పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఆగస్టు 2012, గురువారం

కవితా గానం వీడియో లు తీసి youtube లో ఇవ్వండి - Bhavani Phani


కవితా గానం వీడియో లు తీసి youtube లో upload చేసి లింక్ ఇచ్చి ఉంటే బాగుండేది
 ·  ·  · 4 hours ago
  • Naveen Rjy సాధనాసంపత్తులు అంతకుమించి మానవవనరులను చేకూర్చుకోవడం సమన్వయంగా సంఘటితపరచుకోవడం చిన్న విషయం కాదు....
   4 hours ago ·  · 1
  • Bhavani Phani చూడాలన్న కోరికా, చూడలేక పోయామన్న బాధ అంతే
   4 hours ago ·  · 1
  • Bvv Prasad Bhavani Phani అన్నీ వస్తాయనుకొంటా, కొంత సమయం పడుతుంది..
   4 hours ago ·  · 4

కవిత్వంతో ఒక నిండైన కుటుంబాన్ని పొందాను - Kiran Gali


ఇన్నాళ్ళూ ....కవిత్వం రాసి, ఏం సాధించాను ఏం సాధించగలను అన్న ప్రశ్న పదే పదే వేదించేది. కాని ఈ రోజు రాలిపొయాయనుకున్న అక్షారాలన్నీ అప్యాయతలై తిరిగొచ్చి నన్ను అల్లుకున్నప్పుడు కవిత్వంతో ఒక నిండైన కుటుంబాన్ని పొందాననే ఒక అనిర్వచనమైన అనిభూతికి లోనయ్యాను

నా జీవితంలో ఒక మరిచిపోలేని రోజు. - కాశి రాజు


నిన్న నా జీవితంలో ఒక మరిచిపోలేని రోజు.... ఎంతో మంది మిత్రులను కలిశాను.... ఎన్నో అనుభవాలు మాటలు మూటకట్టుకున్నాను.... చాలా ఆనందంగా గడిపాను !. ఇవన్నీ పంచి ఇచ్చిన కవి సంగమానికి ఎంత ఋణపడి ఉన్నానో ! ..................ఇంకొంతమంది కవిమిత్రులను కలవలేకపోయాము అన్న బాధ కూడా కలిగింది .......................ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారిని మిస్సయ్యాము .....................
ఐ లవ్ కవి సంగమం

మార్పు డెస్క్ టాప్ కు అతుక్కుపోతే రాదు - Gurram Seeta Ramuluనిన్న ఇఫ్లూ లో కవిసంగమం పేరుతొ దాదాపు ఒక వంద మంది ప్రముఖ, అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న పిల్ల కవులు ఒక దగ్గరకు చేరారు, ఈ చేర్చడం వెనుక దీని వేదిక మా ఇఫ్లూ చరిత్ర కూడా చెప్పాలి .ఇక్కడ ఇంటర్ నుండి PhD చదివే వాళ్ళు ఉంటారు వాళ్ళే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 50 కి పైగా వివిధ దేశాల సాహితీ సంస్కృతుల ,కలబోసిన ఒక గొప్ప విశ్వ సంస్కృతుల కూడలి అది . నేను 4 ఏళ్ళ కింద అక్కడ పరిశోదకుడి గా చేరా నాకు తెలి
సి అక్కడ తెలుగు వాళ్ళు ఊడ్చే , తూడ్చే వాళ్ళు మాత్రమే తెలుగు ఉనికా !!అస్తిత్వమా!! అంటే అదేంటి తెలుగా ?? అన్నట్లు చూసే అదో వింత లోకం .ఆ వింత లోకం లో నిన్న అంత మంది తెలుగు కవులు తమ కళల కలబోత చేసుకున్నారు. ఇది శాస్త్ర సాంకేతికం తెచ్చిన ఒక మంచో చెడో చెప్పడం మాత్రం కష్టం కానీ, విభిన్న మనస్తత్వాలు ఒక దగ్గరకు చేరడం మాత్రం జరిగింది . ఇక్కడ కవిత్వం లోకానికి ఏం మంచి చేసుద్ది చెడు చేసుద్ది అని చేర్చించడం కంటే రాయాలి అనే తపన , అమాయకత్వం ముఖ్యంగా 20 నుండి 30 ఏళ్ళ వాళ్ళు బయటికి రావడం మంచి పరిణామం , మా ఇఫ్లూ లో ఇలాంటివి నేను వచ్చాక ఒక 40 సమావేశాలు ఏర్పాటు చేశా ఎన్నో సంస్మరణ , సాహిత్య , పుస్తక ఆవిష్కరణలు ఏర్పాటు చేసాం . కాకుంటే నిన్నటి మీటింగ్ నాకు హ్యాపీ గా అని పించింది యెంత అద్భుతంగా రాస్తున్నారు వీళ్ళు . నాకు వ్యక్తి గతంగా ఈ కవులన్న, రాసేవాళ్ళు అన్నా ఇష్టం ఉండదు. కారణం నేను నమ్మే ప్రాక్టికల్ జీవితం. ఇలా కవిత్వ ఊహల్లో తేలే వాళ్ళ వల్ల ఏం జరుగుద్ది అనుకోవడము. ఇది నా వగాహన లోపం కావచ్చు , కాకుంటే నిన్న వచ్చిన వాళ్ళలో ఒక పది మంది అయినా సమాజ హితం కోరే వాల్లుగా అసమ, విలోమ విలువలు తిరగ రాసే వాళ్ళుగా తయారవుతారు అనే చిన్న ఆశ నాకు . వాస్తవానికి ఇఫ్లూలో గాలి పీల్చుకొనే తీరిక కూడా ఉండదు PhD వాళ్లు కూడా ఒకటో తరగతి లాగా క్లాసు కి వెళ్తారు, చదవు లో బాగా రాణిస్తారు , జాతీయ అంతర్ జాతీయ వ్యాప్త ఆలోచనలు కలబోసుకొని ఉంటారు. కాకుంటే ప్రేమ రాహిత్యం మానవతా విలువలు సూన్యం మీ లాంటి కవుల వల్ల అయినా ఇక్కడ వాతావరణ ఏమయినా మారుద్దేమో అనే భావన నాది.

ఇక పొతే నిన్న ఎవరో చదివిన వాక్యం ఇది " రాయలేక పోతున్న కలం -
ఆలోచనల్లో అక్కడే ఆగిపోయిన నా హృదయం - ఒక్కసారి నన్ను నీలో చూపిస్తూ , నా మనసుకు ఆలోచనలకు అయిన అంగవైకల్యాన్ని ఎత్తి చూపిస్తూ......... "

నిజమే రాయాలనుకున్నది రాయలేక పోవడం ఒక అంగ వైకల్యమే , తల్లి కడుపు లోంచి వచ్చిన పసివాడి లో మలిన రాహిత్యం కవికి ఉండాలి , అలా ఉన్నప్పుడే కల్మషం లేని భావన బయటికి రావొచ్చు ఒక ప్రేమ భావన నిన్ను మంచి బావుకున్ని చేసుద్ది అలా ప్రేమించే పసి మనసు ఉండాలి .అలాంటి పసి మనుసులు నిన్న నేను ఎన్నో చూసా . వీటన్నిటి వెనుక యాకూబ్ అన్న తపన ఉంది ఆ తపన ఒక ఎదిగే మొక్కకు కంచ , వేసి పాదుపోసే చేయి లాగా ఉండాలి , ఒకటి నిజం నేటి జీవితం అత్యంత సంక్లిష్ట మయినది దానికి ఒక చిన్న నాలుగు లైన్లు సాంత్వన ఇవ్వవు ఒక కవి అన్నాడు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు మేత నిజమే మనం పీపాలు పీపాలు సిరా వొలక బోస్తున్నాం నిత్యం ఎంత హింస చూస్తున్నాం !! మరి ఏది మార్పు , ఆ మార్పు నాలా డెస్క్ టాప్ కు అతుక్కుపోతే రాదు అనే స్పృహ ఉంది. అది మన కవిసంగమానికి కూడా ఉండాలని అలా ఉండే క్రమాన్ని "కవిసంగమం" వేగవంతం చేయాలనీ ..  • Mercy Margaret జై హో కవి సంగమం .. జై హో యాకూబ్ సర్ :) u wrote well Gurram Seeta Ramulu sir ..:)


  • Yagnapal Raju కవిసంగమం.... ఒక అక్షరోద్యమం.... అందరి కలయిక అద్భుతం.... కొత్తదనపు కవితల ఉషోదయం.... మన జయం నిశ్చయం....


  • Jagathi Dhaathri శుభం భూయాత్ !!!


  • Bvv Prasad ‎'..కాకుంటే ప్రేమ రాహిత్యం మానవతా విలువలు సూన్యం మీ లాంటి కవుల వల్ల అయినా ఇక్కడ వాతావరణ ఏమయినా మారుద్దేమో అనే భావన నాది.. ' అక్కడే కాదు, ఎక్కడైనా కవులనుండీ, కవిత్వాల నుండీ నేను ఆశించేది కూడా అదే, సీతారాములు గారూ..


  • Jilukara Srinivas your report is good. we expect more from new generation. but lets dont put weight on their heads..

కొత్త కిక్కు - John Hyde Kanumuri

ఓ పదిహేను ఏళ్ళక్రితం నాకున్న మద్యపాన వ్యసనాన్ని మానడానికి చేసిన ప్రత్నాలలో సాహిత్యం ఒక ఆలంబన అయ్యింది. అందులోనూ కవిత్వం ఒక ఒడ్డుకు చేర్చింది.

సంవత్సరంన్నర క్రితం నాగుండెకు బైపాస్ ఆపరేషన్ అయ్యి, సమయాన్ని, దేహానికి మధ్య సంఘర్షణ పడుతున్నప్పుడు పేసుబుక్కు పరిచయం అయ్యింది. కొత్త కొత్త మిత్రులు కవిత్వం మధ్య ఎంత త్వరగా కోలుకున్నానో, డాక్టర్లకే ఆశ్యార్యాన్ని కలిగించింది.

ఈ మధ్య మళ్ళీ దేహం సహరించకపోవడంతో మళ్ళీ ఆసుపత్రి పాలై కవిసంఘమంలో జరిగే పనులలో నేనేమీ చేయలేకపోయాను. కొంచెం అసంతృప్తి.


ముందుబెంచీలో మధ్య కూర్చోవడంవల్ల ఇటూ అటూ కదలలేక కొందరిని కలవలేకపోయాను.

మనసు వుత్సాహమూ దేహం సహకరించనితనమూ మధ్య సంఘర్షణ జరిగినా ఓపిగ్గానే చాలా సమయం వెచ్చించాను అనే చెప్పాలి.

కిక్కిరిసిన హాలుమధ్య
స్పందనలకు హోరెత్తిన చప్పట్లు
కొత్త కిక్కునివ్వకుండాఎలావుంటుంది

నే బయటకు వెళుతున్నప్పుడు
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాను
నా వెంటొస్తున్న స్వరాల చప్పుళ్ళు నే ఒంటరినిగా లేనని పదేపదే గుర్తు చేసాయి

నే చేస్తున్న వానసంకలనం గురించి రెండు ముక్కలు చెబుదామనుకున్నా
చాలా ఆలస్యంగా దొరికిన నా తరుణం కొన్ని వాక్యాలను మింగేసింది

కొందరిని నేను పలకరించడం సంతోషం
కొందరు నన్ను పలకరించలేదనేది అసంతృప్తి

కొత్తదారి : సిరాచుక్కలు ఒలకకనే కాగితాలు వాడకనే కవిత్వాన్ని నిర్మించే ఆధునిక దారి - శ్రీనివాస్.కట్లా

కొన్నిసంఘటనలు ఒరుసుకుంటూ పక్కగా చల్లన్ని పరిమళం నింపుకుంటూ వెళ్లిపోతే. అప్పటికేం తెలియదు కొంత సమయం గడిచాక తెలుస్తుంది. ఎంత గొప్ప అనుభూతి మళ్లీ మరోసారి దగ్గరకు వస్తే బావుండునని. నిన్నటి సమయం కవిసంగమంలో వున్నపుడు మంచి కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిసింది అంతే ఈ రోజు ఫోటో లనూ, జ్క్షాపకాలనూ నెమరేసుకుంటుంటే అనిపిస్తో
ంది. ఇంకోసారి ఇంత ఆనందంగా కలిస్తే మరెంత బావుంటుందో కదా అని.

చారిత్రక సంఘటనలు కూడా చాలా నిశ్శబ్దంగా మనమద్యనుంచే ఏమీ ఎరగనట్లు నడిచెళ్ళి పోతాయి. ఈ మైలురాయి దగ్గరనుండి కొలతలు మొదలెట్టాల్సిన రోజున ప్రపంచం ప్రతిసారీ నెమరేసుకుని ఆశ్యర్యపోతూనే వుంటుంది. కొత్త మలుపులు తిరిగిన చోటుని, కొత్త కొలతలు మొదలెట్టిన చోటునీ పదే పదే పలవరిస్తూనే వుంటుంది.

అవును నిజమే తెలుగు కవిత్వానికి సాంకేతిక సొబగులు అద్దేందుకు చేస్తున్న ప్రయత్నం, ఖాళీ కాలక్షేపాలనుంచీ, ఉబుసుపోని ముచ్చట్లనుంచీ సామాజిక అంతర్జాలానికి కొత్తదారులు చూపించిన ప్రయత్నం. సాహితీ జిజ్క్షాసకు ఆన్ లైన్ అందుబాటుతో అందలం ఎక్కించిన రోజు . మనుషుల మద్యతగ్గిన దూరంతో కవులకు సహ్రుదయ పాఠకులను,సూచనలనూ ఎలా అందించాలో, పాఠకులకు చక్కటి కవిత్వాన్ని ఎలా చేర్చాలో నేర్పించిన రోజు.

ఇది కేవలం గదిలో కూర్చున్న 150 మంది పండుగ కాదు. నెట్ ముందు ఉత్కంఠతతో కూర్చున్న మిత్రులందరితో కలుపుకున్న ఎంతో విస్త్రుతమైన పండుగ.

రోజువారీ కర్యక్రమాల హడావిడిలో ఉద్యోగ, వ్యాపకాల ఒత్తిడిలో కంప్యూటర్ దొరికితే ఏదో కొంచేపు ఆటలాడుకుందా వరకే ఆలోచించే దశనుంచి బయటకు తెచ్చి, పరస్పర ఉపయోగకర వ్యాపకంగా మర్చవచ్చన్నదానికి ఉదాహరణ కవిసంగమం.

ప్రింటులో మన కవితలు వచ్చేనా, వచ్చెను పో
కవిత్వభిమానులు వాటిని చదివేనా ? చదివెను ఫో
మన కవిత్వానికి కూడా స్పందిచేనా ? స్పందిచెనే ఫో.
మరళా వారి స్పందన మనతో పంచుకునేంత ఆలోచన వచ్చేనా ? వచ్చెనే ఫో
వారి సమయం అందుకు అనుమతించేనా ? అనుమతించెనే పో
............ ఫో...ఫో...ఫో

ఇలా ఫోయీ ఫోయీ ఇక పోలేక కవిత్వాన్ని డైరీలకూ, నోటుబుక్కులకూ అంకితం చేసి రోజువారీ జీవిత చక్రంలో గిరగిరా తిరుగుతున్న సగటు జీవితాలకు ఆశారేఖలా వచ్చింది. కవిసంగమం.

చటుక్కున మెరిసే ఆలోచనను, ఓ క్రమంలో కీబోర్డుతోనో లేదా వెంటాడే అలవాటు ఉండటంవల్ల మళ్లీ కొంచె కాగితం పై గిలకరించటం. అటుపిమ్మట మీటల మాటలతో పేర్చుకుంటూ పోవటం. ఆపై
ముఖపుస్తకపు గోడమీద పోస్టరులా ఒక్క క్లిక్కుతో అంటించటం.
మరుక్షణమే ఆన్ లైన్ లోని అంతర్జాల మిత్రులకు ప్రత్యక్ష పరచటం.
మరి ఇంకొంచెం సమయం గడిచే లోగా కొందరు లైకులతో ఆశ్యర్యపోవటం.
మరికొందరి గోకుళ్ళు (పోక్), ఇంకొందరి నిర్మాణాత్మక సలహలతో మరో కవితకు వేసుకోవాలసిన మెట్లను ఊహించడం.
ఎంత బావుంటుంది .. మన ఒకానొక మానసిక స్థితి ఆవిరయ్యే లోగానే
ప్రపంచం మూలమూలల నుండీ స్పండనలను వినే అవకాశం రావటం.

సాంకేతిక ప్రగతి చురకత్తి లాంటిదే. పదును చూసి భయపడాల్సిన పనిలేదు.
నైపుణ్యంతో ఉపయోగిస్తే శస్త్ర చికిత్సలే చేయోచ్చు.


·
  • Jayashree Naidu ‎*చారిత్రక సంఘటనలు కూడా చాలా నిశ్శబ్దంగా మనమద్యనుంచే ఏమీ ఎరగనట్లు నడిచెళ్ళి పోతాయి. Yesterdays's memories are still fresh in mind and feels like coming alive with so much of poetry in the air. Breathing it still Katta Srinivas garu..


  • Jayashree Naidu As tomorrow is the term exam for my students today I am not able to attend Subodh ji's meet the poet program.. really disappointing :(


  • Balu Vakadani Ilane life sagipote enta bavuntudooo...

   Manasu udrekamto, vollu gagurulu podustundi ilachaduvutunte
   Manam anta oka kutumbamb ane bhavana kalugutundi....

   Nalanti Alpasantoshi ki ayte ee jevitaniki idhi chalada..! intakante em kavali anipistundi koni kshanalu.......


  • Katta Srinivas Jayashree Naidu మేడం పరీక్షల హడావిడి తప్పదుకదా.. లేకుంటే మీ అభిప్రాయాలను కూడా వినే వాళ్లం
   11 hours ago ·  · 1
  • Katta Srinivas Balu Vakadani అవును మీరన్నది నిజమే అందరి సహకారంతో ఇంకా మంచిగా వేదికను అభివ్రుద్ది చేద్దాం
   11 hours ago ·  · 1  • Ramesh Hazari kattaa gaaru...really your contribution for kavisangama..is really great...

  • Kiran Gali ‎" చారిత్రక సంఘటనలు కూడా చాలా నిశ్శబ్దంగా మనమద్యనుంచే ఏమీ ఎరగనట్లు నడిచెళ్ళి పోతాయి. ఈ మైలురాయి దగ్గరనుండి కొలతలు మొదలెట్టాల్సిన రోజున ప్రపంచం ప్రతిసారీ నెమరేసుకుని ఆశ్యర్యపోతూనే వుంటుంది. " I too strongly believe in what Katta bro has said. Many may not realize it or fathom it today, but will agree down the line that this is a giant leap in Telugu Kavitvam and Telugu Saahityam


  • Subbarayudu G Kameswara 
   I'm inclined to agree. This is a crucial moment. If all the writers continue to write with vigour and purpose, this may yet be a watershed moment in New Telugu poetry. I heard diferent kinds of voices with one common denominator: no one is
    afraid to speak in his /her own voice. There is no imitation/mimicry. There is no apology. There is no inferiority complex. There is only appreciation for whatever is better than ones own... and there is belief that poetry can play a crucial role in our lives. GREAT! All hail Kavi Sangamam!!--Subbu
   8 hours ago ·  · 1
  • Vijayakumar Koduri well said....!


  • Srinivas Vasudev ‎"సాంకేతిక ప్రగతి చురకత్తి లాంటిదే. పదును చూసి భయపడాల్సిన పనిలేదు.
   నైపుణ్యంతో ఉపయోగిస్తే శస్త్ర చికిత్సలే చేయోచ్చు." మీమాటల్లో ఓ విషయం స్పష్టం--"ఎంత కష్టపది పనిచేసిన చివరికి ఆ పని ఇంతటి సంతృప్తినిచ్చాక కష్తం ఓడిపోయి వెనక్కు మళ్ళాల్సిందే చరిత్రలో ఆ కష్టానికి స్థానం లేదు..." మీ కళ్ళద్వారా చూసి మీ మనసు ద్వారా ఆ ఆనందాన్ని అనుభూతుస్తున్నా కట్టాగారు.అభినందనలు. కార్యక్రమం ఇంత విజయవంత అవ్వటంలో మీ పాత్ర కూడా అమోఘం
కవి సంగమం: తెలుగు ప్రయోగం - telugu.oneindia.in


కవి సంగమం పేర బుధవారంనాడు హైదరాబాదులోని సిఫెల్‌లో కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రముఖ కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బి. నర్సింగ రావు, ప్రముఖ కవి కె. శివారెడ్డితో పాటు నేటి తరం కవులు కూడా పాల్గొన్నారు. అఫ్సర్, యాకూబ్, గుడిపాటి వంటి కవులు, కవితా ప్రియులు ఈ సమ్మేళనాన్ని అలరించారు. గుర్రం సీతారాములు వంటి సాహితీ ప్రియులు క్రియాశీలక పాత్ర వహించారు. ఈ కవి సమ్మేళనం కొత్త కవులకు వేదిక ఇచ్చింది. ఫేస్‌బుక్‌ను ఈ కవి సంగమానికి వాడుకున్నారు. ఇది తెలుగు కవితా కార్యరంగంలో ఓ ప్రయోగం. దాని గురించి కవులు కొంత మంది ఫేస్‌బుక్‌లోనే బుధవారంనాడు, గురువారంనాడు తమ అనుభూతిని పంచుకున్నారు. ఆ అనుభూతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
నిన్నటి కవిత్వపు పండుగ గురించి..... ఏ సగమూ సంపూర్ణం కాదు! నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. అందుకు కించిత్తు బాధ! అసలు రాగలనో లేదో అనుకున్నాను కానీ వచ్చాను, కొంత సమయం గడపగలిగాను, అందుకు చాలా సంతోషం అనిపించింది. ఎవరైన, ఎక్కడైన కష్ట పడి పనిచేస్తున్నపుడు గౌరవించలేకపోతే, అది కు సంస్కారం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కార్యక్రమం కోసం కవి యాకూబ్ గారు చాలా శ్రమించారు. నిన్న నాకు కనిపించింది వారి శ్రమ అందుకున్న సత్ఫలితం. వారి తో పాటూ మరి కొందరు నిన్న కష్టపడ్డారు. నిన్నటి విజాయనికి కారకులైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ముఖ్యంగా వచ్చిన వారికి! ఒక సభకు, సమావేశానికి నిండుదనం ఆహుతులే కదా? ఆ నిండుదనం కార్యక్రమాన్ని మరింత విజయవంతం చెసింది. అందరూ అశించినట్టు కవిత్వం కావాలి కవిత్వం! అది అక్షరసంకలనం లా కాక భావ సంద్రం లా ఉరకాలి. - ఉషా రాణి కందాళ
నిన్నటి వాతావరణం అంతా కవిత్వంతో నిండిపోవడం చాల బావుంది. తెలియని వారినందరినీ కలిపి చేసిన ఈ సభ కొత్తదనంతో నిండి రొటీన్ కు బిన్నంగా నడిచింది. అతిదుల ప్రసంగం ఎన్నో విషయాలు తెలిపాయి. యాకుబ్ గారి ప్రయత్నం విజయవంతం అయ్యింది.పేరు పేరునా పలకరిస్తూ ఆదరించిన యాకుబ్ గారి ఆతిధ్యం ఎంతో నచ్చింది. వారి ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.- శైలజా మిత్ర
నిన్న నా జీవితంలో ఒక పరిపూర్ణమైన రోజు.... ఎంతో మంది సహచరులను కలిశాను.... ఎన్నో అనుభవాలు మూట కట్టుకున్నాను.... ఎనలేని ఆనందంతో.... ఎల్లలు దాటే పారవశ్యంతో గడిపాను.... ఇవన్నీ పంచి ఇచ్చిన కవి సంగమానికి ఎంత ఋణపడి ఉన్నానో.... - యజ్ఞపాల్ రాజు
కవుల సంగమం సంద్రంలా ఉంది నేనో ఈత నేర్చుకునే జీవిలా ఉన్నా సంతోష సంభ్రమాశ్చర్యాలతో - వర్ణలేఖ వారు
ఇన్నాళ్ళూ ....కవిత్వం రాసి, ఏం సాధించాను ఏం సాధించగలను అన్న ప్రశ్న పదే పదే వేదించేది. కాని ఈ రోజు రాలిపొయాయనుకున్న అక్షారాలన్నీ అప్యాయతలై తిరిగొచ్చి నన్ను అల్లుకున్నప్పుడు కవిత్వంతో ఒక నిండైన కుటుంబాన్ని పొందాననే ఒక అనిర్వచనమైన అనిభూతికి లోనయ్యాను - కిరణ్ గాలి
ఈ నాటి కవి సంగమం కవిత్వానికి, కవిత్వంకావాలి కవిత్వం అన్న నినాదానికి అక్షరాల పండుగ చేసుకున్నట్లు అనిపించింది. ఎన్నో కొత్త గొంతుకల్లా అనిపిస్తూ సమాజంమీద ఎక్కు పెట్టిన భాణాలు సూటిగా ఆహుతులైన కవులను ఎంతగానో అలరించాయి - రేణుకా అయోల
ప్రతీవాళ్ళు, వారి,వారి ఇంట్లో జరిగిన/జరుగుతున్న పెళ్ళిలాగ పాల్గోవడం అద్భుతంగా ఉంది. అందరూ కలిసి పనిచేస్తే కొండైనా పిండి అయిపోతుందని నిరూపిస్తున్నారు. చాలా గొప్పగా ఉంది. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం మరింత గొప్పగా ఉంది. -
కోదండరావు
http://telugu.oneindia.in/sahiti/essay/2012/kavi-sangam-an-experiment-telugu-104236.html