యం లో చక్కగా చెప్పారు ... !! చావ౦టే ఏ౦టి..?//రూపాన్ని మార్చుకోడమేకదా..! నీడలా వెంట వచ్చి తీసుకు పోయేది చావే కదా ...మరి దానితో దోబూచులాట ఎందుకు ..ఇక్కడ చావు ను ఒక ఆట తో పోల్చడం బాగుంది ..పుట్టుక నుంచి చావు ..రోజు లో ఉదయం నుంచి సాయం వరకు ఆడే ఆట లాంటిదే మరి నీడై వె౦బడి౦చే చావుతో ఎన్నాళ్ళు//నీ దోబూచులు.../రాత్రైతే ఆట ముగిసిపోవాల్సి౦దే సహజ మరణం రావాలని అది కూడా సౌఖ్యం గా ఉండాలని కోరుకుంటారు ...కాని ఇక్కడ మన చావు కి మనమే దారులు వేస్తున్నాము ...చెడు అలవాట్ల తో .చెడు ఆలోచనలతో ..నిజమే మరి మన శరీరాఇనికి హానికరం అపాయకరమైన అలవాట్ల తో నే సగం చస్తున్నాం ... మన గోతుల్ని మన౦ ఎప్పుడో తవ్వుకునే ఉ౦టా౦ చెడు అలవాట్లతోనో చెడ్డ ఆలోచనలతోనో// చావు తరువాత ???....భూమి లో మన దేహం కప్పుబడ్డాక మొక్క లా తిరిగి మరల చిగురిస్తాం కదా...అంటే చావు కు ముందు మంచి జీవితం గడిపి నలుగురికి ఆదర్శ ప్రాయం గ నడుచుకోమని అర్థం.... మట్టిలోకి విత్తనమై మళ్ళీ చేరుకునే ము౦దు/// అన్ని కాలాలపాటూ నువ్వో పచ్చని జ్ఞాపకానివై ఈ లోక౦లో బతికే ఉ౦టావ్...... అన్ని కాలల లో నువ్వు పచ్చని చెట్టయి బతికే ఉంటావు ....చావు తర్వాత మిగిలేవి మంచి పేరే .....శాశ్వత మైన ధీ పేరు మాత్రమే ..సంపద కాదు అని చక్కగా చెప్పి ముగించారు ...ప్రకాష్ గారు ... తాత్వికత తో మంచి కవిత ను అందించిన ప్రకాష్ గారికి అబినందనలు ... \=============== "ఒక చావు తరవాత" వస్తే రానీ చీకటిని నేను మాత్ర౦ వెలుగుతూనే ఉ౦టాను చీకటిలోకి వెళ్ళేవరకూ..... చావ౦టే ఏ౦టి..? రూపాన్ని మార్చుకోడమేకదా..! ఊరికినే ఏడవకు ఎవరో సచ్చినట్టు కన్నీళ్ళు బుగ్గమీద‌ అమ్మ పెట్టిన తీపి ముద్దు గురుతుల్ని ఊరికే చెరిపేసి పోతాయ్ నీడై వె౦బడి౦చే చావుతో ఎన్నాళ్ళు నీ దోబూచులు... రాత్రైతే ఆట ముగిసిపోవాల్సి౦దే శాశ్వత౦కాని జీవితాన్ని మలుచుకోవాల్సి౦ది అ౦ద౦గా కాదు హు౦దాగా మన గోతుల్ని మన౦ ఎప్పుడో తవ్వుకునే ఉ౦టా౦ చెడు అలవాట్లతోనో చెడ్డ ఆలోచనలతోనో మన౦ ఇప్పుడు అటువైపే నడుస్తున్నా౦ మట్టిలోకి విత్తనమై మళ్ళీ చేరుకునే ము౦దు ఎన్ని గు౦డెలు నీ ఊపిరై కొట్టుకు౦టున్నాయో చూసుకో..... అన్ని కాలాలపాటూ నువ్వో పచ్చని జ్ఞాపకానివై ఈ లోక౦లో బతికే ఉ౦టావ్...... పనసకర్ల ప్రకాష్ 05/27/2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mlLAng

Posted by Katta

Sriramoju Haragopal కవిత

చివరకు మిగిలేది.. 27.05.2014 ఎక్కడుందో జడిసి జడిసి వొణికిపోయి అణు,పరమాణు, కణజాలాలన్ని ముడుసుకుపోయిన గొంతులోని మాట ఎన్ని కాలాలనుండి వెతుక్కుంటున్నాను నా మాటని నేను పరకాయప్రవేశం చేసిన వాగర్థాలేవేవో నన్ను నన్నుగా పలుకనియ్యవు సుతారంగా చుట్టుకున్న తీగెలదారుల్లో సిగ్గులొలుకుతూ కట్లపూలై పూసిన నవ్వులన్ని అలవోకగా ఆకాశం వాలుమీద జారిన వెన్నెలలన్ని నీ కోసం నిరీక్షించిన వూపిరిగాలులలోకి దిగిన కలలపరిమళాలన్ని పిలుపులకోసం దారులు కాచిన పెదవుల వంతెన తెరిచి విడిచిన నౌకల్లా ఏవి మాటలు చిట్లీచిట్లని దుఃఖాల గాజులని వొడుపుగా సింగిడీలు చేసుకుని అల్లీఅల్లని వూహల పింగాణీపాత్రల వొరల్లో రంగులద్దుకుని ఆ వంకో ఈ వంకో విసిరినవో కసిరినవో పలుచని స్నేహాలని పుట్టినాకో పుట్టక మునుపో నిన్ను కలువాలని చేసిన ప్రతిజ్ఞల్ని మేఘాల మీద గీసిన నీటిరంగుల నీ చిత్రాల లాస్యాలు, లవణిమల్ని స్వరపేటిక తంత్రులు కదలీ కదలక, కదలనివ్వని వొత్తిళ్ళ మత్తల్లు దూకాల్సిన మాటలేయి నీవెక్కడున్నావురా నా చుట్టూరా నీ జ్ఞాపకాల కాంతి పరివేషాలు గుండెతొనల్ని వొలిచిపోసి మాధుర్యాల్ని గ్రోలే నీ కౌశలం తెలుసు నాకు నేను వ్యక్తం కాని నిర్వేదనని, నిశ్శబ్దాన్ని మిణుగురు వెలుగుల్లా ఆశలపుప్పొడులు రాల్చే చిరువెన్నెలల నెలపొడుపా నా మాటలు నాకివ్వు నీతోనే మాట్లాడనీ చివరిసారి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kc0k52

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఉచితంగా మరణం - కాసుల ప్రతాపరెడ్డి గిన్నెల చేతులు కడిగి కండువా భుజానేసుకుంటవు వస్తనో, రానో, వుంటనో, పోతనో పైలమని చెప్పవు బాయి మీద మోటరు తొందర పెడతది కుండలెంత గోకినా పిడికెడు చేతికందది ఆ తల్లి బొటబొటా రాల్చే కన్నీళ్లు గుండె మీద టపాటపా రాలి ముద్ద కడతయి అద్దెకరం పొలం అప్పట్ల ఇంటిల్లిపాదికీ ఆదరువు జీవితానికి దీమూ, ఆత్మగౌరవమూ బాయి మీద మోటారు తొందరపెడతది మధ్యలోనే చావు బుసకొడుతూ కాటేయొచ్చు విద్యుత్తరంగాల పగ్గాలతో యముడు మాటేయవచ్చు రూపమేదైనా కావొచ్చు, పగ పట్టింది నిన్నే కదా! నీలం నీలంగా మెరుపు మెరుపులుగా ఆకుపచ్చ బటనే ఒంటి రక్తాన్ని పీల్చేసి విసిరేయొచ్చు ఎంత నాశనగాలమిది! కరెంటుకూ, ధరలకూ, బుక్కెడు బువ్వకే కాదు ప్రాణాలకూ బిచ్చగాణ్ని చేసిండ్రు కదా! బయటి శత్రువు లోపలి శత్రువు ఒక్కడే అద్మ రాత్రి కరెంటిచ్చేవాడు రాత్రి పూట తిరుగొద్దన్నవాడు ఒక్కరా, ఇద్దరా? నాలుక చీలినప్పుడు నాగుపామే! అంతా యెటమటం మోట గొట్టిన యాల్లనే బాగుండేదేమో! నడిరాత్రి నడమంత్రం చావు లేదు ఉచిత కరెంటును ఎగబెట్టే ఇకమతులేమో! నాణ్యతకు దొడ్డిదారి ఆమోదం కావాలేమో!! అందుకనే ఉచితార్థంగా నీ చావును రాసిపెట్టారేమో!!! కాయకష్టమెరిగినవాడివి కదా! ఈ కొత్త చావుల ముచ్చట్లు నీకేమెరుక?! (వైయస్ పాలనలో రాసిన కవిత ఇది)

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvDLhp

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవిత్వం : ......॥ జీవితం!॥..... . ( Life ) . ఓ మార్మిక వైచిత్రీ! ఆనంద పుత్రీ! మానస వైవశ్యమా !జీవితమా! నీ ఉద్గమన పయన పరిధికి అవనివ్వు అనంతమే అవధి . నీ పక్షాలు మోస్తున్నవి ఔన్నత్య కీర్తిని, ఉపేక్షను, దైవత్వాన్ని అపార పారవశ్యాన్ని, ఆవేదనను, మరణాన్ని. జీవితమా! తీసుకో నన్ను నీ ఆలింగనం లోకి అనాఛ్చాదితంగా, నిస్సంకోచంగా, రాజీ రహితంగా, విస్మృతీ రాహిత్యంగా. అన్వేషిస్తాను నేను ఉదధి ఉప్పెన వంటి నీ మహదానందాన్ని సింహ గర్జన లాంటి నీ క్రూరత్వాన్ని కబళిస్తాను అసురునిలా కలహిస్తాను మానవునిలా ఆనందిస్తాను అనంతునిలా చిందులేస్తాను చిన్నారిలా . నిన్నేమీ అర్థించను ఏదీ ఆశించను విధినుండి ఓడినా గెలిచినా బ్రతికినా మృతిచెందినా . చింపి గుడ్డల్లోనూ నేను దేవుణ్ని నేల కొరిగినా దైవాన్ని అణచబడినా అజేయున్ని హతమైనా నేను అమరున్ని . మూలం : మహర్షి అరవింద ఘోష్ , (sri Aurobindo collected poems ) స్వేఛ్ఛానువాదం : నాగరాజు రామస్వామి.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jX8rHd

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ప్రియతమా... అందుకో చెలియా... పరిమళించే ఉఛ్వాసలో ప్రయాణించే నీ విరహ కౌముది నా మదిని కోసినపుడు రాలిపడ్డ రంపప్పొట్టుని... పరిత్యజించే నిఛ్వాసలో పారిపోయే నీ వలపు కోయిల నా ఎదను మీటినపుడు ఊడిపడ్డ వెన్నెలపొడిని... అందుకే సఖియా... నేను నువ్వులేక ఖాళీగా తలచిన నీ క్షణాల్ని అనుక్షణం శిక్షించకు...అందులో నేను లేనని ! నేను నవ్వాగలేక జాలీగా గడిపిన నీ తలపుల్ని ప్రతిక్షణం బాధించకు...అందులో నువ్వున్నావని ! ఏదేమైనా ప్రియతమా... నేను కలై వస్తే మూసిన నీ రెప్పలు కదలనీయకు ! నేను అలై వస్తే వేచిన నీ కనులను మూసివేయకు !! 27-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tKdyh5

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్/ Dt. 27-5-2014 సొంత గొప్పలు మెప్పుకోసం ఎప్పుడూ వినిపించకు భావమివ్వని ఉత్త కవితలనెప్పుడూ వినిపించకు కసిని హృదిలో కుమ్మరించి మసిని మదిలో రంగరించి మొసలి లాగా కంట నీటిని ఎప్పుడూ కురిపించకు ఎదనుమీటగ చేర పిలిచినా రాగసుధలను పంచమన్నా నాదమివ్వని వీణ తీగల నెప్పుడూ సవరించకు శిధిల ఊహల జీవితాన రుధిర జ్యోతుల వెలుగులోన పెదవిపైన విషపు నవ్వుతో ఎప్పుడూ నటియించకు వింతలోకపు తీరు కల్ల అంతరాత్మయే నిజము "చల్లా" చింతలెన్నో ముసురుకున్నా ఎప్పుడూ విలపించకు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkxnqB

Posted by Katta

Sudarshan ON Screen కవిత

//kuppili sudarshan// * లోక్ సభ స్వగతం * నీకెలా పుట్టిందీ ఈ మెట్టుకి మొక్కాలనీ నిద్రిస్తున్న నా దైవత్వాన్ని మేల్కొలపాలనీ.. నేనొక మురికికూపమైపోయాక నీలో దేశభక్తి తుఫానై వొచ్చి నాకు తలంటినట్లుంది.. కాసేపహల్యాతుల్యనైనాననుకో.. నన్ను కాస్త కుదురుకోనీ ఇంకొంచెం తేరుకోనీ.. నీగురించి నాలో ఉన్న ప్రతి మట్టిపెళుసుకీ ఉద్వేగంగా చెప్పనీ.. మునుపు మసిబారిన నా ప్రజాస్వామ్యపు పడిగాపులూ తలబిరిసిన కులౌకికవాద చరిత్రలూ నన్ను ప్రశ్నించీ విసిగీ సమాధానాలు రాక లేకా, ఏ గది ఐమూలల్లోనో నా దేశ భావజాలాన్ని పాతిపెట్టీ దేశదేశాలకీ నేనొక మేడిపండు సౌధమని వర్తమానాలు పంపిస్తుంటే_ తల యెత్తి యెలా చూడగలనూ? ఏ 'పా'పాలకులను ఎంతని భరించగలనూ? మరో కుచిత్రమిది_ నిరాశతో ప్రజలంతా వాళ్ళ గుండెల్లొ వేదనలకీ- రోదనలకీ రాజ్యాంగంలో చుక్కలూ-కామాలే చిరునామాలుగా పెట్టి, నోటుకి వోటను బాటను పట్టీ_ అపుడు నేనేమయ్యానూ? నన్నేమన్నారూ? 'పిశాచ శయ్యాగారం' ! ఇంతకీ నీకెలా పుట్టిందీ ఈ మెట్టుకి మొక్కాలనీ నిద్రిస్తున్న నా దైవత్వాన్ని మేల్కొలపాలనీ..? సరే ఇపుడు నీకు శెభాషనమంటావా దేశభక్తా భారతీ గళ వక్తా.. విను విను నాలో ఉద్రేకంగా మేల్కొన్న స్వతంత్ర పూర్వపు స్వేచ్చా గాలులు ఐదేళ్ళొక లిప్త కానివ్వొద్దంటున్నాయ్. . ! 26th may ఆంధ్ర జ్యోతి వివిధలో ప్రచురితం. . 27/5/2014

by Sudarshan ON Screen



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXhp8K

Posted by Katta

Kamal Lakshman కవిత

నేటి జీవితం.... పీల్చే గాలి కల్తీ తాగే నీరు కల్తీ తినే తిండి కల్తీ మాటాడే మాటా కల్తీ చూసే చూపూ కల్తీ పలికే పలుకూ కల్తీ నవ్వే నవ్వూ కల్తీ బంధాలూ కల్తీ బంధువులూ కల్తీ ఇలా అన్నీ అన్నీ.. కల్తీ ..కల్తీ...కల్తీ...లే ఇక ప్రేమ మాత్రం కల్తీ కాకుండా ఎలా ఉంటుంది.. కల్తీ ప్రేమల మధ్య స్వచ్ఛమైన మన అనుబంధాలెంత స్వచ్చమో ....!! ఏమో..ఏమో..??? కమల్ 27.05.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SK2Hqi

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-46 ఒకరి మీద అధికారం చెలాయించడం అంటే మనిషికి ఎంత ఇష్టం... అన్ని పనుల వెనుకన్న పరమార్ధమదేనేమో... అధికారం కూడా ఆలోచిస్తే ఒక గణిత సూత్రమే... కారణం ఏమైనా కాని...మనకి లోబడినవారిని మాత్రమే మనం అధికారించగలం... ప్రతివారి దగ్గరా తుపాకి ఉండనీ ఎవరూ ఎవరితో అవసరానికి మించి వ్యవహరించరు...! ----------------------------------------- 27-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVSpNO

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

---------జాలిగామ నరసింహ రావు ___________ప్రకృతి..విలాపం__________ ఒక సాయంత్రం... నా ఇంటి పెరటిలోని...ఒక..కొమ్మ... దిగాలు పడుతూ....ఊగీసలాడుతుంది... మందలించ విసుక్కుంది... పాడు మనుషులని తిట్టిపోసింది.... ఆకలేమో అనుకుని నీరు కోసం...వెల్లా! సల...సల..మసిలే నీరు...చిందులేసింధి... ఆవిరయ్యే...నా..జీవితాన్ని నిలబెట్టలేవని...విలపించింది... ముట్టరాదని....శాసించింది..... అంతలోనే తడిలేని పొడిగాలి...నన్ను...విసిరేసింది... నల్లని దుమ్ముతో....ఆ..కొమ్మని...కప్పేసింది... కొమ్మ....గాలి...నీరు...అన్నీ కలిసి...నన్ను..చూసి...ఈసడించాయి... సిగ్గుతో అందమైన...ప్లాస్టికు...కుర్చీలో...ఠీవిగా...కూర్చుండిపోయా... కాళ్ళకు...తగిలిన...పుడమి...అగ్గితో...బుగ్గిఅవుతూ....సుర్రుమంది.. అయ్యో...పాపమని....ఆలోచిస్తూఉండిపోయా... ఆహా!ఏమి లీల.... విలపించే...ప్రకృతినిచూసి... తాండవంతో...శివుడు... ప్రేమతో....యేసు... దయతో..అల్లా..... ఉసూరుమనే...ప్రకృతిని...ఊరడించడానికేమో... కుంపటిలా...వుండే...పుడమితల్లిని...కాస్త...చల్లారుద్దమనేమో... మనుషుల...పాపం..కాస్త..కడిగేద్ధమనేమో.... ఆకాశాన్ని...ఉరికించి...మేఘాల..కరిగించి...వర్షించాడు... తడిసిన...ప్రకృతి... ముసి...ముసిగా...నవ్వుతుంది.... నేలరాలిన..పంటతో....మనిషిని...కాస్త...ముంచింది.... ఇప్పటికైనా...కొంచెం...ఆలోచిద్ధాము..... కాలుష్యపు...కళిపై..పోరాటం..చేద్ధాము... ప్రకృతి...తల్లి..కంటి..నీరు..కాస్తైన...తుడిచేధాము... //27-05-2014//

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pdOj6Q

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

---------జాలిగామ నరసింహ రావు ___________ప్రకృతి..విలాపం__________ ఒక సాయంత్రం... నా ఇంటి పెరటిలోని...ఒక..కొమ్మ... దిగాలు పడుతూ....ఊగీసలాడుతుంది... మందలించ విసుక్కుంది... పాడు మనుషులని తిట్టిపోసింది.... ఆకలేమో అనుకుని నీరు కోసం...వెల్లా! సల...సల..మసిలే నీరు...చిందులేసింధి... ఆవిరయ్యే...నా..జీవితాన్ని నిలబెట్టలేవని...విలపించింది... ముట్టరాదని....శాసించింది..... అంతలోనే తడిలేని పొడిగాలి...నన్ను...విసిరేసింది... నల్లని దుమ్ముతో....ఆ..కొమ్మని...కప్పేసింది... కొమ్మ....గాలి...నీరు...అన్నీ కలిసి...నన్ను..చూసి...ఈసడించాయి... సిగ్గుతో అందమైన...ప్లాస్టికు...కుర్చీలో...ఠీవిగా...కూర్చుండిపోయా... కాళ్ళకు...తగిలిన...పుడమి...అగ్గితో...బుగ్గిఅవుతూ....సుర్రుమంది.. అయ్యో...పాపమని....ఆలోచిస్తూఉండిపోయా... ఆహా!ఏమి లీల.... విలపించే...ప్రకృతినిచూసి... తాండవంతో...శివుడు... ప్రేమతో....యేసు... దయతో..అల్లా..... ఉసూరుమనే...ప్రకృతిని...ఊరడించడానికేమో... కుంపటిలా...వుండే...పుడమితల్లిని...కాస్త...చల్లారుద్దమనేమో... మనుషుల...పాపం..కాస్త..కడిగేద్ధమనేమో.... ఆకాశాన్ని...ఉరికించి...మేఘాల..కరిగించి...వర్షించాడు... తడిసిన...ప్రకృతి... ముసి...ముసిగా...నవ్వుతుంది.... నేలరాలిన..పంటతో....మనిషిని...కాస్త...ముంచింది.... ఇప్పటికైనా...కొంచెం...ఆలోచిద్ధాము..... కాలుష్యపు...కళిపై..పోరాటం..చేద్ధాము... ప్రకృతి...తల్లి..కంటి..నీరు..కాస్తైన...తుడిచేధాము... //27-05-2014//

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SaR2QL

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

మీరు ఏ తెలుగు ఫాంట్లను ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చా?

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wdq22S

Posted by Katta

Sanjeev Goud కవిత

SANJEEVANA TARANGALU/ కనులు మూసుకుంటే కంటి పాపలో కనిపించే నీవు.... మల్లెల సౌరభాల తొ మనసూగించే నువ్వు తీరా కండ్లు తెరఛి చుట్టూ చూస్తె లేవు!! మది లో మాటతూటాలు పేల్చి గుండె తో గుసగుసలు పల్కి మధురానుభూతుల పంచి మత్తెక్కింఛి వివశుని చేసే నువ్ నిదుర లేచి చూదును గదా!? నిశబ్దమై నువ్వు ....!!! నిశ్చేశ్టనై నేనూ ......!!! @@@@@@@""""@@@@"""@@@@@

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wdbtfL

Posted by Katta

Kapila Ramkumar కవిత

కవి మిత్రులకు విన్నపము: ఈ క్రింది సూచనలను మరొక సారి గమనించి, కవి సంగమానికి సహకరించంచగోర్తాము ఈ గ్రూపు లో ~ 1. కవితలకు ఫోటోలు పెట్టవద్దు.[సీనరీలు గట్రా] 2. ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యాలి. 3. ఇతర పత్రికలలో, అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన మీ కవితల,కవితావ్యాసాల 'లింక్స్'ను సరాసరి ఇక్కడ పోస్ట్ చెయ్యవద్దు. ఆ రచనను టైపు చేసి కానీ ,కాపీ,పేస్ట్ చెయ్యడం ద్వారాగానీ పోస్ట్ చేస్తూ క్రింద బ్రాకెట్ లో సదరు పత్రిక యొక్క పేరును రాయండి.[అలా లేని పక్షంలో అటువంటి పోస్టింగును పోస్ట్తె చేసినవారికి తెలుపకుండానే తొలగించడం జరుగుతుంది] 4. కవిత్వానికి సంబంధించని పోస్టింగులు వెంటనే తొలగించబడతాయి. 5. కవితాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేవారిని, 'కవిసంగమం' గ్రూపు సమగ్రతకు భంగం కల్గించేవారిని వారికి తెలపకుండానే తొలగించడం జరుగుతుంది.ఈ విషయంలో 'అడ్మిన్'లు ఎవరికీ జవాబుదారీగా ఉండనవసరం లేదు. 6. కవిత కింద కేవలం లైక్ కొట్టిన వారికీ,కామెంటు రాసినవారికి -ఒక్కొక్కరికి ఒక 'థ్యాంక్స్' చెప్పడానికి మాత్రమే పరిమితం కాకుండా,అవసరమైన చోట్ల ఆ కామెంటుకు వివరణ కానీ,ఇంకాస్త కవితకు సంబందించిన విషయం కానీ చెప్పదలుచుకున్నప్పుడు రాయడం బాగుంటుంది. 7.కవితలలోని అంశాలకు, కామెంట్ల లోని విషయాలకు పోస్ట్ చేసినవారే బాధ్యులు. వాటితో 'అడ్మిన్'లు గానీ,'కవిసంగమం' గ్రూపుకానీ ఏకీభవించారని అనుకోవసరం లేదు. ..... Note 1 ~ ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యండి. ఒకటికన్నా ఎక్కువ కవితలు పోస్ట్ చేసినచో ఆ పోస్ట్ తొలగించడం జరుగుతుంది. NOTE : 2 ~ కవిత పోస్ట్ చేసేటప్పుడు-కవితా శీర్శిక తప్పక పెట్టండి. [*ఉదా: కవి పేరు | కవితా శీర్షిక ] అలాగే కవిత క్రింద తేదీ తప్పక వెయ్యండి.[*ఉదా: తేది -నెల-సంవత్సరం] మిత్రులారా! సహకవులు రాసిన కవితలపై మీ స్పందనలు రాయండి.ప్రోత్సహించండి. మంచి 'కవితా'వరణం సృష్టించండి !! 27.5.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oCWB61

Posted by Katta

Rajeswararao Konda కవిత

ప్రేమ విఫలమై - మనసు కకా వికలమై @ రాజేష్ @ 27/05/14

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oCTNpo

Posted by Katta

Hari Chandan Kumar కవిత

EE CHETTULO OKA KOMMA PY VAALENDUKU AVAKAASAAM ICHCHINANDUKU KUVAKUVALA TO EE CHITTI PITTA CHEPTONDI DHANYAVAADAALU

by Hari Chandan Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Sahc63

Posted by Katta

Chennapragada Vns Sarma కవిత

నీ ఆటకట్టిస్తాలే_నువ్వెన్ని ఎత్తులేసినా ..@శర్మ \27.5.14\

by Chennapragada Vns Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tInTdf

Posted by Katta

Rajeswararao Konda కవిత

నేనే.. వయ్యారం - నా కెందుకయ్యా ఇంకా ఈ మల్లెల భారం @ రాజేష్ @ 27/05/14

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tInUxM

Posted by Katta

Rajender Kalluri కవిత

# నా పరిచయం ఒక జ్ఞ్యాపకం # తెలియని ఒక పరిచయం ఏర్పరిచే దారే " స్నేహం " ఆ దారిలో తెలీకుండానే ప్రయానిస్తుంటాం ఆ ప్రయాణం లో కొన్ని ఆశలు , ఆశయాలు , వాటితో ఏర్పడే స్నేహాలు . వాటి వెనకాల దాగుండే చిన్న స్వార్ధాలు అర్ధం లేని అలకలు అవకాశం కోసం ఎదురుచూసే అవకాశవాదులు ఆవేశాలని రగిలించే మధ్యవర్తుల మాటలు ఒక రోజు గాలివానలా ఎగసే గొడవలు వాటికి - వాళ్లకి మధ్య అహంభావాలు మాటలు లేని కొన్నికాలాలు మాట్లాడాలని ఉన్నా- మనసుకు ఎదురుపడే కొన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలకు దొరకని సమాధానాలు ఎదో వివరణ ఇవ్వాలని చేసే ప్రయత్నాలు తెలుసుకోలేని కొన్ని వాస్తవాలు , ఏ స్నేహం కోరదు సంజాయిషులు అలా ముగిసే ద్వేషాలు , ఒక్కటయినా క్షణాలు , అవి రాల్చే కన్నీరు తెలియజేసే ఆనందాలు... కోట్లు పెట్టినా కోనుక్కోలేని కొన్ని గ్న్యాపకాలు కొన్నాలకు ఎదురుపడితే :) kAlluRi [ 27 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mwe1jO

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నల్ల అద్దం ___________ ఎక్కడికో విసిరివేయబడతాను కొన్నిసార్లు నాకు నేనె దూరంగా అప్పుడక్కడ విరిగిపడిన శిలాశఖలాలలు కళ్ళ అంచులతో ఏరుకుంటాను వాకిలి ముందు నేలపగుళ్ళపై జల్లిన కళ్ళాపి లేపనంలా మది గుహలన్నీ పచ్చిగానే నానుతూంటాయి అంతరంగ వైశాల్యాన్నీ కొలిచే కొత్త బావుటాలకు లోలోపలే చేదవేస్తూ పాకుడు గోడలపై గొంగళిపురుగులా మరో వేట నాలో రంగులద్దుకున్న ఎండు వారధులు వాటి పునాదుల మధ్యగా మళ్ళీ నేనె చిట్లిన ఉప్పు నీటికి అతుకులేస్తూ కలల సాంద్రతను వడగొడుతూ ఇంకో అన్వేషణ ఇనుప గడియారంలో నిర్లిప్త శత్రువులు నా ఆప్తులు మరికొన్ని అణువులు పేర్చుకోవాలి తెగిపడకుండా ఇక్కడి నేలంతా ఎన్నిసార్లు నన్ను రాసిందో విరిగిన ప్రతిసారీ కొంత సాంత్వన ముసురు దుప్పట్లన తడిసిన చంద్రుడి సాలేగూటిలా నన్నెవరో పోగేయ్యాలి మళ్ళా లోతునుండి బయటికొచ్చాక తిలక్ బొమ్మరాజు 09.05.14 27.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tI6Isu

Posted by Katta

Panasakarla Prakash కవిత

"దిక్కులు చూస్తారే౦" బహుళ అ౦తస్తుల భవనాల నెత్తిమీద పెట్టిన కిరీటమై మెరిసిపోతున్నాడు సూరీడు... అదే తూరుపు కాబోలు కొత్తగా వచ్చిన వారికి దిక్కులేని పట్టణ౦లో ఏ దిక్కు ఎటు౦దో.. తెలుసుకోవడ౦ కష్టమే... ఇప్పటికీ పాతవారినడిగితే.. దిక్కు తెలియక‌ దిక్కులు చూస్తూనే ఉ౦టారు. అ‍‍‍‍౦తేనా..! జన్మ నిచ్చిన తల్లిద౦డ్రులను వృద్ధాప్య౦లో చూసే దిక్కు లేదు మన పక్కనే నివసిస్తున్నదెవరో ఎవ్వరికీ తెలిసే దిక్కులేదు మనిషి లోపల ఏ మాయు౦దో తెలిసే దిక్కు అస్సలు కానరాదు అ౦దుకే మనకు దిక్కులను పట్టి౦చుకునే అవసర౦ ఇప్పుడు లేదు దిక్కు లేనివార౦దరికీ ఆ తూరుపే దిక్కు వెలుగునిచ్చి ము౦దుకు నడవమ౦టు౦ది...... పనసకర్ల 27/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oCjoyK

Posted by Katta

Kapila Ramkumar కవిత

కవిత్వమై గెలిచిన తెలంగాణ తెలంగాణ మలి దశ ఉద్యమంలో కవులు నిర్వహించిన పాత్ర మరువలేనిది. సాహిత్య పేజీల్లో నిరంతరం కవిత్వం ఊట లాగా వెలువడుతూనే ఉండింది. వేలాది కవితలు, వందలాది సంపుటులు, పదుల సంకలనాలు వెలుగు చూశాయి. ఎన్నో సంస్థలు ఏర్పడి మొదలు కవిత్వం ద్వారానే తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరిచాయి. ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చి నప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యమమైనా మొదట కవిత్వంలో వ్యక్తమవుతుంటుంది. భావ కవి త్వం, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళిత, ముస్లిం, తెలంగాణ కవిత్వా లు ఆయా ఉద్యమాల్లో తొలి దశలో తమ వంతు పాత్ర నిర్వర్తించాయి. మిగతా ఉద్యమాల కన్నా తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమంతో మమేకమై చివరికి తమ ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో కార్యరూపం దాల్చడంతో సఫలీకృతమైంది. తెలుగు సాహిత్యం పేరు మీద తెలంగాణ సాహిత్యానికి అన్యాయం జరిగింద ని, వివక్షకు గురైందని స్పృహలోకి వచ్చిన తెలంగాణ కవులు ఎన్నో ప్రశ్నలు సం« దిస్తూ కవిత్వం రాయడం వరకే పరిమితం కాకుండా కార్యాచరణలోకి దిగారు. తమ భాష, సంస్కృతి వేరని ఎలుగెత్తి చాటారు. ఉద్యమానికి ఊతమయ్యారు. 1969 ఉద్యమం సందర్భంలో భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనదే పైచేయి అయింది. కాని మలిదశ ఉద్యమంలో తెలంగాణ కవులు, కళాకారులు కవిత్వం ద్వారా పాట ద్వారా అనేక పుస్తకాల ద్వారా భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనను పూర్వపక్షం చేసి సీమాం«ద్రులపై పైచేయి సాధించగలిగారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎందరో కవులు నిలిచి వెలిగితే, మరెందరో పుట్టుకొచ్చారు. కాళోజీ లాంటివారు మొదట్లో సమైక్యవాది అయినప్పటికీ త్వరలోనే ఆయన తెలంగాణ వాదిగా మారి, 'ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం/ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం' అనేంత తీవ్ర స్థాయిలో కవిత్వం రాశారు. 1995 నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం రాజుకుంది. 1998లో తెలంగాణ కవులు, సాహిత్యకారులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, కె.శ్రీనివాస్, అంబటి సురేంద్రరాజు, కాసుల ప్రతాపరెడ్డి తదితర ముఖ్యులు కూడి తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పర్చుకున్నారు. ఐదుగురు కన్వీనర్లుగా- సురేంద్రరాజు, సుంకిరెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, అనిశెట్టి రజిత, స్కైబాబ ఎంపికయ్యారు. ఎన్నో కవిసమ్మేళనాలు, సదస్సులు జరిగాయి. ఈ సంస్థ తరఫునే సురేంద్ర రాజు, సుంకిరెడ్డి సంపాదకత్వంలో 'మత్తడి' (2002 డిసెంబర్) అన్న బృహత్ కవితా సంకలనం వెలువడింది. ఇందులో 1917 నుంచి 1952 వరకు ఒక విభాగం, 1952 నుంచి 1998 వర కు రెండవ విభాగం, 1995 నుంచి 2002 వరకు మూడవ విభాగంగా విభజించి మొత్తంగా 258 మంది కవిత్వాన్ని సంకలనం చేశారు. 2002 నాటికి తెలంగాణలో పేరుబడ్డ కవులందరూ ఇందులో ఉన్నారనే చెప్పవచ్చు. 'మత్తడి' రూపుదిద్దుకుంటున్న సమయంలోనే జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వం లో 'పొక్కిలి' (2002 మే) సంకలనం వెలువడింది. 129 మంది కవిత్వం ఇందులో చోటుచేసుకుంది. అప్పటికే లబ్దప్రతిష్ఠులైన సిధారెడ్డి, సుంకిరెడ్డి, జూకంటి జగన్నాధం, ఎస్.జగన్‌రెడ్డి, అఫ్సర్, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, జూలూరి గౌరీశంకర్, అమ్మంగి వేణుగోపాల్, ఆశారాజు, నాళేశ్వరం శంకరం, షాజహానా, అన్నవరం దేవేందర్, అన్వర్, స్కైబాబ, పొట్లపల్లి శ్రీనివాసరావు, వఝల శివకుమార్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కోడూరి విజయకుమార్ తదితరులు తెలంగాణ కవిత్వం రాశారు. గద్దర్, గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న తదితర వందలాది మంది వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమంలో పాటల రూపంలో కవిత్వాన్ని పండించారు. వేముల ఎల్లయ్య, ఎం.వెంకట్, సీతారాం, ప్రసేన్, యాకూబ్, అయిల సైదాచారి, పగడాల నాగేందర్, అంబటి వెంకన్న, బెల్లి యాదయ్య తదితరులు ఎంతోమంది రాసిన కవిత్వం తెలంగాణ కవిత్వానికి అదనపు సౌందర్యాన్ని, వస్తు విస్తృతిని అందించింది. రెండేళ్ల తర్వాత సిధారెడ్డి ఆధ్వర్యంలో ఆయనే అధ్యక్షుడుగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. తెరవే అన్ని జిల్లాలకు విస్తరించడమే కాకుండా ఎందరో కొత్త కవులకు ఊతమందించింది. 'సోయి' అనే పత్రికను వెలువరించింది. అనేక సభలు సమావేశాల ద్వారా ఉద్యమ కవిత్వం విరివిగా పుట్టుకొచ్చేలా కృషి చేసింది. 2007లో జూకంటి జగన్నాధం, జూలూరి గౌరీశంకర్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై ఈ సంస్థ మరెన్నో కార్యక్రమాలు తీసుకుంది. 2012లో ఈ సంస్థకు సూరేపల్లి సుజాత కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2006లో సుంకిరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, పసునూరి రవీందర్ తదితరుల పూనికతో 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం ఏర్పడి ఎన్నో సదస్సులు, సభలు నిర్వహించడంతోపాటు కొన్ని విశిష్టమైన సంకలనాలు వెలువరించింది. '1969-73 తెలంగాణ ఉద్యమ కవితా' సంకలనం కూడా ఈ సంస్థ వెలువరించింది. 2009లో 'జాగో..జగావో' పేర ప్రొ.జయశంకర్ ప్రారంభోపన్యాసంతో ఒక రోజంతా జరిగిన కవిసమ్మేళనంలో వచ్చిన కవితలకు మరిన్ని పాటలు జోడించి 'జాగో..జగావో' తెలంగాణ ఉద్యమ కవిత్వం పేర 120 మందికి పైగా కవులతో సంకలనం వెలువడి మలి ముద్రణ కూడా పొందింది. కెసిఆర్ నిరాహారదీక్ష తర్వాత నడిచిన ఉద్యమంలో ఈ సంకలనంలోని పాటలు, కవితలు విద్యార్థులకు, ఉద్యమకారులకు ఎంతో తోడ్పడ్డాయి. టాంక్‌బండ్‌పై విగ్రహాల కూల్చివేత సందర్భంలో 'దిమ్మిస' వినిర్మాణ కవిత్వం పేర 51 మందితో ఒక సంకలనం వెలువడడం విశేషం. ఈ సంకలనం వల్ల కూల్చివేత పట్ల ఎక్కువ వ్యతిరేకత రాకుండా తెలంగాణ కవులు చేయగలిగారు. శ్రీకృష్ణకమిటీ రిపోర్టు వెలువడిన వెంటనే ఆగ్రహోదగ్రులైన కవులు 31 మంది దాకా కలిసి తీసుకొచ్చిన 'క్విట్ తెలంగాణ' సంకలనంలోని కవితలు వివాదాస్పదమవడం తెలిసిందే. తెలం గాణ వ్యతిరేకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ కవులను మొత్తం ఆంధ్రా ప్రాంతంవారి వ్యతిరేకులుగా చిత్రించే ప్రయత్నం జరిగింది. అనంతరం 'మునుం' పేర 256 మంది కవులతో మరో సంకలనం వేముగంటి మురళీకృష్ణ, వఝల శివకుమార్, అందెశ్రీ, కాంచనపల్లి, దాసరాజు రామారావు తీసుకొచ్చారు. అయితే ఈ సంకలనంలో తెలంగాణేతరులు రాసిన కవిత్వం కూడా చేర్చడం పలు విమర్శలకు దారితీసింది. తర్వాత అనిశెట్టి రజిత పూనికతో 100 మందికి పైగా కవులతో 'జిగర్' సంకలనం వెలువడింది. డా.ఖుతుబ్ సర్‌షార్, స్కైబాబ సంపాదకత్వంలో 'రజ్మియా' తెలుగు-ఉర్దూ సంకలనం (36 మంది తెలుగు ముస్లిం కవులు, 31 మంది ఉర్దూ కవులు) వెలువడింది. తెలంగాణ జాతిపిత జయశంకర్ చనిపోయిన సందర్భంలో జూలూరు సంపదకత్వంలో 'జయశంకరా', వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో 'జయశిఖరం' కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఇవే కాక వివిధ జిల్లాల నుంచి ఎన్నో సంస్థలు ఎందరెందరో కవులతో సంకలనాలు వెలువరించాయి. కొన్ని జిల్లాల కవులతో ప్రత్యేకమైన సంకలనాలు కూడా వెలువడ్డాయి. ప్రత్యేక సంచికల్లోనూ కవిత్వం విరివిగా చోటుచేసుకుంది. రెండు సంచికలుగా వెలువడిన 'ముల్కి' పత్రికలోనూ, మరెన్నో ఛోటా మోటా పత్రికల్లోనూ తెలంగాణ కవిత్వమెంతో అచ్చయింది. అన్వర్, సుంకర రమేష్, అన్నవరం దేవేందర్ లాంటివారు పత్రికల్లో అచ్చయిన కవిత్వాన్ని సంకలనాలుగా వెలువరించారు. అఖిల భారత తెలంగాణ రచయి తల వేదిక ఇతర రాష్ట్రాలలోని కవులను కూడా ఉద్యమంలో భాగం చేసింది. మొత్తంగా తెలంగాణ కవుల్లో తెలంగాణ కోరుకోని కవి ఒక్కరూ మిగలలేదంటే, తెలంగాణపై ఒక్క కవిత కూడా రాయని కవి మిగల్లేదంటే అతిశయోక్తి కాదేమో! ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చినప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో భాగంగా వివిధ సందర్భాల్లోనూ విభిన్నంగా, విరివిగా కవిత్వం వచ్చింది. 'తెలంగాణ ఎప్పుడు? ఎట్లా?' 'ఇప్పుడేం చేద్దాం', 'తెలంగాణ కవుల గర్జన', 'విద్రోహదినం', 'యుద్ధభేరి', 'సిర్ఫ్ తెలంగాణ' అంటూ పూట పూటంతా, రోజు రోజంతా కవిసమ్మేళనాలతో ఉద్యమం ఉర్రూతలూగింది. ఆత్మహత్యలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఇలా ఎన్నో సందర్భాలు పోరాట రూపాలై కవిత్వం పలికాయి. తెలంగాణ ఉద్యమం పలికించిన వివిధ రూపాలు- దూలా, బతకమ్మ, బోనాలు, రాస్తారోకోలు, రహదారుల బంద్, రోడ్లమీద వంటావార్పు-సామూహిక భోజనాలు లాంటివన్నీ కవిత్వంలోనూ ప్రతీకలయ్యాయి. సబ్బండ వర్ణాల వృత్తులన్నీ ఉద్యమంలో నిరసన రూపాలవడం, ప్రతీకలవడం విశేషం. ఇట్లా ఒక ఉద్యమం ఇన్నేసి రకాల కవిత్వాన్ని అందివ్వడం అరుదేనేమో! అయినప్పటికీ అవన్నీ ఉద్యమానికి ఊతమందించాయనడంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పడుతున్నది కాబట్టి ఇక ముందు తెలంగాణ కవులు రాశి కన్నా వాసి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. మరింత బలమైన, లోతైన భావంతో, విభిన్న కోణాల నుంచి కవిత్వాన్ని అందించాల్సి ఉంది. తెలంగాణ కవిత్వం మరింత విస్తృతి పెంచుకోవాల్సి ఉంది. -స్కైబాబ

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nrO9qt

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• తెలవార్లు •• ఉదయాలు పక్షుల అరుపులై నా కనుల అంచుపై- గడ్డిలో మొలిచిన ఎర్రపురుగు సూర్యుడు- ఆకాశం నాలో ఈరోజుకి ఏ రంగు పూయునో, నంగనాచి-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1raWtiw

Posted by Katta

Rajaram Thumucharla కవిత

కవి సంగమం చదివిన కవిత్వ సంపుటి – 30 కవిత్వ సంపుటి పేరు : " రాతి చిగుళ్ళు " రాసిన కవయిత్రి పేరు : " శైలజామిత్ర" పరిచయం చేస్తున్నది : "రాజారామ్.టి " "సౌందర్యాత్మకతకు అద్దం శైలజా మిత్ర కవిత్వం " ఎప్పుడో సరిగ్గా గుర్తు లేదు కానీ వొక పుస్తకావిష్కరణ సభలో అనంతపురంలో వొక కొత్త స్వరం జ్వలించే జీరతో భాస్వరమై ఆవేశంతో మండటం విన్నాను.ఎవరా అని వాకబు చేస్తే ఆ స్వరం శైలజామిత్రాదని ఇపుడిపుడే చిగురిస్తున్న కవిత్వపు "రాతిచిగుళ్ళు" అని చెప్పారు.ఆ రోజు కనిపించి వినిపించిన శైలజా మిత్ర కవితా స్వరం వేరు. ఈ రోజు పదునెక్కి, వగరెక్కిన ఆ స్వరం కఠిన రాతి చిగుళ్ళు సైతం సౌందర్యాత్మకతతో చిగురించి వికసించునట్లు కవిత్వం చేసింది. "నిజం చెబుతున్నాను” అంటూ. కవిత్వంతో " ఏ బొమ్మ గీసినా" "నన్ను నన్నుగా"గుర్తించమనే శైలజా "నేను నేను గానే" వుంటానని చెబుతూ "మహానగరపు నీడలలో" జీవించినా "స్త్రీ ఏకాక్షరం కాదు"-అనే "ఒకానొక స్వప్నం " నిజం చేసుకొన్న కవయిత్రి. "తప్పదు...! మనం మళ్ళీ జన్మించాలి...! కష్టాలను కనికరించి,దుఃఖాన్ని దూరం చేసి పతనంతో పోరాడి,మరణంతో మారాం చేసి తప్పదు... మనం మళ్ళీ జన్మించాలి"-అని అందర్నీ కోరుతున్న కవయిత్రి శైలజా మిత్రా. "అదే భూమి...అదే ఆకాశం అదే గాలి,అదే నీరు, అదే వెలుగు,చీకటి"- అయినా మనం మళ్ళీ ఎందుకు జన్మించాలి అనే ప్రశ్నకు సమాధానంగా "చెట్టు కొమ్మపై ఒదిగి కూర్చున్న పిచ్చుక కోసం అప్పుడే పుట్టి గంతులేసే లేగదూడ కోసం... రా రమ్మని పిలిచే సముద్రపు అలల కోసం ఒంటరైన చందమామ కోసం వసంత ఋతువు కోసం ... మళ్ళీ మళ్ళీ జన్మించాలనే కోరికను గాఢంగా వ్యక్తపరుస్తున్న కవయిత్రి శైలజా మిత్ర. "మృత్యువంటే శరీరానికి సంబంధించిది కాదు మనసు ముక్కలయినపుడే మృత్యువు మనల్ని చేరినట్లే శ్మశానమంటే నిశ్శభ్డాన్ని అలుముకున్నది కాదు ఎవరూ లేరని తెలిసినపుడే శ్మశానంలో మనం వున్నట్లే"- ఇలా మరణం శరీరానికి కాదు మనసుకు అది ముక్కలయినప్పుడు , మనం అనుకున్న వారు లేకపోవడమే శ్మశానంలో వున్నట్టు వుంటుందనే ఒక చింతనను కల్గిస్తున్న కవయిత్రి శైలజామిత్ర గారే. గువ్వ ఎగరకుండా వుండదని, కొమ్మ ఎదగకుండ వుండదని, సూర్య బింబం బయటకు రాకుండా వుండదని జరిగేవి ఏదో జరుగుతుందన్న భయంతో ఆగవని కాల స్వభావాన్ని,ప్రకృతి ధర్మాన్ని ఈ మాటల్లో ఇలా తెలియబరుస్తున్న కవయిత్రి శైలజా మిత్ర గారే. "వేటగాడు పొంచి వుంటాడని గూటిలో గువ్వ దాక్కోదు ఎప్పుడో ఒకప్పుడు గొడ్డలివేటు పడుతుందని కొమ్మ ఎదగటం ఆపదు రహస్యాలన్నీ బయటపడుతాయని సూర్యబింబం సముద్రంలో దాక్కోదు" వ్యవస్థలో కవి తాను అనుభవిస్తున్న వొంటరితనం, యంత్ర నాగరికతా విషపు కోరల మధ్య ఇరుక్కొని పడుతున్న వేదన, పొందుతున్న దుఃఖం, నలుగురిలో తన గుర్తింపు కోసం పడే తపన,చివరికీ తనను తాను కోల్పోతున్న బాధ ఇవ్వన్నీ చివరికి అతన్ని లేదా ఆమెను అస్థిత్వపు వెదుకులాలోకి నెట్టివేస్తాయి.అట్లాంటి సందర్భంలో వీటన్నిటిని కవిత్వం చేయాల్సివచ్చినప్పుడు ఎంతో మథనానికీ గురవుతుంటారు.ఇట్లాంటి మథనం కవయిత్రి శైలజామిత్ర లో కూడా గుర్తించవచ్చు.ఇందులో ఈవిడ అనేక కవితల్లో సామాజిక అస్థిత్వాన్ని , వైయుక్తిక అస్థిత్వాన్ని సాంద్రతరంగా చిక్కదనంతో ఆవిష్కరించారు. "నేను నా హృదయ పాత్రను విస్మరించలేను నన్ను భరిస్తున్న భరతమాత పరిష్వంగాన్ని పరిత్యజించలేను హిమశిలా శ్రేణులపై చరిస్తున్న నేను వేరెవరికోసమో బతుకలేను మాసిన మనసులు తిరిగే ప్రపంచంలో నా నీడను కూడా భరించలేను మెడపై పడుతున్న కత్తి వేటుకు భయపడి తల వంచుకొని మౌనంగా నడువలేను ప్రేమ చినుకులకు చేతులు అడ్డుపెట్టగలనేమో కానీ పూర్వ స్మృతుల్ని మర చిపోలేను" గుండెతో పాటు శరీరం కూడా ఈ ప్రపంచం కోసమేనని తప్పించుకోలేనంటూ కవయిత్రి తన అస్థిత్వం ఎందుకోసమో చెబుతారు. అద్దంలో ముఖం మసకబారుతుందని అయిన తన ముఖాన్ని మార్చుకోలేనని కవయిత్రి తన అస్థిత్వాన్ని చాటి చెప్పుకొంటుంది. "విస్మరిస్తున్న హృదయ పాత్ర "-అనే ఈ కవిత ఎత్తుగడ తిలక్ "ఆర్తగీతం" ఎత్తుగడలా మనకు అనిపిస్తుంది. తిలక్ "నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ అదేశాన్ని మన్నించలేను ఈ విపంచికకు శృతి కలుపులేను "-అని ఆరంభిస్తే శైలజామిత్ర " నేను నా హృదయ పాత్రను విస్మరించలేను నన్ను భరిస్తున్న భరతమాత పరిష్వంగాన్ని పరిత్యజించలేను "-అని ఆరంభించింది. అంత మాత్రాన తిలక్ ని శైలజామిత్ర అనుసరించదని చెప్పను. తిలక్ తన గుండె గూడు పట్లు కదిలిన సన్నివేశాలని కనులు వరదలై పారునట్లు చిత్రిస్తే ఈ కవయిత్రి జీవితంలోని కరువు , అవేదనని కాచివడబోసి ఏదో కావాలన్న తపనను బాధ్యతను మరచిపోలేనంటూ చిత్రించింది.తిలక్ లోని అనుభూతి ఛాయల్ని శైలజామిత్ర తన కవిత్వంలో ప్రతిబింబించిందని చెప్పడానికే ఈ పోలికను చెప్పాను. "ఒక్క రోజయినా నా ఉనికి ఊహాచిత్రాన్ని"చిత్రించు కొంటూ బతుకంతా బతనిస్తున్న ఈ కొద్ది కాలాన్ని తనవి దీరా కళ్ళకద్దు కోవాలనుకొనే ఈ కవయిత్రి వొకింత విరామ చిహ్నంతో తనను తాను తరచి చూసుకుంటానని చెబుతుంది. .వైయుక్తిక అస్తిత్వపు వెతుకులాట ఈ కవయిత్రిలో ఒంటరితనపు రూపంలో ధ్వనిస్తుంది."ఒంటరి తనం మరింత ఒంటరిగా భరించలేనంత బరువెక్కినప్పుడు "తన భావాలు పరుగులు తీస్తాయని"-అంటున్న పాదాల్లో ఏకాకితనపు దిగులు,ఆత్మీయ సాహచర్యం కోసం పడే తపన "విరామ చిహ్నం"-కవితలో చిక్కనిదనం మేళవించి అనుభూతి సాంద్రతతో చిత్రిస్తుంది. ప్రపంచ ప్రభావం కవయిత్రి మీద పడిందో లేక కవయిత్రి ప్రభావం ప్రపంచం మీద పడిందో తెలీదని శైలజమిత్ర చెబుతూ "ప్రపంచం నా కళ్ళల్లో కొలను అయ్యింది / నేను ఆకొలనులో కలువగా మారాను /ఎవర్ని ఎవరు అల్లుకపోయారో"-అని సంశయం వ్యక్తం చేస్తుంది. తనదైన ప్రపంచాన్ని,తాను ఆ ప్రపంచాన్ని తాను ఎట్లా అర్థం చేసుకుందో 'నేను నా ప్రపంచం"-అనే కవితలో కవయిత్రి ఇలా అంటుంది. "ప్రపంచం పసిపిల్లలాంటిది దరికి చేర్చుకుంటే ఒదిగి పోతుంది తరిమి కొడితే అందకుండా పారిపోతుంది ప్రాణాన్ని ప్రాణంలా ప్రేమను అచ్చమైన ప్రేమలా చూపే ప్రపంచం ఒక వస్తువు కాదు కనిపించకుండా పోవడానికి ద్రవపదార్థం కాదు ఒలికిపోవడానికి ప్రపంచం ఒక గ్రంధం అందులో ప్రతి ఒక్కరూ ఒక గీతా సారాంశం" తన అవగాహనలో ప్రపంచం లోని ప్రతిఒక్కరూ ఒక గీతా సారాంశం అని అనటంలో తాత్వికతను అద్ద్తారు కవిత్వానికి ఈ కవయిత్రి. ఏదయిన వొక ఙ్ఞాపకం మన మనసుల్ని గాయపరుస్తే ఆ ఙ్ఞాపకాన్ని మరువలేకపోయినా అలాంటి దాన్ని ముందుగా గుర్తుకు తెచ్చుకుండే దానిగా ఎప్పుడూ భావించం. కానీ ఈ కవయిత్రి చాల చిత్రంగా ఎంతో గాఢంగా గాయపరిచిన ఙ్ఞాపకాన్ని గూర్చి ఇలా అంటుంది. "ఎప్పుడో గాయపరిచి సరాసరి గుండెలోకి దూసుక పోయిన బాణం ఇప్పటికీ ఙ్ఞాపకాల ముందు వరుసలో ఉంది మానవీయ ప్రదర్శన అక్కడే! నా గుర్తుగా ఉండనీయండి! శరీరం వెదురు బద్దై ఆయుధంగా రూపొందడానికీ కారణం "ఙ్ఞానం మనిషిని శిలగానో,చీకటిగానో మార్చటం”- అని శైలజా మిత్ర చెబుతూ గాజు చెట్లతో నిండిన మానవారణ్యం లోని ఒక చరిత్రని గుర్తుకుతెస్తుంది. ఒంటరి తనం తమ చుట్టు పరుచుకున్న కవులు,అస్తిత్వపు వెతుకులాటలో నిమగ్నమయిన కవులు సాధారణంగా తమ కవితల్లో తాత్విక భావాల్ని వొంపుతుంటారు.మరణం గురించో, జననం గురించో ఆ కవులు తమదైన తాత్విక వ్యాఖ్యానాన్ని కవిత్వం చేస్తుంటారు.ఈ కవయిత్రి జీవితం అనే బండను మోస్తున్న మట్టి నుండి వచ్చిన మనిషిని ఇలా వ్యాఖ్యానించింది. "ఏళ్ళ తరం మోస్తున్న బండను మట్టి మనిషి ఇంత వరకు దించనే లేదు ఇదేదో శిక్ష అనుకొని కొందరు సర్కస్ అనుకొని కొందరు బతికేస్తున్నారు కాళ్ళు చక్రాలై, చేతు భిక్షాపాత్రలై ఏ గమ్యానికి చేరుతారో కానీ అదో వలయం అంతే" మనిషి జీవితానికీ గమ్యం తెలీదంటూ ఆ వలయం ఎక్కడ ప్రారంభం అవుతుందో చివరికీ మళ్ళి అక్కడికే చేరుకుంటుందనే తాత్విక భావాన్ని వ్యక్తీకరిస్తుంది ఈ కవయిత్రి. ఎవరికైనా పక్షపాతం చూపించే తత్వం వుండవచ్చునేమో కానీ మట్టికి వుండదని ఇలా అంటుంది. "మట్టి మమకారంతో కూడిన తల్లి లాంటిది! అందుకే అందర్ని సమానంగా తనలో దాచుకుంటుంది..! జీవిత సత్యాలను బోధ చేస్తుంది..!" బతుకు అతుకుల బొంతయినపుడు నిసించే ఇల్లు ఒక శ్మశానం నిద్ర రాక కనురెప్పలు బరువయినప్పుడు పవళించే పరుపు ఒక సమాధి! అని, నిజం చెబుతున్నానని తగిలిచోటే దెబ్బ తగులుతుందనే వాస్తవాన్ని పేర్కొంటూ,ఒకసారి పగిలిన గుండె చిట్లిపోతూనే ఉంటుంది అతకడం అతికించడం ఒక బూటకమనే యథార్థాన్ని చెబుతూ..చిరాఖరికీ అస్తిత్వానికీ మిగిలేది బూడిదేననే నిరాశను "నిజం చెబుతున్నాను..!"-అనే కవితలో భారంతో పలుకుతుంది. అనేకులు అనేక విధాలుగా అమ్మను తమ కవిత్వంలో ఆవిష్కరిస్తుంటారు.ఈ కవయిత్రి కూడా "మాతృత్వం మృగ్యమౌతుందా"-అనే కవితలో అమ్మలో దాగివున్న ఆవేదనను ,వాత్సల్యం కోసం అలమటించే అమ్మను రూపు కట్టించింది. "ఎక్కడైనా అమ్మ జన్మ గాయాల గేయమే ఎపుడైనా పలకలేని ప్రశ్నల ప్రతిబింబమే వివేకానికందని చక్రగతిలో ఎంత తీవ్రత వున్నా అమ్మ అవతారమే తప్ప ఆయుధం కాదు ఆదర్శం తప్ప అఙ్ఞానం కాదు బిడ్డ వేళ్ళు తాకితే మౌనంగా రేకులు రాల్చే గులాబి" లాంటి అమ్మ సంతానం వీధిలోకి విసిరేస్తున్న రాఇలా నిశ్చలంగా వుండటమే కాదు మాత్ర్త్వాన్ని బతికిస్తుందని ఒక చక్కని భావాన్ని కవిత్వం చేసింది శైలజామిత్ర. కవిత్వానుభూతిని కలిగించే మంచి కవితల్లో "ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు !"-అనే కవిత ఈ కవయిత్రి ప్రతిభా సామర్థ్యాన్ని మనకు అద్దం చేసి చూపెడుతుంది.రోజు అంటే,మనిషి అంటే ఏమిటో ,ఎవరో ఒకనిర్వచనమిచ్చి తన నాన్న చెప్పిన అంశాలుగా పేర్కొంటూ,ఆయన నిత్యం చెప్పినవి ఒక్కొక్కటి గుర్తుకొచ్చి ఆయన ఇపుడిపుడే అర్థం అవుతున్నాడని కవయిత్రి మంచి శిల్పంతో ఇలా చిత్రించింది. "నాన్నా! సగానికి పైగా జీవితం గడిచాక ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు ఉదయం,మధ్యాహ్నం,రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుందని స్వార్ఠం,అసూయ,కపటం,అబద్ధం కలగలిపితేనే నేడొక మనిషని నిత్యం నువ్వు చెప్పినవి ఒక్కోక్కటి గుర్తొచ్చి ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు" అమ్మకి కొడుకు పైనా,తండ్రికీ కూతురి పైన ఎక్కువ ప్రేమ వుంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటూవుంటారు.అందుకు గల కారణాలను యూంగ్,అడ్లర్ లాంటి వాళ్ళు విశ్లేషించి చెప్పారు.ఈ కవయిత్రి కూడా అట్లాంటి భావాన్నే ఈ కవితలో పొదిగినట్టుంది. "ఈ జీవితానికీ ఎందుకో సరి కొత్త పేజిలా ఉందీ పూట తరచి చూస్తే నా పుటలన్నింటిలో నీ ఆఛ్చాదనలే ఉన్నాయి. నిజం! నాన్నా! నువ్వు ఏనాడైతే నన్ను వదిలి సుదూర తీరం పయనించి నా కన్నిటి బిందువుగా మారావో ఆ రోజు నుంచే ఎవరికీ ఎవరూ కానట్లు సాగిపోతోంది మన ఇంటి నావ" ఇలా తండ్రి మరణం ఎంత ప్రభావితం చేసిందో చెబుతూ దుంఖపు నదిలోకి మనల్నీ తీసుకెళుతుంది.. ఆస్తులైనా,రోగాలైనా,లక్షణాలైనా సంతానానికి తల్లితండ్రులనుంచే సంక్రమిస్తుంటాయి.ముఖ్యంగా పిల్లలు వారి తల్లి తండ్రుల జీవితాల్లోనికి తరచి చూసినప్పుడు వారి అనుభవాలు అనుభూతులు ఆ పిల్లలకీ స్ఫూర్థినిచ్చేవిగా వుండవచ్చు.సగం జీవితం గడచిపోయాక కవయిత్రి జీవితపు దీపం వెలిగి వెలిగి చివరకు కొడిగట్టేదశలో ఆ అనుభవపు నుసిని ఆదీపం తాలూకునేనని గుర్తించానని ఇలా చెబుతుంది. "నా గుండెలో నిన్నటి వరకు నా కోసమే నేనున్నానని అనుకున్నాను బతుకు సాయంత్రపు గూటిలో కొడిగట్టే దీపం తాలూకు నుసిని గుర్తించి ఆ నుసి గతంలో వెలిగిన దీపం తాలుకేనని ఇపుడిపుడే నాకు అర్థం అవుతున్నావు" నిరాశతో నిస్పృహతో నలిపోయిన జీవితానికీ తండ్రీ తాలూకు ప్రేరణే మళ్ళి వెలుగులు నింపుకోడాని కారణం కావాలని ఆ తండ్రి మార్గమే ఆచణీయమనే భావనను కవయిత్రి స్ఫురింపచేస్తోంది. శైలజామిత్రకీ ఊహాశక్తి బలంగానేవుంది.తాను ఊహించిన భావనను గుండెలో నిలిచిపోయేలా గీయగలిగే నేర్పు ఈ కవయిత్రికి వుంది.తాను చెప్పదలుచుకున్న దాన్ని కవిత్వం ఎట్లా చేయాలో ఈవిడక బాగా తెలుసు.బాల్యంలో పిల్లలు పుస్తకాల్లొ నెమలీ ఈకలు పెట్టుకొని అవి పిల్లలు పెడతాయనే ఊహలో వుండటం అందరికి తెలుసు.మనం అలా చేసేవుంటాము.దాన్ని ఈ కవయిత్రి జీవితానికి అన్వయించి అద్భుతంగా ఇలా చెబుతోంది. "చిన్నప్పుడు నా పుస్తకాలలో నెమలీకలు పిల్లలు ప్ర్ట్టాయంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు చూడు నా బతుకు పుస్తకం మీద రంగు రంగుల రెక్కలు రోజుకో అవతారంలో నాకు ఏమాత్రం సంబంధం లేని పిల్లల్ని తెచ్చి ఎలా పెడుతున్నాయో!" ఈ కవయిత్రే చెప్పుకున్నట్లు "నన్ను ఎవరూ వినడం లేదే అనే ఆవేదన నుండి వచ్చిన భావాలివి.నన్ను నన్నుగా ఎవరూ చూడటంలేదనే నిరాశలోంచి వచ్చిన శైలి ఇది." రాయి కఠినంగా వుంటుంది. చిగుళ్లు సుకుమారంగా వుంటాయి.ఈ కవిత సంపుటిలో అన్ని కవితలు సుకుమార పదాలచేతనే రాయబడ్డాయి.రాతి చిగుళ్ళు అనేది ఒక విరోధభాసం.అందుకే ఈ కవయిత్రి "రాతిచిగుళ్ళ లాంటి మనుషుల మధ్య అంతా మాయ అనే నిజం వుంది"-అని అంటునే అయినా ఎదో పొందాలనే తాపత్రయం వుందని చెబుతుంది.శైలజామిత్ర గారికీ వున్న మరో నేర్పు ఏమంటే తన కవితలకీ అందమయిన శీర్షికలనుంచడం."విస్మరిస్తున్న హృదయ పాత్ర",ఒకానొక బతికిన క్షణం","రాతిచిగుళ్ళు"-ఇలాంటి సార్థక్యపు శీర్షికలు ఆవిడ కవితానికీ మరింత సౌందర్యాత్మకతను చేకూర్చాయి. "గాజు కెరటాల వెన్నెల సముద్రాలు"-అనే ఒక అద్భుత వాక్యమ్ తిలక్ ప్రయోగించాడు.ఈ కవయిత్రి గాజు అనే పదాని చాల చోట్ల ప్రయోగించింది.ఒక్కొక్క కవికీ ఒక్కోక్క పదమ్ మీద యిష్టం అలా పేరుకపోతుందేమో? వచనమయి తేలిపోయే పాదాలను రాయడాన్ని, ప్రశ్నల పరంపరతో కవిత్వంనిర్మించే పద్డతిని,వస్తువును దర్శించే క్రమంలో విస్తృతమైన కాన్వాస్ ని స్వీకరించే పద్దతిని,అన్వయ క్రమంలేని పద సంయోజనం కూర్చే లక్షణాన్ని ఈ కవయిత్రి వదులుకో గలిగితే ఈవిడకున్న ఊహాశక్తికీ భవిష్యత్తులో వొక మంచి కవయిత్రిగా పాఠకుల ఎదలో నిలిచిపోగలదని వొక ప్రామిసింగ్ కవయిత్రిగా నేను నమ్ముతున్నాను. "ఎవర్నువ్వు అని అడగగానే "తెలుగు వాడిని" అనే సమాధానంలో జీవితముంది..!మనిషిగా మనకు మనుగడ వుంది"-అని నమ్మి భాషాభిమానాన్ని ప్రకటించే కవయిత్రి, "ఎన్నో సార్లు మరణించాక ఇక కోలుకోడానికేం మిగిలింది?ఇంకెన్నో సార్లు తిరస్కరించాక ఇక ప్రేమనే పదాని పుట్టుకేముంది"-అని ప్రశ్నించే శైలజామిత్ర ఉమ్మడిశెట్టి సాహిత్య అవార్డ్ పొందిన సందర్భంగా మరో సారి అభినందనలు తెలియచేస్తూ...ఆవిడ పూయించిన "రాతిచిగుళ్ళు" రుచిని ఆస్వాదించమని మిత్రుల్ని కోరుతున్నాను. వచ్చె మంగళవారం మరో కవితా సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nqMUb3

Posted by Katta

Raveendar Hanmandla కవిత

తెర్లు చేస్తే మర్ల బడ్తం -------------------------- ఓ తెలంగాణమా తొలి వేకువ గానమా ఎంతటి నెత్తురు ఒలకబోసుకున్నం మరెంతటి ఉడుకుడుకు ప్రానాలు ధారపోసుకున్నం నాటి రజాకార్లతోనయితేనేమి భూస్వామ్య,దేశ్ముఖ్లతోనయితేనేమి నిన్నటికినిన్న,తొలిపొద్దులను అమాంతం మింగేసే రాజ్య రక్కసులతోనయితేనేమి దివారాత్రులు పోరాటమే కదా అడుగడుగునా అమరత్వమే కదా నాగేటి చాళ్ళల్ల మెరిసిన మొలకలన్నీ ఆకాశాన్ని ముద్దాడే స్తూపాలే కదా ఎంతటి వేదన,మరెంతటి ఘర్శణ రాజీ పడి బతుకుదామన్నా జీవిత రహదారి పొడుగునా వివక్షాపూరిత విచ్చుకత్తులే కదా చేపను నమ్మించి మింగేసే కొ\u003Cంగ జపాలే కదా ఎన్ని గుండెలవిసి ప్రానాలిడిసినయి లేలేత శరీరాలెన్ని అగ్గిలో బొగ్గయినయి ఉరికొయ్యలపై ఊగిన షిరస్సులెన్ని బలిదానమో,బలవర్మణమో విశాద గీతాలపనే కదా వినీల తారాపథంలో వెదుకులాటే కదా త్యాగాల పునాదులపై పోరాట దారులగుండా పొడుస్తున్న పొద్దుతో కదిలివస్తున్న ఓ తెలంగాణమా.. ఆరున్నర కోట్ల ప్రజల విజయ గానమా ఇంక నిన్ను తెర్లు కానీయం అమరుల మర్లబడే త్వతం తో సకల దుర్మార్గాలపై దూసుకెళ్తాం.

by Raveendar Hanmandla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hrs85L

Posted by Katta

Patwardhan Mv కవిత

ఐసా దీజియే :::: // ఎం.వి.పట్వర్ధన్ || ఒరేయ్! నీకు అంతులేని సంపదలూ, అపారమైన సంతోషాన్నీ అనుగ్రహిస్తున్నాను ఆహా !! స్వామీ! అయితే నన్ను కవిని చేయ్ కళ్ళూ,కాళ్ళూ నేలపై గట్టిగా నిలిచి ఉండేలా ఆయన అదోలాగా నవ్వి అన్నాడూ కాదురా! నిత్య దరిద్రమూ, నిరంతర దుఃఖమూ అభిశపిస్తున్నాను అంతేనా స్వామీ! అయితే నన్ను కవిని చేయ్ ఎదుటి వారి సుఖాన్ని ఎప్పుడూ స్వప్నించేలా ఈసారి విసుగ్గా అన్నాడు నిప్పుల వాగుల వెయ్యా నిన్ను ఈ ప్రపంచం గుర్తించకుండుగాక అవునా స్వామీ ! అయితే నన్ను కవిని చేయ్ అమృతమయుణ్ణై నా సరికొత్త ప్రపంచమేదో నేనే సృష్టించుకునేలా 27-05-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S9iLkF

Posted by Katta

Sriramoju Haragopal కవిత

చివరకు మిగిలేది.... ఎక్కడుందో జడిసి జడిసి వొణికిపోయి అణు,పరమాణు, కణజాలాలన్ని ముడుసుకుపోయిన గొంతులోని మాట ఎన్ని కాలాలనుండి వెతుక్కుంటున్నాను నా మాటని నేను పరకాయప్రవేశం చేసిన వాగర్థాలేవేవో నన్ను నన్నుగా పలుకనియ్యవు సుతారంగా చుట్టుకున్న తీగెలదారుల్లో సిగ్గులొలుకుతూ కట్లపూలై పూసిన నవ్వులన్ని అలవోకగా ఆకాశం వాలుమీద జారిన వెన్నెలలన్ని నీ కోసం నిరీక్షించిన వూపిరిగాలులలోకి దిగిన కలలపరిమళాలన్ని పిలుపులకోసం దారులు కాచిన పెదవుల వంతెన తెరిచి విడిచిన నౌకల్లా ఏవి మాటలు చిట్టీచిట్లని దుఃఖాల గాజులని వొడుపుగా సింగిడీలు చేసుకుని అల్లీఅల్లని వూహల పింగాణీపాత్రల వొరల్లో రంగులద్దుకుని ఆ వంకో ఈ వంకో విసిరినవో కసిరినవో పలుచని స్నేహాలని పుట్టినాకో పుట్టక మునుపో నిన్ను కలువాలని చేసిన ప్రతిజ్ఞల్ని మేఘాల మీద గీసిన నీటిరంగుల నీ చిత్రాల లాస్యాలు, లవణిమల్ని స్వరపేటిక తంత్రులు కదలీ కదలక, కదలనివ్వని వొత్తిళ్ళ మత్తల్లు దూకాల్సిన మాటలేయి నీవెక్కడున్నావురా నా చుట్టూరా నీ జ్ఞాపకాల కాంతి పరివేషాలు గుండెతొనల్ని వొలిచిపోసి మాధుర్యాల్ని గ్రోలే నీ కౌశలం తెలుసు నాకు నేను వ్యక్తం కాని నిర్వేదనని, నిశ్శబ్దాన్ని మిణుగురు వెలుగుల్లా ఆశలపుప్పొడులు రాల్చే చిరువెన్నెలల నెలపొడుపా నా మాటలు నాకివ్వు నీతోనే మాట్లాడనీ చివరిసారి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mtJDGK

Posted by Katta