పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జూన్ 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ఏమి నీ సౌందర్యం..: అబ్బ ఎంత కమ్మదనమో.. నీ మాటల మాధుర్యాల తేనియ ఊటలని తెలిసి ఎంతో సంతసించాను..! అబ్బ ఎంత తీయదనమో.. నీ కన్నులు చిమ్మిన మదనుని విరి భాణాలని తెలిసి ఎంతో అబ్బురపడ్డాను..! అబ్బ ఎంత చలువో.. నీ బిగి కౌగిలిన కరిగిన కాలం చిందించిన చిరు స్వేదమని తెలిసి ఎంతో మైమరచిపోయాను..! అబ్బ ఎంత మైకమో.. నీ సోయగపు మేనును వీడిన సమీరం మొసుకుని తెచ్చిన చందనపు సౌరభాలను ఆఘ్రాణించి హతాశుడనయ్యాను..! అబ్బ ఎంత సౌకుమార్యమో.. నీ మెత్తటి చూపులు విరితూపులై సుతిమెత్తగా నా హృదయకుహారాన్ని ఆక్రమించడం అనుభవించి ఎంతో ఆనందపడ్డాను..! ఎంతై మోహమో.. నీ వన్నెలు చిన్నెలు అంబరపు అనంతకోటి తారకల మెరుపులకన్ననూ మించు కౌస్థుభ ప్రభాసమని అర్ధమై విభ్రాంతుడనయ్యాను..! ఏమి నీ సౌందర్యం.. బృందావని విహారం..!! ఏమి నీ సౌందర్యం.. స్వర్గ లోక నివాసం..!! 14/06/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lvc4Vn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి