పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Padma Rani కవిత

!!అప్పుగా ఆనందం!! వాదనలు ఎందుకని వలయంలో చిక్కి నాణెంపై బొమ్మను చూసి బొరుసు గీసి బాలింతకాలేని బాల్యానికి బారసాల చేసి భాధ్యతలంటూ ఆర్భాటాల నడుమ నలిగి ఆనందాన్ని కాస్త అరువు ఇవ్వమనడిగితే కుదవు పెట్టడానికి భాధలేగా మిగిలాయంది కన్నీటితో కనకమేకాదు కన్నపేగూ కరగనంది. 11-5-2014

by Padma Ranifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nwFV1N

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ప్రేమ కోసం పరితపించటం నేరమా ఆప్యాయత కనిపిస్తే కరగటం దోషమా ప్రతి పిలుపులో పరవశించటం పాపమా ఒంటరితనం లో స్నేహం కోరుకోవటం సాహసమా వీటిని బలహీనతలుగా భావించి తేనే పలుకులతో తీపి వాక్యాలతో వచించటం చాలా దారుణం కదా ... ఈ బలహీనత అమ్మ లాంటి అతివలదైతె విచక్షణ లేక చదువుకున్న కుసంస్కారులు వారి జీవితాలతో చెలగాటం ఆడటం హీరోఇజం అయిన దౌర్భాగ్య వాతావరణం ఇప్పటికైనా మారుతుందా .... అది ఎడారిలో ఎండమావేనా .... ఎన్నో జీవితాలు శిధిలం అవుతున్నాయి ఈ సాంకేతిక కీచక పర్వాలలో ... వీరిని రక్షించే దైవం లేదా ... ??? !!పార్ధ !!11/05/14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nC1DyX

Posted by Katta

Srinivas Saahi కవిత

శ్రీనివాస్ సాహి *అమ్మ గుర్తు..* సంబురం సంతల బేరంలా గిచ్చి-గిచ్చీ గుచ్చి-గుచ్చీ ఒకింత తగ్గితే పరిచయ లేమి ప్రపంచాన్ని పచ్చిగా-పిచ్చిగా పరిచయం చేస్తుంటే నాన్న కూడా అమ్మే అయి నానార్థాలు వివరిస్తుంటే.. చిక్కు గీతల ముళ్ళిప్ప చూపి చిన్నదేరా ప్రపంచమని నన్ను పెద్దవాడిని చేసి నన్ను వెలిగించ నువ్వొక ఆలోచనా చిమ్నీవై నేనారిపోతున్న ప్రతీసారి అత్మీయపు చమురువై అరువులైనా బరువులైనా అలసిపోయిన ఆ కండ్లళ్ళ నాదనే స్వార్ధమే అమ్మా!..... 11/05/2014.

by Srinivas Saahifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nwaJ2U

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఇద్దరు హద్దు// పెళ్ళికి ముందు బ్రహ్మచారిని పెళ్ళైన రోజే నాకో పాప ఐదేళ్ళకి ఇంకో పాప ఇద్దరితో కలిపి ముగ్గురు పిల్లలం హాయిగా ఆడుకొంటున్నాం. ______________________ క్షమించాలి రాజు గారూ ఇద్దరుమించి పిల్లలుంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు _____________________ హమయ్య బతికి పోయాను.......11.05..02014. (19.04.2014 ఒక రాత్రి ఎనిమిది కవితలు మూడోది)

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCUdR1

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//మెట్టు-2//06 ఆదృఢత్వం అతని ఉత్థానంకొరకే ఆ నిమ్నత్వంలో ఎంత ఔన్నత్యం? ఆఔన్నత్యం వెనుక ఎంతటిముగ్ధత్వం నిజంగా..నిరుపమాన కమనీయ...రమణీయ సేవాశిల్పం-మెట్టు తనపై పాదంమోపుతున్నది బాలుడనీ -బలిష్టుడనీ అధికారనీ-బంట్రోతనీ బేధభావాలను మెట్టుచూపదు ఆదరణీయుడనీ-అనాకారిఅనీ లెక్కలువెయ్యడం తనకుతెలీదు దేశ,జాతివైరాలను కులమతప్రాంతవివక్షలను తానుపాటించదు జనం పాదాలధూళితో పాదరక్షలమురికితో తానుమలినమవుతానన్న జంకు తనకుండదు-(2)...11-5-14 june2013

by Aravinda Raidu Devinenifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCUdAz

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

క్రొత్తగా.....తెచ్చుకున్నాము... కష్టాలెన్నో.....అవమానాలెన్నో...దిగమింగుకొని... యోధులమై.....సమిధలమై......బిగించిన...పిడికిలి...విధిలించక... సకిలించేవారి....నోర్లు...మూయించి.... వెక్కిరించినవారి......కన్ను...తెరిపించి..... క్రొత్తగా...తెచ్చుకున్నాము.....సంబరాలెన్నో...చేసుకుంటున్నాము... కల్లు..మూసుకొని....చేసిన...త్యాగాలు...మత్తులో..పులిమి...మరిచిపోతున్నాము... అసువులు బాసిన...త్యాగుల......నినాదాల..కేకలు.. ఇక ....వినపడవు... హోరెత్తించే...పోరు...ఇక...కానరాదేమో....... ఊతనిచ్చే....ఉరికించే....పాటల...పస వుంటుంధో...లేదో... నూతన...నిర్మాణం...మన..చేతుల్లో... రైతన్న...కంటి..నీరు...నేల రాలరాధు..... పసిడి..భూముల..అమ్మరాధు....కాంక్రీటు....పిల్లర్లు...అమ్మ..గుండెల్లో...దింపరాధు... ఇంటింటా....ఒక కుటీర పరిశ్రమ...స్థాపించవలెను.... చదువులేని..చదువుకున్న..వారు...వొక్కటై....ప్రచారం...సాగించవలెను... ప్రభుత్వం.....ప్రోత్సాహం...అంధించవలెను....శంఖం...పూరించే...రథం..నడిపించవలెను.... మన..ఆడవారి....గుండెల్లో...ఆత్మస్థైర్యం..నింపవలెను... మధ్యం...చేసే....పాపం...వీధి..నాటకాలతో....వీది...వీదినా...నిర్విరామంగా...ఆడవలెను... ఆర్తనాదాలు...మనుసుల...కలచివేసే...పాటలై....చైతన్యం..నింపవలెను.... విధ్యా..యజ్ఞం....చేయవలెను.... గ్రామ..గ్రామాన...గ్రంధాలయం..నెలకొల్పవలెను... వృత్తివిధ్యా పెంపొంధించవలెను..... నిధ్రిస్తున్న యువతపై....కొరడా..జులిపించి... నూతన....భారతం....ఆవిష్కరించవలెను... మొబైలు...ఫోను...ఫేషను.... టీ..కేఫుల..అడ్డాలు...కట్టడిచేయవలెను... సంఘ..భాధ్యతలు....సంఘ..నియమాలు... జాతి..అమరుల....కుటుంబ..అవస్థలు...త్యాగ..ఫళాలు... పాఠ్యాంశాలై...బొదించవలెను.... వైధ్య..విజ్ఞానం..ప్రతి....వంటింట్లో....పలకరిస్తుండవలెను.... ప్రభుత్వ..సేవలు...అంధరికి....చేరువ..కావలెను.... ఉధ్యోగులు...నిష్కల్మశులై...బంట్రోతులుగా...పనిచేయవలెను.... అయిపోయింధని...ధులిపేసుకోవాకు.... నిర్మించేవరకు....నిద్రించకు.... పదవి..రాలేదని....ఆశించిన...ధనం...ఖ్యాతి....అందలేదని.. ముసుగుతన్ని....పడుకోవాకు.... నోర్లుతెరిచిన...జనం...ఇంకా...ఆశాతోనే... చేతులు..చాచి....అర్ధిస్తూనేవున్నారు...ఎండిన డొక్కలతో....మాసిన...బట్టలతో... మూలిగే....మనస్సులతో....................................................

by Jaligama Narasimha Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyQi5

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//మెట్టు/0///06--A * మెట్టు ఇటుక,సిమెంటు,ఇసుకలతో ఒద్దిక,ఓరిమి,దృఢత్వాల మిశ్రమాన్ని జతచేసి అమర్చినట్లు చూడముచ్చటగా ఉంది. ఆమెట్టు ఎన్ని అంతస్థుల సౌధపు ఆరోహణ,అవరోహణలకు ఆలంబనమో? తాను అలా ఎంతకాలం తొణక్కుండా నిల్చిఉండాలో? ఎందరెందరికి ఊతమవ్వాలో? ఈవిషయాలేవి మెట్టుకితెలియవుపాపం. చివరకు తాను ఆధారంగాఉన్న భవంతిసౌందర్యాన్నిసైతం చూడలేదు మెట్టుకకకకకకకకకకకకకకకకకకకకు తెలిసిందల్లా, ఆరోహకుడు బలంగామోదినతొలిపాదంలో యావత్ శరీరభారాన్నిమోపి, తననుబలంగాతొక్కి,పైకినిక్కి పైమెట్టుక కి, మలిపాదం చేర్చి తొలిపాదం బిగిపట్టుని సడలించగానే హమ్మయ్య అనినిట్టూర్చ ర్చినట్టు తేలికపడడమే. ఆనిశ్చలత్వం అతిథిచలనం కొరకే ఆ వెనకదన్ను అతనిముందడుగు కొరకే (సశేషం) (1) 11-5-2014 జూన్2013

by Aravinda Raidu Devinenifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCUd3q

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

అమ్మా! మనసారా నన్ను క్షమించు! ***********************************రావెల పురుషోత్తమరావు అమ్మా! మనసారా నన్ను క్షమించు! ఐశ్వ ర్యానికి నిర్వచనం తెలీని కుటుంబంలోనుంచి వచ్చినా అందరినీ ఆనంద వార్ధిలో ముంచె త్తి మురిపించావు. ఐదు పదులైనా నిండకముందే ఐహిక సుఖాలనన్నింటినీ వదలుకుని ఆవలి తీరాలకు వెడలిపోయావు. చీకటంటే వెలుగు దారుల వెంట వెన్నంటి నడిపించే అశ్యమైన శక్తి అని పదే పదే చెపుతూ వచ్చావు. ఊహతెలియకముందే మమ్మల్నందరినీ దుఃఖ సాగర0లో ముంచి వెళ్ళిపోయావు. ఎంత ఉన్నతమైన సంస్కారమోనీది!!! ఊరు ఊరంతా కన్నీటి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చినప్పుడే మాకు తెలిసిపోయిందమ్మా! అందరూ కాదంటున్నా నాకిష్టమైన అమ్మాయిని కోడలిగా ఇంటికి తెచ్చి నీకు ప్రతిరూపమన్నట్లుగా నిలిపాను. ఆరేళ్ళు నిండకుండానే నా ముద్దులపట్టి పరలోకానికి ప్రష్తానం సాగిస్తే గుండెను చిక్కబట్టుకుని కాలం గడిపాను. నోములూ వ్రతాలంటూ నీకోడలు నిన్ను మరిపించిందటమ్మా అందరూ అంటుంటే తెలిసిందమ్మా -- ఆవిడా నీకొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలకు సామాధానాలను తెలిసికోవాలని బయలుదేరి వచ్చిందమ్మా! మనుమలూ మనవరాండ్రనూ చూసి మురుసుకుంటూనే వాళ్ళందరినీ ఇక్కడనే వదిలేసి ఒక్కతే నన్ను ఒంటరితనానికి ఒదిలేసి ఒచ్చేసిందమ్మా! నీవు బహుశా శతాధిక వృద్ధురాలివై ఉంటావు! ఈపాటికి అయినా వాళ్ళ బాగోగులను నువ్వే చూసుకోవాలి తప్పదమ్మా! ఆజన్మాంతం నీకు ఋణ పడి ఉండడం మాటేమో గాని తనువు చాలించిన తర్వాతకూడా నీపై బరువును మోపిన దురదృష్టవంతుడినమ్మా నన్ను మనసారా క్షమించు. ఇప్పుడంతా చీకటే జీవితమైపోయిందని ఎలాచెప్పాలో తెలియకుండాపోతున్నది!!! ===================================11-5-14

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyPec

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

అమ్మా !అమృతమూర్తి! నీవు కఠోరమైన పురుటి నొప్పులకోర్చి నాకు ప్రాణాలు ప్రసాదించావు నాపై నీలి నీడలు పడకుండా ఎలా కడుపులో దాచుకున్నావో ఎవరికీ కనిపించకుండా కన్నీళ్ళు తుడుచుకున్నావు నాకు తొలిసారి అనంతమైన ఆకాశాన్ని చూపించావు నాకోసం గోగుపూలు తెమ్మని జాబిల్లిని పిలించింది నీవు నిండు పున్నమి చంద్రునితో చెలిమి చేయించింది నీవు మల్లెల తెల్లదనాన్ని వెన్నెల చల్లదనాన్ని నాఒంటి పై పులిమింది నీవు జిలుగు తారలతో దోభూచులాడి సీతాకోకచిలకలతో పరవశాల పరుగులు నేర్పింది నీవు లోకాలు శాసించే ఏలికైన అలెగ్జాండర్ అశోకుడు ఆదిశంకరుడు ఎవరైనా తల్లి పాలు తాగిన పసివారే నీ జోల పాటలో ఎన్ని తత్వాలు ఎన్నెన్నో జీవిత సత్యాలు నిఖిల లోకాలు నవగ్రహాలు నక్షత్ర మండలాలు ఆదమరచి నిదురపోతాయి దేశం కానీ దేశంలో బ్రతుకు బరువైనపుడు గుర్తుకొచ్చేది అమ్మ కష్టాలు కన్నీళ్ళు క్రుంగ దీసినపుడు గుండెల్లో మెదిలేది అమ్మ అమ్మా ఎన్ని జన్మలైనా నీ రుణం తీర్చుకోలేను నీ చల్లని వొడి నాకు దేవుని గుడి.........

by ఉమిత్ కిరణ్ ముదిగొండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCUcww

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

"సముద్ర ఘోష" కవయిత్రి:శిలాలోలిత. ఇలాంటి కవితని ఏ మగాడూ రాయలేక పోయాడెందుకు? చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం నాకిది, ఈ కవితకు ఎన్ని శీర్షికలు పెట్టొచ్చోకదూ నా జీవితం లోంచి మా అత్త గారి పేరు మీ జీవితంలోంచి ఎన్నో ఎన్నెనో పేర్లు, ఎందరు స్త్రీలు తల్లిగా చెల్లిగా ప్రియురాలిగా భార్యగా అత్తగా మామ్మలుగా తమ తమ జీవితాలని ధారబోయలేదు...చివరికి ఆ సముద్ర ఘోషలా మిగిలిపోలేదు. "ఎడారులు ఒకప్పటి సముద్రాలేమో" ఆసక్తి కలిగించే ఎత్తుగడతో మొదలై "నత్తగుల్ల ఘనీబవించిన సముద్రానికి ప్రతీక" అన్నప్పుడు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. "నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం" నత్తగుల్ల వినిపించే ఆ రహస్యం ఏమిటి ఈ సమాజానికి తెలియందా కాదుకదా...సముద్రమంతటి స్త్రీలని నత్తగుల్లగా మార్చిన పాపం ఎవరిది నీది నాది మన అందరిదీ...ఎదారి నత్తగుల్ల అందులో వినిపించే సముద్రపు హోరుని కవయిత్రి కవిత సారాంశంగా చెప్పిన తీరు ఆమె పరిణితిని సుస్పష్టం చేసాయి అనటం అతిసయోక్తి ఏ మాత్రమూ కాదు. "ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం" ఈ ముగింపులో ఎంత చక్కగా చెప్పారు "కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు" అలోచింపచేసే కవిత. సందర్భం ఏదైనా స్త్రీ అడుగడునా నిత్యం అణగదొక్కబడుతూనే ఉంది, కవయిత్రి శిలాలోలిత గారి కలం ఇలా సమాజాన్ని ప్రశ్నిస్తూ మరిన్ని కవితలతో కనువిప్పు కలిగిస్తూ కవనం కొనసాగించాలని కోరుకొంటున్నాను. మన అందరం చదువుకున్నదే భూమి ఒకప్పుడు పూర్తిగా మంచుతో నిండి కాలక్రమేణా కరుగుతూ...సముద్రాలు భూమి ఇత్యాదులు ఖండాలుగా ఏర్పడుతూ వివిధ దేశాలుగా రూపాంతరం చెందింది...పోతే భారతదేశంలో స్త్రీని దేవతగా కొలవడం సర్వసాధారణం మరి ఈ కర్మ భూమిలో "గృహ హింస" చట్టం అవసరం ఎందుకొచ్చింది, సముద్రాలంటి స్త్రీలు ఎడారిలో నత్తగుల్లలా ఎందుకు మిగిలారు ఈ మాతృ దినోత్సవ సందర్బంగా ఒక సారి ఆలోచిద్దాం......మీ వర్మ కలిదిండి. "సముద్రఘోష" ఎడారులుఒకప్పటి సముద్రలేనేమో ఎడారుల్లోని నత్తగుల్లను చెవి కానిస్తే సముద్రమై ఘోషిస్తుంది నత్తగుల్ల ఘనీభవించిన సముద్రానికి ప్రతీక నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం 11.05.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU8Ns

Posted by Katta

Niharika Laxmi కవిత

(నేను ... మా అమ్మ ..... ) teacherని కొట్టి schoolకి వెళ్లనని మారంచేసినా, నచ్చచెప్పి నన్ను పంపిన క్షణాలు ఎదలో పదిలం ! పళ్ళ మధ్యలో పిన్నీస్.. cycle టైర్లో కాలుని ఇరికించి ఏడుస్తుంటే నువ్వు విలవిల్లాడిన క్షణాలు పదిలం ! నువ్వు విసుగొచ్చి తిడితే మంచం కింద దాక్కొని నీతో వెతికించిన క్షణాలు పదిలం ......... ! ఇప్పటికి కలలతో నిదుర చెదిరినా పక్కనే ఉన్నానంటూ ఓదార్చి నిదురలోకి పంపే క్షణాలు పదిలం! జ్వరంవస్తే నన్ను దగ్గరికి తీసుకొని నిదుర లేని రాత్రులు ఎన్ని గడిపావో ఆ క్షణాలు పదిలం ! ప్రసవించడానికి ఎంత ఇబ్బంది పెట్టాను అని అడిగితే చిరునవ్వుతో కప్పేస్తావు ఆ భాదని ! తిననని మారంచేస్తే నేటికి గోరుముద్దలు పెడతావు , నలుగురు మా గురించి మంచిగా చెబితే మురిసిపోతావు ! ఎప్పటికి నీకు పసిపాపనే కాబట్టి ఎంత అల్లరి చేసిన ఓపికగా భరిస్తావు ! నేను ... అక్క ...నాన్నే .......... నీ ప్రపంచం ..! ఇంత అనుభందాన్ని నాకు పంచి ఇచ్చావు నీకు నేను తల్లినై కంటిపాపలా చూసుకుంటాను అమ్మా ! .................................... నిహారిక (may -11-2014)

by Niharika Laxmifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU8Nd

Posted by Katta

Vani Koratamaddi కవిత

/ఓదార్పు// మనసుకు ఓదార్పు దొరకనపుడు కన్నీటిని వర్షిస్తూ బాద దిగమింగుతూ నాకు నేనే ఓదార్పు నయ్యాను కన్నీటినే అక్షరాలుగ మలిచి బాధనే భావంగా మారుస్తూ పదాలను ప్రోది చేస్తూ.. కవితా ప్రపంచంలోనికి అడుగులు వేసాను అక్షరాలకు గుర్తింపు నామనసుకు ఓదర్పు నిచ్చే మరో ప్రపంచానికి చేరువచేసింది ఆత్మ బందువైయ్యింది మదిలోని బాదలన్ని పదాలుగా పేరుస్తూ అక్షరాలు నామనసుకు ఓదార్పుగా.. కన్నీటి తుడిచేటి ఆత్మీయ నేస్తాలుగా...!! ...........వాణి కొరటమద్ది 11 may 2014

by Vani Koratamaddifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyKXG

Posted by Katta

Murthy Kvvs కవిత

Mario Puzo మరొక నవల Sicilian పై నా అభిప్రాయం God Father తో ఒక ప్రత్యేకతని సంతరించుకున్న రచయిత Mario Puzo రాసిన మరి ఒక నవల Sicilian గూర్చి ఇప్పుడు ప్రస్తావిస్తాను.1950 దశకం నుంచి ఈ కధ మొదలవుతుంది.రెండవ ప్రపంచ యుద్ధ చ్చాయలు అక్కడడక్కడ తొంగిచూస్తుంటాయి.అయితే దాని గురించినదే కాదిది.సిసిలీ లో ని మాఫియా కుటుంబాల ప్రాభవం ముస్సోలిని అణచివేతవల్ల కొంత తగ్గినట్లుగా చెబుతాడు రచయిత.అయితే అమెరికన్ సేనలు ఫాసిష్టులను పారద్రోలి వారి అనుయాయులను అక్కడ ఉంచినట్లుగా అర్ధమఔతుంది.రోం నుంచి వాళ్ళు నిరంకుశంగా పాలన సాగిస్తుంటారు.Palermo అనే ఊరిలో ఇంకా Montelepro అనే ఊరిలో ఈ కధ అంతా నడుస్తుంది. మీరు గనక గాడ్ ఫాదర్ చదవక పోతే మొదట వచ్చే Michael Corleone పాత్ర గూర్చి ఏమి అర్ధం కాదు.అగమ్య గోచరంగా ఉంటుంది,అంటే దానిలో నుంచి దీని లోకి ముడి వేస్తాడు రచయిత,అయితే దానికీ అర్ధం ఉంది.అమెరికా లో Sonny ని చంపిన ఓ పోలీస్ ఆఫిసర్ ని పకడ్బంది ప్లాన్ తో అతని సోదరుడు Michael ఓ హోటల్ లో మట్టుపెడతాడు.ఆ సన్నివేశం ఊహించనలవి కాదు మొదట్లో. ఓ హోటల్ లో సంధి కోసం కోసం హాజరవుతారు.వచ్చినపుడు Michael ని బాగా చెక్ చేస్తారు.ఎక్కడ ఎలాంటి ఆయుధం ఉండదు.విచిత్రంగా ఆ సన్నివేశం చివరిలో పోలిస్ అధికారిని టపా మని కాల్చి పారేస్తాడు.అసలు విషయం ఏమిటంటే ఆ హోటల్ లోకి రాకముందే అక్కడున్న సర్వర్ కి డబ్బులిచ్చి ఓ పిష్టల్ ని బాత్ రూం లో పెట్టిస్తాడు...తను పాస్ కి వెళ్ళినప్పుడు అది లోపల పెట్టుకొని టేబుల్ ముందు కూర్చుని మాటాడుతున్నప్పుడు ఠపీ మని కాల్చి పారేస్తాడు.50 వ దశకం లో నే వాళ్ళ మెదళ్ళు అలా ఉన్నాయి. సరే... ఇక్కడుంటే ప్రమాదమని తన స్వస్థలమైన సిసిలీ లోని మరో డాన్ డాన్ క్రాస్ దగ్గరకి పంపిస్తాడు. రెండు సంవత్సరాలు అక్కడున్నతరవాత అక్కడినుంచి ఆఫ్రికా కి సముద్రం మీదుగా వచ్చి అక్కడినుంచి విమానం లో న్యూయార్క్ రావాలనేది గాడ్ ఫాదర్ ప్లాన్ . ఇలా జరుగుతుండగా Salvatore Guiliano అనే విప్లవకారుణ్ణి మైఖేల్ తను వచ్చేటప్పుడు తీసుకురావాలనేది అతని తండ్రి షరతు.దానికీ ఓ కారణం ఉంది.నిజం చెప్పాలంటే ఈ Sicilian నవల లో హీరో ఈ Guiliano నే.సిసిలో ప్రజలని రోం పాలకుల సహాయం తో వేధిస్తున్న Mafia families కి సిమ్హ స్వప్న స్వప్న మౌతాడు.సుకుమారమైన,అందమైన రొమాంటిక్ జీవితాన్ని గడిపే అతని జీవితం కొన్ని సన్నివేశాల ఫలితంగా విప్లవకరం గా మారుతుంది.భయంకరమైన మోసపూరితమైన రాజకీయ అండదండలున్న వ్యక్తులను తన ధైర్య స్థైర్యాలతో,ప్రజల సహకారం తో ఎత్తుగడలతో ఎలా తన ఊరుచుట్టూ యున్న కొండలను వేదికగా చేసుకొని పోరాడాడో చదివితే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. మనిషి లోని నమ్మించి మోసం చేసే తత్వం ఎంత లోతుగా ఉంటుందో ప్రతి పేజీలోను అర్ధం అవుతుంది.గులియానో తల్లి మారియా పాత్ర సగటి భారతీయ స్త్రీ లానే ఉంటుంది.Adonis పాత్ర దీనిలో గుర్తుండిపోయే పాత్ర. అతను యూనివర్శిటి ప్రొఫెసర్ గా పనిచేస్తూ తన ఒకప్పటి స్టూడెంట్ గులియానో కి సహాయపడుతుంటాడు.కొండల్లోని గులియానో కి అనేక చరిత్ర పుస్తకాలని అందించటం.... వారి చదివే గుణానికి ప్రతీక. చివరివరకు ఏమౌతుందోనని చాలా టెన్షన్ గా ఉంటుంది.ఎవరు మంచి వారో..ఎవరు చెడ్డవారో..అసలు చాలా వరకు అర్ధం కాదు.మంచిగా ఉన్నవాళ్ళే శతృవుకి సహకరించడం...హీరోకి అత్యంత దగ్గరగా ఉండి అనేక దాడుల్లో అతనికి సహకరించిన అతని బంధువు(Aspanu) ఒక చిన్న కారణం చేత గులియానో చావుకి కారణమవుతాడు. అది ఊహించలేము.అంటే మానవ పరమైన Loyalties ఎంత బలహీనంగా ఉంటాయో అవగతమౌతుంది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా చెప్పవచ్చు.బయటకి చక్కగా మాటాడుతూనే ఒకరిని ఒకరు manipulate చేసుకోవడం చెప్పదగినది. ఎన్నైనా చెప్పండి......తెలుగులో ఎన్ని అనువాదాలు చదివినా యూరోపియన్ల యొక్క Treacherous నేచర్ అర్ధం కాదు.వారి పలుకుబడులు,ఉద్వేగాలు,మానవ సంబందాలు ఇది చదివితే బాగా అర్ధం అవుతుంది అనిపించింది.ఇంగ్లీష్ రచయితల్లో నాకు ,ముఖ్యంగా ఫిక్షన్ రైటర్స్ లో, నచ్చిందేమంటే కొన్ని విషయాలు ఎవరేమనుకుంటారో అని వదిలి వేయరు.

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU7Ji

Posted by Katta

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ //అమ్మ నా పాస్‍వర్డ్ // "మీరు అర్థంకారు" "అసలు మీరేంటో మీకర్థమౌతుందా?" "ఓ అర్థముండి ఏడిస్తేగా.." "వాడు వొట్టిమొండి""మూర్ఖుడు" "అమాయకుడు" "...."...." * నన్నెవ్వరూ అర్థం చేసుకోనప్పుడు.. అర్థం చేసుకోను కనీసమూ ప్రయత్నించనపుడు వాళ్లకు తోచిన ఆ ఘడియలో అనిపించిన ఎత్తిపొడుస్తున్నామనో.... ఆకాశానికి ఎత్తేస్తున్నామనో ఏదో ఓ అర్థాన్ని అంటగట్టినపుడు ఒక్కొక్కసారి నాకు నేనే అర్థంకానపుడు నేనేమిటో నాకే చూపే అద్దంలా నా మనసుకు అర్థం చెబుతూ ఆ అర్థాన్నే అందరికీ చూపుతూ అమ్మ.... నా నిఘంటువు. నేను బాధపడ్డా.. ఏడ్చినా.. కోపించినా తమాయించుకోలేక ఒంటి కాలిపై లేచినా అరిచి గీపెట్టినా.. తాను తలకొట్టుకుంటూనైనా నన్ను మారమంటూనే లోకానికి నా సాత్విక రూపాన్ని పరిచయం చేయజూస్తూ అమ్మ.... నా ఫోటోఫ్రేము ఒక్కమాటలో.. నన్ను నేనుగా నా బతుక్కే లాగిన్ కావడానికి పాస్‍వర్డ్ అమ్మ 11/5/2014

by Raj Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU4Nz

Posted by Katta

Pusyami Sagar కవిత

వలస చిత్రం ____________పుష్యమి సాగర్... ఇక్కడ కొన్ని వెలిసిన రంగులు కాన్వాసు పై చిత్రాలు గా మారతాయి పిండం ఉమ్మ నీరు లో చేప లా ఈధుతున్నప్పుడు, విత్తనాన్ని మరెక్కడో మొలకేత్తించాలని తమ కడుపులు కట్టుకొని ...ఆశల దారాల్ని అల్లుకుంటూ అహరహం శ్రమించి ఆకాశంలో పయనింప చేస్తారు రెక్కలొచ్చిన కొన్ని పక్షుల్ని ...!!!!!. తమ బతుకులు మార్చుకోవాలని తమని తాము చెక్కుకుంటూ ఇంకిపోయిన కన్నీళ్ళని కరెన్సీ కట్ట ల కింద దాచేస్తు ... చరవాణి ద్వారా గుండె చప్పుడు వినిపిస్తారు ...., చిన్నప్పటి జ్ఞాపకాలను, కొన్ని ఆనందాలను, దుఖాలను ఇంటి వాకిట పరిచి గడిచిపోతుంటాం కాలం ఒడి లో ...!!!! చదువులను మదించి ముళ్ళను పూలబాటగా మలచుకొన్న బతుకు చిత్రం....దీనికి మరో వైపు , గంపెడు పిల్లలని , ఆబగా నోరు తెరిచి చూస్తున్న అవసరాలను . .పెళ్ళికి ఎదిగిన కూతుళ్ళ చూపులను ., కట్టుకున్న ఆడది వంటికి నిండుగా కప్పలేని నిస్సహయత ని జనాల జాలిచూపులని ..తట్టుకోలేక కసిగా ... వెంటాడుతు విసిరేయబడతాయి ... అజ్ఞానపు తురుపు ముక్కలు !! ఎడారి పచ్చిక బయళ్ళలో పాస్ పోర్టులు లాక్కోబడి, ముద్ద దొరకక కడుపుచుట్టుకుపోయిన పేగులను తన్నుకుంటూ వచ్చిన ఆకలికేకలు గాల్లో కలిసిపోయి చెత్త కుప్పలో దిక్కులేని కట్టే గా విసరబడ్డప్పుడు , పాలకులు చలువ కళ్ళద్దాల లో చిత్రమే చూసారు ... ఇవి కొన్ని చరిత్ర లో లిఖించబడని కొన్ని రక్తాక్షరాలు కనిపించని చేదు నిజాలెన్నో తమని తాము కాల్చుకుంటూ ప్రతి క్షణం బూడిద గా మారుతూనే ఉంటుంది ...!!! వ్యధాభరిత జీవితాలను ఓడ్డున పడేసే దేవుడు ఎప్పుడు వస్తాడో . వేల కళ్ళలో చిగురిస్తున్న అంతులేని ప్రశ్న ...!!!!! మే 11, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyLLu

Posted by Katta

Chandra Shekhar Vemulapally కవిత

ఆమె అమ్మ అమృతం బొట్లు ఆ వేళ్ళనుంచి అమృతం ధారలు ఆ రక్తనాళాల్లో పారుతూ ఆమె, అమృతమూర్తి .... రాలుతున్న ఆ కన్నీటి బొట్లు మమకారం పేగు బంధం తెగి పేగు మెలిపడిన నరకయాతన ఎద నులిమిన వ్యద మనోస్రావం .... ఆమె

by Chandra Shekhar Vemulapallyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU4go

Posted by Katta

Sriramoju Haragopal కవిత

నువ్వే నువ్వే ఎందుకు నన్ను కనలేదు ఎప్పటికీ పెరగని నీ ఎత్తుబిడ్డనై ఎల్లప్పుడు నీ ఒడి దాగివుందును కదా రోజూ నీ ముద్దులతో రోజాపూవునై వికసింతును కదా నెలపొడుపు చూసి నా ముఖం చూసి నీ వెన్నెలకళ్ళతో ఆడించేదానివి కదా నీ గారాబుపట్టినై నీ ప్రేమపొత్తిళ్ళలో దుఃఖమే ఎరుగని మొదటి మనిషినయేవాణ్ణి కదా నీ కొంగు చాటున నీ పాలగుండెలపైన ఆకలి తీరని పాపాయినై వుందును కదా నీ కుచ్చిళ్ళులాగి నా ఎత్తుకు దింపుకుని తలమీద నీచేయి కిరీటం పెట్టుకుందును కదా ఎన్నడూ కోపగించని నీ మమతలతో నీతోనే హాయిగా వుండేవాణ్ణి కదా ఎందుకు నువ్వు నన్ను నా కలగా కన్నావు ఈ ఆర్తి తగ్గని దుఃఖాలపాలు చేసావు ఎపుడూ నిన్నే వెతుక్కోమని ఇట్లా ఒంటరిని చేసి వొదిలావే

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU3ZT

Posted by Katta

Jaligama Narasimha Rao కవితby Jaligama Narasimha Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sgvZHw

Posted by Katta

Indira Bhyri కవిత

. . . గజల్ ఆనందం కలిగినపుడు అమ్మ గుర్తుకొస్తూంది ఆవేదన తీర్చు అమ్మ ప్రేమ గురుతుకొస్తూంది అడగనిదే వరాలిచ్చె ఆమెచేతి చలువ చూస్తె ఫలాలిచ్చె కల్పతరువు కొమ్మ గురుతుకొస్తూంది ప్రశంసలే పన్నీరై నాపైనే కురిసినపుడు సుఖమంటే ఎరుగని తన శ్రమ గురుతుకొస్తూంది తెలిసితెలియకేనేమో మాటలనే తూలినపుడు కన్నీటితొ కడిగేసిన క్షమ గురుతుకొస్తూంది కోరుకున్న విజయాలే నాకు స్వంతమైనపుడు మాటరాని తనకన్నుల చెమ్మ గురురుతుకొస్తుంది మాను వంక చూసినపుడు మాటరాక నిలిచిపోతె అమ్మ త్యాగభరితమైన జన్మ గురుతుకొస్తూంది వింతలీను జగమునంత చుట్టినపుడు ఓ ' ఇందిర ' అమ్మ నాకు కొనిఇచ్చిన బొమ్మ గురుతుకొస్తూంది (అమ్మ తీవ్ర అనారోగ్యం పాలైన స్థితిలో ....అమ్మలందరికీ వందనాలు తెలపాలని ఈ కాస్త వీలు చేసుకున్నాను)

by Indira Bhyrifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaa6df

Posted by Katta

Vijay Gajam కవిత

.......అమ్మ..మ్మా........(విజయ్....21.01.2009 నుంచి 11-05-2014) నన్ను కనకపోయినా కంటికి రెప్పలా కాపాడావూ.. చనుబాలు ఇవ్వకపోయినా చక్కని సంస్కారం నేర్పావు.. మునిపంటి భాదను దిగమింగి మమతానురాగాలు పంచావు.. అస్థీ ఐశ్వర్యాలు ఇవ్వకపోయినా కష్టాలలో అధుకోవడం నేర్పావు.. నన్ను ఓ మొక్క నుంచి నలుగురికి ఉపయోగ పడే చెట్టుగా మార్చావు.. నా కష్టఫలం ఏ మాత్రం ఆశించకుండా వేల్లిపొయ్యావా.. నన్ను ఓంటరిని చెసి వేళ్లీ పోయావా అమ్మా.. నువ్వు వెల్లిపోయాక తెలిసొచ్చింది..నా కోసం నువ్వు ఎం కోల్పోయ్యావో.. ఇప్పటికీ నా చేతి మీద నువ్వు కొట్టిన దెబ్బ మచ్చ నూసినప్పుడల్లా అనిపిస్తుంది.. నా ఉన్నతికి నువ్వు ఎంత తాపత్రయ పడ్డావో.. నా ధైర్యం నువ్వు .. నా స్వాస నీ బిక్ష... కాని నేను నువ్వు అడిగిన చిన్న కోర్కే కూడా తీర్చేలేని వాడినయ్యాను.. నన్ను మన్నిస్థావు కధూ.. మళ్లీ నా ఇంట్లో పుడతావు కధా అమ్మ..మ్మా..

by Vijay Gajamfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sgw1PM

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అమ్మ దైవత్వానికి ప్రతిరూపం ఆకాశంలోని అనంత వైశాల్యం సముద్రంలోని లోతైన హృదయం భూమి యొక్క దివ్యమైన రూపం ప్రేమ యొక్క మధురమైన భావం ఒక దానితో ఒకటి విలీనమై మానవాళి కోసం ఏర్పాటైన నిత్యత్వం గల ఒక అపురూప వ్యక్తిత్వం ఆమే అమ్మ- అమ్మ అంటే ఒక అద్బుతం అమ్మ - ప్రపంచాన్ని పరిరక్షించే మాతృత్వం ప్రపంచంలోని తన బిడ్డల ఆత్మలకి పోషణ ఇచ్చే సత్యమైన సంపూర్ణ ప్రేమతత్వం ఈ రోజు మనందరికీ మాతృదినం మనందరి జీవితాలలో సుదినం ప్రపంచమే ఆమెలో ఒక సూక్ష్మ భాగం ఇదే అమ్మ కోసం నా గుండె అర్పించే ప్రేమరాగం! [మే 11, 2014 న Mother’s Day సందర్భంగా తల్లులందరికీ శ్రద్ధాంజలితో] © జాస్తి రామకృష్ణ చౌదరి 11May2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sgw1PB

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

కదిల్తేనే రాసేవాడు కవి కదుల్తూ ఉన్నా రాసేవాడు కండక్టర్

by Chandrasekhar Sgdfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaa5Wy

Posted by Katta

Jagadish Yamijala కవిత

అవీ ఇవీ .......................... రాయి రాయి ... నాకో ఉత్తరం రాయి నన్ను ప్రేమిస్తున్నానని కాదు నువ్వు మరెవరినీ ప్రేమించడం లేదు అనయినా రాయి --------------- అద్దంలో చూసాను చదివాను ఒక కవిత అది నీ ముఖారవిందం ------------------- ఎప్పుడో ఒక రోజు నిన్ను మరచిపోతాను ఆరోజు గాలి వీయదు ప్రేమ అదృశ్యమైపోతుంది ---------------------- నీ పెదవులు పలికేదాకా నేను అనుభూతి చెందలేదు నా పేరు అంత అందంగా ఉందని ------------------------ విజయమనేది పొందేందుకు.... ఓటమి అనేది నేర్చుకోవడానికి ------------------- ప్రేమకు కళ్ళు లేవనేది అబద్ధం నీ కళ్ళను చూసిన తర్వాతే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను ----------------- తమిళ మూలం కవి వైరముత్తు అనుసృజన యామిజాల జగదీశ్ -------------------------------- 11.5.2015 ----------------------------

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaa3hq

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //అంకితం// అమ్మ గోరుముద్దలు తినలేకపోయినా అమ్మ ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు! ఒక అమ్మ తాన బిడ్డకి అన్నం తినిపిస్తుంటే చేట్టుచాటు నుండి చూస్తూ కన్నీరు కార్చినా రోజు ఇంకా నాకు గుర్తుంది ఒక అమ్మ తాన బిడ్డకి పలు పడుతూ తాన కడుపు నిండింది అని మురిసిపోయే అ నవ్వు నాకు గుర్తుంది ఎంత ఆకలిగా ఉన్న ఇవాళ నేను ఉపవాసం అని ఇట్టే అబద్ధం చెప్పి ఉన్నదంతా నలుగురికి పెట్టె కన్నతల్లి నాకు గుర్తుంది ఒక్కో అమ్మ ఒక్కో లా తాన ప్రేమనీ తాన బిడ్డలకి అందిస్తుంది మరి అ ప్రేమను అందుకున్న పిల్లలు మాత్రం అమ్మ ని బ్రతికి ఉన్న అనాధనీ చేసారు రోడ్ మీద అనాధ ఆశ్రమం లో ఎంతో మంది తల్లులు కన్నీటినీ మింగి బ్రతుకుతున్నారు ఉన్నవాడికి తల్లి విలువ తెలియదు లేనివాడికి తాన తల్లి ఎలా ఉంటుందో తెలియదు నాలంటి అనాధలు అందరు కలిసి రాసిన ఈ కవిత గొప్ప తల్లులు అందరకి అంకితం 11may2014

by Venu Madhavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iEK3tg

Posted by Katta

Maheswari Ande కవిత

అమ్మా!! నా ఉనికికి కారణమైన బీజాన్ని, నీవు భారమని తలవక ప్రీతితో మోశావు!! నీ కదలికలవలన కలిగిన అసౌకర్యానికి, నీవు సంతోషించి పరవశించావు!! నేను ఈలోకానికి రావడనికి కలిగించిన బాధను, నీవు ఆనందంగా భరించి ప్రేమను పంచావు!! నే వేసిన తప్పటడుగులును సరిజేసి, అలుపెరుగని బాటసారిగా తీర్చిదిద్దావు!! సుమధురమైన నీ భాష నాకర్థంకాదేమోనని, భావరహితమైన నా పలుకులనే మట్లాడసాగావు!! నా ఙ్ఞానసముపార్జనకై, నీ సమయాన్ని వెచ్చించావు!! నా కలల సాకారానికై, నీవు నిరంతరం శ్రమించావు!! రెండక్షరాల నా పిలుపుకై ప్రతిక్షణం పరితపించావు అమ్మా!!యని నొరారా నిన్ను పిలిచి, నీకు కలిగిన ఆనందాన్ని చూసి, నేను సంతోషించడం తప్ప మరేమీ చేయలేని నా అసమర్థతను మన్నించి, నీ ప్రేమను రెట్టింపు చేస్తున్న నీకు నేనేమిచ్చి ఋణం తీర్చుకోగలను??

by Maheswari Andefrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QuGwTh

Posted by Katta

Sriarunam Rao కవిత

అమ్మా...... పులకరించిన మేని.... పాశాన్ని పలకరిస్తే.. మతృత్వానికి అర్ధంచెబుతూ అనురాగపుకేక మరో జీవితాన్ని హత్తుకుంటుంది. నీడకుకూడా గొడుగుపట్టే అమ్మతనం ఆర్తితోకప్పే చీరకొంగులా నిరంతరం నిన్ను కాపాడుకుంటుంది. ఇకనుండి నీ ప్రతీఅడుగూ... అమ్మ కళ్ళల్లో పుట్టే మెరుపులతో రక్షించబడుతుంది. ఆ తన్మయం కోసమేనేమో... తన గుండెల్ని చీల్చుకువచ్చినా నిన్ను తన ప్రాణంలా మార్చుకుంటుంది. కనులముందు కణేల్ మంటున్న నిప్పుకణికని కౌగిలించుకుంటావా? నచ్చినరంగే కదా అని రక్తాన్ని కుళ్లబొడుచుకోగలవా? ఇవన్నీ అమ్మే చేయగలుగుతుంది అందుకే దేవుడికైనా తాను అమ్మే అవుతుంది. శ్రీఅరుణం 9885779207 విశాఖపట్నం-530001

by Sriarunam Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RBRVlj

Posted by Katta

Mohammad Abdul Rawoof Chinni కవిత

@ చిన్ని @ // అమ్మ // ================== ఈ సృష్టిలో తీయనైన పాట పేరు అమ్మ ఈ జగతిలో మృదువైన మాట పేరు అమ్మ నాలోని ప్రాణం అమ్మ నా ప్రాణ దీపం అమ్మ నాలోని గుణమే అమ్మా..... నాలోని రూపం అమ్మ నా వెంట నీడే అమ్మ నా తోడు పేరే అమ్మా.... అమ్మ లేని చోటుని గమనించలేనుగా అమ్మ లేని జీవితం ఊహించలేనుగా.... ఆనందం గుప్పెట మూసి నా బ్రతుకుని మలిచింది అమ్మ తన ఆప్యాయత గుండెలో దాచి నా వెన్నెంటే నడిచింది అమ్మ మమతని ముద్దగా మలిచి గోరు ముద్దలు పెట్టింది అమ్మ తన మనసంతా నన్ను నింపుకుని నా తోడు నిలిచింది అమ్మ.. అందుకే... ఈ సృష్టిలో తీయనైన పాట పేరు అమ్మ ఈ జగతిలో మృదువైన మాట పేరు అమ్మ @ చిన్ని @// 11--5-2014 MY Heart Beats

by Mohammad Abdul Rawoof Chinnifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gp87Mx

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || ఆమె గురించి || ఎందరో కళ్ళల్లో ఆమెను చూస్తూ ఉంటాను *** చిన్న పాప చీర చుట్టుకొని అచ్చం అమ్మలానే ఉన్నాను కదూ అని అడుగుతుంటే అతని కళ్ళల్లో ఆమె జ్ఞాపకం ఒకటి కరగడం గమనించాను *** ఆమెను కోల్పోయి చిరిగిన బాల్యాన్ని వాడి అతుకుల బట్టలతో ఎలా కప్పుతాడు అనురాగమో, ఆకలో వాటి విలువ వాడికి తెలిసినంతగా నాకు తెలియదు *** విసిరివేయబడిన విస్తరుల పక్కన ఎవడో వదిలించుకున్న అవ్వ కన్నుళ్లో అమ్మను బ్రతికించమని ఒక విజ్ఞాపన నన్ను నిలదీసింది *** ఊరులో ఆమెకు అన్నీ అమర్చి రోజూ అడుగుతాను అమ్మా నవ్వుతున్నావా అని ఆ.. అంటూ మొన్న పండక్కి నేను వచ్చినపుడు దాచుకున్న నవ్వు తీసి వినిపిస్తాది *** ఆమె గురించి అక్షరాలు కాదు వ్రాసే కన్నులు కావాలి నీకు నాకు చాంద్ || 11.05.2014 ||

by Chand Usmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iEtDRO

Posted by Katta

Sriramoju Haragopal కవిత

నేను అమ్మను భూగోళాన్ని అరచేతితో ఒత్తి రొట్టెలా కాల్చి బిడ్డల కడుపునింపే తల్లీ నువ్వు అమ్మవే నేలను చాపలా పరిచి ఆకాశాన్ని చింపి దుప్పటిలా కప్పి పసికందును ప్రేమపొత్తిళ్ళలో నిద్రపుచ్చే లాలిపాటల తల్లీ నువ్వు అమ్మవే సమస్తసముద్రాల్ని పాలుగా రొమ్ముల్లో నింపుకుని లోకానికి పాలిచ్చే పాలధారవైన నువ్వు అమ్మవే (నా కవితాసంకలనం మూలకం నుండి) మదర్స్ డే సందర్భంగా

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fYpYyU

Posted by Katta

Sriramoju Haragopal కవిత

నేను అమ్మను భూగోళాన్ని అరచేతితో ఒత్తి రొట్టెలా కాల్చి బిడ్డల కడుపునింపే తల్లీ నువ్వు అమ్మవే నేలను చాపలా పరిచి ఆకాశాన్ని చింపి దుప్పటిలా కప్పి పసికందును ప్రేమపొత్తిళ్ళలో నిద్రపుచ్చే లాలిపాటల తల్లీ నువ్వు అమ్మవే సమస్తసముద్రాల్ని పాలుగా రొమ్ముల్లో నింపుకుని లోకానికి పాలిచ్చే పాలధారవైన నువ్వు అమ్మవే (నా కవితాసంకలనం మూలకం నుండి) మదర్స్ డే సందర్భంగా

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nuERLU

Posted by Katta

Surya Suryadevara కవిత

.....మాతౄత్వం ...... నీ పిలుపు నాకు అతి మధురం నీ ప్రేమ నాకు అత్యంత స్వచ్చ్యం. నీ అత్మియత నాకు అతి పవిత్రం నీ అనురాగం నాకు మహదానందం నీ కష్టం నాకు జివితం నీ సేవ నాకు తొడ్పాటు ఈ ఊపిరి నువ్వు ఇచ్చిన మహ ప్రసాదం........ పవిత్ర మాతౄ ముర్తులందరికి హ్రుదయ పుర్వక శుభాబినందనలు ...

by Surya Suryadevarafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RBv0GI

Posted by Katta

Arcube Kavi కవిత

కొడుకా..యుద్దానికి నడు ______________________ఆర్క్యూబ్ కొడుకా-ఊరూరి చెరువు చెదిరిపోతుంది జెరంత గడ్డపార పట్టుకొని పోరాదు నీయవ్వ..తవ్వుకుంట కూసుంటె తెలంగాణ ఎవడు దెస్తడే ? బిడ్డా..గా హాస్టల్ల పురుగులన్నం బెడుతుండ్రట అట్లవొయ్యి అడిగిరాపో అరే ఏందే నీ లొల్లి అటువోతే ఇటువోతే తెలంగాణ ఎవడుదెస్తడే కొడుకా..గా చెట్లను మొదట్లకు కొట్టేయకురా వాటి కొమ్మలనిండా గుత్పలున్నై మీ నాయిన వాటితోనె రణంజేసిండు ముసల్దానా-నా ఇజ్జత్ దీత్తవానే అవిటితోని మనింటికి దర్వాజలు జేయిస్త మనకు పతార కావల్నా వద్దా ? ఒరే వారి ..గా పిట్టల్ని చంపకురా అవి మనింటి పొల్లగాండ్లురా థూ నీయవ్వ ..ఇగ నన్ను బజార్లవడెయ్యి ఇంటికి బొక్కాసకచ్చినోన్ని అట్టిగ పంపిత్తమా ఏంది కొడుకా ఊకే ఏంబంటవురా అట్లదిరిగితే నలుగురు ఏమనుకుంటరో తెల్తది ఎట్ల నడుసుకోవాల్నో తెల్తది అరె ఏందే నీ సణుగుడు నా లెక్కలు నాకుంటై నా వ్యూహాలు నాకుంటై నాకు సిగ్నల్ వస్తంది మంచిగ కలవడుతున్నప్పుడే లేపి కూసుండవెడ్తవు థూ నీయవ్వ ..ఎక్కడిదే నీకీ గుణం కొడుకా..రాత్రిపూట ఒక్కనివి పోతున్నవు ఎటు పోతున్నవో చెప్తలెవ్వు ఏంజేస్తున్నవో తెలుస్తలేదు అగులు బుగులైతందిరా... నీయవ్వ నా మీద నమ్మకం లేదానే ఆంద్రా పార్టీలను బొందవెడ్తనని జెప్పిన గదనే జాగ కోసం ఎతుకుతున్నా నాయినా మరి..అర్రలకెల్లి ఎల్తలెవ్వు పొద్దంత అండ్ల ఏంజేస్తున్నవురా ఏ పోవే..నీకన్ని అనుమానాలే బంగారు పళ్ళెం జెయ్యద్దా అండ్ల నీకు బువ్వ పెట్టద్దా వద్దుర కొడుకా - మట్టిల పుట్టిన మట్టిల పెరిగిన మట్టి సిప్పల్నే దింట గీ మట్టిల్నే కలుస్త నువ్వు గా వంకర వోతన్న నల్లగొండ దిక్కు పొయ్యిరాపో ఎందుకే అమ్మా..ఒక్క నాలుగు రోజులాగు ఐతే ఈ నాలుగు రోజులు మన కరీం నగర్ గుట్టల్ల కావలి వండుపో అమ్మా..ఎందుకే సూదుల్తో పొడుస్తవు ఒక్క రెండు రోజులు ఈడ లెవ్వనుకో ఐతే..ఈ రెండు రోజులు హైదరాబాదుల కబ్జా ఐన భూములల్ల సిపాయి లెక్క కలబడకుంటమాయే అట్టిగ నిలవడి రాపో ఓ అవ్వా..ఎందుకే తిన్న తిండి పెయ్యిన వట్టకుండ సతాయిస్తవు ఒక్క దినం ఓపికవట్టు ఐతే ఈ దినం చచ్చి మన ఆత్మల జీవం బోసుకున్న యాదయ్యింట్ల దీపమై ఎలిగి రాపో అవ్వ నీ పుణ్యముంటది నన్ను సంపుక తినకు నువ్వు మనవనితోని వొయ్యి నాలుగుతీర్ల తీపి వస్తువలు కొన్నుక్క రాపో ఆడ కిందిమీద జేత్తన్న తెలంగాణ వస్తంది కొడుకా..ఆడ నువ్వు కిందిమీద జేసేదేముండది ఈడ ఓయు పోరగాండ్లతోటి పొడుస్తున్న పొద్దు కోసం పపతి వట్టుపో అవ్వా..నువ్వు ఓపికగల్లదానవు ఏండ్లాగినవు పూండ్లాగినవు ఒక్క గంట గడువియ్యి పొయ్యి మనవరాలితొ బతుకమ్మలెత్తుకుంట పోటువలు దిగుపో సరె కొడుకా ఈ గంట అటేటు వొయ్యి మన కవులేమనుకుంటున్నరో విని రాపో అవ్వా..బువ్వ ఉడికేదాంకాగినవు ఉమ్మగిల్లేదాకా ఆగవా ? నువ్వట్ల ఒరుగు..నిమిషంల లేపుత చూడు కొడుకా..గడువులు వాళ్ళ వీళ్ళకు గాదురా నీకిస్తున్న ఈ ఒక్క నిమిషంల నా బొండిగ పిసికి చంపు గప్పుడు గమ్యాన్ని ముద్దాడినోనివైతవు ఏందే గట్లంటవు కొడుకనిజూడకుండ నన్నంటె నిన్నట్లు గాదే సాలుతియి.. గీ లంగ మాటలకు ఏంతక్కువలేదు ఎప్పుడువడితే అప్పుడూద అది అగ్గి బిడ్డా పరాశికాలద్దు తండ్రులు కొడుకులకు కొరివి వెడుతంటే ఉద్యమం కాటికారా పోయేది ఇంట్ల వండి చేసిన యజ్ఞాలు గివ్వేనారా ఒక గుత్ప వట్టవు ఒక్క ఆయుధాన్నైన గురి చూసి స్పందించవు తురుంఖానువు నువ్వొక్కనివే అనుకుంటనే ఈడిదాకచ్చింది గా ఎస్టేట్ల ఎలుక గొద్దెలు పాతినవారా ఊకూకే తవ్వుక సూడ ఆ పండుడేదో పొయ్యి బయ్యారం గనులల్ల వండుపో మన సాలేట్ల నడువదో నేను జూత్త నడువూ పోలవరం కింద పొలికేక వెట్టు అదో లెక్క అట్టిగ వాన్ని కలుపుకోను వీన్ని కలుపుకోను ఏమిటికిరా సభలు ? బిడ్డ నువ్వు మంచిగుంటె నాకు పేరత్తది నువ్వు తప్పులవడితే తల్లి గిదేన చెప్పింది అని తిడుతరు కొడుకా.. ఏదిట్ల పిడికిలి వట్టు ఇదే మీ అమ్మనుకో పట్టు సడలియ్యకు నా ఆట పాట తెచ్చుకుంట దునియంత ఆడుతా మొగులునంత పాడుతా.. ఇగ అను ఒకసారి గట్టిగ జై తెలంగాణా

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgkXRB

Posted by Katta

కొనకంచి లక్ష్మి నరసింహా రావు కవిత

Happy Mother's Day కొనకంచి లక్ష్మి నరసింహా రావు అమ్మ ఒంటరి రాత్రి కంటి నుంచి జారిపోయే కన్నీటి చుక్క.. ఎకాంతం అల్లుతున్న నైలాన్ సాలెగూడు.. కాలం కురులను ఆర్ద్రంగా దువ్వే చల్ల గాలి.. గది చెక్కిలి పై చిరునవ్వుల్ని వొంపుతున్న మొనాలిసా.. అన్నీ అంతర్వలయాల్లొ కందకాలు తవ్వుతున్నట్లు చేతులు చాస్తాయి. స్తబ్దంగ కదలని కాలంలో చికటి నవ్వినట్లు నాకేమీ తోచని అర్ద రాత్రి తెల్లని మంచు ముద్ద కప్పేసినట్లు భయం.. భయం.! ఎడర్ల కావల నదుల కావల నా చిన్ని పారదర్శకపు నోరు తెరిచి నీ ఊపిరిని ఉగ్గులొ కలిపి తాగించావు . దీప శిఖల్లా. అక్షరల్ని దిద్దించి ఏకంత సరస్సులో తేలిన ఎర్ర కలువను చేసావు. పిడికెడు మూగ గుందెమీద పికాసో చెయ్యి గీసినట్లు బాల్యం నిండా అన్నీ చిత్రలే! అలసిపోయిన హ్రుదయం పట్టు తప్పి ఆకాశంలోంచి జారి పడ్డట్టు దీప స్థంభం కింద పొంచి ఉన్న చీకటి ఆవలిస్తూ వెక్కిరిస్తుంది . స్మృతుల సర్పాలు క్రూరంగా కాళ్ళకు చుట్టుకొని ఊపిరి తీసుకోనియకుండా బుసకొట్టి భయపెడతాయి . ఎంత బలంగా మూసినా జ్ఞాపకాలు మాత్రం కిటికీలు తెరుచుకొనొచ్చి తేనెటీగల్లా ముసురుకుంటాయి పొలిమెరల్లొ నిలబడి సౌందర్యం నా కొసం ఆప్యాయంగా ఎంత ఎదురుచూసినా డియర్ మమ్మీ... దీపావళికి ముందు రోజున మొదటిసారి నేను బాంబు కాల్చినప్పుడు నీ కల్లలో మెరిసిన ఆనందార్ద్రత నిప్పు నలుసులా నాకింకా గుర్తుంది . ఊపిరాడని రాత్రి రంగేసుకున్న మృత్యువు నన్ను రకరకాలుగా వేధిస్తున్నప్పుడు కన్నీళ్ళతో నీవు ఆసుపత్రిలో చేసిన యుద్దం అకాల మరణం పొందని ఈ అదౄష్టవంతుడికింకా గుర్తుంది . ఇంటి ముందు వేపచెట్టుకింద గుండెల్ని వణికించే సంక్రాంతి చలిలో నువ్వు తలంటుతుంటే పడ్డ కుంకుడు రసం మంట ఎదార్ల కీవల నదుల కీవల నాకింకా గుర్తుంది. భవిష్యత్తును కట్టేసి నగరం రాక్షసిగా నన్ను అడుగడుక్కి భయపెట్టినా నీ, ఆశీర్వాద బలంతో రగుల్కొంటున్న జీవకణంలా నేను. చీకటి కాగితం మీద మెరిసే రేడియం అక్షరంలా నీ అమృత హస్తాలతో దేశం బుగ్గ మీద పెళ్ళిబొట్టు పెట్టినట్లు నీ వారసునిగా నేన్నేను.

by కొనకంచి లక్ష్మి నరసింహా రావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g9uwD6

Posted by Katta

కొనకంచి లక్ష్మి నరసింహా రావు కవిత

Happy Mother's Day కొనకంచి లక్ష్మి నరసింహా రావు అమ్మ ఒంటరి రాత్రి కంటి నుంచి జారిపోయే కన్నీటి చుక్క.. ఎకాంతం అల్లుతున్న నైలాన్ సాలెగూడు.. కాలం కురులను ఆర్ద్రంగా దువ్వే చల్ల గాలి.. గది చెక్కిలి పై చిరునవ్వుల్ని వొంపుతున్న మొనాలిసా.. అన్నీ అంతర్వలయాల్లొ కందకాలు తవ్వుతున్నట్లు చేతులు చాస్తాయి. స్తబ్దంగ కదలని కాలంలో చికటి నవ్వినట్లు నాకేమీ తోచని అర్ద రాత్రి తెల్లని మంచు ముద్ద కప్పేసినట్లు భయం.. భయం.! ఎడర్ల కావల నదుల కావల నా చిన్ని పారదర్శకపు నోరు తెరిచి నీ ఊపిరిని ఉగ్గులొ కలిపి తాగించావు . దీప శిఖల్లా. అక్షరల్ని దిద్దించి ఏకంత సరస్సులో తేలిన ఎర్ర కలువను చేసావు. పిడికెడు మూగ గుందెమీద పికాసో చెయ్యి గీసినట్లు బాల్యం నిండా అన్నీ చిత్రలే! అలసిపోయిన హ్రుదయం పట్టు తప్పి ఆకాశంలోంచి జారి పడ్డట్టు దీప స్థంభం కింద పొంచి ఉన్న చీకటి ఆవలిస్తూ వెక్కిరిస్తుంది . స్మృతుల సర్పాలు క్రూరంగా కాళ్ళకు చుట్టుకొని ఊపిరి తీసుకోనియకుండా బుసకొట్టి భయపెడతాయి . ఎంత బలంగా మూసినా జ్ఞాపకాలు మాత్రం కిటికీలు తెరుచుకొనొచ్చి తేనెటీగల్లా ముసురుకుంటాయి పొలిమెరల్లొ నిలబడి సౌందర్యం నా కొసం ఆప్యాయంగా ఎంత ఎదురుచూసినా డియర్ మమ్మీ... దీపావళికి ముందు రోజున మొదటిసారి నేను బాంబు కాల్చినప్పుడు నీ కల్లలో మెరిసిన ఆనందార్ద్రత నిప్పు నలుసులా నాకింకా గుర్తుంది . ఊపిరాడని రాత్రి రంగేసుకున్న మృత్యువు నన్ను రకరకాలుగా వేధిస్తున్నప్పుడు కన్నీళ్ళతో నీవు ఆసుపత్రిలో చేసిన యుద్దం అకాల మరణం పొందని ఈ అదౄష్టవంతుడికింకా గుర్తుంది . ఇంటి ముందు వేపచెట్టుకింద గుండెల్ని వణికించే సంక్రాంతి చలిలో నువ్వు తలంటుతుంటే పడ్డ కుంకుడు రసం మంట ఎదార్ల కీవల నదుల కీవల నాకింకా గుర్తుంది. భవిష్యత్తును కట్టేసి నగరం రాక్షసిగా నన్ను అడుగడుక్కి భయపెట్టినా నీ, ఆశీర్వాద బలంతో రగుల్కొంటున్న జీవకణంలా నేను. చీకటి కాగితం మీద మెరిసే రేడియం అక్షరంలా నీ అమృత హస్తాలతో దేశం బుగ్గ మీద పెళ్ళిబొట్టు పెట్టినట్లు నీ వారసునిగా నేన్నేను.

by కొనకంచి లక్ష్మి నరసింహా రావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g9uwD6

Posted by Katta

Jyothirmayi Malla కవిత

గజల్ రచన:సినారె అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు ఈబండి చూడరా నాన్నా ఈ గుఱ్రమింక నీదన్నా తెగమంకుతో చిననాడు దిగలేదు అమ్మ మూపు రొదలలో మౌనపాఠంలా వ్యధలలో జ్ఞానపీఠంలా నా బాల్యమంతా తానే నడిపింది అమ్మచూపు చీకటికి చంద్రబింబంలా ఆకలికి పూర్ణకుంభంలా నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ్మ రూపు మెరిసే ప్రభాత కిరణంలా విరిసే వసంత కుసుమంలా పెరిగే సినారె బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు

by Jyothirmayi Mallafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNnxi9

Posted by Katta

Jagadish Yamijala కవిత

అవీ ఇవీ .......................... రాయి రాయి ... నాకో ఉత్తరం రాయి నన్ను ప్రేమిస్తున్నానని కాదు నువ్వు మరెవరినీ ప్రేమించడం లేదు అనయినా రాయి --------------- అద్దంలో చూసాను చదివాను ఒక కవిత అది నీ ముఖారవిందం ------------------- ఎప్పుడో ఒక రోజు నిన్ను మరచిపోతాను ఆరోజు గాలి వీయదు ప్రేమ అదృశ్యమైపోతుంది ---------------------- నీ పెదవులు పలికేదాకా నేను అనుభూతి చెందలేదు నా పేరు అంత అందంగా ఉందని ------------------------ విజయమనేది పొందేందుకు.... ఓటమి అనేది నేర్చుకోవడానికి ------------------- ప్రేమకు కళ్ళు లేవనేది అబద్ధం నీ కళ్ళను చూసిన తర్వాతే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను ----------------- తమిళ మూలం కవి వైరముత్తు అనుసృజన యామిజాల జగదీశ్ -------------------------------- 11.5.2015 ----------------------------

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNnuD6

Posted by Katta

కాశి రాజు కవిత

మేముప్పుడు నీ ముందుట్టినట్టు ఊకట్టడం నేర్పావు. ఓరగా సూడడమో వద్దని అలగడమో నీకు తెలిసింది బాగుందిప్పుడు కన్నా! పాల బుగ్గల్తో పచ్చోసనొస్తూ ముద్దెట్టుకుంటే మురిపిస్తున్నపుడు కళ్ళెందుకు మూస్తానో తెలుసా. సొంగకార్చి ఆరిన నీ వొంటివాసన నాకెందుకు నచ్చుద్దో తెలుసా మీ అమ్మపక్కలో రొమ్ము తడుముతూ నువ్వే చేసే హైరానాతో ఇంతెదిగాక నేనూ శాసించడం నేర్చాను మా అమ్మను ఆకలవుతుందే అన్నం పెట్టని గద్దించి అడుగుతున్నాను. 11/5/14

by కాశి రాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jeGoOo

Posted by Katta

Rvss Srinivas కవిత

|| ముగ్గురూ తల్లులే || వాసుదేవా !బంగారు తండ్రీ! అంటూ పిలుస్తూ అప్పుడే చిలికిన వెన్నని తినిపించేది పాలదాలిలో కాచిన కమ్మనిపాలు ఒడిలో కూర్చోబెట్టుకు తాగించేది కొంగుతో మూతి తుడుస్తూ రాజుల సారెలలోని పూతరేకుల్ని నాకొక్కడికే తినిపించేది అందరి కళ్ళు కప్పుతూ ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా తాను తినేడప్పుడు పెట్టే ఒక్కముద్దతోనే కడుపునిండేది నాకు. మనసు వెన్నపూస మాట వెన్నెల జల్లు అమ్మలా నన్ను పెంచింది పదహారేళ్ళు అమ్మకి అమ్మ మా అమ్మమ్మ. _/\_ *** *** *** మా చదువులకోసం నాన్నకి దూరంగా ఉంటూ అమ్మ చేసిన త్యాగం మరపురానిది మార్గదర్శి ...మా అమ్మ నడిపిస్తూ నడవడికలు నేర్పుతూ లక్ష్యాన్ని చేరుకోడంలో అనుక్షణం సాయపడింది. మాకు ఆశీస్సులు అందించి స్వర్గంలో దేవతలకి అనురాగామృతం పంచేందుకు వెళ్ళిపోయింది _/\_ *** *** *** నాన్నా తిన్నావా! అంటూ పలకరిస్తుంది ఎక్కువసేపు కంప్యూటర్ మీద కూర్చోకండి. టైంకి తినండి ...మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆరిందాలా కబుర్లు చెప్తుంది చిన్నప్పటినుండి ఒక్కక్షణం నన్నొదిలి ఉండక, చదువులకోసం ఇంటినుండి వందల మైళ్ళు దూరంలో ఉన్న నా చిట్టి'తల్లి' ...@శ్రీ 11/05/14

by Rvss Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RB9JwZ

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా............తొక్కబడ్డావు....... సంక్షప్తంగా వద జరుగుతు0ది కష్టమే ఫలమనే బ్రమలో నువైతు0ది బలి. విభజన జరిగిపోయి0ది ఏ భాగాన్ని వద్దనుకొని ము0దుకడుగు వెయ్యగలవు కులంగా మతంగా నగరంగా గూడె0గా చెప్పాలంటే చాటేడంత మహ ఇతిహసాల్లోని పేజిల్లా.....పాలి0పబడడానికి. ఇ0టి ము0దు దిష్టి బొమ్మగా ఊరి చివర బొడ్రాయిగా మేడలకు ప్రహరీగా చాకచక్యంగా తీర్చిదిద్దబడ్డావు. మీలో మీకే పందాలు పెట్టి కొట్టుకొని ,కోసుకొని కోసుకోని చస్తే ,ఒక సారి ఆనందపడదామనే ప్రణాళికల మధ్య- వాళ్ళ బ్రతుకు చిగురికి అ0టుగా- కట్ఝుదిట్ఝంగా బానిస చేయ్యబడ్డావు వృత్తిని తక్కవ చేసి చెస్తు0ది ధరిస్తు వెలివెయ్యబడ్డావు. మనుషులంతా సమానమని చెప్పే ఈ కులమతాలు పక్కను0డి చెప్పకు0డా కులమతాల గలీజును ఎ0దుకు ధరి0చాయ్యే ఒక్క సారి నిలబడి ఆలోచి0చు. 11-05-2014

by Mothi Mohanarangafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RB9JwT

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

(తల్లుల రోజట....అహా ఆహా హా...) గుప్పెడు అన్నం పెట్టండి చాలు . అమ్మంటే దేవతని అమ్మంటే అనురాగ మూర్తని అమ్మంటే ఆది శక్తని ఇంకా ఇంకా ఎన్నో బిరుదులు అమ్మ గోరు ముద్దలు తినకుండా అమ్మ లాలి పాట వినకుండా ఎవరైనా పెరుగుతారా అమ్మ గుర్తొస్తే..... గోరు ముద్దలేనా గుర్తొచ్చేది లాలి పాటలేనా గుర్తొచ్చేది అమ్మ ఒక చాకిరీ యంత్రమని అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని అమ్మ ఒక సంక్షుభిత రూపమని పగలు రేయి తేడా తెలియని పనుల వలయంలో అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్ అందరి కడుపులూ నింపే అక్షయ పాత్ర తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు కలో గంజో ఆమె కడుపు లోకి కన్న వాళ్ళ కట్టు కున్నవాళ్ళ కలల సాకారమే ఆమె నిరంతర కృషి అమ్మతనపు ఆత్మీయతని అన్నంలో కలిపి తినిపిస్తుంది కట్టుకున్న వాడు అహరహం నరనరాన్ని నలుచుకుతింటున్నా చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది తన గుండెల్లో గునపాలు దిగుతున్నా పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది ఇంత చేసి............... రెక్కలొచ్చిన పిల్లలు తలో దిక్కూ ఎగిరిపోతే గుండె చెరువై కూలబడుతుంది అమ్మంటే దేవతని అన్నదెవరురా సిగ్గుపడాలి మనం ఆ మాట అన్నందుకు దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి అమ్మని దేవతని చేసిన చోటనే అడుక్కుంటున్న ఈ అమ్మలెవరో మరి ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర... రోడ్ల కూడళ్ళ దగ్గర అత్యంత దీనంగా అడుక్కుంటున్న ఈ గాజు కళ్ళ అమ్మలందరూ దేవతలేనంటారా??? వృద్ధాప్య కేంద్రాల్లో శూన్యంలోకి చూస్తూ కుమిలిపోయే అమ్మలందరూ దేవతలు కాదా!!! అమ్మ మనిషి, అమ్మకి అన్నం కావాలి అమ్మకి ప్రేమ కావాలి అమ్మకి మందులు కావాలి అమ్మకి బట్టలు కావాలి అమ్మకి అన్నీ కావాలి అమ్మంటే దేవతని ఒట్టి మాటలొద్దు గోరు ముద్దలు తినిపించిన అమ్మకి గుప్పెడు అన్నం పెట్టండి చాలు...

by సత్యవతి కొండవీటిfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jN85T2

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అమ్మ-ఆదిశక్తి వ్యక్తిలోని సకలశక్తులకు మూలం కనుక అమ్మ-తొలిగురువు ప్రపంచాన్ని పరిచయం చేసి జీవనయానానికి సన్నద్ధం చేస్తుంది కనుక అమ్మ-అంతులేనిమమతల ఆకాశం అనితరసాధ్యమైన రీతిగా ప్రమసుధావర్షధారలు కురిపిస్తుంది కనుక 11-5-2014 మే-2013

by Aravinda Raidu Devinenifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qtpvc4

Posted by Katta

Sree Kavita కవిత

|| మాతృ దేవో భవః || 'శ్రీ' కవిత 11.05.2014 'అ' అంటే అమృతం 'మ' అంటే మమత ఈ రెండు అక్షరాల క్షమత 'అమ్మ' పదం అమ్మే నే పలికిన తొలి పలుకు అమ్మ స్పర్శే నే పొందిన తొలి ప్రేమ అమ్మే నాకు ఓనమాలు నేర్పిన తొలి గురువు అమ్మ పలుకు అద్వితీయం అమ్మ పలుకు కమ్మదనం అమ్మ పలుకు ఆచంద్రార్ఖం అమ్మ నిజమైన ప్రేమకి నిలువెత్తు రూపం అమ్మ నిజమైన కరుణకి కదిలే దైవం అమ్మ నిజమైన లాలనకి ఆలనా పాలనా 1. జనని నవమాసాలు మోసి పురిటి నొప్పులు పంటి బిగువున ఓర్చి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి జన్మనిచ్చే మాతృ మూర్తి తన బిడ్డ ధరణిపై అడుగిడుతూనే నొప్పులు మరిచి మురిచి గుండెలకు హత్తుకొని లాలిస్తూ ప్రేమని కురిపించే అమృత వర్షిణి 2. మాత ఏడవగానే తన రక్త మాంసాలు కరిగిస్తూ పాలిస్తూ పరవశించే ప్రియవదనం నిద్రాహారాలు మానీ తన బిడ్డకు పోశాకాహారాలిచ్చే అక్షయం చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కిరావే అంటూ గోరు ముద్దలు తినిపించే అన్నపూర్ణ రాగం రాకున్నా అనురాగంతో లాలిపాటతో అవలీలగా నిద్రపుచ్చే లాలిని ప్రియగామిని 3. తల్లి తప్పటడుగులు మాన్పి బుడి నడకలు నేర్పి బుజ్జగింపులతో నడవడిక మార్చే నేర్పరి ఓంకారంతో మొదలుపెట్టి అమ్మపేరుతో రాతలు దిద్ది తలరాతను మారేల శ్రమించే బ్రాహ్మణి చెడుగుణాలను తుంచి మంచిని పెంచి ఓటమిలో ఓదార్చి ఆత్మ విశ్వాసం నింపే స్పూర్తి ప్రదాత అమ్మ అని పిలుపు వినగానే ఎక్కడ ఉన్నా పరుగెత్తుకొని వచ్చి అక్కున చేర్చుకొనే ఆదరణీయ మూర్తి 4. అమ్మ ఏప్రతి ఫలం ఆశించని ప్రేమే అమ్మ ప్రగతిని ఆకాంక్షించే అభిలాషిని అమ్మ ఎంత ఎత్తు ఎదిగినా చంటి పాపలా చూసుకొనేది అమ్మ పేగుబంధంతో మొదలై మమతల బంధంతో మిగిలేది అమ్మ ఓ మాతృమూర్తి ఏలా తీర్చుకోగలను నీ ఋణం ఏమిచ్చినా తక్కువే అందుకే అందుకో స్వీకరించు నా వందనం పాదాభి వందనం ఓ జనని నువ్వు నాతో లేకున్నా నీ నామ స్మరణతోనే నా ప్రతి అడుగు నిన్ను తిరిగి తీసుకురాలేను కానీ నా కూతురులో నీ రూపాన్ని చూసుకుంటూ అమ్మా అని పిలుస్తూ అపురూపములా పెంచుకుంటూ కొంతైనా నీ ఋణం తీర్చుకుంటా ఆశీర్వదించు మాతృమూర్తులందరికీ... వందనం......!!.మాతృ దేవో భవః !!

by Sree Kavitafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fY1LbZ

Posted by Katta

Kapila Ramkumar కవిత

|| శ్రీకాంత్||శ్రీశ్రీ ||| నీ కవిత ఓ ఖడ్గసృష్టి . నీ జీవితం ఓ మహాప్రస్థానం .. నీ కావ్యం చదివిన క్షణం - తీరింది నా కవితా దాహం . ఆగింది నా కలం .. కోరింది నీ పాదదాసోహం। జీవితమనే అంపశయ్యపై ఊరేగుతోంది నా శవం . నీ పేరువిన్న ప్రతిక్షణం - మ్రోగుతోంది నాలో మురళీనాదం... మొదలైంది ఓ కవితాభావం ... నీ జీవితం అమరామరం॥ sreesree244@gmail.comhttp://media.andhraprabha.com/Images/article/2014/5/3/kavithaT.jpg

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jepQpG

Posted by Katta

Kapila Ramkumar కవిత

Alone, Looking for Blossoms Along the River The sorrow of riverside blossoms inexplicable, And nowhere to complain -- I've gone half crazy. I look up our southern neighbor. But my friend in wine Gone ten days drinking. I find only an empty bed. A thick frenzy of blossoms shrouding the riverside, I stroll, listing dangerously, in full fear of spring. Poems, wine -- even this profusely driven, I endure. Arrangements for this old, white-haired man can wait. A deep river, two or three houses in bamboo quiet, And such goings on: red blossoms glaring with white! Among spring's vociferous glories, I too have my place: With a lovely wine, bidding life's affairs bon voyage. Looking east to Shao, its smoke filled with blossoms, I admire that stately Po-hua wineshop even more. To empty golden wine cups, calling such beautiful Dancing girls to embroidered mats -- who could bear it? East of the river, before Abbot Huang's grave, Spring is a frail splendor among gentle breezes. In this crush of peach blossoms opening ownerless, Shall I treasure light reds, or treasure them dark? At Madame Huang's house, blossoms fill the paths: Thousands, tens of thousands haul the branches down. And butterflies linger playfully -- an unbroken Dance floating to songs orioles sing at their ease. I don't so love blossoms I want to die. I'm afraid, Once they are gone, of old age still more impetuous. And they scatter gladly, by the branchful. Let's talk Things over, little buds ---open delicately, sparingly. ____ ___11/5/2014 Tu Fu

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ohw4Nu

Posted by Katta

Jaya Reddy Boda కవిత

/// జయరెడ్డి బోడ /// చెడగొట్టు వాన /// నేలపుత్రునిగా జన్మించి అన్నదాత వారసునిగా ఎదిగి పల్లె పడచుల అందాల మధ్య వెచ్చని అనుభూతిని చెంది కష్టమే తెలియని పక్షి దశలోనే ప్రకృతి పెట్టిన స్వచ్చమైన ఆహారానికి పాత్రుడవై .. మేధావిగా ఎదిగి పట్నంలోకి ఎగిరెల్లిన వాడా అక్కడి యాంత్రికత్వానికి వెగటు పుట్టి పల్లె పంచిన మధుర జ్ఞ్యాపకo లోనే బ్రతుకీడుస్తున్నావ అలాగే నీ జ్ఞ్యాపకాల ఊపిరిలో నైనా చల్లగా సేదదీరు స్నేహితుడా .. ఇప్పుడిక్కదంతా మొన్న ప్రసరించిన ఎండ వేడికి పలిగిన నెర్రెల్లో, ఎండిన చేల్లల్లో మాడిన మొఖాల్లోని లోతైన మనుషులే అగుపిస్తారు ఇక నిన్న కురిసిన అతివృష్టి అకాల వర్షానికి,, క్రింద మీద పడి కూడేసుకున్న వడ్ల గింజలకు రెక్కలొచ్చి వాన నీటి లో కొట్టుకు పోతుంటే బిగపట్టుకున్న కడుపులోని కడివెడు దుఃఖంతో, అయినా మొక్కవోని దైర్యంతో వాటికి చేతులడ్డు పెడుతూ కన్నీరు కూడా కనిపించనియ్యని "ఆ చెడగొట్టు వాన లో" బీటు బజారులలో పిల్ల పాపలతో అన్నయ్యలు వదినమ్మలు ముసలి తల్లులు తండ్రులు హృదయ విధారకంగా అయ్యా ,ఇక నీ ఉహాల లోకం అలాగే సాగనీ, తప్పి దారి పొరపాటున ఇటు వైపు రాబోకు మిత్రుడా మోడువారడం.. పుష్పించడం అలవాటైన ఈ పల్లె మొరటు మనుషుల మధ్యన ... సున్నితత్వంతో...తట్టుకొని నువ్వు నిలువలేవు జాగ్రత్త!!! (11-05-2014)

by Jaya Reddy Bodafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g8kz8T

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ అమ్మ @ అవని గర్భాన దాగిన ఖనిజాలెన్నో ధరణి ధరించిన ప్రకృతి సిరులెన్నో పుడమి భరించే పురిటి భాధలెన్నో వసుధ వేదికగా జన్మించే జీవలెన్నో ఓ అమ్మా...! నీ కడుపున మాకు ప్రాణం పోసి నీ గుండెలపై మమ్ముల మోసి నేలకె నువ్వు తలమానికమైనావు. _కొత్త అనిల్ కుమార్ 11/5/2014

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWhMNe

Posted by Katta

Chi Chi కవిత

_IdentitY_ దేనికీ లేదు మనిషిక్కూడా మనిషనుకోడమే..మనిషిననుకోడమే!! నన్ను భూమనమన్నాకొడుకెవడని భూమడగదు గనకనుకుంటున్నావ్!! అసలేదీ అడగలేదు దాన్నేదో అనుకోమని.. అనుకోడమే ఆయుధమైంది అందరిమీదందరికీ!! నీకది సమయం..సమయానికి నువ్వేంటి? నీకిది లోకం.. లోకానికి నువ్వేంటి? చాలు!! మౌనం భయపెడితే మరణం నవ్వుతుంది నీ బతుకంతా.. నువ్వు గుర్తించే జ్ఞానమంతా కాగల గుర్తింపు నీది జ్ఞానమే నిన్ను గుర్తించదు దానికదెందుకో దానికే తెలీదు దానికి నువ్వెందుకింక!! నీ నియమాలకు నువ్వొద్దు నీ ప్రశ్నలకు నువ్వొద్దు నీక్కావాల్సిన వేటికీ నువ్వొద్దు అవి నీక్కావలంతే!! ఒప్పుకోవా? మంచిది నీ ఒప్పుకోలు కూడా దేనికీ అక్కర్లా నిన్నొప్పుకోలేదన్నఏడుపు లేకుంటే చాలు నిన్ను నువ్వొప్పేస్కున్నట్టే!!___(11/5/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWhNRc

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

//అలుపెరుగని బాటసారి// ------------------------------ // శ్రీనివాసు గద్దపాటి// -------------------- అగ్నిసాక్షిగా కలిసి ఏడడుగులతో మొదలై అండగా నడవాల్సిన అడుగులు కాస్తా అర్థాంతరంగా ఆగిపోతే....! ఒంటరి బాటసారివై ఎన్ని కన్నీటి మజిలీలు దాటావో...?! తుఫానుదెబ్బకు గూడుచెదిరిన గువ్వ పిల్లల్లాంటి మమ్ముల్ని ఆప్యాయతనే రెక్కలమాటున పొదువుకొని ఎన్ని శోకసముద్రాలీదావో.....? సూర్యునితో మొదలై సుక్కలదాకా నువ్వొక్కదానివే కదమ్మా ఎన్ని పాత్రలు పోషించావో...? కంటినిండా ధైన్యం గుండె నిండా ధైర్యం ఎన్నో ముండ్ల బాటల్ని... మాకై పూలబాటలుగా మారుస్తూ... అలుపెరుగని బాటసారిలా సాగుతున్న అమ్మా.......నీకుహాట్సాఫ్.....!!! (మాతృదినోత్సవం సందర్భంగా ...అమ్మకోసం) 11.05.2014

by Srinivasu Gaddapatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RA1f9p

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు -33 . మీరు ఇంతవరకు Jacob Barnett పేరు విని ఉండకపోతే, మీరు అతన్ని గురించి తెలుసుకోవడం అవసరం. ఈ లింకులో (http://ift.tt/1syaFzg) TEDxteen లో అతని ప్రెజెంటేషన్ చూడవచ్చు. తారే జమీన్ పర్ చిత్రం మనకి "ఆటిజం" గురించి అవగాహన కలిగించడంలో తోడ్పడి ఉండవచ్చు గాని, అటువంటి పిల్లలని పెంచడానికి ఎంత మానసిక పరిణతి, ఆత్మస్థైర్యం, మొక్కవోని ఆశ, పెంచే వ్యక్తి (వ్యక్తుల)కి నమ్మకం ఉండాలో చెప్పనక్కరలేదు. జీవితంలో నిజమైన సవాలు అదే. గెలుపుకి అతి తక్కువ అవకాశం ఉన్న చోట, 2 సంవత్సరాల వయసులో ఇక Jacob జీవితాంతం మాటాడలేడు అని వైద్యులు ఆమె ఆశలపై నీళ్ళు జల్లితే, వాళ్ళ సలహాని పక్కనబెట్టి అతని తల్లి Kristine Barnett … ఇప్పుడు Einstein అంతటివాడుగా ప్రపంచంలోని మేధావి వర్గాలు Jacob ని గుర్తించేలా పాటుపడింది. అతను ఖగోళశాస్త్రానికి సంబంధించి సంక్లిష్టమైన సమస్యలకి సమాధానం కనుక్కుందికి ప్రయత్నిస్తున్నాడు. అయితే దీనికీ కవిత్వానికీ ఏమిటి సంబంధం? అన్న ప్రశ్న మీకు రావచ్చు. మీకు ఇచ్చిన పై లింకులో అతనో మాట అన్నాడు. మీరు కాలేజీలో చదివేవన్నీ మరిచిపొండి ... అని. శలవుల్లో మీకు ఏది ఇష్టం అయితే దాన్ని ముందుకి తీసుకుపొండి. మీకు ఏది ఇష్టమైనదో మీరే నిర్ణయించుకోవాలి అని కూడా అన్నాడు. మనకి చదువు అంటే వివేచనాత్మక పరిజ్ఞానం కాదు, కేవలం ఎవరో చెప్పినది యధాతథంగా, ఏ సంశయాలూ లేకుండా (implicit గా) అంగీకరించి బట్టీయం వెయ్యడమే. ఇప్పుడు చెప్పబోయే కవితలోని తాత్పర్యంకూడా సరిగ్గా అదే. అందుకు ఈ ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది. బాల్యంలో ఉండే అద్భుతమైన "Creativity" ని బయటకి తీసుకురావడంలో మన విద్యావిధానం విఫలమౌతోంది. కేవలం వినియోగదారులు తయారవుతున్నారుతప్ప, ఉత్పత్తిదారులు తయారవడం లేదు. మనిషిచేసే అన్ని investments లోనూ అతి పెద్ద risky investment చదువుపై కాలాన్ని మదుపు పెట్టడం. యవ్వనంలో ఉన్న మనిషికి ఒక్కొసారి ఈ సందేహం కలుగుతుంటుంది... నా చదువు ఎందుకైనా పనికివస్తుందా? … అని. జీవితంలో కొంత పరిణతి సాధించినతర్వాత, మనకున్న అపోహలు ఒక్కటొకటిగా కరుగుతున్నప్పుడు చదువు ఏ మేరకి జీవితంలో పనికివస్తుందో / లేదా పనికిరాదో తెలుసుకుంటున్నప్పుడు, అనుభవానికి ఉన్న ప్రాధాన్యత అర్థమై, కొన్ని విశ్వాసాలను "unlearn" చెయ్యవలసిన ఆవశ్యకత అర్థమౌతుంది. అందరి జీవితానుభవాలూ ఒక్కలా ఉండవు కాబట్టి ఎవరికి వారు unlearn చేసే విషయాలు మారుతుంటాయి. ఈ క్రమంలో, మన అభీష్టాలకి వ్యతిరేకంగా జరిగే కొన్ని సమకాలీన మార్పులను మన అవగాహనా రాహిత్యం వల్ల, అయిష్టతవల్ల వాటిని మార్పులుగా గుర్తించం, అంగీకరించం. దానిఫలితమే మనం అంతర్ముఖులమైపోవడం. (బహుశా, ఇక్కడ ఈ “చలి-విడిది” సన్నిహితమౌతున్న మృత్యువుకి సంకేతం కూడా కావచ్చు. ) . చలి – విడిది . చాలామందికి వయసు పైబడుతున్నకొద్దీ చాలా తెలుస్తాయి అయితే, వాటికి వేటికీ నేను పెద్దగా విలువివ్వను. నా రెండో పాతిక సంవత్సరాల జీవితాన్ని విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నది మరిచిపోడానికీ ఆ తర్వాత జరిగిన విషయాలు అంగీకరించడానికి నిరాకరించడంలోనూ గడిపేను. నాకు ఇప్పుడు పత్రికలలో కనిపించే పేర్లేవీ పరిచయం లేదు. ఇప్పుడిప్పుడే మనుషుల్ని గుర్తుపట్టలేక వాళ్లకి కోపం తెప్పించడంతోబాటు వాళ్ళు చెప్పిన చోట్లలోఎప్పుడూ లేనని ఒట్టేసిమరీ చెబుతున్నాను నాకు నష్టం కలిగించేవి అన్నిటినీ అలా చివరి వరకూ ఒకటి తర్వాత ఒకటి తుడిచెయ్యగలిగితే దాని ప్రయోజనం ఉంటుంది. అప్పుడు నాకు తెలిసినవేవీ ఇక మిగలక, నా మనసు అంతర్ముఖమౌతుంది... చేలలా, మంచులా. . ఫిలిప్ లార్కిన్ (9 August 1922 – 2 December 1985) ఇంగ్లీషు కవి . The Winter Palace . Most people know more as they get older: I give all that the cold shoulder. I spent my second quarter-century Losing what I had learnt at university. And refusing to take in what had happened since. Now I know none of the names in the public prints, And am starting to give offence by forgetting faces And swearing I've never been in certain places. It will be worth it, if in the end I manage To blank out whatever it is that is doing the damage. Then there will be nothing I know. My mind will fold into itself, like fields, like snow. . Philip Larkin (9 August 1922 – 2 December 1985) English Poet and Novelist

by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1syaFzh

Posted by Katta