పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, అక్టోబర్ 2013, బుధవారం

బుక్ ఇంట్రో

అవేద( చదివిన కవితా సంపుటి)గాయాల పూదోటలో విశ్రమించినవేళ గుండె మీది పొరల్ని చీల్చుకొని వచ్చిన కవితా కల్పతరువు మొక్కై మానై విస్తరించినపుడు కల్గే వేదనను అనుభవించి అనుభూతించి తనలో తాను తుఫాను కమానైవూగి మరుక్షణం మహాప్రవాహమై తాను నడిచినా మేరా డప్పుల మోతల్లో బాధా తప్త హృదయాల విషాద గీతికల్ని పలికించి కవిత శకలాల పరిమళాల్ని తన 'అవేద'కవితా సంపుటిలో అంతటా వెదజల్లిన కవి ప్రేమ్ చంద్ ను నేనేకాదు ఎవరైనా మంచి కవి అనక తప్పదు.
కవిత్వం వొక ఆత్మకళగా భావించే కవుల్ని అందం , ఆనందంతో పాటు చైతన్యం కూడా దాని పరమావధి అని నమ్మే కవుల్ని , విప్లవ దృక్ఫథం ద్వారా సామాజి క అభివ్యక్తి ని ఆహ్వనించే కవుల్ని అస్త్తిత్వ సంక్షోభంలో చిక్కుకున్న ఆధునికమానవుడి అనుభవాల్ని అధిరూపకం ద్వారా వ్యక్తపరుస్తున్న కవుల్ని ప్రే మ్ చంద్ గాడంగా అధ్యనం చేయడం వల్లనేమో ' అవేద' లాంటి కావ్యాన్ని అస్తిత్వం లోకి తేగలిగాడు.
1990 దశకంలో వున్న కవిత్వమంతా ఏక శిలా నిర్మితంకాదు
ఏక ప్రవాహం కాదు. అది వివిధ పాయలుగా ప్రవహించిన ప్రవాహం.ప్రేమ్ చంద్ 'అవేద' లో తన కాలపు వాదాలను , సమస్తమానవ అనుభూతుల్ని కవిత్వాభి వ్యక్తి మార్చే ప్రయత్నం చేశాడు.
,దాహం వొంటరి అంకెతో నేరవేరిందా'- అంటూ ప్రశ్నించి న కవి లింగభేధమేందుకు?- అంటూ ప్రశ్నించిస్త్రీమారకం విలువగా మారిన క్షణాన్ని నిరసించాడు తన కవిత్వం లో .
'నేను కుట్ర గురించి మాట్లడుతున్నాను/డిసెంబర్ 6 న పట్ట పగలు దేశం నడిబొడ్డు మీద జరిగిన కుట్ర గురించి ... '- మతో న్మాదందుర్మార్గాన్ని సూచించడమే కాక ఉత్పత్తికీ కారకులైన దళితులు ,బహు జనులు ,మైనారిటీల వాదాల్ని సహానుభూతితో కవిత్వం చేయడంమే కాదు వారి పక్షానా నిలుస్తాడు.
'ఋణగ్రస్తుడా ఏం ఫర్వాలేదు ' - అని ప్రారంభించిన కవిత మూడో ప్రపంచ దేశాల ఆర్థిక స్థలాలను ఆక్రమిస్తున్న అగ్రరాజ్యాల కుట్రను బహిర్గతం చేస్తుంది . విప్లవం పట్ల విప్లవకారుల పట్ల కవికి గల విశ్వాసం కవిత్వం తొట్రు పాటు లేనితనాన్ని వ్యక్తం చేస్తుంది .
ప్రాంతీయ,జాతీయ, అంతర్జాతీయసమస్యలపై సైతం కవి తన అక్షరాస్త్రాలను సంధించాడు. '
'నానుదుటి మైదానంమీద/చలమలుపుడుతున్నాయి/
అప్రయత్నంగానాచేయి నీటిని తోడేస్తుంది'-లాంటి కవిత్వ పంక్తులు అనేకం కావ్యమంతా పరుచుకొని కవి భావనా పటిమను తెలుపడమే కాక కవిత్వమంటే పదాల స మూహాలకూర్పు కాదు తెలియచేస్తాయి.
ఊహించగల మేధ ,స్పందించగల హృదయం,రాటుదేలిన కలం
ఈ మూడింటి సమ్మేళనమే ఈ 'అవేద' - అని చెప్పొచ్చు.
అందరికీ నమస్కారం.మళ్ళీ నన్ను ఈ మార్గం లోకి మళ్ళించి న యాకూబ్ కు ధన్యవాదలతో మళ్ళీ మంగళ వారం మరో సంపటి పరిచయంతో.....కలుద్దాం.
                                                                                                                                                                                                                                                                                                                                                                      టి.రాజారామ్(15-10-2013)