పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు // Dt. 04-2-2014 జీవన వృక్షం వాడిపోయి చిటారు కొమ్మన ప్రాణం చేరిపోతే రాలిన పళ్లను ఏరుకుంటున్నారు వారసులు వృద్ధాప్యమనే కడలిలో తల్లి దండ్రులు ప్రయాణిస్తుంటే డాలర్ల జాలరులైనారు కొడుకులు కూతుళ్ళు కాలక్షేపం అనే సోమరికి బద్ధకస్తులు ప్రియ బంధువులు శ్రామిక జీవన ఫలాలను కూర్చొని మెక్కుతారు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iopsHW

Posted by Katta

Sriarunam Rao కవిత

ప్రసవ వేదం. అమ్మ ఊపిరికి అడ్డం పడుతూ అనంతానికి అర్ధం చూపెడుతూ.. త్యాగాన్ని చీల్చుకువచ్చే తుది ప్రణవనాదం.. జీవనసంగీతంలో..అత్యుత్తమరాగం, చిన్ని పొట్టలో ఆకలి కొత్తగా పుడుతుంటే ఆకృతీకరించిన ఆత్మచలనంలా.. ఉద్దీపిస్తున్న ఏడుపు ఎన్ని గమకాలను తాకుతుందో? బుడిబుడి అడుగులతో భూమిపై పడుతున్న దర్ఫం ఆక్రమించబోయే సాధనని ఎత్తిచూపుతున్నట్లుంది.... కల్మషం అర్ధం తెలియని బోసినవ్వు.. పాదరసపు వరదలా హృదయపు ఇరుకులలోంచీ ప్రవాహిస్తుంది, ఎన్ని ఆవరణలు బ్రధ్ధలవుతున్నా మరెన్ని అవతారాలు అంతరిస్తున్నామానవుడు ఫరిడవిల్లుతున్నాడంటే.. పరిమళిస్తున్న అమ్మతనంమనకందిస్తున్న రక్తబందానికే. శ్రీఅరుణం, విశాఖపట్నం.

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j9CoEr

Posted by Katta

R K Chowdary Jasti కవిత

కృష్ణా! ఆ దుష్టనికృష్ట నిండు సభలో అంతమంది కురువృద్ధులమధ్య ఆ అభాగ్యపాండవుల మధ్య దుశ్శాశనుడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తుంటే సిగ్గు లేని నీచులు అపహాస్యం చేస్తుంటే అతివీరయోధులై కూడా ఆమె భర్తలు చేతులు ముడుచుకుని కూర్చుంటే ఆమె కళ్ళు మూసుకుని కృష్ణా అని ఒక్క పిలుపు పిలవగానే గభాలున వచ్చి కాపాడావే మరి ఇప్పుడు ఏమైంది ఏ దుష్టనీచనికృష్టరాష్ట్రం లో రోజుకి ఎందరో అభాగ్యణిలు మానభంగాలకి గురి అవుతుంటే రాక్షసహత్యలకి గురి అవుతుంటే వాళ్ళ ఆర్తనాదాలు నీకు వినిపించడం లేదా వాళ్ల ఆత్మఘోష వినిపించడం లేదా గోపికలతో సరసాలాడుతూ పిల్లనగ్రోవి ఊదుకుంటూ తన్మయం చెందుతూ నిన్ను నీవు మరిచిపోయావా లేక భార్య కాళ్ళు పడుతుంటే హాయిగా ఉందిలే అని ఆ గాఢనిధ్రలోనుండి లేవలేకపోతున్నావా లేదా ఈ కలియుగం సంగతి నాకెందుకులే అని తప్పించుకుంటున్నావా లేక శిశుపాలుడి తప్పులు పోకచెక్కలతో లెక్కించినట్టు ఈ స్త్రీ జాతి అంతమయ్యేవరకు అలా లెక్కిస్తూ ఉంటావా చూడు ఇక్కడ స్త్రీజాతి ఎంత వేదన పడుతుందో ఎలా ఆక్రోశిస్తుందో ఎలా దినదినం క్షణక్షణం భయపడుతూ నరకంలో జీవిస్తుందో చూడు కృష్ణా చూడు ఇక్కడ ఒక్క పాండవుడు కూడా లేదు ఉన్న వాళ్లంతా కురువృద్ధులు దుష్టబ్రష్టులు న్యాయం ధర్మం అంతరించి మానవత్వం మంటగలిసి కాముకత్వంతో కళ్ళు మూసుకుపోయి రెచ్చిపోతున్న మగాళ్ళు మృగాళ్ళు ఇక్కడ క్షణానికి ఒక్క ద్రౌపది బలి ఆయిపోతోంది ఎందుకు పుట్టామా అని స్త్రీ జాతి కుమిలిపోతోంది నీవు నిజంగా ఉంటే దిగిరా వాళ్ళని రక్షించు రాక్షసులని శిక్షించు నీవే స్వయంగా వస్తావో వచ్చి దేవదత్తమే పూరించి విష్ణుచక్రమే వేస్తావో లేక నీ లోకంలోనుండే నీ కృష్ణమాయనే చూపిస్తావో నీ ఇష్టం ఇది కేవలం నా నివేదన మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్న స్త్రీ జాతి కన్నీటి ప్రార్ధన! © జాస్తి రామకృష్ణ చౌదరి 02.02.2014@01.35PM

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6a1XS

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-65// ******************** 1. మబ్బుని కోసినా, మంచినీరేగా, మంచోడు బాధపడినా... పట్టించుకోరు అందుకేగా 2. కోరికలు, ఊరికుక్కలు, ఏమిచ్చినా... వెంటబడుతూనే ఉంటాయ్. 3. నదిని పాయలో, పాయని నదిలో చూడగల్గాలి, పారదర్శకత అంటే.. ఉంటే... 4. శవాలు తేలే నదిలో, శివ,శివాంటూ మునక, ఏమనాలి, భక్తి మించిన మత్తు లేదనక 5. మాట తడబడదా, మత్తు తలకెక్కితే, గద్దెనెక్కాడాయె,తూలుతాడులే 6. ఇసుకమేడ ఉనికి, వాన చినుకుతో సరి, ఎన్నాళ్లోయ్ నడమంత్రపు సిరి 7. ఎక్కడానికేనోయ్ కొండ, అక్కడ తొంగోడానికా... ఎక్కిన పదవే, స్వర్గద్వారమా 8. చీకటి ముసిరితేనే, చుక్కలు అగుపడతాయ్, కష్టాల్లో ఆప్తుల్లా 9. తలకొట్టినా, జలమిస్తుంది బోండాం మంచోడంటే ఆడేనోయ్, పెట్టుకో ఆడికి దండం. 10. గాలికెగిరే కాగితం గాలిపటమా? వెనకనుంచి అరిచే ఆకతాయీ, వేదికమీద చూపు నీ బడాయి. ================== Date: 05.02.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c42hh1

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నా జన్మ...: ఈ పచ్చని దారుల్లో నీ వెచ్చని కౌగిలిలో కరిగిపోయే నా జన్మే కదా జన్మ..! ఈ మలయ సమీరపు మధుర స్పర్షలో నీ తీయటి స్వరపు మాధుర్యములో ఓలలాడే నా జన్మే కదా జన్మ..! ఈ సెలయేటి నాదపు కదలికలో నీ గాజుల గల గలల స్వరగతిలో సేదదీరే నా జన్మే కదా జన్మ..! ఈ చిగురుటాకుల చిటపటలో నీ చిరుకోపపు మిసమిసలో ఊసులాడే నా జన్మే కదా జన్మ..! ఈ అనంతాకాశపు ఆర్ధ్రతలో నీ కనుదోయిన పారేటి సంద్రములో నివాసముండే నా జన్మే కదా జన్మ..! 5/2/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c42h0G

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/చితకని నేను -------------------------- నన్ను కంటున్న నా ఆలోచనలు ఎక్కడి ఊహలో ప్రతిరోజు నాతో అంటుంటాయి అవి నిజమవుతాయని నీలి రంగు వస్త్రాన్ని కప్పుకున్న ఆకాశంలా ఎప్పుడూ నాపైనే కరిగిపోతుంటాయి కొన్ని అంతుచిక్కని చెట్ల కొమ్మల్లో దాగిన ఒంపుల్లా నా చుట్టుతా తిరుగుతుంటాయి నేను కూర్చుందామనుకున్న నేల ఎవరో కాజేసినట్టు ఒంటి కన్ను జ్ఞాపకాల రాక్షసులు ఎటు కదిలినా ఎన్నాళ్ళని కన్నీళ్ళను అరువు తెచ్చుకోను ప్రతి నిత్యం నాతోనే ఉండే విపంచిలా గుప్పెడు విజయాలకే గంపెడు గర్వాలు వొళ్ళంతా తడుస్తూనే ఉంటారు ఎల్లకాలం ఆ సాధనలోనే నా దేహం ఇంకా కురుస్తూనే ఉంది పచ్చిగా... తిలక్ బొమ్మరాజు 05.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd62Jc

Posted by Katta

Chi Chi కవిత

_ చా!! _ ప్రభుత్వాలని మాటలతో తిట్టనోళ్ళు కానీ , మనసులో తిట్టుకోనోళ్ళు కానీ లేరు!! ప్రజల్ని మించి పాలకులు , పాలకులని మించి ప్రజలు , అందరినీ మించి మీడియా మనకూ మనకూ మధ్యే పొద్దున లేవకముందునుంచి రాత్రి నిద్రపొయ్యాక(వస్తే) కూడా సాగే ఆగని పరపీడన పోటీలో అందరూ గొప్పోల్లే , మంచోల్లే , న్యాయవంతులే , ప్రాప్తజ్ఞానులే ఎవ్వర్ని కెలికినా తాను గొప్ప ఊరు దిబ్బ అన్న భావన!! ఆ స్వభావవ్యక్తీకరణల్లో దొర్లే వినూత్న విపరీత పరదూషణల్లో పవిత్రులమయ్యాక పూటకూటి పోటీ తప్ప , యావత్ సజ్జనానికీ ఇంకో టోపీ దొరకదు!! జాతీయ జాతిగా అందరు తమ తమ తమ జాతులకు అక్రమంగా గుర్తింపిచ్చేస్కుని సక్రమంగా దేశజాతిగా గుర్తించడానికి ఒక్క జాతిని కూడా లేకుండా చూస్కోడంలో జాత్యహంకారముందో , దేశధిక్కారముందో స్వదేశీయులకే తెలియాలి సంస్కారమైతే లేదు!! అదే ఉంటే దేశమే జాతిగా ఉండి దేశంలో ఇంకో జాతుండేది కాదు unity unity unity!! universe అంతా నవ్వుతుంది మనుషుల్లో unity ఉందంటే hehe మనుషులే నవ్వుతారు ofcourse!! కానీ unanimousగా unity గురించో , కోసమో అంతా గొంతులు ఇంకా ఏవేవో చించుకుని చెప్పేదొక్కటే!! " మనుషులంతా ఒక్కటే " అని ఏ గ్రహంలోనో ఏమో మన మనుషులకే తెలియాలి పీల్చుకునే గాలికి న్యాయం చేయడానికే భూమిని చీల్చుకునేది అనుకునేనంతగా ముక్కలు చేస్కున్న జాతి భావాన్ని ఎన్ని తరాలు దిగి స్థిరవ్యాప్తిని కొనసాగించినా మట్టి గంధంలోని అదృశ్య కిరణాన్ని అణువంతైనా తాకలేవు!! జాతి భేదమో , భేద ఖేదమో!! ఏదైనా కార్యరూపం దాల్చని కారు కూతలన్నీ కథల కొలువులోనో , కవిత కనులలోనో కలిసిపోవాల్సిందే______Chi Chi(5/2/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd5ZNr

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // బుర్ బుర్ బుర్ర్ ర్ర్ ర్ర్ ... // బిగిచ్చు, చెవులకి, ఇయర్ ఫోన్లు. ఎక్కు, నిచ్చెన ఏస్కొని, తౌసండ్ సీ సీ బైకుని. ఏలాడదీయి, కళ్ళని, గాగుళ్ళకి. వొత్తిచ్చుకో, ప్లే బటన్ తోటి. ఆశిక్ బనాయా... ఆశిక్ బనాయా... ఆశిక్ బనాయా అప్నే. ఇంగ కిక్ స్టార్ట్ చెయ్యి, లైఫుని. పొయ్యి దుంకు, సేం, మల్లా, ఆ బంగాళాకాతంలనే. సిగ్గులేనోనిలెక్క. హాయిగ. 4. 2. 2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXVcPb

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

- చిరాశ // 12. బ౦డ బతుకులు // ******************************* ఎన్ని రాళ్లు కొట్టినా నాలుగు రాళ్లు వెనకేసుకోలేని బ౦డబతుకులు కొ౦డల్ని పి౦డిచేసేది మేమైతే ధనరాశుల కొ౦డలుగ మారేది వాళ్ళు ఎ౦డకు వెన్ను మాడినా కూడా బిడ్డల కడుపు మాడొద్దని ఆరాట౦ నిత్య బతుకు పోరాట౦ ***************************** {05/02/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2c9ek

Posted by Katta

Pusyami Sagar కవిత

మెరుపు ముక్కలు ______ పుష్యమి సాగర్ "చెత్త కుప్ప ల్లో విసిరివేయబడ్డ మాంసం ముద్ద " "కన్నీళ్ళ కాలువ చెంపల మీదుగా గుండె లో కి .." "నువ్వు యాదికొస్థె మాటలన్నీ గిల గిల కొట్టుకు చస్తున్నాయి !" "నువ్వు యాదికొస్థె మాటలన్నీ గిల గిల కొట్టుకు చస్తున్నాయి !" "ఎప్పుడు వదులుతాయి నా దేశానికి పట్టిన చీడ పీడలు .." "సమూహాలలో నేను వంటరితనాన్ని తొడుక్కొని నిదరొతున్నాను! "వెంటాడుతుంటాయి కళ్ళలోంచి వెలేసిన కొన్ని కలలు" ఫిబ్రవరి 5, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2caPc

Posted by Katta

Gattupalli Lavanya కవిత

Srivashist - Guru @Srivashist 1h @JP_LOKSATTA @Loksatta_Party - I will donate rs.10/- for every RT this tweet geta in 24 hrs. Spread the word. #donate2lsp #loksattanow #deal

by Gattupalli Lavanya



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2c8XD

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

||ఆకలి తీర్చా || సత్యం గడ్డమణుగు|| ********************************* పొద్దుగాలనుంచి అడుక్కున్నా ఒక్కమ్మా బువ్వెయ్యలేదు.. కడుపుల వాడెయడో అతంచుకి ఇటంచుకి తాళ్ళుగట్టి లాగేత్తుండు.. కనీతం సుక్క నీళ్లైనా గొంతుల పోద్దామని ఆ ఈదిచియరున్న పంపుగాడికి పోతే, అది గూడక అమ్మగార్ల లెక్క ఏషాలేత్తంది.. ఆళ్ళేమో ఒక్క మెతుకు ఇయ్యలే, ఇది గూడ ఒక్క సుక్క బియ్యలే.. ఔలే ఎట్తాగిత్తాయ్..? అతలే మన యవ్వారం ఎడిసిమంగి మడతాలాగుంది.. కొద్దికొద్దిగ నా వంట్ల సత్తువ తగ్గుతా ఉంది. ఆ పంపు కాడ్నే కూలబడ్డా.. పంపుని పట్టుకోనీకి శెయ్యి గూడ లెయ్యలే., అప్పుడు జూసినా ఆ పంపు కన్నంల రెండు సుక్కలున్నయ్.. అవి కాసేపట్ల కారి కింద పడతయ్.. ఎట్టాగూ తలని లేపే ఓపిక లేక నోటిని పంపుకుందకి పెట్టిన.. సరిగ్గ సుక్క రాలే టైముకి ఓ కుక్క నాలికతో ఉన్న రెండుసుక్కలూ నాకేసింది.. బారెడు నాలిక్కి ఆ రెండు సుక్కలు సరిపోక రొప్పుతా నన్ను సూతంది.. అప్పటికే కింద పడ్దప్పుడు తగిలిన దెబ్బల్నుంచి కారుతున్న రక్తం వాసన ఆ కుక్క నాసికలకి తాకింది.. చిన్నగ నా మీద ఉన్న రక్తాన్ని సుతారంగ నాకేత్తోంది ఆ కుక్క.. అది అలా నా రక్తం కోసం నా మీద పడగానే ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా దాని కాలు నా ముక్కుకి రాసకపోయి రక్తం నా నోట్లోకి కారింది.. నాకు గొంతులోకి జారుతున్న ఉప్పని ద్రవం తప్ప ఇంకేమీ తెలియలేదు.. తెలుసుకునేంత తెలివి లేదు.. తెలివి రాగానే లేచి చూశాను నాకింక ప్రాణం లేదు.. ఎందుకంటే అప్పటికే ఆ కుక్క నా వొళ్ళు మొత్తం కొరికి మింగేసింది.. నిజానికి గొంతులోకి జారిన ఉప్పని ద్రవం ముక్కు మీద గాటుకి కాదు ఆ కుక్క కాటుకి వచ్చిన రక్తం.. పోన్లే నా జీవితంల అడుక్కోడమేగాని పెట్టింది లేకపాయే.. ఇట్టాగైనా పోతా పోతా ఒక జీవి ఆకలి తీర్చిన. గది సాల్ నాకు..! - సత్యం గడ్డమణుగు, 04-02-2014, 03:51

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gHyPoN

Posted by Katta

Jagadish Yamijala కవిత

ప్రేమతో ఒక స్నేహం -------------------------- స్నేహమూ ప్రేమా రెండు కళ్ళు.... వీటిలో ఒక కన్ను చాలు అంటే మనం నడిచే దారిలో స్పష్టత ఉండదు స్పష్టత కోసం స్నేహం, ప్రేమా అనే రెండు కళ్ళూ కలవక తప్పదు ఒకదానికొకటి చేతులు కలుపుకొని నడవాలి అప్పుడు మనం నడిచే దారి అందంగా ఉంటుంది .... --------------------------------------- యామిజాల జగదీష్ 5.2.2014 -----------------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jeEp2q

Posted by Katta

Vijaykumar Amancha కవిత

//పుట్టిన ఊరు // అమ్మ పుట్టిన ఊళ్ళొనే నేను పుట్టాను మరి నాన పుట్టిన ఊరు నా స్వస్థలమెందుకౌతుందో అమ్మ పుట్టిన ఊరు అమ్మమ్మ వారి ఊరు అవుతుంది నాన పుట్టిన ఊరు నా ఊరు అవుతుంది ఎందుకు ..ఎందుకు..ఎందుకలా // విజయ్ కుమార్ //

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j7ezx2

Posted by Katta

నవీన్ కుమార్ కొమ్మినేని కవిత

!!గమనం!! నిగనిగలాడిన నిన్నటి నిజాలు నేడు నల్లని అబద్దాలు నియమాలై నడిపించిన నమ్మకాలు నేడు నిలువనీడలేని అనాధలు చవులూరించిన తియ్యని అనుభూతులు నేడు చెదరని చేదు జ్ఞాపకాలు కాలం చేసే కనికట్టులో.. పరుగులెత్తిన ప్రవాహాలు నేడు నిశ్చల పయోధి తరంగాలు ఎర్రెర్రగా మండిన ఎండలు నేడు మసిపూసుకున్న రాత్రులు కనికరంలేని ఆ కాలం చేసే కనికట్టులో, కలలు కుమరించి రాసుకున్న కావ్యాలు నేడు అర్థాన్ని వెదుక్కుంటున్న పదసమూహాలు ఆశల అలలతో పోటెత్తిన సముద్రాలు నేడు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న మేఘావళులు కాలమొకటే కానీ, గట్టున కూచుని ప్రవాహాన్ని గమనించడమూ అందులోపడి మునిగిపోవడమూ ఒకటి కాదు! నవీన్ కుమార్ కొమ్మినేని 05/Feb/2014

by నవీన్ కుమార్ కొమ్మినేని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gLDOVm

Posted by Katta

Vijaykumar Amancha కవిత

//పుట్టిన ఊరు // అమ్మ పుట్టిన ఊళ్ళొనే నేను పుట్టాను మరి నాన పుట్టిన ఊరు నా స్వస్థలమెందుకౌతుందో అమ్మ పుట్టిన ఊరు అమ్మమ్మ వారి ఊరు అవుతుంది నాన పుట్టిన ఊరు నా ఊరు అవుతుంది ఎందుకు ..ఎందుకు..ఎందుకలా // విజయ్ కుమార్ //

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bkePky

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

కూలీ ........ హిందీ:- హరీష్ పర్మార్ స్వేచ్చానువాదం:-శ్రీనివాసుగద్దపాటి .................................................................................................................... నేనొక కూలీ నాకు అప్పగించినపని ఏదైనా.. చెయ్యాల్సిందే ఈ బంజరభూమిని మార్చమంటే నేను దాన్ని సశ్యశ్యామలం చేస్తాను కానీ... విచారం ఆ పచ్చని వనంలో .. భవనాలు నిర్మించమంటారు నేను గ్రామన్ని పట్టణం గా.. పట్తణాన్ని నగరంగా... నగరాన్ని మహానగరంగా... ఇలా.. భవనారణ్యాన్ని నిర్మిస్తాను కానీ... నేను మాత్రం ఎప్పటిలాగే... ఎక్కడివాణ్ణి అక్కడే... మునుపటిలాగే.. సరిహద్దుకి ఇవతలే.. కేవలం. ఒక కూలివాణ్ణే.... 03.02.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bVRbe6

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు// Dt. 5-2-2014 కరవమ్మ ఇంటిముందు మృత్యువు భిక్షాటనకు వస్తే ప్రాణాలనే బిక్షగా వేశాడు ఇంటి యజమాని విరిసీ విరియని పువ్వు కామాగ్నికి కమిలి అత్యాచారపు బాహువుల్లో నలిగి మృత్యువు సిగలో వాడిపోయింది ప్రాణం ఓ ఘోషా స్త్రీ దేహం బురఖా కప్పుకుంది మృత్యువు కనబడగానే మాయమైంది బురఖా మిగిలింది

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cTmqL5

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | చెల్లెలి ఫోన్ ........................... నిన్న చెల్లెలు ఫోన్ చేసింది తన బరువైన ,దిగులునిండిన జీవితాన్ని వొంపుతూ అమ్మలాంటి వదినతో సుదీర్ఘంగా మాట్లాడుతూనే ఉంది. తనలో కరుగుతున్న దు:ఖాన్ని, మోస్తున్న దిగుళ్ళ పర్వతాల్ని, శెలవేస్తున్నగాయాల్ని, వలపోతల్ని ఏకరువుపెడుతూఉంది. రోజురోజుకీ పెరుగుతున్న ఆశలపట్టికలనేరంవల్ల తన కాపురం వధ్యశిలమీదకు చేరుకుంటున్న ఘట్టాన్ని వివరిస్తూవుంది. ఇద్దరు పిల్లల భవిష్యత్తుని ఫణంగాపెట్టి ఎటూ తేల్చుకోలేని అశక్తతను ఏకరువు పెడుతూఉంది. ఒకింటికెళ్ళాక, ఆ ఒకింటిలో ఎండిపోయిన తనలోపలి నదుల్ని తలుచుకుంటూ నీరైపోతోంది. అందరూ ఉండి, ఎవరూ లేనట్లుగా మారిన జీవితంలో అందరూ వచ్చివెళ్ళే సమయం కోసం దేహమ్మీద మిగుల్చుకున్నగాయాలగుర్తుల్ని తడుముకుంటూ ఎదురుతెన్నులు చూస్తోంది. తప్పెవరిదో ఎవరికి తెలుసు- కాపురం నిలబడాలని కలగజేసుకోకుండా కాలానికే వదిలేసిన నాలాంటి మర్యాదస్తులదా? తనలో తానే సమాధానపడుతూ,సముదాయించుకుంటూ భర్త అయినందుకు భరిస్తూ నోరెత్తకుండా జీవితాన్ని కొంచెం కొంచెం జరిపేస్తున్న తనదా? ** నేను పక్కనే ఉంటానని తెలుసు. తోడబుట్టినవాడి గొంతు తన గొంతుతో కలిపి తను విరిగిపోతానని మాట్లాడలేని నిస్సహాయపు తనం.. అనుకుంటాం కానీ, అన్ని సమస్యలకూ, ఆవేదనలకూ పరిష్కారాలు ఒకేలా ఉండవు కాక ఉండవేమో?! 5.2.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N0A2dR

Posted by Katta

Kishan Mayu కవిత

ప్రేమకి..05.02.2014 కలిసి వున్నప్పుడు కనబడలేదా ప్రియ..! నీకు నేను పంచిన నీపై నేను చూపించిన నా ప్రేమ..! ని ప్రేమ కోసం ఆశగా ఏదిరి చూసి చూసి చివరికి కనుమరుగయ్యి కట్టేల్లో కాలిపోతున్నపుడు కన్నీరు పెడతావెం ప్రియ..!

by Kishan Mayu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQQtVz

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || పాఠాంతరం ప్రేమిస్తే ఊపిరందక విలవిల లాడేలా కాదు. తేలికై తేలాడేట్లు.. ద్వేషిస్తే శ్వాసకై మళ్ళీ నీ గుండె గదికే పరుగెత్తుకొచ్చేట్లు గుర్తుంచుకుంటే హృదయపు ద్వనితో జుగల్ బంధీ చేసినట్లు మరపులోకి తోసేస్తే మరో పెద్ద వెలుగు రేఖ పక్కన గీసినట్లు కరచాలనం చేసామంటే భరోసా ప్రవహించేటట్లూ మాట చురిక విసిరామంటే నీడపోరలు మాత్రమే తెగేటట్లూ నిరీక్షిస్తే రాదేమో ప్రయత్నిస్తేనే సాధ్యం ► 05-02-2014 http://ift.tt/LOjZil

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LOjZil

Posted by Katta

R K Chowdary Jasti కవిత

పూదోట ఎంత అందంగా ఉంటుంది తన నవ్వు గులాబీపువ్వులా సింధూరపు వెన్నెలలా ఇప్పుడు ఆ నవ్వుల పూదోట ఎలా కాలిపోతోందో మీ నల్లని చూపులతో చూడండ్రా తెంపకండ్రా ఆ నవ్వుల్ని మీ కోర్కెలతో చంపకండ్రా ఆ పువ్వుల్ని మీ చేతులతో అది ఒట్టి నవ్వు కాదురా దానిలో ప్రకృతి పరిమళం ఉంటుంది జీవితపు సారాంశం ఉంటుంది ఆస్వాదించండి ఆనందించండి కానీ అంతం చేయకండిరా ప్లీజ్! © జాస్తి రామకృష్ణ చౌదరి 05.02.2014@11.49AM

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kaIEfn

Posted by Katta

Buchi Reddy కవిత

2-4-14 ****** అతడు---ఎక్కువ----ఆమె---తక్కువ???మార్పు ఎన్నడు ?? ఎప్పుడు ??******************* అతడు-ఎక్కువ ఆమె--తక్కువ కాలం మారింధీ సమాజం మారింధీ జీవిత విధానం మారింధీ స్వాతంత్రం వచ్చింధీ---అయినా ఏళ్లు గడిచినా ఇంకా ఇప్పటికీ ఈ బూర్జువా వ్యవస్థ లో స్త్రీ-- పురుషుల మధ్య న్యాయం ధర్మం నీతి సమాజం---లో అన్నింట్లో తేడాలు అప్పుడు--ఇప్పుడు--ఎప్పుడూ--?? స్త్రీ--అతని స్వంత ఆస్తి ఆమె మనిషి కాధూ స్త్రీ--మైనస్ పురుషుడు---ప్లస్ పురుషుడు----- వాంశోద్దారకుడు ----జ్యా ణ వంతుడు ------సమర్థుడు -----బలవంతుడు ------పోరాటయోధుడు స్త్రీ-----సుకుమారు రాలు -------బలహీనత కల ధీ ------పిరికితనం కల ధీ ------భోగవస్తువు -----సౌంధర్య వస్తువు--- అంటూ సమాజం కలిపించిన తీరును పాతబావాజాలలను ఎదురించకతప్పధు తీరుగబడక తప్పధు ఇక బైబల్--ఖురాన్--గీత ఏ గ్రంధం తిరగ వేసినా చదివినా--అన్నింట్లో పు రు షా ధీ క్య త---కనిపిస్తుంధీ ?? స్త్రీ--విధ్య బాల్య వివాహాలు దేవధాసి వృత్త్హి---ట్రాఫికింగ్ వోటింగ్ హక్కు---పితృసా మ్యా అధిపత్య సమస్య వితంతు పునర్వివాహాలు--సతీ సహగమనాల కు వ్యతిరేకం గా ఎన్నో ఉద్యమాలు చేపట్టినా నేటికి స్త్రీ ల కు ఏ విధమయినా స్వేచ్ఛ-- --స్వాతంత్రం లేకుండా సమానత్వం లోపిస్తూ అణిచీవేతల తో అధిపత్యాలతో నిర్భంధాలతో నేటి ధోపీడీ సమాజం కట్టుబాట్ల పేరుతో కట్టి వేస్తూ--- నేటి ప్రజాసామ్యం లో చట్టాలు సహిత౦ మతాల--కులాల ప్రాతి పధిక మిధ నడుస్తూ---?? పురుషాధి ప త్యా౦ కుటుంభం లో సమాజం లో రాజకీయాల లో-- కళ్ళకు సంకెళ్ళు కాళ్ళ కు సంకెళ్ళు మనసుకు సంకెళ్ళు నోటి కి సంకెళ్ళు -- వేస్తూ నోర్లు మూయిస్తూ అన్యాయాలు చేస్తున్న తీరుని ఏ ధు రించక తప్పధు పోరాడక తప్ప ధు---- నేటికి ఆసిడ్ ధాడు లు లై౦గీ క ధాడు లు వరకట్నపు హత్యలు గర్భ౦చ్చి తి అత్యాచారాలు వై వాహిక అత్యాచారాలు రకరకాల వె ధింపులతో అవమానాలతో అసమానతల తో అభద్ర త ల తో మానసిక వె ధ న ల తో---గడుపుతూ ఎంతకాల్లం ఈ-తీరు ఎప్పుడు--ఎన్నడు--మార్పు ??? గుండె నిబ్బరం తో ఆత్మ విశ్వాసం తో సాహసం తో దేశం లో ని మహిళాలంతా ముక్త కంట ౦ తో ఎలుగెత్త్హి--- ఎదురొడ్డి పోరాడక తప్పధు మార్పు రావాలి-- తేవాలి ** స్త్రీ -- పురుష సంభంధం అనేధీ మనిషికి --మనిషికి ఉండే సహజ సంభంధం కావాలి*****(మార్క్స్ మాటలను) తలుచుకుంటూ----- -------------------------------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kaIGnE

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||ఉరితీత|| సమస్యల బస్తాలు ఇరుభుజాలనెక్కుంచుకొని నిరాశ నిస్పృహలు చెరో సంకలో దాచుకొని సూర్యచంద్రుల మద్య నలిగే ఆకాశంలా అంగడిలో ఆ మూల నుండి ఈ మూలకు కురవని కాసుల బేరం నడుమ, పగుళ్ళ పాదాలతో సూరీడు వాలాడు, ఇంటిముఖం పట్టేవేంటి, గయ్యాళి పెళ్ళాం, గంపెడు పిల్లలు, కిరణా శీను రెంటు బాబాయ్, చిట్టీలోడు, చెబదులోళ్ళు నీ ఇంటిముంగిట కాపులేక చెట్టును దాటగలవ నీ కష్టాలు తీరేవికావు, సంచిలిసిరేసి సారాకొట్టుకు నడవోయ్ జారిణిరంగి రంగులద్దుకుని తలుపు తీస్తుంది,రంగుల్లోకంలో దూకై వరేయ్, నిన్ను చూస్తే దిగులవుతుంది, రాత్రి గడవదేమో,నీతో పాటు నేను వస్తాను నీ ఇంటికి కారు దిగిన బాల్యస్నేహం, జాలితో ఏంట్రా వట్టి చేతులతో కొమ్మ కొమ్మకు ఏదో తగిలిస్తున్నావ్ చెట్టుతో మాటలేంటో, మతిబ్రమించి, చివరకు మానసిక రోగం నిద్రలో కూడా నీ దీనస్థితి గుర్తొచ్చి, నా కనురెప్పలు తెల్లవార్లు కొట్టిమిట్టాడాయ్ రాత్రి గడిచింది ,సూరీడు నవ్వాడు, టీ సుక్క మింగెవొ లేదో, అప్పుడే చెట్టుతో మాటలేన్ట్రా ప్రతీ కొమ్మనుండి ఏవో తీసి మళ్లీ భుజాలకెక్కిస్తున్నవ్, పిచ్చి ముదిరింది నిముషం ఆగి నిజం చెప్పు, వట్టి చేతులతో చెట్టుతో మాటలేన్ట్రా, చీకటిలో ఏదో తగిలిస్తున్నావ్, వేకువ జామునే మళ్లీ ఏదో తగిలించుకుంటున్నావ్ చిద్విలాస చిన్మయత్వ ముగ్ద మనోహర రూపంతో మోము వెలుగుతుంది చిదంబర రహస్యం ఏంటో, స్నేహితుని అయోమయపు ప్రశ్న.... జవాబు "ఉరితీతే "......ఫలితం కంటినిండుగా కమ్మటి నిద్ర సమస్యల బస్తాలు, నిరాశ నిస్పృహలు నిద్రకుముందు చెట్టుకు ఉరితీసాను నాకు నేను ఊ కొట్టుకుంటూ "మనిషి" నై మనసుతో మనసులో కునుకేసాను రాత్రి గడిచింది, వేకువ యంత్రాన్నైఅంగడి వైపు మళ్లీ అడుగులేసాను బేరంకోసం నేను, అర్థంకాక బాల్య స్నేహం - చెట్టును చూస్తూ జాలిగా! "చెట్టుదేవుడు నవ్వుతున్నాడు ఎవరైనా ఉరేస్తారా అని ఎదురు చూపులతో శిలువలో భరిస్తూ" నిన్ను నన్ను నిదురపుచ్చడానికి!! సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఆయన మిమ్మును శోధింపనియ్యడు, అంతే కాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను "మార్గమును" కలుగజేయును. ఆర్కే ||ఉరితీత||20140205

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bpGhxi

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

బ్రదకని పాట ********రావెల పురుషోత్తమ రావు రోజంతా నగరాల నడివీధుల్లో చీకట్లే విస్తరిస్తూ పోతుంటే వెలుగు జిలుగల ప్రస్థానానికి వేదిక ఎక్కడ మిగిలి ఉంటుంది? చెదరిన జుట్టుతో చినిగిన ఉడుపులతో భంగపడిన మాన ధనంతో ఆడపిల్ల అభం శుభం యెరుగని అందాలబొమ్మ తలొంచుకుని నడుస్తూ ఏకధారగా విలపిస్తూ ఇంటికి చేరువగా చేరుకుంటే యే తల్లి దండ్రుల గుండెలు వక్కలవకుండా మిగిలి నిటారుగా నిలబడ గలుగుతాయ్? ఈ దేశం నీ మాతృ భూమి అందరూ నీ సహోదరులేనంటూ బడిలో నేర్చిన పాఠం గాలికి దూదిపింజలా ఎగిరిపోతుంటే యే పిల్లల గుండెలో ధైర్యం నెత్తురుగా ప్రవహిస్తుంది? సజావుగా ఈసమాజం గీసిన హద్దుల్లో నిర్భయంగా పిరికిదనాన్ని పారద్రోలి బ్రదుకును స్వేచ్చగా వెలార్చగలుగుతుంది ? -------- ---------------------------------- 3-2-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MS6zmi

Posted by Katta

Kotha Kamalakaram కవిత

కె.శివారెడ్డి,కొలకలూరి ఇనాక్ గార్లకు 'దాట్ల' సాహిత్య పురస్కారాలు ప్రతి సంవత్సరం ఒక కధకునికి పురస్కారాలు అందించడానికి 'దాట్ల దేవదానం రాజు సాహితీ సంస్థ ' నిర్ణయించింది.ఈ సంవత్సరానికి (2014) ప్రముఖ కవి కె. శివారెడ్డి, ప్రముఖ కధకులు కొలకలూరి ఇనాక్ గార్లకు సంస్థ పురస్కారాలు ప్రకటించింది. కవి, కధకుడు దాట్ల దేవదానం రాజు 60 వ జన్మదినోత్సవం మార్చి 23 వ తేదీన యానాం లో జరిగే సభలో పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ పురస్కారం కింద ఒక్కొక్కరికీ పదివేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. 4-2-2014 డి.వి.ఎస్.రాజు, దాదేరా సాహితీ సంస్థ , యానాం.

by Kotha Kamalakaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nRlAm5

Posted by Katta

మరువం ఉష కవిత

మరువం ఉష | తరుచుగా -------------------------- దేహమే శిలువగా మోసుకుంటూ, లేదా దేహపు గదిలో బందీ అయిన ఆత్మగా విశ్వపు ఒడికై ఆర్తి చెందుతూ విడుదల కొరకై వేచి ఉంటాను గోడల్ని ఒరుసుకు మొలిచిన రావిఆకులు కదులుతాయి, కంటి చూపుని కదుపుతాయి నీటిలో పడ్డ కిరణాల పరావర్తనమో, వక్రీభవనమో మెరుపు నీడలై కనులెదుట నిలుస్తాయి వార్తాహరులు వచ్చిపోతున్నట్లే ఉంటుంది కమ్ముకుని కట్టిపడేసిన భయపు కౌగిలి లో ఊపిరి అందని ఉక్కిరిబిక్కిరి లో దిగంతపు దిశ గా, ఏవేవో ఆనవాళ్ళ వెంట చివరి మజిలీ కి తరలిపోతుంటాను గాలి ఊయలులు సేద తీరుస్తాయి కెరటాల వీవెనలు కుదుటపరుస్తాయి ప్రకృతిలో మనుషులు, మనుషుల్లో ప్రకృతి పలుకరిస్తాయి, గృహానికి చేరిన భావన ఇస్తాయి ఇవన్నీ నిండిన లోకపు వాకిలి లో నిలిచి, కృతజ్ఞతల తోరణాలు కట్టిపోతాను 03/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bjTNSS

Posted by Katta

Sai Padma కవిత

సాయి పద్మ //.......................... నాదీ అనబడే పెద్ద ఆశలేం పెట్టుకోలేదిక్కడ కాటి దాకా కంట నీరై తిరగాలని కూడా లేదు కొత్తనీరు, పాతచావు రెండూ సమానమే అయ్యాయి జీవితమంతా చిటికెడు ప్రేమ కోసం తపించే స్త్రీలు అణచివేతని ఆరుగజాల చీరలా చుట్టిన పడతులు గుప్పెడు బూడిదయ్యే విషయంలో కూడా అసమానతల్ని... అధికారాన్ని రోజువారీ వంటలా ..కర్మ సిద్ధాంతపు మంటలా సమాధాన పడటం చూస్తే నిస్సహాయితని , అది పెంచే సంస్కృతి నీ నిద్ర లేపి మరీ ,మళ్ళీ చంపాలనిపిస్తోంది .. ఈ కవితకి క్రాఫ్ట్ లేదు ... ఐచ్చిక జైలు ముంగిట్లో కళ్ళాపి జల్లే ఆడవాళ్ళని ప్రేమించే నాకు బుద్ధి లేదు ..!! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bVgk8N

Posted by Katta

Prabhakara Chary Anumula కవిత

ఆడోళ్ళ ఆవల విసిరేయ తగునా...? ఆడ పిల్లలు నీకు వరుస పుట్టారంటు... ఆడోళ్ళ మెడ పట్టి ఆవలికి గెంటేసి... మరో ఆలికై చూసేటి మగాడా.... వద్దన్న నీకు ఏడంగ వచ్చురా ...మరో ఆడంగి...! ఆడనే నీ బతుకు ఆరంభమని తెలిసి ...! చనుబాలతో నీ బలుపు మొదలాఎనని మరచి... ముదితతో కలసి...మురిపాల అలసి... ఆడి..పాడి...ఆడదని...! ఆడిదని.....! ఆడ విసిరేయ తగునా...? సంపదల కలిమిని..మగటిమి లేమిని...! మృగ ..మగ... బలిమిని.... కళ్ళు మూసుకొని..! చిరునవ్వుతో....సహియించిన..! వసుధనే...! ఆవల విసిరేయ తగునా ,,,!?

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bVgmNY

Posted by Katta

Annavaram Devender కవిత

తొవ్వ ..................................................................................................5.02.2014.. ..................................................................................................అన్నవరం దేవేందర్ .......................................భాషల ఖార్ఖానా భాస్కర్ ...................................................... ఆయనను చూస్తే అప్సస్ అనిపిస్తది .ఎట్ల నేర్సిండు ఇన్ని భాషలు అని .ఒకటా రెండా పద్నాలుగు భారతీయ భాషలు గడ గడ మాట్లాడుతాడు .సర్ర సర్ర రాసుకపోతడు .మల్లా ఇండ్ల కెల్లి అన్డ్లకు ,అండ్ల కెల్లి ఇండ్లకు సక్కగ అనువాదం చేస్తడు.మనకు తెలిసి ఏడు ఎనిమిది భాషలు తెలిసినోల్లు ఉన్నరు.పివి సాబ్ సుత భాహు భాషా కోవిదుడు .ఇంక ఆయనకు విదేశీ భాషలు సుత వచ్చు .ఈ పద్నాలుగు భాషలు నేర్సుకున్న నలిమెల భాస్కర్ ది కరీంనగర్ .ఆయన అన్ని భాషల పుస్తకాలు పత్రికలు ఉంటయి . మొదట తమిళం నేర్సుకున్నాడట .ఇగ తరువాత కన్నడం ,మలయాళం ,హిందీ ,ఉర్దూ ,పంజాబీ ,సంస్కృతం ,అస్సామీ ,బెంగాలి ,ఒరియా ,మరాటి ,ఆంగ్లం ,గుజరాతీ ,ఇన్ని భాషలు వచ్చు తెలుగు భాష మనదేనాయే .మొత్తం పద్నాలుగు ఇంకోటి తెలంగాణా కూడా మస్తు వచ్చు .తెలంగాణ తెలుగు వేరు వేరా అనిపించవచ్చు .అవును వేరు వేరే అని ఈ నలిమెల భాస్కరే తన ‘బాణం ‘వ్యాసాల ద్వార నిరూపించిండ్రు .ఎందుకంటే తెలంగాణా భాషల రాసిన నవలలు కేవలం తెలుగు పుస్తకాలు సదివేవాల్లకు సమాజ్ కావు . అయితే ఇన్ని భాషల పట్ల ప్రేమ ఎందుకు పెరిగింది అంటే ,తాను రైల్వే స్టేషన్ ఉన్న ఒక వూరిలో ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తుండగా ఆ రైల్వే బుక్ స్టాల్లో అన్ని భాషల చందమామ లు అన్ని భాషల రేపెదేక్స్ బుక్స్ చూసి పట్టు పట్టినట్టు చెప్పుతారు .ఇగ ఆ తెరువాత ఒక్కొకటి ఒక్కొక్కటి అన్ని భాషల అక్షరాలు సాహిత్యం వ్యాకరణం కథలు కవిత్వం అన్ని నమిలి మింగేసిండు . ఇట్లా అనువాదం లోకి వచ్చిండు గాని మొదలు ఆయన కవి రచయిత .1993 లో ‘నూరేల్ల పది ఉత్తమ మళయాళ కథలు ‘తెలుగులోకి అనువాదం చేసి పుస్తకం గా తెచ్చారు . ఇదే సంవత్సరం మలయాళం నుంచి ‘మనీమేకర్స్ ’నవల కన్నడం నుంఛి ‘కుండి ‘నవల తెలుగులోకి అనువదిన్చిండ్రు . 1996 లో ‘అద్దంలో గాందరి ‘ పేరుతో తమిళ మలయాళ మరాటి భాషలలోని పన్నెండు కథల పుస్తకం తెచ్చిండ్రు .1985 నుండి 2000 లలో తెలుగు లో వచ్చిన దళిత స్త్రీ వాద కవిత్వాన్ని తమిళంలో పుస్తకం వేసిండ్రు . 14 భారతీయ భాషలలలోని రచయితల పరిచయాన్ని ఆంధ్రజ్యోతి లో కాలం లో పరిచయం చేసి పుస్తకం గా వేసిండ్రు .ప్రజా సాహితీ లో ‘మట్టి కూడా మాట్లాడుతుంది ‘ కాలం రాసి పుస్తకం గా వేసిండ్రు .మలయాళ నవల ‘స్మారక శిలలు ‘అనువాదం అనువాదం సాహిత్య ఎకాడమి పుస్తకం గ వేసింది .ఇలా నలిమెల భాస్కర్ సర్ ఒక అనువాదాల ఖార్కనా . ఇదంతా ఒక ఎత్తు తెలంగాణా భాషకు డిక్షనరీ తాయారు చేసుడు ఇంకొక ఎత్తు .ఆంద్ర –తెలంగాణా బలవంతంగ కలిపి ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణా భాషా సంస్కృతి చెప్పరానంత నష్ట పోయింది .అందులో తెలంగాణా పదాలు దాదాపుగా మరిచిపోయే దశ వచ్చింది .అప్పుడు ఆ లోటు ను తీర్చ ‘తెలంగాణా పదకోశం ‘తీసుకవచ్చిండ్రు .ఇప్పుడు మరిన్ని పదాలతో సరి కొత్తగా వస్తుంది. అనువాదం లేకపోతే దేశ దేశాల కవిత్వం సాహిత్యం మనం చదువక పోవచ్చు కాని ఇదొక పరిశ్రమ .నలిమెల భాస్కర్ ఇన్ని భాషలు తెలిసి మన సాహిత్యాన్ని ఇతరులకు అక్కడి సాహిత్యాన్ని మనకు అందిస్తున్నారు .చిన్నగా భాషల మీద ఇంట్రస్ట్ బహుభాషా వేత్తను చేసింది .భాషల పట్ల ప్రేమ ఇన్ని భాషల మన భాస్కర్ గురించి అంతర్జాల పాట కులకు తెలువాలేనని ఈ తొవ్వలో ఈ సారి భాస్కర్ .... .

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cSWH5p

Posted by Katta

Swatee Sripada కవిత

రెండు సమాంతర సముద్రాల మధ్య.... స్వాతీ శ్రీపాద పోగేసుకోడం పోగొట్టుకోడం రెండు సమాంతర నదులూ నిర్విరామంగా అటూ ఇటూ ప్రవహిస్తూనే ఉంటాయి ఖాళీ చేతులతో రెంటి మధ్యా ఒడ్డులా కళ్ళప్పగించి కాస్త కాస్త చెక్కుకుంటూ పోయే అబ్రకదబ్ర మంత్రాలమారి సమయం ముందు తలవంచి ఎవర్ని వాళ్ళు సమర్పించుకు, సరిపెట్టుకు సరిగమలవుతూ .... ఉగ్గుపాలతో కాలుష్యాన్ని తాగితాగి అలవాటుపడి బోసి నవ్వుల్లోనే నీలి నీడల చాయలు ఆట మరబొమ్మలా అలుపనేది లేకుండా ఇటునుండి ఆ తీరానికీ ఆ వైపును౦డి ఈ నదిలోకీ ఎగిరెగిరిపడుతూ తుంపరలు తు౦పరలుగా ఊహలు.. కనురెప్పలు వాలీ వాలకమునుపే కాచుక్కూచున్న కలలు చటుక్కున చీకటి తెరలను జరిపి ము౦దుకొస్తాయి ఆగిపోయిన కాలం పాయలు పాయలుగా చీలి నిద్రకూ మెళుకువకూ మధ్య హరివిల్లు లెన్ని౦టినో గాలిపటాలుగా ఎగరేస్తుంది మసక వెలుతురులో నడిరోడ్డున పరచుకున్న తోకమల్లె పూల పరిమళాల సంభాషణలకూ ఉండీ ఉండీ అక్షంతలుగా రాలుతున్న పూల జల్లుల్లో పులకరిస్తూ తొలి వెలుగు రేఖలను తెల్లగన్నేరు గుత్తులలో నింపుకు పక్కనుండే సరసరమని జారిపోయే దేవసర్పాల కాంతులు కళ్ళల్లో వంపుకు మళ్ళీ ఓ సారి మొలుస్తుంది ఎప్పుడో ఎండిపోయిన బాల్యం. సాయం సంధ్య ఎర్రని కళ్ళలో చుక్కలుచుక్కలుగా చనుబాలై అప్పుడప్పుడే విచ్చుకునే తెల్లని బొడ్డుమల్లెల చల్లదనం ఆకుచేతుల్లో మొహాలు దాచుకు వేళ్ళ సందుల్లోంచి దూరి వచ్చే వెన్నెల తీగలమీద నిశ్శబ్ద గానమవుతూ దిగ౦తాలకు రాయభారాల పర్వమవుతూ నవయౌవనం నీడలు తెరలు తెరలుగా కలవరిస్తున్న మాటల గుసగుసలనో పక్కకు నెట్టి హోరు గాలిలా చుట్టుకుపోతు౦ది హద్దులు మరచిన ఆకాశమై ఒకప్పటి చెరిగిపోని సంక్రాంతి ముగ్గు నిండిన జీవన ప్రాంగణం పెదవుల వెనకా , లోలోపలి అదృశ్య మధు భా౦డంనిండా పొంగి పొరలే తీపి కలల ఆవిరులు అగరు పొగలై కాస్సేపు ఉక్కిరిబిక్కిరి చేసే వేళ ఇటూ ఇటూ ప్రవాహాల్లోకి జారిపోయిన క్షణాలు తలపోస్తూ వచ్చిపడుతున్న సుమధుర గీతాలాపనలు ఆస్వాదిస్తూ రెండు సమాంతర సముద్రాల మధ్య ఒదిగిన చెలియలి కట్టని...................

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imTvPJ

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-17 నువ్వు చెప్పదలుచుకున్నది ఎవరేమనుకున్నా చెప్పేవెళ్ళు.. వాటిలో సత్తువ లేకపోతే ఈ అనంతకాల ప్రవాహంలో కలిసి మాయమైపోతాయి..! నిజంగా నీ పలుకులు జీవోన్మత్తములే గనక అయితే నీ సమకాలికులు నీ పట్ల నిర్లక్ష్యం వహించినాసరే ఒక వంద యేళ్ళ తర్వాత గురజాడ వారిలా కొన్ని వందల యేళ్ళ తరవాత వేమన్న వాదంలా జనాల గుండెల్లోనాని ఒక శుభోదయాన చిగుళ్ళు వేసి వృక్షాలవుతాయి...!

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3Dimf

Posted by Katta

Srikanth Kantekar కవిత

నేను-4 --------- ఎవరో నువ్వు ఎల్లలులేని ప్రపంచంలో ఎదురుపడి ఎగిసిపడే నన్ను పట్టుకుంటావ్ ఎలా నువ్వు యెదలోకి చేరి యేదో మాయ చేసి అసంకల్పితంగా నాకు సంకెళ్లు వేస్తావ్ నీ మాటల దారిలో నన్నొక ప్రతిస్పందనగా మలుస్తావ్ ఊహకందవ్ మరెందుకో ఊపిరిలో ఒదుగుతావ్ మరెలాగో నా ఉద్వేగంలోనూ, ఉద్రేకంలోనూ నీకే లొంగిపోతాను విజయపు కిరీటాన్ని తీసి గర్వపు ఖడ్గప్రహరాన్ని పడవేసి ఓ వనదేవత! నన్ను స్వీకరించు అని సమర్పించకుంటాను మల్లెపూల నీ వాలుజడ నా మెడ చుట్టు చుట్టి వెన్నెల జల్లు చుట్టు పరిచి పరుచుకున్న నీ ఒడిలో ఒదుగుతాను చెప్తూ చెప్తూ పోతావ్ మన కథను చివరి అంచు వరకు లాక్కెళ్లి మరణం గురించీ చెప్తావ్ మరణించనిదంటావ్ మన ప్రేమ విడదీయలేనిదంటావు మన స్నేహం పిచ్చిదానా! నీ తల నిమిరి నీ నుదిటన తిలకమై పూస్తాను నిన్ను నమ్మకంగా గుండెలోకి తీస్కోని ఈ బంగారు క్షణాల్లో నిన్ను బతికించుకుంటాను మృతప్రాయమై నిత్యం ప్రవహించే కాలం చింత మనకెందుకు ఈ బతికిన క్షణాల్లో భయం దరిచేరని బహ్యా ప్రపంచం గోల తెలియని అమృత కథనం మనం అమరగానం మనం నిరామయ, నిర్వాణ చిదానంద ఆత్మలం మనం - శ్రీకాంత్ కాంటేకర్

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bpp0Ef

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || గుండె లోతుల్లో|| ======================= తవ్వే కొద్దీ నీచఆనవాళ్ళు బయట పడుతున్నాయి లోపల పేరుకుపోయిన ఆనవాళ్ళు కరుడుకట్టి మట్టి ముద్దలై వెక్కిరిస్తున్నాయి ఐనా గునపం పోటు వేస్తూనే ఉంది పెకలిస్తున్న గునపం గాయాలు చేస్తూనే ఉంది తవ్వేకొద్దీ వర్గ దోపిడీ పాదముద్రలు కనిపిస్తూనేఉన్నాయి గతం తాలుకూ బాధలన్నీవ్యధలై ముద్రలుగా కనపడుతున్నాయి గుండె గాయాలు కనపడుతూనే ఉన్నాయి ఆనవాళ్ళను చీల్చుకుంటూ అన్వేషణ సాగిస్తూ అంతరాలను తవ్వుతుంటే గతాలన్ని విషాదాలే ... అన్నీ అవశేషాలే నాటి నాగరికతల నుండి పుణికి తెచ్చుకున్న వారసత్వ బానిసత్వపు ఛారలు గులకరాళ్ళై గుండెకు గుచ్చుకుంటున్నాయి పదునెక్కిన గునపం గుండె లోతుల్ని వెతుకుతుంది చివరి లోతుల్లో జలమై ప్రవహిస్తూ స్వచ్చమైన హృదయాలు కనిపించాయి మానవ పరిణామ క్రమానికి ముందు కుల వర్గ విబేధాలు లేని జీవనాలు నవ్వుతున్నాయి వానర పరిణామా సంచారంలో.... ============= పిబ్రవరి 05/2014 =============

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MZIutV

Posted by Katta

Naveen Auvusali కవిత

||మౌనం శూన్యం ||నవీన్ అవుసలి.|| మూగబోయిన మనసుతో ,మౌనాన్ని మోసే మదికి తనకి తన విలువేంటో తెలిపే నేస్తమే మౌనం.. శూన్యాన్ని శోధించే యోచనతో, శూన్యంతో శూన్యమైన ఆలోచనకి పదునైన ఆలోచనని పుట్టించే నేస్తమే శూన్యం... మూగబోయిన మనసుని జయించు అదే జీవితం.. శూన్యమైన ఆలోచనకి జీవం పోయు అదే అసలైన జీవితం..

by Naveen Auvusali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZbI9F

Posted by Katta

Sriramoju Haragopal కవిత

అగ్నితలం నిర్విరామంగా, నిశ్చలంగా ఆకాశమట్లే వుంది పెదాలపూల రెక్కల మీద వాలిపోయే సంజె కెంజాయల వెలుగుదువ్వెన్ల పిలుపులై, నీటి అలల కలల రాగజలతరంగిణీస్వరాలై, నింగినేలా తడిసేలా విరజిమ్మే విరులచెమ్మలై, ఇంకా ఎరుపెక్కిన వియోగాశ్రునయనాలై గాలి నిశ్శ్వాసాలతో తల్లడిల్లిపోతున్నది ఎవరిని కన్నీటిచినుకులా రాలిపొమ్మని, ప్రతిరేయి చీకటి దుఃఖపువడగాలులతో నిదురతొవ్వల్ని ఎడారులు చేసిందో ఎవరిని వెన్నెలసింగిడిబొమ్మలా రమ్మని ప్రతిరేయి చీకటినవ్వుల నీలిహంసరెక్కలతో పాటలు విసురుతుందో ఎవరి పాదముద్రల నద్దుకుని బాటలన్ని కావ్యగీతాలైనాయో నేల మరుపెరుగని మనసులాగ వెక్కెక్కిపడ్తున్నది పొక్కిలి పొక్కిలైన సముద్రాన్ని అలికే అలికిళ్లప్రేమ హస్తాలేవి పచ్చిగాయాల పదునుతో తడి తడిగా శాంతిదేహాలు పొదల్లో దాచిన నెమలీకల పిల్లనగ్రోవి మంచుముద్ద అనుకంపలెరుగని గుండెల్ని తడిమి ఎట్లా కాలిపోయిందీ లోకం ఎపుడు వొస్తావీ తోటగుమ్మంలోనే పరిమళమై నిరీక్షించే నాకోసం జడివానలో తడువని పిడికిట్లో రాసుకుని దాచుకున్న పేరు నీదే 03.02.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3vosS

Posted by Katta

Krupakar Ponugoti కవిత

నామదేవ్ ధసాల్ గొప్ప స్ఫూర్తిదాయకమైన కవీ ,రచయిత. కాని అతని రాజకీయ భావాజాల ప్రయాణం ,పరిణామం గనక గమనిస్తే ( ఈరోజుటి - 3-2-2014- ఒక తెలుగు దిన పత్రిక అందించిన సమాచారాన్ని బట్టి ) '' మొదట్లో సోషలిస్టు భావాజాలం కొంత కాలం కాంగ్రెస్ తో సాన్నిహిత్యం తర్వాత శివసేన తో , ఆ తర్వాత ఆర్ ఎస్ ఎస్ తో " అనీ , ఇంకా " రచనలు : ఇందిరాగాంధీ పై 'ప్రియదర్శిని' పేరుతో కవిత్వం శివసేన పత్రిక సామ్నా లో రచనలు " ( కోట్స్ నావి ) అని చదివాక కొంచెం ఆశ్చర్యం , ఎందుకో కొంచెం ఆయన రాజకీయ దృక్పధం పట్ల అయిష్టం అనిపించింది.ఆయన రచనల వెనక ఉన్న రాజకీయ ఆచరణే ఆయనకు అంత గుర్తింపు నిచ్చిందా అని అన్పించింది.ఏదేమైనా , ధసాల్ అధో జగత్ దళితుల గురించి చేసిన రచనలను ప్రేమిస్తూ ,ఆయనకు నివాళు లర్పిస్తున్నాను .

by Krupakar Ponugoti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3vot4

Posted by Katta

యం. శ్రీవల్లి కవిత

ll సింధూరంll యం.శ్రీవల్లి. 03/02/2014. హృదయాన్ని తాకివెళ్ళే నీ ప్రతి జ్ఞాపకం .. నా పెదవిపై చిరునవ్వై మెరుస్తోంది. నా తనువుని స్పృశించే పిల్లతెమ్మేరేదో.. నీ చిలిపి ఊహకు ప్రాణం పోస్తోంది. నీ తలపుల సెలయేరులో తానమాడే నా మది లో వలపు కలువలు విరబూసినాయి. నీ ప్రేమ చినుకులలో తడిసిన వేళ రాలే ప్రతి ఆనందభాష్పమూ స్వాతిముత్యమయ్యింది. చిన్న చిన్న ఆనందాల నా ప్రపంచం నీ అనురాగ వీచికలతో స్వర్గతుల్యమయ్యింది. నీ మనసు స్వచ్చత నా ప్రేమ హరివిల్లు తో కలిసి సంధ్యారాగమై.. ఆనంద వర్ణాల నిలయమయ్యింది. నీ సాంగత్యపు క్షణాల ముందు.. వందేళ్ళ కాలం అల్పమయ్యింది. మన ప్రేమ నుదుటి సింధూరమై నా స్త్రీత్వం పరిపూర్ణమయ్యింది.

by యం. శ్రీవల్లి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j67VXP

Posted by Katta

Padma Rani కవిత

!!వృధాప్రయత్నం!! పలకా బలపం పట్టి పదాలెన్నో కూర్చి పలకలేని భావాలన్నీ అందులో పేర్చి చదవమంటే సరిగ్గా కనబడడం లేదని నల్లకళ్ళద్దాలు తొడిగి రంగుకల చూస్తే కనబడేది నలుపే కాని తెలుపు కాదు.. మూర్ఖుడికి మంచి ముచ్చట్లెన్నో చెప్పి మురిపాలతో అనురాగ పాఠాలు నేర్పి గాజువంటి జీవితాన్ని గోముగిస్తే కాదని విసిరేసి ముక్కలు చేసి గాయాలు చేస్తే మందువేసినా గాటుమాత్రం మాసిపోదు.. బండబారిన మనసుని బరిలోకి దింపి ప్రేమనంతా పోసి గోరుముద్దలుగా చేసి తినిపించబోతే చేదు నోటికి సహించదని తియ్యతేనెలో విషాన్ని రంగరించి సేవిస్తే విషం వెన్నగామారి ప్రాణం పోసేయదు.. 03-02-2014

by Padma Rani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fS9CmP

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

కవి రాజులము వారణాసి రామబ్రహ్మం 5-2-2014 మారాజులము మేము కమ్మని కవితల మిమ్ములను పలకరించి పరవశింపజేయు మాటల రారాజులము మేము కన్నీళ్లు నవ్వెను తప్త హృదయ వేదన శమించెను కలువ కన్నెలూ నవ్వెను విరహానంతర ప్రియ సమాగమున నవ్వెను ప్రేయసీ ప్రియుల మనములూ వర్షించెను రస ప్రేమ జల్లులు హర్షించెను మోదమున వారి వారి మనములు తనువులు సడలెను చీర ముడులు పరవశమున హసించెను కొప్పుముడుల సుమ కన్నియలు విచ్చి సౌరభమును పంచెను సమాదరముగా

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsSCTJ

Posted by Katta

Kapila Ramkumar కవిత

అసమాన ప్రతిభాశాలి ఆళ్వార్‌స్వామిPosted on: Tue 04 Feb 23:06:02.05006 2014 వ్యక్తి ఒక సంస్కృతికి, చరిత్రకు ప్రతీకగా, ఒక శక్తిగా ఎదిగితే ఏమౌతాడు..? సరిగ్గా అతడు ఆళ్వారుస్వామి అవుతాడు. మనిషి మనిషిగా ఎదిగితే మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే తప్పక వట్టికోట అవుతాడు. సాహిత్య సంపదను తన భుజాల మీద మోసుకుపోయి పల్లెపల్లెకూ చేరవేస్తూ వ్యక్తి వ్యక్తికీ పంచిపెడితే సరిగ్గా అతడు అరుదైన సాహితీమూర్తి అవుతాడు. కథకుడౌతాడు. నవలాకారుడౌతాడు. ఉద్యమశీలి అవుతాడు. కార్యకర్త, యువకులతో యువకుడు, మేధావులతో మేధావి, కమ్యూనిస్టుల మధ్య ఉత్తమ కమ్యూనిస్టు, నాయకుల నడుమ అరుదైన నాయకుడు. ఒక స్వాప్నికుడు, ప్రేమికుడు, స్పార్టకస్‌ వారసుడు. ఒక గోర్కీ సృజనాత్మకలో ఆనందంగా తడిసి తరించినవాడు.ఆళ్వార్‌ పుట్టుకతో అందగాడు. వెన్నెల్లాంటి చిరునవ్వు, నిష్కళంకంగా నవ్వినవాడు. ఢిల్లీ కోటలో గుండెఝల్లుమనిపించిన, నల్గొండకే వన్నె తెచ్చిన నకిరేకల్‌ ముద్దు బిడ్డ. మదార్‌కలాన్‌ కన్నబిడ్డ. రామచంద్రాచార్యులు, సింహాద్రమ్మలకు 1915 నవంబర్‌ 1 జన్మించాడు. తన జన్మే ఒక తిరుగుబాటు సంకేతమైంది. ఒక విప్లవబావుటా అయ్యింది. జీవితాంతం వట్టికోట దౌష్ట్యంతో పోరాడుతూనే వచ్చాడు. దురహంకార పాలనపైనా, పాలకులపైన తిరుగుబాటు చేస్తూనే వచ్చాడు. నోరు తెరిచిన జైళ్ల ఇనుపకోరలకు చిక్కి బందీ అయినా యుద్ధంలో శత్రువును నిలువరించిన శాంతియోధుడుగానే కదులుతూ, చైతన్యవంతుడై మెదలుతూ వచ్చాడు.పాఠశాల చదువు అంతగా ఒంటబట్టక పోయినా అన్యాయం, అక్రమం, మోసం, వివక్ష, హెచ్చుతగ్గులు, ఆధిపత్యం వంటి అనేక విషయాలను అనేకులకంటే మిన్నగా అధ్యయనం చేస్తూ వచ్చాడు. అధ్యయనానికే పరిమితం కాకుండా రాస్తూవచ్చాడు. కాలం మీద తనదైన ఒక ప్రత్యేక ముద్రను వేస్తూ వచ్చాడు. ఇక సృజన కాలమంతా ఆళ్వార్‌ స్వామిదే అయ్యిందనాలి. కాకుంటే కథలు, గల్పికలు, నవలలు వెలువడతాయా ? దేశోద్ధారక గ్రంథమాల వంటి అపూర్వ సంస్థలు జన్మకు నోచుకుంటాయా ? నిజాం నిరంకుశ పాలనలో ఇటువంటి సాహసాలు, సాహసీకులు బతికి బట్టకట్టడం సాధ్యమవుతుందా ? ఆళ్వార్‌ స్వామి దృఢ సంకల్పం, అంకుఠిత దీక్ష, చెక్కుచెదరని నిరతి వల్లనే అవన్నీ సాధ్యమయ్యాయి. పేద, గ్రామీణ జీవితం నుంచి వచ్చి ఒక అధ్యాపకునికి వండి పెడుతూ బతుకుబండిని నెట్టుకుంటూ వచ్చాడు. ఆయన సామాజికత్వం, నిరంతర అధ్యయనమే అన్ని విపత్తులనూ, లేమినీ అలవోకగా గెలిచే శక్తి సామర్థ్యాలను అతనికి ప్రసాదించి ఉంటాయి. ఆ తర్వాత కొంత కాలం వరకూ (1933 దాకా) కందిబండ గ్రామానికి చెందిన నారపరాజు సోదరులకు పని చేసి పెడుతూ అణా గ్రంథమాల పుస్తకాలను అమ్మి పెట్టే ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తూ, తెలంగాణ పల్లె పల్లెనూ చైతన్య పరుస్తూ వచ్చాడు. కోదాటి నారాయణరావు సహకారంతో ఆనాటి గోలకొండ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా చేరి కొంత కాలం గడిపాడు ఆశ్వారుస్వామి. ఈ ఉద్యోగం పెద్దగా ఆర్థిక స్థోమతనేమీ సమకూర్చక పోయినా, బోలెడంత లోకజ్ఞానాన్ని, సాహిత్య పిపాసనూ పంచి ఇచ్చింది. నిరంతరం అధ్యయనం వల్ల అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, సృజనశీలుర పరిచయం వల్ల వివిధ ఉద్యమాల విప్లవ స్ఫూర్తి కలిగింది. ప్రపంచం ఆయన కళ్లెదుట నిలిచినట్లయింది. పీడిత తాడిత జనానికి, అణగారిన, దిక్కూ మొక్కూ లేని వారికి తాను చాలా దగ్గరి వాడినన్న సోయి కలిగి పెద్ద దయింది. 1993లో వట్టికోట హైదరాబాద్‌ (సికిందరాబాద్‌)కు మకాం మార్చడమన్నది తెలంగాణ ఉద్యమానికి, సాహిత్యానికి పెద్ద మలుపుగా పరిణమించింది. తొలి తెలంగాణ నవలా కారుడిగానూ, నిజాం రాష్ట్రంలో పౌర హక్కుల కోసం పోరాడిన ప్రథమ పౌరుడిగానూ ఎదిగే అవకాశం కలిగింది. దొడ్డి కొమరయ్య హత్యపై నిజ నిర్ధారణకు వెళ్లిన తొలి కార్యకర్త వట్టికోట. యశోదమ్మతో వివాహం, సికింద్రాబాద్‌తో సంబంధాలు, అక్కడి వర్తక సంఘాలతో పరిచయాలు, యువకుల మధ్య పెనవేసుకు పోయిన స్నేహ బంధాలు, విరబూసిన పరిమళాలు ఆళ్వారు స్వామి భావజాలాన్ని మరింత ప్రోదిచేశాయి. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలుకొని, నాలుగు సంవత్సరాలకు పైగా జైలు జీవితాన్ని అనుభవించిన వట్టికోట చివరి వరకూ గట్టి పిండంగా, మొక్కవోని సాహసికుడుగా నిలబడ్డాడు. ఏనాడూ కనీసపు సుఖాలనైనా చవిచూడని, (అసలు అటువంటి వాటిని కోరనైనా కోరని) వట్టికోట తన కోసం ఏమీ మిగుల్చుకోని నిస్వార్ధజీవిగానే కడవరకూ కొనసాగాడు. అరకొర బతుకు బతుకుతూనే అతడు ఆసాంతం సాహిత్య సేనానిగా, సమతావాద కార్యకర్తగా నిలబడ్డాడుగాని కించిత్తు తడబడడం గాని, వెనుకడుగు వేయడం గాని చేయలేదు. పైగా అతడు సభలను రంజిపజేసే ఉత్తమ ఉపన్యాసకునిగా ఎదిగాడు. సాహిత్య సంస్థలను పెంచి పోషించిన సాహసికుడుగా నిలిచాడు. సాహిత్య సృజన, ఉద్యమ నేపథ్యం అనేవి ఒక వంతైతే 'తెలంగాణ' సంపుటాలను ఆళ్వారుస్వామి వెలువరించడం మరొక గొప్ప సేవ అవుతుంది. అన్ని రంగాలకూ చెందిన తెలంగాణ వివరాలను అందులో పొందుపరిచాడాయన. ఇప్పటికీ ఆ సంపుటాలు సమగ్రమైనవిగా నిలుస్తున్నాయంటేనే మనం అతని అసమాన ప్రతిభను, అనితర సాధ్యమైన శ్రద్ధను గూర్చి అంచనా వేయవచ్చు.1952లో వెలువడిన 'ప్రజల మనిషి' నవలలో వట్టికోట ఆనాటి గ్రంథాలయోద్యమం, రాజకీయ-ప్రజోద్యమాలు, తన కాలం నాటి స్వానుభవాల చిత్రీకరణకు అద్భుతంగా చోటు కల్పించాడు. తెలంగాణ ఉద్యమ జీవితాలకదొక అరుదైన దర్పణంగా ఎప్పటికీ నిలిచి భాసిస్తుంది. ఆ నవలకు కొనసాగింపుగా గంగు వచ్చింది. జైలు జీవితాన్ని వివరించే గ్రంథం 'జైలు లోపల' రూపుకట్టింది. ఇవిగాక, వట్టికోట వారి మరొక అసాధారణ కృషి ఫలితం- గ్రంథాలయ సూచి. ఈ విధంగా నిరంతరం అటు ఉద్యమ జీవితానికి, ఇటు సాహిత్య సృజనకు నడుమ ఒక సంతుల-సమన్వయాన్ని సాధిస్తూ నిజాం క్రూర ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతూ వచ్చి తెలంగాణ అంతటా ఉద్యమమై విస్తరించిన ఆళ్వారు స్వామి తన 47వ ఏటనే (1961 ఫిబ్రవరి5న) హఠాన్మరణం చెందటంతో ఒక గొప్ప అధ్యాయం ముగిసినట్లయింది.మహోన్నత సాహిత్య శీలి, అలుపెరగని ఉద్యమకారుడు గనుకనే మహాకవి దాశరథి తన 'అగ్నిధార'ను ఆళ్వారు స్వామికి అంకితమిచ్చారు. దేవునిపై భక్తి లేకున్నా జీవులపై భక్తి ఉన్నవాడని, అతని జీవనధర్మాన్ని, తాత్వికతను ప్రశంసించారు. అంతేకాదు మంచికి పర్యాయపదం ఆళ్వారు, అతనిదే సార్థకమైన జీవితం అంటూ కొనియాడారు. అందుకే వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వార్‌. పలుకుతోంది పిడికిలెత్తి నవతరం జోహార్లు. భూపతి వెంకటేశ్వర్లు (నేడు ఆళ్వారు స్వామి వర్ధంతి)http://ift.tt/1fsSEL6

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsSCDe

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు // Dt. 04-2-2014 సైనైడ్ రుచి - మరణం అనుభూతి ఆడదాని మనసు వర్ణించ లేనివి అందుకే నీవు అర్థం కావు ప్రియా! నీకోసం గుండె వాకిలిలో ఎదురు చూసే మనసు అన్యధా ఆలోచించడం మానేసింది ప్రియా! నా ప్రేయసి వన్నీనిజం లాంటి అబద్ధాలే వస్తానంటూనే ఎప్పుడూ రాదు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nHTv0I

Posted by Katta

Naresh Kumar కవిత

(ఫుస్తక పరిచయ ప్రయత్నం) నారి సారించి-శిలాలోలిత సాహిత్య వ్యాసాలు. కొన్ని సార్లు చరిత్ర కూడా కొన్ని జాతులపైన పక్షపాత ధోరనే చూపిస్తుంది.. వివ్క్షని కూడా మామూలు విషయం అనుకునేంతగా అలవాటు చేస్తుంది.... ఇదే స్త్రీ/స్తీవాద కవిత్వం విషయం లో కూడా జరిగి ఉండవచ్చు కానీ చరిత్ర/సమాజమూ చెసిన అలక్ష్యం శిలాలోలిత గారు చేయలెదు.. "నారి సారిచి" పుస్తకంలోనినలభయ్యారు సాహిత్య వ్యాసాలలో దాదాపు స్త్రీవాద,అభ్యుదయ భావ సాహిత్య పరిచయం చేసె ప్రయత్నం చెససారు.. పుస్తకం చదివాక ఆ ప్రయ్త్నం లో శిలా లోలిత గారు సఫలీకృతులయ్యారనే నాకపి ంచింది.. మొదటి వ్యాసం లో స్వీయ పరిచయమూ,సాహిత్యానుభవాలతో మొదలై వెయ్యెళ్ళ సాహిత్య చరిత్ర్లో స్త్రీ వాద సాహిత్యం గురించి చ్ర్చిస్తూనేవరుసగా కొందరు కవయిత్రులనూ,కవులనూ పరిచయం చేస్తారు.. తొలితరం కవయిత్రులైన "మొల్ల" వంటి వారితోసహా నిన్నటి,నేటి తరపు కవయిత్రులు,కవుల మరియు రచనల పరిచయాలూ, స్త్రీ అనచివేతలో భాగంగా స్త్రీల సాహిత్యమూ నిరదరణకు గురైన విషయంలో లోతైన విష్లేషణా విమర్షలతో సాగిపోతుంది.. రచయితా రచయిత్రుల పరిచతాలతో పాటు వారివారి రచనలపై విశ్లేషణలూ,వారి పుస్తకాల వివరాలతోపాటు అక్కడక్కడా ఆయ రచయిత్రుల కవితల భాగాలనూ చేర్చడం పుస్తకానికి అదనపు విలువను తెచ్చాయ్ మొత్తానికి ఒక స్త్రీ సహిత్యం పైనే ప్రత్యేకంగా చేసిన కృ అద్బుతం అనే చెప్పుకోవాలి.... చదివిన పండితులగుదురు విదితం గాకున్న యపుడు వెర్రులె పురుషుల్ చదివిన చదువకయున్నన్, ముదితలు విధ్వాన్సురాండ్రు పుట్టువు చేతన్ -కాంచన పల్లి కనకాంబ (నూరుపూలు వికసించిన కవిత్వపు పూలతోట "ముద్ర" 31 వ వ్యాసం) కాపీలకు ప్రజాశక్తి,విశాలాంద్ర అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు. 05/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fs63mV

Posted by Katta

Yasaswi Sateesh కవిత

ఆదివారం 02.02.2014 వార్తలో ఒక్కమాట పరిచయం. వేదాంతసూరి వారికి.. ధన్యవాదాలు

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k36fyA

Posted by Katta

Abd Wahed కవిత

కంటిలో తేమ నెపుడూ ఆరనీకూ గుండెలో పూల నెపుడూ వాడనీకూ దారిలో రాయి కాదా చివరి గమ్యం ముందుకే సాగు బాటను ఆగనీకూ గాలిలా వీచె కాలం అడ్డుకున్నా ధూళిలా పచ్చికలనూ చెదరనీకూ చూపులో రేయి పడకే వేసుకున్నా మెత్తగా సత్తువంతా కూలనీకూ కాగితం లాగె ప్రేమ త్రుళ్ళుతున్నా రాయిలా మార్చు దియా ఎగరనీకు వీణలా పాడుతున్న చెట్టుపైనా ప్రేమగా మౌనమేదీ వాలనీకూ

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1apeGRE

Posted by Katta

Surya Prakash Sharma Perepa కవిత

వేదాధ్యయ 05-02-2014 |మనసుకి ఎమైంది ఈవేళ| ____________________________________________ రగిలే కణికై... రిపుని హరించే అశ్వమేధ అస్రనృపుని గర్జనలేవి?? జంకులేని తురగపాద రుధిరమదేది? ఏమైంది..? రగిలించే రవికిరణం ఏమైంది? పోరాడే సంకల్పం ఏమైంది? శృతినుండే స్థైర్యానికి ఏమైంది? చెలరేగే రక్తపు సెగ ఏమైంది? మదగజములపై మృగరాజల్లే లంఘించే శౌర్యానికి ఏమయ్యింది? ఘనశత్రులనే కాలాంతకమై కబళించే కాఠిన్యత ఏమయ్యింది? ఏమైందీ నీమనసుకి ఈవేళా ఎమైంది...? ధన్‌ధనమంటూ దూసుకుపోయే ధనుంజయుని శరమేదీ కనబడదేమి? కణకణకంటూ ఖననం చేసే అగ్నిశిఖల శక్తి సాటి సాహసమేది? ఓనేస్తం! గురిచేయ్ నీశస్త్రం, నగమే శకలాలై మిగిలేలా...! గగనం అదిరేలా! సారించెయ్! వింటినున్న ప్రళయాన్నే కురిపించెయ్ రుధిరంలో రరుణాన్నే రగిలించెయ్ అమ్ములలో ఆగ్నేయమె సంధించెయ్ నిదురించే నీ ప్రమిదని మేల్కొలిపేయ్ రుద్రునివై ఫాలాక్షపు జ్వాలలనే కురిపించు... "అస్తమయం"... కాదుర ఆ సూర్యునికే "చరమాంకం". ఆశలు మోసే 'రేపటి'కది సరిపల్లవి, ఇది సత్యం. ఓటమికే కుంగితె జగమేదీ? గెలుపుకు విలువేదీ? విజయపు రుచియేదీ? గమనించు... ఓటమి నీ అతిథేనని గమనించు విజయమె అంతిమపథమని గ్రహించు అరులను దుందునుమాడే వీరునివై నిజకాలపు గమనాన్నే శ్వాసించు... ఉదయించు... తూరుపు తొలి అరుణిమవై ఉదయించు... తూరుపు తొలి అరుణిమవై ఉదయించు...

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jcrxcZ

Posted by Katta

Lingareddy Kasula కవిత

ఇడుపు కాయితం||డా //కాసుల లింగ రెడ్డి ||02-02-2014 పుస్తెలతాడు కట్టించి తన్నుకు చావమని సాపెన పెట్టిండు సచ్చినోడు. 1 తాటికమ్మల గుడిసన్నా లేదని రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన. కాసులు లేని కనాకష్ట కాలంల నిలువ గరిసెలిచ్చి నిలబెట్టిన. గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె కుడిదాయి కుడిపి కుతిదీర్చిన. నా రామసక్కని కుర్చీ ఇచ్చి సదువుకున్నోనివని రాజును చేసిన. నిన్నేమన్న కర్రె కుక్కను చేసి ఎంటదిప్పుకుంటినా? 2 మర్లువెళ్ళన్నా కాలేదు కాళ్ళ పారాణన్నా ఆరలేదు ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి. పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య అడ్డు తెరలెందుకంటివి సంపదలు నీకు సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి ఈ కాపురం నేనొళ్ళనంటె కూసున్న పెద్దమనుషులు కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి. 3 కుడి ఎడమల పెయ్యినొరుసుకుంటూ కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష బాగలేదని చీదరిస్తివి. ఎగిలివారగట్ల వరిమొవ్వలోని మంచు ముత్యమసొంటి యాసనెక్కిరిస్తివి కట్టుబొట్టుమీద కథలల్లి కోట్లు కూడ పెడ్తివి. సెలిమలు దోచి సేనెండవెడ్తె కన్నీళ్ళు నాకాయె నీళ్లు నీకాయె. నిల్వ నీడలేదు చెయ్య కొల్వు లేదు ఉనికి ఉనుక పొట్టయితుంటే నా కుర్చి నాక్కావాలంటె ఇకమతులతోటి కాలం కమ్మలు మర్లేస్తివి. 4 నా ఇంటి చుట్టూ మొలిచిన ప్రైవేటు ఎస్టేట్‌ సర్కారు తుమ్మల మధ్య నేను బందీనైన ఆస్తమా రోగి లెక్క శ్వాసకోసం తండ్లాడుతున్న. సూర్యుడు నీవోడయ్యిండు సుక్కలన్ని నీ కుక్కలయినవి. బళ్ళు నీవి, గుళ్ళు నీవి మడులు నీవి, మాన్యాలు నీవి చెమట నెత్తుర్లు ధార పోసి మిగిలిన బొక్కల గూడును నేను. మల్లెసాల మీద మంచమేసి సాధికారంగ సకులం ముకులం పెట్టి చర్నాకోల చేతవట్టి నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి. 5 ఇగ ఇప్పుడైనా పనుగట్లకీడ్చి పంచాయితి పెట్టి ఇడుపు కాయిదం అడుగక ఇంకేం చెయ్యాలె? రచనా కాలం: 29 అక్టోబర్‌ 2007 'తెలంగాణ కవిత 2008' 'సూర్యుడు ఉదయిస్తాడు' సంకలనం

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LqQBhn

Posted by Katta

Patwardhan Mv కవిత

.చంద్రముఖి:::: మొదటి సారిగా నా నీడ లాంటి ఓటమి వెంబడించడం లేదు. బతికున్నానా? ఒకేసారి నోట్లో పోసిన సముద్రమంత అమృతంలా జయం. బతికుంటానా? అప్పుడు శిఖరాన్ని చేరుకోవాలనే తపన ఎంత బాగనిపించేది! ఇప్పుడు కిందకు దూకేయనా? చెప్పాలంటే ఓటమి నా తల్ల్లి పాల నుండో,తండ్రి ఉపదేశాల నుండో నాలో ప్రవేశించి ఉంటుంది. పిలువకపోయినా తానే వచ్చి నన్నెంత బాగా చూసుకునేదని నాకు ఒక మారు పేరై ఎలా నిలిచేదని!! ఎవరున్నారు నీకని అడిగితే గెలుపు వేయి గోత్రాలు వల్లెవేసింది. చూపుడు వేలుతో నా ఓటమి నన్నే చూపింది. రమ్మన్నా రాని గెలుపు కన్నా ఓటమీ! నువ్వే ఎంతో మంచి దానివి. నువ్వు ఎల్లవేళలా నా దానివి. కానీ ప్రపంచంలో ఓటమీ ! నువ్విప్పుడు నిజంగా అనాథవి. చివరకు నన్నూ పోగొట్టుకున్నావ్. అలా చూడకు ఓటమీ నాకు తెలుసు నువ్వెప్పుడూ గెలుపు కుబుసానివే! 04-02--2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8tjMt

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MRcmII

Posted by Katta

Lingareddy Kasula కవిత

"వాకిలి "లో నేను తెలంగాణ కవుల మీద రాస్తున్న "పడుగు" శీర్షిక .మొదటిది ఏనుగు నరసింహా రెడ్డి గురించి. చదవండి. మీరు కూడా మీ biodata తొ పాటు మీ రచనలు నాకు పంపండి. Dr.kasula Linga Reddy MBBS,DCH, plot no:63 H.NO:3-9-318/1, SARASWATHI NAGAR,CHINTHALAKUNTA CHECK POST,L.B. NAGAR,HYDERABAD-500074 CELL: 8897811844, 9948900691 నిఖార్సైన కవి నర్సింహారెడ్డి ఉన్నతీకరించబడ్డ మాట కవిత్వ రూపమైతె, మెరుగైన సమాజం కోసం వ్యాప్తి చేసే భావధార దాని సారమౌతుంది. ఛలోక్తులు, చమక్కులు, తిట్లు శాపనార్థాలు తాత్కాలికంగా కవిత్వంగా చెలామణీ కావచ్చు.పేరు తేవచ్చు.కాని కవిత్వాన్ని సీరియస్‌గా తమ జీవితంలో భాగం చేసుకున్న కవులు భావజాలపరంగా, తాత్వికంగా తమని తాము వ్యక్తీకరించుకుంటరు. తమ కవిత్వం క్యారెక్టర్‌ను విశదపరుస్తరు.తెలుగు సాహిత్యంలో బాలగంగాధర తిలక్‌, పఠాభి, శ్రీశ్రీ,దాశరథి లాంటి అనేకమంది కవులు చెప్పుకున్నట్టు ఇగో మన ఏనుగు నర్సింహారెడ్డి కూడ చెప్పుకుంటున్నడు. ఆర్తి, నిజాయితీ, రాయకుండా ఉండలేనితనం ఈ కవిని ఇట్లా చెప్పుకునేట్టు చేస్తున్నవి. 'వాదాల్లేని సృష్టించుకున్న వివాదాల్లేని పరస్పరం సహకరించుకునే సమూహాల్లేని పజ్జెమే క్షణ క్షణం తగులుతున్న తాకుడురాళ్ళ పురులను ఒక్కొక్కటే పేనుకుంటూ కట్టిపడేస్తుంది ఇక నాలో కొత్త ఆశల్ని పూయిస్తుంది' అని కవిత్వం జీవితంలో ఎట్లా అంతర్బాగమైందో తెలుపుతడు.'కవిత పిచ్చోడని కసిరినారు నన్ను' అంటూ వాపోతూనే 'ఒదగకపోతే ఒంచుతా వినకపోతే విరుస్తా వ్యాకరణాలు రొదపెట్టనీ పద్యాన్ని హృదయానికి పర్యాయపదం చేస్తా' నంటూ లక్ష్యప్రకటన చేస్తడు. మృదువైన, సున్నితమైన భావప్రకటనతో సమాజం గురించి సూటిగా, స్పష్టంగా వ్యాఖ్యానించడం నర్సింహారెడ్డి కవిత్వ లక్షణం.60 వ థకంలో పల్లెలో పుట్టి పెరిగి, పట్టణానికొచ్చి పైచదువులు (M.A.Ph.D.) చదువుతున్న సమయంలో కవిత్వం నర్సింహారెడ్డిని ఆవహించింది.అమ్మగా నాన్నగా ద్విపాత్రాభినయం చేసి తన్ను తీర్చిదిద్దిన ఏనుగు లక్ష్మమ్మ కష్టాల్ని దూరం చేయాలని, అందుకు తాను ఉద్యోగం సంపాదించుకోవాలని తపిస్తున్న కాలంలో నిరుద్యోగం మీద పుంఖాను పుంఖంగా కవిత్వం రాసిండు. క్వాలీఫైడ్‌ల మొర,క్యూ కవిని కలవర పెట్టినయి. అప్పుడప్పుడూ నిరాశ బాకులా దిగేది. 'సమాజం పుస్తకాన్ని తిరగేసి చదవలేనందుకు' కలిగిన బాధను కవిత్వంలోకి ఒంపుకుంటడు. 'కలలు పగిలి పోవచ్చు పాఠకుని చేరని కావ్యంలా నువ్వలా కళ్ళల్లో వత్తులు వేసుకొని గోడమీద సున్నెం పట్టెలా చారగిలబడకు నేనసలే రాకపోవచ్చు అమ్మా! ఎదురు చూడకు' అంటూ తల్లికి ఆఖరి లేక రాసుకుంటడు.దు:ఖం కళ్ళెను ఎల్లబోసుకుంటడు.అందుకే 'పల్లె చేతుల్తో నగరవాతావరణంలోకి పట్టుకొచ్చిన తాజా కవిత్వం' నిరుద్యోగిలా మా ఇంటికొచ్చింది అంటాడు ఎన్‌.గోపి.మానవ సంబంధాల పట్ల ఆర్తిగల్ల కవి సరియైన వయసులో పెళ్ళికాకపోవడాన్ని కూడ హృద్యంగా చిత్రిస్తడు. విఫల ప్రేమలకు విలపిస్తడు. యాంత్రీకరించబడ్డ సంబంధాలని చూసి 'రోజూ కలుసుకుంటున్న అపరిచితులమం' టూ వాపోతడు. తొంభయవ థకం తెలంగాణ సమాజంలో అనేక మార్పుల్ని తీసుకొచ్చింది. ప్రపంచీకరణ దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్ని మింగేసింది.'కనిపించని ఈ కుట్రల్లో పల్లె కన్నీరు పెట్టింది'. అర్బనైజేషన్‌ పల్లెల్లో ప్రధానంగా వున్న వ్యవసాయాన్ని కుంగతీసింది.ప్రజాస్వామ్య ప్రహసనం ముగిసింది. ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల రిమోట్‌తో నడవడం మొదలైంది. సంపన్న దేశాలు ప్రపంచబ్యాంకు, డబ్లుటివో వాటిని ముందుపెట్టి ఈ నాటకం నడిపిస్తున్నవి.వ్యవసాయం ,దానిమీద ఆధార పడ్డ చేతివృత్తులు ద్వంసమైనవి.పల్లె వల్లకాడుగా మారింది. 'అప్పులోల్లు పైసలడిగితే ఎట్లరాని పొట్టకూటికోసం గింజలెట్టులనుచు వెరచి రైతుబిడ్డ ఉరికొయ్యకూగెరా' అంటూ 'ప్రపంచబ్యాంకు బాకు పల్లెబొండిగ తెంచిన' వైనాన్ని చిత్రిస్తడు కవి. 'బహుళజాతి మాయ బలితీసుకొని పోయిన ' తీరును ఎరుకపరుస్తడు. 'చెరువు నోరు తెరిసె చెల్క కన్నీరింకె చుక్కనీరు లేదు దుక్కిదున్న తేటతెల్లమాయె తెలగాణ యవుసమ్ము' అంటూ వ్యవసాయ దుస్థితిని తెలుపుతడు.తెలంగాణ పల్లెల్లోని సకల పార్శ్వాలను చూపుతడు.శ్రమైకజీవన సంస్కృతి తన ప్రాభవాన్ని కోల్పోవడంతో పల్లె బతుకును హీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. అందుకే, 'పల్లె బతుకు మాది పాడుగాను' అనే మకుటంతో 'మట్టిపాట'ను గానం చేసిండు కవి. ఛందోబద్ధ పద్యాలు తెలంగాణ మాండలికం వల్ల అందాల్ని సంతరించుకున్నవి. తెలంగాణ పల్లె దుంఖమంతా నర్సింహారెడ్డి కవిత్వంలో కనిపిస్తది.స్వతహాగా తను రైతుబిడ్డ. అందుకే, 'పీఠభూమిలో నాగలి కర్రు కింద నీటిమట్టం కూడ నిర్దయగా జారుకుంది' అంటూ వ్యవసాయ దుస్థితిని కవిత్వం చేస్తడు. 'నీటినుంచే ప్రాణం పుట్టిందని పంటచేల పారవశ్యాలతోనే సమస్త రంగాల బతుకు బండ్లు పరుగులు తీస్తాయని' ఎరుకున్న కవి, ఆ నీటిని తోడడానికి కావాల్సిన విద్యుత్తు లేమి పట్ల కలత చెందుతడు. తెలంగాణ పల్లె దుస్థితికి కారణమైన నయావలపవాదాన్నే కాకుండా, అంతర్గత వలసవాదం మీద యుద్ధం ప్రకటిస్తడు.610 జీవోని ప్రశ్నిస్తడు. 'వాళ్ళు కష్టపడుతర్‌ సార్‌' అంటూ సీమాంధ్రుల దోపడి మీద సెటైర్‌లు విసురుతడు. 'పనిలేకపోవడమంటే జీవితము పెద్దగా లేకవోవడమే' నంటూ శ్రమైక జీవన ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తడు.కల్లోని కుంటలో నాన్నని కలవరిస్తడు. 'కాలానికి ఆరబెట్టిన నీటిరంగుల వర్ణచిత్రంలా నాన్న నాకొక అస్పష్ట జ్ఞాపకం' అంటూ కలత చెందుతడు. పరాయీకరణ నర్సింహారెడ్డిని కూడ నోస్టాల్జియాలోకి నెట్టింది. అందుకనే కల్లోని కుంటని,కాడమల్లె చెట్టుని, ఊరునీ పలవరిస్తడు. 'ఇక్కడో ఊరుండేది ఎవరైనా చూపిస్తారా?' అంటూ గడుసుగా ప్రశ్నిస్తడు. రెవెన్యూ డిపార్టుమెంట్‌ కు సంబంధించిన సమస్యలమీద,సహృదయులైన సహోద్యోగులమీద మీద కవిత్వమల్లుతడు. ప్రభుత్వాధికారిగా ఉంటూనే అసౌఖ్యానికి గురైనవాళ్ళ పక్షాన నిలబడడం కొందరికి గొప్ప విషయంగా కనిపించవచ్చు, కాని అది అనివార్యం అవుతది. గౌరవప్రదమైన వృత్తిగా భావించే డాక్టర్లు, లాయర్లు కూడ రోజువారీ కూలీల కింద మార్చబడ్డ ఈ వవస్థలో ఏదో ఒక ధృవాన్ని చేరుకోవడం అనివార్యమౌతుంది. నర్సింహారెడ్డి కవి కాబట్టి ప్రజా ధృవాన్ని చేరుకున్నడు. మృదువైన, స్పష్టమైన, సూటితనం నర్సింహారెడ్డి కవిత్వశైలిలో కనిపిస్తది.తెలంగాణ నుడికారపు సొగను మరింత అందాన్ని అద్దుతది. అక్కడక్కడ వ్యంగ్యం, దెప్పిపొడుపు సాధికారికంగా జతకడ్తవి. అలతి పదాలతో ప్రతీకలను, అలంకారాలను విస్తృతంగా వాడతడు. 'వెన్నెల మెరువడానికి గోడల అద్దాల్ని వెతుక్కుంటుంది' 'తల్లులు-మాసిన పిల్లల నెత్తుల్లోంచి పేన్లు ఏరి కుక్కినట్లు పక్షలు-కొమ్మల రెక్కల నడుమ గండుచీమల్ని ఏరి పారేస్తున్నవి' 'ఫైళ్ళంటే కాగితాలు ఎంత మాత్రం కావు జోడించబడిన చేతులు' 'గుట్టను తాకిన మబ్బుల్తో రంగుల గుడారమేసిన ఆకాశపు' 'చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు' 'తలస్నానం చేసి తుడుచుకోవడం చేతకాని పసిపిల్లల సమూహంలా చెట్లు' నర్సింహారెడ్డిలోని భావుకతకు ఇట్లాంటి నిదర్శనాలు ఎన్నైనా ఇవ్వవచ్చు. అట్లే 'పొద్దూకి వచ్చిన వాన పొద్దూకి వచ్చిన చుట్టంలాపోనే పోదు' 'చెడిపి రాస్తున్న(చెరిపి కాదు)' 'తొవ్వదారానికి' 'నడమంత్రం' 'పల్లె బొండిగ'లాంటి తెలంగాణ నుడికారపు మెరుపులు కవి ప్రతిభకు నిదర్శనాలు. అట్లాగే కవిత్వంలో ప్రయోగాలు చేయడం కూడ నర్సింహారెడ్డి ఇస్టపడుతడు.ఛందోబద్ద పద్యాలతో కూడిన 'మట్టిపాట' ,రుబాయీలు మనకు అదే చెప్తాయి. అయితే,నర్సింహారెడ్డి అంత్యప్రాసల లౌల్యం వదిలించుకోవాలె.ఎత్తుగడ,ముగింపులకు ప్రాధాన్యత ఇవ్వాలె.ప్రతీకల ప్రీతితోటి వచ్చిన అస్పష్టత తొలిగించుకోవాలె. మరింత కవిత్వం రాయాలె. నిఖార్సైన కవిగా నిలబడాలె. -డా|| కాసుల లింగారెడ్డి సెల్‌: 8897 811 844 బయోడేటా పేరు: ఏనుగు నర్సింహారెడ్డి జననంం: 6 ఎప్రిల్‌ 1968 కల్లోనికుంట, రామన్నపేట (మండలం),నల్లగొండ జిల్లా ఎస్‌.ఎస్‌.సి.:1983 చిట్యాల ఇంటర్‌: 1985 రామన్నపేట బి.ఎ.: 1989 నల్లగొండ ఎం.ఎ.:ఉస్మానియా ఎం.ఫిల్‌.:తెవివి-తులనాత్మక సాహిత్యం పి.హెచ్‌.డి.:తెవివి-తులనాత్మక సాహిత్యం రచనలు- 1992 నుండి సీరియస్‌గా కవిత్వం పత్రికలలో వ్యాసాలు,విమర్శలు,సమీక్షలు 1998నుండి ప్రచురణలు: కవిత్వం సమాంతర స్వప్నం-1995 నేనే-2002 మట్టిపాట-2008 కొత్తపలక-2013 నవల- 'పగిలిన గుండెలు' డైలీ సీరియల్‌గా నల్గొండ డైలీలో 1988 రెండు నెలలు

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://M.A.Ph

Posted by Katta