పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Anemoni Shivudu కవిత

Check your last profil visitors \u003C3\u003C3\u003C3 http://adf.ly/dLSI3

by Anemoni Shivudufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://adf.ly/dLSI3

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

Check Who loves you \u003C3\u003C3\u003C3 http://adf.ly/dL5ve

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://adf.ly/dL5ve

Posted by Katta

Srinivasa Bharadwaj Kishore కవిత

అమెరికాలో అట్లాంటా నగరంలో పరివార సమేతంగా స్థిరనివాసమేర్పరచుకున్న శ్రీనివాసుడు, శివాదుల నుద్దేశించి, ఛందోబద్ధంగా ఒక ధారలాగ వచ్చిన పద్యాలు ఇవిగో నచ్చి ఆనందిస్తే నాకు చెప్పండి. నచ్చకపోతే మరచిపొండి. పలుకుల తల్లికి నివాళి - వలసవచ్చిన దేవతలు రచన: కిభశ్రీ వృత్తం : చంపకమాల IIII UI UIII UII UII UI UI U III IUI UII IUI IUI IUI UIU 1, 11వ అక్షరాలకు యతి మైత్రి పలుకుల తల్లి నీ చరణ ప౦కజముల్ కడ నిల్చియు౦డి నా తలపుల నిన్ను యు౦చగ పదాలవె దొర్లెను గారడీవలెన్ ఖలుడను నాకునీవిధిని కైతలు ధారగ వచ్చెన౦టె నీ చలువనె కాకలేదు పద జాలము వాడెడి ప్రజ్ఞ నాకుగన్ తా:: సరస్వతీ దేవి కటాక్షము లేకుంటే, నాకెక్కడిది ఛందోబద్ధమైన కవిత వ్రాసేంతటి ప్రజ్ఞ సిరిపతి వీడిపాల్కడలి చేరెను ఈదరి రివ్రుడేలునన్ సరియగు సౌతులిర్వురును సంయమునుండిరి చేరి పెన్మిటిన్ నరుడిగ నారదు౦డు హరి నామములే నిరత౦ జపి౦చగన్ తిరిగె విమానమై తనివి దీరగ చుట్టును వైనతేయుడున్ తా:: విష్ణువు, పాలకడలి వదలి రివరుడేలులో వెలుస్తాడు. లక్ష్మీదేవి, ఆమే సవతి(భూదేవి) తో పతిని చేరి వుంటుంది. గరుడుడు జనులను మోసుకుని (airplanes) గోపురవీధులు (గోపురం - ఆకాశాన్నంటుతుంది - గోపురవీధులు - ఆకాశంలో వీధులు) (airplanes hovering around). నారదుడు నరుడిరూపంలో వస్తాడు. శివుడును వీడిపర్వతము సింహిక తోడుగ రాగ ధాత్రికిన్ భవునికి అండనుండగనిభాననుడింకను షణ్ముఖాదులున్ (అండగుండగను ఇభాననుడు) శివునగ నాగరాజుతనె సీ(చీ)కటిబిల్మున దూరె చల్లగన్ శివజటనున్నగ౦గయును శీతలధారల ఛాటహూచయెన్ తా: శివుడు లింగం రూపంలోను, పార్వతి, మోదలగు వారందరూ వస్తారు. శివునగ (శివుని నగ - ఆభరణం ) బిలంలోకి దూరాడు (we have lots of snakes in USA). గంగ (Chatahoochee river - అట్లాంటా జీవనది) దివివిడి ఇ౦ద్ర గ౦ధరువ దేవతలప్సరసాదుల౦దరున్ కవిజన గానకోవిదులు ఖ్యాతిని పొందిన నాట్య తారలై నవవిధ భకి్త భావములు నైగమ శాస్త్రము లన్ని నేర్వగన్ చవియగు మానవాకృతుల చైత్యము కూడిరి పర్వదిన్ములన్ (చవియగు - సరియగు, చైత్యము - గుడి) తా: స్వర్గంనుంచి ఇంద్రుడు మోదలగువారు కవులు, గాయకులు, నాట్యతారలుగ మానవరూపంలో మా వూళ్ళో వెలసినారు. జనులందరూ భక్తులై పూజలు గుళ్ళో చేస్తారు నేను వుండేవూరు - తాలహాసీ. అక్కడ గుడి కట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పైని పద్యాలలో "రివ్రుడేలునన్" ను "తాలహాసినన్" అని, "చాటహూచయెన్" ను "ఓఖ్లఖూనయెన్" అని మార్చి, తాలహాసి కి కూడా అన్వయించుకోవచ్చు......

by Srinivasa Bharadwaj Kishorefrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ksJXXl

Posted by Katta

Sudarshan Punna కవిత

హైకూలు// పున్న సుదర్శన్ 1. మాటకు పాట చూపులకు ప్రాణము నీ రాకతోనే... 2. గుర్తుకొస్తావు తలచినప్పుడేనా? తలవకున్నా.. 3. జారే చినుకు మబ్బుల మనసుల రహస్య పత్రం 9.2.14

by Sudarshan Punnafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eeXk51

Posted by Katta

Rajesh Sweet కవిత

Find Who Will Be Your Valentine. @ ==> http://tinyurl.com/kllofqd

by Rajesh Sweetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/M26vj4

Posted by Katta

Nirmalarani Thota కవిత

దిగంతాల అంచుల్లో నీకోసం వెతికాను .. భువనాంతరాళ అడుగుల్లో నీ ఉనికికై చూసాను . . నీవు రాక నీ జాడ తెలియక నిస్పృహతో నేనంతమయ్యే క్షణంలో గుండె తలుపు తోసుకొని కన్నుల్లోకి ఉబికి వచ్చి చెక్కిట జారినప్పుడు గానీ తెలియ లేదు . . . నువ్వు నాలోనే ఉన్నావని . . ! ! నిర్మలారాణి తోట [ తేది: 09. 02. 2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fPpaHM

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/అ"సంఘర్షణ ---------------------------- నాలో నేను కాలిపోతున్నప్పుడు ఆ వెలుగులో మనోదివిటి వెక్కిరిస్తుంటే మబ్బుల గుండా సెగల రెక్కలేవొ నన్ను దులుపుతుంటే ఆర్డ్రతను చేతి కొసల చివరన చూపెడుతూ రంగులతో కలిపిన కాస్త మట్టిని దేహపు సొరంగాలలో పులుముకుంటూ నా అడుగుల కింద పడి బిక్కుబిక్కుమంటు గాలి పట్టాలు చెక్కని శిలాస్పటికంలా సంభాషణల గోటి మొదళ్ళు ఇంక చాల్లే చల్లార్చుకొందాం ఆర్బాటాల గుహలలో మగ్గిన విగత కళేభరాల్ని కొత్తగా మొదలెడదాం అనుకుంటూ పోగేసుకున్న ఎండుగుడ్ల కార్ఖానా చివరి మజిలి బాగుండాలని శృంకల శకలాలను పచ్చిగా పేర్చుకుంటున్నా నిగూడ వరండాలలో నన్ను నేను తడుపుకుంటూ తిలక్ బొమ్మరాజు 09.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bgeDID

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-22 నాలో ఏమి జరిగిందో నీకు ఎలా తెలుస్తుంది.. నీలో ఏమి జరిగింది నాకూ తెలియదలాగే...! నోటి భాష కొంతదాకా.. కంటి భాష ఇంకొంతదాకా.. వ్యక్తం చేయవచ్చుగాక...! మనలోని సగానికి సగం ప్రపంచం అవ్యక్తంగా .. ఎవరికీ తెలియకుండానే మనతోపాటు సమాధి అవుతుంది కదూ..? ----------------------------- 9-2-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f6sGM5

Posted by Katta

Kapila Ramkumar కవిత

Karlapalem Hanumantha Rao's లింక్ సరదా కవితే కాని.. కవి కుమారు లందరూ తప్పక చదవి తీరాల్సిన కవిత నేనెవ్వరంటావా? నువ్వు శ్లేషాలంకారానివో, ఉపమాలంకారానివో నాకు తెలీదు. మైలున్నర సమాసాని వైనా మహగొప్ప సంధి వవయినా నాకు ఖాతర్లేదు. చేవ లేనిదానివో చైతన్య స్రవంతివో నాకెందుకు? ద్రాక్షాపాకాని వయితే దయ చూపించేది లేదు. నారికేళపాక మయితే దాసోహ మనేది లేదు. మేలిమి వచనవయితే మరలి పోయేది లేదు. తేలిక వచనమయితే కాల రాచేది లేదు, నిన్ను ఆపడం నాధ్యేయం. నీ వెవరవయితేనేం? నీ లిమిటేషన్సు నీక్కనబరచడం నా బతుకు. కాలానికి కళ్ళున్నాయని చెప్పడం నా విధి. నా కళ్లముందు పడకముందే అనుభవించాల్సిందంతా అనుభవించు. మత్తేభంలా నడుస్తావో, శార్దూలంలా ఘీంకరిస్తావో ఘీంకరించు. మందార దామంగా విరుస్తావో, చంపకంగా పూస్తావో పూయి. ముత్యాలసరంగా మెరుస్తావో, మత్తకోకిలగా కూస్తావో కూయి. వచనంగా వందపేజీల్దాకా కామాలతో కాళ్లరిగేలా తిరుగు. సెమికోలన్లతో, డాష్ మార్కులతో నీ ఇచ్చవచ్చినట్లు బతుకు. ఇన్ని అయ్యాకా ఇంకా రానంటావూ? చీకటి పడలేదంటావూ? తమ్ముడూ, నా చేతిలో అధికారం లేదు. ఇంకా తిరిగితే అర్థం అయోమయం అవుతుంది. భావాలు కుత్తుకలు కరుచుకుంటాయి. పుస్తకం ఉక్కిరి బిక్కిరవుతుంది. క్రొత్తపుస్తకం మొద లెట్టా ల్సొస్తుంది. అందుకే ఇలా రా! నిన్ను గర్భంలో దాచుకుంటాను. నిన్ను చదివేసి పాదాల్లో వది లేస్తాను. మరలేసిన పేజీల్లో చెఱ వేస్తాను. మంచి భావాని వయితే నీ జ్ఞాపకాన్ని ముందు పేజీల్లో మననిస్తాను! నేనెవ్వరంటావా? నీకు తెలీదూ? నేను ఫుల్ స్టాప్ ని, గమనానికి ప్రస్తావనని. గమనానికి పరిసమాప్తిని. -శ్రీ వి.ప్రేమ్ చంద్ కిషన్ రావు ('65ల నాటి భారతుల నుంచి నేను సేకరించి ఉంచుకున్న మంచి కవితల నుంచి) 9-02-2014

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJYl9F

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

ఫిబ్రవరి రెండో ఆదివారం (9.2.14) ప్రపంచ పెళ్లిరోజు. దంపతులకు.. ఈరోజు పెళ్లిరోజు జరుపుకొంటున్నవారికి శుభాకాంక్షలు.. మూడుముళ్ల బంధం_ఏడేడుజన్మల అనుబంధం ..@శర్మ \9.2.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LKYyOx

Posted by Katta

Prabhakara Chary Anumula కవిత

అవనిలో సగం ...ఆకాశంలో సగం అని ఎవరన్నారు....! నేనైతే అన్నీ... నువ్వేనంటాను .....అంతా ..... నువ్వేనంటాను.!

by Prabhakara Chary Anumulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/M14sMi

Posted by Katta

Kalidas Darla కవిత

:::::::: వసంతం :::::::::: ఎంతని చెప్పనూ.... నా.. తలపులన్నీ నీ చుట్టూనే.. నిన్ను తలచినంతనే మనసు వసంతమవుతుంది. కాలం ఇసుకతిన్నెలపై చిరుగాలి గీతల్లాంటి నీ జ్ఞాపకాల సంతకాల్ని పదే పదే తడిమి చూసుకుంటుంది హృదయం, వలపు వాకిట్లోకి వచ్చి వయసు దోసిట్లోకి, అనురాగపు అమృతాన్ని వయ్యారంగా వోలికిస్తావు.. నువ్వు. నవ్వులు నువ్వు రువ్వావో... చిరు నవ్వే నువ్వయ్యావో... అర్ధంకాని అయోమయంలో ముంచేస్తావు తడిసిన పూలవనం పసిడి వెలుగుల వేకువలో మెరిసినట్లు లక్షలాది నక్షత్రాలు ఓకేసారి వెలిగినట్లు అద్భుతానికి ఆకృతి నువ్వు, ఎన్ని యుగాలుగా పోగైన అందమో ఇది ఎంత తలచినా కలతే... ఎంత చూసినా వెలితే.... దోసిళ్ళకు ఎత్తడం కుదరదు దోచుకుపొవదమూ సాధ్యపడదు అల్లుకుని,ఆఘ్రాణించుకుని,ఇక్యమైపోతే తప్ప ఆస్వాదించడం కుదరదు.

by Kalidas Darlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bBmMF5

Posted by Katta

Srinivas Reddy Paaruvella కవిత

పారువెల్ల || పదే పదే నువ్వు అదే అంటావు పువ్వుకు ఓ రంగును పులిమేవాడు ఎగిరే పతంగి దారం తెంపేవాడు నీలోనే ఉన్నాడు అయినా పదే పదే నువ్వు అదే అంటావు కట్టిన బట్టతో పెట్టిన బొట్టుతో మనిషిని కొలిచేవాడు నీలోనే ఉన్నాడు అయినా పదే పదే నువ్వు అదే అంటావు గాయపడని దేహాలేవీ లేవు మందుకోసం వెళ్లి మైకంలో పడ్డావు ఏ మందు తాగావో పువ్వులూ నీవే ఎగిరే పావురాలు నీవే ఏ రెక్కలు తుంచినా ఆ చేతులు నీవే 09.02.2014

by Srinivas Reddy Paaruvellafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d80ADJ

Posted by Katta

Maheswari Goldy కవిత

|| శ్రీ కా రం !|| మహేశ్వరి గోల్డీ. మౌనసరస్సున ఉషాకిరణాల సమక్షంలో హంసనై జనియించి...!! ప్రేమసరస్సున స్వాతి ముత్య మాలతో నీకై నిరీక్షించి...!! కావేరి తీరమున ఓ తపస్వినిలా ప్రపంచ ప్రేమికులు ఎవరూ చదవని ప్రేమవేదాలను మౌనకావ్యాలుగా సప్తవర్ణలేఖలపై సాగరసంగమ వేళ చంద్రసుమముల సాక్షిగా....!! సుంధరహాసినినై....... సుమధురభాషిణినై......!! నీ సాన్నిహిత్యంలో నివేదించ సౌగంధికావనమున వసుంధరగా నీ అనుమతికై...!! ఆర్తితో వేచిన కాలాలు శతకోటిరాగాలాలపిస్తూ ఉషఃకాలమున హిమశంఖాలుగా సరాగాల పల్లవితో మన ఇరువురి కలయికను కాంక్షిస్తూ మౌణవీణను శృతి చేస్తున్న శ్రీపారిజాతాలు కాశ్మీర చినుకుల సవ్వడితో సిరిమల్లె పువ్వులయి మన ప్రేమకధకు అనురాగ మంత్రాలతో మధుపత్రాలపై శ్రీకారాక్షరములు రాస్తున్నవి ప్రియధరా !! 9/02/2014

by Maheswari Goldyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kqZEOB

Posted by Katta

Anu Bujji కవిత

Find Who Will Be Your Valentine. @ ==> http://tinyurl.com/mazbnow

by Anu Bujjifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d7S5s8

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

మాఘపొద్దు పెనుచీకటి అరచేతి మీద రేఖలు అడవులు నల్లని తామరాకు ఈనెల్లా కొండల దారులు అంతరిక్షం నుంచి ఒక్కొక్క రేకూ విచ్చుకుని నల్ల కలువై విరిసిన రాత్రి !!! రాత్రి చీకటిపొదుగులో తలదూర్చి పాలుతాగి అలాగే ఎప్పుడో మాగన్నున పడి .. నిద్రలోకి జారుకున్నాయి వృక్షాలు రాత్రంతా చలిగాలిలో ఆదమరిచి నిద్రపోయాకా మెలకువ వచ్చే సరికి ఆకుల చివర్ల నుండి ఇంఒ•• ఎ•ంంగా జారే మౌన బిందువుల్లో కరుణతో చిరునవ్వే ఏడు రంగుల సుప్త స్వరాలు రాత్రి గర్భంలో తపస్సు తర్వాత చాచిన ఆకుపచ్చని దోసిళ్ల నిండా ఓ వెచ్చని అమృత ఫలం దోసిట్లోని ఫలాన్ని పెదవులకు ఆన్చి వెచ్చ వెచ్చగా... నెమ్మది నెమ్మదిగా.. కొద్ది కొద్దిగా... బొట్టు బొట్టుగా... ప్రాణ రసాన్ని సిప్‍ చేసే కొద్దీ ప్రాణం లేచి వస్తుంది ప్రాణులకి శిలల్లో నిద్రపోయే ప్రాణశిశివు సైతం మత్తుగా ఒత్తిగిలుతుంది !!! రంగులు మార్చబోయే ఆకుల అరచేతుల మీంచీ ఇక లోయంతా ఎగరవా రుతువుల సీతాకోక చిలుకలు? వసీరా

by Vakkalanka Vaseerafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b7HFtU

Posted by Katta

Naveen Auvusali కవిత

|| ఆనందం||నవీన్ అవుసలి.|| కారు మబ్బులు కమ్మిన వేలన బీటలు బారిన బీడు భూమికి ఆనందం... పుల్ల పుల్లను ఏరి గూడు కట్టిన రెక్కల కష్టాన దాగి పొదిగిన పిల్ల పక్షికి ఆనందం.. నల్లమట్టిని మలచి ఎర్రంగ కాల్చినా కుండ తీర్చు దాహం ఎండిన గొంతుకి ఆనందం.. దారి తప్పిన బ్రతుకులో దహించే బాధ నీ తోడైనా నీ దారిన ఎదురయ్యే నీ తోటి మనిషికి మాత్రం పంచు ఆనందం..

by Naveen Auvusalifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZbI9F

Posted by Katta

కాశి గోవిందరాజు కవిత

గుది గుచ్చి ఇటుకుల గుట్ట పక్కన పెంటేసి పెంచిన మొక్కలన్నీ నీ నవ్వులాగె పూస్తున్నాయమ్మా నువ్వింకా ఆ మట్టిచేతులు కడుక్కోలేదని వాటికి తెలిసీ పచ్చగా మన వాకిటనిండా పరుచుకున్నాయ్ వచ్చిపోయే తూరీగలూ, తొండపిల్లలూ నాతో మాటాడినట్టు నేనెన్ని సార్లు కలగాన్నానో నా నిద్దర్లో మరి పొద్దున్నే లెగిసి అచ్చం ప్రాణం పోసినట్టు మొక్కలకు నీల్లేసి కొన్ని పువ్వులు కోసి, నీకు తెచ్చిచ్చాక నువ్వు గుదిగుచ్చిన దండలో, నువ్వూ, నేనూ, నానా నిండిపోయాం. సివర్లు ముడేసి నోటితో తెంపాక. నీ కొప్పున పెట్టుకునే కనకాంభరాలు నాన్నవైపే చూసే నవ్వుతుండేవి. పసుపు రాసిన నీ చేతులేమో పచ్చగా తాకుతుంటే నేనెందుకు ఎదుగుతాను? అలాగే ఉండిపోనియ్ నాన్న నీ ముందు మొక్కై మొలుస్తాడు, నేను పువ్వై పూసి నీ కొప్పులో కూచుంటాను. (కొలీగ్ తల్లో కనకాంభరాలు పెట్టుకొచ్చింది, అమ్మలాగ ముద్దాడలేక, అమ్మని రాసి సూపించా ) 7/02/2014

by కాశి గోవిందరాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fBtn1y

Posted by Katta

Katta Srinivas కవిత

సోదరుడు Yasaswi గార్కి అభినందనలతో

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNs13T

Posted by Katta

Patwardhan Mv కవిత

ఒక మొగుడి గారి మోనోలాగ్::: వాడిపోయిన శతపత్రం లాగో మాసిపోయిన ముఖచిత్రం లాగో నిన్ను చూస్తే సఖీ ! భయమేస్తున్నది. నా మీద నాకే జాలేస్తున్నది. **************************************** ఆమె ఆలోచనల్లా గిరున తిరుగుతున్న పంకా రెక్కలు మంచం మీద అస్తవ్యస్తంగా పడున్న ఆశల ముక్కలు చిమ్మగా మెరుస్తున్న చిచ్చర కళ్ళు అవి అంగారకునికి అచ్చంగా నకళ్ళు. ఆపుకోలేని ఆమె అధర కంపనానికే అవును,అందుకే,భూమి గిర్రున తిరుగుతున్నది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసల్నే అలలుగా కడలి అరువుగొన్నది. ఆమె కప్పిన ముసుగు నేర్పిందేమో బహుశా చీకటి కింత నల్లదనపు నిర్దయను. ఆమె పక్క విరుపుల్లోంచి ఒడిసిపట్టుకుందేమో గడియారం కదిలే మెలకువలను ఆమె మౌనమే తన పేరుతో పిడుగులకు శబ్దాలను చెక్కిందేమో ఆమె మౌనమే కావచ్చు చుక్కలకు చూపు రక్తమై ఎక్కిందేమో ****************************************** పెళ్ళగిలి పడుతున్న దూరం ఉనికిని కోల్పోతున్న భారం ఎందుకంటే ఏం చెప్పను-ఏమో ఈ మధ్య ఏనాడు తీరుబడిగా ఆమె ముఖాన్ని చదివాను ఒక ముఖపుస్తకాన్ని తప్ప ************************************************* వెలసిపోయిన పాలపుంతలాగో ఒలికి పోయిన పాలముంతలాగో నిన్ను చూస్తే సఖీ !జాలేస్తున్నది నేనంటే నాకే భయమేస్తున్నది. 09-02-2014,మంచిర్యాల్.

by Patwardhan Mvfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNs0Np

Posted by Katta

Raja Sekhar కవిత

మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు అంధ్రభూమిలో నా కథ 'మా ఇంటి తంటా' ప్రచురితమైంది. కుదిరితే చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..

by Raja Sekharfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aIJQ6K

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఈర్ష్య మా ఇంటి ముంగిట్లో కానీ పెరట్లో కానీ ఒక్క గులాబీ మొక్క కూడా నాట లేదు నేను కానీ ఎదురింట్లో పూచిన గులాబీని చూస్తే మాత్రం నాకు చెడ్డ అసూయ పాపం! తను - ఆ గులాబి తన సోయగంతో, తన సౌరభంతో మనసుల్ని అలరిస్తూ కొద్ది రోజులే జీవిస్తుంది జన్మని సార్ధకం చేసుకుని తనువు చాలిస్తుంది నేను కూడా ఏదో రోజు పోతా కానీ ఇలా క్షణక్షణం అర్ధం పరమార్ధం లేకుండా చస్తూ బ్రతకడం ఏమిటో......... బ్రతుకుతూ చావడం ఏమిటో..... నాకస్సలు అర్ధం కాదు! ఎప్పటికి మారుతుందో ఈ జీవితం? 08FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f5kGLn

Posted by Katta

Krishna Mani కవిత

జాతర సవ్వడి గాలులు మిడతల అరుపులు మిణుగురు మెరుగులు చిటపాట చినుకులు జల జల మోతలు కప్పల గంతులు పాముల సందడి ! ఉరుముల కాంతిలో మెరిసిన జాతర మాడిన బతుకున కురిసెను వెన్నెల ! కృష్ణ మణి I 07 -02 -2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LVAPfk

Posted by Katta

Sky Baaba కవిత

హైవానియత్ (ఎ పోయం ఆన్ గుజరాత్ జెనోసైడ్) - - - - - - - - (ఈ పోయెమ్ చూడండి.. సెక్యులరిజాన్ని కాపాడండి.. ఇవాళ మహాచర్చ లో పాలుపంచుకోండి!) 'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా దూస్రీబార్ బచీ జాన్‌ తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా' - గుజరాత్ గోడ మీది వాక్యాలు జన్మకు ఆరని అలజడి వెన్నంటి వచ్చింది లయ తప్పిన వేలగుండెల ధ్వని నా గుండెలో వేల ముఖాల వేలవేల చీకట్ల తర్జుమా నా మొఖం కన్ను మలుగుత లేదు కనుపాపలమీద పరుగులు పెడుతున్న పాదాలు దూసుకొస్తూ త్రిశూలాలు కరవాలాలు బరిసెలు పొడుచుకొచ్చిన కన్ను తెగిన కాలూ చెయ్యి తల నెత్తురు కారుతున్న మర్మాంగాలు అంతా రక్తం ఆకు పచ్చని రక్తం ధ్యాసెక్కడిది ముండ్లా పురుగూ పుట్రలా రాళ్ళా కొండలా చీకటా అడ్డం పడి ఉరుకుతూ అడవినో ఎడారినో కాళ్ళకింద పరుగెత్తిస్తూ వెలుగు కావాలి నమ్మకం కావాలి నెలవంకల వెలుగు కావాలి కుడికన్ను చూస్తుండగానే ఎడమకన్ను పెరికివేత భార్యల కనురెప్పల మీదే భర్తల దహనం భర్తల పిచ్చి చూపుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు యోనుల రక్తస్రావంలో మునిగిపోతున్న నా దేశం ఎడమకాలు వెంట కుడికాలు ఉరికొస్తుందన్న నమ్మకమేది? ముసలి తల్లిదండ్రులు పసిబిడ్డలు నిండు చూలాల్లు పచ్చి బాలింతలు ఎవరున్నారో ఎవరు లేరో చెల్కల్లో తగలబడి ఉన్న బూడిద కుప్పల్లో ఎన్నెన్ని ముఖాలు వెతుక్కోవాలి పండు ముడతల అమీనా బీబీ ప్రతి ముడతా సాపిస్తున్నది కవాబులా ఉడికిన ఈ పసిదేహం పేరెవరు చెప్తారు చేపలా చీల్చిన ఆ యువతి శవం కథ ఎవరు చెప్తారు పతా తెలీకుండా మాడిన ప్రతి దేహమూ సాపిస్తున్నది 'తరాల మా నమ్మకాల్ని తగలబెట్టేసిన పాపం ఊరికేపోదు' 'అల్లా హమే లేలియాతో యే జహన్నుమ్‌సే భీ అచ్ఛా హోతా' సరీఫా బాను ఏడుస్తున్నది భూమితల్లి ఏడుస్తున్నది తన గుండెల మీదే ఆడిన తన బిడ్డల్ని తన ఒంటిమీదే నగ్నంగా ఉరికిస్తూ ఆడుకున్న రామ సంతతి అకృత్యాలు చూసి- నగ్నంగా పడేసి సామూహిక బలాత్కారాలు చేసిన అకృత్యాలు చూసి- భూమి తల్లి ఏడుస్తున్నది అవాళ సీత కష్టాలు చూసి ఏడ్చి ఏడ్చి పగిలిన భూమితల్లి ఆమెను అక్కున చేర్చుకున్నట్లే ఇవాళ రామ సంతతి అకృత్యాలకు బలైన తన బిడ్డల్ని అక్కున జేర్చుకుంది కన్ను మలుగుత లేదు కన్ను మలిగితే చీకటి చీకట్లో చెల్లా చెదురైన ఊరు తుంపలు తుంపలుగా కన్ను మలిగితే ఏడేళ్ల ఇమ్రాన్‌ కెవ్వున అరుస్తూ... అదే చీకటి చీకట్లో ఒక్కో అమానుష దృశ్యం శకలాలు శకలాలుగా మీదికి రాల్తూ పసి దేహాల్ని గాల్లోకి ఎగరేసి చంపిన అమానవీయం పసి చేతులకు కరెంట్ పట్టిచ్చిన అమానవీయం పెట్రోలు తాపి పసిపెదాలకు అగ్గిపుల్ల అంటిచ్చిన అమానవీయం కన్ను తెర్వక ముందే పసిగుడ్డును శూలం గుచ్చి మంటల్లో మాడ్చిన అమానవీయం పసి కళ్ళల్లో బొమ్మకట్టిన అమ్మీ అబ్బాలు అవమానించబడ్డ అమానుషం మానభంగించబడ్డ అమానుషం ముక్కలుగా నరకబడ్డ అమానుషం కళ్ళముందే తగలబెట్టబడి కళ్ళలో మంటలుగా నిలిచిపోయిన అమానుషం పసి దాహాలకు గుక్కెడు నీళ్ళు నిరాకరించబడిన సంఘంలో ఒకరి మూత్రాన్ని మరొకరికి తాపించుకున్న నిస్సహాయత పసి ఆకల్లకు నాలుగు మెతుకులు దొరక్కుండా చేసిన రాజ్యంలో పుట్ట మన్నులో నీళ్ళు కలిపి తినిపించుకున్న నిస్సహాయత... చితికిన గుండెకు మనిషితనపు లేపనంతో ఓదార్చుకుంటున్న ముసల్మాన్‌లను ముట్టుకొనొచ్చాను జన్మకు మానని మనసు గాయాన్ని మోసుకొచ్చుకున్నాను పరిణామ క్రమంలో జంతు దశలో ఆగిపోయిన జీవులు కొన్ని ఇప్పుడు మనషుల్ని చంపుతూ... 'ముసల్మానోంకో మారో - కాటో - జలావో' 'జిస్‌ మొహల్లేమే అల్లా హోగా వో మొహల్లా జలేగా' 'హిందుస్తాన్‌మె రహెనా హోతో హిందూ బన్కే రహో' 'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా దూస్రీబార్ బచీ జాన్‌ తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా' విరిగిన గోడలమీది నినాదాల్ని కూల్చి రాయాల్సింది కొత్త నినాదం: 'హిందూ హిందీ హిందుస్తాన్‌' నహీ– వో హిందూ బనే ఇన్సాన్'!

by Sky Baabafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/M0uT4D

Posted by Katta

Shekhar Nagunuri కవిత

సంచారం చేస్తున్నడు చంద్రబాబు గురుడు వద్దన్నాఆగదులే తెలంగాణ పురుడు ప్రత్యేకరాష్ట్రంకు లేఖ ఇస్తివి నిరుడు నీమది నిండా ఉన్నదిలే సీమాంధ్ర కరుడు

by Shekhar Nagunurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83ZxU

Posted by Katta

Mala Chidanand కవిత

॥ ప్రేమగ్రంథం ॥ నాకు తెలుసు నేనంటే నీకిష్టమని నీకు తెలుసు నీవే నా దైవమని. నా ప్రేమ చందమామ నీవే అని నీ ముద్దు చిలుకమ్మ నేనే అని. నేను అనునిత్యం ఆరాధించేది నిన్నే అని నీవు అనుక్షణం అభిమానించేది నన్నే అని. నా ప్రేమసాగరంలోని ప్రతి బిందువూ నివే అని. నీవు శ్వాసించే గాలిలోని పరిమళమన్తా నేనే అని. నా అనుగాలపు కతృ కర్మ క్రియలన్నీ నీవే అని. నీ రచనలోని ప్రతి స్పందనా నేనే అని. నీకు తెలుసా ?? ప్రియా... మన ప్రణయమే మహాకావ్యమని ఆ కావ్యమే ఒక గ్రంథమని అందులోని వాక్యములే ఈ కవిత అని. ॥మాలచిదానంద్॥9-2-2014||

by Mala Chidanandfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gYyz4Y

Posted by Katta

Nagendra Bhallamudi కవిత

స్నేహం కుదిరింది // 08/02/2014 అకాశానికి మనసుకి స్నేహం కుదిరింది తేలియాడే మబ్బుల్లో మనసు రాలిపడే చినుకుల్లో ఆర్తిగా ఆలపించే అమృతవర్షిణి మది ఆకాశపు అంచులను చుట్టివచ్చి ఊహలకు ఎల్లలులేవనంటోంది నింగి నేలవైపు తొంగి చూసి రాలిన చినుకుల్లో తన ప్రతిబింబం చూసుకుంటోంది ఊగుతున్న చెట్ల కొమ్మల గాలి తెరలు పారుతున్న సెలయేటి నీటితో యుగళగీతం ఆలపిస్తోంది పున్నమిని స్వాగతించిన కలువబాల మనసనే హంసవాహనంపై తారాపథం చేరుకుంటోంది నిజం అకాశానికి మనసుకి స్నేహం కుదిరింది -నాగేంద్ర

by Nagendra Bhallamudifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggiT8l

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

అందం వారణాసి రామబ్రహ్మం 9-2-2014 రెండు అక్షరాలలో ఇమిడి ఉన్న ఆనందం అందం కాలాతీతం అనంతం కనులపండువలో వీనులవిందులో వీటి వెనుక పరవశించే మనసులో ఉన్నది అందం ప్రకృతీ చందమామ అందానికి నిలయాలు హృదయముల కలయికలోని వివశత్వం లోనూ వాటి వియోగపు విరహపు సలుపులోనూ ఉన్నది అందం అనుకున్నది అందితే అందం అందినది నిలిస్తే అందం సౌందర్యం సౌమనస్యం తారుణ్యం లావణ్యం ముగ్ధత్వం రాసిక్యం అందానికి అందాలు తపించే హృదయపు గాఢానుభవ దర్శనంలోనూ ప్రీతిలోనూ ఉన్నది అందపు చందం

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fMG9dF

Posted by Katta

Girija Nookala కవిత

kites 7-2-2014 Occasionally fluttering in the breeze caught on electric wires down and depressed with torn body and battersd heart nursing nostalgia of the past and pride Once the beautiful queen of skies bold and bearing dancing to Western winds scorning and sneering limits and pits swaying swirling in intoxicating lures Alas entagled in the snares unaware arrogance ignorace and youthful pride made blind to the lust called love dancing swan dance with borrowed feathers. Cut abrupt in life and love now down to earth with regrets repentences balming wounds wishing to disappear into the unknown skies unseen unsung and unknown.

by Girija Nookalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d6ukkg

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !!మట్టి వాసన !!05-10-2013//07-02-2014 ***************** మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసినప్పుడు నా మనస్సు పురివిప్పిన మయూరంలా నాట్యం చేస్తుంది జలతారు తెరలు వ్రేలాడినట్లు నింగినుండీ నేలకు ధారగా కురిసే వాన చినుకులు కనిపించినప్పుడు నేను మళ్ళీ మా"పల్లె" లో గడిపిన బాల్యపు అనుభూతుల్లోకి జారుకుంటాను కల్లాకపటం తెలియని ఆరేడేళ్ళ పసితనంలో అయ్యవార్ల బెత్తం దెబ్బలు గుర్తుకొస్తున్నా లెక్క చేయక చింపిన నోటుపుస్తకం కాగితాలతో చేసిన పడవల్ని వీధుల్లో ప్రవహించే పిల్లకాలువలపై వదిలిన మధుర స్మృతులు ఇప్పటికీ నా మనోఫలకంపై చెరిగిపోని చిత్రాల్లా గోచరమవుతూనేవుంటాయ్ వానాకాలంలో చిరుజల్లులకే వురిసే మా వూరి సర్కారు బడికి లాంగ్ బెల్ సిగ్నల్ ఎప్పుడవుతుందోనని ఒళ్ళంతా కళ్ళింతలు చేసుకుని ఆత్రంగా ఎదురుచూసే నాకు గడియారంలోని సెకన్ల ముల్లు కూడా గంటలముల్లు లాగే బద్దకంగా ఒళ్ళు విరుచుకొని భారంగా కదిలినట్లనిపించేది బడి వదలగానే పొద్దుపొయిందాకా వర్షంలో తడుస్తూ జట్టుతోపాటూ పరుగులెత్తి పిల్లకాలువలకు గట్లుకట్టి తడిసి ముద్దయిపోయి చలికి వణుకుతూ ఇంటికి చేరుకునే నన్ను తిట్ల హారతితో ఆహ్వానించి,అభిమానంతో కోపగించుకుని ఆపై ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మ ఒడి నాలుగు చినుకులు రాలినా నాకిప్పటికీ జ్ఞాపకానికొస్తుంది రోహిణీ కార్తె ఎండలకు నోళ్ళు తెరుచుకున్న బీళ్ళన్నీ రాలిన చినుకులతో తనువంతా తమకంతో తడుపుకుని పచ్చిక బయళ్ళుగా రూపాంతరం చెంది నన్ను ఆడుకునేందుకు రమ్మని పిలిచే ఆట స్థలాలయ్యేవి పిల్ల తెమ్మెరలకు మెల్లగా తలలూపే అరవిరిసిన అందమైన గడ్డిపూలు హరివిల్లులోని రంగులన్నీ తమ రెక్కలకు అద్దుకున్నట్లు కనిపిస్తూ హద్దు లేకుందా ఎగిరే సీతాకోక చిలుకలు పొద్దుతెలియనీయక ఆటలో అలసిపోనివ్వని నా నేస్తాలయ్యేవి తొలకరి చినుకులకు తడవగానే పులకరించే పుడమితల్లి వెదజల్లే మధురమైన"మట్టివాసనాకలిగించే మత్తు కోసం నా శరీరం గమ్మత్తుగా పలవరించేది యాంత్రికత రంగు పులుముకొని మమ్మీ-డాడీల సంస్కృతిలో పెరుగుతున్న నా పిల్లలకు నా బాల్యంలోని వర్షానుభూతుల్ని పొరలు పొరలుగా విప్పి ఎన్నిరకాలుగా వర్ణించి చెప్పినా తక్కువే ఎందుకంటే............ పాశ్చత్య నాగరికత భ్రమలో పల్లె పదానికి అర్థం మర్చిపోయిన పట్నవాసులుగా అనుభూతులకూ,అనుభవాలకూ దూరంగా బ్రతుకీడుస్టున్న వాళ్ళకు అరక్షణం తీరిక దొరికినా మక్కువగా కనిపించే కంప్యూటర్ గేంస్ అన్నింటికన్నా ఎక్కువే కాబట్టి* --వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167*

by Vempalli Reddinagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2LgtJ

Posted by Katta

Jaya Reddy Boda కవిత

//జయ రెడ్డి బోడ // తడి ఆరని జ్ఞ్నాపకం // చిరకాల ఎదిరి చూపుల అనంతరం కురిసే తొలకరి జల్లులకు పులకరించే భూమి పుత్రుడుగా దిగుతాను నేను .. సానుకూలంగా స్పందించి పచ్చగా విచ్చుకొని ఆహ్వానించే ప్రకృతి కాంతలా, చేతులు చాచి నువ్వు .. దూరానికి దూరానికి మధ్య జరిగే సమాగమమే అయినా అదే మన తొలి సంగమం లా, ఆ రసాస్వాదనా ..ఆనంద సాగరంలో మునిగి తేలి, అటు తిరిగి నువ్వు ఇటు తిరిగి నేను మత్తుగా గమ్మత్తుగా లతల్లా పెనవేసుకొని ఒకరికొకరం ... యుగాల కదలికల్లో అడుగడుగునా కలిసిన భావనలో .... నేను, క్షణికమైన ఆ మురిపెము మత్తుకు లాలసుడనై అచేతనవస్తలోకి వెళ్లి పోయనేమోనని అనుకున్న, నువ్వేమో.... కల లాంటి మన కలయిక, కదలకుండా ఉండదు కదా అన్న నీ భయావహ యోచన లో.. పైకప్పు వైపు.. నిస్తేజంగా, కేవలం ఓ పసుపు తాడుతో నిన్ను ఒంటరి 'బందీని'చేసి, కటిన హృదయుడిగా వదిలి వెళ్ళిన మాట వాస్తవమే అయినా.. "పిచ్చి పిల్లా " నేను "వీధి" ఆడిన వింత నాటకంలో విదూషకుడనై దిగువ మధ్య తరగతుల హెచ్చు తగ్గు లలో నలిగి పై కొమ్మకెగుర భంగపడి.. నేల విడచి సాము జేసి, ప్రవాసమనే వ్యసనంలో... చిక్కుకు పోయిన అమాయకున్నే కానీ, ఏ ప్రేమ భావం లేని ...శిల' నై కేవలం కాముకున్నైన ఓ కొయ్యను మాత్రం కాను లే, వేకువ జామున, అలుపెరుగని నీ నాజూకైన చేతి ముని వేళ్ళతో నా పాదాలను తెలిసి తెలియకుండా.. తగిలి తగలనట్టు స్పృశించి, నువ్వు వెళ్లి పోయాక..... నేను తడిమి చూడలేదనుకున్నావా ?.. దిండుపై రాత్రి, నీ కన్నులు వర్షించిన.. వేడి నీటి దారల తడిని... నువ్వు భాద్యతల బరువుల్లో 'క్షమయా ధరిత్రి' వై, మరిచావేమో కానీ, అది నా మదికిప్పడికీ ఎప్పటికీ ఒక తడి ఆరని జ్ఞ్యాపకమే..! (09-02-2014- తెలిసీ తెలియని తనంలో మన "కలయిక" 25 వసంతాల ఈ జ్ఞ్యాపిక నీకు ...నాకు)

by Jaya Reddy Bodafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MB01HT

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 21 . పీట్ హైన్ జీవితం చాలా కుతూహలం రేకెత్తిస్తుంది. నాజీలు నెదర్లాండ్సుని ఆక్రమించినపుడు అతను రాసిన ఒక "గ్రక్ (Grook)" (అతను కనుగొన్న ఒక డచ్చి కవితా రూపం) నాజీల పరిశీలనను తట్టుకునిమరీ ప్రచురించబడింది. కారణం వాళ్లకి దాని అంతరార్థం బోధపడక పోవడమే. [CONSOLATION GROOK Losing one glove is certainly painful, but nothing compared to the pain, of losing one, throwing away the other, and finding the first one again. ఓదార్పు . ఒక గ్లోవ్ పోగొట్టుకోవడం బాధాకరమే. కానీ, అంతకంటే బాధాకరమైనది రెండో గ్లోవ్ ని కూడా విసిరేశాక మొదటిది దొరకడం. (ఇందులో సందేశం, మీరు తాత్కాలికంగా స్వాతంత్ర్యాన్ని కోల్పోయినా (మొదటి గ్లోవ్), మీరు నాజీలతో చేతులుకలిపి మీ దేశభక్తిని పోగొట్టుకోవద్దు (రెండో గ్లోవ్ విసిరెయ్యడం). ఎందుకంటే, మీకు మళ్ళీ రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీరు చింతిస్తారు. అని)] అందులో అతను స్వాతంత్ర్యాన్నీ, దేశభక్తినీ, ఆత్మగౌరవాన్నీ సంకేతరూపకమైన ఉపమానంతో పొల్చి చెప్పేడు. అది డచ్చి ప్రజలకి అర్థం అయింది. కుంబెల్ (సమాధి రాయి) అన్న కలం పేరుతో పీట్ హైన్ 7 వేలకు పైగా "గ్రక్స్" రాసేడు. ఈ కవితలో అతను చమత్కారంగా చెప్పిన భావన: మనం నిజంగా ఎటూ నిర్ణయించుకోలేని సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. మనకి కొన్ని తెలిసో తెలియకో ఇష్టాయిష్టాలు ఉంటూనే ఉంటాయి. నిజంగా నాణెం ఎగరేసి దానిద్వారా మనం నిర్ణయించుకోవాలని అనుకున్నా, నిజంగా అటువంటి పరీక్షకి పెట్టే వేళకి మనకి తెలిసిపోతుంది.... మనకి ఏది కావాలో ఏది అక్కరలేదో. ఎందుకంటే, నాణెం ఎగరేయ్యగానే మనకి ఇది పడితే బాగుణ్ణనో, ఇదిపడకపోతే బాగుణ్ణనో మనసులో అనుకుంటాము. ఆ ఫలితం యొక్క అవసరాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థించడమో, మొక్కులు మొక్కుకోవడమో చేస్తాము కూడా. ఆ ఒక్క క్షణంలో ఎంతవేగిరం మన మనసు ఇష్టాయిష్టాలు తేల్చేసుకుంటుందో ఆ మానసిక స్థితిని ఆయన బాగా చెప్పాడు. . బైరాగి చిట్కా... పీట్ హైన్, డచ్చి కవి . మీరెప్పుడైనా తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు ఏ అభిప్రాయమూ లేక ఏది నిర్ణయించుకోవాలా అని సతమతమౌతున్నపుడు ఈ సందిగ్ధనివారణకి ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఒక నాణెం ఎగరేసి బొమ్మో బొరుసో కోరుకోవడమే చెమటతుడుచుకుంటూ ఏది పడుతుందా అని మీరెదురు చూస్తుంటే సంభవత మీ సమస్య తీరుస్తుందనికాదు నా ఉద్దేశ్యం; ఒక సారి మీరు గాలిలోకి అలా నాణెం విసరగానే, అకస్మాత్తుగా మీ రేది పడాలనుకుంటున్నారో మీకు తెలిసిపోతుందనే. . పీట్ హైన్ (16 December 1905 – 17 April 1996) డేనిష్ కవి , శాస్త్రజ్ఞుడు, గణితశాస్త్రవేత్త, రచయిత, పరిశోధకుడు, ఆవిష్కర్త, రూపశిల్పి. . A Psychological Tip . Whenever you're called on to make up your mind, and you're hampered by not having any, the best way to solve the dilemma, you'll find, is simply by spinning a penny. No - not so that chance shall decide the affair while you're passively standing there moping; but the moment the penny is up in the air, you suddenly know what you're hoping . Piet Hein (Kumbel) (16 December 1905 – 17 April 1996) Danish Scientist, Mathematician, Inventor, Designer, Author, and Poet. His biography makes very interesting reading. Read it here: http://ift.tt/MAZYvP

by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d6o5Nq

Posted by Katta

Maheswari Goldy కవిత

MY SOUL….!! MAHESWARI GOLDY I thought my world that only you But you expected colored butterflies Although I fell in love with you again….!! Sometimes I ask myself Why such a quest…?? When I asked to do so Able to a lot of my soul……. Then I think…!! It does not wish to rejoice my life However, illogically like an insane I spent a couple of minutes alone Just for affection……………….. A moment of my life spent in general terms Because of the desire to touches my mind…!! I know my love is blind But I had only it on my mind A hurt so deep it cuts like a knife But wounds heal and I will go on with my life...!! Every time I want to make it happy But it is never ever think about me….!!

by Maheswari Goldyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ldE3qK

Posted by Katta