పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Rambabu Challa కవిత

సుదీర్ఘ పయనం// Dt. 6-2-2014 ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పూర్వం నువ్వెవరో.. నేనెవరో.. ఇదేరోజున భవసాగరంలో నాకు చేయందించి సుడిగుండాలు, తుపానులు, బడబాగ్నులు ఎన్నో..ఇంకెన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ ఇప్పటికీ నానీడగా ఉన్ననీకు.... ఈసాగర మధనంలో.. రత్నంలాంటి కూతుర్ని, మణిపూస లాంటి కొడుకునిచ్చి వారి ఔన్నత్యానికి శ్రమించి, ప్రేమానురాగాల్ని పంచిచ్చిన నీకు.... ఈసంసార సుదీర్ఘగమనంలో పడుతూ లేస్తూ.. అపుడు పట్టుకున్న నాచిటికనవేలునలాగే వదలకుండా నాతో పయనించే నీకు.... రాజీలేని, రాజీనామా లేని, పదవీవిరమణ లేని అవిశ్రాంతమైన నీసేవలకు.... ఏమివ్వగలను??? నేనేమివ్వగలను??? నీనుదుటిపై ప్రేమానుబంధాల పెదవి స్పర్శ తప్ప.. ఆపాత మధురాల స్మృతులు తప్ప.. అన్నీ ఇచ్చిన నీకు నాదోకోరిక.... "నన్ను నీఒడిలో శాశ్వితంగా నిదురించే భాగ్యం కల్పించు" “””ఫిబ్రవరి ఆరున మాపెళ్లిరోజు సందర్భంగా నా శ్రీమతి రాజేశ్వరికి ప్రేమతో అర్పించుకున్న కవితాకుసుమం”””

by Rambabu Challafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awTfxY

Posted by Katta

Kavi Yakoob కవిత

విజయనగరంనుంచి పాయల మురళీకృష్ణ అనే కవిమిత్రుడు ,ఇటీవలే తాను ప్రచురించిన కవితా సంపుటి ' అస్తిత్వం వైపు' పోష్టులో నిన్న పంపాడు. సాయంత్రం ఆ సంపుటిని చదువుతూ గడిపాను. కె.శివారెడ్డి గారు ముందుమాట రాశారు. అందులోంచి కొంతభాగం ~ ఒకానొక విషాద సమయంలో Poetry makes me you ! ................................................................... " ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా ఉంటా ; ఎవరు కేకేసినా వెళ్ళిపోతా- ఎందుకో తెలుసా- ఒకటి : to locate a new poet, to discover new voice, fresh and vibrant voice. రెండు : ఈ సంచారాలలో నన్ను నేను కనుక్కోవడానికి, బతికించుకోవడానికి, ఎప్పటికప్పుడు కొత్తతరంతో Readjust చేసుకోవడానికి, కొత్తతరపు ప్రాణవాయువును నా గుండెలనిండా నింపుకోవడానికి, ఇదొక నిరంతరాన్వేషణ. అలా ఆకలిగొన్న కళ్ళతో ఆవురావురుమంటూ తిరుగుతున్నప్పుడు తటస్థపడ్డాడు,మురళీకృష్ణ. పాయల మురళీకృష్ణ.విజయనగరం జిలా, మెంటాడ గ్రామవాసి,ఉపాధ్యాయుడు. తనూ,నాలానే తన పిల్లల్లో,విద్యార్థుల్లో తనను డిస్కవర్ చేసుకుంటానికి ప్రయత్నిస్తూ ఎక్కడో, ఏ పత్రికలోనో కవిత అచ్చయితే - కవిమిత్రులు ,' అర్థం కాకుండా రాస్తున్నావని' అంటే, కించిత్ కలతపడి, అయోమయపడి నాకు ఫోన్ చేస్తే- నేనడిగితే తను ఆ కవిత పంపితే -చదివి Do not worry-you are on the correct line, Go ahead అని ప్రోత్సహించా. తర్వాత నేనూ ఆలోచించా తోటివారు అలా ఎందుకన్నారని. ఒక కొత్తరకమైన ఆధునిక కవిత్వ వ్యక్తీకరణ, పద్యనిర్మాణం కారణమని అన్పించింది. అది తనచూపు నుంచి- తను కవితను ఊహించే పద్ధతిలోనే ఒక కొత్తదనం ఉండటాన, భిన్నంగా ఉండటాన, తనదైన కవిత పరిభాష ,నిర్మాణం, సాధించుకునే క్రమంలో ఉన్నాడు కాబట్టి. వస్తువుని చూడటం- చూడటంలోనే వినూత్నంగా ,విశిష్టంగా ఉండటం, బొమ్మమీద బొమ్మ కూర్చడం- పదబంధాలు, వాక్యనిర్మాణాలు -ఎత్తుగడ ,నిర్మాణం, మలుపులు- వీటన్నిటిలో తనదయిన ప్రత్యేకత సాధించడానికి ప్రయత్నించే క్రమంలో - మామూలుగా ఉన్న వ్యక్తీకరణకీ, నిర్మాణానికీ భిన్నంగా ఉండటం వల్ల - తోటికవులు,పాఠకులు యిబ్బంది పడ్డారా/ పడే అవకాశం ఉందా? కవిత అచ్చవుతుంది. పఠనీయమవుతుంది. మరోసారి చదివి -కవితలోకి చొరబడే ప్రయత్నం చేయడం లేదా? బద్ధకపు పాఠకుడి ' సాధారణీకరణ' ను లెక్కలోకి తీసుకోవాలా- కొత్త కవిత్వాన్ని క్రమంగా పరిచయం చేయాలా -వద్దా? ఇలా చాలా విషయాలు ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే -పాయల మురళీకృష్ణ, పాయల మురళీకృష్ణ అయ్యాడు. ఏ కవయినా ఆ కవే కావాలి. మరొకడు కావడానికి వీల్లేదు. తనదయిన వ్యక్తీకరణ కవిత్వపు ఉనికిని తను చాటాలి. " పాయల మురళీకృష్ణ నంబర్ ~ 89652 86969

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awOXqn

Posted by Katta

నవీన్ కుమార్ కొమ్మినేని కవిత

!!కొన్ని ప్రశ్నలు!! గతించిన కాలాన్ని సరికొత్తగా సుతిమెత్తగా స్పృశించి కళ్లనుండి జారుతున్న జ్ఞాపకాలతో కడుపు నింపుకుంటాను ఆకలంటే అర్థమేమిటి? శ్రీరంగాన్నో దేవులపల్లినో ఆత్రేయనో వేటూరినో దోసిట్లోకి ఒంపుకుని తనివితీరా తాగేస్తాను దాహమంటే ఏమిటి? ఒకక్షణం ఆకాశవీధిలో విహంగాన్నై విహరిస్తే మరుక్షణం సాగరగర్భాన చేపనై ఈతకొడతాను నా ఇల్లెక్కడున్నట్టు? ఇంకా, నేటి నేనుగా నిన్నల్లోకి పోయి నుంచుంటే నాకు నేను నవ్వులాటగా కనిపిస్తాను మధ్యలో ఏం జరిగినట్టు? ముద్దబంతి పువ్వుని మురిపెంగా చూస్తుంటే మొదటిప్రేమ గుర్తొచ్చి మనసు ముద్దముద్దవుతుంది ఆనాటి ప్రణయాలిప్పుడేమైనట్టు? -------నవీన్ కుమార్ కొమ్మినేని (06/Feb/2014)

by నవీన్ కుమార్ కొమ్మినేనిfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awTitL

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-20 ఒకరోజు కొందరు తారసపడినప్పుడనిపిస్తుంది ప్రపంచం ఎంత కఠినమైనది ఎంత కర్కశత్వం తో ఉన్నారీ మనుషులు వీళ్ళతో రాతిలా ఉండటమే మేలు అని..!! ఆ మరుసటిరోజే మరెవరో కనపడతారు స్నేహదీపాలు వెలిగే కళ్ళతో మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందా అనిపించే కరుణార్ద్రమైన మనసు తో.. ఇక దానితో మన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటాము.. ఈశ్వరా ..! ఈ అలని పైకి పోనివ్వవు,పూర్తిగా కిందికి పడనివ్వవు కదా..! ------------------------------------------ 8-2-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kkYEvp

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నీవు....: నిశీది వేళ నిబిడాంధకారంలో నన్నల్లుకుని పెనవేసి చుట్టేసిన సన్నజాజి తీగేవు నీవు.. వేగుచుక్క పొడిచి వేకువ పొడసూప తమకమ్మున నా మెడను పామిన ముదితవు నీవు.. భానోదయపు లేలేత కిరణాలకు సుతారముగా నా కౌగిలిని వదలనంటూనే వదిలిన వనితవు నీవు.. స్వప్నమున రేరాజును గని కలల ప్రపంచమున విహరించు నాకు సంధ్య కెంజాయన తేనీటి సౌరభాలు అందించు దేవేరి నీవు.. అరుణారుణమును దాల్చిన నుదుటి సింధూరముతో సకల శుభప్రధాయినియయి ఎదుట నిల్చి సుప్రభాత గీతికలు పలుకు సుదతి నీవు.. పలుకులో కులుకువై పదంలో మలుపువై పాటలో తేటవై పల్లవిలో ఎద మల్లియవై బ్రతుకు బాటన బృందావనిని పరిచిన పూబాల నీవు.. అహరహము శ్రమియించి విశ్రాంతి యన్నది మరచి విలాసాల మేడను నిర్మించిన విధుషిమణి నీవు.. ఎంత చెప్పినా తరగని కల్పనా రీతులకు వన్నెలను కూర్చిన కావ్య ప్రబంధపు కవితా నాయిక నీవు.. ఏం చెసినా చెరగని ఋణబందపు అనుబందమై మమతల సామ్రాజ్యాన్ని వెలయించిన మానినీమణి నీవు.. 07/02/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cb54VG

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

- చిరాశ // స్వామి దర్శన౦ // ******************************** స్వామి సన్నిధి చేర వడి వడిగ నే బోవ సవ్వడె౦దుకె మువ్వ సడిసేయబోకే స్వామి వారిని జూసి కైమోడ్పులిడువేళ గలగలలు నీకేల ఓ మట్టిగాజా పరవశమ్మున నేను స్వామినే చూస్తు౦టె చూపు మసకగునట్లు కన్నీరు ని౦పకే ఓ వెర్రి కన్నా ********************************* - {07/02/2014}

by Chilakapati Rajashekerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cb55sP

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || ఇదీ ప్రేమే..? || నన్నువొంపి నీ చేతులలోకి పోసుకొని ప్రతీ రక్త కణాన్ని పరీక్షించి రెక్కలు తెగిన స్వేచ్ఛను ఎగరమని చప్పట్లు కొట్టి నవ్వుకుంటూ తిరిగి నాకు బదులు నిన్ను నింపి గాజు గదిలో మూతపెట్టి భద్రంగా దాచి ముద్దాడి i love you అనడమూ ప్రేమేనా ..? మీ చాంద్ || 07.Feb.14 ||

by Chand Usmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bBtrz2

Posted by Katta

Jagadish Yamijala కవిత

కనిపించకుండా పోయింది నా హృదయం ----------------------------------------------- నీడను నమ్మిన నీకు నిజాన్ని నమ్మే మనసు లేకుండా పోయింది మాటను ప్రేమించిన నువ్వు ముఖాన్ని చూడటంతోనే నేను నచ్చకుండా పోయాను నవ్వును ప్రేమించిన నువ్వు నవ్వు అందాన్ని ఆస్వాదించడం తెలియకుండా పోయింది ఊహల్లో ఉన్న నీకు ఆలోచించడం తెలియకుండా పోయింది విలాసాలు కావాలనుకున్న నువ్వు జీవితంలోని వర్ణాలు తెలియకుండా పోయాయి నీకు ఇవన్నీ తెలియకుండా పోవడం వల్ల నా హృదయం తెలియకుండా పోయింది నీకు -------------------------------------------------- యామిజాల జగదీశ్ 6.2.2014 ------------------------------------------------- ..

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itB6AV

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c9BT5s

Posted by Katta

Pusyami Sagar కవిత

జవాబు దొరకని ప్రశ్నలు _____ పుష్యమి సాగర్ ఓ దయ గల తల్లి ... కోరికల సెగలలో నువ్వు కాలి పోతున్నప్పుడు వెన్నల రాత్రుళ్ళు , వెచ్చదనపు చెలమలు చీకటి పొదల గుంపుల్లో భావ ప్రాప్తి అందించిన చెమట చుక్కల్లో నువ్వు మైమరచి పొతునప్పుడు గుర్తు కు రాలేదా....!!!!! రెండు క్షణాల సుఖం కదపు లో పిండం మై సమాధానం లేని ప్రశ్న ని సందించి నిలదీసినపుడు పలాయన వాదానికి మారు గా నిలబడ్డావెందుకు ...!! పాపపు ఫలితం పేగులకు చుట్టుకొంది పోనీ లెద్ధురు ....అవాంచిత గర్భమని గంట లో దేవుడు ఇచ్చిన ఫలాన్ని చిదెమిసి రక్తం లో బయటకు పంపావు ... నీ పుట్టుక మరచితివా ....!!!! మానవత ను మంట కలిపి వినాశాకరపు ఆలోచన ను వంటి కి చుటుకొని మరో ఆనంద లోకం లో విహరిస్తూ వున్నావు నడి వీదులలో ...దిక్కు మొక్కు లేక చిరిగి పోయిన జీవితపు విస్థరాకులను గుర్తు తెచ్చుకో ...!!!! అయ్యో ...ఇదెక్కడి చోద్యం !!! స్రీలు పూజింప బడాలని బొడ్డు కోసిన దగ్గర్నుంచి చెవుల్ల్లొ ఇల్లు కట్టుకొని చెప్తూనే... పసి పిల్ల పుట్టింది అని .. పెంట కుప్ప లో, రోడ్డు పక్కన నాలా లో dead or alive గా పడేసి నీవు ప్రతి పూట పేపర్లకు ...బుల్లి తెరలకు ఎక్కటం ద్వంద నీతి కి మారు కాదా.....!!!! ఇక్కడ వీధికో కుంతి లు ఉన్నంత కాలం గజానికో చెత్త కుప్పలలో కను మూసిన అనాధ శిశువుల ... ఆత్మ ఘోషలు ...వినిపిస్తూనే వుంటాయి....!!! (07-feb-14) (రోజులు నిండని పసి పిల్లలను చెత్త కుప్ప లో పడేసిన వార్త ను చూసి కలత చెంది రాసిన కవిత )

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kjLdvN

Posted by Katta

Kalidas Darla కవిత

:::::::: వసంతం :::::::::: ఎంతని చెప్పనూ.... నా.. తలపులన్నీ నీ చుట్టూనే.. నిన్ను తలచినంతనే మనసు వసంతమవుతుంది. కాలం ఇసుకతిన్నెలపై చిరుగాలి గీతల్లాంటి నీ జ్ఞాపకాల సంతకాల్ని పదే పదే తడిమి చూసుకుంటుంది హృదయం, వలపు వాకిట్లోకి వచ్చి వయసు దోసిట్లోకి, అనురాగపు అమృతాన్ని వయ్యారంగా వోలికిస్తావు.. నువ్వు. నవ్వులు నువ్వు రువ్వావో... చిరు నవ్వే నువ్వయ్యావో... అర్ధంకాని అయోమయంలో ముంచేస్తావు తడిసిన పూలవనం పసిడి వెలుగుల వేకువలో మెరిసినట్లు లక్షలాది నక్షత్రాలు ఓకేసారి వెలిగినట్లు అద్భుతానికి ఆకృతి నువ్వు, ఎన్ని యుగాలుగా పోగైన అందమో ఇది ఎంత తలచినా కలతే... ఎంత చూసినా వెలితే.... దోసిళ్ళకు ఎత్తడం కుదరదు దోచుకుపొవదమూ సాధ్యపడదు అల్లుకుని,ఆఘ్రాణించుకుని,ఇక్యమైపోతే తప్ప ఆస్వాదించడం కుదరదు.

by Kalidas Darlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bBmMF5

Posted by Katta

Chythenya Shenkar కవిత

చైతన్య || "Little things called ♥ " ------------------------------------- నే కరిగి పోవటం బహుశా నువ్వెప్పుడూ చూసుండక పోవచ్చు.... చూసే అవకాశమూ ఇక రాకపోవచ్చు!!! నువ్వెళ్ళాక పర్చుకున్న చీకటిని తరిమేందుకు నన్ను నేను ఎన్నిసార్లు వెలిగించుకున్నానో... ఆ వెలుగులో నిన్ను నే చూసుకుంటూ ఓ వైపు .. మైనానై బాధగా కరిగిపోతూ మరో వైపు... ఈ క్షణాలకు జాలిలేదు నన్ను అమాంతం మింగేయాలన్న ఆతృత తప్ప!!!! నీ ప్రేమ వర్షం నాపై కురిసే ముందు... నీ చూపుల దారులలో నే మొలకెత్తాను!!! చిగురించాను!!!! పుష్పించాను!!!! ఒక్కో క్షణం ఎండుటాకులా రాలిపోతుంటే.. ఆశావాదం లో ముంచి అంటించుకున్నాను.... కానీ ఏం లాభం!! ప్చ్.... యుగాలు వేచాను... క్షణాలలో నన్ను దాటెల్లిపోయావ్!!!!! నేను నువ్వైపోవాలని నా ప్రేమను నీకు చెప్పేందుకు నీకోసం రోజుకో పువ్వేడ్చేది!!! నువ్వులేవిపుడు!!! ఇకపై రోజూ నేనే ఏడ్వాలి.... నువ్వు ఋతువైనా బావ్వున్ను!!!! తిరిగోస్తావనే ధైర్త్యం....చిగురిస్తానన్న ఆశ ఉండేవి... నీకేం తెలుసు?? రోజూ నీ జ్ఞాపకాలు.... ఎన్ని సార్లు నన్ను చిద్రం చేసి వెళ్తాయో!!! నే కోల్పోయినదేంటో... నన్ను దాటి వెళ్ళిపోయే రాత్రులకు తెలుసు!!! నీవై ఉదయించిన నా జీవితం లో నిన్నటికి -రేపటి కి మధ్య.... ఈ రోజింత ఇరుకుగా ఉందెందుకో!!! నాలోని నిన్ను అడిగేది ఒక్కటే... ఒక్కసారి రాలేవా??? నా నమ్మకాన్ని అబద్దం చేసేందుకైనా!!! 07/02/14

by Chythenya Shenkarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e8wCLe

Posted by Katta

Kavi Yakoob కవిత

తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్ ....................................... జనవరి 2009 » వ్యాసాలురచన : చేరా [ఈ వ్యాసం మొదటగా 'చేరాతలు' శీర్షికలో (సెప్టెంబరు 2, 1990) ప్రచురించబడింది. చేరా గారి ప్రత్యేక అనుమతితో యదాతథంగా ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాం. వారికి మా కృతజ్ఞతలు - సం.] స్మైల్‌కు కవిగా కన్నా కథకుడిగా ఎక్కువ పేరున్నట్టుంది. అతను రాసిన కథ పేరు మీదుగా ‘ఖాళీ సీసాల ఇస్మాయిల్’ అనే పేరు రూఢిలో ఉండి. కాకినాడలో ఉంటున్న సీనియర్ కవి ‘చెట్టు ఇస్మాయిల్’ నుంచి వేరుగా గుర్తించటానికి ఇట్లా అనేవారు. ఇప్పుడు కవిగా ‘స్మైల్’ అనే పేరుతో ప్రశస్తి వచ్చింది. ఎక్కువ రాయక పోవటం వల్ల (తనే చెప్పుకున్నాడు స్లో రైటర్నని) స్మైల్‌కి మేజర్ కవిగా గుర్తింపు లేకపోయినా సమకాలిక కవులు ఈయన్ను మంచి కవిగా గుర్తించారు. ఈయన ‘మా అబ్బాయిని కొట్టినప్పుడు’ అనే కవితను రావులపల్లి సునీత రాసిన ‘తల్లిగోడు’ అనే కవితతో కలిపి ఈ శీర్షిక కింద పూర్వం ఒకసారి పరామర్శించాను. ఈ పుస్తకం (ఒఖడే)లో 1966 నుంచి 1990 వరకూ పాతికేళ్ళ కాలంలో రాసిన పన్నెండు ఖండికలున్నాయి. ఈ పుస్తకం విచిత్రమైన పొడుగాటి మీసాలతో సాల్వడార్ డాలీ బొమ్మ ముఖచిత్రంగా పొడుగాటి (ఆడ్) సైజులో ఉంది. ఈ కవికి డాలీ చిత్రాలు ఇష్టం. తన కిష్టమైన చిత్రకారుని బొమ్మ ముఖచిత్రంగా వేసుకుని కవి ఫోటో వెనక వేశారు. ఈ పుస్తకంలో ‘డాలీ నుంచి కాస్త గాలి’ అనే ఒక ఖండిక ఉంది. ఇది కృ.శా. కవిత్వం మీద (చెట్టు) ఇస్మాయిల్, సైగల్ పాట మీద అఫ్సర్ రాసిన ఖండికల సరసన చేర్చదగినది. ఒకోసారి తూలిపోతుంటాం కాదా అని తన మూడ్ గురించి మనకు ముందుగా చెప్పి జ్ఞాపకం వస్తావు డాలీ గడియారం కరిగి ప్రవహిస్తూ అని డాలీని గుర్తు తెచ్చుకుంటూ మంచుముక్క లాగా కరిగిపోతున్నట్టు డాలీ చిత్రించిన గడియారాన్ని గుర్తు చేస్తాడు. కరుగుతున్న కాలాన్ని సంకేతించిన ఈ డాలీ చిత్రం ప్రపంచ ప్రసిద్ధమైంది. వెంటనే దృశ్యచిత్రంతో సమమైన ఊహా చిత్రాలను పదాలతో చిత్రిస్తాడు కవి. ఓ తుమ్మ ముల్లు శూన్యంలోకి కలుక్కున దిగబడినట్టు నిటారుగా నిలుస్తుంది. ఓ కన్నీటి చుక్క దుఃఖపు పావురమై అశాంత గీతాలు ఆలపిస్తూంటుంది. ఈ రెండూ చాలు బాధా తీవ్రతను వ్యక్తం చేయ్యటానికి. కానీ కవి వీటితో సంతృప్తి పడక రెంటినీ కలిపి మరో చిత్రం తయారు చేశాడు చూడండి. ముల్లు మొనమీద ముక్కును మోపి బ్యాలెన్స్‌కి రెక్కల్ని తిప్పలు పెడుతూ నన్ను శపిస్తుంది కదా డాలీ వీర్యాల వానలో నానమని మళ్ళా మనిషిగా పుట్టమని మనిషి మనుగడను గురించిన తాత్విక గీతం ఇది. ముల్లు మొన మీద ముక్కు మోపి బాలెన్సు చేసే పావురం ద్వారా జీవితంలో అర్ధరాహిత్యాన్ని, క్లేశాన్ని చూపించదల్చుకున్నాడు. అధివాస్తవికమైన చిత్రాలు కవిత్వంలో చిత్రించటంలో వేగుంట మోహన్ ప్రసాద్ ఘటికుడు. చాలాసార్లు అతని ఊహల్ని మనం అందుకోలేం. కాని స్మైల్ ఊహాచిత్రాలు అందీ అందకుండా ఒక్కోసారి దూరంగా చాలాసార్లు దగ్గరగా స్పష్టాస్పష్టంగా పోల్చుకోటానికి వీలుగా కనిపిస్తుంటాయి. ఈ కవే డాలీని గురించి, జీవితాన్ని గురించి చెప్పిన మాటలు ఇతని కవిత్వానికి అన్వయిస్తాయి. ఈ గీతంలో డాలీని సంబోధిస్తూ స్మైల్ – నువ్వూ నాకు నీలానే అర్ధం అయీ అవవు జీవితం లాగే శాశ్వతంగా జీవితం లాగే శాశ్వతం లాగే. స్మైల్ కవిత్వం జీవితాన్ని నిర్వచించదు. లక్ష్యాల్ని సూచించదు. ఖండ ఖండాలుగా జీవితాన్ని విడగొట్టి ఊహా చిత్రాలుగా చిత్రిస్తాడు. వీటిలో వాస్తవికత కన్నా నిర్లిప్తమైన తాత్విక ధోరణి కనిపిస్తుంది. కొత్త సంవత్సరాన్ని ‘కొత్త సముద్రం’గా భావించిన ఈ ఖండిక చూడండి. ఆవిడ కౌగిల్నీ పిల్లల నవ్వుల పూరేకుల్నీ సిగరెట్లనీ, విస్కీ సీసాల్నీ, పేకముక్కల్నీ రహస్య సుఖాల జిలుగు దారిలో మంచి కవిత్వాల కాయితాలనీ స్నేహితుల ఆప్యాయపు వేళ్ళ కొసల్నీ అభాగ్యుల జాలి చూపుల చూరు చివర్లనీ పట్టుకుని మూడొందల అరవై అయిదు కల్లోల సముద్రాల్ని ఈదాలి మళ్ళా నేను. పైన చెప్పినవన్నీ జీవితంలో సాధారణమైనవే. “మళ్ళీ ఇవేగదా, జీవితం మళ్ళీ రొటీన్‌గా ఈదటమే గదా” అన్న నిర్లిప్తత వీటి వెనకాల ఉంది. అయితే ఈ నిర్లిప్తతలో నుంచి ఒక్కోసారి ఒక ఆశారేఖ ప్రసారిస్తాడు. ‘ఒఖడే’ అనే ఖండికలో - అర్ధ స్వప్నాలు, అర్ధ సత్యాలు చుట్టుకు గడిచిపోతాయి వ్యర్థంగా జీవితాలు అని వ్యర్థజీవితాలతో ప్రారంభిస్తాడు. గాలి గాయపడుతుందని ఆకురాలదు నేల నొచ్చుకుంటుందని మొక్క మొలవదు అని ప్రకృతి పరంగా జీవితంలో స్తబ్దతను ఉత్ప్రేక్షిస్తాడు. కాని ఆ వెంటనే గొంతు మార్చేసి, మాట తిప్పేసి – అలా అనుకుంటాం అయినా ఏదీ ఆగదు అని మార్పుని సూచిస్తాడు. ఆ మూలన ఒకడు మృత్యునైశిత్యపువులితో శిలలు చెక్కుతుంటాడు… విషాద గీతాలాలపిస్తాడు అని నిరాశాపూరిత దృశ్యాన్ని చిత్రిస్తాడు. ‘మృత్యునైశిత్యం’ అనే ప్రయోగం కొత్తది. పదునును మృత్యువుతో పోల్చే భావమూ కొత్తదే. విదూషకుడు వినోదానికి గెంతులేస్తూ వంకర టింకర పాటొకటి పాడుతుంటాడు దొరికింది తినండి తాగండి సుఖంగా నిద్రపోండంటాడు అని జీవితంలో అబ్సర్డిటీని చూపిస్తాడు. అయితే ‘ఈ ప్రపంచపు అనేకానేకానేక వికృత రణగొణ ధ్వనుల మధ్యనే ఒక కేక ఒక సజీవ సంగీతమై’ వినిపిస్తుంది. ఓ పూవు పూస్తుంది జీవితం సంపన్నమౌతుంది అర్ధవంతమై సాగుతుంది ఆ వొఖడి వల్లే అని Life is rich and meaningful అనే ఆశను వ్యక్తీకరిస్తాడు. ఈ పుస్తకం పదేళ్ళ కింద (1980) రాసిన తూనీగ అనే కవితతో ముగుస్తుంది. బాల్యంలో చాలామందికి కలిగే అవ్యక్తానుభవాన్ని గొప్ప కవిత్వానుభవంగా మలిచాడు స్మైల్. మొదలు పెట్టటమే అసాధారణంగా మొదలు పెడతాడు. ‘వేళ్ళు తొండలైపోయేవి తూనీగ దొరికేదాకా’ అని వేళ్ళను తొండలతో పోల్చటంలో ఔచిత్యం ఉంది. తొండ అటూ ఇటూ తల కదిలిస్తూ హఠాత్తుగా ఆగి పరిసరాల్ని పరిశీలిస్తుంది. తూనిగను పట్టుకునే వేళ్ళకిది సజీవమైన పోలిక. మేఘాల మొహాలు చూసుకునే పచ్చటి చెరువు నీట్లో పచ్చికగరువుల్ని నెమరేసే గేదెల కొమ్ముల మీద సాయంత్రపు సూర్యుడితోపాటూ గాలి సర్దాగా కూచున్నట్టు గుంపులు గుంపులుగా తూనీగలు తూనీగలు చాలా తేలికగా ఉంటాయనటానికి గాలి సర్దాగా గేదె కొమ్ముల మీద కూర్చుంది అని గడుసుగా అంటాడు. తూనీగల సెటింగు చిత్రించి అక్కడ తూనీగను పట్టుకునే ప్రయత్నాలూ, అక్కడి దృశ్యాలూ, అప్పటి మనో భావాలూ అద్భుతంగా చిత్రిస్తాడు. తూనీగ తోకకి దారంకట్టి ఎగరేస్తే అది కాస్త ఎత్తు ఎగిరి కిందపడిపోయేది. దాన్ని వర్ణిస్తూ – ‘చడీ చప్పుడు లేకుండా కింద పడిపోయేది అక్కయ్య జడలోంచి రాలిన కనకాంబరం మల్లే’ అంటాడు. తూనీగలను ఎగరేసి ఆనందించే స్థితిని అప్పటి స్థితికీ వయసుకీ తగిన పోలికలతో వర్ణించాడు. రెండోక్లాసు నుంచి మూడోక్లాసుకి ఎగిరినప్పట్లా దుమ్ములో చిలుంపట్టిన బేడ బిళ్ళ ఎవరిదో నాకు దొరికినప్పట్లా మా అన్నయ్య నాకివ్వని వాడి బంతి పగిలిపోయి ఎగరనప్పట్లా. స్మైల్ బహు కావ్యాలు రాసి మేజర్ కవి కాలేదని నాకు దిగులు లేదు. సమకాలికులే కాక తరువాత వారు కూడా పదే పదే చదువుకుని మూడ్‌లోకి వెళ్ళిపోగల కవిత్వం రాశాడన్న సంతోషం నాకు చాలు. ‘ఒకడు నాచన సోమన’ లాగా తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్. [Coutesy : eemaata.com]

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0lwfB

Posted by Katta

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || గులాబీ || చక్కని చుక్కల సిగలో ముద్దుగా ఒదిగి పరిమళపు వీవనలందించేది నీవే ! సుతిమెత్తని హృదయాన్ని సున్నితంగా తాకి రసరమ్యభావనలందిచేది నీవే ! ప్రేమికుల పాలిట తేనెచినుకులు చిలకరించి మనసుకి తన్మయసుమాలు పూయించేది నీవే ! కన్నెపిల్ల లేలేత పెదవులపై, చెక్కిళ్ళపై సిగ్గువర్ణాలందించేది నీవే ! నీ గుబాళింపులు లేనిదే ప్రేమికుల దినోత్సవమే జరుగదు ! నచ్చిన మనిషి మదిని గెలవాలంటే ప్రేమరాగాడోలికలలో మునగాలంటే నీ సహాయం అర్ధించాల్సిందే ! నీ పన్నీటి జల్లులు లేనిదే విందువినోదాలే బోసిపోతాయి ! చిగురించే స్నేహానికి మెరుపులద్దేది నీవే పసిడినవ్వుల చిన్నారులు మెచ్చే పసిడిపుష్పానివి నీవే ! పరిమళానికి భాష్యం చెప్పేది నీవే చక్కదనానికి నిర్వచనం రేకులు విప్పిన నీ రూపే ! Happy rose day

by Swarnalata Naidufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g95Jdt

Posted by Katta

Lugendra Pillai కవిత

కరణం లుగేంద్ర పిళ్ళై //పరిణామక్రమం// నన్ను నేను అక్షరాలకు అంకితమిచ్చాను భావ కవితగా మారి కవిని చేసింది కవితను ప్రేయసికి కానుకగా ఇచ్చాను ప్రేమికుడిగామార్చి ప్రేమంటే నేర్పింది శ్వాసను జోడించి నా ప్రేమను విశ్వ వ్యాపితం చేశాను విప్లవ వీరుడిగా కీర్తి అచంద్ర తారార్కం నిలిచిపోయింది 7/2/2014

by Lugendra Pillaifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewOTIj

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

మాఘపొద్దు పెనుచీకటి అరచేతి మీద రేఖలు అడవులు నల్లని తామరాకు ఈనెల్లా కొండల దారులు అంతరిక్షం నుంచి ఒక్కొక్క రేకూ విచ్చుకుని నల్ల కలువై విరిసిన రాత్రి !!! రాత్రి చీకటిపొదుగులో తలదూర్చి పాలుతాగి అలాగే ఎప్పుడో మాగన్నున పడి .. నిద్రలోకి జారుకున్నాయి వృక్షాలు రాత్రంతా చలిగాలిలో ఆదమరిచి నిద్రపోయాకా మెలకువ వచ్చే సరికి ఆకుల చివర్ల నుండి ఇంఒ•• ఎ•ంంగా జారే మౌన బిందువుల్లో కరుణతో చిరునవ్వే ఏడు రంగుల సుప్త స్వరాలు రాత్రి గర్భంలో తపస్సు తర్వాత చాచిన ఆకుపచ్చని దోసిళ్ల నిండా ఓ వెచ్చని అమృత ఫలం దోసిట్లోని ఫలాన్ని పెదవులకు ఆన్చి వెచ్చ వెచ్చగా... నెమ్మది నెమ్మదిగా.. కొద్ది కొద్దిగా... బొట్టు బొట్టుగా... ప్రాణ రసాన్ని సిప్‍ చేసే కొద్దీ ప్రాణం లేచి వస్తుంది ప్రాణులకి శిలల్లో నిద్రపోయే ప్రాణశిశివు సైతం మత్తుగా ఒత్తిగిలుతుంది !!! రంగులు మార్చబోయే ఆకుల అరచేతుల మీంచీ ఇక లోయంతా ఎగరవా రుతువుల సీతాకోక చిలుకలు? వసీరా

by Vakkalanka Vaseerafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b7HFtU

Posted by Katta

Kavi Yakoob కవిత

Selected Readings :: గాలి నాసరరెడ్డి | కదలిక ........................... కదలికలో అందముంది అందుకేనా లోకం కదులుతోంది గాలుల్లో పువ్వుల కదలిక గగనంలో మబ్బుల కదలిక కౌగిట్లో తేనెల కదలిక బతుకంతా ఆశల కదలిక 'సీమంతిని' కడుపులోన మరో తరం కదులుతోంది సామ్యవాది కనులలోన మరో జగం కదులుతోంది గూటిలోని గువ్వల్లా ఏటిలోని చేపల్లా కదిలే నా హృదయంలో కదిలే ఏవో కవితలు కవితా : సమకాలీన కవితల కాలనాళిక /24 ; జనవరి-ఫిబ్రవరి 2014నుండి.

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aBNPBN

Posted by Katta

కాశి గోవిందరాజు కవిత

గుది గుచ్చి ఇటుకుల గుట్ట పక్కన పెంటేసి పెంచిన మొక్కలన్నీ నీ నవ్వులాగె పూస్తున్నాయమ్మా నువ్వింకా ఆ మట్టిచేతులు కడుక్కోలేదని వాటికి తెలిసీ పచ్చగా మన వాకిటనిండా పరుచుకున్నాయ్ వచ్చిపోయే తూరీగలూ, తొండపిల్లలూ నాతో మాటాడినట్టు నేనెన్ని సార్లు కలగాన్నానో నా నిద్దర్లో మరి పొద్దున్నే లెగిసి అచ్చం ప్రాణం పోసినట్టు మొక్కలకు నీల్లేసి కొన్ని పువ్వులు కోసి, నీకు తెచ్చిచ్చాక నువ్వు గుదిగుచ్చిన దండలో, నువ్వూ, నేనూ, నానా నిండిపోయాం. సివర్లు ముడేసి నోటితో తెంపాక. నీ కొప్పున పెట్టుకునే కనకాంభరాలు నాన్నవైపే చూసే నవ్వు తుండేవి. పసుపు రాసిన నీ చేతులేమో పచ్చగా తాకుతుంటే నేనెందుకు ఎదుగుతాను? అలాగే ఉండిపోనియ్ నాన్న నీ ముందు మొక్కై మొలుస్తాడు, నేను పువ్వై పూసి నీ కొప్పులో కూచుంటాను. (కొలీగ్ తల్లో కనకాంభరాలు పెట్టుకొచ్చింది, అమ్మలాగ ముద్దాడలేక, అమ్మని రాసి సూపించా ) 7/02/2014

by కాశి గోవిందరాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fBtn1y

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఎరా...ఎలా ఉన్నావ్?// వీడేంటి! గ్లాసుని చేత్తో పైకెత్తి ద్రవాన్ని రెండుసార్లు తిప్పి నవ్వుకొని తాగాడెందుకు? హాస్యమాడదామని పక్కటేబులులో కూర్చున్న బాల్యస్నేహితుడికి ఫొన్ చేసి ఎత్తగానే పక్కకు తిరుగు బే అంటే తిరిగి ఇక్కడే ఉండి ఫొన్ ఎందుకురా అనగానే ఓ గుద్దు గుద్ది ఏమైపోయావ్ అంటే బారంగా రోజూ వత్తానే ఉన్నాను అన్నాడు ఇంకేంటి కబుర్లు అంటే చేతిలో సిగరెట్ లాక్కొన్నాడు ఆ చేతిలోది ముంది కాల్చరా అని ఇంకోటి ఎలిగించుకొని నాకా మాత్రం చనువులేదా అనిపించుకొన్నాకా అనుమతి తీసుకొని నా టేబులులో కూర్చున్నా... తొలి సిప్ తాగానో లేదో వచ్చి నాపక్కన నుంచుని ఇంకేంటి విశేషాలని అడిగాడు అన్నీ సశేషాలే విశేషాలేముంటాయ్ అనగానే వాడితో సహా సభలో అందరూ నవ్వులే సరే ఉంటా అన్నాడు తల ఎత్తి సరే అనేలోపు వాడు లేడక్కడ.....06.02.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l3oJwP

Posted by Katta

Naveen Auvusali కవిత

||అర్థం కాని రాక్ష(సరాజ్యం) ||నవీన్ అవుసలి|| ఏవేవో మౌన భావాలు ఎందుకో బలిసె దిగిన మూగ బాధలు .. సమరం చేసి సమాజాన్ని నిస్తేజం చేయమనా సంధి చేసి సత్తువల్ని నిస్సత్తువలు చేయమనా .. ఆత్మ రక్షణకై రాక్షసత్వాన్ని రేకెత్తించమనా అడుగంటిన అంతరాత్మని అంతమొందిన్చమనా .. కొమ్ములతో కుమ్మేసే క్రూరమృగాలని వేటాడమనా కోట్లతో కుమ్మక్కయ్యే కోడెనాగుల కోరలూడమనా.. అస్త్ర కైవసం చేసి అసురున్ని అడ్డంగా సంహరించమనా అస్త్ర సన్యాసం చేసి అసురిడికి ఆకలి నైవేద్యమవమనా .. గెలుపులేని ఓటమితోనే గెంతుతూపోమనా కుళ్ళు కుతంత్రాలు తాళలేక విగధజీవియై విశ్రాంతి తీసుకోమనా ...

by Naveen Auvusalifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itd0pS

Posted by Katta

Krishna Mani కవిత

జాతర సవ్వడి గాలులు మిడతల అరుపులు మిణుగురు మెరుగులు చిటపాట చినుకులు జల జల మోతలు కప్పల గంతులు పాముల సందడి ! ఉరుముల కాంతిలో మెరిసిన జాతర మాడిన బతుకున కురిసెను వెన్నెల ! కృష్ణ మణి I 07 -02 -2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LVAPfk

Posted by Katta

Surya Prakash Sharma Perepa కవిత

"మలినం లేని ప్రేమ" -వేదాధ్యయ [06-Feb'14] మలినం లేని ప్రేమ పొందాలనుకుంటున్నావా!! మలినం లేకుండా ప్రేమించు. ద్వేషపు మరకలు పడతాయి అనుమానపు బూడిద అంటుతుంది కాచి శుభ్రం చేసుకో సున్నితమైన ఆలోచన సబ్బుతో... పురుగులు కొరుకుదామని మాటువేస్తాయి వద్దని నచ్చజెప్పు, మందలించు ప్రేమతో... చంపుదామని చూస్తున్నావా!!? వాటి బంధువులొస్తాయి జాగ్రత్త, పగతో... ప్రేరణ లేక చిరుగులు పడతాయి. అల్లెయ్ నీ ప్రేమను మనసుపెట్టి పవిత్రమైన సమయ మగ్గాన్ని అందుకుని, మేలు జాతి సహన దారాలతో... మలినం లేకుండా చూసుకో నీ సహజ ప్రణయ వస్త్రాన్ని. మలినం లేని ప్రేమకై నీరీక్షణలో నీ పాత చర్మం రాలిపోనీ వేయి కాంతులతో కొంగ్రొత్తగా నీ ప్రేమ చర్మమై చేరేవరకు మలినంతో నిన్ను చేరిన ప్రేమ నిన్ను తాకినంతనె శుభ్రమైపోతుంది. మలినం లేకుండా ప్రేమించు నేస్తం! మలిన రహిత ప్రేమను ఆస్వాదించడానికై...

by Surya Prakash Sharma Perepafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itd0Gt

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

సంధానం ***********రావెల పురుషోత్తమరావు నిన్నటిదాకా నేను ఎదురయిన ప్రతి వాడినీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసాను. కప్పదాటు జవాబులతో కొందరు వినీ వినబడనట్లు నటిస్తూ, మరికొందరు నేనుకనబడగానే దివాంధుల్లా నటిస్తూ తడబడుతూ, దారిమర్చేవారు , ఇంకొందరు. ఎవరూ నాప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకుండా పోయారు. అందుకేకొన్నాళ్ళు నేను ఆప్రశ్నలను వాటి మానాన వాటిని వదిలేసి మౌన్నాన్నశ్రయించాను ,మహర్షిలా. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది అందరూ నన్ను ప్రశ్నల తో మూకుమ్మడిగా అదేపనిగా, దాడి చేస్తున్నారు. భావికాలపు జీవనగతిని గూర్చి నిజం చెప్పండంటూ నిలదీసి నిలువునా వేధిస్తున్నారు. అనూహ్యమైన ప్రశ్నల జడిలో నన్ను అన్యమనస్కం గావిస్తున్నారు అమ్మయ్య ఇప్పుడు జనంలో చైతన్యం, ప్రవాహంలా ఉరకలెత్తుతున్నది అబ్బబ్బబ్బో నన్ను ఎనలేని ఆనందం ఆర్ణవమై ముంచేస్తున్నది . చిరకాలపు నా వాంచ చిత్రంగా నెరవేరుతున్నది. సమాధానాలతో సంధానమై నిలువెల్లా, పులకించి పోతున్నాను 05-02-2004 -----------------------

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWq9Ju

Posted by Katta

Shekhar Nagunuri కవిత

సంచారం చేస్తున్నడు చంద్రబాబు గురుడు వద్దన్నాఆగదులే తెలంగాణ పురుడు ప్రత్యేకరాష్ట్రంకు లేఖ ఇస్తివి నిరుడు నీమది నిండా ఉన్నదిలే సీమాంధ్ర కరుడు

by Shekhar Nagunurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83ZxU

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || మూసిన కనురెప్పల వెనుక చిలిపిగ నవ్వుతూ నీవు || ------------------------------------------------------------------------------ దాచలని చూసినా దాగలేనిది మది ఊసుల ఊయలలు అనగారిన మురిపాలు అందిపుచ్చుకునే సమయం దగ్గరై మనసు గిలిగింతలు పెడుతున్నాయి... మది అళ్ళ కళ్ళోలం సాక్షిగా మదిసరాగాలు గిచ్చి గిలిగింతలు పెడుతున్నా.. మనం ఏకమై మమేకమై ఇద్దరం ఒక్కటై ఆసరాగాలు పాడుకునే వేలాయనా...? ఎవరన్నారు మన ప్రేమకు ఎటువంటి అడ్డుగోడలు ఉన్నాయని మనమధ్య ఏ విధమైన పొరపొచ్చాలు కావవి దూరంగా ఉండి దగ్గరవ్వడమే కదూ నీలోని సొగసుల సోయగాలు నాలో రేపెను వలపుల తరంగాలు మనసైన వాడిని కాబట్టేనేమో ప్రతి హృదయ స్పందన తెలుసుకున్నా తలచుకున్న క్షనానే గుండెలదరగా కవ్విస్తున్నావు మూసిన కనురెప్పల వెనుక చిలిపిగ నవ్వుతూనీవు

by Aduri Inna Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N5a3lu

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

పిల్లారాయాష్టకము వారణాసి రామబ్రహ్మం 6-2-2014 ౧. కల్లోలిత సరసిని కనిపించదే ప్రతిబింబము నిలువదు సంక్షుభిత హృదయమున నీ మూర్తి మదినిండ నిండి నెమ్మది నిమ్ము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౨. నాసికాత్రయంబకమున నాజూకుగా మొదలై మరటాంధ్ర సీమల ఏరుల సెలయేరుల కలుపుకు నదిగ మారి భద్రగిరి రాముని పాద పద్మములకు పాద్యమై పున్నెములప్రోవై పట్టిస వీరభద్ర స్వామిని చుట్టుముట్టి అఖండ గౌతమై అన్నపూర్ణయై గోదావరి లవణాబ్ధిని కౌగలించుదరి నుంటివి ప్రసన్న వీక్షణముల ప్రపంనుని కావుము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౩. సిద్ధి బుద్ధి పతివి నీవు శ్రీవల్లి దేవసేనాపతి తమ్ముడు; మంచి బుద్ధుల సిరుల సంపత్తుల నిచ్చి బ్రోతురు మమ్ము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౪. సంసారపు బండిని లాగు మాకు బాడిబందల దారిని కాడి భారమయ్యె కలతల వడిని అలజడిని బాపుము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౫. విలసిల్లును సదా పూవుల పిందెల కాయల నారికేళ వృక్షము కళ కళలాడును గృహములు సదా పిల్లలు పాపలు పెద్దలతో తళతళలాడును మీ మోము మామ్ము కాచుతరి భళి! భళి! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౬. భావముల వరుసయే మనసు; నిరంతర కామ భావనయే మన్మథుడు; ప్రియమెప్పుడు మదిని మెదలుటయె వలపు; తలపుల సదా మీరుండుటయే భక్తి! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౭. మీరు లేనే లేరని నాస్తికులు, అంతట మీరేనని ఆస్తికుల తగవులాటలు మొదటినుండీ శంకిసుమంతయును లేని నమ్మకము కుదుర్చుడు పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౮. జగమంతయును అల్లకల్లోలములు హాహాకారములగ నున్నది దేవుని పేరనే జరుగుచున్నవి దారుణములు మతముల మతులు సరిచేసి మమ్ము కాచుడు పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! తటిల్లతా సమరుచి గాత్రి తల్లి పార్వతి అనుంగుపట్టీ! అనుగ్రహము చూపి వ్రాయించితివి నాచేత నీ అష్టకమును వ్యాసమౌని మేటి వ్రాయసకాడా! ప్రీతితో గొని దీనిని బ్రోవుము నన్ను సమస్తవిద్యా ప్రదాతా! సకల విఘ్నాన్తకా! ఈశ్వరకుమారా! ఐశ్వర్య కారకా! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kW3c9h

Posted by Katta

Kamalakar Reddy Yanjarlapati కవితby Kamalakar Reddy Yanjarlapatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bAnjXW

Posted by Katta

Kamalakar Reddy Yanjarlapati కవిత

ఈ వారం ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమయిన నా చిలిపి కవిత.

by Kamalakar Reddy Yanjarlapatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bAnjXN

Posted by Katta

R K Chowdary Jasti కవిత

విరుద్దం అదే గీతం అదే సంగీతం ఎన్ని యుగాల్నుంచి నాలో వింటున్నానో ఎంత విన్నా ఎంతో మధురం కానీ నాకు దుర్భరం అందుకే నేను మాత్రం ఎన్నో గీతాలు ఎన్నో సంగీతాలు నాలోంచి పలికిస్తూ ఉంటాను రకరకాలుగా జీవిస్తూ ఉంటాను అది నాకు ఆనందం మేమిద్దరం కానీ పరస్పరవిరుద్దం! © జాస్తి రామకృష్ణ చౌదరి 07.02.2014@8.16AM

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2VRoo

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !!మట్టి వాసన !!05-10-2013//07-02-2014 ***************** మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసినప్పుడు నా మనస్సు పురివిప్పిన మయూరంలా నాట్యం చేస్తుంది జలతారు తెరలు వ్రేలాడినట్లు నింగినుండీ నేలకు ధారగా కురిసే వాన చినుకులు కనిపించినప్పుడు నేను మళ్ళీ మా"పల్లె" లో గడిపిన బాల్యపు అనుభూతుల్లోకి జారుకుంటాను కల్లాకపటం తెలియని ఆరేడేళ్ళ పసితనంలో అయ్యవార్ల బెత్తం దెబ్బలు గుర్తుకొస్తున్నా లెక్క చేయక చింపిన నోటుపుస్తకం కాగితాలతో చేసిన పడవల్ని వీధుల్లో ప్రవహించే పిల్లకాలువలపై వదిలిన మధుర స్మృతులు ఇప్పటికీ నా మనోఫలకంపై చెరిగిపోని చిత్రాల్లా గోచరమవుతూనేవుంటాయ్ వానాకాలంలో చిరుజల్లులకే వురిసే మా వూరి సర్కారు బడికి లాంగ్ బెల్ సిగ్నల్ ఎప్పుడవుతుందోనని ఒళ్ళంతా కళ్ళింతలు చేసుకుని ఆత్రంగా ఎదురుచూసే నాకు గడియారంలోని సెకన్ల ముల్లు కూడా గంటలముల్లు లాగే బద్దకంగా ఒళ్ళు విరుచుకొని భారంగా కదిలినట్లనిపించేది బడి వదలగానే పొద్దుపొయిందాకా వర్షంలో తడుస్తూ జట్టుతోపాటూ పరుగులెత్తి పిల్లకాలువలకు గట్లుకట్టి తడిసి ముద్దయిపోయి చలికి వణుకుతూ ఇంటికి చేరుకునే నన్ను తిట్ల హారతితో ఆహ్వానించి,అభిమానంతో కోపగించుకుని ఆపై ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మ ఒడి నాలుగు చినుకులు రాలినా నాకిప్పటికీ జ్ఞాపకానికొస్తుంది రోహిణీ కార్తె ఎండలకు నోళ్ళు తెరుచుకున్న బీళ్ళన్నీ రాలిన చినుకులతో తనువంతా తమకంతో తడుపుకుని పచ్చిక బయళ్ళుగా రూపాంతరం చెంది నన్ను ఆడుకునేందుకు రమ్మని పిలిచే ఆట స్థలాలయ్యేవి పిల్ల తెమ్మెరలకు మెల్లగా తలలూపే అరవిరిసిన అందమైన గడ్డిపూలు హరివిల్లులోని రంగులన్నీ తమ రెక్కలకు అద్దుకున్నట్లు కనిపిస్తూ హద్దు లేకుందా ఎగిరే సీతాకోక చిలుకలు పొద్దుతెలియనీయక ఆటలో అలసిపోనివ్వని నా నేస్తాలయ్యేవి తొలకరి చినుకులకు తడవగానే పులకరించే పుడమితల్లి వెదజల్లే మధురమైన"మట్టివాసనాకలిగించే మత్తు కోసం నా శరీరం గమ్మత్తుగా పలవరించేది యాంత్రికత రంగు పులుముకొని మమ్మీ-డాడీల సంస్కృతిలో పెరుగుతున్న నా పిల్లలకు నా బాల్యంలోని వర్షానుభూతుల్ని పొరలు పొరలుగా విప్పి ఎన్నిరకాలుగా వర్ణించి చెప్పినా తక్కువే ఎందుకంటే............ పాశ్చత్య నాగరికత భ్రమలో పల్లె పదానికి అర్థం మర్చిపోయిన పట్నవాసులుగా అనుభూతులకూ,అనుభవాలకూ దూరంగా బ్రతుకీడుస్టున్న వాళ్ళకు అరక్షణం తీరిక దొరికినా మక్కువగా కనిపించే కంప్యూటర్ గేంస్ అన్నింటికన్నా ఎక్కువే కాబట్టి* --వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167*

by Vempalli Reddinagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2LgtJ

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

చెవికి సోకని బధిరులు వారణాసి రామబ్రహ్మం 7-2-2014 కుక్కలు పిల్లులు మన ప్రేమకు తోటి మనుషుల కన్న ఎక్కువగా నోచుకుంటున్న నేడు బంధములేవి రాగములేవి? అటకెక్కినవి అన్ని అనుబంధములూ మనుషులలో మంచితవమును మర్యాదను గౌరవించుటలను అందరు మనుషులను అభిమానించటను నేర్పు చదువులు హుళక్కి చేసికొని; ఇంగితము మరచి అన్నిటికీ రక్షక భటులపై ప్రభుత్వములపై ఆధారపడు అమాయకత్వాన్ని పెంచుకున్న మనకు; మృగముల వంటి మనుషులనుంచి రక్షణ ఎటులదొరకును? అమెరికా వెళ్లి తెలుగువారు అందలముల నెక్కెదరు స్వంత రాజధానినుంచి వెళ్ళగొట్టబడెదరు? దీని భావమేమి తిరుమలేశ! ? కులములోని తోటివారికి అందనీయక ప్రభుత్వములిచ్చు తాయిలములను తాము మాత్రమే వంశ పారంపర్యముగా కొల్లగొట్టుకొను కుల కునాయకులు దుర్బలము చేయుచున్నారు దేశమును; తాయిలములను ఒక సారి అందుకున్న వారే, సైంధవులై మరల మరల అనుభవించుచున్నారు!! తమ పేద వెనుకబడిన సోదరులకు ఎంత మాత్రమూ అందనీయడము లేదు ఏ తాయిలములను వీరి ఈ ధాష్టీకమునకు దురాగతములకు తెరవేయువారులేరు ఓట్లకై వంతపాడువారే అందరు కురాజకీయ నాయకులూ!!!! దేశము సంఘము ; మాటలు కోటలు దాటించుచు పనిదగ్గర పడుకొను పనికిమాలిన నాయకుల వల్ల బాగుపడవు, అభివృద్ధి చెందవు కులము చూసి, మతమునకు భ్రమసి ప్రాంతీయ భావమునకు ప్రాణమిచ్చి ఓట్లు వేయు సోదరసోదరీమణులకు మిగులునది మాటల ఫలహారము మాత్రమే నిత్య జీవనము మాత్రము అష్ట కష్టములమయము ఈ తెలివితక్కువ తనమునకు అందరమూ; దురాగతములకు దుష్పరిపాలనకు అలవాటు పడి అలమటించ వలసినదే అవినీతి సంద్రమున మునిగి పోవలసినదే పంచతంత్రము రామాయణము మహాభారతము భాగవతము ఇతర ఆస్తిక నాస్తిక సద్గ్రంథముల ఉపయోగించుకొని జీవించని జాతి; అలో లక్ష్మణా అని వ్యథల వేదనల విచక్షణలకు గురి అగుచూ, హుందాతనము లేని జీవితముల ఈడ్చుకొనుచు; తమ దౌర్భాగ్యమునకు ఎవరిని నిందించవలనో నిందించుకొనవలనో తెలియని అయోమయమున అఘోరించవలసినదే ఆర్తి నొందవలసినదే "మేధావులు" కుల మత ప్రాంతముల పేరుతో విడిపోయి కాట్లాడుకొనుచున్న నేడు ఏది జాతికి ఆశాకిరణం? ఏది జాతికి ఆదరణీయం? ఏది జాతికి ఆచరణీయం? ఏది జాతికి గౌరవం? ఏది జాతికి విముక్తి? చెప్పే నాథుడే లేడే చెప్పినా వినలేని బధిరులే అందరూ!!!!

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Mw1v6c

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నా జన్మ...: ఈ పచ్చని దారుల్లో నీ వెచ్చని కౌగిలిలో కరిగిపోయే నా జన్మే కదా జన్మ..! ఈ మలయ సమీరపు మధుర స్పర్షలో నీ తీయటి స్వరపు మాధుర్యములో ఓలలాడే నా జన్మే కదా జన్మ..! ఈ సెలయేటి నాదపు కదలికలో నీ గాజుల గల గలల స్వరగతిలో సేదదీరే నా జన్మే కదా జన్మ..! ఈ చిగురుటాకుల చిటపటలో నీ చిరుకోపపు మిసమిసలో ఊసులాడే నా జన్మే కదా జన్మ..! ఈ అనంతాకాశపు ఆర్ధ్రతలో నీ కనుదోయిన పారేటి సంద్రములో నివాసముండే నా జన్మే కదా జన్మ..! 5/2/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c42h0G

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-65// ******************** 1. మబ్బుని కోసినా, మంచినీరేగా, మంచోడు బాధపడినా... పట్టించుకోరు అందుకేగా 2. కోరికలు, ఊరికుక్కలు, ఏమిచ్చినా... వెంటబడుతూనే ఉంటాయ్. 3. నదిని పాయలో, పాయని నదిలో చూడగల్గాలి, పారదర్శకత అంటే.. ఉంటే... 4. శవాలు తేలే నదిలో, శివ,శివాంటూ మునక, ఏమనాలి, భక్తి మించిన మత్తు లేదనక 5. మాట తడబడదా, మత్తు తలకెక్కితే, గద్దెనెక్కాడాయె,తూలుతాడులే 6. ఇసుకమేడ ఉనికి, వాన చినుకుతో సరి, ఎన్నాళ్లోయ్ నడమంత్రపు సిరి 7. ఎక్కడానికేనోయ్ కొండ, అక్కడ తొంగోడానికా... ఎక్కిన పదవే, స్వర్గద్వారమా 8. చీకటి ముసిరితేనే, చుక్కలు అగుపడతాయ్, కష్టాల్లో ఆప్తుల్లా 9. తలకొట్టినా, జలమిస్తుంది బోండాం మంచోడంటే ఆడేనోయ్, పెట్టుకో ఆడికి దండం. 10. గాలికెగిరే కాగితం గాలిపటమా? వెనకనుంచి అరిచే ఆకతాయీ, వేదికమీద చూపు నీ బడాయి. ================== Date: 05.02.2014

by Kodanda Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c42hh1

Posted by Katta

Chi Chi కవిత

_ చా!! _ ప్రభుత్వాలని మాటలతో తిట్టనోళ్ళు కానీ , మనసులో తిట్టుకోనోళ్ళు కానీ లేరు!! ప్రజల్ని మించి పాలకులు , పాలకులని మించి ప్రజలు , అందరినీ మించి మీడియా మనకూ మనకూ మధ్యే పొద్దున లేవకముందునుంచి రాత్రి నిద్రపొయ్యాక(వస్తే) కూడా సాగే ఆగని పరపీడన పోటీలో అందరూ గొప్పోల్లే , మంచోల్లే , న్యాయవంతులే , ప్రాప్తజ్ఞానులే ఎవ్వర్ని కెలికినా తాను గొప్ప ఊరు దిబ్బ అన్న భావన!! ఆ స్వభావవ్యక్తీకరణల్లో దొర్లే వినూత్న విపరీత పరదూషణల్లో పవిత్రులమయ్యాక పూటకూటి పోటీ తప్ప , యావత్ సజ్జనానికీ ఇంకో టోపీ దొరకదు!! జాతీయ జాతిగా అందరు తమ తమ తమ జాతులకు అక్రమంగా గుర్తింపిచ్చేస్కుని సక్రమంగా దేశజాతిగా గుర్తించడానికి ఒక్క జాతిని కూడా లేకుండా చూస్కోడంలో జాత్యహంకారముందో , దేశధిక్కారముందో స్వదేశీయులకే తెలియాలి సంస్కారమైతే లేదు!! అదే ఉంటే దేశమే జాతిగా ఉండి దేశంలో ఇంకో జాతుండేది కాదు unity unity unity!! universe అంతా నవ్వుతుంది మనుషుల్లో unity ఉందంటే hehe మనుషులే నవ్వుతారు ofcourse!! కానీ unanimousగా unity గురించో , కోసమో అంతా గొంతులు ఇంకా ఏవేవో చించుకుని చెప్పేదొక్కటే!! " మనుషులంతా ఒక్కటే " అని ఏ గ్రహంలోనో ఏమో మన మనుషులకే తెలియాలి పీల్చుకునే గాలికి న్యాయం చేయడానికే భూమిని చీల్చుకునేది అనుకునేనంతగా ముక్కలు చేస్కున్న జాతి భావాన్ని ఎన్ని తరాలు దిగి స్థిరవ్యాప్తిని కొనసాగించినా మట్టి గంధంలోని అదృశ్య కిరణాన్ని అణువంతైనా తాకలేవు!! జాతి భేదమో , భేద ఖేదమో!! ఏదైనా కార్యరూపం దాల్చని కారు కూతలన్నీ కథల కొలువులోనో , కవిత కనులలోనో కలిసిపోవాల్సిందే______Chi Chi(5/2/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd5ZNr

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/చితకని నేను -------------------------- నన్ను కంటున్న నా ఆలోచనలు ఎక్కడి ఊహలో ప్రతిరోజు నాతో అంటుంటాయి అవి నిజమవుతాయని నీలి రంగు వస్త్రాన్ని కప్పుకున్న ఆకాశంలా ఎప్పుడూ నాపైనే కరిగిపోతుంటాయి కొన్ని అంతుచిక్కని చెట్ల కొమ్మల్లో దాగిన ఒంపుల్లా నా చుట్టుతా తిరుగుతుంటాయి నేను కూర్చుందామనుకున్న నేల ఎవరో కాజేసినట్టు ఒంటి కన్ను జ్ఞాపకాల రాక్షసులు ఎటు కదిలినా ఎన్నాళ్ళని కన్నీళ్ళను అరువు తెచ్చుకోను ప్రతి నిత్యం నాతోనే ఉండే విపంచిలా గుప్పెడు విజయాలకే గంపెడు గర్వాలు వొళ్ళంతా తడుస్తూనే ఉంటారు ఎల్లకాలం ఆ సాధనలోనే నా దేహం ఇంకా కురుస్తూనే ఉంది పచ్చిగా... తిలక్ బొమ్మరాజు 05.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd62Jc

Posted by Katta

Pusyami Sagar కవిత

మెరుపు ముక్కలు ______ పుష్యమి సాగర్ "చెత్త కుప్ప ల్లో విసిరివేయబడ్డ మాంసం ముద్ద " "కన్నీళ్ళ కాలువ చెంపల మీదుగా గుండె లో కి .." "నువ్వు యాదికొస్థె మాటలన్నీ గిల గిల కొట్టుకు చస్తున్నాయి !" "నువ్వు యాదికొస్థె మాటలన్నీ గిల గిల కొట్టుకు చస్తున్నాయి !" "ఎప్పుడు వదులుతాయి నా దేశానికి పట్టిన చీడ పీడలు .." "సమూహాలలో నేను వంటరితనాన్ని తొడుక్కొని నిదరొతున్నాను! "వెంటాడుతుంటాయి కళ్ళలోంచి వెలేసిన కొన్ని కలలు" ఫిబ్రవరి 5, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2caPc

Posted by Katta

Gattupalli Lavanya కవిత

Srivashist - Guru @Srivashist 1h @JP_LOKSATTA @Loksatta_Party - I will donate rs.10/- for every RT this tweet geta in 24 hrs. Spread the word. #donate2lsp #loksattanow #deal

by Gattupalli Lavanyafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2c8XD

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

సాఫల్యం ------------ రావెల పురుషోత్తమ రావు శబ్దానికో శక్తివుందనీ అర్ధానికో అవధి వుంటుందనీ శబ్దార్ధాల సంయోజనకు శరసంధానపు బిగువుంటుందనీ తెలిసిన కవులకు అవధుల్లేని ఆనందం ఆర్ణవమై నిలుస్తుంది అందుకే శతక వాజ్మయ స్వారస్యం తెలిసుకుంటే జీవన రధం సాఫీగా సాగుతుంది. వేమనను చదివినప్పుడు వేదననడగించుకునే విధానం అలవరచుకున్నాను. సుమతీ శతక పఠనంతో సూక్తిసుధాకరంగా బ్రతుకును మలచుకోగలిగాను. భర్తృహరిని భావార్ధకంగా పఠించడంతో జీవన గమ్యాన్ని సులుసూత్రంగా కలుపుకున్నాను. శ్రీధర్మపురినివాసుని చదవడంతో సిరి వెంట నా గమనాన్ని చీదరించుకుని నిష్కర్షతో మిగిలాను శతక వాజ్మయ సాహచర్యం సుఖినో భవంతు అంటూ జీవితాన్ని ఆశీస్సులతో అందిపుచ్చుకుని అజరామరంగా బ్రదుకు బాటను తీర్చిదిద్దుకునే వీలు కలిగించింది అందుకే ఆకవులందరినీ ప్రాతః స్మరణీయులుగా ప్రతినిత్యం తలచుకుంటూ సాహిత్యపొరోహిత్యాన్ని సక్రమ పంధాలో నడిచేలా జాగ్రత్త పడుతూ జాగరూకతతో అడుగులు ముందుకేస్తు జీవన పధంలో ఒడిదుడుల్లేకుండా సాగుతున్నాను ********************************07-02-2014

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fXu2Mu

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

- చిరాశ // 12. బ౦డ బతుకులు // ******************************* ఎన్ని రాళ్లు కొట్టినా నాలుగు రాళ్లు వెనకేసుకోలేని బ౦డబతుకులు కొ౦డల్ని పి౦డిచేసేది మేమైతే ధనరాశుల కొ౦డలుగ మారేది వాళ్ళు ఎ౦డకు వెన్ను మాడినా కూడా బిడ్డల కడుపు మాడొద్దని ఆరాట౦ నిత్య బతుకు పోరాట౦ ***************************** {05/02/2014}

by Chilakapati Rajashekerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2c9ek

Posted by Katta

మరువం ఉష కవిత

మరువం ఉష | తోడై వస్తావా సహోద్యోగి గా? ------------------------------------------ "కవిత్వం అంటే?" నాకు నేనే వేసుకున్న ప్రశ్నని మోసుకుంటూనే, పదిలంగా నా 'కవితాసంకలనం' ఒకటి నీకు పోస్టులో పంపుదామని... "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" నిర్లిప్తం గా సమాధానం కొరకు వేచిన చెవులతో ఇన్నేళ్ళగా ఎన్నో-నవ్వు అద్దకాలతో- ముతకబారిన ముఖాలు, ఉద్యోగాలు: డాలర్లలో/డాలర్ల కోసం, ఇంద్రియాలు వేలం వేసుకుని క్రిమి ఇబ్బంది గా కదులుతోంది లోలోపల: గూటి గోడలు ఎక్కుతూ జారిపడుతూ, గుండెజిగటలో కూరుకుపోతూ పగిలిపోగల ఆ ఒక్క గుండె చేజార్చుకున్నాను, అక్కరలేని జవాబు నీరుగారిన ఆశలు, ప్రణాలికలు మనసులో- దేహం లోపలా వెలుపలా ప్రవహిస్తున్న చీమూ నెత్తురు బతుకుని ఒరుసుకుని సాగే లజ్జా, బిడియాలు - ఏ జలతత్వం తెలపాలి? నువ్వు, నేను, తను నిజానికి ఈ మర్త్యలోకం, కదిలే జీవం ఏదో ఒకనాటికి Perishable మరణ సంహిత ఇదే/ను/గా/!? విపత్తు ని పొట్లాల్లో చుట్టి విసిరేయగలిగితే, విశ్వం పట్టటానికి అంతే లోతైన గొయ్యి తవ్వాలి, ఇదే, ఈ నానాజాతులకి నాబోటి జీవి తలపెట్టగల Potentially Hazardous యోచన "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" మళ్ళీ అదే నవ్వుతో, విసుగు ధ్వనిస్తూ అదే ప్రశ్న- తెప్పరిల్లాను కానీ, I grinned back, sort of smiled... చెప్పగల/అంగీకరించబడే మాట మెత్తగా అప్పజెప్పి కొత్త సమాధానం కొరకు వెదుకులాట ఈమారు నాలోని నాకు నేను వేసుకున్న ఇంకొక ప్రశ్న పువ్వుల్లో ఏదో ఉంటుంది, పసిపాప నవ్వల్లే - ఏమిటది? పసిపాప కన్నుల్లో దాగి ఉంటుంది వెన్నెలల్లే సున్నితం గా, లేతగా- లేత గాలిలో, నీరెండలో కోమలత్వం ఉన్నట్లే అవన్నీ fragile beings, ఖచ్చితం గా విలువైనవీను కాలం ఎంత చిక్కగా ప్రవహిస్తుంది, ఎన్నిటిని దాటుకుని ఎడతెరిపిలేకుండా... ప్రశ్న వెనుక ముసురుతూ ఇంకొన్ని మరికొన్ని ఇంకెన్నో! అశాశ్వతం కి నిర్వచనం: ఏది? ఇదొక్కటీ శాశ్వతం గా దొరికితే బావుణ్ణు కలవటం, విడిపోవటం, పోగొట్టుకోవటం, నిరీక్షించటం నిరంతరం దేనికొరకో నశించిపోయే ఉద్వేగాలు ఊరించే విష ఫలాలు, ఆ ఒక్క బలహీనతనీ బలం గా చేధిస్తే - ఆకాశం దాచుకున్న nonperishable, సముద్రం పొదివిపట్టిన perpetual శాంతి నిత్య సత్యమై పోదూ!? యంత్రాలు, యాంత్రిక వైనాలు, ప్రాపంచిక పోకడలు వీటికన్నా Potentially Hazardous వస్తువులేవి సముదాయాలు, సమూహాలు గా అవే బండశిలలు- మర మనిషి గా మారిన నువ్వు, నేను, మనమంతా! ఇకిప్పుడు చెప్పు, నీ నుంచి, నా నుంచి, మనల్ని కాపాడుకునే వృత్తిని చేపడదామా మనమిద్దరం ఈ చిన్ని లోకాన్ని రక్షిద్దామా? "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" విశ్వాల తనిఖీ చేస్తూ - సృష్టి కోసమొక తపాలా వ్యవస్థ కనిపెడుతూ - మరణించే వరకు ఓ మహత్తర కార్యం నెరవేరుస్తూ... కవిత్వమంటే జవాబు అవసరం లేని బతుకు సాగిస్తూ- లోలోపల పగుళ్ళ సవ్వళ్ళు వినవస్తున్నాయా? రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక నీకు త్రోవ చూపుతూ- 05/02/2014

by మరువం ఉషfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jfFzL3

Posted by Katta

Gattupalli Lavanya కవిత

@Srivashist @JP_LOKSATTA @Loksatta_Party update. Crossed 250 RTs at Rs 330/RT for http://win.loksatta.org #donate2lsp Next 500 at Rs500/RT

by Gattupalli Lavanyafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LUfp26

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

నా కిలా అన్పించింది .............................. కనులకు విన్పింపచేసేది కర్ణాలకు చూపించేది నీది కాని అనుభవాన్ని నీ గుండెలకు తాకించేది నీకు నిన్నే కొత్తగా చూపించేది కవిత్వంగా నిలుస్తూ ......... ..................................... వాధూలస 7/1/14

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g6Mf9d

Posted by Katta