పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

Ramakrishna Kalvakunta కవిత

ఓటమీ... గెలుపే !! ---------------------- @డా. కలువకుంట రామకృష్ణ కొన్ని సార్లు ఓటమి కూడా గెలుపే ! అయిన వాళ్ళను గెలిపించడం కోసం నువ్వు ఓడిపోవడం ఎంత మధురం ! గెలిచిన వాడు .. మళ్ళీ గెలవక తప్పని స్థితి ఓడిన వాడికో .. ఎంత స్వేచ్చో ఓడినా ,గెలిచినా .. ఆడటమే కదా . కావాల్సింది ! ఓడిన వాడిపై ఎన్ని హృదయాలు కారుణ్య వర్షం కురిపిస్తాయో విజేతవైతే అహంకారపు పొర మెల్లగా ఆక్రమిస్తూ అసూయా వీక్షణాల ,వ్యంగ్య బాణాలకు నెలవవుతుంది ఒక్కో ఓటమి ..... గాయపడ్డం గుండెకలవాటుగ మారుస్తుంది నిజానికి ఓటమికి ఎంత సహనం కావాలి ఓటమికి ఎంత గుండె ధైర్యం కావాలి నాలిముచ్చుల ,నక్కజిత్తుల దొంగ దెబ్బల గెలుపుల కన్నా ధైర్యంగా ,ఎదురెదురుగా నిలిచి ఓ డటమే .. మిన్న గెలుపొక పూర్ణ బిందువైతే .... ఓటమొక విరామ చిహ్నమే ఓడిన వాడికి గెలిచే అనంత శక్తి ఎక్కడో దాక్కుని ఉంది ఓటమికి తెలిసిన కన్నీటి విలువ ఏనాడూ గెలుపు .. అందుకోలేదు ! ఇంట గెలిచినోడు - రచ్చ గెలువక పోవచ్చు రచ్చ గెలిచినోడు- ఇంట గెలువక పోవచ్చు ఇంటా- రచ్చా గెలిచినోడు తనను తాను గెలువక పోవచ్చు ఆయుధమై హింసతో గెలిచే కన్నా అక్షరమై ,ఆత్మీయతతో ... అశ్రువర్షం ధారవోస్తూ ఓడటమే మిన్న ఒక్క వ్యక్తిత్వంలో ఓడకుంటే చాలు ! ఎన్ని ఓటముల్నైనా భరించవచ్చు ఒక ఓటమి అనేక విజయ శిఖరా లకు ..ఆలంబనై నిలుస్తుంది . @డా.కలువకుంట రామకృష్ణ

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p3MFpl

Posted by Katta

Radha Rao కవిత

ఉమ్మడి కుటుంబ వ్వస్త చిన్నాభిన్నమయింది. వ్యక్తి గతస్వార్థం వెర్రి తలలు వేస్తోంది. అభిమానాలు, ఆప్యాయంగా పలకరింపులే కరువైనాయి. సమస్య ఏదైనా వస్తే ఎవరితో పంచుకోవాలో తెలియని ఒంటరి తనం. అందరూ ఉండీ ఎవరూ లేనట్లే ? సమస్య ఎవరితో పంచుకుందామన్నా అవమానాలపాలే ! ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సమస్య లే కాదు, సంతోషాలూ ఆనందాన్ని అనుభూతిని పొందేవారు. అమ్మ,అమ్మమ్మ, నానమ్మలు పిల్లలందరిందరికీ ముద్దలు కలిపి చేతినిడా పెడుతుంటే కడుపు నిండా తినేవాళ్ళం. ఎంగిలి, గోరుముద్దలు మామూలే !! నేటి పరిస్థితి ఎవరితో ఏసమస్య చెప్పుకోలేక గుళ్ళు, గోపురాలు తిరిగి చెప్పు కోవాల్సి వస్తుంది . ఏకాకి జీవితాలే నేడున్నవి !!!

by Radha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p3MFpg

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ద్వైతాద్వైతం|| ఒక దుఃఖానికి సంబంధించిన మాట నేను నీలా వుండటం. నీలా వుండాలనుకోవడంలో తప్పేమీ లేదేమో కాని, నేనే నీలా మారిపోవడం ఒక విషాదం నా జీవితం తాలూకూ చారిత్రికవిషాదం. నువ్వు పలుకుతుంటావ్ నాలో నువ్వు నవ్వుతుంటావ్ నాలో నువ్వే, నువ్వే ప్రతిక్షణం నేనై రగిలే క్షణంలో అది నా తాలూకూ మరణభావన. సాదృశ్యతలు సామాన్యమేనైనా నేనే అదృశ్యమైపోయాక, ఇక వేటిని వెతుక్కోవాలి నేను నాలో, నిరంతరం నిన్ను తప్ప. చేతులారా, నిన్ను నాటుకున్న పాపానికి నా దేహం ఇప్పడిక నా పాలిటి సమాధి. జీవమై నువ్వే ప్రవహించుకో ఇక. పాలించుకో ఇక, ఈ నీ రాజ్యాన్ని. -------------------------------------14/4/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hF2m2o

Posted by Katta

Kavi Yakoob కవిత

" ఏ కవయినా తనకు తాను నిలబడాలంటే, తన డిక్షన్ తను సృష్టించుకోవాలి. తన శబ్దప్రపంచం తను నిర్మించుకోవాలి. అభిరుచి కాదు..ఆత్మశైలి కావాలి. సామాజిక స్పృహ కవిత్వ రక్తప్రసరణ కావాలి" * "కవికి నిరంతర సాధన కావాలి. కవిత్వం ఊపిరి కావాలి. మనల్ని ఆవరించిన వాతావరణం కవిత్వం కావాలి.అప్పుడు కవిత్వం దానంతటదే బయల్పడుతుంది." - కె.శివారెడ్డి

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gw3nrC

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

మనిషి - మనీషి ************ మనిషి బతికున్నోడు నాలుగు రాళ్ళు వెనకేసుకునెటోడు బతికున్నోల్లను గద్దలా పీక్కుతినెటోడు పైసలుంటేనే పలుకరిచ్చెటోడు మనీషి మరణించినా బతికున్నోల్ల మనసుల ఉన్నోడు రాయిలా మారినా దేవుడైనోడు గతించినా భవిష్యత్తంతా బుక్కెడు బువ్వపెట్టెటోడు లేనోల్ల కోసమే బతికి కంటనీరు తుడిచెటోడు కండ్లల్ల నిలిచినోడు ************ ఏప్రల్ 14,2014 అంబేద్కర్ జయంతి

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRM9Jb

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

మనిషి - మనీషి ************ మనిషి బతికున్నోడు నాలుగు రాళ్ళు వెనకేసుకునెటోడు బతికున్నోల్లను గద్దలా పీక్కుతినెటోడు పైసలుంటేనే పలుకరిచ్చెటోడు మనీషి మరణించినా బతికున్నోల్ల మనసుల ఉన్నోడు రాయిలా మారినా దేవుడైనోడు గతించినా భవిష్యత్తంతా బుక్కెడు బువ్వపెట్టెటోడు లేనోల్ల కోసమే బతికి కంటనీరు తుడిచెటోడు కండ్లల్ల నిలిచినోడు ************ ఏప్రల్ 14,2014 అంబేద్కర్ జయంతి

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRM9sF

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

Nisheedhi | Illogical| తర్కం కి అందని మనసుపొరలని గర్హిస్తూ నిజాలను గ్రహిస్తూ ఒక్కొ పొర వదిలేస్తు నగ్నంగా నమ్మకాలకి దూరంగా ఆస్వాదించాలంటే ఆలోచనల దిగంబరత్వమే అశరీరంగా అనంతంగా ఎల్లలు లేని అనుభుతిగా కళ్ళు తెరిచి చూడలేని మూసిన గుప్పిట్లో రహస్యాలన్ని మనసు విప్పుతూ ఒకటే యాతన ప్రసవభారం తీరి అర చేతుల్లో పాపయిలా నవ్వేవరకు . అలోచనలన్నీ బాస్టర్డ్ చైల్డ్సే విత్తుల గుర్తులు తెలియకుండా కన్నందుకు అమ్మలకి తప్పని అభిశపం లా మనసుని వదలకుండా అడ్డ దిడ్డంగా మహావేగం గా పెరిగిపోతూ జనోద్దారణ కోసమో స్వీయ దహనం కి ఆత్రమో . ఎందుకో మరి ? నిశీ!! 14-04-14 .

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNLAKU

Posted by Katta

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు || ప్రశ్నలు || షష్ఠి పూర్తి దాటి శతకానికై పరుగులు పెడుతున్న స్వాతంత్రమా నీవెక్కడ? ఇహపరాలను మరిపించి మనిషికి మనసును దగ్గరచేసే స్వేచ్ఛా నీ ఉనికెక్కడ? మూడువేల ఏళ్ళచరిత్ర నాదంటూ భీరాలు పలుకుతున్న పదహారణాల తెలుగుదనమా నీ ఊరెక్కడ? ఎంత తాగినా రక్తదాహమే తీరని హింసా నువ్వు కనిపించని చోటెక్కడ? ఆకాశంలో సగానివంటూ నిన్ను పాతాళానికి తొక్కారే మగువా నీకు మనుగడెక్కడ? రొమ్ము విరుచుకుని జబ్బలు చరుచుకునే మగతనమా నువ్వు పుట్టిందెక్కడ? #14-04-2014

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyaV0i

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//సొతంత్రం// ఎనకటికి ఓరోజు అర్ధరాత్రి సొతంత్రం వచ్చిందంట! ఎవళ్లకి? అని అడగబాక ఆమాత్రం సదుంకోలేదా నువ్వు ఎన్ని పేపర్లున్నా ఒకిటీ సదవ్వా! ఎళ్ళెళ్లవా అన్నీ పార్టీలోళ్ళయే గాందా? ఔననుకో ఓపాలి చెప్పింది ఇనవో అర్ధరాత్రి సొతంత్రం ఎవరికొచ్చిందంటే... ఓరి ఎంగళప్పళ్ళారా! సోది ఆపి టీవీ చూడండ్రా ఏంటీడు! ఎంత దయిర్యం? పగలే పార్టీ మ్యానిఫెస్టో ఇడుదల సేత్తన్నాడు కొంపదీసి ఈడికి పగలే సొతంత్రం వచ్చిందా..ఏటి!?...14.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gw0aVx

Posted by Katta

Amma Akhil కవిత

పిచ్చి ప్రయత్నాలు చేయకు #అమ్మఅఖిల్ ఎక్కడున్నావు ప్రియతమా...? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీకు నేను గుర్తున్నానా నీతో కలిసి ఏడడుగులు నడవాలనుకున్న నీ ప్రేమికుడిని ఈ చావు బ్రతుకుల సంగమంలో నాతో ఆఖరి మజిలి వరకు వస్తానని నువ్వు చేసిన ప్రమాణాలు అప్పుడే మర్చిపోయావా? ఏది ఏమైనా నీతోనే ఈ జీవితం కొనసాగాలని ఆశపడుతున్నానని ఆనాడూ నువ్వు చెప్పిన మాటలు ఈనాడూ ఊపిరి లేనివైపోయాయా? నాతో నువ్వు ఎంతో ప్రేమగా చేసిన బాసలన్నీ కాలగర్భంలో కలిసి కొట్టుమిట్టాడుతున్నాయా? ఒకరికి ఒకరం అని అందంగా మనం రాసుకున్న ప్రేమ కవితలు ఇప్పుడు చిరునామా కోసం వెతుకుతున్నాయా? నేను విన్న మాటలన్నీ నిజానిజాల ఆన్వేషణలో ఎటూ నిర్ధారించుకోలేక పోతున్నాయా? నాతో ముడిపడిన నీ ప్రేమబంధాన్ని బలవంతంగా తెంచుకోవాలని చూస్తున్నావా? మనసునిండా నింపుకున్న నీ ప్రేమను కాలసర్పం కాటు వేస్తే తట్టుకోలేక విలవిలలాడుతున్నావా? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో ఒక్కసారి నా నుండి నీ మనసుని తీసుకెళ్ళగలవా? నా ప్రాణసఖి ఏదో ఒకరోజు చావాల్సిందే అని ఈ రోజే చనిపోతామా? ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న మన ప్రేమకు ఉరితాడు బిగించాలని చూస్తున్నావా? హృదయాంతరాళం నిండా నిండిన ప్రేమకి సమాధి కట్టాలని అనుకుంటున్నావా? కలిసిన మనసులను విడదీయాలని "పిచ్చి ప్రయత్నాలు" చేస్తున్నావా...? నీకిది న్యాయం నా ప్రాణమా... ఎలా ఉంటుందో తెలియని రేపటి కోసం ఈ రోజు నువ్వు బాధ పడుతూ నన్ను బాధపెడుతున్నావా? ఇప్పటికైనా తెలుసుకో... నీ మీద నాకున్న ప్రేమకి మరణం లేదని సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చినా నా నుండి నిన్ను దూరం చేయలేడని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నువ్వు ఎన్ని చేసినా నేను నిన్ను మర్చిపోలేనని ఎన్ని ఆటంకాలెదురైనా నీ చేయి విడువనని నిన్ను ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తున్నానని...! 14apr14

by Amma Akhil



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hB00k6

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

సదా స్మరామీ... బుద్దం శరణం గచ్చామీ అన్న అంబేద్కర్ సదాస్మరామీ భారత రాజ్యాంగ రూపం దారి చూపు జ్ఞాన దీపం //బుద్దం// బడి మెట్లను ఎక్కొద్దనీ గుడి మెట్లను తాకొద్దనీ అంటు రోగ కులం కత్తి గుండెకు గాయం చేస్తే ఆగ్రహ ఆవేశాలను ఆలోచనగా మలచి అన్యాయపు డొక్క చీల్చె న్యాయ శాస్త్ర విద్య నేర్చి కడజాతుల కన్నీళ్ళను కెరటాలుగ తీర్చిదిద్ది కులం గోడ కూల్చి వేయ వుద్యమ జెండగ ఎగసె. //బుద్దం// అంబేద్కర్ అంటే ఒక దళిత జనుడు కాదు, పీడిత తాడిత నరాన ప్రవహించే జవజీవం ఆత్మ గౌరవాన్ని యెదలొ ఆకళింపు చేసుకొని మునుముందుకు సాగే ఓ మహోన్నత ఆశయం అంతరాల దొరతనాల అంతుజూసె ఆయుధం సామాజిక న్యాయానికి సమరశీల సిద్దాంతం. //బుద్దం// (అంబేద్కర్ మహాశయునికి అక్షర నివాళి) 14.4.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRiX5j

Posted by Katta

ప్రేమలేఖ తెలుగు మాస పత్రిక కవిత

-----రచనాసక్తి గలవారికి ఇదే మా ఆహ్వానము------- ప్రేమ చిట్కాలు,ప్రేమ సిద్ధాంతాలు,కధలు,కవితలు,జోక్స్,వంటలు, ,ప్రేమ పాటల సారంశం, పర్యాటక విశేషాలు, ఆధ్యాత్మిక రచనలు మొదలైనవి వ్రాయగలిగే నేర్పు ఉండి తమ రచనలను పత్రిక లో చూసుకోవాలని తపించే వర్ధమాన రచయి(త్రి) తలను మేము ప్రోత్సాహిస్తం. సారంశం ఏదైనా రచనా శైలి బాగుంటే చాలు.మీ రచనలు ఎడిట్ చేసి పత్రికలో మేము ప్రచురిస్తాం. ఆసక్తి కలవారు సంప్రదించండి. email id : editorpremalekha@gmail.com

by ప్రేమలేఖ తెలుగు మాస పత్రిక



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hEsJ8H

Posted by Katta

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || సహజం || పూలపానుపుపై నా తలలో నా ఆలోచనల్లో నన్ను నిలదీస్తూ కొంటెగా .... నవ్వులు రువ్వుతుంది నీ రూపమే నిద్దుర నాకు తోడు రానంటుంది .... ......, ఎందుకో అనిపిస్తుంది నీవు, స్థిమితంగా కూర్చుని, నా హృదయం తో .... ఆటాడుకుంటూ ఉన్నావేమో అని. ఆ ప్రభావమే నన్నిలా తపించేలా చేస్తుంది అని. తెలుసుగా చెలీ .... అది న్యాయం కాదు. కేవలం ఒక ఆటే ప్రేమ అని .... అనుకోలేను. చిలికి చిలికి జల్లు గాలివానైనట్లు ప్రేమ జూదం ఆకర్షణల పాచికల ఆటలో .... నన్నోడి అధర్మంగా నీకు దాసుడ్ని అయ్యానని. అలా ఆలోచిస్తే చాలా కష్టం గా ఉంటుంది. అయినా, నిజం గా నా ఓటమి నిన్ను సంతోషంగా ఉంచగలిగితే ఆ ఆనందం చాలదూ .... ఈ జీవన సాఫల్యానికి నేను కలలు కన్నది నిన్నే నిజం చెబుతున్నా! నీ ప్రేమ లేని అస్తిత్వం .... లేదు నాకు. నీలోనే నివశిస్తూ నిన్నే నేను కలలు కంటుంది, నేను పూజిస్తుంది, జీవిస్తుంది, నిన్ను ప్రాప్తించుకునేందుకే .... అని నీకు తెలుసు! ఒంటి స్తంభము మేడలో .... ఒంటరిగా ముస్తాబించుకుని మేనువాల్చినా ఎందుకో నిద్దుర రాదు. టేప్ రికార్డర్ లొంచి మంద్రం గా వడపోసినట్లు ఒకప్పటి ప్రేమ జంట, మనం .... చెట్టాపట్టాలేస్తూ పాడుకున్న పాటల సంగీతం వినిపిస్తూ ఆ నిన్నటి నిజం తుడిచెయ్యలేని గతం జ్ఞాపకం హృదయాన్ని స్పృశిస్తుంటే నా జీవన ప్రశాంతతను నిన్నను ..... నిన్ను, మరిచిపోలేకపోతున్నాను!? ప్రేమకు అర్ధం తెలిపి, బాష్యం చెప్పింది నీవే అన్న నిజాన్ని. జీవించడానికి .... ఒక ఆశవై, ఒక నమ్మకానివై అనిశ్చితి, అపనమ్మకం గడియల్లో .... నిర్వీర్యుడ్నైన క్షణాల్లో .... ధైర్యానివై, పురోగమించేందుకు తోడుగా నిలబడ్డ నీ కోసం కలలో ఎదురుచూడటం సహజమే కదూ! ఈ జీవనంలో, పూజ, గమ్యం నీవు కావడం! 14APR2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gvslnw

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-6/ Dt. 14-4-2014 ఉగ్రవాదం మత్తులో తెగ ఊగుతున్నావెందుకు పగతొరగిలే మంటలో చలి కాగుతున్నావెందుకు లోకమంతా క్రాంతి వృక్షం పెంచుకుంటుంటే కొమ్మ తొడిగే శాంతి చివురులు తుంచుతున్నావెందుకు కూటి కోసం కూలిచేసే సాటి మనిషి గుండెలో కర్కశంగా వాడి బాకులు దించుతున్నావెందుకు సమత తీవెకు మమత పూసే పూలతోటల్లో తీవ్రవాదం కలుపు మొక్కలు పెంచుతున్నావెందుకు సర్వమతములు విశ్వశాంతిని ప్రభోదిస్తుంటే శాంతి కొరకే ఆయుధాలని పలుకుతున్నావెందుకు హితం కోసం మతం ఉందని "చల్లా" కవితలు రాసినా మతం గుండుతో మనిషి గుండెను పేల్చుతున్నావెందుకు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gvsmrA

Posted by Katta

Amma Akhil కవిత

పిచ్చి ప్రయత్నాలు చేయకు #అమ్మఅఖిల్ ఎక్కడున్నావు ప్రియతమా...? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీకు నేను గుర్తున్నానా నీతో కలిసి ఏడడుగులు నడవాలనుకున్న నీ ప్రేమికుడిని ఈ చావు బ్రతుకుల సంగమంలో నాతో ఆఖరి మజిలి వరకు వస్తానని నువ్వు చేసిన ప్రమాణాలు అప్పుడే మర్చిపోయావా? ఏది ఏమైనా నీతోనే ఈ జీవితం కొనసాగాలని ఆశపడుతున్నానని ఆనాడూ నువ్వు చెప్పిన మాటలు ఈనాడూ ఊపిరి లేనివైపోయాయా? నాతో నువ్వు ఎంతో ప్రేమగా చేసిన బాసలన్నీ కాలగర్భంలో కలిసి కొట్టుమిట్టాడుతున్నాయా? ఒకరికి ఒకరం అని అందంగా మనం రాసుకున్న ప్రేమ కవితలు ఇప్పుడు చిరునామా కోసం వెతుకుతున్నాయా? నేను విన్న మాటలన్నీ నిజానిజాల ఆన్వేషణలో ఎటూ నిర్ధారించుకోలేక పోతున్నాయా? నాతో ముడిపడిన నీ ప్రేమబంధాన్ని బలవంతంగా తెంచుకోవాలని చూస్తున్నావా? మనసునిండా నింపుకున్న నీ ప్రేమను కాలసర్పం కాటు వేస్తే తట్టుకోలేక విలవిలలాడుతున్నావా? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో ఒక్కసారి నా నుండి నీ మనసుని తీసుకెళ్ళగలవా? నా ప్రాణసఖి ఏదో ఒకరోజు చావాల్సిందే అని ఈ రోజే చనిపోతామా? ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న మన ప్రేమకు ఉరితాడు బిగించాలని చూస్తున్నావా? హృదయాంతరాళం నిండా నిండిన ప్రేమకి సమాధి కట్టాలని అనుకుంటున్నావా? కలిసిన మనసులను విడదీయాలని "పిచ్చి ప్రయత్నాలు" చేస్తున్నావా...? నీకిది న్యాయం నా ప్రాణమా... ఎలా ఉంటుందో తెలియని రేపటి కోసం ఈ రోజు నువ్వు బాధ పడుతూ నన్ను బాధపెడుతున్నావా? ఇప్పటికైనా తెలుసుకో... నీ మీద నాకున్న ప్రేమకి మరణం లేదని సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చినా నా నుండి నిన్ను దూరం చేయలేడని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నువ్వు ఎన్ని చేసినా నేను నిన్ను మర్చిపోలేనని ఎన్ని ఆటంకాలెదురైనా నీ చేయి విడువనని నిన్ను ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తున్నానని...! 14apr14

by Amma Akhil



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQy7b1

Posted by Katta

కాశి రాజు కవిత

|| దేవగన్నేరు || వద్దులే అని నాన్నలు బద్దకించాకే ఏ ఊళ్ళోనైనా పొద్దుపోతుంది అప్పుడే ఆ ఊరి సూరీడు అలిసిపోయి పొద్దు సూసుకుంటూ పనిసేసే అమ్మల్ని ఇంటికి పొమ్మంటాడు బోదులో కాళ్ళు కడుక్కుని కచ్చాఇప్పి రోడ్డెక్కాక, ఇంటికి చేరేలోపు ఎన్ని కబుర్లో ! నెలలునిండని పిల్లాన్ని నేలమీద వొదిలేసి వచ్చిన అమ్మలకి ఒక్కో అడుగుకీ ఒక్కో వేగం వదిలిరాలేని ప్రేమతో వొచ్చిన ఒక తల్లి వొరిసేలో ఏం సేత్తాదో తెలుసా! ఆకుకట్ట ఇప్పినట్టే అమ్మ గుండెని ఇప్పేస్తది గుబులు మూన నీట్లో గుచ్చి వరి నాటుతున్నట్టు ఓరోజంతా ప్రేమను దుఃఖంతో నాటేస్తది. రోజుకూలీ బతుకులో రోజంతా అలా అమ్మ ధ్యాసలో జీవించి ఇంటికిపోయాక కాస్త ముందొచ్చిన మొగుడు పిల్లానెత్తుకుని గుమ్మమ్ముందు దేవుళ్ళా కనిపిస్తే. కల్లనీలు కారుస్తూ ఆ తల్లి దేవగన్నేరైపోతాది. అవును దేవగన్నేరైపోతాది

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLDhhq

Posted by Katta

Nirmalarani Thota కవిత

నింగి నిండా ముసురుకున్న మొయిళ్ళు గుండె నిండా మోయలేని గుబుళ్ళు కలల్లోనే కనిపించే ఆనందాల వాకిళ్ళు..! ఎగరడానికి బరువైన రెక్కల రొద . . చెప్పడానికి వీలు లేని మనస్సు సొద . . ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిధుల నిశీధి పొర . . మనసు విప్పి స్వాంతన పొందడానికి అడ్డొచ్చే అహపు తెర... ధైర్యం చేసి మనసు పరుద్దామన్నా అంతు చిక్కని మనుషుల ఆంతర్యాలు ! ఎంత వెదికినా అర్ధం కాని మోడరన్ ఆర్ట్ లాంటి జీవితాల అంతరార్దాలు ! దాటలేని వలయాల మధ్య ఎదురీతల సంఘర్షణలతో అసంతృప్త ఆవిరులను నింపుకున్న మానస మేఘం లోతు తెలియని లోకపు చిరు విమర్శనా పవనం తాకిడికి స్వచ్చంగా మెరువనూ లేక ఉక్రోషంతో ఉరమనూ లేక రావడానికి తొంగి చూస్తూ రాలడానికి బిడియ పడుతూ కను కొలుకున ఆర్తిగా నిలిచిన అశ్రుబిందువుకు భాష్యం చెప్పే సాహసం చెయ్యలేక మౌనం నిరంతర వాక్ప్రవాహం అనుకుంటూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నా ! నిర్మలారాణి తోట [ తేది: 14.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwU51O

Posted by Katta

Subhash Koti కవిత

అద్భుతమైన దోహా ( తెలుగు సేత: గుంటూరు శేషేంద్ర గారు ) బ్రజ్ భాషలో మొహమ్మద్ మల్లిక్ జాయిసీ చెప్పిన దోహా ఇది: కాగా కాగా సబ్ తన్ ఖాయియో, చున్ చున్ ఖాయియో మాంస్ . దో నయ్ నా మత్ ఖాయియో, పియా మిలన్ కె ఆస్: కాకీ కాకీ దేహమంతా తిను, ఏరుకుని ఏరుకుని తిను మాంసం. రెండు కళ్ళు మాత్రం తినకు,వాటిలో ప్రియుడ్ని కలిసే ఆశ మిగిలి ఉంది. ( ప్రియుడి వియోగ దుఃఖము చేత ప్రాణ మాత్రావశిష్థ అయి ఒక స్త్రీ అంటోంది )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sZdhay

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1p1Xto3

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p1Xto3

Posted by Katta

Amma Akhil కవిత

మా అమ్మ గారు భారతీ కాట్రగడ్డ(భారతీరాయన్న) రాసిన కవితా సంపుటి "కనుల కొలను" పుస్తకం నిన్న రయ్యన్ ఫంక్షన్ హాల్,బోధన్,నిజామాబాద్ లో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.మీరు ఇలాంటి రచనలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ.

by Amma Akhil



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p1Xt7z

Posted by Katta

Santi Chaparala కవిత

14/4/2014. Santi... ఏన్నెనో వింతలు మరెన్నెనో విడ్దురాలు జీవితం అంచుల లోకి తొంగిచుస్తే పరిగెత్తే ఆశలు భయపెట్టే భావలు జీవితం మధ్య నుంచుంటే కలవరపెట్టే కలలు అడ్డుపడే అఘదాలు జీవితం లో జీవించాలంటే నిశి లాంటి నిర్మొహమాటాలు పదునైన పలుకు మాటలు జీవితం నెర్పుతుంటే ఆవిరి అవుతున్న ఆప్యయతలు అర్ధం చెసుకోలేని బంధాలు జీవితం లో చిగురిస్తుంటే ఈ జీవితం అంతా జీవించాలని అనిపించే ఆశలు అవిరి అవుతుంటే ఏక్కడో ఎప్పుడో నీ రాక , నీ శ్వాస నాలో కొత్త ఉపిరి పొస్తుంటే ఈప్పుడేమొ తుది దాక జీవించాలన్న కొరిక మరణిచనటుంది ... నీ తోనే మరో జీవితం కవాలంటుంది...

by Santi Chaparala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPNXm0

Posted by Katta

Sreedhar Babu Pasunuru కవిత

"మల్లెపువ్వు" -- పసునూరు శ్రీధర్ బాబు ఒక మల్లెపువ్వు ఈ రాత్రి కిటికీలోంచి తారకలా వచ్చి పలకరించింది వెలుతురు భాషలో మాట్లాడుతూ నా కళ్ళల్లో కొన్ని మిణుగురుల్ని వెలిగించింది తెల్లని మౌనంలా సిగ్గుపడుతూ నా చెవుల్లోకి ఒక ప్రేమకవితను ఒంపింది ఒక ఇంధ్రధనుసు ఈ అర్థరాత్రిలో వెచ్చని పైట చెంగులా నా ముఖాన్ని నిమురుతూ వెళ్ళిపోయింది మల్లెపువ్వు నా భుజం మీద వాలి వెళ్ళిపోయిన కాలంలోని వెలిగిన క్షణాలను నా దోసిట్లో పోసింది రెక్కల గుర్రం మీద ఎవరో దేవకన్య నిరుటి జన్మ స్నేహంలా ఎదుట వాలింది పెదాల మీద తలకిందులుగా వాలిన మల్లెపూవు గుండెలో నలిగి మలిగిన పాత పాటనొకదాన్ని సన్నని తీగలా బయటకు లాగింది అది చీకటి కొలనులో వెన్నెల వలయాలుగా కంపించి కనుమరుగైంది అరిచేతిలో ప్రేయసి చుబుకంలా ఒదిగిన ఆ మల్లెపూవు నిశ్శబ్దం వెచ్చగా గుబాళించడమంటే ఏమిటో చూపించింది మౌనం ఎంత లయాత్మకంగా కల్లోలపరుస్తుందో అనుభవంలోకి తెచ్చింది ఆ మల్లెపూవును అలాగే గుప్పిట్లో దాచినప్పుడు ఆకాశమంత జ్ఞాపకం చల్లని దీపంలా నన్ను లోలోపల వెలిగించింది- దాన్ని కదిలిస్తే.. మువ్వల శబ్దం ఎద మీద హత్తుకుంటే... శంఖపు హోరు అది చీకట్లో తేలుతూ ఏకాంతంలోకి చొరబడుతుంటే నాలో తలుపులు తెరుచుకుంటున్న చప్పుడు- కుంటాల జలపాతంలా నేను నాలోకే దుముకుతున్నప్పుడు ఎగిరే నీటి నురగల మీద తుళ్ళిపడుతూ గంతులేస్తూ మురిసిన ఆ సిరిమల్లి మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోయింది- వీడ్కోలు గాయం చేయకుండా వెళ్ళిపోగల మహత్యం దానిది- ఈసారి వచ్చేటప్పుడు తన తోటనంతా తీసుకువస్తానంది అప్పుడు నక్షత్రాల ఆకాశం తలకిందులై నన్ను తన మీద నడిపిస్తుందేమో చూడాలి- *** (2-11 ఏప్రిల్ 2014)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwB0N0

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hDW9Uo

Posted by Katta

తెలుగు రచన కవిత

******************** నీవు లేని వేళ *********************** నీవులేని ఈవేళ,జ్ఞాపకాలతోటలో మధురస్మృతులు అరుతున్న వెన్నెలరాత్రులలో జాబిల్లివేసే ప్రశ్నలకు జవాబు తెలియకనేనున్నా. అఘాధపులోతులలో అంధకారాన్ని నామనసులో గమనిస్తున్నా. కనిపించని వ్రాతలు హృదయంతో చదవాలని యత్నిస్తున్నా! అద్దంలో నాప్రతిబింబం నన్నడిగే ప్రశ్నకు నేనేమని చెప్పను? చిరునామాలో చివరి అక్షరం నేనని ఎలా చెప్పాలో నానేస్తం? సిరానిండిన కలంతో వ్రాస్తున్నా,అది కన్నేరనుకోకుము నేస్తమా. శిలనైపోయా స్పందన మరిచిన హృదయంతో, ఇలా ఇలా. నీవా రాముడివైతే ఆ పాదం కోసం నేవేచి వేచి చూస్తున్నా. క్షణాల గణితంలో యుగాల వెంబడి నేవేగిపోతున్నా. కనిపించని వ్రాతలు హృదయంతో చదవాలని యత్నిస్తున్నా! నీవా రాముడివైతే ఆ పాదం కోసం నేవేచి వేచి చూస్తున్నా. .................................................. మాధుర్య (౧౩/౦౪/౨౦౧౪)

by తెలుగు రచన



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hDW8je

Posted by Katta

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (అమృతంతో పోల్చలేను...) ప్రేమను అమృతంతో పోల్చి ఎంత తప్పు చేసానో... అమృత మంటే అందమైన అబద్ధం, అదో ఎన్నికల వాగ్దానం... అమృత మంటే కల, ప్రేమంటే గొప్ప కళ... ప్రాణ మూలా లైన నీటిని, పాలను, తేనెను, పంచదారను... అమృతంతో పోల్చి వాటి పరువు తీశాను, జీవనాధారాలకు నేనో పెద్ద తప్పు చేశాను... నీటిని నీటితోనే పోల్చాలి, పాలను పాలతోనే చెప్పాలి, తేనె అయినా, పంచదార అయినా ప్రేమ నయినా ఎలాంటి మానవ సుమగంధాల నయినా... వాటిని వాటితోనే పోల్చాలి, వాటి కవే సాటి, మరి దేనితోను లేదు వాటికి పోటీ... రాత్రంతా దిగంబరంగా దిగులులో తడిసిన వాడికి ఉదయం ఓదారుస్తూ ఇచ్చే ఎండ వస్త్రాన్ని అమృతంతో ఎలా పోల్చను! తనువంతా ప్రాణాలై అంతర్లీన మైన మహా పంచ శక్తుల్ని అమృతంతో పోల్చి ఎలా దోషం మూటకట్టుకోను! ప్రియురాలి దర్శనాన్ని వెన్నెలతో పోలుస్తా, హాయిగా ఉంటుంది... తల్లి పెట్టే గోరుముద్దల్ని చందమామతో పోలుస్తా, చల్లగా ఉంటుంది... అమృతంతో మాత్రం పోల్చను, అమాయకుల్ని మోసం చేయను... ఎందుకురా బాబూ, అమృతం అమృతం అని కలవరిస్తారు! పోలికలు వద్దని కాదు- నీరో, పాలో, నేలో, గాలో, నిప్పో, ఉప్పో... మీ భావాలను చిత్రించటానికి సత్యమైన పోలికల్ని తీసుకోండి! సత్య మైన వార్తకు సత్యం కన్నా గొప్ప లక్షణం ఏముంటుంది చెప్పండి! 14-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwmJ2Z

Posted by Katta

Santhisri Santhi కవిత



by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwmHbj

Posted by Katta

సిరి వడ్డే కవిత

ll ఎందుకో నీకింత నిర్దయ ll కాలానికైనా ఉంటుందేమో కాస్తంత దయ నిన్ను మాత్రం వెన్నంటే ఉంటుంది నిర్దయ వలచి వచ్చానని చులకన నీకు వెలివేస్తున్నావని వేదన నాకు ప్రేమిస్తూ నేను... ద్వేషిస్తూ నీవు విసిరేస్తూ నీవు ... విలపిస్తూ నేను అందరాని చందమామవే నీవని తెలిసినా నిన్నే ప్రేమించడం మానలేకున్నా విసిగి వేసారిన క్షణాన శిలగానే మిగిలిపోతున్నా అనుక్షణం నీకై తపించిన కాలమంతా అవమానాల ముళ్ళ బాటలనే పరిచావు కాలకూట విషాన్నే చిందించావు హృదయాన్ని చిధ్రం చేస్తూనే ఉన్నావు మనోవనంలో చివురించిన ఊహలన్నీ వాడి రాలిపోతున్నాయి పసిమొగ్గలుగానే నేలవరుగుతున్నాయి నిరాశల కొమ్మలుగా కన్నీటి ముత్యాలు విసుగు చెంది జారిపోతున్నాయి కనుల కొలనునుండి మనోసాగరంలోనికి ఎదలోని తేనెవాగులన్నీ తరలిపోతున్నాయి ఉప్పునీటి అలలు తాకని మరో ఆనంద సాగరానికి పెదవిదాటని పలుకులన్నీ పరుగులు తీస్తున్నాయి మది దాచిన మౌనాల గుప్పిట గుట్టు నీకు విప్పి చెప్పాలని గుండె చప్పుళ్ళలో దాచిన క్షణాలన్నీ నీ ప్రేమ వాకిట తెరవాలని తరలిపోయే ఋతువులన్నీ ఆశల విత్తులనే నాటి పోతున్నాయి సాగిపోతూ ఏరులన్నీ ఊరడిస్తున్నాయి నిరాశల కొమ్మన ఊగుతూ ఆశల పత్రాలెన్నో ఊరటనిస్తున్నాయి మారే నా కలల ఋతువులన్నిటా వసంత శోభలనే నింపుతావని నీ నిరీక్షణలోనే యుగాలుగా నిరీక్షిస్తున్నా . ... ll సిరి వడ్డే ll 13-04-2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPA3Aw

Posted by Katta

Annavaram Devender కవిత

ఈ రోజు 14.04.2014 'ఆంధ్ర ప్రభ ' సాహితీ గవాక్షం లో ...

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzAlrT

Posted by Katta

Aruna Naradabhatla కవిత

కొత్త పంట ____________అరుణ నారదభట్ల గట్టిగా హత్తుకున్న రెండు రేకుల బీజం ఇప్పుడెవరో భూమిలో వేసారు! గింజ మట్టిలో పడ్డందుకేమో బాగానే నానింది! ఒక్క విత్తు రెండు ముక్కలైంది... కొత్తగా రెండు లేత ఆకులకు జన్మనీయడం కొత్తసృష్టే గానీ అసలు పండగ ఇప్పుడే మొదలైంది! కలల పంటలు పండిస్తామంటూ గీసిన సరిహద్దు రేఖ రంగురంగుల రంగవల్లిలా మనసులలో కళకళలాడుతుంది! ఎవరికి వారై కూడగట్టిన మబ్బులు మంచు మేఘాలో....లేక గాలికి విచ్చుకు పోయే ధూళి రేణువులో మరి! ఊహాచిత్రాలను ఊరికే కలలు గంటే సరిపోదు! పేరుకుపోయిన చెత్తనంతా తట్టా...పారా నీవై మారి శుద్ధి చేయాలి! మంచి నీళ్ళతో కళ్ళాపుజల్లి అలంకరిస్తేనే సంక్రాంతి పండగలా పచ్చదనం నిండేది! నాలుగు గులాబీలను మెళ్ళో హారంగా జమచేయడం కాదు....రాజ్యమంటే! నాలుగు పచ్చతోరణాలు ఒంటికి చుట్టడమూ కాదు! ఇల్లు అడివికెక్కకుండా కాపలా కాయాల్సింది నీకు నువ్వే! పేరుకుపోయిన చాందసాన్నీ మూసుకుపోయిన ద్వారాలనూ శుద్ధి చేసే ఆయుధం "మేధస్సు" జనం గుండెల్లో నింపే ప్రయత్నం చేస్తావో లేక నీ గుమ్మినింపే గారడిలో పడతావో! ఇప్పుడు రెండు చిగురాకులూ రెండు వైపులా బిక్కు మంటూ ఉగ్గబట్టి చూస్తున్నాయి! వృక్షంలా ఎదగనిస్తారో ....లేక సర్కారు తుమ్మలా ముళ్ళలోకి తోస్తారో! కర్తవ్యం గురించి ఎంతైనా మాటాడు నీ ఎజెండాను జాతీయ జెండాలా స్వేచ్చగా ఎగిరేలా చూడు! సింగపూరో ...జపానో ప్రజలు రాజకీయ సునామీలో కొట్టుకుపోకుండా కంటినిండా నిద్దుర పోగలిగితే చాలు! 14-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qvWgT2

Posted by Katta

Madishetty Gopal కవిత

@@ entries are invited for literary award @@

by Madishetty Gopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jDnuo6

Posted by Katta

Sky Baaba కవిత

ఇంతెజార్ - - - - - అందరూ బాహ్య సౌకుమార్యాన్ని కోరుతున్నారు నేను అంతర్ కోమలాన్ని వెతుకుతున్నాను * అందరూ మల్లెల గురించి మాట్లాడుతున్నారు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను * నా ఊహలపై తారాడే సీతాకోకవు నిన్ను అందుకునే సున్నితత్వ సాధనలో ఉన్నాను * ఒక్కోసారి వెతుక్కుంటూ ఉంటాను నన్ను పంచుకుంటానికి ఊహ ఉండదు దేహముండదు * నా మనసు పడ్డ ఇష్టాలను లోక విరుద్ధమంటూ దూరం చేసి సంబరపడుతుంటారు * లోకం చుట్టిన ఒక్కో పొరా విడిచి నగ్నమయ్యాను చేపలూ సీతాకోకలూ నాతో స్నేహించాయి * నీ నిరీక్షణలో కళ్ళ కింద ముడుతలు పడుతున్నాయి నాకు నచ్చిన నువ్వు ఇంకా ఎదురుపడనే లేదు * అక్కడే నిలబడి ఎదురుచూస్తున్నాను లోకమంతా తిరిగి నేనే నయమని వస్తావని...

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLnnVt

Posted by Katta

Krishna Mani కవిత

తెలుగు కాంతి ************* తెలుగు వెలుగుల శుభోదయం ఆది కవి నన్నయ పద విన్యాసంలో సిరిమువ్వల గల గలలు రాయలవారి అష్టదిగ్గజ పద్మాల రెక్కల సౌరభాలు ఘనకీర్తికి తెలుగునాడ వెలుగు జాడలు ! వేమన సుద్దులు పోతన్న పలుకులు అన్నమయ్య కిలకిలలు గోపన్న జిలుగులు గురజాడ వాగుతో కలిసిన మరెన్నో పాయలు తెలుగున మెరిసిన కొత్త కాంతులు ! పాలకుల కుటిల నీతిలో తెలుగుకు చెదలు ఆంగ్లమున అచ్చుతో లోకంతో పరుగులు మతిచెదిరి మనలేక దాటలేక మునకలు అసలు మరచి కొసరు తోడ మిడి జ్ఞానపు గొప్పలు ! మాతృభాషే అస్తిత్వం అదే కదా ఆధారం అమ్మపలుకుల పాండిత్యం అదే కదా తోలి పాఠం ! కృష్ణ మణి I 14-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hDB9Nj

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత



by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m19o3p

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

*ఓటేయడం* ఓటేయడమంటే సీటెక్కి మాట మరచిన చిలుక పలుకుల నాయకులపై తెలివిగా వేటేయడం స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పోగేసి దేశం పొట్ట మాడ్చినోళ్ళను మెరిగెల్లా ఏరేయడం ఓటేయడమంటే నీ తలరాతను మార్చుకోవడానికి నువ్వే బంగారి అక్షరాలతో చేవ్రాలు చేయడం ఐదేళ్ళ ఒక పసిపాపలాంటి ఓటుయంత్రం బుగ్గను సుతారంగా నొక్కి ప్రజాస్వామ్యాన్ని మల్లెపువ్వులా పరిమళింప జేయడం చేసిన తన ప్రమాణాన్ని మంత్రంగా తలదాల్చి రేపటి నీ కలల ఉదయానికి భరోసానిచ్చే ఒక సూర్యుణ్ణి ఎన్నుకోవడం 03.04.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzh5Lb

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

నా శిష్యురాలు 'లావణ్య' రాసిన మరో కవిత ! ఒక ఎడారి స్వప్నం ! ----------------------- స్వప్నం ఒక ఎడారి స్వప్నం మట్టిపూల సువాసనలు లేని ఎడారి స్వప్నం మబ్బుల్లోంచి ముత్యపు చినుకులు జారిపడని ఎడారి స్వప్నం ముళ్లు, విషసర్పాలు తప్ప అమాయకపు జింకపిల్లల పరుగులు లేని ఎడారి స్వప్నం తల్లి ప్రేమ కోసం ఉరికే దూడపిల్లలు లేని ఎడారి స్వప్నం స్వప్నం ఈ స్వప్నం సమస్తం కోల్పోయింది పసిపిల్లల నవ్వులతో సహా.. అంతా ముళ్లే, విషసర్పాలే - భయం భయంగా ఉలిక్కిపడి లేచిన నేను నా తల్లి అరణ్యం ఒడిలోంచి లోకంలోకి చూస్తూ.. ... చిన్న కుందేటిపిల్లలా... ----------------- 14.04.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gsBuxd

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/కాసిని కొన్ని సార్లు ఓడిపోవలనిపిస్తుంది గెలుపు కంటే ఓటమి రుచి మరింత తీయగా తలపిస్తుంది నీరు పల్లనికి ప్రహిస్తే ఓటమి కౌగిట్లో గెలిచినట్టే గతాల మీద జ్ఞాపకాల పొరలు కొత్త పొరల్లా పరిచయమైనప్పుడు గతానికి ప్రస్తుతానికి మళ్ళా పొరపొచ్చలు నీ మనస్సు పెదాలు బిగ్గరగా పెగలనప్పుడు పదాల్లో నిన్ను వెతుక్కుంటూ కూర్చుంటావు కళ్ళలో కొన్ని లాంతర్లు వెలుగుతూ ఆరిపోతూ గెలుస్తూ ఓడుతూ అటక మీద మసిగుర్తులు పొద్దూకులా కొత్తగా ఓటములు పాతబడ్డ గెలుపులు తిలక్ బొమ్మరాజు 14.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gsBwoX

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్|| క్రతువు || =================== రుతువులెన్నిమారిన క్రతువులెన్ని చేసిన కాలగర్భంలో కలిసి పోతున్న కన్నీటి గాధ లెన్నున్నా నా చేతలన్ని ట్రిగ్గర్ చిరు సవ్వడి కోసమే! తరిమే కాలం తరలిపోతున్నా జ్ఞాపకాల నీడలు తరుముకొస్తున్నా వెంటాడే గురుతులెన్నున్నా నా పాదాల చప్పుడు నీ గుండెల మీద లయ కోసమే! అలజడి రేపిన గాయాలెన్నున్నా ఆరని ఆలోచనల కుంపటి లెన్నున్నా మారని కుల పిలుపులెన్నున్నా మలుపుల్లో మాటేసేది నీ నాలుకపై కుట్లు కోసమే! రాతలెన్ని రాసిన గీత లెన్ని గీసిన గిరిగీసిన నీ సామ్రాజ్య దోపిడీకి గుండు గీసేందు కోసమే నీ తల రాత మార్చేందుకే ! ఇదే నా క్రతువు నిత్య రణ ఋతువు =========== 14-04-2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOCXoX

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

...// చరమ సంధ్యలో ఒంటరి చంద్రుడు //... నింగీ నీరూ కలిసిన దిగ్రేఖ మీద తేలుతున్నది ఓ ఒంటరి ఓడ అలసిన సీగల్ లా . చిక్కిశల్య మైన శశిరేఖను పొడుచుకు తింటున్నది నిశి. నీలజలధి నీటి రెప్పల కింద కరుగుతున్నది అలల కల. తడి ఊర్పులను మోసుకొస్తున్నది నీరసించిన సముద్ర పవనం. విరుగుతున్న కెరటం ! చతికిల పడ్డ చంద్రుడు! సద్దుమణగుతున్న సాగర తీరం లో ఏదో నిరాసక్త నిశ్శబ్ద సంగీతం! అతనో నిర్లిప్త నీరవ గీతం!

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gs5NUO

Posted by Katta

Kapila Ramkumar కవిత

బాల సుధాకర మౌళి ||Dictator|| Posted on: Mon 14 Apr 00:06:29.629135 2014 దేన్నీ కాదనం వస్తువులను పొందిగ్గా మన అలమరాల్లో అమర్చుకుంటాం ముద్దుగా ఉందని పింగాణి చెవులపిల్లిని టేబుల్‌ మీద పెట్టుకుంటాం రబ్బరు కుక్కపిల్లని టీపారు మీద కూర్చోనిస్తాం గోడల మీద ఫెలికాన్‌ సీతాకోకలనూ టీవీల మీద ప్లాస్టిక్‌ పూలనూ ఎగరేస్తాం ముచ్చటపడతాం హొయలు పోతాం మూతి మూడు వంకర్లు చేసి తిప్పుతాం పసిలోకాలన్నింటినీ మార్కెట్‌ నుంచే దిగుమతి చేసుకుంటాం పసిహృదయాలనూ ఆటబొమ్మల్లోనే వెతుక్కుంటాం Break out మనుషులను Dictate చేస్తున్న కాలం మనుషులను వస్తువులుగా వస్తువులను మనుషులుగా ణతీaఎa్‌ఱష చేస్తున్న కాలం సింహం జూలుకాలం నాగుపాము కాలం గదుల్నిండా, అలమరాల్నిండా పేరుకుపోయి దుమ్ముపట్టిన జెర్రిగొడ్డుకాలం మనుషులపై వస్తువులు దండయాత్ర చేసే తేలుకొండెకాలం వస్తువులే సర్వస్వం మనుషులు శూన్యం - మనుషులే శూన్యం నియంతలు ఎక్కడో లేరు మన చుట్టూ మన ఆలోచనల్లోనూ సకల విస్ఫోటన సామగ్రితో సర్వబంధనాల్తో వ్యాపిస్తున్న పుట్ట పగిలిన కాలమే కాలమొక పెద్ద నియంత కాలం చేతిలో తోలుబొమ్మ ఆలోచనొక నియంత నియంతలు కూలాలి నియంతల పీఠాలూ కూలాలి నియంతల్ని తయారుచేస్తున్న పెద్దపులి కుట్రలూ కూలాలి Press the trigger 'భ్రమల్నీ, భ్రమల గోడల్నీ, కుళ్లిన మస్తిస్కాలనూ Shut down! ---------------------------- - బాలసుధాకర్‌ మౌళి 9676493680 ------------------------------ http://ift.tt/1lYQ0kO

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lYQ0kO

Posted by Katta

Buchi Reddy కవిత

4-13-14 ******దేశం లో--రాష్ట్రం లో ఎన్నికల పండుగలు---ఏధి ప్రజాసామ్యం???అన్న లూ--అక్కలూ వోటు విలువ గుర్తించండి****** దేశం లో రాష్ట్రం లో ఎన్నికల పండుగలు ప్రతి జిల్లాల్లో ప్రతి వూళ్ళో ఎన్నికల కొలాహాలం ప్ర ఛా రా ర్బా ట హాలహాలం విరజిమ్ముతుంధీ--- గోడల మీ ధ రాతలు రెపరెపలా డే రంగు రంగుల జెండాలు అన్ని వై పులా లౌడ్ స్పేకర్ల జోరు ఉపన్యాసాల జోరు వెలిసిపోయిన ని నా ధా ల తో అరిగిపోయిన భాషతో అబ ద్ధ పూ ప్రచారాల తో తేప తేప కు మాటలు మార్చుతూ-- అన్న --అక్కా -తమ్మి అంటూ వస్తున్నారు దొంగలు--పచ్చి మోసగాళ్లు వస్తున్నారు మళ్లీ కనిపించ రు కోట్లు పండించుకోడానికి లక్షలు వె ధ జ ల్లు తూఒ వస్తున్నారు---ఊశరవేల్లి నేతలు అన్న లూ--ఆ క్క లూ--జాగ్రత్త భాధ్య త మిధి తీర్పు మీ చేతి లో వీళ్ళు డబ్బుతో మధ్యం తో లేనిపోని ఆశలు కలిపిస్తూ మిమ్ముల్ని కోన గ ల రు నమ్మించ గల రు మోసగించ గల రు మళ్లీ ఆడించ గలరు-- అన్న లూ--ఆ క్క లూ వోటు హక్కు ను స ధ్వి ని యోగం చేయండి principles values idealogy vision party manifesto big picture చిత్త శుద్ది లేని--తెలియని వాళ్ళంతా నేతలు కావాలని సీ ట్ల కోసం-- గంటల్లో పార్టీ లు మారుస్తూ ప్రజా సేవ కోసం అంటూ వస్తున్నారు--ఆవ నీతి పరులు జిత్తుల మా రీ నేతలు -వస్తున్నారు అన్ని రంగుల పార్టీ ల నేతలు ప్రతిధి రాజకీయం చేస్తూ తమ ఉనికి ని కాపాడు కోవడం కోసం అధికార వ్యామోహం కోసం ధన లా ల స కోసం సొల్లు కబుర్లు చెపుతూ ఆధర్షాలు వల్ళిస్తూ ట్రిక్కులు చేస్తూ కొత్త వాగ్ధానా లు కొత్త పథకాలు కొత్త ని నా ధా లు --వినిపిస్తూ నమ్మించడం కోసం-- వోటు కోసం --వస్తున్నారు దోపిడీ దొంగలు--వస్తున్నారు-- జాగ్రత్త అన్న లూ--ఆ క్క లూ ఈ చిచ్చరా పిడుగుల్నీ ప్రశ్నించండి ని ల ధీయాండి కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానాలు కావాలి అబివృద్ది సుస్థిరత సామాజిక న్యాయం రామ మంధిర నిర్మాణం సమానత్వం బి. సీ ల కు ముఖ్య మంత్రి పధ వి సెకుయులరీ సం అంటూ లేనిపోని కబుర్లు చెపుతూ దేశం కోసం జాతి కోసం సమ సమాజం కోసం కంకణం కట్టు కున్నటూ గా నమ్మ బ లు కు తూఒ ఆధిపత్యం చేపట్టగానే మళ్లీ--- అధె ఆట కులాల మధ్య మతాల మధ్య త ౦ పు లు పెడుతూ చిచ్చులు లేపుతూ విభజించి పాలిస్తూ తమ పబ్బం గడుపు కుంటూ---- అన్న లూ---ఆ క్క లూ --జాగ్రత్త మన కు న్న మార్గం ఒక్కటే అధె సె క్యూ ల రీ సం దోపిడీలు -మోసాలు-- ఆవ నీతి లేని సాంఘిక- ఆర్థిక తార తమ్యాలు లేని ప్రజాసామ్య వాధ సమాజాన్ని నెలకోలుపుకుందాం కదలండి ప్రశ్నించండి మార్పు తెండి వోటు విలువను మ రీ చి పోకండి తీర్పు--- మీ చేతి లో గుర్తుంచుకోండి--- -------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1quiGnT

Posted by Katta

Chi Chi కవిత

_ లేదెదురు_ టి.వి. offలో పెట్టి చూస్తుంటే స్పురణకొచ్చిందింకోసారి నాకూ నాకూ మధ్యున్న అడ్డమేదో!! ఏదైనా ఆలోచన మెదలటానికి అనంత ప్రస్తుతమంతా కూర్చిన ఆంక్షలన్నీ దాటి నిద్రిస్తున్న స్వేచ్చా చలనాన్నిమేల్కొలిపే కార్యకారణ మూలం నియంత్రణ కోల్పోయుంది.. మూల నియంత్రణే చలన నియంత్రణ కన్నార్పే కార్యమైనా సరే దాని సన్నల్లోనే!! ఏ ఛానల్ కావాలని కాదు అసలు on ఎందుకు చెయ్యాలనుకున్న తక్షణమే స్థిరమైన యాదృచ్చికంలో ఆలోచన ఆగిపోయింది.. నియంత్రణను కూడా నియంత్రించే ఆ శక్తేదో ఆలోచన కాదు , మూలం కాదు , వ్యక్తిత్వం కాదు మరణం కాదు , నిరాశ కాదు , స్పృహ కాదు!! స్థిర చలనాలకు , కార్య కారణాలకు అతీతమైన భావన నామ రూప పదార్థ మౌనాలకావల లేదు ఉందక్కడ!! ఆ లేదుకి ఉన్నదేదీ అంటక ఎదురేదీ లేక లేదు లేనిదేదీ లేక లేదై ఉన్న స్థితిలో నియంత్రణ లేకనే నియంత్రించబడి టి.వి. on చేయకుండానే చూస్తుండిపోయా నాకూ నాకూ మధ్యున్న లేదే అడ్డంగా!!_____(14/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK41jF

Posted by Katta