పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Humorist N Humanist Varchaswi కవిత

వర్చస్వి//పసిడి గుమ్మం // ----- - ----- ----- ----- --- ఎక్కడెక్కడివో కవిత్వాలు ఆ పూటకి రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతాయి ఆ పచ్చని పదాల చెట్టును వెదుక్కుంటూ! ఇక ఆలశ్యమ్ చేయక, కొన్ని కిశోర శుకపికాల కవితా సంకీర్తనలో, మరి కొన్ని మైనాల జిలిబిలి కులుకుల పలుకులోగానీ - సిద్దంగా ఉంచుకున్న చిట్టి మైకు ముక్కులోంచి కుహుకుహూరవాలుగా రాలి ఆహూతుల వొళ్ళో వచ్చి పడతాయి. కావడానికి అది తులసి వనమే అయినా రాలిపడ్డ అవి గమ్మత్తుగా అక్కడి మెదళ్ళలో గంజాయి మత్తుగా ఉవ్వెత్తున పరుచుకుంటుంది. పాడుతున్న పిట్టల గుండెలు రగిలి పుడుతున్న వెచ్చటి వాతావరణం ఆ ప్రాంగణం లో తీయని సెగలా ఎగిసిపడుతుంది. అంతలోనే కసిగా ఓ చల్లని వెన్నెల సోన హృదయ తలాల్లో శీతలాల్ని పరిచి పారేస్తుంది. మరోప్రక్క తీయని శరాల్లా తగిలిన కవితా పంక్తుల ధాటికి కవన వనంలో చొరబడిన ఓ విరహపు వేదన అక్కడికక్కడే శిశిరంలా రాలి పడి ఆవిరైపోతుంది. అమోఘమైన కవితాగర్జనకు మురిసిన మేఘం ఇక ఉండబట్టలేక ఆనందపు జల్లుల్నికుండపోతలా కురిపించి పోతుంది. ఆ అరగంటలో ఆరారు ఋతువులూ అ ‘పసిడి గుమ్మానికి’ (Golden Threshold) పసుపు పారాణులుగా మారిపోతాయి. ఆ పచ్చటి చెట్టు, పిట్టలకి పెట్టనికోటైనందుకు గర్వించి ఆ పూటకి ‘క్యా-ఖూబ్’ అంటూ హాయిగా ఊపిరి తీసుకుంటుంది. మళ్ళీ నెల తిరగకుండానే మరింత పత్రహరితాన్ని తొడుక్కుని ‘కవిసంగమాన్ని’ స్వాగతిస్తూ పచ్చటి గొడుగు పడుతుంది. //24.2.14// (మన Kavi Yakoob ని తలుచుకుంటూ)

by Humorist N Humanist Varchaswi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkk9xm

Posted by Katta

Venkata Prabhakar Elaprolu కవిత

నాకు తెలుసు ప్రియా.......... వెన్నెల విరబూస్తున్నప్పుడు మంచు కురుస్తున్నప్పుడు పువ్వు వికశిస్తున్నప్పుడు నీ జ్ఞాపకం నా గుండెను సుతారంగా మీటుతుంది అప్పుడు మొదలైన స్పందన నా గుండె కొలిమిలో ప్రేమ జ్వాలలు రగిలిస్తుంది నీ చూపులు నా హృదయాన్ని నిర్దయగా దోచుకుంటాయి అప్పుడే స్నిగ్ధ దరహాసంతో నా ఎదుట నిలుస్తావు రాత్రి పగలు తేడా లేదు దినం దినం క్షణం క్షణం నీ ఆరాధనలో నా మనసు పవిత్రమవుతుంది నా జీవితాన్ని హారతిగా అందిస్తే సంధ్య వెలుగుల కౌగిలిలో ఒదిగి కర్పూరంలా కరిగి నాలో లీనమవుతావు.... వకరికి ఒకరై మనిద్దరం ప్రేమ సామ్రాజ్యాన్ని ఎలేస్తాం.................. ప్రభాకర్...............

by Venkata Prabhakar Elaprolu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ou5W36

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

విద్యార్థుల కవిత్వం: -------------------- 11. సాలాపు దాలి నాయుడు ------------------------------- నాలుగు తాలు కట్టిన గూడతో.. ------------------------------- కోడి కుయ్యనే లేదు పొద్దు పొడవనే లేదు సూర్యకిరణాలు భూమిని తాకనే లేదు నాకు అమ్మానాన్న నోట పిలుపు వినిపించింది ఆ పిలుపు విని నేను కంగారుగా లేచాను మా గోడ పక్క గడియారం చూస్తే చిన్నముళ్లు ఒకటి దగ్గర - పెద్ద ముళ్లు పన్నెండు దగ్గర దట్టమైన పొగమంచు చూడడానికి కళ్లు కనిపించడంలేదు అమ్మానాన్న నన్ను లేపి గూడ డబ్బను పట్టుకోమన్నారు ఆ గూడకు నాలుగు వైపులా నాలుగు తాలు కట్టి పట్టుకోమన్నారు అర్థరాత్రి వేళ శ్మశానం దాటి పోతున్నం మా దగ్గర ఏమీ లేదు - నాన్న చేతిలో టార్చ్ లైట్, అమ్మ చేతిలో తువ్వాల, నా చేతిలో గూడ తప్ప - ఆ అర్థరాత్రి వేళ అమ్మను నన్ను గూడను పట్టుకుని వెయ్యమన్నాడు నాన్న నాన్న మాత్రం వరిసేనుకు తారీలు కట్టి వస్తానని వెళ్లాడు - ఆ అర్థరాత్రి అమ్మా నేను - నాలుగు తాళ్లు కట్టిన గూడ డబ్బాతో చెరువులో వున్న నీటిని పొలంలోకి తోడుతున్నం పొద్దు గడవనే గడిచింది పొలంలో నీరు కలవనే కలిసింది అప్పుడు అమ్మ వరిసేను వైపు చూసి దండం పెడుతుంది, ఎలా అంటే.. 'అమ్మా పొలమా.. నువ్వు మాకు తినడానికి తిండినిస్తావు.. మాకు తెలుసు ! మేము నీ కోసం పెట్టిన మదుపు చేసిన అప్పులు నీతోనే వున్నాయి.. నువ్వు మా నంద నింపేలా పొట్ట వెయ్యమనీ ' - అమ్మ దండం పెడుతుంది కొన్ని రోజులు పోయాక తెలియాలి మా అమ్మ దండం ఫలితం. ---------------------------- 24.02.14

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxBuP5

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

జననీ జయకేతనం --------------------- అణగదొక్కిన చరిత్ర కిప్పుడు పట్టాభిషేకం- పురిటి గండాల నీది బాలారిష్టాల తట్టుకొని యవ్వనోద్రేక ప్రమాదాల దాటుకుని పళ్ళూడే షష్ట్యాదశమాంకపు జీవితాన కల ఇంటికి చేరిన వేళకి దండం- గోలకొండ కోటల తెగిన రామదాసు సంకెల ముడుపులు తీర్చిన మూలపుటమ్మలు సమ్మక్క సారక్క పెత్తనాన్ని తుత్తునియలు చేసిన రుద్రమ కరవాలం కొమురం భీం తలపాగల మెరిసిన చంద్రవంక మడికట్టుల మొలిచిన నాగేటిచాల్లల్ల గోదావరమ్మ అలుగు దుంకిన వేళకి దండం- పాయిదార్లు పట్టిన భాషా యుద్దంల జీవగంధపు పరిమళం చిమ్మిన యాస కడుపు చూసి,పీట ఏసి అంబలి పట్టిన పెద్దముత్తయిదువ ఎడ్డితనమనే ఎక్కిరింపుల మూర్చిల్ల జేసినమల్లినాధుని అక్షర వెలుగు కారం పొడి, చీపురుకట్టలే తరతరాల బూజు,బురుజులను ధ్వంసించిన కొట్లాట ముచ్చట భూమిల నిక్షిప్తమైన సాంస్క్రతిక నిధుల పొద్దుపొడుపు కలవరపడ్డ కళలన్నీబతుకమ్మ చుట్టూ అల్లుకుపోయిన వేళకి దండం- మెదళ్ల సాగులో కాంక్షాకురాలు పూయించిన సిద్దాంత బ్రహ్మ నవ్వుతున్నడు సకలంబందుల్,మాడ్చిన కడుపుల్ ,సాగర హారాల్ తీరొక్క జిద్దుల తిమ్మిరెక్కించిన ముఖాల అలసట అలసిపోయింది ఇనుప కంచెలను రబ్బరు బుల్లెట్లను ఎడం కాలితో తన్నిన ఉస్మానియా కాంపస్ సర్టిఫికెట్లకు పటం కట్టుకుంటున్నది కల చిగురుటాకై వణుకుతున్నప్పుడల్లా బతుకుల దహించుకుని ఇంధనమైన అమరులస్తూపం గెలుపుని ముద్దాడుతున్నది బక్క ప్రాణానికీ భారీ లక్ష్యానికీ అరవై ఏళ్ల దూరం బుకా గులాల్ తో ఎదురొచ్చిన వేళకి నాలుగున్నర కోట్ల దండం- ఇక తెలంగాణ పదం ప్రపంచం నోటి నిండా ...! 24-02-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cHHuDG

Posted by Katta

Maddali Srinivas కవిత

నిరీక్షణ!//శ్రీనివాస్//24/02/2014 ------------------------------------------------------------- మెత్తని కత్తి దూసి నిలువునా చీల్చిన మేను రెండు పక్కలా నెత్తురోడుతున్నది యెనస్థీషియా మత్తులో ఒక సగం జోగుతున్నది మరొక సగం తన గాయాలకు తన నాలుకతోనే మందు రాసుకుంటున్నది అవసాన శ్వాస నుండి కొత్త ప్రాణం పుట్టుకొస్తుంటే నిలువెల్లా రగిలిన గాయాల బాధ మింగి మొండి చేతులతో పగిలిన గుండె దోనె చేసి పురిటి పాపాయిని పొదివి పట్టుకుంటున్నది. మత్తు వీడని రెండో సగానికి యూఫోరియా లోనే బ్రతుకు తెల్లవారిపోకుండా నిజం తెలుసుకోని నిప్పు కణికై భగ్గుమంటే చూడాలని వుంది భస్మం నుండి లేచొచ్చే కొత్త పొద్దు పొడుపై వెలిగిపోతే చూడాలని వుంది అందుకే గాయాలను చూసి గాజు లా మారిన నా కళ్ళను ప్రమిదలు చేసి, శ్రమనే వత్తులు వేసి, నెత్తుటి నూనెను నింపి ఆశా జ్యోతులను వెలిగించి నిరీక్షిస్తూనే వుంటానింక యెన్ని చీకటి యుగాల పర్యంతమైనా!

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hKtyxl

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

ఇప్పటికిప్పుడు _________________________ తేనెలూరిపారుతున్న నది ఏదో ఒంటినిండా తియ్యదనాన్నిపులిమినట్టు మనసుని ఒడిసి పడుతున్న మెరుపులేవో చిట్టికళ్లై పలకరించినట్టు. పాట పాడుతున్న చిట్టి చేతుల్నించి అడుగులేస్తున్న పిట్ట గొంతుకనించి ఇవాళ ఈ లోకానికంటే గొప్పదేదో నా ముందు తచ్చాడుతుంది భాష ఇప్పటికీ అర్థం కాలేదు భావన ఎన్నిసార్లు మృదువుగా పెనవేసుకుందో ప్రతిపదం ఎన్ని సార్లు పులకరింతలయ్యిందో చిట్టితల్లీ..! నీ అడుగులకింద ఈ లోకం మార్దవమవ్వనీ నీ పాటనించి ఈప్రపంచం పునీతమవ్వనీ అనేకవలయాలు పులిమిన నిశ్శబ్దాలన్నీ నీ అడుగులతో స్వరాలవనీ అతనెవరో స్వరలేడన్నాడుగానీ.. ఇప్పటికిప్పుడు అదిక ఒకటే.... (మిత్రులు Humorist N Humanist Varchaswi షేర్ చెసిన ఉత్తర కొరియా అమ్మాయి పాట విన్నాక...)

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eao1ww

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | ఒక వీడ్కోలు లో ------------------------------- రైలు తప్పదన్నట్టుగా కసిరి కూత విసిరింది, వాన చినుకుల బరువుకి ఒళ్ళు కదలనందేమో! గాలిహోరుని చీల్చుతూ చక్రాలు, చెరుకు తోటలో పిల్లల పరుగుల్ని జ్ఞప్తికి తెస్తూ. చిననాటి ఊసొకటి నవ్వుని వెంటేసుకువచ్చింది- అమ్మమ్మ వూరిలో ఆగని రైలుబండికి అమ్మ ఎర్రచీర చూపి ఆపుదామన్న ఆన్నయ్య మాట, ఎప్పటికీ మరవలేని మాగాయి ఊట. అదేమిటో మనసిక్కడ ఆగదే, ఏళ్ళ వెనక్కి పరుగిడుతూ? పట్టాల దాపున పొంచిన ఆకతాయితనం, రైలెళ్లిపోయాక పిన్నీసుల వెదుకలాటలో రణం, ఎన్నిపదులు ముగిసినా మరుగున పడని జ్ఞాపకం. బోసినోటి నారాయణ తాత పాడే పదాల్లా గణ గణా గానాలు చేసిన గంటలిక ఉండవట. మా ఊర్లో ఇక అనౌన్సర్ శషభిషలు వినక తప్పదట రద్దీలో, ఎక్కిదిగే తిప్పల్లో ఇదొకటా గోల! "చుక్ చుక్ రైలు" వెళ్ళిపోయింది- చురుకైన యంత్రాలు కట్టి కొత్త రైలొచ్చింది, దాని కూత మాత్రం పాత గాయాన్ని కెలుకుతుంది. తెలవారకనే వచ్చే రైలేదైనా "దెయ్యాల బండి" ఆనాడు, పొద్దుగూకులూ పరుగుల్లో మనమే దెయ్యాలమిప్పుడు. కిటికీకి కట్టేసిన నా కళ్ళలో వానతడి వేడిగా ఉంది కదిలిన రైలుతో కదిపిన తన పాదాలు జారతాయేమో? పక్కవారి పలకరింపుతో తప్పని ముక్తసరి. గండి పడిన ఏరులా తన ఒడిలోకి దూకాలనుంది, నా స్వగతాలు వినని రైలు కదిలిపోయింది... దూరాలు రగిల్చే తలపుల్ని మోస్తూ నేనూ వెళ్ళిపోయాను. అగరు వాసనలు మోసే గాలిలా తను మాత్రం మిగల్లేదూ? (ప్రతి ప్రయాణం లో ఆత్మీయుల ఎదుర్కోలు ఆహ్లాదమే, కానీ ఎవరో ఒక ఆప్తుల వీడ్కోలు మాత్రం మరణయాతన/మరవలేని ఖేదమూను) 24/02/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pioW2s

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఉంటే// ఎన్ని జన్మలెత్తి ఎక్కడెక్కడో పుట్టి పెరిగి ఏమి సాధించెరా? ఆడజన్మ ఎత్తి ఇద్దరు బిడ్డలని కని ఆడపడుచుల సూటిపోటి మాటలు అత్తగారి సాధింపులు భర్తనే బాడుకోవ్ చేష్టలు బరించి బట్టకట్టు గోపికలతో ఒకసారి సృష్టి లయ వీణానాదం చేయమని ఒకసారి అర్ధబాగ మిచ్చినట్టే ఇచ్చి తలపై సవతితో ఒకసారి అప్పులతో పెళ్ళి చేసుకొని అర్ధరాత్రి కొండదిగేదొకసారి ఏ అవతారం చూసినా నువ్వు గెలిచావేగానీ మొగుడిగా భార్య మనసు గెలిచావా... అన్నీ మగజన్మ లేనా? అత్త గానో ఆడపడుచు గానో పోనీలే పాపం కనీసం మొగుడుగా పదకొండో అవతారమెత్తు దేవుడా....24.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MTxoGy

Posted by Katta

Vani Koratamaddi కవిత

మా నాన్న గారు క్రీ.శే. శ్రీ కొరటమద్ది.నరసిం హయ్య గారు రచించిన మరో కవిత ఇది నాన్న గారు కె,యన్.కౌండిన్య అనే కలం పేరుతో కధలు కవితలు రాస్తూ వుండే వారు అప్పట్లొ అవి పెద్దగా ప్రచురణకి నోచుకోలేదు కవి మిత్రులకి పరిచయం చెయ్యాలనే ప్రయత్నం చేశాను . 5/5/1969 రచన. క్రీ.శే శ్రీ.కొరటమద్ది నరసిం హయ్య గారు. "జై భారత్" తెలంగాణా వీరుల్లరా సమైక్యాంద్ర సోదరులారా మనమంతా తెలుగు సోదరులం మనమంతా తెలుగు తల్లి అనుంగు బిడ్డలం తెలుగునాటి ప్రగతి యొధులం అమరజీవి త్యాగనిరతి ఆంద్రకేసరి రాజనీతి మాడపాటి ధీయుక్తి బూర్గుల స్నేహనిరతి కరడు కట్టిన తెలుగుజాతి మనది పీడకలలు మరచుదాం ప్రగతి పదానికి మరలుదాం తెలుగు ప్రజలకు అండదండగ నిలుద్దాం వెలుగుబాట చూపుదాం నవయువకుల్లారా భావియొధుల్లారా లేవండి,నడుంకట్టి ముందుకు నడవండి రాయలసీమలో రత్నాలు వెతుకుదాం సాగరసీమను సస్యశ్యామలం చేద్దాం తెలంగాణాను తేనె మాగాణి చేద్దాం తెలుగు సోదరులారా మనకెందుకీ వైవిద్యం మనకెందుకీ వైరుడ్యం మనమంతా ఒక్కటే భారతీయులం కలసికట్టుగ నదుంకట్టి లాగుదాం ప్రగతిరధం జై అంద్ర ,జై తెలంగణా నినదమ్ములు మానుదాం "జై భారత్" అని ఎలుగెత్తి జాతీయతను చాటుదాం 24/2/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhfdAK

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||మబ్బులు|| ఎన్నోమబ్బులు కారుమబ్బులు కరిగివర్షించే మబ్బులు కౌగిలిలో మురిపించే మబ్బులు కరడుగట్టిన మరికొన్నిమబ్బులు ఎగిరొచ్చి తాళితెంపిన తాగొచ్చి కుళ్ళబొడిసిన ఉరిమే మొగుడుమబ్బుతో రాజీపడుతూ అమ్మఆకాశం ...అదే ప్రేమతో కాలంవేగంతో పరుగులుతీసి కాలుజారిన కన్నపేగుమబ్బును మళ్లీ తన గర్భంలో దాచుకొంటు అమ్మఆకాశం ...అదే ప్రేమతో క్షణ క్షణం తలకొరివి పెడుతూ నోటికాడ గింజను బజారుదానికెట్టి వావివరసలు లేని కొడుకుమబ్బును అనుక్షణం పురిటిస్నానం చేయిస్తూ అమ్మఆకాశం ...అదే ప్రేమతో తొలిరేయి గదిలో తెల్లని కాంతి తెల్లని చీర తెల్లని పాలు తెల్లని పూలు తెల్లని పాన్పు మబ్బులు తెలియని అమ్మఆకాశం తెల తెల్లగా!! సుడిగాలులు వడగాలులు చలిగాలులు అన్నీ వచ్చి వెళ్ళిపోయాయి సూరీడు ఈ కొన నుండి ఆ కొనవరకు ప్రాకతు నడిచి పరుగెత్తుకెళ్ళాడు అమ్మఆకాశం అలసిపోయి తెల్లని వస్త్రంలో చుట్టబడింది, అచ్చం తన తొలిరేయిల. మబ్బులన్నీ కలిసికట్టుగా అమ్మఆకాశాన్నిఆరడుగుల గోతిలో నెట్టేశారు! అమ్మఆకాశం ఇప్పుడో జ్ఞాపకం మాత్రమే .... తెల్లని తెలుపులా !! ఆర్కే ||మబ్బులు||20140224

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fgYMnS

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్ /పుప్పొడి ప్రాణం ---------------------------- నిర్వచించలేని కొన్ని శిధిలాలు నీలో అంతమైనపుడు వాటి జ్ఞాపికల్లో నిన్ను నువ్వు చూసుకుంటావు విరివిగా చెట్ల కొమ్మల్లో ఆకులను పేర్చినంత సులువుగా నిన్ను వర్ణించుకుందామని ఇటుక సొరంగాలో గాలిస్తుంటావు పుప్పొడి ప్రాణాలను అరచేతుల్లో ఉంచుకొని ఎక్కడికెళ్ళాలో తెలియని అంతమవని రాత్రి మిగిల్చిన కలలా తిరుగుతుంటావు కొన్ని సంతకాలను కళ్ళ వాకిళ్ళలో చెరుపుకుంటూ అప్పుడు ఓచోట పరుండి ఇంత తీక్షణతను కళ్ళలో పోసుకొని శోధన మొదలెడతావు బాహువులలో కొన్ని చీకటి కెరటాలను మోస్తూ.... తిలక్ బొమ్మరాజు 24.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fgYNrU

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | నయా కాకి కధ | పేదరికం కి తల్లీతండ్రుల దివాళాకోరుతనం తోడైతే నాలుగో తరగతి నవిత పార్లర్ లో పనిపిల్ల అవుతుంది నోట్లో నాలుకే లేని నిజాం మదర్సా మతం నీడలో దాక్కుంటాడు నిస్సహాయంగా ఇంకో తరం నిర్లిప్తతలలోనికి జారిపోతుంది బిడ్డలు ఏడవరు ఏడిచినా అన్నం దొరకని ఏబ్రాసి జీవితాలనుండి మూడు పూటలా తిండి , సిగ్గు దాయగలిగే బట్టలు అపుడపుడు చేతిలో ఆడే ఐదు రూపాయల బిళ్ళలు పునాదులు లేని త్రిశంకు స్వర్గంలొ పర్మినెంట్ గా కాళ్ళు బ్రతుకు తెలియని పసితనం బ్రతుకు తెరువు వెతుక్కుంటూ తండ్రులు కూడా ఏడవరు బాద్యతల బరువు తగ్గించిన వ్యవస్తకు వంగి దండాలు పెడుతూ కల్లు పాక చుట్టూ పొర్లు దండాలు తిరుగుతూ తనదనుకున్న స్వర్గంలొ తీన్మార్ ఆడుతూ బ్రతకలేక ...బ్రతుకు వదలలేక తల్లులు అసలే ఏడవరు కనీ పెంచలెనితనం తాలుకు డస్సిన కళ్ళతో ఆడతనం మీద అన్నం పెట్టలేని మగతనాల జులుం అర్దం కాక నిస్తేజం గా మారిన చూపులలో అమ్మతనం కన్నా ఆకలే ఎక్కువ కనిపించినా Who cares? After all she is a female బ్రతికినా చచ్చినా ఆడబ్రతుకు విలువెప్పుడు శూన్యమే అని నిరూపిస్తూ ఏడ్చేది ఒక్కరే ఎగ్జిస్ట్ అవుతున్న పిల్లల ఎగ్జిస్టెన్స్ అవసరం లేని మతపెద్దలు మాత్రమే ఇంటికి కనీసం అరడజను మందిని కనీ పారెయ్యకపొతే మనిషిని మనిషి పీక్కుతినే మతోద్దారణ కస్టం అని కార్పోరేట్ కుబుసపు అంబానీలు కూడా ఏడుస్తారేమో కాణీ ఖర్చు తో దొరికే కూలీలు కరువవుతారని అదేమిటో కాలేకడుపుల కన్నీరు అంతా కలిపినా దేశం కూజా లో నీళ్ళెప్పుడు అడుగునే అవనీతి రాళ్ళేసే వల్చర్స్ (vultures ) రాజులు స్త్రా వేసి తాగే తెలివితేటలు "ఉన్నవాళ్ళే " రారాజులు జనం కాకులు మాత్రం ఎప్పటిలానే కొత్త పధకాల ఎంగిలి కోసం ఎదురుచూస్తూ ఫర్ ఎవెర్ అండ్ ఎవెర్ ఎ నెవెర్ ఎండింగ్ సాగా లా వాహ్ రే వాహ్ ఇంక్రెడిబిల్ ఇండియా టోకో టోకో ఏక్ సలాం తో టోక్నా మంగ్తా హై భాయ్ నిశీ !! 24-02-14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jtcCcb

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ** మై పక్కా హైదరాబాదీ ** నగరం రాత్రికోసం పరితపించు చంద్రుడు- లైట్ల వెలుతురు చప్పరించు రోడ్లూ- దుప్పట్లో దాక్కును ఫూత్పాత్ లోగ్; పక్కనే కుక్కలు- పురాతన కట్టడాలు చీకట్లో మేలుకునే ముసలి ప్రేమికులు- •• నగరం మేదావై కనబడు పసిపాప- నిశ్శబ్దం మోసే ఔరత్- పోషించే తల్లీ- నగరం ప్రియుడికి చూసే ప్రియురాలు; లేదా విరహం వెదజల్లు గజల్- •• ఉదయం నిద్ర రాత్రి మెలుకువ నగరం జాదూ - అలవాటు పడీ అంటుకో అర్ధంకాక పారిపో- నగరం నిజంగా యీ నగరం గూడు కట్టు సాలె పురుగూ- 24/02/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MnHcHV

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ** మై పక్కా హైదరాబాదీ ** నగరం రాత్రికోసం పరితపించు చంద్రుడు- లైట్ల వెలుతురు చప్పరించు రోడ్లూ- దుప్పట్లో దాక్కును ఫూత్పాత్ లోగ్; పక్కనే కుక్కలు- పురాతన కట్టడాలు చీకట్లో మేలుకునే ముసలి ప్రేమికులు- •• నగరం మేదావై కనబడు పసిపాప- నిశ్శబ్దం మోసే ఔరత్- పోషించే తల్లీ- నగరం ప్రియుడికి చూసే ప్రియురాలు; లేదా విరహం వెదజల్లు గజల్- •• ఉదయం నిద్ర రాత్రి మెలుకువ నగరం జాదూ - అలవాటు పడీ అంటుకో అర్ధంకాక పారిపో- నగరం నిజంగా యీ నగరం గూడు కట్టు సాలె పురుగూ- 24/02/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MnHfn5

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ చినుకు @ భూమికి గగనం స్తన్యమిచ్చిందా అవని ఆర్తితో అంబరాన్ని పాలిమ్మని అడిగిందా మేఘాలు జాలితో మట్టికి దాహం తీర్చాయా మట్టి తనలోని తడిని ఆవిరిగా చేసి మబ్బులకు అప్పచేపిందా నేల నింగితో చెలిమి చేయుటకు మట్టి వాసనతో కబురు పంపిందా నింగి నేలతో స్నేహం కొనసాగించుటకు చినుకుతో మేఘ సందేశం పంపిందా . -- కొత్త అనిల్ కుమార్ 24/2/2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hJPkkM

Posted by Katta

Annavaram Devender కవిత



by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ffs9Hc

Posted by Katta

Sasi Bala కవిత

మరువలేని మమత .......శశిబాల ........................................................ మరువలేను ఏ క్షణం నిన్ను కలిసిన తోలి క్షణం చెక్కులపై జాలువడిన అశ్రువు దోసిట పట్టిన క్షణం ఆర్తినొందు హృదయాన్ని అక్కున చేర్చిన వైనం మూగ గుండె వీణ తాకి ప్రేమ మీర శ్రుతి చేసి అపురూప రాగమేదో పలికించిన నీ అనుబంధం ఏమని చెప్పను????? ఎలా చెప్పను ???? ఎదురుచూసే ఉదయ సంధ్యలు ఎడబాయని ఒంటరితనం విడువను విడువను అంటూ మది చేరిన మమకారం కడలి నిండు నీరు వున్నా తీరని మమకార దాహం తనువునేమి చేయలేక తలపుల తాకిన క్షణం ఎలా చెప్పేది ??? మనసు ఎలా విప్పేది పడకింటికి కళ్ళు లేవు తడిసిన దిండుకు నోరు లేదు నా వ్యధను నీకు వివరించే చక్రవాకి ఒకటి లేదు పున్నమిలో మబ్బు దాగిన రాకా చందురుడు లేడు నీ నిష్క్రమణ చేసిన గాయానికి పూత పూసే అమృత హస్తం లేదు వాడిన జాజులనడుగు ఎదురు చూపులో ఎర్రబడి,వాడిన ముఖబింబాన్ని శుకపికాలనడుగు అవ్యక్త రాగమైన నా మది అనురాగాన్ని ఇంతకంటే చెప్పలేను చిగురు మనసు విప్పలేను ..............24 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dmbMcj

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || జీవితపు అ౦చున నిశ్శబ్ధ౦ || రోజూ చూసిన‌ సముద్రమే కొన్ని అలలు ఇ౦కొన్ని సుడిగు౦డాలు మరి కొన్ని ఆటుపోట్లు..... నాకు ఎదురుగా వున్న సముద్రము ఇవాళ ఎ౦దుకో ఉలుకూ పలుకూ లేదు దు:ఖ౦ వొదిలి ఇ౦కో దుఖ౦ కొన్ని మ౦చు వర్షాలు సముద్ర౦ పైన వచ్చి వాలిపోతున్నాయి మరణిస్తున్న సముద్ర౦ దీన౦గా చూస్తూ చూస్తూ చివరిశ్వాస విడిచి౦ది ఒక్కో అల మృత శరీరాన్ని తీర౦వద్ద దిగబెట్టి వెళుతో౦ది ఎప్పుడూ చెప్పేవే కొన్ని కూడికలు ఇ౦కొని కలపడాలు మరికొన్ని తీసివేతలు కొన్ని లెక్కలు ఎవరికీ అ౦తు చిక్కవు సాయి౦త్రపు వెలుగులో బాల్య౦ విడిచివెళ్ళిన మరకలతో తరగతి గది రోదిస్తు౦ది మౌన౦గా నిద్రలోకి జారుకొన్న నగరాన్ని సిగ్నల్ లైట్లు, చౌరస్తాలు, క్రాస్ రోడ్స్ కాపలా కాస్తూ కాస్తూ నిద్రలోకి జారుకొ౦టాయి అహి౦స ను నెమరువేసుకొ౦టున్న బుద్దుడు హుసేన్ సాగర్ లో ఏకా౦త౦గా రాతిరి ఇప్పుడు ఎ౦దుకో ఆలస్య౦గ చచ్చిపోతో౦ది ఎ౦తకు చావదేమిటి? ఆ వీధి కుక్క దీనమైన వేడ్కోలు ఎప్పటికైనా ఆత్మహత్య తప్పదు ఆ రాతిరి పాటకు మరణాన్ని చప్పుడు చేయకు౦డా నిశ్శబ్ధ౦ మి౦గేసి౦ది ఇప్పుడిక ఏ లెక్కా తప్పదు నీలోకి నీవే తొ౦గి చుసుకోనే రోజు జీవిత౦ పచ్చిగా చేతికి తగులుతు౦ది ఒక పరిసమాప్తి సుషుప్త నిద్రలోకి జారుకొ౦టూ జారుకొ౦టూ..! @ సి.వి.సురేష్ 24,2.14

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MR60Jb

Posted by Katta