పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

Venkata Prabhakar Elaprolu కవిత

నాకు తెలుసు ప్రియా.......... వెన్నెల విరబూస్తున్నప్పుడు మంచు కురుస్తున్నప్పుడు పువ్వు వికశిస్తున్నప్పుడు నీ జ్ఞాపకం నా గుండెను సుతారంగా మీటుతుంది అప్పుడు మొదలైన స్పందన నా గుండె కొలిమిలో ప్రేమ జ్వాలలు రగిలిస్తుంది నీ చూపులు నా హృదయాన్ని నిర్దయగా దోచుకుంటాయి అప్పుడే స్నిగ్ధ దరహాసంతో నా ఎదుట నిలుస్తావు రాత్రి పగలు తేడా లేదు దినం దినం క్షణం క్షణం నీ ఆరాధనలో నా మనసు పవిత్రమవుతుంది నా జీవితాన్ని హారతిగా అందిస్తే సంధ్య వెలుగుల కౌగిలిలో ఒదిగి కర్పూరంలా కరిగి నాలో లీనమవుతావు.... వకరికి ఒకరై మనిద్దరం ప్రేమ సామ్రాజ్యాన్నిఎలేస్తాం.................. ప్రభాకర్...............

by Venkata Prabhakar Elaprolu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fnwZlO

Posted by Katta

Saif Ali Gorey Syed కవిత

ఖమ్మం జిల్లా కు చెందిన కవులకు అద్భుత అవకాశం నా దర్శకత్వం లో లవ్ ఇన్ ఖమ్మం LOVE in KHAMMAM cinema తయారవుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఖమ్మం జిల్లా చరిత్ర మీద రచించిన జానపద శైలి లో పాటలు కావాలి ఈ సినిమాకు బేషరముగా పాటలు రాసే ఆసక్తి ఉన్న కవులు బేషరముగా నన్ను సంప్రదించగలరు director@aimwonders.com www.filmywonders.com

by Saif Ali Gorey Syed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cM2hGd

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy ||పిచ్చాడిలా తిరుగుతునే ఉన్నా గమ్యిం తెలీక నీకోసం || -------------------------------------------------------------------------- మిగిలిపోయిన గాయాల గురించి బెంగలేదు..గుండెలో పగుళ్లిచ్చిన కలల గురించి పశ్చాత్తాపం అయినా ఆదరించే వారేడి ముళ్లను కౌగిలించునున్నా అదే నీ ప్రేమని తెలీక కళ్లు నులుముకున్న ప్రతిసారీ కన్నీళ్ళే వస్తున్నాయి నిప్పులకుంపట్లు బయటకు దూకుతున్నాయి నీజ్ఞాపకాలై తెల్లవారుజాముల్లో ఎన్నెన్ని మరణాలు చీకటితెరల్ని చించుకుంటూ.. నాకు నేను మరనిస్తూ వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ.. నన్ను నేను అసహ్యించుకొంటూ చచ్చుబడిన క్షనాలను నిద్రలేపిన నీ తియ్యటి గుర్తులు.. నన్ను వెక్కిరిస్తున్నాయి అక్షరాలు అలసిపోయేదాకా.. పిచ్చిరాతలు రాస్తూనే ఉన్నా అలుపెరగక గుండెలమీద రెపరెపలాడే జ్ఞాపకాల పేజీలు నేనేంటొ తెల్సి కూడా నన్ను వెతుక్కుంటూ చుట్టూ సూర్యకిరణాల పరిభ్రమణం చేస్తునే ఉన్నాయ్ మైలురాళ్ల వెంట ఆహ్వానతోరణాలు.. నీవనే తియ్యటి జ్ఞాపకాలు తీరం చేరిన ప్రతిసారీ ఎక్కడో నేను ఓడిపోయిన నిజం పరుగెత్తే మోహంలో .. నన్ను కాటేస్తున్న నిజాలు ఏమేం పోగొట్టుకున్నానో గుర్తించలేక. నేనోడిపోయాను రాలిపడుతున్నగతాన్ని ఏరుకుని మళ్లీ ఒంటికి అతికించుకోలేక పిచ్చాడిలా తిరుగుతునే ఉన్నా గమ్యిం తెలీక నీకోసం

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etqvBR

Posted by Katta

Aruna Naradabhatla కవిత

చిత్రం _______అరుణ నారదభట్ల మనుషులు ఎంత చిత్రమో మససులూఅంతే చిత్రం! ఇంటిముందు కట్టేసిన మేకపోతుకూ ప్రేమగా ఆకులు తినిపిస్తూ పిల్లలగెంతులాట.... అరేయి...మంచినీళ్ళు కావాలా... దాహమేస్తుందేమొరా...నీళ్ళిస్తాను అనే పసి చేష్టల హృదయ స్పందన పశువుల మనసును తేలికగా చదివేస్తుంది! తెచ్చిపెట్టిన పండగ రేపో...మాపో దాని ప్రాణాలను గాలిలో కలిపేందుకే అని ఏం తెలుసు వాళ్ళకు!?! ఒకే ఇంట్లో రెండు రకాల మనుషులు చేస్తున్న పని తప్పో...ఒప్పో గానీ ప్రాణం మాత్రం ఒక్కటే అనిపిస్తుంది! మృదువైన శరీరంతో ఉన్నందుకేమో మనసు...మెదడూ మృదువుగానే లేలేత చిగురులా ఎంత సున్నితం! పిల్లలు జీవం పోస్తుంటే వారిని కన్న పెద్దలు ప్రాణం తీస్తున్నారు చేతి ఐదు వేళ్ళూ ఐదు రకాలు ఒక్కచేతికే ఇన్ని హంగులు... లోకంలో ఇంకెన్ని జీవులో... ఎన్ని మనస్తత్వాలో.. సృష్టించిన దేవుడికి కూడా తెలియదు కావొచ్చు! 25-2-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etqvBG

Posted by Katta

Swatee Sripada కవిత

ఎప్పటికప్పుడు కొత్త గానే ఉంటుంది నునులేత ఆకు మెరుపు చెక్కిళ్ళలా వడితిరుగుతూ తొంగి చూసే తడి’ నీటితెర చటుక్కున జారిపడే వేసవి తొలి చినుకులా కనుకొలుకుల్లో మొలవడం కొత్తగానే ఉంటుంది ఒక్క ఇదేనా ! ఏమూలను౦డి ఏమూలకు కొలిచినా ఏమనసు లోతుల్లో క్షీర సముద్రాలు చిలికినా ప్రతి మాటా అప్పుడప్పుడే వికసించే చురకత్తి మొగ్గలా కొత్తగానే కదా ఉండేది. నీది కాని ప్రతిదీ నీకు కావాలనే అనిపిస్తుంది. ఆనందాలూ విలాసాలూ హద్దులుగా నాటుకు నీదనుకున్న ప్రతి నేలా బంగారం పండే మాగాణీ కావాలనే అనిపిస్తుంది ఎక్కడికక్కడఏ మూల తవ్వుకున్న నిధులూ నిక్షేపలూ నీకే సొ౦తమవాలని ఉంటుంది. నీళ్ళి౦కి పోతున్న నది ఒడ్డున పడిగాపులు పడుతూ పచ్చని పైరు నాటుకున్నట్టు నిశ్శబ్దాని మరిగించి మిరియాల కాషాయం లా సంవేదన పడిశానికి మందులా కళ్ళుమూసుకు మింగేసినా జ్వరపడిన ప్రతిసారీ పసిపాపై మారాం చేసే మనసు కొత్తగానే కదా. ఎంత పాతబడిన గాయమైనా మళ్ళీ మళ్ళీ ముళ్ళకంప తలపుల్లో కొత్తగా రేగి రేగి పోగొట్టుకున్న అమూల్యాలను కలల్లోనూ వెతుక్కున్నట్టు వెక్కిళ్ళు పెడుతూనే ఉంటుంది. చుట్ట చుట్టుకు పడుకుని ఎన్ని వెలుగులను మింగేసిన కొ౦డచిలువ పడమరో మళ్ళీ తూర్పు వాకిట కొత్త సూర్యుడిని ప్రసవి౦చినట్టు ఎన్ని విషా’దాలో నిరంతరం అస్తమిస్తూ ఉదయానికి ఆశలను ప్రసాదిస్తాయి కడుపు నిండిన క్షణాలు కనురెప్పలపై పవళించి విశ్రమి౦చినా మళ్ళీ ఆకలి కేకలు అలారంలా మళ్ళీ మళ్ళీ మోగి మస్తిష్కంలో సైరన్ లై మేల్కొలుపుతాయి జాతరలో తప్పిపోయిన పాపాయిలా తిరుగుతున్నప్పుడు కొత్తమోహాలని౦డా జాలి మెత్తదనం చూపుల చివరే ఆగి లోలోతుల గాఢత బేరీజుల తరాజుపై రాబందవుతు౦ది ఎప్పటికప్పుడు ఈ సంశయాల బూచిని దాచేస్తూనే ఉంటాను అమాయికపు మొహం తొడుక్కుని ఆషాఢమేఘాన్ని అవుతూనే పోతాను

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1haJeXT

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! వనిత !! చెరగని చిరునవ్వు మీ సొంతం తరగని సహనం మీ స్వభావం కష్టాలు సుఖాలు చుట్టాలు సూటి పోటి మాటలు మిత్రులు దయ కారుణ్యం మీ కవచకుండలాలు సమ బాధ్యత మీకే అయినా సమ భావం ఎండమావే కదా ఎన్నో వికార స్వభావాలు చూస్తున్న శాంత స్వభావం తప్పని సరి పుట్టిన వెంటనే ఇంటికి మహాలక్ష్మి తెలియని వాళ్ళ ఇంట్లో దౌర్భాగ్య స్తితి ఏమని చెప్పాలి మీ పరిస్తితి తప్పదు ఈ రోజుల్లో మీకు ఈ దుస్తితి వీటి కలబోతే వాటికి సర్వనామమే వనిత !!పార్ధ !!25feb14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Nukhvl

Posted by Katta

Maddali Srinivas కవిత

సోకైన దొరల బండి// శ్రీనివాస్//25/02/2014 --------------------------------------------------------- సై సై జోడెడ్ల బండీ సోకైన దొరలా బండీ వేరుపడే యెద్దు నాది జోడుందామన్న యెద్దు నాది చర్నాకోలా నా "చేతి"లో వుంటే యే యెద్దైనా నా మాటే వింటుంది || సై సై|| వొంటి కొమ్ము విసిరే పోట్ల గిత్తెనైనా రెండు కొమ్ములు విసిరే మకర దున్ననైనా యిట్టే నా దారికి తీసుకొస్తా నేనే రాణీ నని అనిపిస్తా ||సై సై|| తవుడు బాగ తినిపించి నీళ్ళు బాగ తాగించి యెకరాలకు యెకరాలను దున్నిస్తా వోట్ల పంట పండిస్తా నోట్ల పంట పండిస్తా నేనే మహా రాణి లాగ దునియానే యేలేస్తా ||సై సై|| డూ డూ బసవన్న లాగ వూగేటి యెద్దులెన్నొ నా దారికి తీసుకొచ్చి చెవులను మెలిపెట్టేసా యెగస్పార్టి ల పని పట్టేస్తా ||సై సై||

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1esS5PC

Posted by Katta

Kks Kiran కవిత

14వ తారీకున నా ఫ్రెండ్ Mavvsn Reddy ఇంట్లో జరిగిన పెళ్ళికి వెళ్దామని ఆ రోజు ఉదయం 11.30కి తణుకు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కి , సీట్ దొరికాక కూర్చుని బుద్దిమంతుడిలా మొక్కపాటి వారు రాసిన " బారిస్టర్ పార్వతీశం " పుస్తకం చదువుతూ కూర్చున్నాను. నిడదవోలు రైల్వే స్టేషన్లో 40 నిముషాలు ఆపాడు బండిని. అంతవరకూ పుస్తకం చదవడంలో నిమగ్నం అయిపోయిన నేను ' ఇంతసేపు ఆపాడు ఏంటి ఇక్కడ? ' అని తల ఎత్తి చూస్తే నా కుడివైపు ఉన్న సీట్ కు 2 సీట్ల ముందర కూర్చుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ఎంత అందంగా కనపడిందో నా కళ్ళకి? బహుశా ఆ అమ్మాయి బ్రాహ్మణుల అమ్మాయి అనుకుంట. ఆ అమ్మాయి కళ్ళకి కాటుక లేదు,పెదాలకు లిప్ స్టిక్ వేసుకోలేదు,బొట్టుబిళ్ళలు ఏమి ఉపయొగించకుండా చక్కగా కుంకుమబొట్టు పెట్టుకుని ఎరుపు ,ఆకుపచ్చ గల పంజాబి డ్రెస్ లో ఉంది ఆ అమ్మాయి. అమ్మాయిలకి నిజమైన అందం అలంకరణల వల్ల రాదనుకుంట....!!! కాస్తంత మొహమాటం,సిగ్గుపడుతూ మొహంలో ప్రస్ఫుటంగా పలికించే హావభావాలు ,సన్నని చిరునవ్వు ఇవి చాలు అమ్మాయిలకు అందాన్ని ఇనుమడింపచెయ్యడానికి. ఆ అమ్మాయివైపు నేను చూడటం,తను కొంచెం ' నేను గమనిస్తున్నాను ' అనే విషయం గుర్తించి బయటకు ఎటో చూస్తున్నట్లు చూస్తూ మధ్యమధ్యలో నావైపు తిరిగి చూడటం, అది గుర్తించి నేనేదో హఠాత్తుగా ఏదో పని ఉన్నవాడిలా పక్కకి దృష్టి మరల్చడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూడటం. ఇలా నా చేస్టలు అన్నీ ఆ అమ్మాయికి " నాకు నీమీద బోల్డంత ఆసక్తి ఉంది సుమా !!! " అన్నట్లు తోచాయి కాబోలు , ఏ అమ్మాయికైనా ' తన అందం ఇంకొక అబ్బాయి గుర్తించి తన మెప్పుకోసమే ఆరాటపడుతున్నాడని అనిపిస్తే కించిత్ గర్వం కలుగుతుంది అనుకుంట... అలాగే తను నేను చూస్తున్నననే విషయం చూసి కొంచం గర్వంగా తన పెదాలను బిగపట్టి పొంగి బయటకు రాబోతున్న నవ్వుని ఆపే ప్రయత్నం చేసింది,కాని కొంత ఆ ప్రయత్నంలో విఫలమైంది . నోటికి అడ్డంగా తన చేతి వేళ్ళు అడ్డంపెట్టి నవ్వే ఆ నవ్వుని చూస్తే నాకు " వేళ్ళు మధ్య వెలుతురులా అంత అందంగా ఎలా నవ్వు వస్తోంది ఈ అమ్మాయికి ?"అని అనిపించింది. ' నేను చేసే చేష్టలు ఆ అమ్మాయి గుర్తించి అలా ప్రవర్తిస్తోంది ' అనే భావం అబ్బాయికి కలిగితే ఇంకా సంబరపడిపోతాడు అబ్బాయి. కాని నేను ఇలా కుదర్దని కాసేపు నా మొబైల్లో పాటలు వింటూ కూర్చున్నాను.తను ఆ చర్యతో నొచ్చుకుందేమో...!! తనుకూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ తన ఎడమచేతిని పద్మంలా ముడిచి ఆ చేతివేళ్లను పైకి దగ్గరగా చేసి ఆ వేళ్ళను చుస్తూ ఏదో గొప్ప నాటకంలో కళాకారిణిగా అభినయించింది. మాటిమాటికి నుదిటిపై ముందుకు పడే తన ముంగురులను సరిచేసుకుంటూ వికసిస్తున్న పువ్వులా అందంగా నవ్వే అమ్మాయిని చూస్త్తూ ఉంటే దేవకన్యలకి కూడా ఇంత అందం ఉంటుందా అని అనిపించింది. ఏ బుద్ధిలేనివాడు చెప్పాడు దేవకన్యలు కేవలం స్వర్గంలోనే ఉంటారని? ఈ అమ్మాయిని వాడేవడో చూస్తే ఖచ్చితంగా ఆ అభిప్రాయం మార్చేసుకుంటాడు అని అనిపించింది. ఎందుకో అమ్మాయిని చూస్తే ఎందుకో " శ్రీహర్ష నైషదం " లోని దమయంతి మళ్ళీ ఈ అమ్మాయి రూపంలో భూమి మీదకి అవతరించేసిందా అని అనుమానం కలిగింది. అలా ఆ దేవకన్యను ఆరాధనాపూర్వకంగా నేను చూస్తూ ఉంటే , ఎక్కడనుంచి వచ్చారో 4గురు మనుష్యులు మామధ్య అడ్డంగా నుల్చున్నారు యమదూతల్లా , అయినా ఆ అమ్మాయిని చూద్దాం అని నేను ప్రయత్నిస్తుంటే కదలరే ఆ కర్కసులు? అయినా దొరికినకొద్దీ వాళ్ళు కదులుతున్నప్పుడు ఏర్పడే ఖాళీ జాగాలోంచి తనని నేను చూసే ప్రయత్నం చెయ్యడం,నా చూపుకోసం ఆ అమ్మాయి చూసే ఎదురుచూపులు ఇలా ఇలా కొంతసేపు అలా ఆ ప్రహసనం జరిగింది. నా కుడిప్రక్క కూర్చున్న కొంతమంది వృద్దులు నేను పడే ఆరాటాన్ని గమనిస్తూ ఉన్నారు. నేను ఓ అక్కర్లేని చిరునవ్వు వాళ్ల మొహానపడేసి ఆ అమ్మాయిని చూడటం ఎలా అనే ప్రయత్నాలలో నిమగ్నం అయి ఉన్నాను. మొత్తానికి ఈ యమదూతలు ఏదో పని ఉందని కదిలారు అక్కడనుంచి,మళ్ళీ మా చూపులు కల్సుకున్నాయి. నా ఎడమపక్క వికృతంగా చీరకట్టుకుని ఉండి,తన బిడ్ద కిటికిలోంచి బయటకు చూస్తూ ఆశ్చర్యంతో అడిగే ప్రశ్నలకు విసుగ్గా మొహంపెట్టి ,ఆ పిల్లలో ఉన్న ఆసక్తిని అంతా చంపెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఆ బిడ్దతల్లిని చూసి నాకసలు కోపమే రాలేదు అప్పుడు. పక్కనే ఉన్న తన కుటుంబంతో మాట్లాడడం మానేసి ఎదుటి ప్రయాణికులతో లోకాభిరామాయణం,ఈ దేశం బాగుపడాలంటే పాటించాల్సిన సూత్రాలు చెప్తున్న ఆ బిడ్డ తండ్రిని చూసి నాకసలు విసుగే అనిపించలేదు ఆ క్షణాన. అప్పటికే మా మధ్య మౌనసంభాషన జరుగుతోంది కంటిచూపుల ద్వారా,ఆ సమయంలో ప్రపంచంలో ఏ ఏ విషయాలు జరిగితే నాకేం? గోదావరి బ్రిడ్జ్ పైనుంచి మేం వెళ్తున్న రైలు కూలిపోయి నీళ్లలో పడినా ఆ అమ్మాయిని కాపాడడానికి నేనెలానో ఉన్నాను కదా??? ఇంకెందుకు వేరే అర్దంలేని భయాలు,విషయాలు? అని అనిపించింది నాకు. అంత కాపాడేద్దాం ధైర్యవంతుడిలా అని అనుకున్న నేను సాహసం చేసి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. కాని ఆ అమ్మాయి నాకోసమో అన్నట్లో లేక తన సహజమైన ప్రవర్తనే అదో తెలియదుకానీ " మాటలద్వారా కాకుండా హావభావాలు ప్రదర్శించడం ,అది కూడ ముఖ్యంగా తమ మొహంలో కనపడేట్టట్లు ప్రదర్శిస్తూ ఉంటే స్త్రీలు ఇంత అందంగా ఉంటారా ?" అని నేను ఆశ్చర్యపోయేలా రకరకాల హావాభావాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది. అంటే గడ్డం క్రింద కుడిచేతిని ఆనుంచుకుని బయటకు చూస్తూ,వివిధ రకాల మనుషుల ప్రవర్తనని చూస్తూ ఆశ్చర్యపడుతూ అలా కూర్చుని ఉంది. ఆ అమ్మాయి గడ్డం కింద నొక్కు ఎంత అందంగా ఉందో తెలుసా? ఆ అమ్మాయి గడ్డం కింద నొక్కుకి బహుశా ఈ చిన్ని సంఘటన కారణం అయి ఉండవచ్చు. " బ్రహ్మదేవుడు ఈ అమ్మాయిని సృష్టిస్తున్నప్పుడు తాను తయారు చేసిన ఈ అందానికి తానే ముచ్చటపడి,ఆ బొమ్మని తన ఎదురుగా తేరిపారా చూడటానికి వీలుగా తన కుడిచేతి మధ్యవేలుతో పట్టుకుని చూసి ఉంటాడు ఆ గడ్డం కింద, దానితో ఆయన వేలు నొక్కుపడి అంత అందంగా ఏర్పడి ఉంటుంది ఆ అమ్మాయి గడ్డంకింద నొక్కు. " అంతటి సౌందర్యాన్ని నేను తన్మయత్వంతో ఆస్వాదిస్తూ ఉంటే ఇంతలో నేను దిగాల్సిన " అనపర్తి " రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది, ఎప్పుడూ భగవంతుడిని అంతలా ప్రార్దించని నేను , ఈసారి చాలా తీవ్రంగా వేడుకున్నాను ' ఎలాగైనా అమ్మాయి దిగల్సిన స్టేషన్ కూడా అనపర్తే చెయ్యి, నేను వెళ్ళాల్సిన పెళ్ళికే తనని కూడా వచ్చేట్టు చూడు ' అని. కాని ఈ విశ్వంలో ఈ దేవుడు అంత నిర్దయుడు ఇంకెవరూ ఉండరనుకుంట . ఆ అమ్మాయి దిగాల్సిన స్టేషన్ అనపర్తి కాకుండా చేశాడు, పోనీ కొంచెం ఆలస్యం అయినా పర్లేదు పెళ్ళికి వెళ్ళడానికి.ఈ అమ్మాయి దిగే స్టేషన్ వరకూ వెళ్దామని అనిపించింది,కానీ ఆ రోజు తెలంగాణ విభజనకి వ్యతిరేకంగా జరుపుతున్న బంద్ గుర్తొచ్చింది. వాహనాలు ఏమీ తిరగట్లేదు,వెంట వెళ్ళినా తిరిగి రావడం ఎంతో వ్యయప్రయాస అవుతుందనిపించి మొట్టమొదటిసారి ఈ వ్యవస్థ,అందులోని నాయకులపై విసుగేసింది , కాని ఏమీ చెయ్యలేని నిస్సాహయత నడుమ మొత్తానికి రైలు దిగుదామని అనిపించి దిగాను, చెప్పుకోవద్దూ...!!! దిగాలంటే ఎంతో దిగులేసింది,కాని ఏం చెయ్యలేని స్థితి, అలా రైలు దిగి ఆ రైలు వెళ్లేంత వరకు నిశ్చేస్టుడినై నిలుస్తూ ఉన్నాను అంతే, ఆ రైలు ఎంతో నిర్దయగా కూతపెట్టి గమ్మున్న వెల్లిపోయింది,తనతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయింది. - Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cL1HbR

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // కొన్ని సార్లు .... // దుఖాలు పసలేని నవ్వుల్లో దోర్లిపోతాయి ప్రేమలు దుఖాల్లో ఒలికి పోతాయి దాచుకోలేని ఔదార్యమంతా అనంతంలో కలిసి పోతుంది చేరుకోలేని దిగులంతా రెండు ముద్దలు మింగలేని అవస్థ అవుతుంది మట్టివాసన జ్ఞాపకాలన్నీ చెంపలపై తడై మెరుస్తుంటాయి అలజడులేమో అడుగుల్లో తడబాట్లు అవుతుంటాయి అలవికాని విచారమంతా పట్టరాని క్రోధమవుతుంది దూరాలు పెరగడానికే ఆరోపణలన్నీ మిగిలి పోతాయి లెక్కల బెరిజుల్లొ లాభాలు లేకుండా కదలలేని బ్రతుకవుతుంది ఐనా తప్పదు కొద్దిగా జీవించడమో లేక నటించడమో నేర్చుకోవాలి Date:25/02/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eeQdOO

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఒంటరిని అని భావిస్తే ఎన్నో ఆలోచనలు నీ సాంగత్యం లో వుంటే ఏంతో ఉత్తేజం ఎప్పుడు చెరగని నీ చిరునవ్వు ఎప్పటికీ వసివాడని నీ స్తైర్యం ఏమి తెలియనీ నీ అమాయకత్వం ఏంతో నేర్పుగా చెప్పే నీ సునిశితత్వం నీ స్నేహం లో నన్ను నేను మార్చుకున్నా నా కన్నీ తెలుసనుకున్నా తెలిసింది ఎంత అల్పమో తెలుసుకున్నా వేదన మదిలో దాచి చిరునవ్వే నాకు పంచె నీ ప్రజ్ఞ అమోఘం ఆ చిరునవ్వులో ఎంతటి సహజత్వం నా ప్రతి ఆలోచనలో నీ ప్రశంస నా ప్రతి విజయం లో నీ సహకారం ఇది నా ప్రయత్నం కాదేమో ఇది దైవ యత్నమెమొ కదా చెలి !!పార్ధ !!25feb14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eeIVL1

Posted by Katta

RajendraKumar Devarapalli కవిత



by RajendraKumar Devarapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1flSWBM

Posted by Katta

Panasakarla Prakash కవిత

నా.......నే.........ను.. ఎవరూ లేని చోట ఏకా౦త౦గా ..............నాలో నేను ఎవరితోఉన్నా ఎప్పుడూ........ నాతో నేను.............. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో...తెలియక‌ నిత్య౦...నా వె౦టే నేను.......... నిజమైన స్నేహితులెవరూ లేక‌ ఎల్లప్పుడూ నా పక్కనే నిలబడి నేను... పరిగెడుతున్న ప్రతిరోజు పాదాల అ౦చును ఎర్రగా అల్లుకునే పా"రాణి"నీ..నేనే........ చీకటి ప్రేయసి నుదుటిమీద రాత్ర౦తా తెల్లని ముద్దిడిన రే"రాజు"ను కూడా అవును..................నేనే..................... పనసకర్ల‌ 25/02/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hOaqyo

Posted by Katta

Lingareddy Kasula కవిత

ఒక ఆకుపచ్చ కల||డా// కాసుల లింగా రెడ్డి ||25-02-2014 ఒక వేగు చుక్క వెలిసింది కాలపు మొగులు మీద తెలంగాణ పొద్దు పొడిచింది ఆరుపదుల ఆరుగాలం చెమట పొద్దుదిరుగుడు పువ్వై పూసింది రింగన్న పురుగై ఎగిరింది సకలజన సమ్మెలు మిలియన్‌ మార్చ్ లు సాగర హారాలు పల్లె పట్టాలెక్కిన తీరులు విగ్రహ విధ్వంసాలు ఉద్యమ వ్యాకరణాలై ఊరేగినవి పెట్టుబడుల గాయాలు తట్టుకొని నాయుడోళ్ళ 'గే'యాలు దాటి నమ్మవశంగాని చట్టసభలు 'టీ' బిల్లుల చక్కబెట్టినవి నినాదమంటవో, మా విధానమంటవో పది జిల్లల ఏకకంఠ పరివ్యాప్త గానమంటవో ఒరిగిన పదివందల ప్రాణాల వెలుగులంటవో కలెబడి కష్టకాలం దాటి నిలబడ్డది నా ‘జై తెలంగాణ ‘ ఇయ్యాళ్ళ నన్ను అలవిగాని ఆనందం అలాయి బలాయితీసుకుంటంది కొత్త ఆశల కౌముది మదినిండ వెలుగుతంది రేపటి ఆకుపచ్చ కల కండ్లల్ల మెదులుతంది. -డా|| కాసుల లింగారెడ్డి సెల్‌: 8897811844, 9948900691 (14 ఫిబ్రవరి 2014)

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dt4ZgN

Posted by Katta

Chinna Mathews కవిత

చిన్నా మాత్యుస్ ॥ నీకు గుర్తుందా….. నేస్తం..!! || సోదరా !!! లోకం లో దొరికే అరుదైనా ఆప్తుడా తెలిసి తెలియని వయస్సు చేయి చేయి వేసుకొని పొలం గట్లపై పైరగాలికి చెప్పే మాటలు స్నేహ తీరాన కాలక్షేపాలు తెలిసి తెలియని మాటలతో మనం చేసుకున్నా వెకిలి నవ్వులు నా నేస్తమా గుర్తుకొస్తున్నాయి రా నీ జ్ఞాపకాలు ...... !! నీకు గుర్తుందా….......!! నా కలలను నీ ఊహలతొ ముడివెస్తూ మనం కొన్ని ఆశలు చేతిలో పట్టుకొని జీవన వేగం కోసం పరుగెత్తిన రోజులు. నేస్తం.!! కాలం గుర్తుచేస్తుంది నిన్న మనం ఆడిన పరుగు పందెం నుండి యిప్పుడు ఆడుతున్న బ్రతుకు పోరు దాకా ఎన్నో కన్నీటి ఒడుదుడుకులు ఎన్నో సంతోషాల మద్య యెంత వింతగా మారిపోయామో కదా!! నీకు తెలుసా!! ఇక్కడ చాల మార్పులు వచ్చాయి కాలం మారిపోయింది మనుషులు మారారు ,మనసులు మారాయి కలిసి ఉన్నరోజులు పోయాయి విడంబన రోజులు వచ్చాయి బంధువులు ప్రేమను విడిచారు బందుకట్టుమాటలు పెంచారు నేస్తం ......!! నీవు లేవు కదూ నువ్వు.. నా నుండి మరలిపోయావు నీ స్నేహం కూడ దూరమైంది చిరకాల మిత్రుడివి నువ్వు అనుకున్నా .. ****నీ జ్ఞాపకం ఐయ్యింది**** 25.02.2014

by Chinna Mathews



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pnMmn9

Posted by Katta

Yasaswi Sateesh కవిత

Thanks to Manasa garu for her commentary on presenting the concept కవితత్త్వాలు.. through her blog. http://ift.tt/1h9wJf4 కవితాసంకలనాలు / కవితత్వాలు "అసాధ్యమైన ఏకాంతం అంటూ ఏమీ లేదు. ప్రపంచ రహస్యాలను రూపకాలంకారాలతో తప్ప హేతువాదంతోనో, తర్కంతోనో విప్పి చూపలేము" - నోబుల్ స్వీకారోపన్యాసంలో నెరూడా చెప్పిన మాటలివి. కవిత్వం నా వరకూ చాలా ప్రశ్నలకు ఒప్పించగల సమాధానమైంది. దేవరహస్యాలను విప్పి చెప్పిన మహామంత్రమైంది. కనుక, ఆ రహస్తంత్రులు మీటే రసవిద్య నేర్చిన కవుల పట్ల కూడా సహజంగానే నాకు వల్లమాలిన ఆసక్తి, గౌరవం, ప్రేమ. ఓ ఐదారేళ్ళ క్రితం విజయవాడలో పుస్తక ప్రదర్శనకు వెళ్ళినప్పుడు, "కవితా దశాబ్ది" అనే పుస్తకం కంటబడింది. నూటయాభై కవితలు - సుమారు ఓ దశాబ్ద కాలంలో వచ్చిన వందల కవితలను వడబోసి ప్రచురించారు సంపాదకులు ఎస్వీ సత్యనారాయణ గారు, పెన్నా శివరామకృష్ణ గారు. ప్రతి కవితకూ చివర, మూణ్ణాలుగు వాక్యాల్లో ఆ కవి గురించి చిన్న పరిచయం కూడా జత చేశారు. ఆ చిరుపరిచయం ఆసక్తి రేకెత్తించిన మాట వాస్తవమే కానీ, సామాన్యంగా కవితా సంకలనాలు నన్నట్టే ఆకర్షించవు. ఒక్కో కవిదీ ఒక్కో కవిత - ఏం సరిపోతుంది? కవి తత్వం అర్థం కాదు, కవి గొంతు బలంగా వినపడ్డట్టు ఉండదు, కవి మనసుల్లో చొరబడి మాయ చేసినట్టుండదు. కేవలం పొగమంచులా కమ్ముకునే కొన్ని ఆలోచనలు మిగులుతాయంతే. అది నాకు నచ్చదు. కవిత్వాన్ని కాలక్షేపం బఠానీ అనుకోలేకపోవడమనే బలహీనతే కాదు, తారసపడ్డ ప్రతి కవీ షడ్రసోపేతమైన విందుభోజనం లాంటి అనుభవమే తన కవిత్వం ద్వారా మిగల్చాలన్న దురాశ కూడా కలదాన్ని. అయితే ఆ రోజు కథ వేరు - పుస్తకం ఆకర్షణీయంగా ఉంది, కవితలు దేనికవే నన్నట్టు ఉన్నాయి - తీసుకోవాలా వద్దా అని కొంత ఆలోచనలో పడ్డాను. సరే, నాణ్యమైన కవితలన్నీ మన కోసం ఎవరో ఎంపిక చేసి పెట్టారన్నసంతోషానిదే పై చేయి కావడం వల్ల, పుస్తకం నా చేతి సంచీలోకొచ్చి పడింది. అది మొదలుకుని ఎన్నో నెలల పాటు - విజయవాడ- హైదరాబాదు ప్రయాణాలన్నింటిలోనూ నాకదే తోడుగా ఉంది. చాలా సార్లు చదవడం వల్ల, కొన్ని కవితలు కంఠతా వచ్చేశాయి కూడా! ఇది జరిగిన చాలా నెలలకు, నేనా పుస్తకాన్ని దాదాపుగా మర్చిపోయిన రోజుల్లో, చాలా చిత్రంగా, ఓ సోషల్ మీడియాలో "ఆకాశం" కవి బి.వి.వి గారు నన్ను పలుకరించారు. ఆయన ఓ కవిగా, కేవలం అక్షరాల ద్వారా పరిచయం. బయట పెద్దగా ఎవ్వరితోనూ పరిచయాలు లేని రోజులవడం వల్లేమో, నేను హుషారు అణచుకోలేక, వెనువెంటనే బదులిచ్చాను - " 'నేనే ఈ క్షణం' అన్న కవితను వ్రాసింది మీరే కదూ..' గాలి బిగిసినట్టు లోపల ఏ కదలికా లేని క్షణం/ ఒక కోరిక చినుకులా రాలుతుంది /చినుకు లాగే కోరిక ఒంటరిగా రాదు/చినుకు చుట్టూ అనేక చినుకులు...' అంటూ సాగే ఆ కవితను ఒక సంకలనంలో చదివాను. అది మీరే కదూ?" అని ధృవపరుచుకోవడానికి అడగ్గానే, ఆయనిలా అన్నారు- " మన కవిత్వ మెవరు చదివారులే, అనుకొంటున్నపుడు అకస్మాత్తుగా ఎవరో మనం పాడిన పదాలను మన ముందుంచుతారు అపుడు అనిపిస్తుంది నిజంగా, నువ్వు ఈ లోకం లోకి రావటానికి అర్థం ఉందని.." అది మా మొదటి సంభాషణ. అటుపైన ఆకాశం గురించి తెలియడం, అది నా హృదయానికి ఎంతగానో దగ్గరగా అనిపించడం, చదివీ చదవగానే దానిపై నా స్పందన, గత ఏడు మరిది పెళ్ళి నిమిత్తం మా మావయ్యగారి ఇంటికి వెళ్ళినప్పుడు, వారిని కలవడం - - అన్నీ అనుకోకుండానే, పెద్ద ప్రణాళికలేవీ లేకుండానే జరిగిపోయాయి. ఇంత ప్రత్యేకమైన పరిచయానికి 'కొనాలా వద్దా' అని సందేహాడిన ఓ కవితా సంకలనం కారణమంటే అబ్బురంగా అనిపిస్తుంది. వర్తమానమే కాదు, భవిష్యత్తూ మన కోసం బంగరు కానుకలేవో దాచి ఉంచడమంటే ఇదే! కవిత్వంలో ఆధునికతకూ, సమకాలీనతకూ నావద్దన్నున్న నిర్వచనాలేవో చెదిరిపోతున్న రోజుల్లో, ఇజాలకు అతీతంగా, వర్గీకరణలకు లొంగకుండా కేవలం కవిత్వ కంఠ స్వరమే ప్రామాణికంగా వెలువడ్డ కవితా సంపుటుల పట్ల మళ్ళీ ఆసక్తి మొదలైంది. నలుగురు సాహిత్య మిత్రుల ద్వారా అటువంటి సంకలనాల్లో ముందు వరుసలో ఉండేది ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సంపాదకత్వంలో 1999 లో వెలువడ్డ "యువ నుండి యువ దాకా" అని తెలుసుకుని దానిని సాధించాను. 1936 నుండీ 1996 వరకూ అరవయ్యేళ్ళ తెలుగు ప్రస్థానంలో 44 లబ్ధప్రతిష్టులైన కవుల రచనల్లో నుండి 73 మణిపూసలనెంచుకుని అల్లిన కవితాహారమిది. ఇందులో కవితలన్నీ ఒక ఎత్తు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి వ్యాసమొక్కటీ ఒక ఎత్తు. కవిత్వాన్ని గురించి అలాంటి సుదీర్ఘమైన వ్యాసం చదవడం గొప్ప అనుభూతి. కేవలం ఈ వ్యాసాన్ని చదివేందుకు పుస్తకాన్ని కొనుక్కున్నా దోషం లేదనడం అతిశయోక్తి కాదు. గొప్ప కవిత్వమంటే ఏమిటీ అన్న ప్రశ్నకు - ఆయన చివరకిలా అంటారు - "తిలక్ చెప్పినట్టు అంతరాంతర జోతిస్సీమలని వెలిగించాలి. చలం చెప్పినట్టు- "వ్రాసేటప్పుడు మన శ్వాస ఇబ్బందిపడాలి. రక్తం పొంగాలి. బాధపడాలి, నలగాలి జీవిత రథచక్రాల క్రింద కలంలోంచి నెత్తురు ఒలకాలంటే అక్షరాలా? పాండిత్యమా? కాదు -- సంవత్సరాల మూగవేదన" బైరాగినీ- ఇస్మాయిల్‌నీ, మోహనప్రసాద్‌నీ- తిలక్ నీ, శ్రీశ్రీనీ శేషేంద్రనీ , సినారెనీ రేవతీదేవినీ వెంటవెంటనే చదువుతున్నప్పుడు కలిగే అనుభవాలను మాటల్లో పెట్టడం అంత తేలికేం కాదు. అవే భావాలు, మనకున్న అవే నాలుగు మాటలు. కానీ కవులు మారితే ఎంత తేడా! స్వీయ శైలి - సృజన జమిలిగా అల్లుకున్నకవుల కవితల్లో అనుభూతి వ్యక్తీకరణ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చదివి తీరాల్సిందే! ఇటీవలి కాలంలో కొత్త కోకిలలు గొంతు సవరించుకునేందుకు ఆసరాగా నిలబడే పచ్చని చెట్టుగా పేరొందిన " కవి సంగమం " బృంద సభ్యులు యశస్వి సతీష్ గారు కూడా ఇలాంటి ప్రయోగమొకటి చేశారు. ఇదే బృందంలో గొంతు విప్పి పల్లవులు పాడిన నూటయాభై మంది కవులను , వాళ్ళ కవిత్వాలనే ఉనికిగా మార్చి అంతర్జాలానికి ఆవల ఉన్న పుస్తక ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. "ఒక్క మాట" శీర్షికన వెలువడ్డ ఈ పుస్తకంలో కవిపరిచయంతో పాటు ,కవుల రచనల్లోని భాగాలను అర్థవంతంగా కలిపి కొత్త కవితనలల్లే ప్రయోగం కూడా చేశారు. ఇది ఆసక్తికరంగా ఉన్నా, కవి లోతులను మాత్రం తెలియజేయడం లేదు. సాధారణంగా ఇటువంటి సంకలనాల్లో పాఠకులకు దొరికేది మచ్చుకో మెతుకు. ఈ సంపుటిలో ఆ అవకాశం కూడా లేదు. కానైతే ఎన్నో కవితలను కలిపి, స్వతహాగా కవి అయిన 'యశస్వి ' గారు సృజనాత్మకంగా వ్రాసిన పంక్తులుంటాయి కనుక, ఆసక్తి కలిగించిన కవులను వెదికి పట్టుకుని మరిన్ని కవితలు చదువుకోవడమే పాఠకులకున్న అవకాశం. పైపెచ్చు ఇది కేవలం కవిత్వానికే పరిమితమైన పుస్తకం కాదు, వాళ్ళ కవిత్వం ద్వారా సంపాదకులకు పరిచయమైన కవి తత్వాన్ని కూడా ఆవిష్కరించే ప్రయత్నం. కవిత్వంలో కవి తత్వం అన్ని సందర్భాల్లోనూ బయటపడదు, మరీ ముఖ్యంగా, ఈ సంకలనంలో చోటు దక్కించుకున్న అనేకమంది కవులు కొత్తవాళ్ళు. ఇప్పుడిప్పుడే కవితావినీలాకాశంలోకి రెక్కలు విదుల్చుకుంటూ ఎగరజూస్తున్నవారు. వాసి సంగతి పక్కన పెడితే, రాసి తక్కువ. ఈ పరిమితుల దృష్ట్యా, సంకలనంలో అన్ని కవితలూ ఒకే రాగంలో సాగినట్టు అనిపించదు. ఇన్ని వైరుధ్యాలనీ, తేలికగా తోచే సంక్లిష్టమైన బాధ్యతనీ సంతోషంగా తలెకెత్తుకుని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు - ఈ కూర్పులోని నేర్పుకూ రచయితకు అభినందనలు. ఇది ఒక చక్కని కవుల డైరీగానూ, ఓ కాలానికి సంబంధించిన కవుల తత్వానికి ప్రతీకగానూ నిలబడి - మిత్రబృందంగా మారిన కవులందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఓ జ్ఞాపకంగా నిలుస్తుంది. నేను వ్యాసం మొదట్లో చెప్పినట్టు, సమకాలీనులకంటే ఇలాంటి పుస్తకాలతో మున్ముందు ఇక్కడికి రాబోయే వారికే ఆసక్తి, అవసరమూ ఎక్కువగా ఉంటాయన్నది వ్యక్తిగత అభిప్రాయం. (ఆసక్తి కలవారి కోసం , యశస్వి సతీష్ గారి బ్లాగు http://ift.tt/1esoKVn ) శర్మ గారి మాటల్లోనే చెప్పాలంటే - కవిత్వమంటే- కాఫ్కా వాక్యం ఖలీల్ జిబ్రాన్ వచనం కృష్ణశాస్త్రి నిట్టూర్పు జాషువా ఆక్రోశం విశ్వనాథ గద్గద కంఠం శ్రీశ్రీ కేక ఇవే..ఇవే..ఇవే ప్రమాణాలుగా నిలబడ్డ మంచి కవితల సంకలనాలకు ఏనాడైనా తిరుగుండదుగా! అలాంటి కూర్పులను భద్రంగా రేపటి తరాల కోసం భద్రపరుచుకుందాం. on 20.2.2014

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9wJf4

Posted by Katta

Maheswari Goldy కవిత

|ని త్య సు గం ధం||మహేశ్వరి గోల్డీ శ్రీ రామచిలుకా...!! తన సుదూర స్నేహం నా మనసుపై మౌనంగా అమృతవర్షం కురిపించనున్నదేమో అందుకే ఈ తెలియని ఉల్లాసం...!! తన మౌనం నా అంతరాత్మకు తెలియని కొత్త భాషకు శ్రీకారం కానున్నదేమో అందుకే ఈ ఎడబాటు...!! తన కవితాకుసుమాలు భావితరంగాలుగా మారనున్నవేమో అందుకే ఈ సఖిమౌనహాసం...!! తన ప్రేమకాంతి నా మోముపై దివ్యకాంతి కానున్నదేమో అందుకే ఈ అమిత సౌందర్యం...!! తన పరిచయం నా జీవనరేఖకు కస్తూరి చందనం పూయనున్నదేమో అందుకే ఈ నిత్యసుగంధం....!! 24/02/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ciYZqL

Posted by Katta

Dayanand Rao కవిత

// నేస్తానికి చిరు ప్రశ్న // తేది: 25/2/14 నేస్తం! నిజం చెప్పవూ..! కిన్నెరగంధర్వ సంగీత సమస్తాల్నీ స్వరంలో దాచుకున్నది నువ్వే కదూ..! విశ్వవిరుల మరందాన్నంతా మాటల్లో మూటగట్టుకున్నది నీవే కదూ..! సప్తస్వరాల అద్భుతమిశ్రమాన్నంతా పలకరింపుల్లో పొదవుకున్నది నువ్వే కదూ..! గ్రీష్మంలో హిమనగాల శీతలానివై పదాలస్పర్శతో స్పృశిస్తున్నది నీవే కదూ..! వసంతంలో పాదపాల్ని పల్లవింపజేసే కోయిలరాగానివి నువ్వే కదూ..! ఓంకార నాదాల్ని ఢమరుకాల్ని ఏకకాలంలో మదిలో మ్రోగిస్తూ నాట్యం చేస్తున్నది నీవే కదూ..! పగుళ్ళిచ్చిన నామదిబీడుపై తొలకరి చినుకులై పలకరిస్తున్నది నువ్వే కదూ..! ప్రేమతడిలేక వికసించని నామదిగులాబీమొగ్గపై చిరునవ్వుల చిలకరింపుతో గుబాళింపజేస్తున్నది నీవే కదూ..! నాహృదయయంలో చీకటిని ఛీత్కరిస్తూ తారలపారాణితో పాదముద్రలేస్తున్నది నువ్వే కదూ..! నీతలపుల సోపానాల్ని పెనవేస్తూ మరుజన్మకు వారధి వేస్తున్నది నువ్వే కదూ..!

by Dayanand Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eee3dF

Posted by Katta

Lingareddy Kasula కవిత

ఒక ఆకుపచ్చ కల - డా.కాసుల లింగారెడ్డి ఒక వేగుచుక్క వెలిసింది కాలపు మొగులు మీద తెలంగాణ పొద్దు పొడిచింది ఆరు పదుల ఆరుగాలం చెమట పొద్దుదిరుగుడు పువ్వై పూసింది రింగన్న పురుగై ఎగిరింది సజన సమ్మెలు మిలియన్ మార్చ్‌లు సాగర హారాలు పల్లె పట్టాలెక్కిన తీరు విగ్రహ విధ్వంసాలు ఉద్యమ వ్యాకరణాలై ఊరేగినవి పెట్టుబడుల గాయాలు తట్టుకొని నాయుడోళ్ళ 'గే'యాలు దాటి నమ్మశక్యంగాని చట్టసభలు 'టీ' బిల్లుల చక్కబెట్టినవి నినాదమంటవో, మా విధానమంటవో పది జిల్లాల ఏకకంఠ పరివ్యాప్త గానమంటవో ఒరిగిన పదివందల ప్రాణాల వెలుగులంటవో కలెబడి కష్టకాలం దాటి నిలబడ్డది నా 'జై తెలంగాణ' ఇయ్యాళ్ళ తెలంగాణ పురుడు పోసుకుంది నన్ను అలవిగాని ఆనందం అలాయిబలాయి తీసుకుంటంది కొత్త ఆశల కౌముది మదినిండ వెలుగుతంది రేపటి ఆకుపచ్చ కల కండ్లల్ల మెదులుతంది -డా.కాసుల లింగారెడ్డి 88978 11844 Category: వివిధ, page4 - See more at: http://ift.tt/1fAq7Gg

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fAq7Gg

Posted by Katta

Lingareddy Kasula కవిత

నా ఇదుపుకయితం ఆవిష్కరణ వార్తలు http://ift.tt/1hN4jKG

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hN4jKG

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ciBluo

Posted by Katta

Rambabu Challa కవిత



by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o2iWaE

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అలవాటు ఆకాశం తోక పట్టుకుని జీవితంతో ఆడుతూ ఆ తోకలేని కోతులు ఎంత ఆనందంతో గెంతులు వేస్తున్నాయ్! నేనేంటి! ఆకాశాన్నే నాలోనే ఉంచుకుని జీవితంతో పోట్లాడుతూ ఏదో కోల్పోయిన మనిషిలా ఎంతో విషాదంతో ఎప్పుడూ జారిపోతూ ఉంటా......... 25FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hk82ft

Posted by Katta

Sasi Bala కవిత

ఏదీ ఏమయ్యిందీ ???? మనసు విప్పి హాయిగా నవ్వుకున్న నా గతం చిలిపి చిలి ఊసులు పంచుకున్న నా గతం చిన్ననాటి నేస్తాలతో ఆడుకున్న నా గతం పెరటిలోన తోటలోన మావి పొదల గుబురులోన మోట బావి చాటులోన వీధి అరుగు మరుగులోన దాగుడు మూతలు ఆడిన మధురమైన నా గతం ఏదీ ఏదీ ఏదీ ???? ఏమై పోయింది ???? అమ్మకు తెలియకుండ దాచుకున్న మిటాయిలు కంది చేల దొండ చేల జొన్న చేల దోబూచులు చేసుకున్న బొమ్మ పెళ్ళిళ్ళు అమ్మా నాన్నల ఆటలు ఊరంతా ఉరుకులు పరుగులు వూరి చెరువులో ఈతలు ఏవీ ఏవీ ఏవీ ?????? ఏవీ ఆ తీపి గుర్తులు ?? ఉన్నాయా స్నేహాలు ?? ఉన్నాయా మమతల సిరులు ??? పున్నమి వెన్నెల వెలుగులో అమ్మ చేతి గోరు ముద్దలు రాజూ,రాణీ అంటూ బామ్మ చెప్పిన పిట్ట కథలు నీ వీర్యం నా శౌర్యం అంటూ నాన్న గారి వర్ణనలు వీపున మూటలా ఊపుతూ తాత చెప్పిన ముచ్చట్లు ఎక్కడ ఎక్కడ ఎక్కడ ???? ఎక్కడ ఆ మధుర ఘట్టాలు ??? మర మనుషుల బ్రతుకులో యంత్రాల లోకం లో అతికించిన నవ్వులతో అణగారిన ఆశలతో తెచ్చి పెట్టుకున్న ప్రేమలతో ముసుగేసిన మమతలతో సెంటు బురద పూసుకుని మోసపు రంగులద్దుకుని బూటకపు సమాజ రంగం పై ఆటలాడుతున్నవి దేవుడు చేసిన బొమ్మలు మనుషులు చేసిన శిలలు ................................25 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1erbU9K

Posted by Katta

Nvn Chary కవిత



by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1drgDJ6

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 19(కవి సంగమం) కవిత్వ సంపుటి పేరు :-"దృశ్య ప్రవాహం" కవి పేరు :-" సడ్లపల్లె చిదంబర రెడ్డి" పరిచయం :- రాజారామ్. టి "నీవు కవివా? ఎవరి కవివి?? "నీ' కవివైతే మంచింది! నీ లోని గుబులువైతే మరీ మంచిది!!" --అంటూ "కవి" ఎవరి కవి కావాలో చెబుతూ నీ లోని దుఃఖమైతే చాలా మంచిదనే సత్యాన్ని వెలువరించినవాడు సడ్లపల్లి చితంబరరెడ్డి. “అది కొత్త కత్తిలా కుచ్చు కొంటుంది గుండెలో పచ్చి కారం పొడిలా కలతలు రాలుస్తుంది కళ్ళలో చేదు ఉమ్మెత్త ముళ్ళకాయలా ఇరుక్కొంటుంది గొంతులో నిజంగా నీ గుండె కోసి కాగితం పై పరిస్తే రాస్తుందది రసాక్షరాలు"--అంటూ గూటిలోని దుఃఖం మాత్రమే రసాక్షరాల వాక్యాలు రాస్తుందని వొక నిజాన్ని మన ముందు పరిచిన వాడు సడ్లపల్లె చితంబర రెడ్డి. “నీటిని పోగొట్టుకొన్న చేపలా పొర చిట్లి గుడ్డు నుండి జారిన పచ్చసొనలా చావు పీఠానికి బలి ఇచ్చుకొని ఆరిపోతున్న మేక తల కంటి చూపులా... ఆగిపోయిన జీవితాల్ని కాలిపోయిన కలల తోటల్ని తెగిన నరనరం మీటే విషాదల అలజడుల్ని"-డప్పుల మోతల శబ్దాల కవిత్వం చేయడం కవి ధర్మంగా అనుకుంటున్నవాడు సడ్లపల్లె చితంబరరెడ్డి. తాను తానుగా నిలిచి అక్షరాలు కొలిచే కవై కదిలే పదచిత్రాలను దర్శింప చేయలనుకున్న కవి ఈ సడ్లపల్లె చితంబరరెడ్డి.కవిత్వం రాస్తే ఏంటి లాభం?కవిత్వం రాస్తున్న వాల్లకేమి లాభం?అనే ప్రశ్న కొందరు ఏ మొహమాటం లేకుండా వేస్తుంటారు.అలాంటి వాళ్ళతో నేనంటూవుంటాను "మీరు అనుకుండే "లాభం' వేరు కవులకు కలిగే లాభం వేరు "-అని "తెల్ల కాగితమే కదా!ఇష్టమొచ్చింది రాసి కాగితాన్ని ఖరాబు చేయటం కవిత్వం కాదు.అక్షరాన్ని కాగితం భరించేటట్లు రాయటం కవిత్వం"-అంటాడు వొకాయన.నల్ల కాగితం మీద తెల్లని అక్షరాలు రాయడం కవిత్వం.కవిత్వం రాయడం అందరు అనుకొన్నంత సులభం కాదు,ఎంతో ప్రయాసతో కూడుకొన్న అంశమని కొందరికే తెలుస్తుంది. లోపల ఎక్కడో కడుపులోనో,హృదయలోనో,అస్థిపంజరంలోనో,కళ్ళలోనో దాగి దాగీ మరిగి మరిగీ సలపరించిన అక్షరం మాగిన పండు చెట్టు మీద నుంచి రాలిపడ్డట్టూ కాగితం మీద పడుతుంటే ఎంత మథనం.ఇంత మథనం "సడ్లపల్లి" పడ్డాడు కాబట్టే అతని"దృశ్యప్రవాహం" మన హృదయాల్ని తాకి మనల్ని తలో కలుపుకొని తనతో చివరి వరకు తీసుకెళుతుంది. ఇప్పుడు ఒక్క కవి జీవితం లోంచే కవిత్వం రావడం లేదు.ఇతరుల జీవితాల్లోంచి,వాళ్ళ ప్రేమల్లోంచి,విషయాల్లోంచి,అవమానాల్లోంచి,అనుమానాల్లోంచి,ముఖ్యంగా రోజు వారి జరుగుతున్న కుటుంబఘర్షణల్లోంచి కవిత్వం వొస్తున్నది.కవి తాను పొందిన అనుభూతిని తను ఎంతపొందాడన్నది కాదు అతని కవిత్వానికి గీటురాయి.ఆ అనుభూతిని ఎంతగా పాఠకుల పొందారన్నది ఆ కవి కవిత్వానికీ గీటురాయి అవుతుంది.ఈ లక్షణాన్ని"దృశ్యప్రవాహం" సంతరించు కొన్న వొక మంచి కావ్యంగా కవిత్వ ప్రియులకు అనిపించకమానదు. ఒక వాస్తవాన్ని తెలుసుకోవడానికి శ్రమించాల్సిన అవసరం లేదు కానీ ఆ వాస్తవాన్ని తట్టుకోవాడానికే శ్రమించాల్సివుంటుంది.ఈ కవికి జీవితవాస్తవాలు అవగతం అయింతరువాత,అవగతం అయిన ఆ వాస్తవాల్ని తట్టుకోవడానికీ ఎంతో మథనపడ్డాడు.ఆ మథనం లోంచి ఉబికుబికీ వచ్చిందే ఈ "దృశ్యప్రవాహం". దుర్బల ఆరోగ్యం-దుర్భర దారిద్ర్యం అనే రెండు బండరాళ్ళ మధ్య చొచ్చుకొచ్చి అస్థిత్వాన్ని పొందిన మొక్క ఈ కవి జీవితం. రెండు ఇసురు రాళ్ళ మధ్య నలిగినలిగి ముక్కలు ముక్కలైన జీవిత శకలాల సమూహం ఈకవి జీవితం.ఆ జీవితాన్ని ఒరుసుకొని పారిన జీవిత దృశ్యప్రవాహం ఈ కవిత్వ సంపుటి.అందుకే ఇంత తీవ్రంగా ఇంత ఆగ్రహంగా ఇంత అనుభూతి సాంద్రంగా సాగుతుంది ఇది. "ఆత్మ సహజంగా జ్వలనశీలమయితే చంచలజ్వాల సైతం వెలుగులు విరజిమ్మవచ్చు-అంటాడు "జార్జిసాంట్ ఆనీ"అనే విమర్శకుడు.జీవన్మరణ సమస్యతో నిరంతరంఘర్షిస్తూ ..తన ఆత్మను సహజంగా జ్వలనం చేసుకొంటూ తానొక చంచలజ్వాలై భావుకతతో చితంబరరెడ్డి మండుతున్న భావాల వెలుగుల్ని ఈ సంపుటిలో విరజిమ్మాడు. మానవ,మానవేతర ప్రాకృతికాంశాల సర్వ వ్యాపకాలకు చెందిన అనుభూతుల్నీ,జనసమూహాల బాధలకూ,గాథల అనుభూతులకు ఈ సంపుటి వొక అద్దంగా రూపొందింది.మనుషుల్లోని మంచి చెడ్డల్నీ,సమాజంలోని అంతరాల దొంతరల్ని బట్టబయలు చేయటమేగాక"విజయానికి చిగురు తోరణం కట్టి''తొలిపాఠం' నేర్పుతుంది ఈ దృశ్యప్రవాహం.విద్య,పర్యావరణ రంగాలలోని విషయాలను ,జనుల అగచాట్లను,వైయుక్తిక అనుభవాల్నీ అందమైన పద,భావ చిత్రాలతో సరికొత్త దృక్కోణంతో వచన కవిత్వం చేశాడు సడ్లపల్లి.ఎన్నో కవితలు హృదయపులోతుల్లోకి వెళ్ళి బాధించి బోధించిన అంశాలను ప్రస్తావిస్తాను. "దారి పొడుగునా ఆశల గింజల్ని విత్తి స్వప్న చిత్రాలు తిరగేస్తూ ఒంటరిగా గడియారాన్ని వెంబడిస్తున్నప్పుడు నేను ఊహల శిఖరాలు కొలుస్తాను అప్పుడు నీవు గుర్తోస్తే... మనసు విప్పారిన పూవవుతుంది నిన్ను ఆకృతీకరించాలని కలల నేత కుంచెను తీస్తే అది రక్తాన్ని ఉమ్మింది"-అంటున్న ఈకవి నగరాల్లోని కొన్ని చోట్ల,అడవుల్లో పేలుతున్న మందు పాతరలను ఙ్ఞాపాకానికి తెచ్చి పచ్చి నెత్తురు మరకల్ని చుసి తన గుండె కూడా మందు పాతరై పేలిందని దుఃఖిస్తాడు."మనిషి మనిషి నిశిలో పేరుకొన్న కసి మాంసం ముద్దై కత్తుల కుత్తుకలకు కైపై" ఎక్కుతున్నదని వాపోతు ఇవి "మంచు ముక్కైకరిగి,కన్నీటి వాగై పొంగి కువకువలాడే కపోతమయ్యే" దృశ్యాన్ని కవి కోరుకుంటాడు. మానవ జీవితం లోని వేగం,తీరికలేనితనం,ఇంట్లో కోరికల చిట్టా విప్పినప్పుడు జేబు నిండుకున్న వైనం ఇవన్ని తెలుసుకొనే శక్తి కళ్ళకు లేకుంటే ఎంత బాగుండేదోకదా!-అని అనిపిస్తుంది అని కవి "నాకు అనిపిస్తుంది..!!!"అనే కవితలోచిత్రిస్తూ,"పలకా బలపాల కన్నా జాగ్రత్తగా విధ్యార్థులు అన్నం తట్టలు తెచ్చినప్పుడు../కలల కథలు చెప్పినప్పుడు లేని ఆనందం ఉడకని పిడికెడు మెతుకులు చూడగా/వారి ముఖాల్లో పొంగే వులుగులు చుసినప్పుడు.."-అని అనటంలో భారత దేశంలో రేపటిపౌరులు ఎలాంటి స్థితిలో వున్నారో తెలియ చేస్తాడు.ఎంతో అధిక్షేపాన్ని ఆగ్రహంతో తెలియజేస్తాడు. "విజయానికి' అనే కవితలో కవి తన జీవితం విజయం వైపు ఎట్లా పరుగులు తీసిందో అవిష్కరించాడు.జీవితాన్ని యుద్ధంగా,జీవించాడాన్ని అశ్వంగా,ఎదురయ్యే సంఘటనల్ని దారిగా పోలుస్తూ"యుద్ధానికి దౌడు తీస్తూ గుర్రం అలసి పోతుందప్పుడప్పుడు.......ఆవేశాన్ని సకిలిస్తూ,సునామీల్నీ పుక్కిలిస్తూ కండ కండ నుండి కాళ్లకు శక్తిధారల్లాగి విజయానికి-వీర మార్గం వైపు మళ్ళి కుప్పళిస్తుంది"-అంటూ వొక జీవన వికాస పాఠాన్ని చెబుతాడు."కన్రెప్పలు వాల్చాలంటే /రాత్రికి క్కూడా భయం/రాజ్య వ్యవస్థలో/మారువేషాల శాసనాలని"-అంటూ"ఏడొ చేప" అనే కవితలో రాజ్య వ్యవస్థ నిరంకుశ అధికారా హుంకారాలను కవిత్వంగా మార్చాడు ఈ కవి.రెండు దశాబ్దాల కిందట కవిత్వం రాసిన కవులు ఉదారవాదం,ప్రయివేటికరణ,ప్రపంచీకరణ అనే వాటి ప్రభావానికి లోనయ్యారు.ఈ కవి కూడా వీటి ప్రభావానికి గురికాక తప్పలేదు.మానవ జీవితాల్లోకి ఎంత తీవ్రంగా ప్రవేశించిందో,అది చేసె కుట్రలకీ ఒక్కొక్క కుటుంబం సాంకేతిక వ్యాపార సంస్కృతి వల్లా ఎట్లా విచ్ఛిన్నం అయ్యిందో బహిర్గతం చేసె కవిత "అన్ని రూట్లు బిజీ!!' అనేది. "గిట్టుబాటు ధరకు ఎదురు చూస్తూ కల్లమ్లో పురుగుల ధాన్యం కొరికి పుచ్చిపోతూ రైతు కట్నం బాకి బాపతు కొతయినా జమ చేస్తే అల్లుని ముఖంలో నవ్వులూహిస్తూ కూతురు పట్నం కరెన్సీ పిల్లల్తో పోటి పడే అమాయకత్వంలో మోటార్ సైకిల్ చుట్టూ చక్కర్లాడుతూ కొడుకు..... కాషాయంబరం విభూదుల వెచ్చదనాల్చాలక వి.ఐ.పి స్వాములంతా కొంగు చాటు కోసం తచ్చాడుతూ... జన సంబంధాల చదువులన్నీ టెక్నాలజీ పాము నోట్లో జీర్ణమవుతూ.... అన్ని రూట్లు బిజీగా వున్నాయి"-ఇలా కవిత ప్రపంచీకరణ వల్ల సంభవించిన పరిణామాల్ని వ్యంగ్యంగా ఆవిష్కరిస్తుంది. ఏ విషయమైనా అనుభవంలోకి,అవగాహనలోకి,అనుభూతిలోకి రానంతవరకు నిమ్మళంగా వుండొచ్చు.నిర్మలంగా వుండొచ్చు.ఈ కవి తీవ్రంగా దీర్ఘ రోగానికి(క్రానికల్ డిసీజ్)చిన్నపటి నుండి గురై దాని అనుభవాన్ని పొందిన తరువాత దాన్ని గురించి అవగాహన చేసుకొన్నాకా,దాని అనుభూతిని అర్ఠం చేసుకొన్నాకా నిమ్మళంగా వుండలేక నిర్మలంగా వుండలేక "పచ్చని ప్రాణాన్ని చప్పరిస్తు/మరణద్వారం వైపు లాక్కేల్ళే మృగం రోగం/వైరి వర్గాన్నిక్కూడా కర్కశ కరాళ కర్కోటక పీడింపుల రూపం"-అని ఆ రోగం గురించి గొప్ప అనుభూతాత్మక చిత్రణ చేశాడు.ఆయన తన సంపుటిలో రాసుకొన్న "నే ప్రవహిస్తూ వచ్చిన...'అనే మాటల్ని చదివితే ఆశ్చర్యంతోపాటు మన కళ్ళు కూడా కన్నిటి దృశ్య ప్రవాహలవుతాయి."కళ్ళ ముందే కను గుడ్డును /కసాయి కత్తుల్తో లాగి /మొసలి నోరులా నముల్తూ /ఏదో చెప్పాలని ప్రయత్నించే కళేబరం చివరి కదలికగా మెదిలే నాలుకను కొరుక్కుతిని"-ఇలా మరణం చివరి అంచున నిలబడి కవి చేసిన గెలుపోటముల జీవన్మరణపోరాటాన్ని చదివితే కవి విషాదం, మొండిధైర్యం మనల్ని ఉద్విగ్నతకు గురిచేస్తాయి. మాటలకీ భావాలకీ వో కొత్త సోయగాన్ని తొడిగిన కవితా సందర్భాలెన్నో ఈ సంపుటిలో వున్నాయి.తెగి పోతున్న సంబంధాల గురించి కవి వొక చోట ఇలా అంటాడు."మంట సోకి పటాకీ సరాలు ఒక్కొక్కటి కాలి పేలి పోతున్నట్లు"-ఇలా ఊహకు అందని ఊహను కవి చేస్తాడు."ఏవో వలయాల తీగలు చుట్టుముట్టి/నింపాదిగా స్వారీ చేస్తూ నామీద/నా చేతుల్లో ఏమీ లేని నిబంధనల పుట్టుక/అస్థిత్వాన్ని పళ్ళ కింద బిగపట్టి/పందిరి దబ్బగా ఉండీ లేనట్లు నేను' లాంటి కవిత కవి అస్థిత్వ ఆలోచనను పందిళ్ళకోసం వేసె దబ్బతో ఉపమించడం కవి ప్రతిభను తెలుపుతుంది. "వలస పోతున్న ఎర్రెర్రని మట్టి /దిగులు పడుతున్న పల్లెల ఇళ్ళలో /తెగిపోతున్న వెల్తురు దీపాలు/కరువు లావా ప్రవాహంలో పడి /కాళ్ళూ చేతులాడక /మునిగిపోతున్న రైతులు,రైతు కూలీలు"-ఇలా కరువు నేలలోని స్థితిని ప్రముఖ కవి శివారెడ్డి మెచ్చేలా కవిత్వ చేశాడు సడ్లపల్లి.ఈ కావ్యమంతా ఎన్నో మంచి కవితలు "మనసులను చంపుకొని,దేహ దాహాలను పెంచుకొని,సంతలో సరుకులై కొల,తుల దూర ద్రవ్యాది మానాల ముక్కలై తక్కెడలో ' తూగుతుంటే.."మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాయి. 'నిరాశల గళంలో ఆశల పల్లవి'ని ఇంకా చాలా కాలం ఆలపించమని ఈ కవిని కోరుతూ"జీవించాలనే ఆశ/కాలాన్ని ఎదురించే చేవ" తో ఈ కవి జీవించి నిరంతరం జ్వలించాలని కోరుకొంటున్నా.కవి సంగమ మిత్రుల్ని ఇలాంటి మంచి కవిత్వాలని చదివి మరింత మీరు జ్వలించాలని ఆశతో చెబుతూ మరో మంగళ వారం కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h7LgrF

Posted by Katta

Chi Chi కవిత

_ ఆహా!!ఓహో :2 _ ఉద్దరిస్తామంటే వద్దనేదెవరు!! అంటే మరి హద్దులుంటాయండి అవి కాళ్ళు చేతులు కట్టేసి కర్తవ్యానికి దూరం చేస్తాయని చెప్పి |ధర్మకర్తలందరూ calmగా వృద్ధిలోకొస్తూoటారు| అవేవో చెక్కుచెదరని చైనా వాల్ లాంటి హద్దులనుకునేరు చెల్లని చెక్కుల్లాంటి కాళ్ళు లాగి కళ్ళు తుడిచే కల్తీ కొడుకుల దినచర్యలు!! కలిసొచ్చిన కామానికి నడిచొచ్చిన compound రాళ్ళ కంచెలు !! పుడతాడో పుట్టడో కూడా తెలీకుండా కాలజ్ఞాన కాలుష్యంలో బూడిదిచ్చిన భూమి తాలూకు పేగు తెగ్గానే ముడేసుకునే జీవితకాల దస్తావేజుల ముచ్చట్లు !! నా కడుపుకి తిండం తప్పా Your honoR అని చెప్పి న్యాయదేవత(item) కడుపులో ఆభూమాంతానికి ఆయనే మొగుడని చెప్పి నాటి దొబ్బే వారసత్వ హక్కు గింజలని పెంచకుండా పోషించకుండా యథాతథంగా వారసులోస్తే అందజేయడానికి న్యాయమ్మా మొగుడు కూడా అయిపోతే , ప్రపంచానికో అధికారిక మొదటి పెళ్ళాం(ఎవరికైనా)లా కదలకుండా చెలామణవుతూ మొగుల్లెవరో , బిడ్డలెవరో అర్థం కాక , లేక చీకటికి ఒళ్లప్పగించేసి తెల్లగా మెరిసిపోతోంది నేను పుట్టకముందే నాకాలైన కన్యాయదేవత!! ఏం చేయను మరి..నా పేరుతో కూడా నాలుగు రాళ్ళు నాటుండటం వల్ల నాకు తెలీకుండానే మొగున్నైపోయానని తెలిసాక తెలిసిందేంటంటే రాళ్ళ ముందు నిలబడి నా రాళ్ళ జోలికెవరూ రాకుండా రాళ్లిసురుతూ ధర్మకర్తలా దరిద్రానికి దూరంగా ఉండాలని!! ఆకలి తెలియని బతుకు కోసం ఆస్తులుండాలని తెలియకుండా పోరాటాల బాటెక్కి బతుకుపోరాటమే ఆస్తిగా ఇచ్చే పౌరుషాలకి ధర్మం తెలీట్లా!! కూడు , గుడ్డ , గూడు , కనీసం బెడ్డు కూడా లేకుండా బిడ్డల్నీనే programmes పెట్టేయడంలో న్యాయం, ధర్మం రెండూ లేవంటే ఒప్పుకోరే!! అంతా అన్యాయం , అధర్మం అంటారు.. అసలే రాళ్ళక్కరువు!! వేటితో కొట్టాలో తెలీక అన్యాయం అధర్మం అని అరిచే నోళ్ళని నోట్లతో కొట్టి ధర్మకర్తల్ని చేసేలోపు , రాళ్ళలోని ప్రాణం రోడ్లమీదకొస్తుంది!! |నోరెత్తనోళ్ళు పుణ్యాత్ములు !! నోరొచ్చే వరకు రాళ్ళేత్తుతారు | ధర్మకర్తల్ని ఉద్దరిస్తున్నది వాళ్ళే అని తెలుస్కోవాలంటే ముందు ధర్మం నాలుగు రాళ్ళమీద నడుస్తోందని తెలుసుకోవాలి!! ఊరికే రావడానికి న్యాయధర్మాలేమైన ఉచ్చలా!!.. ఉచ్చులు.. |కావాలనుకుంటే వెళ్లి ఇరుక్కోవాలి !! వద్దనుకుంటే పక్కకు జరుక్కోవాలి| __________________________________ Chi Chi (25/2/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fOOWKX

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ /నాతో ఆ పిస్తాగాడూ/ కొన్ని క్షణాలు పండుటాకులై రాలి పడ్డాక ఏ న్యూటన్ తలపైనో రాలిపడిన అనామక ఆపిల్ పండులా జీవితపు బట్ట తల నిమురుకుంటూ కొన్ని నిరామయపు ఆశలని తడిమేసుకుంటాం ఎప్పుడో చిల్లుపడిన బాల్యపు గోలీకాయ తీపీ వగరుల ఙ్ఞాపకమై వాడి చేతుల్లో పచ్చి మామిడి పిందెలా ఒదిగి కనబడ్డాక..... ఇప్పుడు గతపు జారుడు బల్లపై సర్రున సాగిపోయి అమ్మ వొళ్ళో నోట్లో బొటన వేలేస్కుని కూర్చుని బుజ్జు బువ్వకై మారాం చేస్తూ వాడిలా ఉన్నది నేనేనేమో చిక్కని సాలె గూడై నన్నల్లుకున్న "అంతర్జాలపు మాంత్రికుడా..! ఓ జుకం బెర్గ్" నా మంత్ర దండాన్ని లాక్కుని మాయల పకీరై కుక్కలా ఐనా పర్లేదు అమ్మ రొమ్ము ముందు పడేయవూ.. వాడి లా స్వేచ్చ నివ్వండి నాకు అనంతానంత గందరగోలపు విఙ్ఞానం నుండి రక్షించి నన్ను చిన్ని అడుగుల బాల్యం లోకి తిరిగి పంపండి పొంగే ప్రవాహపు ఝురిలో కౄరత్వం కాక ఆటస్తలాన్ని చూపండి ఔన్రా...... పిరికి దేవుడూ...!! ఈ మనుషుల,ఙ్ఞానాల,మేధావిత్వాలనుండి విముక్తి చేయరా మహోగ్ర జలధునిలో కూడా "నన్ను దిప్పెయ్"దిప్పెయ్" అనగలిగే ధైర్యాన్నివ్వరా మునిగిపొతానేమొ అన్న భయ్యాన్ని తీసేస్తే నేనూ మొనగాన్నైపోతా.... (మెడలోతు నీళ్ళలో కూడా ఆసరా కోరకుండా, ఎత్తుకున్న నాతో "దిప్పెయ్" నన్ను "దిప్పెయ్" అంటూ విదిలించుకొని రెండుసార్లు నిండా మునిగినా అడుగేస్తూ రాయిపై సొంతంగా నిలబడ్డ (పిస్తా) క్రిష్ గాడికి ప్రేమతో) 25/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzaf6I

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ /నాతో ఆ పిస్తాగాడూ/ కొన్ని క్షణాలు పండుటాకులై రాలి పడ్డాక ఏ న్యూటన్ తలపైనో రాలిపడిన అనామక ఆపిల్ పండులా జీవితపు బట్ట తల నిమురుకుంటూ కొన్ని నిరామయపు ఆశలని తడిమేసుకుంటాం ఎప్పుడో చిల్లుపడిన బాల్యపు గోలీకాయ తీపీ వగరుల ఙ్ఞాపకమై వాడి చేతుల్లో పచ్చి మామిడి పిందెలా ఒదిగి కనబడ్డాక..... ఇప్పుడు గతపు జారుడు బల్లపై సర్రున సాగిపోయి అమ్మ వొళ్ళో నోట్లో బొటన వేలేస్కుని కూర్చుని బుజ్జు బువ్వకై మారాం చేస్తూ వాడిలా ఉన్నది నేనేనేమో చిక్కని సాలె గూడై నన్నల్లుకున్న "అంతర్జాలపు మాంత్రికుడా..! ఓ జుకం బెర్గ్" నా మంత్ర దండాన్ని లాక్కుని మాయల పకీరై కుక్కలా ఐనా పర్లేదు అమ్మ రొమ్ము ముందు పడేయవూ.. వాడి లా స్వేచ్చ నివ్వండి నాకు అనంతానంత గందరగోలపు విఙ్ఞానం నుండి రక్షించి నన్ను చిన్ని అడుగుల బాల్యం లోకి తిరిగి పంపండి పొంగే ప్రవాహపు ఝురిలో కౄరత్వం కాక ఆటస్తలాన్ని చూపండి ఔన్రా...... పిరికి దేవుడూ...!! ఈ మనుషుల,ఙ్ఞానాల,మేధావిత్వాలనుండి విముక్తి చేయరా మహోగ్ర జలధునిలో కూడా "నన్ను దిప్పెయ్"దిప్పెయ్" అనగలిగే ధైర్యాన్నివ్వరా మునిగిపొతానేమొ అన్న భయ్యాన్ని తీసేస్తే నేనూ మొనగాన్నైపోతా.... (మెడలోతు నీళ్ళలో కూడా ఆసరా కోరకుండా, ఎత్తుకున్న నాతో "దిప్పెయ్" నన్ను "దిప్పెయ్" అంటూ విదిలించుకొని రెండుసార్లు నిండా మునిగినా అడుగేస్తూ రాయిపై సొంతంగా నిలబడ్డ (పిస్తా) క్రిష్ గాడికి ప్రేమతో) 25/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzaf6I

Posted by Katta

Abd Wahed కవిత

జవాబులేని ప్రశ్న గుబురు పొదలాంటి రాత్రి చీకటి ముళ్ల మధ్య ప్రవహించే నెత్తురు కూడా పగటి వెలుగు లేక చచ్చిపోతుంది మాటల వడగళ్ళకు పంటచేను కుళ్ళిపోతుంది పచ్చికొమ్మలపై ఎండుటాకులా ఆత్మ ఎడారిలాంటి శరీరంపై చెమటవానగా కురిసేదెప్పుడు? ప్రతిబింబాల అద్దంలో రంగులన్నీ కడిగేసి తెలుపేదో తేల్చుకుందాం ఇంద్రధనుస్సు నెగడులో అనుబంధాల చలికాగుదాం ఎండవేడి మాటువేసిందని చల్లని బాటకు తెలియదు బారులుతీరిన చెట్లేగా గాడ్పు దెబ్బలు తినేది ప్రవహించే గాలి కెరటాల్లో ఈదుతున్న చేపల్లా ఇళ్ళల్లో దీపాల రెపరెపలు చీకటి మత్తెక్కిన నగరం నడక తడబడుతుంది కలలకోసం ఎదురుచూస్తు మేలుకున్న నిద్రదేవి నేలపైన తెల్లారింది మనసుల్లో చీకటి ఉదయించింది ప్రశ్నల దుస్తులు తొడిగి వీధుల్లో నడుస్తున్నాం జవాబులు భేతాళుడిలా చెట్టు దిగి రావడం లేదు.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c1QuG9

Posted by Katta

Pusyami Sagar కవిత

మృగత్వం _________పుష్యమి సాగర్ నువ్వు మనిషి ముసుగు ని వొలిచి పశు అంశ ని వంటి నిండా నింపుకొని వేటాడే పులి వి అయినపుడు అంతరాత్మ గొంతు నొక్కి కోరికల గుర్రాలపై స్వారి చెయ్యలేదు ...!!! ప్రదేశాలతో పని లేని ఆకలి చూపులను విసురుతూ కామ జ్వాలల్లో నువ్వు తగలడి పొడి గా పొడి గా మారుతున్నప్పుడు చల్లబరిచే శీతలం కై తెగబడి దూకి లేడి కూనల కన్నీళ్లను నువ్వు తాగలేదు .....!!! ముల్లు ఆకు సామెతలు నా ఆడ కూతుర్ల నవ్వులను మూటగట్టి మూలాన పడెసినపుడు సామాజిక అడవి పెద్ద ల హుంకారాల నడుమ నీ వికటాట్టహాసం ప్రబంజనము అవ్వలేదు ...!!! కళ్ళ ముందు ప్రార్ధనా గీతం దేవుడి వెంట పరిగెడుతూ మాన యుద్ధం లో పోరాడి ఓడిన ప్రతి శరీరాన్ని రుచి చూడలేదు ..నువ్వు .!!!! అవును నిజమే, చెరచబడ్డ మానాల సాక్షి గా పులి ఎప్పుడు విజేతే .... జింక ల ఓటమి కొనసాగుతున్నవరకు !!! ఫిబ్రవరి 24, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k4Zd9C

Posted by Katta