పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఆగస్టు 2012, ఆదివారం

కెక్యూబ్ వర్మ ॥ సగం కాలిన నెలవంక ॥


ఆకాశమంత అందనంత ఎత్తులో
నీవు...


నేలబారున అగాథపు అంచుల లోయలో
నేను...

దేహమంతా పూసుకున్న నీ ఊహల పరిమళంతో
నేను...

ఒక్క మాట కూడా రాని మౌన ప్రమాణంతో
నీవు...

రాని అతిథిలా సుదూర తీరాన ఒంటరి నావపై
నీవు...

కాలమంతా కరిగిపోతూన్న మంచు గడ్డపై
నేను...

శిశిరాన మునిమాపు వేల మబ్బుల తెరల మాటున దాగిన వెన్నెలలా
నీవు...

ఎడారి అంచుల కాష్టపు కారు మేఘాల మాటున సగం కాలిన నెలవంకలా
నేను...
(24-08-2012 )

బివివి ప్రసాద్ || ఆమె ||


ప్రేమకాంతి నా రోజుల్ని వెలిగిస్తున్న ఒక సాయంత్రం ఆమె అడిగింది
నేను మీకు అబద్దాలు చెప్పాననీ, మిమ్మల్ని మోసం చేసాననీ
మీకు అనిపించిన రోజున ఏమి చేస్తారు, నాపై కోపం వస్తుందా


నా చివరి సాయంత్రపు, చివరి బంగారు కిరణాలు
నన్ను చీకటికి అప్పగించి సెలవుతీసుకొంటున్నాయి

పరుచుకొంటున్న ప్రశాంత నిశ్శబ్దంలో ఒక పిట్ట కూసినట్టు
ఊహించనివైపు నుండి నాలో వాలిన మౌనంలోంచి ఒక్కొక్క మాట ఆమెతో అన్నాను

లేదు, నీపైన ఎప్పటికీ కోపం రాదు
నిజానికి కొన్ని తప్త క్షణాల్లో నిన్ను నా సహచరిగా భావించినా
నువ్వు ఎపుడూ నాకొక పసిపాపలా కనిపిస్తావు

నీ నిర్మలమైన చిరునవ్వు నన్ను ప్రాభాతకాంతిలా ఎన్నోసార్లు దు:ఖవిముక్తిడిని చేసింది
నీ చుట్టూ వలయం తిరిగి తాకిన చిరుగాలులు చల్లని నదీజలాల్లా తేలిక చేసాయి
నీ మాటలూ, వాటిమధ్య మౌనమూ నను రోదసిలో విహరించే అన్వేషిని చేసాయి
నా పేలవమైన సమయాలను నీ రూపం గొప్పదిగుల్లోకి పుష్పించేలా చేసింది

నీ పట్ల నాకు కృతజ్ఞత ఉంది
జీవితం నాకు ఇచ్చిన అన్ని కానుకలలోకీ గొప్ప కానుకవి నువ్వు

కానీ, ఒకటి చెప్పగలను, నువు నన్ను విడిచేరొజు సమీపించేకొలదీ
నీకు నేను, మరిచిపోలేని, విడిచిపెట్టలేని అపురూపమైన కానుకనవుతాను
నన్ను విడిచివెళ్ళిన దు:ఖం నీ జీవితమంతా పరుచుకొంటుంది

ఆమె అంది, ఇది తీయని ప్రతీకారం
ఆమె చల్లని నవ్వుపై చీకట్లు వాలుతున్నాయి

నాలో తీయగానైనా ప్రతీకారకాంక్ష ఉందో, లేదో నాలోపల ఒకరికి తెలుసు
నాకు తెలుసు, ఆమె ఎక్కడ ఉన్నా నా మనిషి,
ఆమే, నేనూ వేరుకావటం ఆమె భ్రమ మాత్రమే అని

ఆమె వల్ల నేను ఏయే విశాల విశ్వాలకి మేలుకొన్నానో, విస్తరించానో
ఆమెకి తెలియదు ఇంకా, తానొక పసిపిల్ల కదా

జీవితం ఒక మొరటుస్పర్శ చాలాసార్లు
తాను నానుండి వెళ్ళిపోయాక ఆమెని జీవితమెలా లోబరుచుకొంటుందో నాకు తెలుసు
ఎందరిని చూడలేదు, కేవలం ధూళిలా, రాలిపోయిన పూలలా బ్రతుకుతున్నవాళ్ళని
ఆమెలో నేనొక మరువలేని సంతోషం మిగిల్చే మరువలేని దు:ఖాన్ని ప్రవేశపెట్టకపోతే
ఆమె జీవితం మాయలో ఎలా దారితప్పుతుందో
ఎలా వెలిసిపోయిన చిత్రపటంలా మిగులుతుందో నాకు తెలుసు, ఆమె ఒక పసిపిల్ల కదా

చీకటి ముసురుకొంది
చీకటి కన్నులు చెమరించినట్లు నక్షత్రాలు ఒక్కొక్కటీ మెరుస్తున్నాయి
అవి చిన్నిచిన్ని చినుకులు కావనీ, ఒక్కొక్కటీ నా జీవితం పట్టనంత కాంతిలోకాలనీ
నా కన్నులనుండి జారేందుకు వెనుకాడుతున్న కన్నీటిబిందువు చెప్పింది

ఆమె వెళ్ళిపోయింది, నువ్వైనా నాతో ఉండవా అనబోతున్నానని ఆ బిందువుకి తెలిసినట్లుంది

ఆమె ఉంటే జీవితం ఎలా ఉండేదో తెలియదు కాని
ఆమెలేని దిగులు నన్ను మరింత దయలోకీ, కాంతిలోకీ నడిపించింది
తన వెలితిని నింపుకొనేందుకు అప్పటినుండీ విరామమెరుగక వికసిస్తూనే ఉన్నాను

ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూడాలని చాలాసార్లు అనిపిస్తుంది
అప్పుడు
పూలపై వాలిన మంచుబిందువులూ, పక్షుల రవాలూ, సెలయేటిపరుగూ,
మనుషుల చిరునవ్వులూ, దు:ఖితులపై ఎవరోఒకరు కురిపించే దయా
లోకం నన్నుతాకే మృదువైన సమయాలన్నీ ఆమె మాలో లేదా అని నవ్వుతాయి

24.8.2012

ప్రసాద్ తుమ్మ || నేనే అధికుడ్ని ||

నీ కాల్మొక్త
నీ బాంచన్ దొర,
కాళ్ళు కడిగి

కన్యాదానం చేస్తా
స్వీకరించు ,
నీకు పాద్దభివందనం
నన్ను ఆశీర్వదించు,
నీ కాళ్ళకు దండాలు
సాష్టాంగ ప్రణామాలు ,
కాళ్ళు కడిగి
నేతిన నీళ్ళు చల్లుకో
పుణ్యం వస్తుంది,
కాళ్ళు శుబ్రం చేసుకున్నవాడు
ఒళ్ళంతా శుబ్రం చేసుకున్నవాడితో సమానమే
ముఖానికి బదులు
కాళ్ళే పవిత్రమైనాయి
అట్లయితే
కాళ్ళ నుండి పుట్టిన
నేను ఇంకెంత పవిత్రున్ని
...
26-8-2012

యాకూబ్ ॥ ఒక జన్మే !॥


ఉన్నదొకటే జన్మ


నవ్వినా ఏడ్చినా
ఓడినా పోరాడినా
సుఖించినా దుఃఖించినా

=ఉన్నదొకటే జన్మ!

ఆ లోపలే చింతచిగురు కుప్పల్లా పిలిచే కోర్కెలు
కాగితాలకు చేరుకునే దారుల్లో పయనిస్తూ పదాలు
వేళ్లకొనలపై కునుకుతూ ,జోగుతూ
మెలుకువను కలకంటూ అక్షరాలు
నొప్పెట్టే పాదాల్తో
రాత్రుల్నిఈదే దేహాల తీరనితనం=

కొంత ఊరట,ఇంకొంత వగపు

కొన్ని సందర్భాలు,కొన్ని సంకల్పాలు
=కొడిగడుతూ,వెలుగుతూ గడియారపు ముళ్ళు
*
ఎవరైనా అడుగుతారా కుశలాన్నీ
ఏమైనా తెస్తారా

ఇంకేం ఇస్తారూ
ఇంకేం అడుగుతారు ఇంతకుమించి

అడిగి,లోపలంతా కడిగి
ఎవరైనా ఏమివ్వగలరు?!

*
ఒక జన్మే మరలి రాదు
తిరిగి, మరల రానే రాదు

*పరివర్ధిత కవిత;26.8.2012

బాలు || ఫేస్ బుక్ స్టేటస్ అస్త్రం ||


స్టేట్ అఫ్ మైండ్ కి సింబల్
సూటిగా చెప్పలేని వాటిని
ఏదోలా చెప్పాలి అనిపించినప్పుడు

ఉపయోగించే అస్త్రం
ఫేస్ బుక్ స్టేటస్ అస్త్రం

నీ బాణాన్నికి పదును పెట్టి
బాగా గట్టిగా బిగించిన దనస్సుతో
బాణాన్ని బలంగా
లాగి వదులుతున్నావు

గురి చూసి కొడితే పర్వాలేదు
తగలాల్సిన వాళ్లకు తగులుతుంది
జరగాలిసిన కార్యం జరుగుతుంది

గురి లేకుండా కొడితే
కటిక చీకట్లో తిరుగుతున్న
నా లాంటి వాడికి తగిలితే!

గట్టి కండ బలం
అండ బలం
బుద్ధి బలం
గుండె బలం
లేనివాడిని

ముక్కు పచలారని పసివాడిని
ఇప్పుడిప్పుడే అడుగులు వేయటం మొదలు పెటాను
నా మీద బ్రాహ్మ అస్త్రం అవసరమా!
ప్రేమ అస్త్రం వేస్తె పడిపోతాను కదా!

*26-08-2012*

రాకం నరేందర్ || నువ్వు-నేను ||


ఏ ఆవేశ కణాన్నో అల్లుకొని
అండ పిండాలలో దోర్లుకొని
ఆర్తనాదంతో, ఖండితమైన గాయంతో

అనుమతిలేని అస్తిత్వపు ఆనవాళ్ళని
పరుచుకొని, దిక్కులని నింపుకొని
అచంచల ప్రపంచపు అంచులపైన ఆడాలని......

కాని.....
రక్త మంసాలకి రంగులని అద్దుకొని
ఊరు పేరులతో ఉన్మాదం నింపుకొని
కుల మతాల కుతంత్రాలని రాసుకొని
జాతి నీతి పాటాలు వల్లేసుకొని
ఇరుకు సందులలో ఇమడలేక ఓడుతూ....

నేనెవరు....? నువ్వు....!!!

ప్రకాశ్ మల్లవోలు || రాలిపోయే తోకచుక్క.. ||


1)
నీలాకాశపు నింగి నగరులో
క్రోధావేశము పొంగి పొగరులో


రివ్వున దూసుకుపోతూ, అగ్గిని మోసుకుపోతూ
శరమై, అగ్నిదేవుని వరమై ముందుకు సాగిపోతూన్న

విశాల విశ్వంలో గమ్యమెరుగని ఓ బాటసారీ !!
అసలు దిక్కేది నీకు ??? చివరికి దక్కేది నీకు ???

కనుచూపుమేర గగనాన లిప్త పాటు విహారీ !!
హక్కేది నీకు ??? ఎందుకు మొక్కేది నీకు ??

తీరని ఆ విన్నపాలు ... తీర్చమని విన్నపాలు ...
కారణం వారి వారి లోపాలు ... కడిగేయాలని పాపాలు ...

పట్టించుకోని ఓ చుక్కా!!! పయనిస్తున్నావు ఎంచక్కా!!!
రాలిపోయేటి ఓ చుక్కా !!! ప్రియుని మదిన వాలిపో ఎంచక్కా !!!

2)

తారాజువ్వలా తోస్తావు... విను వీధి లో విహరిస్తావు...
ఇలా వచ్చి అలా వెళ్తావు.... మధుర జ్ఞాపకాన్నిస్తావు ....

ఉన్న క్షణంలో ఆనందానివి .... కనుమరుగైయున్న క్షణం లో భవ భంధానివి...
విహరిస్తున్న క్షణం లో అందానివి..... మది దోచే చిరు భంధానివి..

చూచుటకు రెప్ప పాటు వ్యవహారం...
చేస్తావు సువిశాల విను వీధిలో స్వైర విహారం...

నేల అంతనూ దాటి , పాల పు౦తలు దాటి
చుక్కల చుట్టాల్ని పలకరిస్తావు………….. గ్రహాల గృహాల్ని సందర్శిస్తావు
సకల శకల స్నేహాల్ని దారిలో కలుస్తావు….సోదర సౌర కుటుంబాల్ని పరామర్శిస్తావు ...

చనిపోయేముందర చివరిసారిగా విశ్వాంతరాళం లో విహరిస్తావు
కనుల కట్టినట్టు, పూస గుచ్చినట్టు నీ భాధనంతా వివరిస్తావు

మము కన్నీళ్ళ చూడలేక కనుమరుగైపోతావు..
నిను కన్నోళ్ళ జాడ లేక కన్నీరైపోతావు ....

కలవరమే చుక్కా ..... నీ పయనము కంటికి
కనికరమే లేదక్కా .... నీ పయిన ముక్కంటికి

మరుజన్మలో మరలోస్తావని ...నువ్ తీరు మానక తరలోస్తావని....
వేచి చూస్తున్నాం నీ రాకకై...

04/01/2012

నందకిషోర్ || పునర్విమర్శ అభ్యాసం-3 ||


కొన్ని స్నేహాలూ అంతే!

రెక్కలొచ్చాయని తెలిసేలోపే

ఆకాశాలవైపు ఎగరేసుకుపోతాయ్.
గూడు కట్టాలని గుర్తొచ్చేలోపు
కనపడని గుర్తేదో ముద్రించిపోతాయ్.

మొదట- ఎందుకో అడగొద్దంటూ
కొండకోనలు,వాగువంకలు తిప్పుకొస్తాయ్.
ఏ పనీ లేనందుకు
నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి.

ఆపై- ఎవరికీ చెప్పొద్దంటూ
రెక్కలెలా విప్పుకోవాలో,పూలనెలా గుర్తుపట్టాలో నేర్పిస్తాయ్.
ఏ తెలివీ లేనందుకు
నువ్వు సడిచేయకుండా అనుసరించాలి.

పచ్చని చెట్ల రంగుని,దూరపు కొండల ఎత్తుని,
పూసేపూల అందాన్ని,అవి చెప్తేనే తెలుసుకోవాలి.
వాలుగా కురిసేది వాననీ,వాగులో పారేది నీరనీ,
వచ్చిపోయేది గాలనీ,నేర్పగా నేర్చుకోవాలి.

చెట్టుకాస్తే పండ్లు పైనే ఉండాలనీ
చేనుపండితే గింజలు కిందే రాలాలనీ కోరుకోవాలి.
ఆకురాలేముందు వసంతాలకీ
పూతరాలేముందు పూర్వాహ్నాలకీ వలసపోవాలి.

పొద్దుటి పూట వెలుగనీ,సాయంకాలం చీకటనీ
ఎండపూట తిరగొద్దనీ,ఎన్నెల పూట పాడొద్దనీ
నీరు తాగాలనీ, గాలి పీల్చాలనీ,
పువ్వు రాలినట్టు ప్రాణం రాల్చాలనీ,

దేవుడా!
ఆ ఉపదేశాలకి అడ్డూ,అదుపూ ఉండదు.
ఆ నేర్పు ఎన్నటికీ చదవాలనిపించదు.

చివరగా-వచ్చే అజ్ఞానమేమంటే
వయసుతో అనుభవం రాదనీ,
అనుభవిస్తే బతుకు సరిపోదనీ,
నీ బతుకు నువ్వే బతకాలనీ!
నీలాగే నువ్వు చావాలనీ!

ఇంకా బతికే ఉన్నావా?
ఉంటే -ఏమంటావు బుల్‌బుల్?!

మెర్సి మార్గరెట్ ll ఒంటరి గాలి ll


ఆ గాలికి ఏ భావాలూ లేవు
అనుభవాలు తప్ప
అనుభవాల కొలతల్లో భావాలను

వెతుకులాడటం తప్ప

భావాల చెమ్మ ఘాడత
కొలిచే ప్రయత్నంలో
అణువణువులుగా విడిపోవడం
తప్ప
ఆ అణువుల్లో కూడా
ఒకటిగా ముడిపడి
ఉండాలనుకోవడం తప్ప

ఒంటరిగా గుండెల్లో చేరి
మనసు పొరలను తాకి
నిదురోయే జ్ఞాపకాల కలల్లో
దొంగలా
ఏవేవో రహస్యాలని తడిమి రావడం
తప్ప
రహస్యాల గుస గుసలు
తన నుంచి చేరవేసినా
మూగ గానే ఉండి మూలల్లో
స్థానాన్నివెతుక్కోవడం తప్ప

ఆ గాలికి ఏ భావాలూ లేవు
మట్టితో మమేకమైనా
మరుపును చెంతనే ఉంచుకోవడం తప్ప
నీటిలో అణువుల్ని కౌగిలించుకున్నా
వాటి నిట్టుర్పులను కూడా
గ్రహించలేనంత
అపరిచితగా ప్రవర్తించడం తప్ప

మేఘాల కురులు ముడివేస్తూ
వాటి చిలిపిదనం అల్లరి పెట్టినా
తనకేం సంబంధం లేనట్టు
ఆ వైపు చూడక నీల్గుతూ
ప్రేమికుల కౌగిలింతల్లో దూరినా
సిగ్గు పడకుండా తనకు తానూ
డోంట్ కేర్ అనుకోవడం తప్ప

ఆ గాలికి
ఏ భావాలు లేవు
పిల్లన గ్రోవి తనువును మృదువుగా
స్పృశించినా
దాని మనసును అర్ధం చేసుకోకుండా
ఉండడం తప్ప
మనసు నిండా శ్వాసగా నింపుకున్న
అక్కడ నిలువలేక బయటికొచ్చే వరకు
పరగులు తీయడం తప్ప

ఎందుకని నిలదీస్తే
భావాలన్నీ ప్రేమకి రాసిచ్చి
మోసపోయిన గుండెని
గతంలో సమాది చేసి
ఆకృతి లేకుండా
ఏ ఆలోచనల కొక్కానికో
తనకు తానే చిక్కకుండా తిరుగుతునట్టు
సమాధానం ఇస్తూ అంది
అందుకే
ఈ గాలికి ఏ భావాలు లేవు
నన్ను నేను మరిచిపోవడం తప్ప
.................(26/8/2012)

కవితా చక్ర || ఆగమనం ||


నాదైన స్వాప్నిక ప్రపంచంలో
స్తబ్దత కాన్వాసు పై,
నిశ్శబ్దపు కుంచెతో..

అస్పష్టపు చిత్రానికి
సప్తవర్ణ మేళవింపు పులిమే
ప్రక్రియలోనేనుండగా,
హఠాత్తుగా...
నిశీధి నిండిన మది గూటిలో
చంద్ర కిరణాల వెలుగు
నింపుకున్న 'తను '
ప్రత్యక్షం!
సంభ్రంగా చూస్తోన్న
నా కళ్ళు
వెన్నెల వాకిళ్ళే అయ్యాయి!
తన రాకకి
గుట్టు చప్పుడు లేకపోయినా..
ఆ ఉనికి తో మాత్రం...
గుండె సడి హెచ్చింది..
సొంపైన ధ్వనిలా!!
ఆదరణకి
నిజమైన భాష్యం చెప్పే..
ఆ చెలిమి తో,
హ్రుదయ కవాటాలు
తెరుచుకుని
ప్రేమ విహంగం.
మునుపెన్నడూ
లేనంత
స్వేచ్చగా ఎగురుతోంది!
అందుకేనేమో..
చిన్న చేయూత చాలు..
అచ్చంగా స్పందించడానికి!
చల్లని చేయి తోడు చాలు..
క్లిష్టంగా ఉన్న
జీవితాన్ని
ఇష్టంగా
ఆస్వాదించడానికి..!!

26.08.2012

క్రాంతి శ్రీనివాసరావు || పోస్టుమార్టం ||


శృస్టిలో
జంతువుల ఆత్మహత్యలు
స్వజాతి జంతువుల అకారణ హత్యలూ

లేనప్పుడు....మనిషెందుకిలా.....!!!!!!!

దక్ష ప్రజాపతి దయాహీనత
ఆదిశక్తి ని దహనం చేసి
ఆత్మహత్యకు శ్రీకారం చుట్టింది
మొ

లు
అత్తలఆరళ్ళు కోడళ్ళను
పాడుబడ్డ బావిలోకి ఉరికో
పాత చీర కొంగు వురికో
బలిచేస్తున్నాయు

శవాల కంపు కొడుతూ
నిత్యం చచ్చి బ్రతుకుతున్న
జనాల మద్య ఇమడలేక
పసిబిడ్డలతో సహా కుటుంబాలు
జనాబా లెక్కల్లొంచి తప్పించుకొంటున్నాయు

నేతలే గోతులు తీస్తుంటే
మగ్గాలకు వురిపగ్గాలేస్తుంటే
బట్టల మిల్లులు బ్రతుకుకు చిల్లులు పెడితే
విధిలేక వేరే లోకాలకు వలసలు పోతున్నారు

డంకెలు రంకెలకు
అప్పుల వేలం డప్పుల చప్పుళ్ళకు
తనుపండించినపత్తే దీపం వత్తులై
రైతన్నల నెత్తి మీద వెలుగుతున్నాయు

మనసులు కలసినా మనుగడ కరువై
మనువు తమ మనువుకు అడ్డం పడుతుంటే
సమాంతర రేఖలుగా జీవించలేక
రైలుపట్టాల సాక్షిగా తలలు తెగిపడుతున్నాయు

బడివత్తిడిలో వాడి
నాన్నా నాకెందుకో బ్రతకడం ఇస్టం లేదంటూ.....
ఏకవాక్య వీలునామాలు రాస్తూ....
భవంతుల పైనుండి దూకి
పసిమొగ్గలు ఉసురుతీసుకొంటున్నాయు

రాజకీయ క్రీడలో
ఆశలు తీరే దారులు మూసుకు పోతున్నప్పుడు
నవయువకులు బలిదానాలవుతున్నారు

ఈతి ్బాధల మరణాలను
ఏనేతల చావులకో జతకట్టి
బ్రతుకెళ్ళదీస్తున్నారు మిగిలిన అందరు

ఆత్మహత్య
పిరికితనమో
పరువుతనమో
వీరత్వమో
ధీరత్వమో
అనివార్యతో
అని చేయుటో
అల్పత్వమో
మనుషుల తత్వమో
అంటూ పద్దులు రాసుకొంటున్నాం
అవన్నీ పాలకుల పాతకాలనిమరచిపోతున్నాం
ఆత్మహత్యలు కావవి
మనదేశం
మే
ధా
వు


మౌ
నం
చేస్తున్నహత్యలు
కవిమిత్రులారా కలాలు పట్టండి
ఇకనయునా మేధావుల మెదళ్ళకు నోళ్ళు పెట్టండి

ప్రవీణ కొల్లి || కవిత్వమంటే?..ఏమో... ||


విషాదం నిద్రిస్తున్నప్పుడు
అక్షరాలు మేల్కొంటాయి
పదాలలో ఒదిగిపోయి

వాక్యలు ఒకదాని వెనుక మరొకటి పరుగులు పెడతాయి
ఈ భావాల వెల్లువను కవిత్వమనోచ్చా?
ఏమో...నాకైతే తెలిదు!
I call it as flow of emotions

సంతోషం ఉరకలేస్తున్నప్పుడు
ఎగిరెగిరిపడే మనుసును
కూసిన్ని అక్షరాలతో అభిషేకిస్తాను
కొండంత తృప్తి పధిల పరుచుకోవటానికి.
అలా..అల్లిబిల్లిగా అల్లేసిన పదాలను కవిత్వమనోచ్చా?
ఏమో...నాకైతే తెలిదు!
I call it as flow of expressions

నా అనుభవాలు
నేను చూసిన సంఘటనలు
నా ఆలోచనలు
నేను గమనించిన విషయాలు
అది ఇది అని కాదు
తోచింది రాసేస్తాను.
రాసిందంతా కవిత్వమనోచ్చా?
I don't dare to say...I call it as flow of thoughts

కలం నా నేస్తం
ఎందుకంటే...నిజాయితీ సిరా కాబట్టి
కలం నా విమర్శ
ఎందుకంటే...అంతరాత్మ ఊపిరి కాబట్టి
కలం నా ప్రోత్సహం
ఎందుకంటే......?
చివరి అక్షరం లిఖించక, వెనుతిరిగి చూసుకుంటే "ఇదంతా నేనే!" అనే సంబరం!

ఓ మెప్పు సంతోషాన్నిస్తుంది
ఓ విమర్శ ఆలోచనను రేకెత్తిస్తుంది
అలాగని...
మెప్పులకు బానిసను కాదు
విమర్శలకు భయపడీపోను

నచ్చితే హత్తుకుంటా
నచ్చకపోతే పక్కకుపోతా
ముసుగేస్తే అక్షరాలు తిరగబడతాయి....

బాషపై పట్టు లేదు
పదాలు తడుముకుంటాను!
భావం నా సొత్తు
వ్యక్తీకరణ నా హక్కు!

భావుకత్వం నేర్చుకుంటే వచ్చేదా?
కేవలం ఆస్వాదించాల్సిందే!

(I don't dare to call it as poem, it's just Flow of thoughts.)

వంశీదర్ రెడ్డి || విశ్వ సంగీతం ||


తన్యతకు తెగిన
ఆకాశపు ఫిడేల్ తీగల్ని

ఎడతెగని ఆలోచన్లతో అనస్టమోస్ చేసి,
సెరెబ్రల్ కపాలం తెరిచి
శుధ్ద గాంధారాల్నీ, సుప్త సంగీతాన్నీ
ఆవహిస్తూ,

మురళికంటిన బ్లాక్ హోల్స్ లో
హీలియం గాలులూది
నిషాదపు విషాదం రవళిస్తూ,
ముహుర్ముహుర్లుఠతభంగతరంగ మృదంగ ధ్వానాన్ని
చేతి వేళ్ళలోకి గుండెని లాగి సృష్టిస్తూ,

విశ్వ సంగీతపు ఒపెరాలో
మిల్కీ వేలు దాటుతున్న
అయస్కాంత తరంగాల షడ్జమ స్వర యాత్రలో
ఔడవ ఆరోహణ తుది మెట్టు
దేవ రహస్యాల్ని గుప్పిట చూపిస్తూ

ఉఛ్వాస నిఛ్వాసల జుగల్బందీ ఓంకారమై
నాకే వింతగా విన్పిస్తూ,
సకలం కొత్తగా కన్పిస్తూ...

25 aug 2012

కవిత రాయాలనుకున్నప్పుడు : ఒక చర్చ



‎1. కవి ఏదైన కవిత రాయాలనుకున్నప్పుడు దానిపై తనకి కచ్చితమైన అవగాహన ఉంటే ఏ పదాలను ఏ సందర్భంలో వాడుతున్నాడో తెలుస్తుంది, మంచి స్పృహ ఉంటుంది కవిత మీద

2. కవికి తనేం చెప్పదలచుకున్నాడో సరైన అవగాహన లేనప్పుడు తనకే సందేహంగా ఉంటే పదాల్లో అర్ధాల్లో తత్తరపాటు బయలుదేరుతుంది. అప్పుడు ఎవరు ఎదురుపడి ఏం చెప్పినా మారుస్తూ పతారు.... అంటే ఆ కవి కవిత అర్ధం మార్చేస్తున్నడు. కవి చెప్పాలనుకునే విషయంపై సమగ్ర అవగాహన లేకపోవడం వల్లనే సవరణల అవసరం ఏర్పడింది.

3. పాఠకుడు (కవి , సాహితీ ప్రియుడు, సాహిత్య విమర్శకుడు లేక సాధారణ వ్యక్తి) ఒక కవితను చదివి ఎంతో కొంత అర్ధం చేసుకుని, అరరే ఇది ఇలా రాస్తే బాగుండేది అని సూచనలివ్వాలనుకుంటారు కారణం ఇక్కడ రాసిన కవి చదివిన పాఠకులు భిన్నమైన ఆలోచనా విధానాలు, సామాజిక పరిస్థితులు, మానసిక పరిణతులు కలిగినవారు కావడమే. ఒకవేళ వారికి అన్ని విషయాల్లోనూ సారూప్యత ఉంటే మనసుల దృష్ట్యా విభేదించవచ్చు.

4. కవి వ్యక్తీకరించాలనుకునే భావన సరిగ్గా పాఠకునికి చేరాలంటే కవికి భావ స్వాతంత్ర్యంతో పాటు పదప్రయోగ స్వాతంత్ర్యం కూడా ఉండాలి.

5. చదివిన కవితకి ఏమైనా సవరణలు సూచించాలి అనుకుంటే అప్పుడు కవి హృదయంలో ఏ భావ ప్రకటన ఉద్ధేశముందో తెల్సుకుని, సూచనలు మాత్రమే ఇవ్వాలి. అవి కవికి ఆమోద యోగ్యమైతే సవరిస్తాడు లేదంటే లేదు.

- వర్ణలేఖ

 ·  ·  · Friday at 11:53am via mobile

    • Kapila Ramkumar మంచిగ సెప్పినవ్
      Friday at 12:12pm ·  · 1

    • Nanda Kishore వామ్మో..ఏమైంది వరు? :)
      ఇట్టా రాంగోపాల్ వర్మ స్క్రిప్ట్ పట్టుకొచ్చినవ్!
      Friday at 12:21pm ·  · 5

    • Varnalekha Varu thanQ sir
      Friday at 12:22pm via mobile · 

    • Varnalekha Varu nuvvinkaa raledhani chusthunna nandu yemjepthav malla
      Friday at 12:24pm via mobile ·  · 2

    • Nanda Kishore ఓవరాల్‌గా నాకర్ధమయిందేమంటే ఎవలిష్టమొచ్చినట్టు వాళ్ళు రాస్తరు భయ్!నిప్పుల పుల్లేయాలెగాని,పప్పుల గాదు అని.. అంతేనా? :)
      Friday at 12:27pm ·  · 6

    • Varnalekha Varu pappudhiskondi udikinanka nippula yendhuku uppesedidhi
      Friday at 12:30pm via mobile ·  · 3

    • Karimulla Ghantasala Madhyalo ne jepthav malla. Good articulation, self-evident, every poet and every reader has to digest and follow seriously these practically very useful and purposeful suggestions. Varalekha, adbhuthamgaa present cheshaaru, dhanyavaadaalu.
      Friday at 12:33pm via mobile ·  · 4

    • Friday at 12:34pm via mobile ·  · 1

    • Nanda Kishore ఒకవేళ వారికి అన్ని విషయాల్లోనూ సారూప్యత ఉంటే మనసుల దృష్ట్యా విభేదించవచ్చు.
      :)ఏమన్న అనుకోర్రి భై! ఈ పోస్టుని నేన్ విభేదిస్తున్న.కారణాలు చివరాఖర్ల రాస్త.పెద్దోల్లొచ్చి సూడనీ..
      Friday at 12:40pm ·  · 4

    • Karimulla Ghantasala Adendi malla, Nanda Kishore, madyala pakkana bothav? Adedo gippude jepparaade?
      Friday at 12:56pm via mobile ·  · 1

    • Varnalekha Varu haha yendhuko Cheppu nandu
      Friday at 12:57pm via mobile ·  · 1

    • Kiran Gali saw a different side of you Varnalekha through this post of yours. quite impressive. i was aware of your poetic skill but you sound pretty much like an intellectual in this :). quite glad to know it
      Friday at 1:10pm · Edited ·  · 5

    • Friday at 1:01pm via mobile ·  · 1

    • Kavi Yakoob చాలా ఉపయోగకరమైన అంశాలు చెప్పావు వర్ణలేఖ..!!
      Friday at 1:04pm ·  · 3


    • Bvv Prasad కవులు ఇలా కూడా రాయటం చాలా మంచిది. మంచి ప్రయత్నం.
      1,2 అర్థమయ్యాయి. మిగతావి అర్థం కాలేదు.
      Friday at 2:02pm ·  · 4

    • Varnalekha Varu miku thelinivemuntaay sir? :)
      Friday at 2:04pm via mobile ·  · 1

    • Sailaja Mithra Nuvvu kavithalu raasthe adi chadivesi ela raayalo andaru thelusukuntaru varnalekhaa! proceed
      Friday at 2:45pm ·  · 1

    • Bvv Prasad 
      అన్నప్రాసన నాడే ఆవకాయ ఎందుకు కానీ, కవిత్వంతో పాటు, ఇలా కూడా రాస్తూ ఉండమ్మా. చాలామంది కవులు తమ కవిత్వం గురించి మాట్లాడమన్నా నీళ్ళు నములుతారు. ఆ బాధ్యత తమది కాదు విమర్శకులదని చెబుతారు. అక్కడికి కవులేదో స్వర్గం నుండి దిగినట్లు, భూమి మీద విమర్శ
      కులు వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నట్లు. నువ్వు ముందన్నట్లు, మనమేం రాస్తున్నామో మనకి స్పష్టత ఉండాలి. సాహిత్యంలో ఉన్నతశిఖరాలమీద మనం దర్శించే సృజనకారులు మనకున్న తెలివి లేకనా, జీవితాంతమూ అధ్యయనం చేస్తుంటారు. నీ మంచి ప్రయత్నానికి అభినందనలు.
      Friday at 3:17pm ·  · 2

    • Bvv Prasad Nanda Kishore నందూ, నీ కన్నా పెద్దలెవరు. మాట్లాడవా, వినాలనుంది.. : )
      Friday at 3:27pm ·  · 3

    • Varnalekha Varu shailaja garu ikkada neno miro marokaro nerpithe kavithvam rase heena sthithi yevariki leadhu. andharu kavule.... dhandalu dhandanalu kuda akkaraledhu. nachithe like lekunte side :)
      Friday at 3:32pm via mobile ·  · 1

    • Varnalekha Varu BVV sir ippati vimarshakulu okappati kavulani theliyajeyandi kastha anthaa bayapaduthunnaru

    •  via mobile ·  · 2
    • Varnalekha Varu bhava vyaktheekarana kavithallone kadhu bayata kuda cheyochane boroasaa ivvandi mundhu. mana dheshamlo matladevariki kodhavaledhu dhuradhrushtavashathu venakale yekkuva matladutharu mundharakante
      Friday at 3:39pm via mobile ·  · 2
      Nanda Kishore మీరందరు చదివినవే అయి ఉండొచ్చు.పరుసవేది పదిరకాలు అని ఎక్కడో విన్నా..ఈ చర్చకి, మీ ప్రయత్నానికి ఈ నిర్వచనాలు కూడా ఏమన్నా పనికొస్తాయో చూడండి. గొప్ప ఆర్టు ముఖ్యం. కవిత్వం వినోదం కాదు,అనుభవం.మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి,ఉన్నత పరివర్తన కలగ
       చెయ్యాలని ప్రయత్నిస్తుంది..........- గొప్ప కవిత్వం ప్రధాన లక్షణమేమిటంటే, ఎవరి తాహతుని బట్టి వారికి ఎంతో కొంత అందించగలగడం.కొంత స్పష్టంగా తెలుస్తుంది. జయదేవుడి అష్టపదులు,కృష్ణశాస్త్రి గీతాలు,మాటల అర్ధంతో,ఎంత చెపుతాయో,ధ్వనితో,సంగీతంతో,భాషా మాధుర్యంతో అంతకన్న ఎక్కువ చెపుతాయి. .....ఈనాడు తిండికీ,వొంటికి,మనస్సుపైపొరల ఆహ్లాదానికి ఉపయోగ పడని కళ కాకుండా పోతుంది.లోకం ఇంత విడిపోయింది. .......గొప్ప కవిత్వ సృష్టిగాని,అనుభవంగాని మనసువెనక ఎంతో లోతున ఉండే Sublime of Supernal Planeలో జరుగుతుంది.మనసుకు తెలిసేది స్వల్పం.............. "ఖగరాజ నీ యానతి విని వేగ చనలేదో గగనానికి ఇలకి బహు దూరం బనినాడో కాకపోతే నువ్వెందుకు రావు?" అని పాడతాడు కవి. ఆ విరహం ఏ హృదయంలో ఏ కొద్దిగా మండినా,అతని తపనని నీకు అర్థం చెయ్యడానికి అతనిచ్చిన రూపకల్పన విష్ణూ,వాహనం గరుడుడూ నీకు అనుభవానియ్యడానికి అభ్యంతరాలు కానక్కర్లేదు. కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం. కవిత్వం చదివైన తరవాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా! నీకు తోచనిది కనపడనిదీ కవి చెప్పిన తరవాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వచ్చేది,నీకు సరిపడే కవిత. (-గీతాంజలి అనువాదానికి చలం రాసుకున్న ముందుమాట మొదటి భాగంలోంచి- ) తిలక్ రాసిన "నవత-కవిత", అఫ్సర్ గారి అక్షరం blogలో ఈ పేజిని కూడా వీలైతే ఒకసారి చదవమని కవిసంగమం మిత్రులందరికి మనవి. మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు afsar2008.wordpress.com
      Friday at 3:47pm ·  · 4
      Bvv Prasad నిన్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు వచ్చారు, మా ఊరు, కాసేపు మా ఇంటికి కూడా. ఆయన తన ముందుతరం గొప్పవ్యక్తులు శ్రీశ్రీ, చలం, విశ్వనాధ, తిలక్ ఇలా అందర్నీ, వాళ్ళ ప్రతిభనీ, వ్యక్తిత్వాలనీ తలచుకొంటూ మాట్లాడుతుంటే, చాలా దిగులు కలిగింది. సాహిత్యమే జీవితంగా గడిపిన వాళ్ళెక్కడ, మహాలౌక్యంగా కాలం గడిపే మనమెక్కడ. నువ్వన్నట్లు ఒక లైక్ కొడితే సరిపోయేదానికి, ఇన్ని చర్చలెందుకు. బహుశా, ఈ రోజే ఆఖరు నా సిద్దాంత చర్చలకి.
      Friday at 3:48pm ·  · 4
      Nanda Kishore ‎2 మిత్రులకి,పెద్దలకి వందనాలు. ప్రశ్నించడం మార్పుకి మొదటి గుర్తు. భాష ముఖ్యమా,భావం ముఖ్యమా? కవిత్వం రాయడానికి inspiration తప్పనిసరా?
      కవిత్వమంటే ఉత్త ఉత్తరంలాంటిదేనా? రోజూ మంచి ప్రశ్నలు చూస్తున్నాను.స్పందించాలంటే ధైర్యంసరిపోవట్లేదు. ముందు ఎందుకు రాస్తున్నారు?ఎందుకు పోస్ట్/ప్రింట్ చేస్తున్నారు? ఈ రెండు ప్రశ్నలకి ముందు సమాధానాలు ఆలోచిద్దాం. బహుశా నాకోసమే రాసుకుంటాను అన్న నా సమాధానంతో మీరు ఏకీభవిస్తారనుకుంటా..రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు, మీరు రాసుకునేది మీకు సంతృప్తినిస్తుందా లేదా అన్నది ఒకసారి నిర్ధారించుకోండి.ఇస్తే ఇంకేం బాధలేదు.లేదంటే కారణం భాషో,భావమో గమనించుకుని పఠనం ద్వారా ,జీవితాన్ని మరింత నిండుగా అనుభవించడం ద్వారా సరిచేసుకోండి. ఇక skilled writer కావాలనుకున్నప్పుడు తప్ప inspiration గురించి ఆలోచించాల్సిన పనిలేదనుకుంటా..మన అనుభూతులు మన ఆధీనంలో ఉంచుకోగలిగినప్పుడు కవిత్వం ఓ డైరి మాత్రమే అవుతుంది. ఇక రెండవ ప్రశ్న విషయానికొద్దాం.ఈ శిల్పం,అలంకారం గురించి నాకు తెలీదుగాని మనస్పూర్తిగా అనుభవించకుండ,పాఠకుడిలో ఓ feelగాని,thoughtగాని create చేయలేదని తెలిసీ పోస్ట్ చేయవద్దు. పేరుకోసమో,అభిమానంకోసమో రాసేది అందరికి కవిత్వంగా స్పురించకపోవచ్చు.లేదు మాకు బాగా అనుభవమున్న విషయాలు రాసిన కవిత్వ రూపాన్ని సంతరించుకోలేకపోతున్నయనే మీకనిపిస్తే మీరు కవిత్వం పోస్ట్ చేయడంగురించి పునరాలోచించుకోండి.రాయగా,రాయగా కవి అవుతారని నేననుకోను. ఇక్కడ చాల మంది మంచి కవిత్వం రాస్తున్నారు.అది మీరు రాసిందే అనుకుని చదవండి.మీరు రాస్కున్నదాన్ని ఓ పాఠకుడిల చదువుకోండి.కొత్తగా రాస్తున్నవాళ్ళని ప్రోత్సహిస్తున్న మాట నిజం.అలాంటి ప్రోత్సాహం వల్లే నేనూ రాస్తున్నాను. అయితే విమర్శకంటే,మెచ్చుకోవడం కంటే ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడానికి ప్రయత్నించండి. భాషనో,శైలినో మనకున్న ప్రాధమిక జ్ఞానంవల్ల స్పురించేదే.. ఆ జ్ఞానం వాళ్ళకి అందించడానికి ప్రయత్నించండి.నిర్భయంగా ఏం బాగాలేదో చెప్పండి. అతిగా ప్రతిస్పందిస్తే అందరము కలిసే సమాధానపరుద్దాం. వయసులో ఉన్న వాళ్ళ కవిత్వం రావట్లే అనడం బదులు వాళ్ళతో interactఅయ్యే ప్రయత్నాలు చేసి,తగిన సలహాలివ్వండి. ఈ దిశగా కవిసంగమంగా మనందరం కలిసి ఉద్యమిద్దాం. (గతంలో ఇలాంటి చర్చ జరిగినప్పుడు రాసింది.నాలో పెద్దగా ఏం మార్పొచ్చినట్టు కనిపించక అవే వెతికి మరీ paste చేస్తున్నాను.తప్పులుంటే మన్నించాలి.)
      Friday at 3:49pm ·  · 6
      Bvv Prasad నందూ, బాగా రాసావు. మంచి కవిత్వం తో పాటు మంచి ఆలోచనలకి కూడా, కవిసంగమం వేదిక కావాలని కోరుకొన్నాను, ఇక్కడికి వచ్చినపుడు. కానీ, కొన్ని రోజులుగా ఎందుకో బాగా డిస్ట్రబ్ అవుతున్నాను, ఆర్ద్రతగా చెప్పాల్సినవి, పదునుగా వస్తున్నాయి. ఫరవాలేదు, నీలాంటి కొందరున్నారు ఇక్కడ, దీనికి సంబంధంలేని మరికొందరినీ నెట్లో చూస్తున్నాను. ఇక విమర్శలో ఉండక్కరలేదు. నేను ఇక నా కవిత్వం మాత్రమే పోస్ట్ చేస్తాను. ఏమైనా ఆలోచనలుంటే నా బ్లాగ్ లో రాసుకొంటాను.
      Friday at 4:06pm ·  · 5
      Nanda Kishore ‎Bvv Prasadపిల్లలకు చదువెక్కట్లేదని సార్లందరు ఉద్యోగాలు మానేస్తారా ఏంటి? Kavi Yakoobప్రిన్సిపాల్ గారు..హలో..ఎక్కడున్నారు మీరు?
      Friday at 4:13pm ·  · 5
      Kranthi Srinivasa Rao బివివి సోదరా నీలాంటివాళ్ళు ...అప్పుడప్పుడు నోరుచేసుకొంటూనే వుండాలి .....ఇలా అనకూడదు .....విమర్శఆందరూ చెయ్యలేరు ....లోతయున అవగాహన వుంటేనే సాద్యమవుతుంది ......
      Friday at 4:15pm ·  · 5
      Bvv Prasad ‎Varnalekha Varu నేను నీ మాటల్ని సానుకూలంగానే తీసుకొన్నానమ్మా. నామీదే నాకు కోపంగా ఉంది. నిజమే చాలామంది భయపడుతున్నారనిపిస్తుంది. అందుకే ఇక విమర్శ రాయనన్నాను. ఇప్పటికే నాదికానిచోట కొంత అతిగా ప్రవర్తించాను. కవిత్వం వరకూ, నేనూ రాస్తాను, చదువుతాను. అదే మంచిది, మన అందరికీ.
      Friday at 4:16pm ·  · 3
      Kavi Yakoob ఈసారికి ఇక చర్చ ముగిద్దాం!! విమర్శల క్లాస్ ముగిసింది.మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం!
      Friday at 4:20pm ·  · 3
      Varnalekha Varu ‎:(
      Friday at 4:21pm via mobile · 
      Kranthi Srinivasa Rao ్స్స్స్స్స్స్స్స్స్స్స్స్ గప్చిప్ .....
      Friday at 4:21pm ·  · 1
      Nanda Kishore Ok sir! oka apology raaskOvaali! ""విమర్శకంటే,మెచ్చుకోవడం కంటే ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడానికి ప్రయత్నించండి. "" విమర్శ అనే పదాన్ని పత్రికలవాళ్ళ లాగా నేనూ వ్యతిరేఖార్ధంలోనే రాసాను. నన్నైతే తిట్టుకోవద్దు.bvvసర్ చేసే సద్విమర్శ గురించి కాదు నేన్ మాట్లాడింది. వరలక్ష్మితో '"అవి కవికి ఆమోద యోగ్యమైతే సవరిస్తాడు లేదంటే లేదు"-అని కరుగ్గా రాయించైన విమర్శల గురించి. అపార్ధాలు గట్రా ఏం చేస్కోవద్దు ఎవ్వరైనా!
      Friday at 4:34pm · Edited ·  · 3
      Varnalekha Varu na valla yevaraina hurt aithe chinna pillanani vadhilesi dhivinchandi
      Friday at 4:30pm via mobile ·  · 4
      Santhisri Santhi bvv prasad garu ..! meeru alaa andam baledu. bayamlekunda abhayam ivvandi. pl continue ur effort on we..!
      Friday at 4:37pm ·  · 1
      Praveena Kolli కవిత బాగుందంటే బాగుంది అనే ఒక మాటను కామెంట్ లో సరిపుచ్చాకుండా, సద్విమర్శలు కుడా అవసరం.
      Friday at 4:39pm ·  · 4
      Karimulla Ghantasala Vadilede ledu, Varnalekha, kakapothe andaroo mimmalni deevisthaaru adakkundaane. 1000 challagaa bathakandi. Kaanee mee thiyyani kavithvam, mantalu repe mee vachanam maaku pamchutoone undaalani sharathu.
      Friday at 4:46pm via mobile ·  · 1
      Varnalekha Varu ‎:)
      Friday at 4:48pm via mobile ·  · 1
      Karimulla Ghantasala ‎1000 samvatsaraalani naa ardham
      Friday at 4:55pm via mobile ·  · 1
      Kranthi Srinivasa Rao ్వర్ణలేఖా .......ఏరంగు వస్తువు నీడయునా నల్లనే .....విమర్శ్శ కటువుగానే వుంటుంది ...అందరికీ మింగుడుపడదు ......హాయుగా కవిత్వం రాయు ....ఇందరిపెద్దవాళ్ళ మద్య పోస్ట్ ఛేసి మెరుగులు దిద్దించుకో ....ఆశీర్వాదాలు ....
      Friday at 5:04pm · Edited ·  · 4
      Varnalekha Varu nenu nakosam vadhinchaledhu :)
      Friday at 5:10pm via mobile ·  · 1

    • Karimulla Ghantasala 
      ‎'ఇందరిపెద్దవాళ్ళ మద్య పోస్ట్ ఛేసి మెరుగులు దిద్దించుకో' అనడం ఎందుకో సబబనిపించడం లేదు, Kranthi Srinivasa Raoగారూ. వర్ణలేఖ గారు కానీ, వారి సహచరులు గానీ ఏమంత చిన్నపిల్లల్లా తోచడం లేదు. ఆ మాటకొస్తే వీరిలో చాలా మంది మన లబ్దప్రతిష్టులైన సీనియర్
      ‌ కవులు ఎంతో మంది కంటే మెరుగ్గా రాస్తున్నారు, కాదంటారా? తెలుగు కవిత్వంలో బహుశ ఒక కొత్త శకానికి వీరు నాంది పలికినట్లే కనిపిస్తోంది.వివిధానేక వస్తువులతో, శైలీ భేదాలతో ' కవి సంగమాన్ని' రంగుల హరివిల్లుగా మార్చేసింది వీరేకదా? నిజానికి ఎంతో కాలంగా స్తబ్దుగా ఉన్న సీనియర్లు ఎందరో ఇప్పుడు వీరి ప్రేరణతో తమ కలాలనీ, గళాలనీ సవరించుకుంటోంది నిజం కాదా? కనుక, పెద్దలు పునరాలోచిస్తే బావుంటుంది.
      Friday at 8:01pm ·  · 3
    • Kavi Yakoob Well said Karimulla Ghantasala garu!
      Friday at 8:02pm ·  · 1
      Karimulla Ghantasala Thank you, Yakoob bhai.
      Friday at 8:57pm ·  · 1
      Sky Baaba SADVIMARSHA CHINNAVAARU CHESHAARAA, PADDAVAARU CHESHAARAA ANEDI MUKHYAM KAADU.. VIMARSHA VIMARSHE..! VIMARSHA NU VAYASUNU BATTI, PARICHAYAANNI BATTI CHUDAKUDADANI ANDARIKEE THELISINDE..!!
      Friday at 10:42pm ·  · 3
      Karimulla Ghantasala Yes, I completely agree with you, Skybaba, there should be no distinction. I strongly feel that we should not call 'youngsters' and 'elders' regarding the poets, especially in today's context of many young ones taking charge and lead of Telugu poetry. I further feel that these are the poets that reflects the future of our poetry. They deserve honour on par with those established ones. Thanks.
      Friday at 11:07pm via mobile ·  · 2
      Subbarayudu G Kameswara Discussion chaalaa baavundi. Vimarsa maatram evaruu maanavaddu. Bvv Prasad gaaruKranthi Srinivasa Rao gaaru,, Nandakishore gaaruu chaala chakkagaaa palgonnaaru. NandaKishore ki abhinandanalu. Kavita oka pratiika. Padaalu mottam pratiikanu
       sameekaristaayi . Okariki kanabadinaTTu inkokariki kanabaaDaalani Rule ledu. Oka padamo, oka vaaDuko oka Reader ki (All readers are equally important readers... otherwise they wd not come anywhere near poetry) oka laaga tostey inkokariki inkokalaaga sphuristundi. Andukey kavita nitya nootanamgaa vuntundi. PraveeNa Kolli gaaru annaTTu enduku baagundo, enduku vibhedichaalsi vochchindo cheppaDam manchi pani. Vimarsa eppuduu sadvimarsagaane gurtinchaali. Oorikey pani gaTTukoni vimarsinchaDam personal ideology leka personal vaishamyaaluu unteney jarugutundi. Anduku Vimarsa ni tyajinchkanDi.--Subbu
      Friday at 11:16pm ·  · 1


పూర్తి చర్చను సరాసరి గ్రూపునుండి చూడాలంటే క్రిందిలింకు లోకి లాగిన్ అవ్వండి.
http://www.facebook.com/groups/kavisangamam/permalink/436907953028629/