పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జూన్ 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

జీవితంలో.... ఈదాలని నదులన్ని కట్టగట్టుకుని దూకాయ్ సముద్రంలో అన్నీ కన్నీళ్ళై పోయాయి బడబాలనంలో మరిగి ఆవిరై లేని ఆకాశంలో జల్లెడ పట్టిన జ్ఞాపకాలై నేలరాలిపోయాయి నో రిటర్న్స్ , నో రిపెంటెన్స్ ఒక్క చుక్క కూడా అక్షరమ్ రాలలేదు అన్ని నీళ్ళున్నా ఇంత తడి లేదు ఎన్ని కాగితపు దస్తీలు పిగిలిపోతే ఏంది ఒడిలోకి తీసుకున్న చోటల్లా హృదయ కాసారాలైనయి పచ్చటి రుతువులైనయి ఎగిరొచ్చిన మేఘాల పల్లకీలలో రెక్కలొచ్చిన పాటల చినుకులైనయి కొన్ని వేళ్ళకు, కొన్ని ఆకులకు కొన్ని పక్షుల రెక్కల్లో,కొన్ని ఇసుక తిన్నెల్లో కొన్ని కంటికొలుకుల్లో, కొన్ని పచ్చి ఊపిరితిత్తుల్లో కొన్ని పెదవికంటిన మాటల్లో, ఇంకొన్ని మొలకలెత్తిన చిగుళ్ళలో నీటి చుక్కలు కొన్ని

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UIJvub

Posted by Katta

Sriramoju Haragopal కవిత

జీవితంలో.... ఈదాలని నదులన్ని కట్టగట్టుకుని దూకాయ్ సముద్రంలో అన్నీ కన్నీళ్ళై పోయాయి బడబాలనంలో మరిగి ఆవిరై లేని ఆకాశంలో జల్లెడ పట్టిన జ్ఞాపకాలై నేలరాలిపోయాయి నో రిటర్న్స్ , నో రిపెంటెన్స్ ఒక్క చుక్క కూడా అక్షరమ్ రాలలేదు అన్ని నీళ్ళున్నా ఇంత తడి లేదు ఎన్ని కాగితపు దస్తీలు పిగిలిపోతే ఏంది ఒడిలోకి తీసుకున్న చోటల్లా హృదయ కాసారాలైనయి పచ్చటి రుతువులైనయి ఎగిరొచ్చిన మేఘాల పల్లకీలలో రెక్కలొచ్చిన పాటల చినుకులైనయి కొన్ని వేళ్ళకు, కొన్ని ఆకులకు కొన్ని పక్షుల రెక్కల్లో,కొన్ని ఇసుక తిన్నెల్లో కొన్ని కంటికొలుకుల్లో, కొన్ని పచ్చి ఊపిరితిత్తుల్లో కొన్ని పెదవికంటిన మాటల్లో, ఇంకొన్ని మొలకలెత్తిన చిగుళ్ళలో నీటి చుక్కలు కొన్ని

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UIJtCw

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //కన్నుముసేను// చిరుగాలినీ తాకాలని మెడ మీదకీ వొచ్చాను కాలుష్యం లో చిక్కుకున్న చల్లటిగాలి నేను రాలేను అని చెప్పింది నీడ కోసం రహదారి అంత వెతికాను ఒక ఎండిన చెట్టు గొడ్డలిని తాన కాండంలో నుంచి తీస్తూ నీకు నీడనీ ఇవ్వలేను అని నిస్సహాయతను వ్యక్తం చేసింది అందమైన పక్షులను చూడాలని అడవి అంత గాలించాను , వేటగాళ్ళు దాడికి మేము బలైపోయం అని చెప్పడానికి రాలిన ఈకల గుర్తులు మాత్రమే ఉన్నాయి ప్రకృతి అంత నాశనం ఇపోతుంటే ఏమి చెయ్యలేని నేను చివరకి మనిషి తయారుచేసిన ఈ కాలుష్యం టాబ్లెట్ వేసుకొని కన్నుముసేను 17may2014

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyjnqT

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ నా కోసం @ నా మనసుకు నడక నేర్పినావు అందుకే అది ప్రతి సారి నీ వైపే పరుగు తీస్తుంది. నా కనులకు మాటలు నేర్పావు అందుకే అవి నీ చూపులతో కలిసి పాటలు పడుతున్నాయి. నా హృదయాన్ని విశాల పరిచావు. అందుకే అది నీ తీయని జ్ఞాపకాలతో నిండి పోయింది. నిలకడగా నిలువలేని నా మనసుతో ఇబ్బంది పడుతున్నాను . నిదుర లేని ఆ రాత్రి చీకట్లో వెలుగు రేఖవై నా కళ్ళను కట్టేస్తావు. ఆ వెండి వెన్నెల్లో చల్లటి చిరుగాలి నన్ను తాకగానే గుర్తొస్తావు. ఆ తలపులతో నీవు నన్ను పిలుస్తున్నవనుకోలేదు. కాని,తల వాల్చి నిదురపోతుండగా కలగా నీ పిలుపు వినిపిస్తుంది. ఒకసారి జాబిలిని చూసి నీవనుకున్నాను. నా గుండెలో నీకు గుడి కడితే గగనానికి చేరుకున్నావని మదనపడ్డాను. నా కోసం నిన్ను దిగి రమ్మనను.కాని నాలో శాశ్వతంగా ఒదిగి పొమ్మంటున్నాను. _కొత్త అనిల్ కుమార్ 17 / 6 / 2014 ( ప్రేమ కవితలు _1999 )

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly87uP

Posted by Katta

Subhashini Nakka కవిత

Namasthe telangaana

by Subhashini Nakka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0T9S

Posted by Katta

John Hyde Kanumuri కవిత

పుస్తకం తెరచి ఎన్నాళ్ళయ్యిందో! ~*~ పళ్ళచక్రాలను బిగించుకున్నట్లు అంతా నియమితంగా తిరుగుతుంది ఓ వయస్సు దేహంపై వాలాక నిద్రపొరను వదిలేయడం ఎంతకీ అర్థంకాదు కాలేజీ రోజుల్లో నీళ్ళు కుమ్మరించినా మత్తువదలని కళ్ళేనా అనే ఆశ్చర్యం ఎవ్వరూ నిద్రలేవని సమయానికి పాలప్యాకెట్టును ఆహ్వానిస్తే ఇక వంటగదిలోంచి కాఫీ వాసన పక్కింటికి చేరుతుంది పొయ్యిపై అన్నం ఉడుకుతుంది చూస్తుండు అని అమ్మచెబితే పొంగిన ఎసరుతో ఆరిపోయిన కట్టెలపొయ్యి ఎగాదిగాచూసింది నేనేనా! కొద్దిగా నడక ఓ బ్రెస్సు పేస్టులతో వ్యాయామం కొలతప్రాకారం గొంతులోకి కొంచెం దిగాక వాటికి తోడుగా కొన్ని మాత్రలు ఇక ఆఫీసుకు బయలుదేరాలనే ఆత్రం మొదలౌతుంది దేహాన్ని కొంచెం కడిగి కావలసినవేవో సర్దుకుని ముఖ్యంగా తాళాలు, కళ్ళజోడు రోడ్డెక్కి వాహనం కోసం ఎదురుచూపులు ఆలస్యమైదేమోనని బేజారులు ఒక్కసారి వాహనం ఎక్కాక మళ్ళీ తిరిగి ఎక్కినచోటే దిగేదాకా ఎక్కడున్నానో నాకే తెలియని స్థితి ఎందుకంటే రోజూ ఏదొక సమస్యల ఫైళ్ళు తెరుచుకుంటూనే ఉంటాయి తెరుచుకున్న కంప్యూటరు వేడెక్కిన తన దేహాం ఎప్పుడు చల్లబడుతుందోనని చూస్తూనే వుంటుంది ఇంటికిచేరాక ఆకలి నాలుగు మార్గాల రోడ్డెక్కిన కొత్తకారులా పరుగెడుతుంది మళ్ళీ కొలతలతో ఆహారం జతగా మాత్రలు అరాకొరా అంతర్జాలవిహారం మొదలయ్యాక అలసట రెప్పలపై వాలుతుంది దేహం ఎప్పుడు పక్కపై వాలుతుందో! దాచుకున్న ఆశల ఇష్టాలు అలా షెల్పుల్లో దాక్కున్నట్టే ఉంటాయి కొనుక్కున్న పుస్తకమో మిత్రులు ప్రేమగా పంపిన పుస్తకమో అలంకారాలైన అనేక పుస్తకాలు క్షణాలు కణాల మద్య నిరంతరం సంఘర్షణ పుస్తకం తెరచి చాలారోజులయ్యింది. .....................17.6.2014 21:30 గంటలు

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0O69

Posted by Katta

Kavi Yakoob కవిత

selected Readings ~ గంటేడ గౌరునాయుడు | మా ఆకాశంలో నెలవంక ................................................................. మా ఇంటి ఆకాశానికి పూచిందొక నెలవంక వంకంటే వంకగాదు ఇంటిల్లిపాదినీ వెంటతిప్పుకునే అల్లరల్లరి పిల్లజింక. *** వేరువేరు తీరుతీరుల విడివిడి ప్రపంచాలను ఒకే ప్రపంచం చేసింది. మేము మరిచిపోయిన ఆటల్నీ,పాటల్నీ మాకందించి మరబొమ్మలమైపోయిన మమ్మల్ని మనుషుల్ని చేసింది. నెలవంక తెచ్చింది మా ఇంటికి లిపిలేని వెన్నెల భాష అదే మమ్మల్నిప్పుడు పాలిస్తున్న అధికార భాష . దానికీ వ్యాకరణం ఉంది దానికో వింత సౌందర్యం ఉంది. శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే మహత్తేదో ఉంది దానికి, అదే మా ఆత్మల్నిప్పుడు అనునిత్యం శాసిస్తోంది. వొచ్చీరాని మాటల వొయ్యారినెలవంక వంకంటే వంకగాదు .. వేయిపున్నముల వెన్నెలజింక. *** మేజాబల్లమీద కూజాలోకి రెండాకులతో ఓ పూలరెమ్మ చేరగానే గదంతా కళాకాంతులతో నిండిపోయినట్టు, పచ్చనాకు ప్రమిదలో ఒకే ఒక్క అరుణారుణ పల్లవి మొక్కను దివ్వసమ్మి గా వెలిగించినట్టు, పువ్వంత పాలనవ్వు మాయింటి ఆకాశాన్ని వెలుగు వెల్లువ తో ముంచెత్తింది. చిట్టి చంద్రవంక నట్టింట పాకుతుంటే మా మానస కాసారాల లోలోతుల్లోకి చొచ్చుకుని మేము కోల్పోయిన ప్రమోదాల నిధుల వేదాలకోసం శోధిస్తున్న మీనమే అనిపిస్తుంది. తన చిట్టిచిట్టి చేతులు నేలకు ఆనించి మెల్లమెల్లగా పారాడుతుంటే మేం మోయలేని మహానంద మంధరగిరిని మూపునకెత్తుకున్న కూర్మం లా గోచరిస్తుంది. బాలరాముడౌతుంది, చిలిపి కృష్ణుడౌతుంది, శతాధిక అవతారాలతో మాలోపలి దానవులను, దశకంఠులను దునుమాడి అంతరంగాల్ని ప్రక్షాళన చేస్తుంది మా నవ్వుచినుకుల నెలవంక, వంకంటే వంకగాదు ఎదలోయల చీకటులను తొలగించే వెలుగులెంక. *** నెలవంక వెలుగువేళ్ళతో తాకితేచాలు రబ్బరుబొమ్మ రసరమ్య రాగాలు పలుకుతుంది. పూలపిడికిళ్ళతో పట్టుకుంటేచాలు కొయ్యగుర్రం కీలుసవరించుకుని పరుగులు పెడుతుంది. పగులగొట్టినా ప్రాణం పోసుకుని తనచుట్టూ ప్రదక్షణలుచేస్తాయి ఆటబొమ్మలన్నీ. దాని అనుగ్రహం కోసం చేతులుసాచి నిరీక్షిస్తుంటాయి నిరంతరం మా ప్రాణాలన్నీ. ఆటల్లో అలయబెట్టి అందీ అందకుండా అలరించే మా చిన్ని నెలవంక వంకంటే వంకగాదు ఎద ఎదనూ పూపొద ను చేసిన పసిపలుకులప్రియాంక. *** నక్షత్ర ధూళి తో నలుగుపెట్టి మిన్నేటి గంగ తో స్నానమాడించి తెల్లమబ్బుల బొచ్చుతువ్వాలుతో ఒళ్ళుతుడిచి కళ్ళకు చీకటి కాటుక దిద్ది చెక్కిట దిష్టిచుక్క పెట్టి వేలికిమిగిలిన కాటుకరేకను అరిపాదంకింద అద్ది ఇంద్రధనసు ఉయ్యాలలో వేసి జోలపాడితే దాని నీలాల కళ్ళమీద నిదరపువ్వు వైశఖపున్నమిలా విచ్చుకుంటుంది. నిద్దరలో దాని ముద్దుమోము నిశ్చల దీపంలా వెలుగుతుంది. పరిమళాలు నింపుకుని పిల్లగాలి పాపచుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఇల్లు ఇల్లంతా ప్రశాంత దైవమందిరమైపోతుంది. నిదరలో బెదురుతుందో , కల చెదురుతుందో ఉన్నట్టుండి ఉలిక్కిపడి తపోభంగమైన మునిలా కలవమొగ్గల కళ్ళు విప్పారుస్తుంది. అప్పుడది ఏడిస్తే అదొక ఇతిహాసం, నవ్వితే అది నవీన కావ్యం. పాపతో గడిపే ప్రతీ క్షణమూ కమ్మని కవిత్వానుభవమే, అదొక నిత్యనూతన సాహిత్యాధ్యయనమే, మేమిప్పుడు నెలవంక పాలనవ్వులకు దోసిళ్ళుపట్టి కళ్ళనిండా నింపుకునే చుక్కలం నెలవంకెకు వేలాడే సరికొత్త ఆశల చొక్కాలం. మా నెలవంక... గోరుముద్దల ముద్దుల గోరువంక, వంకంటే వంకగాదు ప్రేమ క్షీరసాగర గర్భాన మేము నిర్మించుకున్న శతసహస్ర దళసుమాలంకృత స్వర్ణలంక అదేకదా మా ప్రియ ప్రపంచమింక.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0PXU

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | నదీమూలంలాంటి ఆ యిల్లు ! ................................................... చాలాచోట్లకు చాలా సందర్భాల్లో , అసందర్భాల్లో వెళ్ళలేకపోయాను వెళ్ళినందువలన ,వెళ్ళలేకపోయినందున అంతే ;అంతేలేని ,చింతే వీడని జ్ఞాపకం ఊళ్ళో ఇప్పుడెవరూ లేరు వృద్ధాప్యంలో ఉన్న యిల్లు తప్పఇల్లంటే చిన్నప్పటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం; చిన్నిచిన్ని కిటికీలు రెండు; కొన్ని దూలాలు; వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు బెంగగా వుంటుంది దూరంగా వచ్చేసానని . కలల్లోనూ అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూలేచి ,పక్కలో తడుముకుని దొరక్క వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తాను; అప్పటికవి ప్రేమిస్తాయి ఇంకా నాలో మిగిలిఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి. 1 ఇంతున్నప్పుడు నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను; అవి నన్ను మోస్తున్నాయి ఒళ్ళంతా పాకిన గజ్జికురుపులమీద చల్లుకుని పేడరొచ్చులో ఉపశమించాను వేపాకు నూరి పూసుకుని కురుపుల్లా మాడి చేదెక్కాను కాలిబొటనవేలి దెబ్బల్నిఒంటేలుతో కారుతున్న రక్తానికి అభిషేకం చేసాను ఎర్రటి ఎండలో బొబ్బలెక్కిన కాళ్ళ మీద ఆవుమూత్రం రాసుకుని ఆనందంతో గంతులేశానుఋణమేదో అంతుబట్టని రహాస్యమై కలల్ని ముట్టడిస్తుంది; గాయాల సౌందర్య రహాస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది 2 అక్కడున్నది ఖాళీ ఖాళీ నేలే కావొచ్చు; ఎవరూ సంచరించని ,నిద్రించని, గంతులేయని ఉత్తి భూమిచెక్కే కావొచ్చు అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి, నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి , పెంచి పోషించిన కాలం వుంది వెళ్ళలేక చింతిస్తున్న , దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది చాలా చోట్లకు వెళ్ళలేక పోవడం క్షమించలేని నేరమే మరీముఖ్యంగా నదీమూలంలాంటి ఆ యింటికి.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1naDkWk

Posted by Katta

Krishna Mani కవిత

(స్కెచ్ కవిత ) పేగు బందం ____________________కృష్ణ మణి ఏమయ్యా గురువయ్య ? ఈ ఏడైన పిల్ల పెండ్లి చేత్తువా ? చెయ్యాలనే ఉంది కనకయ్య సదువుతున్నపిల్ల కదా పూర్తి కానీ సబందాలోస్తున్నై ఇప్పుడే వద్దంటుంది ! బాగుంది వరస అమ్మాయి వద్దంది అయ్యానెమో ....సర్లే అసలే రోజులు బాగాలేవు పైగా పట్నంలో ఉంది ,వస్తా ! ఏమండీ.. ఎందుకే గావు కేక ? అమ్మాయి ఫోన్ చేసింది...ఔనా ఏంటటా ? మన బిడ్డ, మీరెవరు అందండీ ? నీకు పిచ్చెక్కిందా ఏంటి ? సాగర్ అంట అమ్మాయి సీనియర్ పిల్లాడు . అయితే ఏంటే ? ఒప్పుకుంటారా లేక ఎల్లిపోనా అంటుంది ! గుండె పట్టుకొని కూర్చున్న తండ్రి మూలన కొంగు మూతికి పట్టి కారే కన్నీటిని ఆపలేని అశక్తురాలు ! ఈ మాట ఎవరితో చెప్పుకోము ? ఏమని నిన్దిన్చుకోము ? ఆలోచన లేని చింతలో రాత్రి గడించింది ! పదవే పట్నం పోయి పిల్లతో కలిసి ఆరా తీద్దాం ఎవరో ఏమైంది అని అడిగే లోపే , మన పరువు మర్యాద గంగలో కలిసే లోపే ! ధైర్యం చెప్పి బయలు దేరిన చింత ! పట్నం వెళ్లి హాస్టల్లో చూడగా అమ్మాయి లేదు అయ్యో భగవంతుడా ? అనే లోపే వచ్చారు పోలీసులు మేజర్ అమ్మాయికి మీరు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మీ అమ్మాయి కంప్లేంట్ ఇచ్చింది , పదండి స్టేషన్ కి నోరు లేవని స్తితిలో తల్లితండ్రులు ! మీరోప్పుకోరని ఇలా ముందడుగేసం నాన్న ! కూతురి మొహం ఎలా చూడాలో అర్థం కానీ తండ్రి ఏమని తిట్టాలో అని ఆవేశంతో తల్లి ! ఏమని సమర్దిన్చుకోవాలో అని అబ్బాయి ! ఇంతలో అబ్బాయి తరుపు పెద్దలు మా వాడికి మందుమాకు పెట్టి వలలో వేసుకుందని నింద! వారించ అశక్తుడైన అబ్బాయి మౌనమ్ ! తల ఎత్తి కూతురిని చుసిన తండ్రి మాట బట్టక అబ్బాయిని నిలతీసిన అమ్మాయి ధైర్యంగా ఉండు మా వాళ్ళతో మాట్లాడుతా ? ఇంతకాలం ఎం చేసినట్లు అనాలని ఉన్న నోరు రాని బేల ! ముగిసిన మంతనాలు రమ్య , మనం తప్పు చేసాం ! నువ్వు మీ వాళ్ళు చెప్పినట్లు విను నేను మా వాళ్ళు చెప్పినట్లు వింట ! నన్ను అమెరిక పంపుతారంట ! వయసు పెరిగిన తెలివి పెరగని అమ్మాయిని చూస్తూ తల్లి '' కని పెంచింది , నిన్ను కష్టపెట్టడానికా ? నచ్చిన తిండి నచ్చిన బట్ట నచ్చిన నగ వద్దన్నా మారం చేస్తే పట్నం చదువు ఇదేనా మేం చేసిన పాపం '' పదవయ్య పోదాం ఇంకా ఎం మిగిల్చింది ! భుజం తట్టిన తండ్రి ''గుండెలపైన ఆడావని గుండెల తంతే ఎట్లమ్మ ? వేరేవాన్ని నచ్చుకొని చెప్పు ఆఫ్రికా ఆదిమానవుడైన సరే'' మేం వస్తాం ! ఏమయ్యా గురువయ్య ? ఈ ఏడైన పిల్ల పెండ్లి చేత్తువా ? చెయ్యాలనే ఉంది కనకయ్య సదువుతున్నపిల్ల కదా పూర్తి కానీ ....... కృష్ణ మణి I 17-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1slClKY

Posted by Katta

Sai Padma కవిత

కవి పిట్ట లొల్లాయి పిల్లాయి పాటలు గాఢoగా పాడింది నెత్తినేట్టుకొని పాడు చేసారు కొందరు నేలకింద రాసి పాడుచేసారు కొందరు పొగడ్త పిట్ట తలకెక్కింది విమర్శకి పిట్ట కుదేలయింది కవిత్వం ఆగింది లోల్లాయితనం బోలుగా శబ్దిస్తూనే ఉంది --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oALHB8

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

ఎన్ ఆర్ ఐ ఇన్స్టి ట్యూషన్సంటే అమెరికాలాంటివనుకొన్నా ఇండియన్ పందుల దొడ్లకంటే అధ్వాన్నం అనుకోలేదు 17.6.2014

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vAs0ZY

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవింద రాయుడు **************** సర్వం ఉత్తమపురుష ****************** నేను అనే పదానికి ఎంతఅహమో నీవూ అనే మాటరానివ్వదు నాకు అనే పదానికి ఎంతస్వార్థమో నీకూ అనే ఔదార్యం చూపించదు మేము అనే పదం ఎంతసంకుచితమో మనమూ అనే భావనకు చోటుండదు ********************** 17-6-2014 ************(23)

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r15F4Y

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || బాటసారి ...చివరి మజిలి ! || ఎన్నాళ్ళీ యాత్ర ... కన్నీటి చారల సంచార జీవనం పునరావృతం అవుతూనే ఉంది !!? నాచంటలేని ఈరాయి .... వూడలు వేయలేని ఈ వృక్షం ... గూళ్ళని వదలి ... గుండెలు పగిలి... మళ్ళీ కొత్త దారి !! వీరులత్యాగంతో తెలుగు వెలుగై విశ్వమ౦తై ... విరాజిల్లి ... దశాబ్దాల దగా మజిలి ...!! వూరు వదిలి .. నేల వదలి... అన్నీ మనవే అనుకుని ఆఖరుకి కాందీశీకులమై.... మళ్ళీ మొదటికి ....!? కాలం చేసిన గాయాలు ... అనుభవాలు ... పాఠాలు ...!! కారణమేదైనా కానీ ... (?) వలసేప్పుడూ కలసిరాదు... హస్తాలన్నీ కలవాలిప్పుడు ... ఇగోలు, దగాలు, పగలు కాదు .. గాయాల్ని కొంగ్రొత్త గేయాల్ని చేసి జగతికే స్పూర్తినిచ్చే నవ్యాంధ్ర ను నవీకరించాలి... ఆశల సౌధాల కి కొత్త పూల దారుల్ని వేయాలి ... ద్వయ రాష్ట్రాల వారధై, ప్రేమ పాశమై తెలుగు విశ్వమ౦తై వెలగాలి !! 17 - 06 - 2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uAzXfa

Posted by Katta

Udaya Babu Kottapalli కవిత

ఉదయబాబు **ఒక సంధిగ్ధ సమయంలో**17-6-2004 మొన్న మరణించిన వత్సరంలోంచి నిన్న మరణించిన రోజులోనుంచి... మొలకెత్తిన వరినారుమడిలా క్షణాలు కొల్లలై...కోకొల్లలై...పుట్టుకొస్తున్నాయి... ఆశల పాలు పోసుకుని కోరికల కంకులు... స్పృశిస్తున్న పైరగాలిలో...వయ్యరాలు పోతున్నాయి... చంటిపాప మునిపంట కొరికిన ఇడ్లి ముక్కలా చతుర్దశి చంద్రుడు పరువానికి రాని వెన్నెలను పైరుమీద పరుస్తున్నాడు... పండుతున్న పంటను చూసి... శ్రమించిన శారీరక శ్రమ స్రవిస్తున్న రాలుకన్నీటి పిందెల్ని మోచేతుల ఎముకల బద్దలపై నిలబెట్టిన అరచేతులపంజరంలో మెరుస్తున్నాయి... ఆక్షణంలో అవి ఆనందభాష్పాలే...... పవితమైన ఓటుతో నిలబెట్టిన అధికారం ఇచ్చిన మాటను వోటుకుండ పాలు చేసి... ప్రకౄతి పగబట్టిన వేళ... ఆ క్షణంలో సర్పయాగానికి సన్నద్ధమయ్యే జీవన సమిధలు విసర్జించే రక్తాశ్రువులే... \u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C ::: >>>>>>>>>>>

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uAzUjG

Posted by Katta

Kapila Ramkumar కవిత

సాహిత్య ప్రయోజనం || కీ.శే.డా||కె.హరీష్ (సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు)|| సామాజిక ఉత్పత్తిలో ఓకరినొకరు ఎరుకపరచుకోటానికి వాడేది భాష, మాట, పాటా మానవశ్రమ నుండి సమిష్టి తత్వం నుండి పుట్టాయనేది నిర్వివాదాంశం. సామాజిక పరిణామ క్రమంలో ఉత్పత్తి రూపాలూ, విధానాలు మారాయి. శ్రమ విభజన వర్గ విభజనగా మారింది. అది క్రమేణా సమిష్టీ తత్వం నుండి వ్యక్తి తత్వమయింది/ వ్యక్తులకు సొంత ఆస్తితోపాటు కవిత్వం కొద్దిమంది కవుల, ఛందస్సు గొలుసుల్లో చిక్కువడింది. క్రమేణా కవిత్వం ఆధిపత్య వర్గాల ఆనందం కోసం, ప్రజల్ని అంధవిశ్వాసాల్లో ముంచటం కోసం ఉపయోగపడింది. కవిత్వానికి, కళలకూ కూడ వర్గ స్వభావం వుంటుంది. అవి కూడ అంతస్థులూ, అంతరాలు, కులాలు పాటిస్తాయి. భాషయొక్క ఉపరితలమే ' కవిత్వం '. వర్గాధిపత్యాలతో పాటు కవితారూపాలలో కూడ మార్పు వచ్చాయి. మారుతున్న ఈ కళారుపాన్నే మనం పద్యం అన్నాం. గేయం అన్నాం. వచన కవిత అన్నాం. అభ్యుదయ సమాజానికి రూపాలను సమాంతరంగా కళలు, వాటి రుపాలు ( కాంటెంట్లు) మారుతూనే వుంటాయి. కళా రుఫాలు సామాజిక వృక్షంపై విరబూసి వికసించే పూలు. ఈ గుర్తింపు కలిగిన తరువాత కొన్నీ కళలు ప్రజల పక్షాన నిలబడతాయి. కొన్ని పాలకవర్గాలను అంటకాగి వాటి కొమ్ము కాస్తుంటాయి. ఈ చారిత్రక నేపథ్యం సాహితీ ప్రియులందరికి తెలుసు. కళకైనా, సాహిత్యానికైనా, మమతం సమత, శాంతి మానవాభ్యున్నతిని మించిన మరొక లక్ష్యం మరొకటి వుండదు, వుండకూడదు. అలాంటి ఉత్తమ సాహిత్యాన్ని, కళా సంస్కృతిని విస్తరింపచేయటమే సాహిత్యకారుల ముఖ్య లక్ష్యం, కర్తవ్యం. '' ప్రజల నుంచి ప్రజల కొరకు '' అనేది ఇక మన నినాదం, విధానం కావాలి. ఈనాడు మనం ఒకానొక సంక్లిష్టమైన మలుపులోవున్నాం. సాహిత్యాన్ని, మీడియాను, మోసపూరితం చేస్తున్న వ్యాపారపు విలువలు ఒకవపు, సామ్రాజ్యవాదుల ఆర్థిక సాంస్కృతిక దాడులు మరొక్ వైపు, మత ఛాందస ఆదిమ యుగాల దాడి మరొక వైపు నిత్యం మనం ఎదుర్కోటున్నాం. ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదం ముప్పేట దాడులు చేస్తూనే వున్నాయి. ఈ దాడినుంచి మనలను మనం మన సంస్కృతిని, సాహిత్యాన్ని మనమే కాపాడుకోవలసిన ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ విషయాన్ని మానవాభ్యుదయాన్ని కోరే సాజితీ ప్రియులు గుర్తించాలని మరీమరీ కోరుతున్నాను. ఆ విలువలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ఆగత్యాన్ని గుర్తుచేస్తూ సెలవు తీసుకుంటాను. _______________________________________________________ ( 2001 సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభలో నాటి గౌరవాధ్యక్షులు డా||కె. హరీష్‌ గారి ప్రసంగం నుండి కొంత భాగం.....వారి స్వంత నోట్‌ పేడ్ నుండి ) _______________________________________________________ 17-6-2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qokYHr

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఎండ కాస్తుంది అంటే మాటవుతుంది... పేద వాడి కాలే కడుపులాగా విప్లవ వాది మండే గుండె లాగా ఎర్రటి ఎండ ప్రచండంగా నిప్పులు చెరుగుతోంది అంటే కవిత్వమవుతుంది వెన్నెల కాస్తుంది అంటే మాటవుతుంది పక్షం రోజులు పురిటి నొప్పులు పడి పున్నమి..వెన్నెలను ప్రసవించింది అంటే కవిత్వం అవుతుంది ఏమిటో ? అక్షరాల్ని లక్షణంగా లక్ష్యం దాకా తీసుకెళ్తే చాలనుకున్నా.. కాదు.. అక్షరాన్ని వంగ పెట్టి, సాగదీసి మెలిపెట్టి, వీలైతే రెండు మూడు భాషలు కలగలిపి మామూలు మనసుకు అంతుబట్టకుండా మేధావుల మెదడుకు మాత్రమే అర్ధమయ్యేలా వ్రాయగలిగితేనే గొప్ప కవిత్వం ! అమ్మ కడుపు నుంచి అపుడే పుట్టినంత స్వచ్చంగా కలం ప్రసవించిన అచ్చ తెలుగు అక్షరాలను కాగితం పొత్తిళ్ళలో పరిస్తే చాలనుకున్నా . . కాదు. . పదాలకు పదును పెట్టి, సానబెట్టి, కాసింత తేనె పూసి, సాములు చేసి అందాల్ని, ఆనందాల్ని తెర వెనక్కి తోసేసి మాంసపు ముద్దల్ని మాటలుగా చేసి రక్తపు మరకల్ని, చురకల్నీ చుర కత్తులుగా చేసి గుండెల్లో గుబుల్లూ, సెగలూ కళ్ళల్లో పొగలూ, కన్నీళ్ళూ తెప్పించగలిగితేనే గొప్ప కవిత్వం ! నేనింకా పసి కూనని అక్షరాల పొత్తిళ్ళలో హత్తుకునే మెత్తదనమే తెలుసు మాటల మాధుర్యాలను ఆలకించి చిందే మమతల బోసి నవ్వులే తెలుసు అమ్మ వేళ్ళ కదలికల కవితల కితకితలే తెలుసు రంగుల్ని, వెలుగుల్నీ చూసి కేరింతలే తెలుసు ఆకలేస్తే చీమ కుడితే ఓ క్షణం ఏడ్చి మరచిపోవడమే తెలుసు ఎదురు నిలవడం , గళమెత్తడం తెలియదు నిలదీయడం నిగ్గు తేల్చడం తెలియదు లయ బద్దంగా నవ్వడం రాగ రంజితంగా ఏడ్వడం ఇంకా నేర్చుకోలేదు . . బుడి బుడి నడకల పసి పాదాలకు ముళ్ళో, రాళ్ళో తగిలితేనో , దారులే మూసుకు పోతేనో నెమ్మది నమ్మదిగా నేర్చుకుంటా పదాల పేరడీ మాటల గారడీ..! ఎ..ద..గా..లి కదా. . . ! ! నిర్మలా రాణి తోట [ తేది: 17.06.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ydAsQZ

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని 189to192// 189. రుణమాఫీపై ఎటూ తేల్చని ప్రభుత్వాన్ని నేనే సాగునీరు విడుదల చేసిన ప్రభుత్వాన్ని నేనే దిక్కుతోచని స్థితిలో మిగిలింది బక్కరైతు ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 190. మానవ నాగరికత ఆనవాలు జీవనదిని నేనే ఏటా విళయమై జనాన్ని మింగుతున్న విషాదాన్ని నేనే నిర్లక్ష్యానికి నిలువుటద్దం ప్రభుత్వయంత్రాంగం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 191. ఊరించి ఊరించి కళ్ళాపి చల్లే రుతుపవనాలు నేనే అకాల అల్పపీడనమై పంటలు ముంచే తుఫానులు నేనే కాలుష్యంతో తన గొయ్య తానే తవ్వుకున్న మనిషి ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 192. బండెడు పుస్తకాలు మధ్య గానుగెద్దు ఐన విధ్యార్ధి నేనే ర్యాంకులు గ్రేడులతో ప్రగల్బాలు పలికే విధ్యాసంస్థలు నేనే చదువులు తప్ప జ్ణానాన్ని పంచలేని విద్యలన్నీ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని....16.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SQ9C0j

Posted by Katta

Abd Wahed కవిత

(నాకు జ్వరమొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తుల కషాయం అందరితో చదివించాలని డిసైడ్ అయిపోయా) హమ్మయ్య.. జ్వరమొచ్చింది... నరనరాన పొగలు కక్కుతున్న అగరుధూపం మంచుగడ్డలా వణుకుతున్న కణకణం కంబళి చలిమంటలో వలపులాగా అల్లుకుంది జ్వరం... కంటితెరపై ప్రతిరోజు వాలే రంగురంగుల దృశ్యాలు అమృతాంజనం కాల్పులకు కన్నీటిబొట్లుగా రాలిపోయాయి రహదారిని ఈదే కాళ్లు కట్టెముక్కల్లా, పడకేసిన నదిలో కొట్టుకుపోయాయి... గాలిపటం ఎగిరేది స్వంతరెక్కలతో కాదని తేలిపోయింది... చిరుగాలికి వణుకుతున్న పచ్చగడ్డి రేకులా ఆత్మీయత దోసిళ్ళలో పట్టుబడ్డ మిణుగురులా ఈ జైలు కూడా బాగుంది... గుంజకు కట్టిన తాడు ఎంత పొడుగున్నా ... కట్టుతాడే స్వేచ్ఛ ... కనిపించని కట్టుతాడు...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SQ9Apj

Posted by Katta

Aruna Naradabhatla కవిత

వెనుకడుగు ___________అరుణ నారదభట్ల ఒక్కసారి నిజం లోకి తొంగి చూడు గతాన్ని మరో మారు తడుముకొని చూడు నీకోసం నడిచొచ్చిన కాలం ఎన్ని మెట్లు దిగజారిందో! పేజీలు మరోమారు తిప్పిచూడు ఏ క్షణాలు నీ పాదాలవాలాయో ఎన్ని చేతులు నీ గొంతును తడిపాయో ఏ రాగం నిను కొత్తగా పలికించిందో ఏ కాలం నీతో నడిచి వచ్చిందో ఒక్కసారి తరికించి చూడు! ఎవరి కలలు నీకు తోడైనాయో ఎన్ని నొప్పులు నిను ఓదార్చాయో! ఒక్కసారి మేల్కొని చూడు మనసు...మనిషి అర్థం ...పరమార్థం కనికరం లేని కాలానికేసి చూడు చేసిందీ...చేయాల్సింది విజ్ఞతతో నీ అడుగులవైపు చూడు! పున్నమిలూ...చీకట్లు నీడలోని సంతోషాలు పుట్టిన నీవో... పుట్టించిన సృష్టివొ ఒకింత ఓపికగా చూడు! చిక్కుకున్న నడవడిలో గమనం భారం కాకుండా కాసింత అహం కోల్పోయి చూడు! క్షణంలో జారిపోయే కాలానికి కనికరంలేదని గమనించి నడు! నిజంలోకి ఒక్కసారి తొంగి చూడు! ఉనికిని కాపాడే జాడ చూడు! ముందు పదిలమవడానికి వెనకకు తిరిగి చూడు! 17-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oAjt9B

Posted by Katta

తిలక్ బొమ్మరాజు కవిత

తిలక్/అవే కళ్ళు The unpredictable only substance may view you sometimes... Let them Let it allow....Life goes and flows కొన్నిసార్లు జీవించాలనిపించడం సహజమేనేమో ఏ ఆత్మకైనా ఆత్మాభివృద్దికి కారణమైన విత్తనాలు జీవితంలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి తనపై కూర్చుని విర్రవీగుతున్న కాండపు ఆకుల్లాగా వేర్లు లోనెక్కడో దాక్కొని పైకిమాత్రం డాబుగా కనిపించే వృక్షం కూడా ఏదోక క్షణాన నేలకొరగాల్సిందేనేమో జీవన పయనంలో కొన్ని మజిలీలు గురువులుగా నీ ప్రక్కగానే వెడలిపోతుంటాయి నువ్వు గుర్తుపట్టలేనంతగా విజయమో అపజయమో నిబద్ధతను నేర్పిన చేతులు మళ్ళీ కనబడకుండా ఎవరో ఒకరు చెప్పాలి మనకు ఆ ఆనవాళ్ళను నువ్వు కూడా చూశావని అప్పటి వరకు దుమ్ము పట్టిన గత అనుభవాలన్నీ మరుగున పడుంటాయి నీ వెనకెక్కడో నిలుచుని వీపును తడుముతుంటాయి నువ్వు ముందు నిలబడేందుకు కాని స్వయంకృషి రక్తంపైన నరాల క్రింద దాచుకున్నట్టుగా ఒక నిషా ఇప్పుడు అవే పాత కళ్ళు నీకెదురుగా అక్షరాలు దిద్దిస్తున్నాయి మళ్ళాఒకసారి తిలక్ బొమ్మరాజు 17.06.14

by తిలక్ బొమ్మరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vzIDVs

Posted by Katta

Divya Kiran Takshikasri కవిత

దేశం దేహం వేరు వేరు కాదు ! రెండూ ఒక్కటే రెండింటి తీరు ఒక్కటే ! చిన్న తప్పే కదా అని చేసేస్తే దేశం పాడవుతుంది ! చిన్న దెబ్బే కదా అని వదిలేస్తే దేహం పాడవుతుంది ! క్రమ శిక్షణ బాగా పాటిస్తే దేశం బాగుంటుంది ! క్రమ శిక్షణ తో యోగ చేస్తే దేహం బాగుంటుంది ! వ్యర్ధ పదార్ధాలు తగ్గిస్తే దేశం పచ్చగా ఉంటుంది ! వ్యర్ధ ఆహారాలు తగ్గిస్తే దేహం గట్టిగ ఉంటుంది ! దేశాన్ని ప్రేమించు ! దేహాన్ని క్రమబద్దీకరించు ! జై భారత్ !! మీ కిరణ్ ......

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAMAFW

Posted by Katta

Srinivas Reddy Paaruvella కవిత

అడవింకా ఎండిపోలేదు || పారువెల్ల ఊళ్లు పంచుకున్న దొంగలెలా నవ్వుకున్నా అడవింకా ఎండిపోలేదు. ఆకాశానికి ఆకాశమంత దుఃఖం వాకిట్లో మెరిసే చుక్కల్ని చూసి. అయినా ఆకాశమ్మీద అడవి సంతకం చేస్తూనే వుంది కురిసిన మేఘాలని వెలుతురు కిరణాలని మట్టివేళ్ళు పదిలంగానే దాచుకున్నాయి అందుకే అడవింకా ఎండిపోలేదు బలిసిన రెక్కలతో ఎగిరే గద్దల్ని చూసి తెల్ల పావురాలే అడవికి కానుకనిస్తాయి ఓ ఎర్రని మందారాన్ని . అందుకే అడవి ఎండిపోదంతే అడవికి చిరునామా పూసే మందారాలు మెరిసే నక్షత్రాలు

by Srinivas Reddy Paaruvella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAErl1

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || నువ్వు పిచ్చోడివి || నువ్వు పిచ్చోడివి ఎప్పుడూ కనిపించేవే నమ్ముతావు కొమ్మలకు వ్రేలాడితేనే పచ్చదనమని పెదాలపై విరబూసేదంతా నవ్వేనని మెరిసే దేహమే వెన్నెలని బ్రమలో బ్రతుకుతూ ఆరిపోయే దీపపు వెచ్చదనానికో ఆవిరైపోయే నీటి బుడగల వైభవానికో చప్పట్లు చరుస్తూ మురిసిపోతావ్ ******* ఎవరన్నారు నిన్ను నువ్వు నమ్మమని నువ్వెంత కాలం నీతో నువ్వుండగలవో నిన్ను నువ్వైనా నమ్మించగలవా నువ్వు నిద్రిస్తున్న నా ఒడిని కూడా నమ్మకు కాబోయో శూన్యపు ఒడిలో శాశ్వతకాలం కలలు కనలేవు ******* వీలైతే దేహాలను దాటి చూడు లోపలి పొరల్లో పచ్చదనాన్ని ఏమంటారో తెలుసా.. ప్రేమ చాంద్ || 17.06.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n8K6f2

Posted by Katta

CV Yaar కవిత

కవి మిత్రులారా ? ఈ సంఘటన పై ఒక మంచి కవిత రాయ గలరా ? పాజిటివ్ గా , లైఫ్ అఫ్ఫర్మింగ్ గా ఉండాలి ! ఈ ఫోటో జత చేసి . నేను కవిని కాదు కానీ, అందుకే మీకొక ఇన్ స్పిరేషన్ సప్లై చేస్తున్నా !

by CV Yaar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lMIgnr

Posted by Katta

Soma Sekhar Reddy కవిత



by Soma Sekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vyKcTI

Posted by Katta

Sharada Sivapurapu కవిత

మన దేశంలో majority స్త్రీల జీవితాలు చూ స్తుంటే, వారి తల రాతలకి తల తోక ఎక్కడా కనిపించవు. దీనికున్నదల్ల అ స్తిత్వం మాత్రమే. ఈ తలరాతకి తోకఎక్కడ // శారద శివపురపు నా చిన్నతనంలో అమ్మ కొంగు పట్టుకుని ఇల్లంతా తిరిగాను బళ్ళోకెళ్ళి చదువుకున్నప్పుడు అన్నయ్య చెప్పినట్టు విన్నాను నాన్న వేలు పట్టుకుని బయటప్రపంచం చూశాను మనువాడాకా మాత్రం? మగని వెనుకే దాగాను ఉద్యోగం చేసినా తల మాత్రం ఎ త్తలేదు ఎన్నళ్ళిలా ఉంటానని కాలాన్ని నా వెనక రమ్మన్నాను కాని కాలం మాత్రం సెకన్లు ముల్లు కదలందే నిముషం జరగలేనంది నిముషాలర వై కాందే ఘడియ మారనంటుంది. 17/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lMefEw

Posted by Katta

Rajeswararao Konda కవిత

కనులారా చూడవా - అంత దయలేని వాడనా ..? //17.06.14//@ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UHlG5Y

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మానవ జీవితం నిత్యం వైకుంటపాళి జీవిత గమనం లో నిరంతరం కాల సర్పం తో పోరాటం మన ఉచ్వాస నిస్వాసాలు సర్ప భావనే కదా మన వెన్నుముక కుండలిని సర్ప ప్రతిరూపమే నిలువెల్లా విషమున్న మనుషుల కన్నా నిండు కుటుంబాన్ని పోషించే సర్పాలే మాకు మిన్న చిన్న పిల్లలతో , పిల్లలు గా ఇంటి పెద్ద గా మాతో సహజీవనం చేస్తూ మాకు జీవనాధారం అయిన ఆ సర్ప జాతి నాగ దేవత మాకు రక్ష ప్రేమ అనేది మనసులో నిండుగా వుంటే జాతి వైరం మర్చి క్రూర జీవులు కూడా మనతో మమైకం కాగలవు నేస్తమా !!పార్ధ !!17/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pbz8Iu

Posted by Katta

Rajeswararao Konda కవిత

ప్రజలు చెప్పింది నేత వినాలి తాను చేసేదే ప్రజలకు చెప్పాలి..!! ఉత్తుత్తి మాటలకు దూరంగా ఉండాలి కష్టమైనా ప్రజలకు నిజమే చెప్పాలి..!! అప్పుడే కదా నేత - మహానేత అవుతాడు నేస్తమా..!!!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ycfmm7

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఆక్రమణ... నీకూ నాకూ మధ్య ఎప్పుడూ యుద్ధవాతావరణమే! భీకరమైన మన పోరులో నీ చిరునవ్వుల తూటాలు పేల్చి నా దృష్టిని మరలుస్తావు. చూపుల శరాలను సంధించి నన్ను అచేతనుణ్ణి చేస్తావు. తర్కానికి తిలోదకాలిచ్చి రణంలో రసపట్టుతో కనికట్టు చేస్తావు. కనిపించకుండానే నా మనసులో పాగా వేసి నా అణువణువూ ఆకమించేస్తావు. నా విద్యల్ని మరిపించేలా చేసిన నికు యుద్ధతంత్రం బాగా తెలుసని నిన్ను నేను కీర్తిస్తుంటే నువ్వంటావు... ఏ తంత్రమూ ప్రదర్శించకుండానే నేనెప్పుడో నిన్నాక్రమించానని.

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U50ZAe

Posted by Katta

Trinadh Meegada కవిత

//సేను కోతకొచ్చింది// కొలువు యెల్లిన మావ కాన రాకున్నాడు పరువాల అల'జడి' వానలో తడిసి తనువు ముద్దవుతా వుంది నా సొగసు సిత్ర విసిత్రాలు నక్షిత్రాలన్నాడు నా కులుకే కోటి తారల యెలుగన్నాడు పిచ్చి మావ.. చిరిగిన నా రయికే సూసి సాలి రామన్న నేసిన మాసిన సీర సూసి సివుక్కుమన్నాడు ..రంగీ నీకు రంగుల లోకం సూపిత్తామన్నాడు కోటి యెలుగు నీలోనే వుందయ్యా ప్రేమ సాలయ్యా పట్నవాసమెందుకంటే పోవే నీకేం తెలుసన్నాడు ..జాబు నేదు జవాబు నేదు ..ఆకాశ రామా.. నీ కళ్ళ ముందు జరిగిన ఎన్నో మా యవ్వారాలకి నువ్వే సాచ్చివి కదా ..దూరం నుంచి పిలిసి మా మావకి నాకు గుబులుగా వుందని కబురియ్యు ....మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLM7RK

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-77// ****************************** 1. కురులు చిక్కగావుంటే, కొప్పు కుదరడం సులభం, మంచోడన్నాక...గుర్తింపు సహజం 2. చెప్పేదెప్పుడూ తెలిసిందేగా, వినడం మొదలెట్టు... సామిరంగా, ఒక్క విషయమైనా తెలుస్తుంది...నీ మీదొట్టు. 3. ఒంటి సత్తువ తగ్గిందంటే, ఉండదులే పెదవిమోహం, కట్టె కాల్తున్నా... చావదులే పదవిదాహం. 4. సృజనశక్తి నశిస్తే,భజనపాటే శరణ్యం, రోజూ నువు కొత్తగా పుట్టకపోతే, నీ ఉన్నతి అన్నది శూన్యం. 5. తంబాకు నోటికి, జిలేబి సహిస్తుందా? పెడమాటలు వినే చెవికి, ప్రియసూక్తి రుచిస్తుందా. 6. పెరిగిన జుట్టుకి, పెట్టిన విగ్గుకి తేడా గుర్తించడం ఏమంత కష్టం, కళ్లలోకి చూడు,తాత్పర్యం స్పష్టం. 7. పదార్ధాల కల్తీ పాడుచేసేది దేహాన్నే, పడకండిరా యువతా! మత్తులో... పూర్తిగా ఆర్పేస్తుంది దేశాన్నే 8. నటించే చిరునగవుల కన్నా, నయం సుమా కసిరే బెత్తం, మాట కాదు... మనసు చూడరా నేస్తం. 9. అందమైన చందమామది, మచ్చనెందుకు వెదుకుతున్నావ్? చచ్చేటంత చిరాకుతో, బ్రతికి ఏం సాధిస్తావ్. 10. కుక్కలు విస్తరికై కుమ్ముకుంటున్నాయ్, పదవికోసం నాయకుడొకడు... 'చీ'అంటే అవి పోతాయ్, ఏమనాలో ఇపుడు. ========================== Date: 17.06.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U4Swxd

Posted by Katta

Venkat Govada కవిత

జగతియంతకు శాంతికాముకబంధమైనది సృష్టియంతకు విడనిబంధపుతుల్యమైనది మిత్రబంధం 'బంధ 'జాతికి 'గంధ 'మైనది -వెంకట్ గోవాడ

by Venkat Govada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qYMadv

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

చెయ్యెత్తిన చోట ఆర్టీసీ బస్సే కాదు సిఎం కాన్వాయ్ కూడా ఆగుతుంది! 17.6.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n7hCCD

Posted by Katta

Rasoolkhan Poet కవిత

*కదిలే అక్షరాలు* అక్షరాలు కదులుతున్నాయ్ బంగారు వాకిట్లో పచ్చని చెట్టుక్రింద చల్లని వెన్నెల్లో కదిలే అక్షరాలను కళ్ళకు మెరుపులు చుట్టుకుని తదేకంగా చూస్తూ కూర్చుండి పోయా చంటి పిల్లాడికి చందమామ అందినంత ఆనందం నాలో తమ అనుభవాల ముటలను ముత్యాల్లా నాపై విసురుతుంటే ఆ జ్ఞానకాంతుల వర్షంలో తడిసి ముద్దయిపోయా ఆత్రంగా వచ్చినా మదినిండా స్పూర్తితో ఇంటికి చేరా...! యాకుబ్ భాయ్ షుక్రియా.....

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lL4HcP

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|\ సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం|| విప్లవాన్ని కవిత్వీకరించిన వాడు, కవిత్వాన్ని విప్లవీకరించనవాడు శ్రీశ్రీ అని నేటి యువకవులకు స్పూర్తిదాయకమైన ఆందించాడని, సముద్రమంత ముద్ర వేసిన కవి శ్రీశ్రీ అని, చరిత్రకు అర్థాన్ని '' ఏ దేశ చరిత్ర చూసిన యేమున్నది గర్వ కారణం ' అనే గేయం ద్వారా ఋజువు చేసాడు. చరిత్రకు నిజమైన అర్థాన్ని తన కవిత్వంలో తెలిపిన మార్గదర్శి. అని కొనియాడారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి. రౌతు రవి అధ్యక్షతన సాహితీ స్రవంతి ఆధయనవేదిక సమావేశం జూన్‌ నెల మూడవ ఆదివారం ప్రత్యేకంగా శ్రీశ్రీ వర్థంతి సమావేశంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు ఉదయం 10గంటలకు ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పట్టణంలోని కవులు మొవ్వా శ్రీనివాసరావు, సంపటందుర్గా ప్రసాదరావు, కపిల రాంకుమార్, రౌతు రవి, కె. ఆనందాచారి, ప్రముఖ విద్యా సంస్థల అధిపతులు రమణారావు, వీరారెడ్డి, రాఘవరావు, ప్రముఖ వైద్యుడు డా. భారవి, ఇతర సాహితీ అభిమానులు, పాల్గొన్నారు. సాయంత్రం బోడేపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయన వేదికలో భాగంగా సామావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశ్రీ గేయాలను ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సంపటందుర్గా ప్రసాదరావు ఆలపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి సంకలనంలోని కవితలు సునంద, శైలజ, . సునంద, శైలజ, టి.లక్ష్మి, జయప్రద మున్నగువారు చదివారు. శ్రీశ్రీపై నాగభైరవకోటేశ్వరావు రాసిన గేయాన్ని కపిల రాంకుమార్ చదివారుశ్రీశ్రీ సాహిత్య ప్రక్రియల అన్నింటిలోను ఆల్‌రౌండర్‌ అంటూ విమర్శ, అనువాదం, కవిత్వ, చందోరచన, వ్యాసాలు, కథలు, నాటికలు, అంతేకా విదేశీ భాషాలలో పట్టు, శాసనమండలి సభ్యుడిగా తన పాత్రను నిర్వహించాడని అన్నారు. కె.ఎల్‌.యూనివర్సిటి అనువాద విభాగంకు చెందిన మోహనాచార్యులు మాట్లాడుతు నేటి పాఠశాలల మరియు కళాశాల విద్యార్థులకు శ్రీశ్రీ కవిత్వాన్ని పరిచయం చేయవలసివుందని తెలిపారు. నేటి సాంకేతిక విజ్ఞాన సంపాదన మాటున సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం లోపించిందని, దానిని అధిగమించేలా ఎంతో కృషిచేయాలిసివుందని అన్నారు. డా. పి. సుబ్బారావు గారు మాట్లాడుతూ కవిత్వాన్ని విశ్వజనీనం చేయటంలో అతని కృషి అనితర సాధ్యం, దానిని ఎవరూ అధిగమించలేదు. విశ్వనాధను గౌరవించినట్లే, గురజాడను, తిక్కనను, వేమనూ గౌరవించాడు. పద్య చందస్సు, మాత్రాచందస్సు, గేయం, వచన కవిత,అంతే కాక కవిత్వంలో విభిన్న ధోరణులను సృజించినవాడు. అధివాస్తవికత, సర్రలియజం, లాంటి ప్రక్రియలు, లిమరిక్కులు, ప్రాసక్రీడలు ఇలా చెప్పుకుంటేపోతే సమయం చాలదు. మహా ప్రస్థానం ఒక భగవద్గీతలా కొత్తగా కవిత్వం రాసేవారు చదవాల్సివుందని నొక్కివక్కాణించారు. డా.||కవితాంజనేయులు శ్రీశ్రీ కవితలలోని కొన్ని సోదాహరణగా వివరించారు. ఎం.శేషగిరి '' ఏ దేశ చరిత్ర చూసినా ''గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేసారు. 17.6.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lL4J4z

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి - 33 (కవి సంగమం ) కవిత్వ సంపుటి పేరు :- " ప్రవహించే పాదాలు " (కవిత్వం ) సంపుటిని రాసిన కవి పేరు :- " మంత్రి కృష్ణమోహన్ " సంపుటిని పరిచయం చేస్తున్నది : - " రాజారామ్.టి ” " అంతంరాంతర సీమల్లో ఆర్తి భ్రమర భ్రమణ ఝుంకార సంగీతం కృష్ణమోహన్ కవిత్వం “ 'ఇద్దరి మధ్య' 'మనసైన పుస్తకం' ' ప్రేమ '. జీవితపు 'డైరిలో ఒక పేజి ' అది అని ఆలోచిస్తూ, 'ఓ లో తట్టు దృశ్యం 'చూసినప్పుడు 'పోయమే రాయనక్కర్లేదు అని అనుకొంటూ, '. 'తడి ఆరని రాగాన్ని 'ఆలపిస్తూ ఓ' రాత్రి ' 'దుఃఖగీతం' పాడుతూ 'తిరిగిరాని వెన్నెల 'కోసం 'ముకురం ముందు ' 'ఒక నిట్టూర్పు' విడుస్తూ "చెట్టు పోయిన తరువాత 'కూడా 'జరిగింది చాలు 'అని అనుకొని 'దయావర్షం 'లో 'ప్రవహించే పాదాలు 'నడిస్తే కానీ 'వాళ్ళు చల్లబడరు "-అని 'ఏక వాక్యం 'తో చెప్పలేక ఏకంగా 'శిలా గీతం ' తో 'మైదానం 'లోకి వచ్చి 'ఆత్మని చూడు ' అని 'మట్టి మనసుకు నీరాజనం' ఇచ్చిన కవి మంత్రి కృష్ణమోహన్. నిజంగా ఆయనెవరో తెలీదు. తలగడ పక్కనే ఎన్నో రోజులుగా నా కంటి స్పర్శ కోసం నిరీక్షించిన సంపుటిలోని కవిత్వ పాదాలు నా మీద నుంచి నడచి ప్రవహించాయి ఈ రోజు.'కవిత్వం మీద వున్నంత ప్రేమ ' దేని పైన లేదేమో? అని ఇంట్లో అందరూ అనుకునేంత నన్ను ముంచేశాయి. "నిజానికిది ప్రేమ కవితా? లేక నిస్సహాయుడి గుండెకోత” ఈ సంపుటి అని నన్ను ఆలోచనా యాతనకు గురిచేసిన కవితా సంపుటి ఇది. 'ప్రేమేతరమైంది ప్రతిదీ దుర్భరమే దుస్సహమే'- అంటాడు కిరణ్ క్రాంత్ 'రాగధూళి'లో. ప్రేమ మినహా జీవితంలో మరేమీ లేదా?-అని అనుమానమొచ్చినప్పుడు వొక కవయిత్రి అది కూడా జీవితంలో ఒక ప్రధాన భాగమే కదా!-అని వాదనకు దిగింది.అంతటితో ఆ చర్చ ఆపేస్తే బాగుంటుందని నిలిపేశా.నా కున్న వ్యసనాల్లో ఒకటి నా కన్నా తక్కువ వయసున్న వాళ్ళతో ఇష్టంగా మాట్లాడటం. వాళ్ళు చెప్పేవి వినడం.ఓ రోజు LOVE అంటే ఏంటి అని నాకు బాగా సాన్నిహిత్యమున్న కుటుంబం లోని వార్నిఅడిగితే ఓ అబ్బాయి లేచి "LOSS OF VALUABLE EDUCATION "-అని అన్నాడు.ఎంత గొప్ప ఊహతో చెప్పాడా పిల్లాడు అని అనుకున్నాను..నిజానికీ ఈ మంత్రి కృష్ణమోహన్ ఈ సంపుటిలో అక్కడక్కడ చేర్చిన ప్రేమ కవిత్వం నన్ను మంత్రముగ్ధున్ని చేసి మోహనం కలిగించింది నాకు చదివిన తరువాత. ప్రణయ భావనలతో రాయగూడదని కాదు నేనంటున్నది అదే ఒక్కటే కవిత్వం అన్న భావన ఉండగూడదని. కృష్ణమోహన్ కి అలాంటి భావన అసల్లేదు అందుకే "శిలా గీతం "-లాంటి నిరుత్తురులనే చేసే పద్యాలు రాయగలిగాడు. "మట్టి పలకలు"-అనే నానీలు రాసిన కృష్ణమోహన్ మార్కాపురం నివాసి.ఆ ఊరు రాతి పలకలకు పెట్టింది పేరు.ఒకప్పుడు ఇసుకలో అక్షరాభ్యాసం చేసిన దృశ్యం రానురాను రాతి పలకలోకి మారింది.తరచు ఆరాతి పలకలు పగిలి పోవడం,పారిశ్రామిక వ్యాపారీ కారణంగా పగిలిపోని , తక్కువ ధరలో లభ్యమయే రేకు,ప్లాస్టిక్ పలకల సృష్టి జిరిగింది.కాల క్రమేణా రాతిపలకలు మాయమయి పోయాయి మనిషన్నవాడు మాయమైపోనట్లు. కంఫ్యూటర్ కీ బోర్డ్ మీద అక్షరాలు నేర్చుకుంటున్న ఇప్పటి పిల్లలకు అసలు పలకా బలపాలు ఎట్లా తెలుస్తాయి అందుకే ఈ కవి ఆ రాతి పలకల ఆంతరంగిక దుఃఖాన్ని "శిలా గీతం" చేశాడు.ఒకప్పుడు దేశమంతా ఈ రాతి మీదే ఓనమాలు దిద్దింది.ఈ కవి తొలిపద్యం కూడా ఈ రాయి మీదే మొలకెత్తింది.అందుకే ఈ కవికీ "కవిత్వం మీద వున్నంత ప్రేమ"వుంది ఆ రాయి మీద. ఈ రాయి మీదే నేనక్షరాలు దిద్దున్నానంటే యీ పిల్లలు నమ్మటం లేదు ఈ రాయి పలకా బలపాల అర్థనారీస్వర రూపమంటే యీ పిల్లలు నమ్మడం లేదు" ఎలా నమ్ముతారు వారు అక్షరాలకు ఆసనమవ్వడానికీ ఈ రాయి ఎన్ని రాతి దెబ్బలు తిన్నదంటే.ఈ రాయే తన వూరి జనం పాటకు గ్రామ్ ఫోన్ రికార్డ్ అయ్యిందని,తన వూరి చరిత్రకు ఈ రాయే శిలాశాసనం అయ్యిందని కవి మనల్నీ ఒక మధురిమ ఙ్ఞాపకాలలోకి నడిపిస్తాడు. అతి చిన్న వూరిగా వున్న మార్కాపురం ఒక పట్టణంగా మారె దృశ్యాన్ని "కొలనులో నీటి అలల్లా పట్నమై విస్తరించింది"-అనే ఒక చిన్న భావ చిత్రాన్ని కల్పించి ఆ వూరి ఆర్థిక పురోగతికీ ఆ రాయి ఎట్లా కారణమయ్యిందో గొప్పగా చెప్పాడు.ఇట్లా గతవైభవ పునఃస్మరణ అనే ఒక లక్షణాన్ని ఒక కవి నుంచి మరొక కవి అందుకొని తెలుగు వచన కవిత్వాన్ని అనుభూతి అంచుల మీద నడిపించారు.కృష్ణ మోహన్ తన బాల్యపు స్మృతుల్నీ ఈ శిలా గీతంలో మనకు పంచి ఆ అనుభూతిని మన అనుభూతిగా చేశాడు.ఇదీ ఒక మంచి కవిత్వ లక్షణం. ఆది వారం చాల మంది కవులు’ ఫాదర్స్ డే ‘సందర్భాన్ని కవిత్వం చేశారు.అట్లాగే ‘మదర్స్ డే’ ని కవిత్వం చేశారు.నిజానికీ ఆ వొక్క రోజేనా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నది అని నాకు చాల రోజుల నుంచి ఒక అసహనపు ఏవగింపు ఆ రోజుల పైన.నిరంతరం తల్లి దండ్రులను ప్రేమతో ఆప్యాయతతో చూసుకోవాల్సిన బిడ్డలు వారి తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాల్జేస్తున్నారు.డబ్బు సంపాదనా మత్తులో కొందరు,వృద్ధులైన వారికీ సేవ చేయడానికీ ఇఛ్చగించని మనసుతో కొందరు ఏదో ఒక ముసుగుతో మాట్లాడుతూ కన్న వారిని వృధ్దాశ్రమాలలోకి నెడుతున్నారు.ఇంతకన్నా విషాదం మరోటి లేదు.ఈ కవి ఆ విషాదాన్ని "ఎ విజిట్ టు వృధ్దాశ్రమం"-అనే శీర్షిక తో కన్నిటి కవిత్వం నిర్మించాడు. వృద్ధులు అలా వృద్ధాశ్రమాలలో వుండాటాన్ని ఈ కవి సమర్థించడు కానీ అవే లేకపోతే ఆ వృద్ధులకు ఊరట ఎట్లా?-అనే ప్రశ్న వేసుకొని తనే ఇట్లా సమాధానం చెబుతాడు. "మూడోతరంతో ముద్దులాడే ఋతువులో ఇలా సాటి వయసుల్తో సమయాల్ని సాగదీయడం ఒక బాధ ఒక ఊరట" ఆ వృద్ధాశ్రమాల వాతావరణాన్ని ఈ కవి ఇట్లా చిత్రించి మనలో ఒక వ్యథను సృష్టిస్తాడు. కడుపు కోతలు గుండె వాతలు కలసి మెలసి తిరుగుతున్నాయి అనారోగ్యాలు అసహాయతలు సహజీవనం చేస్తున్నాయి ముసలి గువ్వల మనోవ్యధల్ని అక్కడి చెట్టు చేమలు విచ్చుకున్న చెవుల్తో ఆలకిస్తున్నాయి" ఆ ముసలి గుండెల వ్య్థల్నీ సాటి మనుషులు పట్టించుకోకపోయిన చెట్టు చేమలు వింటున్నాయనే చిత్రణతో వాటికి మానుషత్వారోపణ చేసి గుండె కరగి నీరయి పోయే మాటల్ని కవిత్వంలో వొంపుతాడు. ఇలా వాళ్ళు వృద్ధాశ్రమాల పాలు కావడం వాన ప్రస్థం కాదు కర్మఫలమూ కాదు అదొకగెంటివేత మాత్రమే. ఆచీకటి కోణాలు దాచెస్తే దాగని సత్యాలుగా వున్న ఆ మలిసంధ్యలు(అంత్య దశలో వున్న వృద్ధులు) తమ మౌనాల్ని ఛేధిస్తాయని కవి ప్రస్ఫుటీకరిస్తాడు."ఈ యాతన ఎవరికీ అర్థం కానిది,ఈ క్షోభ ఎవరికీ స్పృశించనిది"-ఎవరికీ వారే అలా ఆ వృద్ధాశ్రమాలలోకి నెట్టివేయబడినప్పుడు మాత్రమే అర్థమయ్యేది-అని కవి ఒక సత్యాన్ని కవిత్వం చేశాడు. "వాళ్ళ పాదాల్లో వాళ్ళ పాదాల నీలి మేఘఛాయల్లో నాకో పల్లె కనిపిస్తుంది, వో పొలం కనిపిస్తుంది ఆ పాదాల చుట్టూ పచ్చని పైరగాలులు రెక్కలు విప్పుకొని కదుల్తూ కనిపిస్తాయి ఆ మెల్లని దయాపవనాలు శ్రమగీతాలకు ఆలాపనగా వినిపిస్తాయి ఆ పాదాల మెట్టెల్లో సూర్యచంద్రులు వొదిగి,తల దాచుకొంటారు కాబోలు ఆ పాదాలు,తారకలకు కాంతి భిక్ష పెడతాయి కాబోలు ఒక్కో పాదంవొక్కో ఆకాశ శకలం ఒక్కో పాదం ఒక్కో నదీ ప్రవాహం ఒక్కో పాదం వొక్కో మేఘసందేశం" ఇలా ఆకాశంలో అర్థ భాగమైన వారి పాదాల సౌందార్యాన్ని,సుకుమారత్వాన్ని,గొప్పదనాన్ని,ఆ పాదల అజేయ విజయాన్ని కవిత్వంగా మార్చిన కవి ఎవరంటే మంత్రి కృష్ణమోహనే. ఉన్నచోటనే వుంటూ అనేక కిలోమీటర్ల దూరం నడుస్తూ,ఇంట్లో బయట అనేక కార్యాలను చక్కబెడుతూ,బరువైన కాడితో బాధ్యతలను మోస్తూ,లలితంగా మృదు ధృఢంగా పాదాలు కల వారెవరు?-స్త్రీలవే కదా!.శ్రమ నినాదల్ని నిరంతరం లిఖిస్తున్న పాదాలు కావవి కారుణ్య శరీరాలు అవి అని ఒక అద్భుత పోలికను ప్రవేశపెట్టి ఇంకా ఆ పాదాల పట్ల ఎవరికైనానిర్లక్ష్య అభిప్రాయమ్ వుంటే తొలగించే ప్రయత్నం చేస్తాడు.శ్రమతో స్వేదాన్ని రాలుస్తున్న ఈ పాదాల గుర్తులు ఈ భూతలం మీద మూడొంతులు అని వారి పాదాల విశాలత్వాన్ని గ్రహించలేని కళ్లకు చూపిస్తాడు. బంగారు కంకణం కనపడకపోతే గాభరా పడి గదంతా వెతికినట్టు "మనసైన పుస్తకం"కనపడకపోతే అంతే దిగాలుతో గాలింపు చేస్తాడట ఈ కవి.మనసైన పుస్తం కనపడక పోతే పరాయి దేశంలో మనిషి తప్పిపోయినంత బాధ-అని ఒక భావాన్ని కవిత్వం చేసి తన పుస్తక ప్రియత్వం ఎంతదో తెలియ పరుస్తాడు ఈ సంపుటిలో ఓ కవితలో.ఆ పుస్తకం దొరక్కపోతే నుదుటి మీద చెమట ధారలు,భూన భోంతారాలు బద్దలయ్యిన భయం కలుగతాయని అతిశయోక్తిగా అన్న అందులో ఆ కవి పుస్తకాల పట్ల కనపరిచే ఆసక్తి ద్యోతకమవుతుంది. మనల్ని నిశ్చేష్టితుల్ని చేసి తన దగ్గర నిలబెట్టుకొని చదువించే కవిత "చెట్టు పోయిన తరువాత ". ఏదయినా కోల్పోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలిసేది అన్న అంశాన్ని హత్తుకొనెటట్లు చెప్పిన కవిత ఇది.మనం రాళ్లేస్తే తాను పళ్ళు ఇచ్చేది చెట్టే.మనం నరికేస్తే మళ్ళీ మొలిచి మనకు నీడ నిచ్చేది చెట్టే.తన ఇంటి ముంగిట్లో తన కురులను తాకందే ఎవరినీ బయటకు వెళ్ళనివ్వని చెట్టును మొత్తంగా నరికేసినప్పుడు కవి నిర్మించిన కవిత ఇది.రోడ్డు వేసేవాడు తనకు ఆ చెట్టు అడ్డమయిందని,కాలువలు ఊడ్చేవాడు అది రాల్చే ఆకులు తీయడాని కష్టమైందని ఎన్నేన్ని మాటలన్న ఆ చెట్టు మాత్రం సూర్యుడు చురుక్కుమన్నప్పుడు వారందర్ని తన నీడ కౌగిలిలోకి తీసుకొని సేద తీరుస్తుందని కృష్ణమోహన్ భావన చేస్తూ గోడ పక్కన నాటిన ఆ రెండు మొక్కలు చెట్లయితే గోడని కూల్చేస్తానని వృక్ష పరిరక్షణావశ్యకతను ధ్వనిస్తాడు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్ని అట్లానే నిలబెట్టే ఆట క్రికెట్.అదొక సర్వస్వంగా భావించే వాళ్ళు ఇప్పటికీ వున్నారు.ఆ అట జరిగేటప్పుడు,అయిపోయిన తరువాత కూడా దాన్ని గురించే స్థితి ఈనాటికీ వుంది.కార్యాయాలకు,స్కూళ్లకు డుమ్మా కొట్టి ,ఆఖరుకు పనులన్ని ఎగరగొట్టి ఆ ఆటను టి.వి ల్లో చూస్తున్నారన్న విషయం ఎవరు కాదనలేరు.అనంతపురం జిల్లాలో చాల కాలమే కీర్తిశేషులైన కవి కాకి (కోగిర జై సీతారామ్) పుట్టిన బిడ్డ క్యార్ క్యార్ మని ఏడవకుండా స్కోర్ స్కోర్ అని ఏడుస్తారని ఈ క్రికెట్ గురించి రాసినట్టు ఙ్ఞాపకం.ఎంతగా ఈ ఆట ప్రభావితం చేసిందంటే ఒక ఆటగాడికీ భారతరత్న ఇచ్చేటంతగా.ఈ ఆటని కవి మంత్రి కృష్ణమోహన్ "డైరీ లో ఒక పేజి" అనే కవితలో మనల్ని ఆలోచనలోకి నెట్టెసెటట్లుగా కవిత్వం చేశాడు. " ఆరోజు టి.వి తెర ముందు శిలా స్తంభాన్నవుతాను కళ్ళను వికెట్లకు కాపలా వుంచి గంటల కాలాన్ని కుప్ప పోసి తగలేస్తాను చలి మంట కాచుకోడానికి మరో నలుగురు చేరిపోతారు" కవి ఈ కవితలో ఈ ఆట కాలాన్ని ఎంతగా వృథా చేస్తున్నదో చెప్పడమే కాదు,ఈ ఆట ఎట్లా దేశ ఆర్థిక స్థితి సంక్షోభంలో పడటానికీ కూడ కారణమవుతున్నదో ఒక దృశ్యాన్ని చూపిస్తూ,ఆ రోజటి ఆకలి దప్పుల్ని సైతం మరిపించి మురిపించగల శక్తి ఈ ఆటకున్నదని "కడుపాకలి కళ్ళు తీరుస్తాయి దేహం దాహాన్ని మరచి పోతుందని"- వ్యక్త పరచని దుఃఖంతో చెబుతాడు. ఆటకు సంబంధించిన పారిభాషిక పదాలను కవిత్వం చేయటం అంత సులభం కాదు.అందులోను ఆ పదాలు ఆ కవితలో ఒదిగిపోయేటట్లుగా రాయడం అనుకున్నంతతేలిక కాదు.క్రికెట్ ఆటకు సంబంధించిన పదజాలాన్ని ఈ కవి ఎంత నేర్పుగా ఈ కవితలో వొంపాడో సొగసుగా చేశాడో చూడండి. ఆట బంతి చుట్టూ పరిభ్రమిస్తుంది చూపు పిచ్ మీద పరచుకొంటుంది బౌలర్ వేసే ప్రతి బంతికీ సాగిలపడ్డ వెన్నుపూస వికెట్ లా నిలబడిపోతుంది బౌండరి దాటే బంతి కోసం భారి సిక్సర్ కోసం కళ్ళు బైనాక్యుర్లయి కూర్చుంటాయి" ఇలా కవి క్రికెట్ ఆటను కవిత్వంలోకి తీసుకొచ్చి నిద్రలేక 'ఎర్రబడ్డ కళ్ళు నులుముకుంటున్న ' వాళ్లు ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారు కదా!-అని నిట్టూర్పు విడుస్తాడు. 'కోపగిస్తాం గానీ/మనం నవ్వితే ఏడ్చే/ఏడిస్తే నవ్వే మనుషుల కంటే/అద్దం చాలా నయం కదూ!'-అని అంటున్న ఈ కవి తనే 'అద్దాన్ని బద్దలు చేయాలనిపిస్తుంది/ఒక్కరోజైనా/ఆప్యాయంగా పలకరించనందుకు'-అని విరుధ్ద భావాలతో చెబుతాడు.అద్దం ఎప్పుడూ వున్నది వున్నట్లే మాట్లాడుతుంది.హిపొక్రటిక్ గా వుండదు మనుషుల్లా.ఒక అద్భుత భావ సంచయాన్ని ఈ కవితలో కవి నిక్షిప్తం చేశాడు. 'ఒకప్పుడీ యవ్వనానికీ /అందాన్ని ఆరాధించటం / దినచర్యలో భాగమై వుండేది"-అనటం అప్పటి యువకుల మనస్తత్వాన్ని చిత్రిస్తాడు.'అందంగా తీర్చిదిద్దిన / తైల వర్ణ చిత్రం మీద / ఆకస్మికంగా యాసిడ్ పోస్తే "-అని అనటంలో ఈనాటి యువకులు ప్రేమ పేరుతో స్త్రీల మీద యాసిడ్ దాడులు చేసే సంఘటనను గుర్తుకు తెస్తాడు.'అల్లారు ముద్దుగానో ,అపురూపంగానో /చూసుకుంటున్నవన్నీ/ వొక్కొటొక్కటిగా కనుమరుగైపోవడమూ'-అని అనడంలో తల్లి దండ్రులు పోగొట్టుకున్న పిల్లల్ని ఙ్ఞప్తి చేస్తాడు. 'కానీ పచ్చగా ఎదిగిన పైరు మీద / వికృత కీటకాలన్నీ /మూకుమ్మడిగా దాడి చేస్తే '-అని అనటంలో అడకూతుర్లపైన లైంగిక దాడికి పాల్పడుతున్న వికృతత్వాన్ని స్ఫురణకు తెస్తాడు. ఇవన్నీ "ముకురం ముందు "అన్న కవితలో కవి వ్యక్తపరిచినవి.ఈ కవితలో ప్రతి పాదం కవిత్వమై పారాడింది."మంచు శిల్పంన్నించి /సౌందర్యంన్బొట్టు బొట్టుగా నేల రాలడం అసహజమేం కాదు"అని అంటున్న ఈ కవి "అంతా మన వేదనాజ్వలిత నిస్పృహే కాని అసలు పతనమయ్యేది సౌందర్యం కాదంటాడు.అద్దంలో ఎవరైనా కనీసం వారికి వారైన సమ్మోహనంగా కనిపించకపోరనే మనస్తత్వ శాస్త్ర అంశంతో ఈ కవిత చిత్రంగా ముగుస్తుంది.ఈ కవి శిల్పనిర్మాణ నేర్పుకు ముకురమే ఈ కవిత. "స్పీక్ ఇన్ ఇంగ్లీష్" "స్పీక్ ఇన్ ఇంగ్లీష్"-అనే ఏక వాక్యం ఒకే వాక్యం ఒకే వాక్యం కిటికీ కిటికీ కీ వేలాడుతున్న వాక్యం ఇవాళ చాలమందికి ముచ్చటైన వాక్యం తన గుండెలో బల్లెంలా ఎలా గుచ్చుకుందో ఆ చిన్న వాక్యం పాములా తన ఒంటిపై ఎలా పాకిందో చెబుతూ, మనల్నీ వాస్తవానికీ కల్పనకీ మధ్య నిలబెట్టి నిలదీస్తున్నట్టుగా అనిపించేటట్లు ఈ కవి రాసిన కవిత "ఏక వాక్యం".మాతృభాష పట్ల మమకారాన్ని పెంచే వాక్యం . చేతిలో చిల్లిగవ్వ వుంచుకోకుండా,ముఖంలో దిగులు వర్ణాల్ని చూపించకుండా త వారసత్వంపై విశ్వాసం వున్న నాయనమ్మను "అంతరం"-అనే కవితలోనూ,ఎన్నో మార్లు రూపం మారి మారి ఇవాళిలా మిగిలిపోయిన నాయనమ్మను "నానమ్మ కళ్ళ్ద్దాలు "అనే కవితలోను ఇంతవరకు మనం చూడని వైవిధ్యంతో చిత్రించాడు. బెలూన్ లతో అందమైన బొమ్మలు తయారు చేసే వారి జీవితాలు వారు తయారు చేసే గాలి బొమ్మల వలే ఆకలి చూపుల కిరణప్రసారాల ముందు పేలిపోతాయనే వేదనను "బొమ్మా-బొరుసు" లో చూపిస్తాడు.ఓ తడి ఆరని రాగాన్ని మనతో ఆలపింప చేస్తాడు. "నువ్వు వదిలివెళ్లిన లోకంలో నేనో ఒంటరిని,మూగ బాధని. ఈ రాత్రి ఈ నిముషం ఇప్పటికీ కాలిపోతున్న వాణ్ణి కరగి నీరౌతున్న మనిషిని " ఈ మాటలు తన దేవి స్మృతుల్లో ఈ కవి తడి ఆరని దుఃఖంతో మాట్లాడినవి.ఇపుడీ అక్షరాలనిండా ఆవిడా చిహ్నాలే.ఓ ఙ్ఞాపకాల పూలతోటే.ఒంటరిగా వెళ్ళటం అలవాటు లేని ఆవిడ "ఎవరికీ మాట మాత్రం చెప్పకుండా అర్థరాత్రి చీకటిలో అర్థాంతరంగా..వెళ్ళిపోతే కన్నీరు మున్నీరై తల్లడిల్లిపోయి రాసిన రాసిన వాక్యాలివి.రాసిన ప్రతి వాక్యంలో ఆమెనెంత అపూర్వంగా ప్రేమించాడో హృదయపు గూడులు కదిలేటట్లుగా ప్రతి కదలికలో ఓ పొందిక ప్రతి చర్యలో ప్రేమ ప్రబింబేచించేటట్లుగా చెప్పిన కవిత. "ఓ పాట నవుతాను,ఆగిపోతాను ఓ శిలనౌతాను,నడుస్తాను కఠిన సత్యంతో పోరాడుతాను,శాంతపడతాను జీవితాన్ని అర్ఠం చేసుకుంటానికి యత్నిస్తాను అయినా ,అశాంతి ద్వారం దగ్గర ఆగిపోతాను" ఎంతటి ఆవేదనాత్మక వాక్యాలో ఇవి అంత ఆలోచనాత్మక వాక్యాలు కూడా ఇవి. ఎంత దూరం నడిచినా,ఎంత కాలం గడిచినా ఆవిడా ఙ్ఞాపకాల పూదోటలో తానెప్పటికి తడి ఆరని రాగాన్నేఅంటున్న కృష్ణమోహన్ నిజంగా గొప్ప దేవీ ప్రేమికుడు.ఒక హృదయ దగ్ధ గీతం ఈ "తడి ఆరని రాగాన్ని "-అనే పద్యం. "నిత్యం దుఃఖపు కోణాలు స్పృశిస్తావు /నిరంతరం జీవన వేదాంతాలు జపిస్తావు '-అని అంటున్న కవి, ఇవాళ రాసే వస్తువు మారాలా? రూపం మారాలా? సారం మారాలా?-అని ప్రశ్నలు వేస్తున్నకవి , "కవిత్వ సింధువులో నేనొక బిందువు"-అని వినయంగా అంటున్న కవి ,"చుట్టూ వున్న చీకటి ఇంతగా వెక్కిరిస్తుంటే నేనొక మిణుగురునై చిన్న పద్యానికైనా శ్రీకారం చుట్టకుంటే ఎలా?"-అని తడి వాక్యాలు రాస్తున్న కవి మంత్రి కృష్ణ మోహన్. ఒక మంచి కవితా సంపుటిని అందించినందుకూ ఆ కవిని అభినంస్తున్నాను.ఉత్తమ కవిత్వం రాయాలనుకునే యువ కవి మిత్రులకు ఇలాంటి కవిత్వం విరివిగా చదవమని చెబుతూ...వచ్చే మంగళ వారం మళ్లీ కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2JivZ

Posted by Katta

Abd Wahed కవిత

ముళ్ళు (ఎన్నికల సందర్భంగా వినిపించిన విద్వేష ప్రసంగాలు ప్రేరణగా...) అన్నీ ముళ్ళే నమ్మకాలు, విశ్వాసాల ముళ్ళు గులాబీలపై కూడా ముళ్ళు పూస్తున్నాయి ప్రతి గుండెలో దిగబడుతున్నాయి... ప్రేమమొలకలు నేల ఒడిలోనే ప్రాణాలొదిలేస్తున్నాయి చురకత్తుల చినుకులు కురుస్తుంటే పండేది ముళ్ళపంటే... ఒకటి రెండు పాటల సెలయేర్లన్నా ప్రవహిస్తే బాగుండును ఊళ్ళో కాస్త మనిషి గాలి వీస్తే బాగుండును.. పూలతోట పెంచేదెవ్వరిప్పుడు? సువాసనలను పంచేదెవరు? ప్రతిచెట్టుపై నెత్తుటి ఆకులే కన్నీటి పూలెక్కడ? ఊరిలో అక్షరాలన్నీ చచ్చిపోతున్నాయి ప్రతి వీధిలో వాటి కళేబరాలే కనబడుతున్నాయి కత్తులపై చిరుగాలి తెగి వేలాడుతుంది... నల్లగాలికి ఉరికంబం ఊగుతుంది.. పాట వధ్యశిలపై ఊపిరి వదులుతుంది.. కరువొచ్చిపడింది. నోరెత్తే గొంతులకు కరువు... లేచే చేతులు చొక్కాజేబుల నుంచి మొలకెత్తడం లేదు చలనం లేని ప్రతిమలే అన్నీ ఇప్పుడు రాతిదెబ్బలు పడినా కదలవు మెదలవు... అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ముల్లు భయపడుతుందా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sjbpf3

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ మన ప్రణయం @ ప్రతి క్షణం నీ కన్నులతో మాట్లాడాలని తహతహ లాడే నా కళ్ళు. అనుక్షణం నీ రూపాన్ని ఊహించుకుంటూ జీవించే నా మనసు. ఎప్పటికి నీ చిరునవ్వుల సవ్వడి వింటూ ఆనందించే నా హృదయం . మధురంగా నీ పెదవులపై ఒక కావ్యాన్ని రాయాలనుకునే నా పెదాలు. ఒక్కసారిగా నువ్వు నా ఎదురుపడితే మైమరిచిపోవడం ఒక కొత్త వింత . అవును , ఇంత కాలం నా కన్నులు ఏ కన్నులతో మాట్లాడలేదు ఒక చూపుల ప్రశ్నలకు నా కళ్ళు బదులు పలకడం ఇదే తొలిసారి నిదురలో కళలు కనే కళ్ళకు మెలకువలో కలలు కనే ఊహల్ని నేర్పావు గుండె శబ్దం తప్ప ఏమి తెలియని నా జీవితాన్ని నీ చిరునవ్వుల అల్లర్లతో నింపేశావు ముచట్లే తెలియని నా పెదాలపై నీ పలకరింపులతో తీయని తడి కావ్యాలనే రాసేశావు. అందుకే మన ప్రణయం నిరంతర సుధా ప్రవాహం _కొత్త అనిల్ కుమార్. 17 / 6 / 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sjbn6R

Posted by Katta