పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మే 2014, శుక్రవారం

Vijay Kumar Svk కవిత

Title plzzzzz... :)

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rcb1xZ

Posted by Katta

Mothi Mohanaranga కవిత

....మోతి మోహనరంగా///////ఇ0దిరా పార్కు..... అక్కడొకడు టికెట్లు చి0పుతున్నాడు మీ జీవితాలు ఇలాగే చిరిగిపోతాయేనే సంకేతం ప్రేమ గురి0చి ప్రవచనాలు ,నిర్వచనాలు పలికే పక్ష పైట చాచి0ది . ప్రేమ గురి0చి శ్లోకాలు,స్తోత్రాలు పాడే పక్షి పని ప్రారంబి0చి0ది. ఒక పక్షి ఆడ ఒక పక్షి మగ అది యాడ -పార్కులో రేయ్ పొ0డిరా పొ0డి ఎవడురా మిమ్మలన్ను యూత్ అ0ది మీరు భూతు-ముసలాడు వె0టాడితే పడంది లేదు పిలైనా పల్ల తలైనా--నేత్రానందతుడు. కొద్దిసేపాగి రా ఇక్కడ చుక్కలు కనిపిస్తాయి-ఒకడు ఇక్కడ ఏనీ టైమ్ చుక్కలే వర్షమైనా ఎ0డైనా-ఇ0కొకడు వీళ్ళతో యుద్దాలు చేసినా బుద్దులు మార్చకలేరు. ఎ0దుకంటే బుద్దులు నేర్పలసిన వాళ్ళు సిగ్గ లేకు0డా పక్కన అదే పని చేస్తున్నారు కాబట్టి-ఆస్తికుడు ఏమయ్యా దేవుడు వీళ్ళంత నిన్ను మొక్కే వాళ్ళేగా ,గడ్డి పెట్టవె0దుకు-నాస్తికుడు తలది0చుకొని వాకి0గ్ చేసుకు0టున్న -తండ్రి తిరిగి వేళ్ళిపోతున్ప-తల్లి ఏమయ్యా యజమాని ఈ పార్కు మీద వచ్చే పె0ట తి0టే ఎ0త తినకపోతే ఎ0త నేను. 02-05-2014

by Mothi Mohanarangafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fBgGcl

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ప్రాణం తన గేయం నాలో ప్రాణమై జీవరాగం పాడుతూనే ఉంది నా జీవితం తన గానంలో సాగుతూనే ఉంది కానీ తన గేయం ఒక జోలపాట కావాలని నా శ్వాస ఆగిపోయి ఆ సంగీతంలో ఐక్యమైపోవాలని నా హృదయం ధ్యానం చేస్తూనే ఉంది కానీ నేనొక మనిషిని తనొక దేవత ఎప్పటికి చేరతానో మరి నేను ఆమె చెంతకి! 02May2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fB9v3O

Posted by Katta

Vijay Gajam కవిత

...మజిలీ...విజయ్...02.04.14 అగాధం లోించి పోంగుకొచ్చిన బడబాగ్ని చల్లారినట్లుగా ఉందీ మనస్సు.. సందేహం ఏమిటంటే అది చల్ల బడిందా లేక శిలలా మారిందా..? అగాధపు లోతుల్లోని నీటి ఊటతో ఇప్పటికైన దాహం తీరుతుందా..? లేక ఎండ మావే అవుతుందా .. అర్ధం లేని మాటలకు సమాదానం లేని ప్రశ్నలకు ఎం దోరుకుతుందీ... రాయాలని రాయడం లేదు...బాద తగ్గుస్తుందో పెంచుతుందో తెలియడం లేదు ఈ రాత.. కాని సంతోషం... పోంగుకోస్తున్న దుఖ్కాన్ని ఆపేంత సంతోషం.. మోహంలో మాత్రం తెలియని ఫీలింగ్స్..ఇక మనసు సంఘతి ఎందుకూ.. రోజులు గడవడం ఆగవు కధా.. డబబాగ్ని చల్లారుతుంది..శిల అవుతుంది.. ఇక్కడే అదే జరిగింది... కలలు రావడం లేదని నిద్ర ఆగదు కధా.. రైలు ప్రయాణంలో ఒక మజిలీ ముగిసింది.. మరో ప్రయాణం ప్రారంబం అయింది..

by Vijay Gajamfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lHd2h3

Posted by Katta

Kapila Ramkumar కవిత

దుఃఖ రహస్యం విప్పిన తాత్విక కవి పద్యం ఒకటి! - కోడూరి విజయకుమార్ మే 2014 పురాణ గాథ లాంటి కథ ఒకటి ప్రచారంలో వుంది. ఒకనాడు అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన సంగీత విద్వాంసుడు తాన్ సేన్ ని ‘దీపక్’ రాగాన్ని ఆలపించమని కోరాడు. తాన్ సేన్ రాగాలాపనతో ఆస్థానం లోని దీపాలు వాటంతట అవే వెలిగాయి. రాగాలాపనతో తాన్ సేన్ శరీరం అంతా ఎంతగా కాలిపోయిందంటే, అతడిని వెంటనే దాపునే వున్న నది దగ్గరకు తీసుకు వెళ్ళారు. అయినా లాభం లేకపోయింది. నది లోని నీళ్ళు వేడెక్కి పోయాయి. ఇక చావు తప్ప మరొక దారి లేదనుకున్న సమయం లో ఇద్దరు అక్కచెల్లెళ్ళు ‘మల్హర్ ‘ రాగం ఆలపించారు. ఆ అక్కచెల్లెళ్ళు ఆలపించిన మల్హర్ రాగానికి ఒక్క సారిగా వర్షం కురిసి, తాన్ సేన్ శరీరాన్ని చల్ల బరిచింది. మరి, ఒక ఎల్లలు లేని ఆకలితో, తీరని దాహంతో, ఒక తెరిపి లేని పరుగులా మారిపోయిన జీవితం కాలిపోతున్నపుడు మనిషికి కావలసిన గొప్ప ఉపశమనం ఏమిటి? బహుశా, అతడిని మళ్ళీ మనిషిని చేసే ఒక స్వచ్చమైన దుఃఖం. లోకం లోకి అడుగుపెట్టిన తొలి క్షణాలలో శక్తినంతా కూడదీసుకుని బిగ్గరగా ఏడ్చిన పసి దుఃఖం లాంటి దుఃఖం! ‘వాషింగ్టన్ ఇర్వింగ్’ అంటాడు – ‘కన్నీళ్లు చాలా పవిత్రమైనవి. అవి మనిషి బలహీనతకు కాదు, అతడి శక్తికి సంకేతాలు. కన్నీళ్లు పది వేల నాల్కల కన్నా శక్తివంతంగా మాట్లాడతాయి. కన్నీళ్లు, అంతులేని విచారాన్ని, గాఢ పశ్చాత్తాపాన్ని, అవ్యక్త ప్రేమనీ చేరవేసే దూతలు’ మరి, ఇంతటి గొప్పదైన దుఃఖం గురించి పద్యం చెప్పే కవి, ఒక తాత్వికుడు కాకుండా, కేవలం కవి మాత్రమే అయితే సరిపోతుందా ? ‘తాత్వికుడు కాని వాడు, కవి కాలేడు’ అన్న మాట వాస్తవమే గానీ, ఇలా జీవితం లోని దుఃఖం గురించీ, జీవితం లో ఉండవలసిన దుఃఖం గురించీ పద్యం చెప్పడానికి ఆ ప్రాథమిక అర్హతలని మించిన అర్హత ఏదో ఆ కవిలో వుండాలి కదా! బహుశా, పాపినేని శివశంకర్ తెలుగు సాహిత్యంలో అలాంటి అరుదైన తాత్విక కవి. ఒక్కొక్క పద్యం సాధనంగా, జీవితంలోని ఒక్కొక్క భావోద్వేగాన్నీ తడిమి చూసే ప్రయత్నం చేసిన కవి. ‘జీవితానికి పరాయివాల్లమై పోయాం నీటి మీద నూనె తెట్టెలం అయిపోయాం’ అని బాధపడిన కవి. చాలా సరళంగా కనిపిస్తూనే, గొప్ప తాత్వికతతో తొణికిసలాడే పాపినేని శివశంకర్ గారి కవిత్వం చదివినపుడు, ఒక అంశం పైన విస్తృతంగా సంభాషించే సమయంలో, ‘జిడ్డు కృష్ణమూర్తి’ కీ, ‘ఓషో’ కీ నడుమ వుండే తేడాని ఉటంకిస్తూ ఎక్కడో చదివిన ఒక వ్యాసం జ్ఞాపకం వొస్తుంది. ఆ వ్యాసంలో రచయిత అంటాడూ – ‘ఓషో గొప్ప ఉపన్యాసకుడు. ఏ అంశం గురించయినా శ్రోతలని ఉత్సాహపరుస్తూ, అనర్ఘలంగా ఉపన్యసించ గలడు. కానీ, కృష్ణమూర్తి ఉపన్యాసం ఎలాంటి తొడుగులూ లేకుండా, సరళంగా, జీవితానికి అవసరమైన అంశాలనే లోతుగా విశ్లేషిస్తూ సాగుతుంది.’ బహుశా, పాపినేని గారి కవిత్వం, కృష్ణమూర్తి స్కూల్ కి చెందినదని నా అభిప్రాయం! జీవితంలో వుండవలసిన, జీవితానికి అవసరమైన దుఃఖం గురించి ఈ ‘దుఃఖ మేఘ మల్హరి’ అన్న పద్యంలో ఆయన ఏమంటున్నారో ఒక సారి ప్రశాంతంగా చదవండి ఇక్కడ! దుఃఖ మేఘ మల్హరి అప్పుడప్పుడూ శరీరం అశ్రువైతే మంచిది ఆవేదనా దగ్ధమైతే మంచిది సుఖించడమే అందరూ నేర్పారు అన్ని పరిశోధనలూ భూమ్మీద మనిషి సుఖ పడడానికే చేశారు ఏడ్పు-దిగులు-వేదన-విషాదం- విలాపం-దుఃఖం మొదలైన మాటలన్నీ అంటరానివిగా తేల్చారు ఇల్లు, ఒళ్ళు, చదువు, ఉద్యోగం, కారు, భార్య – అన్నే సుఖం కోసమే దుక్ఖమూ ఒక సత్యమేనని అందరికీ తెలీదు గుండెలకాన విలపించడమూ తెలీదు అప్పుడప్పుడూ దుఃఖాన్ని దయగా నీ పెంపుడు కుక్క పిల్లల్లే దగ్గరికి తియ్యడం మంచిది పూడిక తీసిన బావిలో నీరూరినట్లు కంట్లో నీరూరితే మంచిది దు:ఖమంటే జ్వలన జలం – జలజ్వలనం దుఃఖించే టపుడు నీ కళ్ళ వెనకాల లీలగా ఒక కటిన పర్వతం బొట్లు బొట్లుగా కరిగిపోతుంది దు:ఖాంతాన నీ కళ్ళు నిర్మలమవుతాయి నీ లోపల పరిశుభ్రమవుతుంది నువ్వు వెలిమబ్బారిన ఆకాశమవుతావు దు:ఖించిన వాడికే జీవితం అర్థమవుతుంది దుఃఖం లేని ప్రపంచం అసంపూర్ణమవుతుంది రెండు కళ్ళు రెండు అపురూప కార్యాల కోసం వున్నాయి ఒకటి నీ దుఃఖం కోసం రెండోది పరాయి దుఃఖం కోసం ఈ పద్యానికి ‘దుఃఖ మేఘ మల్హరి’ అన్న పేరు పెట్టడంలోనే, జీవితంలో ‘దుఃఖం’ అగౌరవంగా చూడవలసిన అంశం కాదనీ, జీవితాన్ని చల్లబరిచే గొప్ప శక్తి ఏదో తనలో ఇమిడ్చుకున్న అంశమనీ అన్యాపదేశంగా చెప్పారు. ‘అప్పుడప్పుడూ శరీరం అశ్రువైతే మంచిది’ అని పద్యాన్ని ఎత్తుకోవడంలోనే, అతడు ఇక్కడ ప్రస్తావిస్తోన్న దుఃఖం అలా పొడి పొడిగా నాలుగు కన్నీటి చుక్కలు రాల్చే దుఃఖం కాదనీ, పొగిలి పొగిలి ఏడ్చే దుఃఖం అనీ అర్థం అవుతుంది. అందరూ సుఖించడమే నేర్పడం వలన, సకల పరిశోధనలూ భూమ్మీద మనిషి సుఖపడడానికే చేయడం వలన మనిషి దుఖించడం మరిచిపోయాడని వాపోతున్నాడు కవి. దు:ఖమూ ఒక సత్యమే అన్న సంగతిని చాలా మంది మరిచిపోయారని బాధపడుతున్నాడు కవి. ఇంతకీ ఈ సత్యాన్ని మరిచిపోవడం వలన జరిగిన నష్టం ఏమిటి ? మనిషి క్రమంగా లోపల కటినంగా మారిపోయాడు…. లోపల వెలి మబ్బుల ఆకాశంలా మారిపోయాడు … లోపల మకిలి ఏదో పట్టి, పరుల జీవితం మాత్రమే కాదు … తన జీవితమూ కనిపించని అంధుడై పోయాడు …. ఎందుకిలా ? జిడ్డు కృష్ణ మూర్తి అంటాడు – ‘మనలో చాలా మందిమి, ఒక స్పష్టతతో ప్రయాణం ప్రారంభించి, వయసు పెరిగే కొద్దీ అస్పష్టత వైపు అడుగులు వేసి, అంతిమంగా ఆ అస్పష్టత తోనే మరణిస్తాము’ బహుశా, అలాంటి అస్పష్టత ఏదో నిన్ను కమ్మేసినపుడు, దుఃఖం నీ గుమ్మం ముందు నుంచున్నపుడు, దానిని రెండు చేతులూ సాచి ఆహ్వానించమంటున్నాడు కవి … ‘నీ పెంపుడు కుక్కల్ని దగ్గరకు తీసినట్టు’, నీ దుఃఖాన్ని కూడా దయగా దగ్గరకు తీయమంటున్నాడు. శరీరమంతా అశ్రువుగా మారేంతలా, ఎండిపోయిన బావిలా మారిన జీవితంలో నీరు వూరేంతగా, దుఃఖాన్ని దగ్గరకు తీసుకోమంటున్నాడు. తీసుకుని నిన్ను నువ్వు శుభ్రపరచుకొమ్మని చెబుతున్నాడు … నీ లోపలి కటిన పర్వతాన్ని కరిగించమని అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే, దుఃఖించని వాడికి జీవితం అర్థం కాదని చెబుతున్నాడు కవి. అవును … ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అర్థం కానపుడు, నీ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తావు? నీకే అర్థం కాని నీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తావు ? ఇంతకీ, జీవితానికి అర్థం ఏమిటి? … నీ ‘రెండు కళ్ళు రెండు అపురూప కార్యాల కోసం వున్నాయి / ఒకటి నీ దుఃఖం కోసం / రెండోది పరాయి దుఃఖం కోసం’ ! బహుశా, ఈ రెండు దు:ఖాలూ లేని ‘ప్రపంచం అసంపూర్ణమవుతుంది’ అందుకే, ‘దేవుడి దుఃఖం’ కూడా అతడిని ఆరాధించిన మానవాళికి ఒక అపురూపమైన సంగతి అయింది ! http://ift.tt/1kBeDUq

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBeDUq

Posted by Katta

Venu Madhav కవిత

కలలు అన్ని కన్నీరు గా కరిగిపోతుంటే వాటిని అందుకునే క్రమం లో ప్రతి జ్ఞాపకం ముళ్ళు ల గుచ్చుకుంటుంది వెలుగు కి దూరం గా చీకటి తో స్నేహం చేయడం నా మనస్సు ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది ఎందుకు ఇలా అని నా మనస్సు అని అడిగితే ఒక్క నలుపు రంగు మాత్రమే నీ తోడు ఉంటానని చెప్పింది మీ వేణు

by Venu Madhavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hk2SxK

Posted by Katta

Srinivasa Rao Moida కవిత

మొయిద శ్రీనివాసరావు //సముద్రమంత . . .చెమటచుక్క// లోకం. . . వెలుగు చీరను విడిచి చీకటి పాతను చుట్టుకుంటున్న సమయం తన పిల్లలను తానే తినే ఆకలిగొన్న పాములా అలల నాల్కులతో బుసలుకొడుతుంది సముద్రం శ్రమ రెక్కలను సాగదీసుకుంటూ. . . సముద్రంపై ఒంటరి పక్షిలా అతడు తీరంపై. . . పగిలిన దాకలాంటి గుడిసెలో ఎండు రొయ్యల్లా వుండచుట్టుకు పడుకున్నారు పిల్లలు వారి కడుపాకలి కంట్లో ఇసుకై కరకరలాడుతుంటే నెత్తిన గంపెడాశతో ఒడ్డున ఒంటరి దీపస్తంబంలా అతగాడికై ఎదురుచూస్తూ. . .ఆమె నీటిపై తాబేలులా కదలాడిన పడవను అతడు తెడ్డు సాయంతో ఒడ్డుకు చేర్చేసరికి చచ్చిన ఏనుగులా చతికిలబడింది చితికిన బతుకై వెక్కిరిస్తున్న వలను విదిలిస్తే చాలీచాలని చిల్లరకాసులై రాలిపడుతున్న చేపలను చూసి వీచే గాలి సైతం విషాదగీతాన్నాలపిస్తుంది ఇంతటి సముద్రాన్ని ఈదుకొచ్చినతడు ఇంటి సముద్రాన్ని ఈదాలంటే ఒడ్డున సైతం పిడికిట్లోకి తెడ్డును తీసుకోవాల్సిందే! 2.5.14 * * *

by Srinivasa Rao Moidafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWsLKT

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

కలలకాలం =============రావెల పురుషోత్తమరావు కలకాలం గుర్తుండిపోయేది కల కాదుకదా క్షణభంగురమూ బుద్బుద ప్రాయమైనదేకదా కలంటే. నిద్రపట్టని దశలో కనేకలలకన్నా జాగృదావస్థలోని కలలే వాస్తవానికి దగ్గరగా మసలుతాయని కొందరి భావన. తెల్లవారు ఝామున వచ్చేకలలన్నీ నిజమౌతాయని కొందరి ఊహ. కలల మీద మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎన్నో వాస్తవాలు చెప్పారట. ఏదిఏమయినా కలలో అప్రాప్తమనోహరి దర్శనమిచ్చే యవ్వనం అమూల్యమైనది. యముని మహిషపు లోహ గంటల శబ్దం కలలలో వినబడనంతవరకూ కనేకలలకు ఓ పరమార్ధముందని నా ప్రతిపాదన. కలంటే వాస్తవ జీవనయానంలో కనబడని నైరూప్యచిత్రమేమోకూడా! ===========================================

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kASAgB

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి || పిల్లలు..|| జీవితాల్లోకి వస్తారు.. చూడని లోతుల్లో ఈదిస్తారు శిఖరాలు ఎక్కిస్తారు కొత్తదారుల్ని తొక్కిస్తారు నవ్వేసి మత్తెక్కిస్తారు చుట్టేసి పులకరింతలకు గురిచేస్తారు ఏడ్చి బాధ పంచేస్తారు పట్టుదల అవసరం అవగతం చేస్తారు బాధలు మరిచే మందిస్తారు మాటతప్పకుండా మనల్ని సరిచేస్తారు ఏదైనా కొనిపెట్టమని మారాం చేస్తారు మతిమరుపు జీవితాలలో ఆనందాలకు పీటవేస్తారు గూడు చేరమని కబురందిస్తారు తోవ చూపిస్తారు ఉత్సాహానికి రూపమౌతారు ఉల్లాసానికి విలాసమౌతారు అలిసి నిద్దరోయేవేళ నిశ్చింతకు నిలయమౌతారు మనమీద మనకే ప్రేమ కలిగేలా జీవితాన్నిస్తారు వారిగుప్పెట్ల్లో మన ఆనందాలుంచి ఊరిస్తారు ఎలాగోలా... ఆవలితీరానికి చేరుస్తారు =5.2.14=

by Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jnQFwn

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నీవు..: కన్నుల ఆర్ధ్రతా చూడ్కుల నింపి ప్రణయ గీతికలు పలుకు అనురాగవల్లి నీవు..! అంబరం విడచి భువికేతెంచి భవదీయుని సన్ముఖమ్ముననే సంచరించు శీతల కౌముదీ చంద్రికవు నీవు..! వెచ్చని కౌగిలి కమ్మదనమున కరిగిన సౌందర్యపు కర్పూర తరంగం నీవు..! తమకమ్మున మైమరచి మమతల మల్లెల మాలికల డోలికలలో విహరించు నవమోహిని నీవు..! నా నీడ లోని జాఢ నీవు..!! నా తోడులోని నీడ నీవు..!! 02/05/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rLYeh5

Posted by Katta

Arun Nallella కవిత

SHELLY'S Philosophy "The fountains mingle with th-5 river Ard the rivers with the ocean, The winds of heaven mix fortver With a sweet emotion; Nothing in the world is single; All things by a law divine In one spirit meet aid mingle Why not I with Thine?"

by Arun Nallellafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hjCp3w

Posted by Katta

Bharathi Katragadda కవిత

గుభాళించే ఉత్తరాల పర్వం ముగిసింది! నేను క్షేమం నీవు క్షేమంటూ పలకరించే ఆప్యాతానురాగాల ఉత్తరాల పర్వం ముగిసింది! ఈమెయిల్ వచ్చి ఉత్తరాల అనుబంధానికి రెక్కలొచ్చేలా చేసింది! పరిమళించే ప్రేమానురాగాలకి స్వస్తి పలికింది! పొడి పొడి మాటల్తో ఈమెయిల్ ఆధునిక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది! విరగ్గొట్టిన మాటల్తో విపరీతార్ధాలతో ఈ ఈమెయిల్ ఇప్పుడు మనమధ్య స్థిరమై కూర్చుంది ! ముందుతరాలవారికి ఉత్తరం అనే మాధుర్యాన్ని వివరిద్దామన్నా మచ్చుకైనా దొరకని ఉత్తరం యోగక్షేమల్లో పాపం కొట్టుకుపోయింది! మనుషుల దగ్గరితనన్ని పెంచే ఉత్తరం దూరాన్ని పెంచే ఈమెయిల్ లో కొట్టుకుపోయింది! పొరపాటున మనమిప్పుడు ఉత్తరం రాసినా ఈ ఆధునిక యుగంలో తీరిగ్గ చదివే ఓపిక కూడా కరువైంది! సెల్లులపర్వంలో ఉత్తరం మూగబోయి ఒకప్పటి చిరునామాలా యోగక్షేమాలు లేనిదైంది. మమ్మల్ని క్షమించమ్మా ఉత్తరమా!

by Bharathi Katragaddafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzvzfi

Posted by Katta

కొనకంచి లక్ష్మి నరసింహా రావు కవిత

వీలునామా అమ్మా... శరీరం మీద తెల్లవారని కాళరాత్రులని భరిస్తున్నట్లు ..మీరు గుందెల్లో అంటుకున్న చితితో బరువుగా...బాధగా.... చావు శ్వాస పీలుస్తుంటారు. మున్నూట అరవై రొజులూ పస్తులున్నాక ఒక్కరొజు ..విందు భొజనం పేరుతో సజీవంగా తద్దినం పెట్టి .... స్వాతంత్ర్యాన్ని ..నిశ్శబ్దంగా ముక్కలుగా నరికి,రక్త మాంసాల్ని ..మందులో నంజుకుంటున్న ఈ దెశం లో.. కన్నతల్లి చనుబాలు నా కందకుండానే దొపిడీ చెసి....మూతి తూడ్చుకునే ఈ క్రూరాబందుల రాజ్యం లో.. ఓటు నోటుకు పక్క వేస్తుంది. ఆనొటు మీ శీలం మీద పది దొర్లుతుంది …. అమ్మా ..నాకు తెలుసు మీరు కార్చిన కన్నీళ్ళే మూడు వైపులా ఈ ద్వీప కల్పం చుట్టూ సాగరాలై రోదిస్తున్నాయని.. ప్రజలు కార్చిన కన్నీళ్ళే ..జీవనదులై మీ అస్రు జలధిలో సంగమిస్తున్నాయని .. ఎం చెయ్యను ...చెప్పండి. .. పుట్టుకతో కర్మ సిద్ధాంతాన్ని కల్తీ సంస్కుతిని ..తిని పెరిగిన అంట్ల వెధవాఇని మాత్రు భూమి పీక మీదుగా అశోకుని ధర్మచక్రం ..నదిచి వెల్తున్నా వేదాంతం మాట్లడే ...తిరుగుబాటు తెలియని బానిసలకు పుట్టిన ...పుట్టు వారస బానిసుణ్ణి ఏమెచెయ్యకుండా అన్నీ చెస్తున్నాననే భ్రమా పూరిత ప్రభుత్వంలో.. ప్రజలని..వెంటాడి..వెంటాడి వేధించి..వేధించి.. దొంగ దెబ్బలు కొట్టే రాజ్య పాలనలో.. గుండె నిండా ..ఆసని గుర్రపు డెక్కలా పాతుకొని ... మింగ మెతుకు లేకున్నా .. సంపెంగాలొచనలతొ బ్రతుకుతూ ఇన్నాళ్ళూ నా యవ్వనాన్ని వ్రుధాగా పారబోసాను ,...... ఇప్పుడలాకాదు.. అమ్మా.. నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టును మీ అరి చెతుల్లొ గొరింట్తాకుగా ..దిద్దేందుకు .. నా తనువులోని అణువణువును.. ఒక్కొ ..మేకుగా చేసి .. ఈ దుష్ట వ్యవస్థను ..పట్ట పగలు శిలువవెసి యావత్ ప్రపంచానికి ఆదర్శంగా .. ఎవరెస్ట్ మీద ప్రతిష్టిస్తాను ... ప్రతి మనిషి గుండెల్లో అంతుకున్న అదవి గెరిల్లానై దాక్కోని తూర్పు దిక్కుకు వంతెనగా నిలుస్తాను…. . .అమ్మా..ముప్ఫై ఆరెల్ల ఈ అస్ట వక్రచరిత్రను త్రివిక్రముణ్ణై ... పాతాళానికి తొక్కెందుకు అసాంతి జీవుల తలల్లో తొలికొడై కూస్తున్న నా ఈ కలం తో ఈ భ్రష్తున్నర .. భ్రష్తు వ్యవస్థకి.. పాడె కట్టి రాస్తున్నా తుట్ట తుదకు ఈ వీలునామా ………… ………. 1983 డిసెంబర్ 5 ఆ ప్రాంతంలో ఆరొజుల్ని చూసి రాసిన ఈ కవితని.. .. ఇప్పటి రోజులకి అన్వైంచుకుంటే ఎలా వుందో మీరే చెప్పాలి అశ్రువు ............సమతా రచైతల సంఘం బహుమతి పొందిన కవితా సంపుటిలొంచి

by కొనకంచి లక్ష్మి నరసింహా రావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzvwAe

Posted by Katta

Bvv Prasad కవిత

బ్రతకాలి నువు లోకాన్ని లోపలికి తీసుకొంటున్నపుడు అది నిన్నూ లోపలికంటా తీసుకొంటుంది నిశ్చలతటంలోకి దిగినట్టు లోకంలోకి దిగుతావు కానీ నీటి అడుగున వేచివున్న మొసళ్ళని ఊహించలేవు ప్రతి గెలుపూ, పరాజయమూ జీవనానందం నుండి మరికాస్త దూరంచెయ్యటానికి వస్తాయి కీర్తి ఒక వజ్రంలా ఆకర్షిస్తుంది కాని దానిని మింగినపుడు ప్రాణం తీయటం మొదలుపెడుతుంది జీవితం ఇటువంటిదని ఎవరూ చెప్పరు జీవితం కానిది వదులుకొంటే జీవితమే మిగులుతుంది చనిపొమ్మని నిన్ను ఊపేస్తున్న భావాలన్నీ జీవితపు నీడలే కాని, జీవితం కాదు జీవితం తనని తాను చూసుకొనేందుకు నిన్ను కన్నది కానీ, నువ్వేదో చేసి తీరాలని కాదు ఏదో చెయ్యటానికే అన్నీ ఉండాలనుకొంటే ఏదీ చెయ్యని ఆకాశం ఏనాడో మరణించి వుండేది ఏమీ ఎరుగని చిరునవ్వు ఏనాడో మాయమైపోయేది జీవించడమంటే మరేం కాదు గాలిలా, నేలలా, నీటిలా ఊరికే ఉండటం ఉండటమే ఉత్సవమైనట్టు ఉండటం మిగిలిన పనులన్నీ నిద్రపోయినప్పుడు నీ పక్కలో ఒంటరివైన ఆటబొమ్మలు ______________________ ప్రచురణ: నవ్య వారపత్రిక 7.5.14 http://ift.tt/1rVyW1P

by Bvv Prasadfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rVyW1P

Posted by Katta

ShilaLolitha Poet కవితby ShilaLolitha Poetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hZrsrF

Posted by Katta

Vijay Lenka కవిత

విజయ్ లెంక || అదిరే అధరమ్మట|| అదిరే అధరమ్మట యది మరుని విరి శరమ్మట గుండెను గురి చేసి విడిచిన మోహన బాణమ్మట గాయం కాక ముందె ఓ గేయం అవుతా నీ సిగలొ పువ్వవుతా చెరగని చిరు నవ్వవుతా 02/05/14

by Vijay Lenkafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i4DATT

Posted by Katta

Rvss Srinivas కవిత

|| నీ నీడే ...నేను || నీ నీడని వదలకు వెన్నెల్లో నిన్ను గుర్తించడం కష్టం నీ నీడ చూసాకే తెలిసింది వెన్నెలనిచ్చే నీడలుంటాయని నీ నీడ నిన్నొదలదు వెన్నెల వెనుక చీకటిలా నీడని భ్రమిస్తావు నీ తోడుగా ఉన్న నన్ను వీడమని వేడకు. నీడలా నిన్ను వెన్నంటే నన్ను నాకెంత అసూయో అనుక్షణం నీ తోడుండే నీ నీడంటే నీ నీడకి సిగ్గులేదు నీవు పొమ్మన్నా నీనుండి పోలేని నా మనసులా. నీ నీడంటే నాకు ప్రేమే నాకు ప్రతిరూపంగా కనబడుతూ. పోల్చుకోలేకున్నావు. నిన్నైనా నేడైనా...నీ నీడగా ఉండేది నేనేనని ప్రతిజన్మకీ నిను వీడని చల్లని తోడు నేనేనని... ...@శ్రీ 02-05-14

by Rvss Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n93k6Q

Posted by Katta

Amma Akhil కవిత

నిప్పులాంటి నిజం #అమ్మఅఖిల్ ఇక్కడ మనుషులు మనుషులుగా కాక Machinesలాగా బ్రతుకుతున్నారు ఇక జాలి,దయ,కరుణ ఎక్కడి నుండి వస్తాయి మానవ జీవనానికి మానవత్వమనే సహజ లక్షణం ఉంటుంది బ్రతుకంతా యాంత్రికజీవనమైపోయాక మానవత్వమనే గుణం మచ్చుకైనా ఎక్కడ కనపడుతుంది యంత్రాలతో ప్రేమలో పడి ఈ మనుషులు కూడా మనసులేని మరమనుషులుగా మారుతుంటే నెత్తి నోరు కొట్టుకోవడం తప్ప చేసేదేమి లేదు కొన్ని గ్లిజరిన్ కన్నీళ్ళు కార్చడం తప్ప...! ఈ కన్నులతో ఇంకెన్నో మారణకాండలు, మరెన్నో మానభంగాలు ఇంకా కొన్ని నరహత్యలు చూడాల్సిందే... ఇలాంటి దారుణ సంఘటనల నడుమ కొందరు ఎదురుతిరిగితే అధికారబలంతో అణగద్రొక్కే వారేందరో... ఓ భరతమాత నీ కన్నీళ్ళకి కరిగే లోకులు ఏనాడో చచ్చిపోయారు నువ్వు గుండెలు పగిలేలా రోదించినా పట్టించుకునే పాపాన పోయిన నాథులు లేరు మనసారా కోరుకుంటున్న ఇకనైన నీ శోకానికి తెరపడాలని ప్లాస్టిక్ నవ్వులు కాకుండా నీ పెదాలపై నిండైన చిరునవ్వులు పూయాలని... 02may14

by Amma Akhilfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mjWb6I

Posted by Katta

Murthy Kvvs కవిత

అయితే ఎంతైనా మణిరత్నం కదా ,తనదైన శైలి లో చూపించాడు. ఒక పోలిస్ అధికారి తన కుమార్తెకి జరిగిన అమానవీయ సంఘటన ని వివరిస్తూ దానికి కారకులైన వారిని ఏమీ చేయజాలని స్థితిలో ఉన్నానని హీరో కమల్ హాసన్ కి తన అశక్తతని వివరిస్తుంటాడు.ఈ సన్నివేశం సరిగ్గా God father నవల నుంచి తీసుకున్నదే.... అయితే ఎంతైనా మణిరత్నం కదా ,తనదైన శైలి లో చూపించాడు. నవల లో Don Vito Corleone (గాడ్ ఫాదర్ పేరు) దగ్గరకి Bonasera అనే రొట్టెల వ్యాపారి వస్తాడు.ఇద్దరూ ఇటాలియన్ లే.చాలామంది సిసిలియన్ల లాగానే అమెరికా లో బ్రతుకుతెరువుకి వచ్చినవారే.Human instincts ని వివిధ పాత్రల ద్వారా గొప్ప విశ్లేషణ చేస్తాడు రచయిత Mario Puzo.వీళ్ళలో అనేక వ్యాపారాల ద్వారా వృద్ది చెంది ఆధిపత్యం చెలాయించే కుటుంబాలు ఓ అయిదు ఉంటాయి.నిజంగా ఆ నవల స్పిరిట్ ని అర్ధం చేసుకున్నవాడు దానిలోనించి ఎన్ని కధలనైనా వండవచ్చు.మన మహాభారతం లాగా. ఊ ...అయితే ఈ Bonasera అన్ని ప్రయత్నాలు చేసి Don దగ్గరకొస్తాడు.అప్పుడు అంటాడు Don," మిత్రమా ఇప్పుడు నేను జ్ఞాపకం వచ్చానా..ఘనత వహించిన నీ అమెరికన్ చట్టాన్నే ఆశ్రయించలేకపోయావా..." అంటూ mimic చేసినతర్వాత మరి నీ కుమార్తె కి జరిగిన దానికి నన్నేమి చేయాలని అనుకుంటున్నావు అంటాడు.అప్పుడు Bonasera అతని దగ్గరకి వచ్చి చెవిలో ఏదో చెబుతాడు.(ఈ వివరించే స్టిల్ God fatherసినిమాలో చాలా ఫేమస్ అయింది) సినిమా కంటే నవల నే బాగుంటుంది నా దృష్టిలోనైతే.అతను ఆ చెవిలో ఏం చెబుతాడో బయటికి ఇద్దరు చెప్పరు గాని....' అంత శిక్ష వాళ్ళకనవసరం...అయితే వాళ్ళకి జరగవలసింది జరుగుతుంది.నువ్వు వెళ్ళు.' అంటాడు. వెళ్ళేటప్పుడు Bonasera ని ఉద్దేశించి గాడ్ ఫాదర్ అంటాడు." మిత్రమా నీపై గల స్నేహ భావం చేత నేను ఈ సాయాన్ని చేస్తాను.అయితే దీన్ని నువ్వు గుర్తు పెట్టుకో..నేను ఎప్పుడైనా ఏదైనా సాయమడిగితే చేయీ..ఆ రకంగా నీ రుణం తీర్చుకో". యూరోపియన్ లకి,మనకి ఉన్ననీతి లేదా ధర్మశాస్త్రాలలోని తేడా ఇక్కడే కనిపిస్తుంది.ఒక వ్యాపార సంబందమా స్నేహం అనేది...అని మనకనిపిస్దుంది. దాన్ని మించిన ఓ concept ని ప్రవేశపెడతాడు రచయిత.ప్రపంచమే ఇచ్చిపుచ్చుకోవడం లో ఉంది.ఆ loyalty ని నిలబెట్టుకుంటేనే వ్యవహారాల్లో అరమరిక ఉండదు అనేది వారి నీతి. Don't quarrel with people.First, reason with people గాడ్ ఫాదర్ యొక్క ముఖ్యమైన underline message లో అది ఒకటి.Don జడ్జిమెంట్ కొన్ని సన్నివేశాల్లో అతడి స్థిత ప్రజ్ఞతని తెలుపుతాయి.నీ వ్యక్తిగత రాగద్వేషాలను వ్యాపారం లో చూపించకు.అది వేరు.ఇది వేరు అని కుమారుడు Sonny Corleone కి వివరించే తీరు హృద్యంగా ఉంటుంది. అనేక వైరుధ్యాలు నిండిన ఈ ప్రపంచంలో Don ఒక సంపూర్ణ మానవుడా అనిపిస్తుంది నవలంతా చదివిన తరవాత. అతని కుమారుల పట్ల,కుమార్తె పట్ల,ఇంకా భార్య పట్ల ప్రవర్తించే విధానమంతా కేథలిక్ విశ్వాసాల భూమిక గానే ఉండి మనం కూడా అతనితో అనేక సన్నివేశాల్లో మమేకమవుతాము. Family మొత్తం కలిసి ఉండడం లోని బలం నిరుపమానమైనద్ని అతని నమ్మకం. దానిలో తన కుటుంబ సభ్యులే కాదు.అతని మితృలు కూడా ఉంటారు.("Friendship is everything.Friendship is more than talent.It is more than the Government.It is almost the equal of family" ఈ ఒక్క మాట చాలదూ ) తెల్లవాళ్ళ లోకం లో loyalty కి ఎందుకు అంత విలువ ...? ఎంతైనా నాకైతే అనిపిస్తుంది ముందు కళ్ళు తెరిచి ప్రపంచదేశాల మీద పడినవాళ్ళు కదా...అనుభావాల భావ ప్రపంచం వాళ్ళది చాలా విశాలమైనది.ఆవేశం ని అదుపులో ఉంచుకొని ఏమి జరగనట్టుగా ఉండడం ...ఊహించని కోణాల్లో దెబ్బతీయడం ....జంతువు లా విరుచుకుపడడం....మళ్ళీ చాలా సున్నితమైన ప్రేమ గుణాన్ని అర్ధం చేసుకోవడం...ఒకరికొకరు గొప్ప సమన్వయం తో సహకరించుకోవడం ఇలాంటి విరుద్ధ భావాలు వారిలో పుష్కలం.అమెరికా లో ఉన్న ఇటాలియన్ లయినా,ఇంకా ఇతర తెల్లవాళ్ళయినా వాళ కుదుర్లు ఎక్కడున్నాయో వారికి తెలుసు. సరే....ఎప్పుడైనా ఇంకా కొన్ని సన్నివేశాలగురించి ముచ్చటించుకుందాం. ------K V V S Murthy

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n93mf1

Posted by Katta

Krishna Mani కవిత

దుమ్ము ******** గాలి కెరటాలపై నాట్యమాడు వయ్యారిని నీటి జల్లు తగిలితే జారిపడు సింగారిని దూదిపింజ లాగ తేలిపోదు గగనానికి కిటికీ సందు చాలు ఇల్లంతా పరుచుకుంటా రోడ్డు ఎక్కి చూడు ఒళ్ళంతా అంటుకుంటా తెల్లారగా తెలుస్తుంది కళ్ళ ఊసులై కనిపిస్తా తేమ ఉన్న చోట అడుగు చేరి కూర్చుంటా ఎండ ఉన్న చోట బొబ్బిలినై నిలబడతా ! నాలో కలిసెను మంచివీ చెడ్డవి పాలు నీళ్ళలా వేరు చెయ్యగలవా హంసలాగ ? చేసిన చెడుని మింగక తప్పదు విషంలాగ ! గాలితో సహవాసం అదే కదా నా గమనం ! కృష్ణ మణి ! 02-05-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R5WUKE

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

నండూరి వారి జయంతి సభ వివరాలు : సాక్షి & నమస్తే తెలంగాణ :

by DrAcharya Phaneendrafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SfEzf9

Posted by Katta

Abd Wahed కవిత

ఈ రోజు ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ సంకలనంలోని 16వ గజల్ చూద్దాం నాలా దిల్ మేం, షబ్ అందాజె అసర్, నాయాబ్ థా థా సపందె బజ్మె వస్లె గైర్, గో బేతాబ్ థా గుండె మంట ప్రభావం చీకటిలో కనబడలేదు నల్ల గింజ కూడా ప్రత్యర్థిని ఆపలేదు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. నాలా అంటే ఆర్తనాదం, ఘోష. నాలాయే దిల్ అంటే గుండె ఘోష లేదా గుండె మంట, విషాదం వల్ల వచ్చిన గుండె బాధ. అందాజె అసర్ అంటే ప్రభావం గురించిన అంచనా అంటే ప్రభావం ఎంత ఉందో చెప్పడం. నాయాబ్ అంటే అలభ్యం, ఇక్కడ అర్ధం ఆ ప్రభావం కనబడలేదని. సపంద్ అనేది ఒక నల్లగింజ, చెడుచూపు ప్రభావం నుంచి, దిష్టి తగులకుండా ఉండడానికి దీన్ని కాల్చుతారు. అదృష్టం కోసం వెంట ఉంచుకుంటారు. బజ్మ్ అంటే సమావేశం, వసల్ అంటే కలయిక, గైర్ అంటే పరులు, లేదా ప్రత్యర్థి. బేతాబ్ అంటే అసహనంగా ఉండడం. ఇది నిజానికి వ్యంగ్య కవిత. కాని గాలిబ్ దీన్ని చాలా సీరియస్ గా చెప్పాడు. ఈ కవితలో కూడా ఒక దృశ్యాన్ని చిత్రీకరించాడు. కవితలో పంక్తులు సూచించే ఆ దృశ్యం ప్రేమలో ఒక త్రీకోణాన్ని చూపిస్తోంది. గాలిబ్ ప్రేయసి అతనితో లేదు, మరో ప్రత్యర్థి ఉన్నాడన్న సూచన ఇందులో ఉంది. ప్రేయసి తన పట్ల ఆసక్తి చూపకుండా ప్రత్యర్థి పట్ల ఆసక్తి చూపిస్తే సహజంగానే గాలిబ్ గుండెల్లో మంటలు మండి ఉంటాయి. గుండెబాధతో ఘోషించి ఉంటుంది. గుండెలు పిండేసే బాధతో ఎవరైనా చేసిన ఆర్తనాదాలు ఆకాశంలోని దేవుని వద్దకు చేరుతాయని, దేవుని కారుణ్యం కురిసేలా చేస్తాయని అంటారు. దీన్నే గాలిబ్ తన కవితలో వాడుకున్నాడు. కవితలో ఇచ్చిన భావం ఏమంటే, గాలిబ్ గుండె మంటతో ఒక రాత్రి తీవ్రమైన బాధలో గడిపాడు. కాని హృదయాన్ని పిండేసే ఆ ఆర్తనాదాలు, గుండెమంటల ప్రభావం (అంటే అవి ఆకాశాన్ని చేరిన సూచన) ఆయనకు కనబడలేదంట. దానికి కారణం తన గుండెమంట తనకు ప్రతికూలమై ఉండొచ్చంటున్నాడు. ఆయన వద్ద ఉన్న సపంద్ (అదృష్టాన్నిచ్చే నల్లగింజ)ను ఆ గుండెమంట కాల్చేసింది. సపంద్ ను కాల్చితే అది చెడు చూపు నుంచి కాపాడుతుంది. దిష్టి తగులకుండా చేస్తుంది. తన ప్రత్యర్ధి పట్ల అసూయతో ఉన్న గాలిబ్ దిష్టి ఆ ప్రత్యర్ధికి తగులకుండా కాలిపోతున్న సపంద్ కాపాడింది. ఫలితంగా గాలిబ్ గుండెఘోషల ప్రభావం పడకుండా ప్రత్యర్థి సురక్షితంగా ఉన్నాడు. ప్రేయసితో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ గాలిబ్ ఒంటరిగా అలమటించక తప్పలేదు. అంటే గాలిబ్ గుండెఘోషే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. ప్రత్యర్ధిని కాపాడింది. నిజానికి ఇది వ్యంగ్యకవిత. ఆర్తనాదాలు, గుండెమంటలు, హృదయఘోషలను గాలిబ్ ఈ కవితలో పరిహసించాడు. ఎంతగా దుఃఖించినా, ఎంత విలపించినా, ఆ వేదనలు, రోదనలు దేవుడు విని కాపాడ్డం ఏమో కాని వాటి వల్ల కనీసం తన వద్ద ఉన్న సపంద్ వంటి అదృష్ట గింజ కూడా ప్రతికూలంగా పనిచేసిందంటున్నాడు. రోదనలు నిజానికి దేవుడికి చేరి ఆయనకు కావలసిన సహాయాన్ని దొరికేలా చేయాలి, కాని రోదనల మంటకు సపంద్ కాలిపోవడంతో, ఆయనలో ఉన్న ఈర్ష్యాసూయల నుంచి ప్రత్యర్థికి రక్షణ లభించింది. అంటే, రోదనలు అవివేకంగా పనిచేశాయి. ఇక్కడ ఈయన రోదిస్తున్నాడు, అక్కడ ప్రత్యర్థి హాయిగా ఉన్నాడు. ఈ కవితలో ఒక గొప్ప పాఠం కూడా ఉంది. ఈర్ష్యాసూయలతో రోదించినా దాని ఫలితం ఉండదని చెప్పడం. దేవుని కారుణ్యం అన్నది ఇలాంటి అసూయపరులకు లభించదని చెప్పడం ఈ కవితలో చూడవచ్చు. ఈ మాటలు చెప్పడానికి ఆయన ఎన్నుకున్న కవితావస్తువు త్రికోణ ప్రేమ. వ్యంగ్యంగా తన రోదనలే తన కొంపముంచాయని అన్నాడు. ఇది ఈ వారం గాలిబానా. కేవలం ఒకే ఒక్క కవిత పోస్టు చేస్తున్నందుకు మన్నించాలని కోరుతూ... వచ్చేవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్ళీ కలుసుకుందా.. అంతవరకు సెలవు, అస్సలాము అలైకుమ్.

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R8cUM3

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి |శాపగ్రస్తులు | జాతులన్నిటి ప్రపంచాధిపత్య దాహంకి రాజుకుంటున్న అడవి నిప్పుల్లా బాంబుల శబ్దాలలో కలిసిపోయి వినిపించని అస్పష్టమైన పసి ఏడుపులు సమతుల్యం లేని జీవితాలని సరిదిద్దలేని అశాంతి సానుభుతిలేని క్రూరత్వాలుగా మారి అపనమ్మకపు ఆత్మలు రాతిగుండెలై చేసే అప్రతిహత యుద్ధాలు బెదిరింపులు భీభత్సాల మధ్య భయం టాక్సిన్ ని నెమ్మదిగా మనసుల్లో ఇంజెక్ట్ చేస్తూ నమ్మిన ధర్మం పేర అధర్మ పరాక్రమాల అవిటి అక్రమాలు చివరకు మిగిలిన తెగిపడ్డ శరీరాలు , చేజారిన ప్రాణాలు మర్చిపోయిన నవ్వులు కసి కళ్ళ నుండి జారే అసహ్యపు ధారలు చెరగని మచ్చల భీతి మొహాల యుద్ధ బానిసలుగా టెర్రరిజం కి యాంటీ టెర్రరిజం కి మధ్య నలిగి జీవించటం మరిచిపోయిన మరిన్ని నీడలు Dear terrorist can u return my life ? can u at least bring back my smile ? if not , who gave u the right to tear my soul apart ? నిశీ !! 01/05/14 * RIP Swati victim of the twin bomb blasts in Chennai

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNealC

Posted by Katta