పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, ఫిబ్రవరి 2014, గురువారం

Vakkalanka Vaseera కవిత

రెండు వాక్యాలు రెండు రెక్క‌లూ రెండు వాక్యాలు మాట‌ల మ‌ధ్య మౌనం లా వాక్యాల మ‌ధ్య ఆకాశం న‌దిమీద రెక్క‌లు విప్పే ప‌క్షులు రెండు రెక్క‌లూ రెండ‌క్ష‌రాలు అక్ష‌రాల మ‌ధ్య ప్ర‌వ‌హించే న‌ది నీటిలో నీడ‌లూ అంత‌కంటే పొడ‌వైన‌ అంద‌మైన రెక్క‌లు విప్పుతాయి మాట‌ల నీడ‌ల మ‌ధ్య ఎగిరే ప‌క్షి అద్భుత శ‌బ్దాల రంగుల మీద గింగిర్లు కొట్టి చివ‌రికి మౌన వృక్షం తొర్ర‌లోని ఇంటికి చేరుతుంది ----------వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbzSul

Posted by Katta

Kavitha Prasad Rallabandi కవిత

మూలం : 'ఆన్ ద వే టు విండ్ సార్ ' by మార్క్ నెపో (అమెరికన్ కవి ) స్వేచ్చానువాదం : డా. రాళ్ళబండి కవితాప్రసాద్ ...... ...... ...... ...... నువ్వు నడిచొచ్చిన దారి నీ కళ్ళల్లో కనపడుతుంది .... దార్లో ఎవరినైనా గాయపరచావా ? లేక., గాయపడ్డావా? లేక , రెండూనా ? వచ్చేప్పుడు ఏమైనా కావాలని పారేసుకున్నావా ? నాకు తెలుసు, నేనూ అలాగే పారేసుకున్నాను! నా గుండె ఇప్పుడొక చిల్లులు పడ్డ మేకుల సంచి , లోపల గుచ్చు కొంటోంది ... నాకు తెలుసు, మనమిలా కలుసుకుంటామని ! కొందరుంటార్లే ! వాళ్ళలో వాళ్ళు దాక్కుంటారు . ఎప్పుడైనా గాలివాటుగా ప్రేమ ధ్వనిస్తే జడుసుకుని బయటకొచ్చి కళ్ళు చిట్లించు కుంటారు ... కాని ఒకటి చెప్పు! ఒకమహా విషాదం ముంగిట కూర్చుని సుందర స్వప్నాలు కనడం లోఅర్ధముందా !? అదిగో! చిన్నిచిన్నిపిట్టలు తమ కలకలారావాల ముక్కులతో చీకటి ముడి విప్పి తూరుపు సంధ్యని విడుదల చేస్తున్నాయ్ ఇప్పుడంతా హాయిగా ఉంది చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడు, చివరిగా మాట్లాడుకోవడం ఎంత అందంగా ఉంటుందో కదా!

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbzQmg

Posted by Katta

Sravanthi Itharaju కవిత

స్రవంతి ఐతరాజు!! సౌగంధిక జాజరలు!! "ప్రేమ భాష" నీకై చూశాను నేను నాకై వస్తున్నాడు తాను నీ వొడిలో సేదతీరాలనీ, నీ యెదపై వాలాలని నేను నాతో సందడి చేయాలనీ, సరాగమాడాలనీ తాను సతమతమౌతోంది మనసు సందిగ్ధ స్వప్నాలలో విహరిస్తోంది వయసు దశమినాటి జాబిలికై చేతులు చాస్తే.. పున్నమినాటి రేడు చేతికందుతున్నాడు! అందుకోనా, మాననా.. అని సందేహిస్తే.. ఆలస్యం..అమృతం..విషం నాకైనా నీకైనా నేనుకోరిన జాబిలికన్నా..నన్నుకోరే వన్నెలరేడే మిన్న ఉత్తరాన తాను, దక్షిణాన నేను! నేను మాగాయ..తను హిమ "తీ' లేహము నా భాష వేరు..తన భావన వేరు కానీ మమ్మల్ని కలిపింది ఒకేఒక భాష.. అదే "ప్రేమ భాష"!!!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mdyxZp

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // బతికిన మనుషులు! // "మసాలా" అంది ఆమె "ప్లెయిన్" అన్నాడతను "పగలు"- ఆమె "రాత్రి"- అతను "పోవద్దు" "రావొద్దు" ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని అప్పట్నుంచీ వాళ్ళు కలిసి మెలిసి జీవించలేదు! ("జీరో డిగ్రీ" నుండి) 13.7.2012

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iSfvTt

Posted by Katta

Patwardhan Mv కవిత

నక్షా: విశాలమైన ఇంటికి అటు టేపు వేపించి,ఇటు టేపు వేపించి అర ఇంచు కూడా వదలకుండా కొసరి కొసరి కొలతలు గీయించి నక్షా గీయించుకుంటున్న ఓ అన్నా!!! అదిగో !!అటు చూడు అరుగు మీద కూచోని రాకెటు వదలిపోయిన జ్ఞాపకాల పొగ చూపును సరిజేసుకుంటూ ఒక్క చేయితో గుండెను గట్టిగా పట్తుకొని నువ్వు మరిచిపోయిన సరిహద్దులను చెప్తున్నది మీ అమ్మ. అవును,అమ్మలకు తప్ప ఇంతకన్నా -- ఈ కాలంలో హద్దులూ,సరిహద్దులూ బాగా తెలిసిందెవరికని??? ఇంటి నక్షానే కదా !! అంత కష్టమేమీ కాదు!!! 13-02-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lJ7BwI

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

మౌన రాగం ******* రావెల పురుషోత్తమరావు మానవ సంబంధాలన్నీ మసి బారుతున్న దాఖలాలు ఉద్విగ్నమౌతున్న మనసు ఉన్మాదమార్గం వైపు నడచి పోతున్నది. ఆర్ధికపరమైన అనుబంధాలన్నీ ఆధునికతను సంతరించుకునేవేళ ఆత్మీయాతానురాగాలన్న పదాలన్నీ అదృశ్యమౌతున్న నిజం నిలువెల్లా కంపించి వేస్తున్నది. లక్షలు దాటి కోట్లధరను చుంబిస్తున్న వాహనాలు కొడుకుల తలలపై కొరివిని పెట్టడానికి సిద్ధమౌతున్నాయ్ ఇ పాడ్లూ ఐ ఫోన్లూ లాప్టాప్లూ అన్నీ అమ్మాయి శృంగార జీవనానికి ఆసరాగానిలిచి ఆందోళనను కలిగిస్తున్నాయ్ సుప్రభాతం వేళనించీ శృంగారచిత్రాల కుదింపులదాకా ఇంటావిడ సమయాన్ని ఇట్టే భోజేస్తున్నాయ్ ఎడతగని ధారావాహికలు వెకిలి డాన్సులూ అశ్లీలభావఫోరకమైన వ్యంగవిలసితమైన కామెడీ సంభాషణలు జబర్దంస్త0టూ జబ్బలను చరిచి మరీ నవ్వించాలని శతధా ప్రయత్నించి సహస్ర విధాలుగా విఫలమౌతున్నాయ్. అంతా కలగాపులగమై గృహోపజీవుల విలువైన కాలాన్ని ముదనష్టం గా తీర్చి ధ్వంస రచన జేస్తున్నాయ్. ఆవిడకూ ఆయనకూ మధ్యన మౌఖిక సంభాషణలు ఆగిపోయి సంవత్సరాల కాలం గడిచిపోయింది ఇప్పుడంతా సెల్ఫోన్ల మధ్యనే ముద్దు ముచ్చట్లన్నట్టు కాలం ఓ వ్యంగ ముఖచిత్రాన్ని గీసి సంక్షిప్త సందేశాన్నందించింది. మానవ సంబంధాలన్నీ యిలా మరుగునపడిపోతూ ఈమౌనరాగాల గుసగుసలతో కాలం కలియుగం అంతవవకముందే ఘనీ భవించనున్నదన్న వాస్తవం కఋకు నిజమై కుత్తుకలుత్తరించడంలో తరిస్తున్నది.13-2-2014 *******************************

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g1iC8P

Posted by Katta

Vijay Gajam కవిత

.....తెలుగువాడి అత్మ ఘోష .......13.02.14(విజయ్) బజన...బజన..విభజన.. పధవుల కోసం అధిష్టానం వద్ద భజన.. అధికారం కోసం తెలుగు జాతీకి విభజన.. సభా మర్యాధలు లేవు.. పర్లమెంట్ సాక్షిగా.. విభజన..భజన.. సభ సుజావుగా లేదు.. సభ్యుల మద్య సంస్కారం అంతకన్నా లేదు.. దేనికోసం..ఎవ్వరికోసం..ఈ విభజన.. కనిపిస్తున్నదల్లా...అహంకారం.. మూర్కపు పంతం.. ఉన్నదల్లా ఓటు బ్యాంకు రాజకీయం.. అన్నదమ్ముల మద్య చిచ్చు పెట్టి.. తెల్లోడు నెర్పిన విభజించీ...పాలించీ..గోంతుల కోసీ.. రాజకీయ పధవీ సోపానాలలో తెలుగువాడి అత్మ ఘోష ఎవ్వరికి పట్టేనూ...

by Vijay Gajam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jBjVRu

Posted by Katta

Maheswari Goldy కవిత

ప్రే మ సు ధ....!! మహేశ్వరి గోల్డీ. స్వరాల దీవిలో మమతల మధువర్షిణిగా నీ ప్రేమకై జనియించి రవివర్మ చిత్రంలా మోనాలిసా నవ్వులతో నిను మురిపించ వచ్చిన...!! జాహ్నవిని ...! అభినవ ప్రేయసిని ...! నీ ప్రియ దరహాసినిని...!! సాహితీవనమున మహతీలతల సమక్షంలో హొయలొలికించే వంశధారా నిధిలో దాగిన పదాల సంపదను ప్రేమ కవితలను రూపొందించ ఊర్వశినై ఉదయించిన నీ ప్రతిరూపాన్ని ఆరాధనా దీవిలో ఓ రాధికలా నను మలచిన గతజీవన వేదికలో నీ ప్రేమసుధను ...!! కాల్పనికావనమున ఓ అభిసారికలా నిను అభివర్ణించ ఆశతో నీ అనుమతికై నిరీక్షిస్తున్న ...!! నిహారికను ...! ప్రియ హారికను ...! ఆరు ఋతువుల ఆమని సాక్షిగా నా తలపుల నదిలో ప్రతీ అక్షరము ఓ సుమశరమై ఆరాధనకై కలహంస కలువలుగా నిత్యమూ వికసిస్తూ రాగదీవిలో రాజహంసలై నర్తిస్తూ నీ రాకకై ఎదురుచూసిన ఉషోదయాలు...!! నా ప్రతిబింబాన్ని నీ మదికోవెల మనోహర రూపాలుగా చిత్రిస్తూ ప్రేమ సరస్సున హిమశంఖాలపై ప్రణవాక్షరాలుగా అవిషీకృతమవుతున్నవి...! అయినా...!! నే ఓ వనవాసినిలా పౌర్ణమి సాక్షిగా మకరందావనిలో మధులతలతో శృతి కావిస్తున్న జీవనరాగాలు కవితా సుధలై మన ఇరువురు కలయికలో ప్రేమ లేఖలుగా ప్రభవిస్తూ ప్రేమ పావురాల సాక్షిగా మన అమలిన ప్రేమను ఆశీర్వదిస్తున్నవి ఓ ప్రియ మధూధయా...!! 13/02/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lI4ogZ

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRw95G

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఒక ప్రభాతం నీ పలకరింపుతో మది వాకిలి ముందు రంగవల్లవుతుంది . . . ! ఒక ఆమని నీ ఆలాపనలో అరవిరిసిన విరితోటవుతుంది . . ! ఒక శిశిరం రాలే అనుభవాల్లో నీ ఙ్ఞాపకాల చివుళ్ళకు నెలవవుతుంది . . ! ఒక కాంతి పుంజం నీ కన్నుల్లో నిండి బ్రతుకు పయనానికి బాటలు వేస్తుంది . . .! ఒక సాయం సంధ్య వాలే పొద్దుకు నివాళై నీ పిలుపు భూపాలమై స్పృశిస్తుంది . . ! ఒక చల్లని రేయి నీ తలపు వెన్నెల్లో తడిసి మైమరుపు మంచు బిందువై మెరుస్తుంది. . ! ఒక "జన్మ" నీ చెలిమి జ్వాలల్లో పునీతమై సార్ధకమవుతుంది . . ! నిర్మలారాణి తోట { 13-02-2014 }

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aXQgPq

Posted by Katta

Lingareddy Kasula కవిత

సీమాంద్ర పెట్టుబడిదారుల దౌర్జన్యం ,దురహంకారం ప్రజాస్వామ్య వ్యవస్థను వెక్కిరించింది. తెలంగాణను సాధించుకోవడానికి ప్రత్యన్మ్యాయ పద్దతులు వెతుక్కోమన్నది . ఆ సందర్భంగా ... నేనేమన్న?||డా// కాసుల లింగా రెడ్డి ||13-02-2014 నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? ఆకిలి పొక్కిలైందన్న సాన్పి చల్లి ముగ్గు పెట్టి తీరొక్క పువ్వులతోటి పేర్చిన బతుకమ్మసొంటి ఆకిలి పొక్కిలైందన్న పుట్టమన్ను తెచ్చి పుదిచ్చిన బొడ్డమ్మసొంటి అరుగు అరుమంద్రమైందన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? కండ్లనిండ చూసి తుర్తిపడాల్సిన పాలపిట్టను గుళ్ళేరు పెట్టి కొట్టొద్దన్న జెండాగా ఎత్తిపెట్టాల్సిన జొన్నకర్రలను మర్లవడ్డ దుడ్డోలె సెంద్రం సెద్రం చెయ్యొద్దన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? యాభై ఏండ్లసంది నీళ్ళు లేక, నిలువల్లేక కొలువుల్లేక, బతుకుదెరువుల్లేక తెర్లు తెర్లయిన బిడ్డల్ని తెగించి కొట్లాడమన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? రాయపాటి రాదార్ల దోపిడీకి జ(ల)గడపాటి బొమ్మరిండ్ల బేరానికి కావూరి కా(ఆ)సుపత్రుల దందాకు సుబ్బిరాముడి తోలుబొమ్మలాటలకు రామోజీ రంకు సిటీకి నా నేలే వేదికెందుకైందన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? దుష్ట కౌగిళ్ళు విడిపించుకోను కడుపుల్ని మాడ్చుకోమన్న తలరాతల్ని మార్చుకోను రాదారుల్ని మూసేయమన్న అమాస చీకట్ల తొలగించుకోను బొగ్గుబాయిలు బందుపెట్టమన్న దోపిడి కలుపు తీయ దోరదోర పిల్లల ఇస్కూళ్ళు క్లోజన్న సకల జనులు కూడి సమ్మె సైరనూదమన్న- తెలంగాణ తెచ్చుకోమన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? సమ్మక్క, సారలమ్మల శూరత్వం రాణి రుద్రమ రణన్నినాదం కొమరం భీం ధర్మాగ్రహం బందగీ తెగింపుల తేటదనం పాలుసాలని నా బిడ్డలకు సాలుపోస్తున్న సరిగ్గా అరవై ఏండ్ల కింద అలిసిన నా బిడ్డలు దాచిన జమ్మిచెట్టు మీది ఆయుధాలు తీయమన్న నీ అన్నాలం పాడుగాను నేనేమన్న? రచనాకాలం: 28 సెప్టెంబర్‌ 2011 5 అక్టోబర్‌ 2011 నమస్తే తెలంగాణ దినపత్రిక 'చెలిమె'.

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j93WXz

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || వాడు వ్యభిచారి || పసిదేహాన్ని తుంచి నల్లని దేహంలో కలిపేసిన నీ చేతులకు ఆ తడి ఇంకా ఆరలేదు గమనించావా నీ మేలేసుకున్న మీసాల వెనుక తలదించుకోవాల్సిన నిజం ఎవ్వరికీ చెప్పకు అదే అదే నువ్వు అనగా నేను, నేను అనగా నాలాంటివాళ్ళు అందరం కలిసి ఆమెకు కొనిచ్చిన మగాడు 'వ్యభిచారి' అనే రహస్యాన్ని వెలుగులో ఆమెను మోహించలేక రాత్రి మాత్రమే హత్తుకోగల నపుంసకుడు వాడు వెన్నెల సాక్షిగా వాడు వదిలిన దుస్తులకు తప్ప ఆమె ఎప్పుడూ వాడికి అంటుకోలేదు, కనీసం పూయబడనూలేదు చూడు వాడి ఆంక్షల కౌగిలిలిలో ఎన్నో సార్లు మానభంగం చేయబడి ఇంకా మరెన్నో సార్లు చేయబడటానికి ఆమె తాళికి కట్టబడింది ******* ఆమె ఈరోజు కూడా వాడి లోపలి చేయి పెట్టి హృదయమంతా వెతికి వెతికి కొంత రక్తాన్ని వాడికి చూపిస్తూ ఇది నీదేనా ? నేను కాక ఇది ప్రవహిస్తుంటేనూ.. అని అడిగింది అలా వాడు సిలువ వేయబడటం ఇప్పటికి ఎన్నిసార్లో కొట్టబడిన మేకుల గుర్తులే చెప్పాలి ఎన్నో సార్లు వాడు దిగంబరంగా నిలబడి ఆమెను కళ్ళతో స్పర్షిస్తూ అడగాలనుకుంటాడు నేను తొడుక్కోవల్సింది నిన్ను కాదు నన్ను కదా ..? ******* ఆమె అతనిని, అతను ఆమెను లోపలికి హత్తుకోవాలంటే నువ్విక వాడిని వ్యభిచరింపనీయకూడదు అదే అదే నువ్వు అనగా నేను, నేను అనగా నాలాంటివాళ్ళు వ్యభిచారమనగా ఒకొక్క సారి నీకోసం, మరొక్కసారి నాకోసం నేను నీలాగో నీవు నాలాగో ఉండాలనుకోవడమే కదూ మీ చాంద్ || 13.Feb.14 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gtI1d4

Posted by Katta

Mounasri Mallik కవిత



by Mounasri Mallik



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gtI0Ww

Posted by Katta

Kavi Yakoob కవిత

సరోజినినాయుడు -@ Golden Threshold

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dmAqwU

Posted by Katta

Vani Koratamaddi కవిత

నాన్న మా భవిష్యత్ నుతీర్చిదిద్దిన మీ శ్రమ, ఆలోచన అనుక్ష ణము మా జీవితంపై మీ వునికి ఛాటూతూ వుంటుంది సమాజం ఎలా వుంటుందో.. సమస్యలు ఎలా ఎదురుకోవాలో... మీరు చెప్పిన తీరు జ్ఞాపకం అమ్మ మెతకతనం ఉదాహరణగా మీరు నేర్పిన దైర్యం జ్ఞాపకం బాధ్యతల,బందాల విలువలు మీరు నేర్పిన తీరు జ్ఞాపకం కంటికి రెప్పలా కాపాడిన మీరే మాకు ఆదర్సం మా ఎదుగుదలకి తార్కాణం చదువుకోసం వెళ్ళినమా కోసం.. జాగ్రత్తతో చూసిన ఎదురు చూపు జ్ఞాపకం మానసికంగా,శారీరకంగా మీరు పడ్డ శ్రమ ఆరుపదులకే ఆగిపోయిన మీ ప్రాణం విలువ జ్ఞాపకం మీరు లేని వెలితి మే ము పడ్ద కస్టం అనుక్షణంఅమ్మ పడిన ఆవేదనా జ్ఞాపకమే vani, 13/2/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kDGYv9

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| శ్రమకు గురుతు|| ఎండనక వాననక- కదిలేటి తనువు గుప్పెడు మెతుకుల - గుటకేయ కరవు సిరులు పెంచగ - గిరులు తొలిచె ఒడ్డెరోడె -శ్రమకు గురుతు! ఆలు పిల్లలు సాయపడగ మట్టితవ్వి రాళ్ళుపేర్చి కట్టపోతకు కండ కరిగి శ్రమను కొలిచె గానుగెద్దు పొలములోన బిలములోన శిలలమధ్య చెమటకార్చి యీతిబాధల బరువునోర్చి జాతిసంపదనిచ్చు కాసెవాడు! తట్టమోసె కర్మవీరుడు నిలువనీడ లేకపోయిన గుట్టదారుల బతుకుగువ్వ గుట్టుగాను ఒదుగుతున్నడు! ఏ రోజుకారోజు చచ్చిపుడతాడు నల్ల రాళ్ళను శిఖరాన అచ్చుపెడతాడు! (రచనా కాలం 9/1996) 13.02.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bqSDus

Posted by Katta

Krishna Mani కవిత

గోస **** తోవ్వలోని కలువ పువ్వులే ముడుసుకున్నై పోయ్యెదెక్కడో తెల్వని దినాలు గడుస్తున్నై కరిషే చెప్పులు తోడుగ అడుగులు పడుతున్నై తెప్పల పిడిగులు భయపెడుతున్నై కొండలు ఆగులు దాటినా దుక్కులే దిక్కైనై తిప్పల మాటున కడుపులు అరుస్తున్నై మండే అగ్గిల బతుకులు కాలుతున్నై దాపులేని కాడ పానాలు తడుస్తున్నై డొక్కలు దేలిన బొక్కలు ఒంకుతున్నై దిక్కులు దెల్వని మనసులు మొక్కులైన్నై కారే నీళ్ళలో మేరుపులే మురిపాలనై గతి లేని లోకాన మడుగులే గోడుగులైనై కానరాని వెలుగున సిమ్మసీకటి తోడుకైనది ! కృష్ణ మణి I 13-02-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kDuqUH

Posted by Katta

Kancharla Srinivas కవిత

గూడెం విడిపోతుంటే గుండెలు బరువవుతున్నాయ్.. గ్రామం కనుమరుగవుతుందంటే కన్నులు కన్నీరవుతున్నాయ్.. రాజ్యాధికార దురహంకారం పుట్టిపెరిగిన మట్టినుంచి నిను పట్టుపట్టి నెట్టేస్తుంటే చెట్టు పుట్టా శొకం పోలవరంలొ ప్రవహిస్తోంది..

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dJPbFO

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। ప్రేమకు ఓ రోజు ।। -------------------- రెండుకళ్ళు విచ్చుకున్నాయి మరో రెండుకళ్ళు నవ్వుకున్నాయి ఆ క్షణం ఓ ప్రేమ పుట్టినరోజు. మనసు ప్రాయంసంకెళ్ళు తెంచింది ఆ క్షణాన ప్రేమక మోము కలల ప్రపంచం. ఎడబాటు ఎదను కోసింది దూరాలు క్షణాల్లో కరిగిపోయి ప్రణయలొకపు ద్వారాలు తెరుచుకున్నాయి. గులాబీరేకులు ముళ్ళను చూసి కిసుక్కుమన్నాయి ముళ్ళు మౌనంగా మిగిలిపోయాయి ఇది మీ రోజని. కోయిలమ్మ ప్రేమపాట పాడింది తొందరపడి అటుగా వచ్చిన ఓ జంటను చూసి ప్రేమ దానికే వదిలేసి రెండు దేహాలు పొదలను వెతుక్కున్నాయి. ప్రేమకు కొన్ని రాత్రులు గడిచాయి అక్కడ శరీరాలే మాట్లాడుకున్నాయి తీపి చేదుగాను,చేదు భాధగానూ మారింది. కోరికలు పూర్తిచేసుకున్నాయి విడిపోయాయి రెండు మనసులు నివ్వెరబోయింది ప్రేమకు ఓ రోజు ! (13-02-2014) (నాకు నచ్చని "ప్రేమికుల రోజు" దినోత్సవం సందర్బంగా ... )

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Mee8mT

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||బిగ్ బాంగ్|| నేను ... నడుస్తున సమస్తాన్ని .. నేను ... గడుస్తున్న సంశయాన్ని .. నేను... విధ్వంసమైన తొలిని .... నేను ... నిరంతరం మార్పును చెక్కుతున్న మాయా ఉలిని .. నేను ... కాలాన్ని ప్రసవించిన తల్లిని ... నేను ... గాడాంధకారంలో నిద్దుర లేచిన దివ్వెని ... నేను ... ఆకాశపు ఆవలి అంచున కాపలాదారుని నేను ... సకల ప్రాణి సమూము సంచరించు దారిని ..

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g9hkLt

Posted by Katta

Bharathi Katragadda కవిత

చలనచిత్రం 13.02.14 నిన్నటిదాకా నా గుండె గదిలో కిలకిల నవ్వులు వినిపించేవి ! మధురమైన మాటల మూటలు దొర్లేవి! వెన్నెల కిరణాలు ప్రసరించేవి! సుమధురమైన సంగీతం వినిపించేది! కవితలెన్నో పద్యాలతో గారడీలు చేస్తూ పడీ పడీ నవ్వేవి! సాహిత్యపు పరిమళాలు విరజిమ్మేవి! కాని నేడంతా నిశ్శబ్దమే! అంతా అమావాస్య చీకటే! ఈ చీకట్లో జన్మ జన్మల శాపగ్రస్తలా నేను! ఆ శబ్దంలో నీవున్నావు! ఈ నిశ్శబ్దంలో నేను ఉండిలేను ఏమీలేని నాలో నీ ఙ్ఙాపకాలు వున్నాయి!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwsCHM

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

Sarojini Naidu ||Palanquin Bearers|| Lightly, O lightly we bear her along, She sways like a flower in the wind of our song; She skims like a bird on the foam of a stream, She floats like a laugh from the lips of a dream. Gaily, O gaily we glide and we sing, We bear her along like a pearl on a string. Softly, O softly we bear her along, She hangs like a star in the dew of our song; She springs like a beam on the brow of the tide, She falls like a tear from the eyes of a bride. Lightly, O lightly we glide and we sing, We bear her along like a pearl on a string

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etwaaJ

Posted by Katta

మరువం ఉష కవిత

మరువం ఉష | శతకాలు వల్లెవేయించి, పద్యాలు బట్టీపట్టించి --------------------------------------------------------- చదువే లోకంగా చదివించిన ఘనవిద్యలెల్లా… తిరగరాసి మరోమారు మననం చేయించె నిత్యజీవితం వైద్యునికొరకు అప్పిచ్చువాడిని వెదికాను అప్పుతీర్చలేక వూర్లు పట్టి ఏర్లు దాటి పరుగిడాను మేడిపండు సమాజం పొట్టవిప్ప లోటుపాట్ల పురుగులు లోపమెంచి చిచ్చుపెట్ట లోకులే పలుగాకులని కన్నాను శతకాలు శతకోటి నేర్చి నీతిచంద్రికలు ప్రీతిగా వినుకుని పన్నాగాలు పన్నేటి గోముఖవ్యాఘ్రాలను చూసి భీతిల్లాను తల్లితండ్రులందు దయలేని పుత్రులు దేశప్రగతికి వారసులు తోబుట్టువుల మోసగించు దగాకోర్లు దండనాథులు సదా ఈ తారుమారుల్లో సతమతమైన నా మానసం తెలుసుకున్నదొక్కటే పాఠం - జీవితమే గురువు జీవించను నేర్పగ వినరా అని నేనెవరినీ అడుగను, కనరా అని చాటి చెప్పను నేర్వని పాఠాలు సాధనచేయ మనిషికో తీరుగ మారును 02/12/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwfUJ0

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

విన్నపము! వారణాసి రామబ్రహ్మం 13-2-2014 అట నుంటివో ఇట నుంటివో ఎద ఎద నుంటివో కంటికి కానరావు ఎట నుంటివో తిరు వేంకటరాయా! ప్రవహించు గోదావరులు నీ వేగమో ఊహించు కవులు నీ భావావేగమో సాహసించు శూరుల ధైర్యము నీవో వచించుము వన్నెలదొరా ! తిరు వేంకటరాయా! కన్నెల సొగసులు రమణుల రంజనములు నీ రూపో వారి వన్నెల చిన్నెల సింగారములు నీ కులుకో ప్రేమ భక్తి అనురాగములు నీ కరుణలో వాత్సల్యమున నను చేరదీయుము తిరు వేంకటరాయా! అన్నమయ్య పదములు నీ నెలవో త్యాగరాజు కృతుల నీ నివాసమో రామదాసు కీర్తనల నెలకొంటివో పలికించుము నన్నును తిరు వేంకటరాయా! అష్టాక్షరిని ఊయలలూగెదవో పంచాక్షరిని పూర్తిగ నిండితివో షోడశాక్షరిని తల్లి పద్మావతితో నుంటివో అందుము అక్షరరూపా! తిరు వేంకటరాయా! ధ్యానములు తపములు ఉపాసనల నుంటివో పూజలు భజనలు అభిషేకముల నుంటివో జ్ఞానుల నిర్మల మానసము నీ తావో తెలియగజేయుము తిరు వేంకటరాయా! అట నుంటివో ఇట నుంటివో ఎద ఎద నుంటివో కంటికి కానరావు ఎట నుంటివో తిరు వేంకటరాయా!

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwfRNx

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ అనాగారికుడు _నాగరికుడు # నిప్పును కనిపెట్టి అనాగారికుడు దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుని నాగరికుడు అయ్యాడు... నిప్పునేల వాడుకోవాలో తెలిసిన నాగరికుడు దాన్ని ఇష్టానుసారంగా వాడుకుని అనాగారికుడయ్యాడు __ కొత్త అనిల్ కుమార్

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j51YaF

Posted by Katta