పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మార్చి 2014, శుక్రవారం

Girija Nookala కవిత

పుట్ట గొడుగుల నీడ నిన్న లేవు.ఈరోజు ఎన్ని పుట్టు కొచ్చాయి! చెట్టుకో గొడుగు,పుట్టకో గొడుగు చెట్టు వీడిన గొడుగు,రంగు రంగుల గొడుగు పవన పవరు గొడుగు,కిరణ క్రీడల గొడుగు గొడుగు నీడ నిచ్చునని నమ్మి ఓటు వేస్తె ప్రజల ఆశలు అవును మొదలుకె డక్ ఔట్. విరిగిన ముక్కలు అతికే గారడి విద్యలు, సింగపూరు బైస్కొపును చూపే బడా నాయకులు ఉచితాలు,మాఫీలు పాస్ బుక్క్ లొ నగదు బదిలీలు మనది మనకే బిచ్చమిచ్చే మహా మేధావులు బిదవాడి చిరు ఆశ కూడు, గూడు, గుడ్డ ఆశల పల్లకిలో పంచవర్ష పైరవి పుబ్బలొ పుట్టి మఖలో మాయమయ్యే మాయదారి గొడుగులు రాజకీయం సినిమా చేసే బాక్స్ ఆఫిస్ హిట్టా దేశ ప్రగతిని అధోగతి పట్టించే మరో చిరు వినోదమా?

by Girija Nookalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1IF4V

Posted by Katta

Sateesh Namavarapu కవిత

***ఆత్మావలోకనం.*** నువ్వు పలకరించబోతే.. ఎదుటివారు దులపరించుకుంటే, నువ్వు ఆదరించగోరితే.. వారు చీదరించుకుంటే.. నీకు, వినసొంపుగా పలకరించడం రాక కాదేమో, వారి కంటగింపుగా..నీ వెనుక పరిస్థితులు కావచ్చు.! ఆత్మాభిమానం చంపుకొని,సహాయం కోరదలచినప్పుడు.. క్షోభతో నీ మనసు నలిగిపోవడం కనబడక కావచ్చు.! రోజువారీ వృత్తిలా అడుక్కునేవారికీ, సమస్యల వృత్తంలో ఇరుక్కున్న వారికీ.. తేడా గుర్తించలేక కావచ్చు..! తప్పని పరిస్థితిలో..తప్పని తెలిసినా, తిప్పలు తప్పవని హెచ్చరించిన మనసు చంపుకొని మరీ.. వారి మనసు అందనంత చేయి సాచావేమో ఎప్పుడైనా.. సాయం చెయ్యకున్నా.. అడిగిన పాపానికి అనర్హుల జాబితాలో చేరావేమో..? ..చేసినప్పుడు, ప్రతిఫలంగా నువ్వేమీ చేయలేనప్పుడు..లాభం లేదనుకున్నారేమో..?? అది సరేగానీ..ఇదే పరిస్థితి.. నీ వల్ల ఇంకెవరైనా అనుభవించారేమో.. నీ గుండె కోత సాక్షిగా.. మనసు లోతుల్లోకి తరచి చూసుకో ఓ సారి..!!..14MAR2014.

by Sateesh Namavarapufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1ICGe

Posted by Katta

Nirmalarani Thota కవిత

పెదాల పలుకులలో హృదయ స్పందనలను చిత్రాలేసి చూపుతుంటా . . నులిపడే మస్తిష్కపు భావనలను అర్ధం లేని అనువాదాల్లో కాగితాలపై ఆవిష్కరిస్తుంటా ! అంతరాళలోని ఉత్సాహపు వెల్లువకు చెలియలి కట్టలై . . తడిసి ఆరిన ధరణిలో నా ఇష్టాన్ని కురిసి వెలిసిన నింగిలో ఆర్ధ్రమైన మనసునూ ఉరిమి చెదిరిన మబ్బులో వేదననూ . . అక్షరాల రూపంలో చెక్కుతుంటా . . శూన్యాలను దాటి నక్షత్రాలను చేరలేని ఈ ఆంతర్యాలు తిరిగి నాకే వినిపించే ప్రతిధ్వనులైతే ఉన్మాదిలా జీవిస్తుంటా . . ! నిర్మలారాణి తోట [ తేది: 14.03.2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFsCHP

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || జీవితం|| ----------------------------------- నాలో ఎన్నో వర్ణాలు మనసు మాట వినదు ఊసరవెల్లి నా బంధువేమో! మనసు రంగులు మారుస్తోంది!! ఎగిరే పక్షిలా ఆలోచనలు గాలిపటంలా జీవితం ఊహలు రెక్కలు తెగిన పక్షులు జీవితం చిక్కుకున్న గాలిపటం గెలుపు గుర్రం పై స్వారి రోజు జీవిత సవారి పందెం లో నేను గెలుపు గుర్రానిదే పయనమే ఆశ్వమేధం నీడలు నా వెనుకే ఆ వెనుకే నేను రెంటి మధ్య జీవనం గెలుపోటముల పయనం ======= మార్చి 14/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFsCrk

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1IBSH

Posted by Katta

Sriramoju Haragopal కవిత

నువ్వే నా.......? ఇంత మనసైపోతావని అనుకోలేదు ఇంత మమతవై పేరుకుంటావనుకోలేదు ఇంత గుండె చిలికి వెన్నచేస్తావనుకోలేదు నన్ను ఇంత దయచూపి నా కన్నీళ్ళు అద్దుతావనుకోలేదు అసలు నువ్వెవరు? ఎప్పటి నావేదనలకవతల నీవా వుంది ఎప్పటి నాబాధలకంతం నీ తలపా మందు ఎప్పటి నా బతుకు నిండా నీదా కొంగుగొడుగు ఎప్పటి నా వెర్రిపాటల్లో నీదేనా నుడుగు అసలు నువ్వెవరు? నిన్ను చూడబోయే వెలుగుదే అందం నిన్ను ముడుపులుకట్టుకున్న కళ్ళదే వైభవం నిన్ను కలవరిస్తూ నిద్రబోయే రాత్రిదే ఆనందం నిన్ను పలవరించే గుండెదే సంతోషం అసలు నువ్వెవరు?

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFsBUv

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

---- చిరాశ // భాగ్యనగర౦ // ***************************** మాయానగర౦, మహానగర౦ కొ౦దరికే ఇది భాగ్యనగర౦ మరికొ౦దరిపాలిట దౌర్భాగ్యనగర౦ కొ౦దరి పాలిట ఆశలసౌధ౦ మరికొ౦దరి మదిలో ని౦పును ఖేద౦ కొ౦దరి పాలిట కామధేనువు మరికొ౦దరి్కేమో గోముఖవ్యాఘ్ర౦ కొ౦దరి పాలిట స్వర్గకవాట౦ మరికొ౦దరికేమో నరకపు కూప౦ ఒకవైపేమో తళుకుబెళుకుల తగరపు మెరుపులు మరువైపేమో కాలేకడుపుల దొమ్మరాటలు కొ౦దరికేమో మాతగ మారు మరికొ౦దరి పాలిట పూతనతీరు ****************************** ------ {14/03/2014}

by Chilakapati Rajashekerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1IBlC

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -----సినీ ఫ్యాన్స్ అమ్మ చుట్టమూ కాదు, అయ్య చుట్టమూ కాదు అభిమానం నరనరాన నిండినప్పుడు క్షీరాభిషేకాలతో,పుష్పాభిషేకాలతో తడిసి ముద్ధవుతుంటాయి నిలువెత్తు చిత్రపటాలు . ద్వంద్వార్ధ పదాలు ,అర్ధనగ్నాల కంపుని నింపుకుని తెరమీద పరుచుకున్న తొలిరోజు కొంతమందికి పండుగ రోజు . విగ్గు చెదరదు,చెమటచుక్క చిందదు వందల సంఖ్యలో రౌడీలు మట్టి కరుస్తారు జిమ్మిక్కులతో ఫైటింగులు చేస్తూ . ఒక్క విజిల్ వేస్తే వంద సూమోలు గాల్లోలేస్తాయి మన రోమాలు నిక్కబోడుస్తూ చిటికెనవేలు చిటికేస్తే దైనమెట్లు ధద్ధరిల్లుతాయి . వొంట్లో రక్తాన్ని ఉడికిస్తూ . ఒక్క అభివాదం చాలు అభిమానం కట్టలు తెచ్చుకోటానికి ఆవేశం హద్దులు దాటటానికి నువ్వెవరో అసలు తెలుసో లేదో వాళ్లకి. ఇంటికో పోస్టర్ ,వీధికో అభిమానసంగం తారలకు సమస్యలు తెస్తూ వారానికొకరి తలరాతలు మారుస్తూ . తెరమీద తోలుబొమ్మలే వారు కనుసైగ చేస్తే అవుతున్నారు కీలుబొమ్మలు. గుర్తుందో లేదో కన్నోళ్ళ బాగోగులు తారల జన్మదినాలు .. పర్వదినాలు తరించిపోతారు చేస్తూ రక్తదానాలు . చలిమర గదుల్లో సుఖ సంతోషాలతో, నోట్లతో ,కోట్లతో వారు ఎండా ,వానా లెక్కచేయక టిక్కెట్ల కోసం కుస్తీ పడుతూ గాల్లో కలసిపోయే ప్రాణాలు కొన్ని ! (14-03-2014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1IAy4

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

శ్రీ శ్రీ -" ప్రజ "- గ్రంధం నుండి మరికొన్ని ..... ----------------------------------------- 11. మీరు నిర్దేశించిన మరో ప్రప్రంచం స్వరూపం ఏమిటి ? * నిర్దేశించలేదు. ఇమజిన్ చేశాను. అప్పటికింకా నాకు రష్యావిప్లవం కూడా తెలిదు.సాహిత్యకారుల్లోంచి-ఫర్ ఇన్ స్టేన్స్ (గురజాడ గేయాలు, ఫ్రెంచి సింబలిస్టులు , ఫ్రెడరిక్ డెలిస్( వీళ్ళు కొంచెం ముందుకు పోయి చూశారు). అలాగే కవిత్వం ద్వారా నేను మరోప్రపంచం చూశాను. అదే సామ్యవాద ప్రపంచమని అప్పటికి తెలీదు.ఒక విధమైన సాంఘీకన్యాయమ్ లభించాలని, అన్యాయం ,అధర్మం,పోవాలని కోరుకున్నాను. ఈనాడు అదే మరింత స్పష్టంగా రష్యా, చైనా, క్యూబా దేశాల్లో కనిపిస్తోంది. నేను భావించిన మరో ప్రపంచం అదే. 12.మీలోని "నేను" గురించి (కవిత్వంలో) సాధ్యమైనంత వివరంగా చెప్పండి.? * చాలావరకు నా దృక్పధం నుంచే రాశాను. సబ్జెక్టివ్ పోయెట్రియే ఎక్కువ.ఆబ్జెక్టివ్గా రాసిన 'వెర్రివాడా కుర్రవాడా' , 'బిక్షువర్శీయసి ''లాంటివి తప్ప. ' నేను సైతం' కూడా సబ్జెక్టివ్ గా రాసినదే. 13. మీరు ఎన్నడూ మరిచిపోలేని , మీ మీద శాశ్వత ప్రభావం కలిగించిన గ్రంధాలేవి ? * ఒకటి యూలిసిస్( జేమ్స్ జాయిస్ రచన ), ఇంకొకటి లెనిన్ ( మయకొవస్కీ రచన ), మరొకటి కూడా చెప్పాలంటే గురజాడ వారి సమస్త సాహిత్యం. 14. కళ ప్రజల కోసమా ? విప్లవం కోసమా ? * ఈ రెంటికి వైరుద్యం లేదు. విప్లవ సాధనకు కళఒక ఆయుధంగా ఉపయోగపడాలి . అప్పుడే అది ప్రజాకళ అవుతుంది. కళాకారుడు విప్లవసాధన కోసం జరిగే మహోద్యమానికి తన కళను అంకితం చెయ్యాలి . అందుకోసమే దానిని వినియోగించాలి. అప్పుడే అది నిజమైన కళ అవుతుంది. 15.మీ రచనల్లో ఉత్తమంగా భావించే కవిత ఒకటి చెప్తారా ? * " కవితా ఓ కవితా! " కి ప్రథమస్థానం ఇస్తాను. అంటే మిగిలినవి నచ్చవని కాదు.జగన్నాథరథచక్రాలు, దేశచరిత్రలు ఇట్లా నాకు నచ్చినవి ఉన్నాయి. 16. మీరోసారి ధ్వనికవిత్వం కమ్యూనిజంలోనే సాధ్యం అన్నారు. వివరిస్తారా? * ధ్వని - కమ్యూనిజాన్ని ధ్వనిస్తేనే ధ్వనికవిత్వం అన్నాను. ఆనంద వర్దనాచార్యులేమన్నారంటే -వ్యంగ్యార్థం ఓటివుందనీ , కవి చెప్పిన దానికంటే గూడా అందులోంచి మనకి అవగాహన అయేటటు వంటిదే ధ్వని అంటారు.' రీతి ఆత్మస్యకావ్యం' అని ఒకడన్నాడు. ఇట్లాగ - ఔచిత్యం ముఖ్యమని క్షేమేంద్రుడు (11 వ శతాబ్దం -అభినవగుప్తుని శిష్య్డుడు.అలంకారికుడు ) రసచర్చ చేయడంలో ఎందఱో సంస్కృత అలంకారికులు చెప్పారు. వీటన్నిటిలోకి ధ్వనిమతం గొప్పది అంటారు. ధ్వని ఆంటే కవి చెప్పిన డానికంటే కూడా పాఠకుడు పీల్చుకునెదే గొప్పకవిత్వం.ధ్వని ప్రధానమైనదే కావ్యం అన్నారు. అలాగే మన రచనల్లో కమ్యునిజం ధ్వనిస్తేనే అది ధ్వని అని నేనన్నాను. 17.మీకు కవిత్వం రాయాలనే కోరిక ఎప్పుడు పుట్టింది? ఎందుకు పుట్టింది? * నాకు అక్షరాభ్యాసం జరగక ముందే మూడునాలుగేళ్ళ వయసులో చిత్రకారుడిగా నా ఆర్టిస్టిక్ జీవితం ప్రారంభమైంది .ఒక కుడ్య చిత్రకారుడిగా (mural painter) రంగు సుద్దలతో మా మేడ మీద గోడలనిండా బొమ్మలు గీసేవాణ్ణి. నాలో కళపై అభిరుచి ఆవిధంగా ప్రారంభమైంది. 18.1928 లో ' ప్రభవ' రాసేనాటి మీ మానసిక స్థితి ఏమిటి ? * నా 18 ఏట నేను ' ప్రభవ ' రాశాను. ఆ రోజులలో నాకు నా చుట్టూఒక సమాజముందన్నస్పృహ కూడా లేదు.నేను, నా బూర్జువా sorroundings మాత్రమే నాకు కనిపించాయి.అయినా మానసికంగా art for art's sake (కళ కోసమే కళ) వ్యక్తిని. అప్పటికి మాకు ఆస్తిపాస్తులుండేవి. భాధ్యతలెవీ ఉండేవి కావు. అందుకే సమాజాన్ని పట్టించుకునే అవసరం లేకపోయింది. 19. ' మహాప్రస్థానం ' మొదలైన అప్పటి మీ గీతాలకు నేపధ్యం గురించి , అంటే ఈ రకమైన స్పృహ మీలో కలగడానికి కారణమైన పరిస్థితుల గురించి వివరిస్తారా? * నేను 1928 లో కాలేజి చదువులకోసం విశాఖపట్నం నుండి మద్రాసు వెళ్ళాను. మా ఆర్థిక పరిస్థితులు దిగజారడం కూడాఅప్పటినుండీనే ప్రారంభమైంది. ప్రపంచమంతటా ఆకలిదప్పుల హాహా కారాలు వినిపిస్తున్నాయి . 1930 దశాభ్దాన్ని ఆకటి దశాబ్ధం (hungry thirties ) అంటారు. ఈ అన్నిటి ప్రభావ పలితంగానే ' మహాప్రస్తాన ' గేయాలు వచ్చాయి.అంటే , కుటుంబ ఆర్థిక పరిస్థితి, హంగ్రీ థర్టీస్ , నాకు అప్పుడు చదువుకోవడానికి లభ్యమైన సాహిత్యం , నిరుద్యోగ పట్టభద్రుడిగా వున్న చోట ఉండకుండా తిరిగిన తిరుగుడు నాలో సామాజిక స్పృహ కలిగించాయి. 20. యువకవులు, రచయితలకు మీ సందేశం ? * రచన అనేది ఒక కరదీపిక. అది ఎప్పుడూ వెలుగుతూ ఉండేటట్లు చూడాలి . దాని కాంతిని అది నలువైపులకు ప్రసరిస్తూ ఉండాలి. 14- 03 2014.

by దాసరాజు రామారావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFszvN

Posted by Katta

Chi Chi కవిత

_GooD_ నిజమైన ప్రేమ ఎంత నీచమైందంటే వావి వరసల్లేవ్, తన మన లేవ్ శారీరక , మానసిక , లింగ విభేదాల్లేవ్ అడ్డు ఆపుల్లేవ్ , బొడ్డు బంధాల్లేవ్!! పుట్టక ముందైనా , చచ్చిన తరవాతైనా దూరమే లేని వాటి మధ్యలో మెదిలే బండ బతుకైనా నిజమే ప్రేమ నిజమే!! సవరణ పెడతావా తల్లని , చెల్లని , తండ్రని ,తమ్ముడని ఆలని , అక్కని , మగడని , ముండని , మనిషని!! అడ్డాల మధ్యలో అంగాలను అదుపుకుని అడుక్కుతినే మనసు అందర్నీ ప్రేమిస్తే మనసుకి మనసు పుట్టదు శరీరాలకి శరీరాలు పుట్టినట్టు!! ఆత్మని , ఆక్కూర కట్టని అడ్డమైన కూతలు కూసుకుంటూ మనసిస్తా , మట్టిస్తా , మూడొస్తే ముద్దిస్తా అంటూ రసాల రంజుకి రంగులేసి రంకు , జంకు లేకుండా రోడ్డుమీద పొయ్యే ప్రతొక్కరికి ప్రేమను పెదాలతోనో , కుదిరితే పబ్లిక్ గానే భావప్రాప్తుల మేళం మోగించాలనో ఉవ్విళ్ళూరే నిజమైన మనసుకి దాని ప్రేమకి ఒక్కటే చిక్కు మానసిక ప్రక్రియలు వేరు , శారీరక ప్రక్రియలు వేరు కోరికల పొట్ట మండితే ప్రకృతిని తిట్టుకో అందులోని పురుషుడినో , స్త్రీనో , ఇంకేవో రకాలనో అనటానికి నువ్వేమి ప్రకృతమ్మా మొగుడివి/పెళ్లానివి/తల్లి/తండ్రి/whateverవి కావు!! సరే నీచమైనది కాదు ప్రేమ!! పవిత్రమైనది !! ఎంత పవిత్రమంటే నువ్వు ప్రేమించిన స్త్రీ/పురుషుడు/రకాలు ఎంతమందితో పడుకుని దొల్లినా అలానే నువ్వెంతమందితో ప్రేమలో పడి పడుకుని దొల్లినా తుడుచుకున్నా , తుడుచుకోకపోయినా పట్టించుకోని పరమానుభూతే ప్రేమ!! ఏ జీవజాతైతేనేమి , దేని శవమైనానేమి నీ ప్రేమపాత్రపోషణకు భౌతికమంతా అర్హమే!! మానసికమేముంది మన బూడిద మనమున్నంతవరకు ముష్టెత్తుకుంటుంది!!మనం పొయ్యాక మూస్కుంటుంది మనసుపడిoదల్లా మనసుదే కానీ మనది కాదు!!_____Chi Chi (14/3/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFszvC

Posted by Katta

Maddali Srinivas కవిత

యతొధర్మస్తతో జయహ్!//శ్రీనివాస్//14/03/2014 ------------------------ --------------------------- నన్నొడ్డి తానోడెనో తానోడి నన్నొడ్డెనో? ధర్మ సందేహానికి నాటి కౌరవ సభ మూగవోయింది 371 ముందా? రాష్ట్ర విభజన ముందా? సభ తీర్చని ధర్మ సందేహానికి రాజ్యాంగ ధర్మాసనం బదులిస్తుంది నేడో రేపో స్వార్ధపరులు,తమ లక్ష్యాల కోసం నీచ మార్గాలనుసరిస్తే ప్రశ్నించే గొంతులు మూగబోవచ్చు కానీ ,ధర్మం తన ధర్మం తప్పదెన్నడూ నాటి ధర్మక్షేత్రం రణక్షేత్రమై కడకు శ్మశానమైనా ధర్మమే నెగ్గింది నేడు అదే పునరావృతమవుతుంది ఫైనల్సింకా మిగిలే వుంది ముసళ్ల పండక్కి తొందరేముంది? పరుగులో గెలిచిన షైనీ అబ్రహాం గీత దాటి అనర్హురాలు కాలేదా? లక్ష్మణ రేఖను దాటి మొద్దుల సభ చేసిన చట్టం కాదెన్నడు న్యాయ స్తానానికి చుట్టం ధర్మ స్తానంలో తప్పదు మీకు పరాజయం! యతో ధర్మహ్ తతో జయహ్

by Maddali Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFszfb

Posted by Katta

Kapila Ramkumar కవిత

రచన: పద్మాశ్రీరామ్ అంతులేని మృగవాంఛలిలానే కొనసాగితే గుళ్లో దేవతల విగ్రహాలు సైతం భయంతో పరుగెత్తే కాలమొకటి వస్తుందని, మృత్యుదేవత సైతం భీతిల్లి జెండర్ మార్చేసుకోవలసి వస్తుందని, మగపిల్లలకు జన్మనీయడానికే అమ్మతనం భయపడే దౌర్భాగ్యం సమాజాన్ని ఆవరిస్తుందంటూ రౌద్ర స్వరం వినిపిస్తున్నారు పద్మాశ్రీరామ్ గారు. ఒక మహాబలి ఆడతనాన్ని గొడ్డలి చేసి మదాంధుల తలలు నరికే పరశురాము డయ్యేందుకు కాలం కలిసి రావాలిగా అంటూ అశావాదాన్ని కూడా వినిపిస్తున్నారు. కడగండ్ల ఆడకూతుళ్ళ కన్నీళ్ళు మోస్తూ.. కాకుల లెక్కలేస్తూ... అంతవరకూ ఎదురు చూద్దాం... అంటూ శక్తివంతంగా కవిత్వ రూపంలో సామాజిక దౌష్ట్యం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 'ప్రతిరాత్రీ సమాజానికి ఒక మత్తుగా రానీ యుగాంతం..' అంటూ మహిళకు మాత్రమే సాధ్యమయ్యే శాపాన్ని పెడుతున్నారీమె. 'ఆడతనాన్నే గొడ్డలిగా చేసే మహాబలి...' ఇటీవలి కవిత్వంలో అతి గొప్ప పద ప్రయోగమిది. ఆమె ధర్మాగ్రహం పట్ల సహానుభూతి ప్రకటిస్తూ.. ఈ శక్తివంతమైన కవితను అందరమూ ఆస్వాదిద్దాం.. పోనీ....అంతులేని మృగాలవాంఛలిలానే కొనసాగనీ అప్పుడిక గుళ్ళో దేవతల విగ్రహాలు సైతం భయంతో పరుగెత్తనీ మృత్యుదేవతా నువ్వు సైతం భీతిల్లి జెండర్ మార్చేసుకో వారికడకు పోతే నీ శీలానికి సైతం రక్షణ ఉండదని... అమ్మతనమా మగపిల్లలకు జన్మనీయకే ఆడజన్మనెత్తడానికి సమాజమా అనుమతినీయకే సాగనీ ఈ దురన్యాయం మానవతకు మాయని మచ్చగా రానీ యుగాంతం ప్రతిరాత్రీ సమాజానికి ఒక మత్తుగా ఉపన్యాసాలివ్వనీ ప్రభుత్వాలను ప్రతిరోజూ కొత్తగా జీవో లు జారీ చెయ్యనీ చెత్తబుట్టలు నింపే దిశగా... మారద్దు మనం .... తల్లినీ చెల్లినీ పరాయోళ్ళలో చూడొద్దు... పరాయి ఆడోళ్ళనే తల్లిలో చెల్లిలో చూద్దాం... మనది ప్రజాస్వామ్యం... వావివరసలకు సైతం మనం దూరం... రావాలిగా ఒక మహాబలి ఆడతనాన్ని గొడ్డలి చేసి మదాంధుల తలలు నరికే పరశురాముడయ్యేందుకు... అంతవరకూ ఎదురు చూద్దాం...కాకుల లెక్కలేస్తూ... కడగండ్ల ఆడకూతుళ్ళ కన్నీళ్ళు మోస్తూ...http://ift.tt/1o1Ix5h

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1Ix5h

Posted by Katta

కాశి రాజు కవిత

కాశి రాజు ||ఒరిమూన|| ఆ గరుకుగెడ్డాన్ని గీసిన తుప్పట్టేసిన బ్లేడుతో బొడ్డుకోసాక నెప్పిలేకున్నా ఏడ్చానట, నాకప్పుడు తెలుసేమో గడవక ఆరో నెలలో దమ్ముచేలో అమ్మ నాటిన ఒరిమూన ములిగిపోయింది మాయమ్మ దుఖంలోనని. కడుపులో ఉన్న నేను కరువురోజోల్లో పెరుగుతానో లేదోనని గర్భగుడిలో గుప్పిల్లు మూసుకుని కళ్ళు తెరవని నాకు కన్నీల్లే పట్టినట్టుంది నా పేగుకు ముడేసుకున్న మాయనిండా, ఆ దమ్ముచేలో ఉన్న మాయమ్మ కన్నీళ్లు అవునిప్పుడు ఏడుస్తాను అన్నాన్ని, అమ్మనీ గుర్తు తెచ్చుకుని ఎవరైనా ఆప్యాయంగా వొండెట్టిన ముద్దను చుడుతున్నపుడు భూమి బ్రమిస్తున్నట్టు ఉంటాది నాకు. ఒరేయ్ వింటున్నవాడా ! నేను రాసేదానికి నీ లెక్కలు నీవి కావొచ్చు అన్నం నాకు ముఖ్యం కాదు, అమ్మల ముందు చేయికడిగి, ఒంటరి కాలాల్లో వొచ్చేటి దుఖం నాకు ప్రశాంతత. అపుడు రాసే కవిత్వమైతే కన్నీళ్లలో తేలెళ్లిపోయే కాగిత్తప్పడవ. విమర్శించకు వదిలేయ్ దుఖం లాంటి నీటిలో పెరిగే ఒరిమూన బతుకు నాది. (భరించలేని ఆ వెకిలి నవ్వుకి )

by కాశి రాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oTbgI7

Posted by Katta

Sravanthi Itharaju కవిత

శ్రీ స్వామి వారి తెప్పోత్సవాల సందర్భంగా.. సౌగంధిక జాజరలు "త్వరపడవో మనసా".... త్వరపడవో మనసా.. ఉత్తరాన స్వామి కొండ వెలుగు జిలుగుల నిండె.. బాల భాను కిరణాలు అల హారతులై నిండుకుండె పూబాలల తోరణాలు తోమాలలై స్వామి యెదన నిండె స్వామిగ్రహ తీర్థ జలాలు స్వామిని అభిషేకింప పన్నీటి సువాసనల నిండె ధద్యోజనాది షడ్రసోపేతాలు నైవేద్యాలుగా మారె మట్టిపిడతలు తాము జన్మసాఫల్యమునొందె ప్రకృతి సహస్రాక్షియైస్వామికి స్వాగతము పలికె పుష్కరిణీ నీరాలు నిజ నిక్క నీలాలుగా మారె ఈ సంసారపు ఈతిబాధల గట్టునపెట్టి వడి వడిగా చేరవె శ్రీ పురిని ఏడుకొండలెక్కి సాయం సంధ్య వేళ సందె చీకటి ముసురు వేళ కోటికాంతులతో రుక్మిణీ రమణుడై విహరించు కోనేటిరాయుడు సర్వాలంకృత సంపెగపూ తెప్పలపై తిరుగెదడు శ్రీపతి మన తిప్పల తప్పింప.. తిరుమల పై తిరుమలేశుడై మన మలయప్ప ..

by Sravanthi Itharajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oTbfnt

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| కావ్యములు || \\ మధుకలశము \\ రాయప్రోలు సుబ్బారావు ఈ కావ్యము ఫారసీక భాషలో తొలుత రచింపబడెను. రచించిన మహాకవి పేరు ఉమర్‌ అని ప్రసిద్ధిలోనికి వచ్చెను. 11 వ శతాబ్దము ఉత్తరార్ధములో జననము. 1123లో అస్తమయము. కులవృత్తి గుడారములు తయారుచేయడము. అయినా ఉమరు ఉజ్జ్వల బుద్ధి, చదివి శాస్త్రములోను, గణితశాస్త్రమందును స్నాతకుడాయెను. ప్రామాణిక మయిన వర్ణగణితమును వ్రాసెను. జ్యోతిశ్శాస్త్ర సంబంధమయిన గ్రహచార నిర్ణయములు, గుణించి ప్రకటించెను. తత్త్వాన్వేషణ సాగించెను. అంతరములలో అప్పుడప్పుడు రచించిన పద్యములు ఖయ్యాము అనుపేర ప్రచారమునకు వచ్చెను. వీనిని ఇంగ్లీషులో ఫిట్‌జిరాల్డు అను ఆంగ్లకవి అనువదించెను. ఆ అనువాదమూలముగా ఉమరు కావ్యప్రతీతియు, అందలి మూలసార చర్చయు బహుముఖముల ప్రసరించి, ఖ్యాతికి వచ్చినవి. దానికి అనువాదమిది. ఖయ్యామును గుఱించి పూర్వాపరవాదములను తఱచి ఒక ఆంగ్లసారస్వతవేత్త ఇలాతేల్చి వ్రాసెను. Its grim philosophy scarcely matters. The cynicism may be persistent; the mood may be a desperate sort of thing at the bottom of all thinking men's minds. But the tune is so gay that even its pessimism seems blithe. The quick but melodious turns of the poem tease us out of the thought. We may argue about the meaning, but we are indisputably compelled and even convinced by its music. ఇందులో ఇమిడియున్న అబోధవేదాంతమును అలావుండనీ! ప్రసక్తమయ్యే నిర్వేదము పట్టువదలకపోనీ! ఇంకా - తత్త్వజిజ్ఞాసువుల కందఱికీ చిత్తవృత్తి అడుగున కదలుచుండే అవేక్షణ కూడా నిలవనీ! అయినా - ఖయ్యాము పద్యాలలో పల్లవించే అనాసక్తరాగములో అనిర్వేదముకూడా చవులు తేరుతున్నది. రచనలో అనాలసంగా ప్రసరించే మధురభంగిమలు అందలి మీమాంసా భారమును బలవంతంగా ఆవలకు లాగివేస్తున్నవి. ఇందున్న అర్థమేమిటని మనము వివాదపడవచ్చును; కాని కావ్యములోనున్న మాధుర్యము మనను నచ్చించకమానదు. ________________________________________ Dr. C.R. Reddy, Vice Chancellor, Andhra University, Waltair, 16-8-1940. I have been reading the Jubilee Edition of your works which you were so good as to present me at Hyderabad. They are a marvel of our literature, so fresh, powerful and impressive. Your contributions to Telugu will live - live long and charming, a perennial source of joy and inspiration. Keep up. Dr. C.R. Reddy, Vice Chancellor, Andhra University Waltair, 6-9-1940. I forgot in my last letter to add a special word of praise on your translation of Omar Khayyam into Telugu. It reads well and reproduces the Fitgeraldian spirit in no small measure. Considering how difficult it is to translate a piece as cauched in symbols and allegorical language, you have done exceedingly well.________________________________________ మధుకలశము Awake! for Morning in the Bowl of Night Has flung the Stone that puts the Stars to Flight: And Lo! the Hunter of the East has caught The Sultan’s Turret in a Noose of Light. లెమ్ము! నిశాకమండలుతలిన్‌ పడగా విసరెన్‌ ప్రభాత మం దమ్ములదిఙ్మణి\న్‌ చకితతారక లావల బాఱ, కాంతిసూ త్రమ్ములయుచ్చు లొడ్డెను సుతారపు తూరుపువేటకాడు ర మ్యమ్మగు పాదుషాకనకహర్మ్యశిఖాకలశాలిచుట్టునన్‌. 1 .........సశేషం .......14.3.2014

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PzWVGj

Posted by Katta

Panasakarla Prakash కవిత

మీరూ నేను ఆకలిగా ఉ౦ది మనసుకి నా పక్కనే కూర్చుని నాలుగు మాటల మెతుకులు పెట్టేవారు లేక......... దాహ౦గా ఉ౦ది గు౦డెకు ఆత్మీయమైన చేతి స్పర్శతో రోజుకొకసారైనా నా గు౦డె తలుపులు తట్టే వారు లేక...... వెలుతురు తగలడమేలేదు కళ్ళకి మసకబారిన నా గతాన్ని నాలుగు గోడల మధ్యను౦చి బైటికి తీసుకొచ్చేవారులేక‌ చలన౦ లేదు కాళ్ళకి ఇ౦తమ౦దిని మోసీ మోసీ మూలన పడ్డ౦దుకు మొక్కే దిక్కు లేక... రోజూ అద్ద౦లో ఏ౦ చూసుకు౦టారు ఒక్కసారైనా నా మొహ౦లోకి చూడ౦డ్రా వెలిగే మీ రూపాలకోస౦....... పాడుబడ్డ గుడినని అశ్రద్ద చేయక౦డి.. విగ్రహ౦ ఉన్నన్నాళ్ళైనా కొ౦చె౦ నైవేద్య౦ పెట్ట౦డర్రా.... మహాఐతే ఎన్ని రోజులు ఈ ముసలి దీప౦లో చమురు ఇ౦కిపోయేదాకా.......అ౦తేకదా..! వయసులో ఉన్నా‍౦కదాని నా మాట వినకు‍‍‍‍‍‍‍‍‍౦డావిర్రవీగుతున్నారా? జాగ్రత్తరోయ్.... ఎ౦దుక౦టే........నేను చచ్చినా మీ వయసుకి రాలేనుకానీ....... మీరు చచ్చినట్టు నా వయసుకి రావాల్సి౦దే..... పనసకర్ల‌ 14/03/2014

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OaLnbz

Posted by Katta

Jagaddhatri Dhaathri Jagathi కవిత

||జగద్ధాత్రి|| కలరాహిత్యం|| కలలు కనడం రాలేదు నాకు ఎందుకో మరి....... ఆశలు నిండిన ఊహలు పండాలనే కలలు నా కనుల గుమ్మానికి ఎప్పుడూ అపరిచితలే కలరవాలు కలవరాలు ఎరుగనిది నా కనుదోయి అనుభవాలు అనుభూతులై ఎదురైనప్పుడు వాటిని ఆస్వాదించడమే కానీ రంగుల కలలుగా అవి నాకు ముందరే అగుపించిన వైనమైతే లేదు గాలిలో మేడలు కడుతూ ఆకాశం లో విహరించే రంగురంగుల విహంగాల స్వప్నాలు ఎన్నడూ మరి నా హృదయ వృక్షం పై వాలలేదెందుచేతో ..... ఎప్పటికప్పుడు జీవితం ఆవిష్కరించే సరి కొత్త ఆనంద విషాదాలను యధాతధంగా స్వీకరించడమే తప్ప కల గన్నది లేదు ..... ఊహల్లో తేలలేదు ఎన్నడూ బతుకు సంద్రానికి కల దీపం అగుపడలేదు ఆశల హర్మ్యాలూ కట్టలేదు ఎప్పుడూ అప్పుడప్పుడూ వేదనా భయాలు పీడ కలలై వేధించిన మాట వాస్తవమే కానీ సప్తవర్ణ స్వప్నాలు కనికరించింది లేదు నా కనులను అందరిలా నేను ఉండలేక పోవడం రంగుల కలలు కనలేక పోవడం ఏమన్నా లోపమా నాలో అని భయమేస్తుంది ఒకోసారి కన్న కలలు వెతలై బతుకు భంగపడిన వారిని చూసినపుడు కలలు కనలేని నా అశక్తత నాకు అపురూపమైన శక్తిగా అవుపిస్తుంది అపరిమితమైన అవాస్తవికమైన అభూత కల్పనా జగత్తులోనికి నాకు ప్రవేశం లేనందుకు ఆనందం కలుగుతుంది తెలి మబ్బులలో తేలి పోతూ ఆధాటున భూమి మీదకి రాలి పడటం కలకీ వాస్తవానికీ అనుసంధానం కుదరక రాజీ పడలేక ... గాఢమైన అసంతృప్తితో పరితపించే ప్రహసనం నా జీవితంలో లేనందుకు ... కలల బరువును నా కనుపాపలు మోయాల్సిన అగత్యం తప్పినందుకు ఆనందంగా కలల మాంత్రికుల పాల పడకుండా బతుకు కావడిని మోసుకుంటూ వాస్తవం లోనే ...వాస్తవంగానే .... కష్ట సుఖాలను అనుభూతిస్తూనే ... అప్పుడప్పుడూ జీవిస్తూ ....ఎప్పుడూ బతికేస్తూ ..... !!! ........................................................జగద్ధాత్రి 3.04 పి ఏం 14/3/2014 శుక్రవారం

by Jagaddhatri Dhaathri Jagathifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oT0mSC

Posted by Katta

Vinjamuri Venkata Apparao కవిత

కీ.శే.గాడేపల్లి కుక్కుటేశ్వరరావుగారు.... విషయము: ఆంధ్రకవులు, వారిని ఉచితరీతిని సత్కరించిన మహారాజులు నన్నయభట్టు లేకున్నచో రాజరాజనరేంద్రుకీర్తి కృష్ణార్పణమ్ము, తిక్కయజ్వయలేక తెలుగున మనుమసిద్ధినృపాలుపేరు సోదెకునురాదు, శ్రీనాధకవిరాజులేక వీరారెడ్డి,అవచితిప్పయ్య,విస్సన్న సున్న, అలసానివారులేరా,కృష్ణరాయలప్రతిభకు కపిలదస్త్రాలె దిక్కు, చచ్చి,దుమ్మైననృపతుల చావనీక దుమ్ముపైనిన్ని యమృతబిందువులు చల్లి తిరిగి బ్రదుకిచ్చి జగతి సుస్థిరులజేసె సుకవియను మేటియైంద్రజాలికుడొకండు

by Vinjamuri Venkata Apparaofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hi5OeY

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghp0qY

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//చక్రం-14// సాలెగూడు మధ్యలో తూనిగ ట్రాఫిక్ కానిస్టేబులు రన్నింగ్ బస్సు చడో ఉతరో బస్సు స్టాపు అక్కడే సారూ సారూ సిటీలో పలకరింపులు అన్నలంతా అడవిలో రోడ్డు మద్యలో ఫ్లైఓవరు ఫుట్పాత్ మీద పక్కావ్యాపారం వాలెట్ పార్కింగ్ దేశంలో మాదే మొదటిస్థానం ఒకేలాంటి బోర్డులు ఐదు కార్పొరేట్ కాలేజీలు గుడ్డలిప్పుకొన్న హీరోయిన్ సినిమా పోస్టర్ చూసావో యాక్సిడెంట్ ఇరానీ చాయ్ హైదరబాద్ బిర్యానీ అంతేనా పాత బస్తీ గల్లీలూ చూడు ఒకప్పటి నగరం ఇప్పుడొక ఎడారి దేశం నీళ్లు మొక్కలు లేవిక్కడ....11.03.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PzxoNA

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

నీ కోసమే! మంచు బిందువు చేతులు చాచింది మట్టిలోపలికి వెళ్లిన వట్టివేరు సైతం చేతులు చాచింది ఆకుపచ్చని గడ్డిపరకై మహావృక్షాలలోని ప్రాణశక్తి నీ కోసం పత్రం, పుష్పం, ఫలం చాచాయి భూగోళ అండం మధ్య సొనగా విస్తరించిన అదృశ్య జలమైదానంలో బహుశ నీ తరంగ నాదాలే వేర్లుగా భూతలం మీది శబ్దాలు చేతులు చాచాయి మహా శూన్యంలోని మెత్తటి పొత్తిళ్లలో ఒత్తిగిలి ఉత్తర దక్షిణాల మధ్య ప్రాక్‍ పశ్చిమాల మధ్య తూగే నీ ఉయ్యాలలో ఊగుతూనే నీ ఉయ్యాలను ఊపడానికి మంచు బిందువు చేతులు చాచింది మెత్తటి మేఘమై పోయి వట్టివేరు చేతులు చాచింది ఆకుపచ్చని గడ్డి పరకై చేతులు చాచింది విశ్వజనని తొలిఆనందాశృవు నీ ఊయలై వసీరా

by Vakkalanka Vaseerafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghp0an

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dXUV2Y

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Rddy || జ్ఞాపకాలు రక్త దీపార్చనలు చేసుకొంటున్నాయి || జ్ఞాపకం మనిషి కథని తనలోనే దాచుకొని నిజం నిర్జీవమై మౌనం దాల్చి పునర్జీవనమే తెలీని దాని మల్లే తనలో తానే ఒదిగిపోతోంది మనిద్దరిజ్ఞాపకాలు రక్త దీపార్చనల జాతర జరుపుకుంకుంటున్నాయి . కంటీకి కనిపించని దారుణాలు కటిక చీకట్లో జరిగిపోతున్నాయి నీవు ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నా చెప్పాలిసినవాల్లు చెప్పుకొంటూ గుస గుస లాడుకుంటూనే ఉన్నారు నీకు తెలియకుండా నమ్మక ద్రోహం జరిగిపోతూనే ఉంది నీవు గుడ్డీగా నమ్ముతూనే ఉన్నావు ఇది నింగికి ,నేలకు ఇప్పటిది కాదు వైరం ఆత్మ మాయని జార విడిచినప్పటి నుండి .. నిజంస్వాపికుడి దేహాన్ని వదలి ఆత్మ అర్ధంతరంగా వెళ్లి పోతుంది ఎవ్వరూ చూడకూడదనేమో కదూ మట్టిలో మమతలు మయమై పోయి మరణం లోకి ఎగిరి పోతున్నాయి కలలన్నీ దుఖం తో నిండి పోయి దూరంగ జ్ఞాపకాలను విసిరేస్తున్నాయి ఓ నిజాన్ని గర్భం చీకట్లలో దాచుకుంటుంది … గొంతు విప్పి చెప్పాలని ఉన్నా నీవే నాగొంటు వినకూడదని గొంతు నోక్కేసావు మరి జరుగుతున్న వాస్తవాలు నీకెలా చెప్పను

by Aduri Inna Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ijIe4b

Posted by Katta

యం. శ్రీవల్లి కవిత

llసంకల్పంll యం.శ్రీవల్లి. బేలగా కూర్చున్నా.. కళ్ళల్లో బాధ, మనసులో పుట్టెడు దిగులుతో.. ఏటికి ఎడురీద లేక..ముందుకు సాగలేక... అర్ధాంతరంగా పయనం ముగించలేక.. కుప్పకూలిపోతున్న ఆశల సౌధాలని నిలబెట్టలేక.. మనసంతా ఆవహించిన భయాన్ని నిస్సహాయంగా అనుభవిస్తూ.. భయం, బలహీనత, ఆత్మన్యూన్యత, పిరికితనం పిశాచాలై నను కబళిస్తుండగా.. ముందుకు సాగలేక, అడుగు ముందుకు వేయలేక.. ఆలోచిస్తున్నా... ఉవ్వెత్తున ఎగసే కెరటం క్రింద పడుతోంది..మళ్ళీ లేవటానికేగా.. క్షణంలో మాయమయ్యే మెరుపు..మరింత తేజస్సుతో వస్తోంది.. ఎప్పటికైనా ఫలిస్తాననే కదా...ఆశ మళ్ళీ మళ్ళీ పుడుతోంది.. ఇంతటి శక్తి వీటికి ఎవరిచ్చారు? నోటితో పలకరింపు వద్దు..నొసటి వెక్కిరింపు వద్దు.. జాలి చూపులు వద్దు, మొసలి కన్నీరు వద్దు.. ఉన్నదొక్కటే..సంకల్పం. సంసిద్ధమవుతున్నా.. నా జీవన గమనాన్ని నేనే నిర్దేశించుకుంటూ నాకు నేనే ధైర్యం, నేనే సైన్యంగా.. నేనే సారధిగా, ఆశలనే అస్త్రాలుగా .. ధృడమైన మనో నిశ్చయంతో..నింగికెగసే ఆరాటంతో.. కొండల్ని పిండిచేసే గుండె నిబ్బరంతో... మహా ప్రళయాన్నితట్టుకునే ఆత్మ విశ్వాసంతో.. మహాసముద్రాన్ని దాటిన మారుతి వేగంతో.. ఎల్లలు లేని సంకల్ప దీక్షతో .......కార్యసిద్ధికి.

by యం. శ్రీవల్లిfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cX50zf

Posted by Katta

Abd Wahed కవిత

గాలిబ్ కవితల్లో ఈ రోజు మొదటి కవిత గాలిబ్ సంకలనంలోని 10వ గజల్లో 7వ షేర్ ఉగా హై ఘర్ మేం హర్ సూ సబ్జా వీరానీ తమాషా కర్ మదార్ అబ్ ఖోద్నే పర్ ఘాస్ కే, హై మేరే దర్బాం కా ఇంట ఎటుచూసినా గడ్డిగాదాల నిర్మానుష్య దృశ్యం కావలి వాని పని కలుపును తీయడమే ఇప్పుడు ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఉగా అంటే మొలకెత్తడం, హర్సూ అంటే అన్నివైపులా, సబ్జా అంటే గడ్డిగాదం, కలుపుమొక్కలు, వీరానీ అంటే మానవసంచారం లేకపోవడం, మదార్ అంటే ఆధారం, దారో మదార్ అన్న పదబంధాన్ని ఎక్కువగా వాడుతుంటారు, అంటే అర్ధం ఆధారమని. ఆమాల్ కా దారోమదార్ నియ్యత్ పర్ హై అంటే ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయని భావం. దర్బాం అంటే కావలి వాడు, వాచ్ మేన్. ఒక నిరాశకరమైన పరిస్థితిని కాస్త హాస్యం, మరికాస్త వ్యంగ్యం జోడించి ఈ కవితలో గాలిబ్ చెప్పాడు. తన పతనావస్థనే గాలిబ్ ఇందులో వర్ణించాడు. చదివిన వారికి బాధతో పాటు నవ్వు కూడా వస్తుంది. గాలిబ్ తన ధనసంపదలన్నీ ప్రేయసి మోజులో ఖర్చుపెట్టేశాడు. తన ప్రేయసి సంతోషం తప్ప మరి దేన్నీ ఆయన లక్ష్యపెట్టలేదు. ఒకప్పుడు ఆయన ఇల్లు ఒక మహలులా ఎంతో అందంగా, ఆడంబరంగా ఉండేది. కాని ఆయన ప్రేమలో పడి ఏదీ లక్ష్యపెట్టనందువల్ల ఇంటిపై శ్రద్ధ పెట్టలేదు. శుభ్రం చేసేవారు లేరు. ఇంట్లో ఎటుచూసినా గడ్డిమొక్కలు, కలుపుమొక్కలతో అడవిలా తయారైంది. గాలిబ్ ఇంటికి ఒక వాచ్ మేన్, ఒక నమ్మిన బంటు ఉన్నాడు. ఒకప్పుడు ఈ నమ్మినబంటు ఆయన ఇంటి రక్షణ చూసేవాడు. కాని ఇప్పుడు ఆ నౌకరు పని కలుపుమొక్కలు పెరకడంగా మారింది. ఎందుకంటే ఇంట్లో విలువైన వస్తువులేవీ మిగల్లేదు. కాబట్టి ఇంట్లో దొంగలు పడే ప్రమాదం లేదు. గడ్డిమొక్కలు ఇంటిని ఆక్రమించుకునే ప్రమాదాన్ని అరికట్టడమే నౌకరు పనిగా మారింది. ఈ కవితలో చమత్కారమేమంటే, తన ఇంటికి అవాంఛనీయ వ్యక్తులు ఎవరు రాకుండా కాపాడ్డానికి గాలిబ్ నియమించుకున్న నౌకరు ఇప్పుడు అవాంఛనీయ మొక్కలు పెరక్కుండా చూసుకుంటున్నాడు. మనుష్యులు ఎలాగూ అక్కడికి రావడం లేదు. ఉర్దూలో కలుపుమొక్కలను సబ్జ యే బేగానా అంటారు. సబ్జ అంటే పచ్చదనం అన్న అర్ధం ఉంది. నిర్మానుష్య ప్రదేశంగా తన ఇంటిని వర్ణించడం ద్వారా కూడా గాలిబ్ తన ఉనికి కూడా లేదన్న భావాన్ని ప్రకటించాడు. ఈ కవిత విఫల ప్రేమను ప్రకటించే కవిత అయినప్పటికీ ఇందులోని సున్నితమైన వ్యంగ్యం వల్ల భిన్నమైన సందర్భాల్లో కూడా అన్వయించే కవితగా మారింది. ఉదాహరణకు, ఏదన్నా వ్యాపారం చాలా బాగా నడుస్తున్నప్పుడు సందడిగా కళకళలాడుతూ ఉంటుంది. అందరూ పనిలో బిజీగా ఉంటారు. కాని అదే వ్యాపారం దెబ్బతిని, సందడి లేక కళావిహీనమైనప్పడు, పాత వస్తువులనే అటూ యిటూ సర్దుతూ గడపడం జరుగుతుంది. ఇలాంటి అనేక సందర్భాల్లో వచ్చేపోయే వారు ఎవరు లేకపోయినా, పెరిగిన గడ్డిగాదాన్ని తొలగించే పని ఉందికదా అనుకోవడం లాంటిది ఈ కవిత. గాలిబ్ కవితల్లో ఉన్న ప్రత్యేకత ఇదే. విభిన్న సందర్భాలకు అతికినట్లు ఈ కవితలను కోట్ చేయవచ్చు. ఈ రోజు గాలిబ్ కవితల్లో రెండవ కవిత, గాలిబ్ సంకలనం 10వ గజల్లోని 9వ కవిత హనూజ్ ఏక్ పర్తూ యే నక్షె ఖయాలె యార్ బాకీ హై దిలె అఫ్సుర్దా గోయా హుజ్రా హై యూసుఫ్ కే జిందా కా ఇప్పుడు ప్రేయసి ఆలోచనల నీడల చిహ్నమే మిగిలింది యూసుఫ్ ను నిర్భందించిన జైలులా.. భగ్న హృదయమా.. ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. హనూజ్ అంటే ఇప్పటి వరకు లేదా ఇప్పుడు అని అర్ధం. పర్తూ అంటే నీడ, నక్ష్ అంటే చిత్రం, ఖయాలె యార్ అంటే ప్రేయసి ఆలోచన, దిలె అఫ్సుర్దా అంటే నిరాశపడిన, లేదా భగ్నపడిన హృదయం. గోయా అన్నది పోలిక చెప్పడానికి ఉపయోగించిన పదం. హుజ్రా అంటే జైలు గది, జిందాం అంటే జైలు. ఈ కవితలో గాలిబ్ విఫల ప్రేమికుడిని వర్ణించాడు. ఆ ప్రేమికుడు మరెవరో కాదు తానే. ప్రేయసి జ్ఙాపకాలతో, ప్రేయసి మాటలతో ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు. కాని ప్రేయసి అతడిని తిరస్కరించింది. గాలిబ్ హృదయం వక్కలయ్యింది. భగ్న హృదయమా అంటూ సంబోధిస్తూ, ఇక తన హృదయంలో తీయని జ్ఙాపకాలు కూడా మిగల్లేదని, కేవలం ఆ జ్ఙాపకాల నీడల చిత్రం మాత్రమే మిగిలిందంటున్నాడు. అంటే జ్ఙాపకాలు వదిలి వెళ్ళినా గాలిబ్ మాత్రం మరిచిపోడానికి సిద్ధంగా లేడు. ఈ కవితలో గాలిబ్ దివ్యఖుర్ ఆన్ లో యూసుఫ్ ప్రవక్త (జోసెఫ్) జైలు కధను ప్రస్తావించాడు. యూసుఫ్ అసాధారణమైన అందగాడు. ఆయన్ను రాజుభార్య జులేఖా మోహించింది. కాని యూసుఫ్ దైవభీతితో ఆమె కోరికను తిరస్కరించాడు. మహారాణి జులేఖా ఆగ్రహంతో యూసుఫ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. రాజు కోపంతో మండిపడి యూసుఫ్ ను కారాగారంలో పడేశాడు. చీకటి కొట్టం లాంటి ఆ కారాగారం కూడా యూసుఫ్ అద్భుత సౌందర్యం వల్ల దేదిప్యమైన కాంతితో వెలిగిపోయింది. యూసుఫ్ ను ఆ కారాగారం నుంచి విడుదల చేసిన తర్వాత కూడా ఆ కాంతి అలాగే ఉందంట. ఎందుకంటే యూసుఫ్ నీడ ఒక చిత్రంగా అక్కడే ఉన్నందువల్ల ఆ కారాగారం ప్రకాశించేదట. ఇక్కడ గాలిబ్ తన ప్రేయసిని అలాంటి అద్భుత సౌందర్యరాశిగా వర్ణిస్తున్నాడు. తన హృదయం యూసుఫ్ ప్రవక్తను బంధించిన కారాగారం లాంటిదని, అందులో నుంచి ప్రేయసి ఆలోచనల నీడలు కూడా వెళ్ళిపోయినా, వాటి చిహ్నాల వల్ల ప్రకాశవంతంగా తన హృదయం వెలుగుతుందని పోల్చాడు. తన హృదయాన్ని యూసుఫ్ ను బంధించిన కారాగారంగాను, తన ప్రేయసి జ్ఙాపకాన్ని యూసుఫ్ వంటి అద్భుత సౌందర్యంతో కూడిన భావంగాను పోల్చడం ద్వారా తన ప్రేమకు పవిత్రతను ఆపాదించడం కూడా ఇందులో కనబడుతుంది. ఈ కవితను మరోకోణంతో చూస్తే, దేవుని పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి దైవాదేశాలను పాటిస్తూ జీవితాన్ని గడుపుతాడు. కాని, దైవాదేశాలను అతిక్రమించడం అంటే దేవుని ప్రేమను కోల్పోవడమే. కాని దేవుని ప్రేమ ఎంత ప్రకాశవంతమైనంటే, హృదయం నుంచి ఆ ప్రేమ తాలూకు నీడ కూడా నిష్క్రమించినా, దాని చిహ్నాలు ప్రకాశవంతంగా గుండెను తేజోవంతం చేస్తూనే ఉంటాయి. దాన్ని గుర్తించి మళ్ళీ ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేయాలన్న భావం కూడా ఇందులో ఉంది. ఈ రోజు మూడవ కవిత గాలిబ్ సంకలనంలోని 10వ గజల్లో 12వ షేర్ నజర్ మేం హై హమారీ జాదా యే రాహె ఫనా గాలిబ్ కె యే షీరాజా హై ఆలమ్ కే అజ్ జా యే పరేషాం కా వినాశమార్గం పై నా దృష్టి కేంద్రీకరించే ఉన్నాను చిందరవందరైన ప్రపంచభాగాలను కలిపే సూత్రం ఇదే కదా ఉర్దూ పదాలను చూద్దాం. జాదా అంటే మార్గం, బాట, రాహె యే ఫనా అంటే వినాశం వైపు వెళ్ళే దారి, షీరాజా అంటే పుస్తకంలో పేజీలను కలిపి కుట్టే దారం, జుజ్ అంటే ఒక భాగం దీనికి బహువచనం అజ్ జా అంటే అనేక భాగాలు. ఫరేషాం అంటే సాధారణంగా ఆందోళన, బాధలను సూచిస్తూ వాడుతాం, కాని పరేషాం అంటే చిందరవందరై పోవడం అని అర్ధం. ఆలమ్ అంటే ప్రపంచం. ఈ కవిత తాత్విక చింతన ప్రకటించే కవిత. వినాశానికి వెళ్ళే మార్గాన్ని తన చూపులు ఎన్నడూ మరిచిపోలేదు. ఆ మార్గంపైనే ఆయన దృష్టి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతిభాగం వినాశపథానే పయనిస్తోంది. అన్ని భాగాలను కలిపే సూత్రం అదే. చివరకు అన్నీ మూలంతో కలిసిపోవలసిందే. ప్రపంచంలోని ప్రతిదీ, ప్రతివస్తువు, అది స్వతహాగా విభిన్నమైనదైనా, విశిష్టమైనదైనా ఎలాంటిదైనా చివరకు అంతం కావలసిందే. మూలపదార్ధంతో కలిసిపోవలసిందే. అంటే ప్రపంచమనే పుస్తకంలోని అన్ని పేజీలను కలిపి కుట్టిన దారం లాంటిది వినాశం. చివరకు అన్నీ పంచభూతాల్లో కలిసేవే. రాగద్వేషాలు కూడా అంతరించక తప్పదు. ’’కుల్లు మన్ అలైహా ఫాన్‘‘ అంటుంది ఖుర్ ఆన్. భూమిపై ఉన్న సమస్తమూ అంతరించక తప్పదు. ఇదే మాటను గాలిబ్ తనదైన శైలిలో చెప్పాడు. ఎవరికైనా మరణం తప్పదు. అందుకే వి ఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ డెత్ అంటారు. చిందరవందరగా ఉన్న ప్రపంచం అనే పుస్తకంలోని పేజీలన్నింటినీ కలిపి కుట్టిన దారం వంటిది వినాశం అని వర్ణించడంలో గాలిబ్ తాత్వికదృష్టి గమనించ దగ్గది. ప్రపంచంలో వివిధ జాతులు, మతాలు, వర్గాల మనుష్యుల మధ్య ఎన్ని విభేదాలున్నా అందరూ చివరకు మరల వలసిన గమ్యం ఒక్కటే. జీవితమనే పుస్తకంలో వివిధ పేజిలన్నింటిని చివరకు కలిపేది ఒక్కటే. చదివిన కొద్ది కొత్త భావాలను అందించే లోతయిన కవిత. మొత్తం గజల్లో ప్రేమభావాన్ని రాస్తూ వచ్చిన గాలిబ్ చివరి షేర్ లో చెప్పిన ఈ మాటలు గమనించదగ్గవి. విశ్వంలో మనిషి, మనిషిలో ఉన్న రాగద్వేషాలు, ప్రేమలు, నిరాశలు, విషాదాలు, విభేదాలు ఏవయినా కాని చివరకు మనం ప్రయాణిస్తున్న మార్గం తన గమ్యానికి చేరక తప్పదన్న తాత్విక చింతనతో ప్రేమకవితను ముగించాడు గాలిబ్. ఇది ఈ రోజు గాలిబానా. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0U3PW

Posted by Katta