పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మే 2014, ఆదివారం

Kag Murali Krishna కవిత

మురళీకృష్ణ ---- ఏమో ---- అన్నీ అర్థం చేసుకోవటానికి ఆలోచిస్తూ అర్థమైన వాటిని అందరికీ చెప్పాలని ప్రయత్నిస్తూ వచ్చే ఆవేశాన్ని మింగలేక,కక్కలేక చస్తూ నిజంలో బతికే ఇప్పటికన్నా.. చుట్టూ వెధవలతో పెద్ద వెధవ చేసే చిన్న మంచికే మురిసిపోతూ వెధవగా.. ఆనందంగా.. నా బతుకేంటో నాకై ఇక ఏమీ పట్టించుకోని ఒకప్పటి ఆ అబద్దపు బతుకే బావుండేదేమో..

by Kag Murali Krishnafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWFDdn

Posted by Katta

Uday Dalith కవిత

స్వేచ్ఛ తన స్వేచ్ఛ కోల్పోయి భయానక భావాల సింహ గర్జనల మద్య అనునిత్యం పరాభవిస్తుంది మతోన్మాదుల దాష్టీకాలకు ఉదారవాదుల దైన్యానికి నడుమన స్వేచ్ఛావాణి తన గొంతు సవరించుకునే ఆశ లేక అనుక్షణం మూగబోతోంది ఉవ్వెత్తున ఎగసిపడే అలలు ఓ పక్క నిరంతరం ఎగిరిదూకే జలపాతాలు ఓ పక్క వేటికవే స్వేచ్ఛగా ప్రకృతిని పరవశింపజేస్తూంటే నా భావ స్వాతంత్ర్యం మత రక్కసి క్రౌర్యంలో ఆంక్షల వలయంలో నేలరాలిపోతుంది రక్తాలు చిందకముందే శాంతి కపోతాలు ఎగరాలి యుద్ధాలు జరగకముందే భావ స్వాతంత్ర్యం విరియాలి ఉదయ్ 18.05.14

by Uday Dalithfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWxh5t

Posted by Katta

Sai Padma కవిత

సాయి పద్మ //రాజకీయ చింతామణి గెలుపు ప్రతీ మలుపులోనూ ఒక భయం పొంచుంది కలివిడి లేని తెలివిడితనాల్లో ముడి ఎంతకీ వీడనంది అవంద్యులకి అనుమానం కొత్తేం కాదు నీడని కూడా అనుమానించే జాతి, గర్భాస్రావాల్ని తప్పించుకుంది పొడారిన కళ్ళతో, లాభాల మెదళ్ల తో లేక్కలేసే సమూహాల్లో మనసు తడి గురించి మాట్లాడటం మరీ హాస్యంగా ఉంది బంగారక్క , డ్వాక్రా రుణాలకు బలై బాధపడుతోంది కేతిగాడు, అవినీతికి అజీర్తికి నవ్వలేక పోతున్నాడు సుబ్బిశెట్టి , ధరల పట్టిక తగిలించటం మానేసాడు రాజకీయ చింతామణి వ్యాపారం వెలిగిపోతోంది భారతదేశం , సుషుప్తి మంచం దిగుదామా వద్దా అని ఆలోచిస్తోంది ..!! --సాయి పద్మ

by Sai Padmafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbm8lC

Posted by Katta

Bharathi Katragadda కవిత

అక్షరశిల్పం పాతకాగితమే కదా అని నన్ను పారేయకండలా! అపురూపంగా చూడండొక్కసారి! గుండెగదుల్లో దాక్కున్న ఙ్ఞాపక పరిమళాలేవో మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తాయి! అద్భుతమైన అక్షర నిధులేవో మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాయి! ఏనాడో మర్చిపోయిన బాల్యం నిన్ను పలకరించొచ్చు. మరేనాడో పారేసుకున్న యవ్వనపు తీపి గుర్తులు పలకరించొచ్చు! మనసులో గుప్తంగా దాచుకున్న ప్రియురాలి మధురిమలు పలకరించొచ్చు. మనసుని హత్తుకున్న ఇల్లాలి మురిపాలు పలకరించొచ్చు! తండ్రి ప్రేమగా దండించిన అపూర్వ క్షణాలు పలకరించొచ్చు ! అమ్మ ఆర్తిగా అదుముకున్న మధుర క్షణాలు పలకరించొచ్చు! బడి డుమ్మా కొడితే దండించిన గురువు పలకరించొచ్చు! తాతయ్య నానమ్మల చందమామ కథలు పలకరించొచ్చు! అందుకే ఈ అక్షర శిల్పాలను ఒక్కసారి మనసారా సృశించండి! పోగొట్టుకున్న అపూర్వ పెన్నిధేదో దొరకవచ్చు ఆర్తిగా మిమ్మల్ని పెనవేసుకుపోవచ్చు!! భారతీరాయన్న 18.5.14.

by Bharathi Katragaddafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t61zdf

Posted by Katta

ShilaLolitha Poet కవిత

బసవి ----------- ఆమెప్పుడు నవ్వగలదు? ఆమెప్పుడు నడవగలదు? మాట్లాడగలదు? అందరిలాంటి మనిషిగా జీవించగలదు? చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను చెట్టుబెరడు లాంటి శరీరం భావరహితమైన గాజు కళ్ళు ఆకలితో అలమటించే ఒళ్ళు పగలంతా వెలివేత రాత్రంతా జాగారం ఊరందరి ఆకలిని ఊరంతటి అమానుషత్వాన్ని మదమెక్కిన పిశాచుల క్రౌర్యాన్ని శరీరమున్నందుకు ఆడదానిగా అవయవమున్నందుకు మరల మరల మరల మరలా ఆమె చిన్నభిన్న మౌతూనే ఉంది వావి వరసలు లేనిఊరుమ్మడి బతుకామెది జోగుతున్న వ్యవస్థలో జోగిని'' ఆమె ఏ ఇంట్లో చావుమేళం మోగినా ఆమె తాగి ఆడాల్సిందే ఎవడెక్కడ చెయ్యి పెట్టినా ఎవడెప్పుడు అనుభవించినా అడ్డు చెప్పకుడదన్నదే ఊరి నీతి! కట్టిన గజ్జెలు మోగుతూనే ఉన్నాయి పుట్టిన పిల్లలు దోపిడీకి గురవుతూనే ఉన్నారు అందరి అందరందరి వీర్యాల చిత్తడిలో ఆమె లుకలుకలాడే పురుగులు తింటున్న శరీరంతో హీనంగా,హేయంగా,దీనంగా మనమున్దింకా నిలబడే ఉంది నెమ్మది నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తోంది మీరూ,నేనూ, మనమూ కలిసి జోగిని' ని మనిషిగా జీవించనిద్దాం! మహారి,నాటి,మురళి,తెవార్, డియార్,బసవి,జోగిని, పార్వతి,ముత్తామ్మ, తామమ్మ,-పిలుపేదైతేనేం? భాషేదైతేనేం, ప్రాంతమేదైతేనేం మన ముందే కాలుతున్న శరీరంతో ఆమె కూలుతున్న శరీరంతో ఆమె- ఆమెప్పుడు హాయిగా నవ్వగలదు? ఆమెప్పుడు ధీమాగా నడవగలదు? స్వతంత్రంగా మాట్లాడగలదు? మనిషిగా జీవించగలదు? మనమందరం మనుషులుగా ఆలోచించినపుడు ఆమె హక్కులకై పోరాడినప్పుడు ఆమె కూడా నవ్వగలదు.

by ShilaLolitha Poetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sHxLSe

Posted by Katta

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ II ఒక ఎండకాలం సాయంత్రం II కొమ్మా కదలదు ఆకూ కదలదు గాలి ముక్కు మూసుకు తపస్సు చేస్తున్నది. *** ఎన్ని నీళ్ళు గుమ్మరిచ్చినా నివురు గప్పిన నిప్పోలెనే గచ్చు. *** ఆకాశంలా కర్ఫ్యూ పెట్టినట్లనే ఏడనో ఒక పిట్ట *** ఏ చానల్ తిప్పినా ఎన్నికల ముచ్చటన్నట్టు ఎవల్లను పలకరిచ్చినా ఎండ సంగతే. 18/05/14/ సాయంత్రం

by Raj Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lACiTL

Posted by Katta

Panasakarla Prakash కవిత

ము౦దుచూపు సముద్రపు కెరటాల మీద నిలబడి ని౦గిన౦దుకోవాలనుకోవడమే..... జీవిత‍౦. రెక్కలు చాచి సిద్ద౦గా ఉన్న మరణాన్ని గుర్తి౦చక‌ ఆశల ప్రేయసి కౌగిలి మాయలో చేరి నలిగిపోవడమే....స౦సార౦. దెబ్బతిన్న ప్రతిసారీ లేచి ఒ౦టిక౦టిన‌ దుమ్ము దులుపుకుని అమ్మని తలుచుకు౦టూ ము౦దుకు సాగిపోవడమే.. స౦స్కార౦. చీకటిలో౦చి వెలుతురువైపే తప్ప వెలుతురులో నీడై వె౦బడిస్తున్న చీకటిని గుర్తి౦చకపోవడమే... మనిషి అదృష్ట౦. కాలాన్ని వృధా చేసి చేసి ఆనక కాల‍‍‍౦లో కలిసిపోవడమే కాలధర్మ౦ చీకటిలో౦చి చుక్కలు మాయమైనట్టు ని౦గిలో౦చి ఎగురుతున్న పక్షులు మాయమైనట్టు ఒకరోజు మన౦కూడా.... చెప్పా పెట్టకు౦డా వెల్లిపోయాడని ని౦దలు వేయక౦డి.... చావు తెలియకపోవడ౦ ఆన౦ద౦ చెప్పకు౦డా తీసుకుపోతేనే చావు అ౦ద౦ ఈ రోజు పోయినవాడి చుట్టూ మూగి ఏడుస్తారె౦దుకు ఏదో ఒకరోజు మనమూ అలా పోవాల్సి౦దే..! పనసకర్ల 18/05/2014

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAz7f0

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //కవిత// అక్షరంతో మొదలుయినా నా ఈ ప్రయాణం ఎన్నో అంశాలను చేరుస్తూ,అందరి భావాల్ని వివరిస్తూ కొత్తవలని కలుపుకుంటూ,తప్పులని ఏత్తి చూపిస్తూ జీవితం ఒక్క గొప్పతనాని తెలియచేస్తూ,ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ చివరకి ఒక మరుపుని సూచిస్తూ చిన్న కవిత గా ముగిసింది 18may2014

by Venu Madhavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S6XFUg

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఇప్పుడిలా నేను... నేను చూశాను ! ఒక నిస్తేజమైన ఆలోచన మస్తిష్కంలో జనించినపుడు మనోకుడ్యాల్లో ఉత్ఫన్నమయ్యే వెలుగు రేఖలు మసకబారడాన్ని... నేను విన్నాను ! ఒక ఉత్తేజమైన పగటికల ఉవ్వెత్తున ఎగసినపుడు కంటి పొరల్లో అలికిడయ్యే నిశ్శబ్ధ కాంక్షల కోలాహలాన్ని... నేను స్పృశించాను ! ఒక సమ్మోహన వీచిక గంభీరంగా వాలినపుడు బాహ్యాంతరాల్లో భారమయ్యే నిభిడీకృత బహు భావాలని... ఇప్పుడు చూడటానికి ఏ దృశ్యం కనిపించడంలేదు మసక మబ్బులో మెరిసే మిణుగుర్లు తప్ప ! వినడానికి ఏ శబ్ధం కర్ణబేరిని తాడంలేదు గుండెలో అలజడయ్యే నిర్మానుష ఘోష తప్ప ! స్పృశించడానికి ఏ అణువూ మిగలడంలేదు శున్యమైన మనస్సాక్షితో శాస్విత కౌగిలి తప్ప ! 18-5-2014

by విష్వక్సేనుడు వినోద్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrQkds

Posted by Katta

Krishna Mani కవిత

ఉడుకు ______________కృష్ణ మణి ‘’ దక్కనులో దుక్కులు అయ్యా మీరు ఎత్తులో ఉన్నారు మీ పైన పారేనీరు కిందకు దిగుతుంది మీరు పదెకరాలు పారిస్తే కింద మూడొందల ఎకరాలు పారించోచ్చు ధాన్య ఉత్పత్తి కావాలి మీ చావులు అక్కరలేదు కేంద్రానికి ‘’ అని పలికిన మిత్రుడి చిత్రానికి ‘’మా చావులు మీకక్కరలేదు ధాన్య లాభం కేంద్రానికా లేక మీ కోటలకా ? కరెంటుతో నీటిని ఎత్తి ప్లోరైడ్ ను కడగొచ్చు గతిలేని కాడ మీకు కరెంటు నీళ్లాని కుంటి నవ్వులు ఇదే కదా దశాబ్దాలుగా మా వెతలు ఇదే కదా చావలేని తనాన దుబాయి నడకలు ఇదే కదా చచ్చి రగల్చిన బొగ్గుల కొలిమిలో పత్తి గింజలు ! మీరు మీరే మీది మీదే మాది మీదే ఆగని కన్నుల దారల వాగులో ఆటలాడే తుంటరులు మీ ఉద్యమం సరైనదే అంటారు మరి అంత ఉలుకెందుకు ? ఉడుకెందుకు ? పగిలింది మోసపు అద్దం పోయింది గ్రహచారం అయినా చింత చచ్చిన పులుపు చావని తనం ! మానవత్వం మరచిన మనసుల మంచి కోరే మిత్రులం పొందిన విజయానికి చిరుమందహాసాలు మీకు వికటాట్టహాసాలనిపిస్తే మా తప్పు కాదు అనగని మీ అహంకారానికి సూచకం ‘’! కృష్ణ మణి I18-05-2014 note : ఓ మిత్రుడి సంభాషణతో మనస్తాపానికి గురి అయి రాసిన చిన్న కవిత , అన్యదా భావించవద్దు

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRtEU

Posted by Katta

Pratapreddy Kasula కవిత

అమర కీర్తన సేతము రారండి - కాసుల ప్రతాపరెడ్డి అక్షరం పచ్చెలు పచ్చెలై వెక్కిరిస్తూ ఉంటది గాయాల మీద ఒక ముద్దు చాలు మెత్తని పెదవుల మీద తడిముద్దు అమృతం కన్నీళ్లను దోసిలి పట్టి తాగడం ఒక సాహసం పదాలు ఎదురు తిరిగి గుండె మీద తంతయి విషాదం గొంతు దాటి కడుపులకు జారుతది నన్ను నేను నిలువునా చీల్చుకుని మళ్లీ అతికించుకుంటా ఉపాయాలూ ఎత్తుగడలూ వ్యూహాలూ తిప్పికొట్టడాలు క్షణం తీరిక లేని జీవితాలు భూములను చాపల్లా చుట్టి ముడ్డికిందేసుకుంటారు గూడూ కట్టిన చీకట్ల గుడ్లు తేలేస్తం నోరు పెగలదు, చేతులాడవు వీరుడెంత సేపూ వీరుడే మృత్యువును వీలునామా చేసింతర్వాత అమరగానాన్ని ఆనవాయితీ చేసింతర్వాత మనం జీవించడానికి కాపాడుకోవడం ముఖ్యం కాకపోయింతర్వాత పాత చరిత్ర కట్టెదుట దయ్యంలా మళ్లీ మళ్లీ నిలబడుతది ప్రపంచాన్ని కోత పెడుతూ వుంటది జీనా యాహాఁ మర్‌నా యాహాఁ గూడు కట్టిన విషాదంలో సాలెగూళ్లు పెరుగుతుంటయి వలలు దేహాలనూ స్వప్నాలనూ గురి పెడతయి విత్తులు చల్లితే పంటచేలు పచ్చనిల్లవు కొసదేరిన కత్తులూ కటార్లు మొలుస్తయి పిట్టలు ఎగురుతూ ఎగురుతూ అకస్మాత్తుగా నెత్తురు కక్కి నేల రాలుతయి సౌడు నేలల మీద పచ్చగడ్డి ఎక్కడిది మంచి నేలంతా వాడెవడి గుప్పిట్లోకో పోతది తెలంగాణ ఒంటి మీద రాకాసి పుండు చురకత్తితో ఒక్కటే గెలుకుడు తొండి చేసి తప్పించుకునుడు తెలువది పోరాటం గంజితో పెట్టిన విద్య త్యాగాలతోటి చరిత్ర పుటలు పెంచుతుంటం అమరత్వ కీర్తన ఆచారమై గడ్డ కట్టి పోతది రాజు వెడలెర సభకు రవి తేజములలరగ భుజకీర్తులతోటి ఊరేగేవాళ్లు ఊరేగుతుంటరు నెత్తుటి చారలు అచ్చులు కడతయి గెలుపు ఆలోచన బుర్రల నుంచి చెరిపేస్తం పాడుకుంటూ పోవుడు తప్ప ఏదీ వద్దనుకుంటం శాపం పెట్టినవాడెవడో ఎంతకీ దొరకడు ఆకులు రాల్చడమే తప్ప చిగుళ్లు వేయడం నేర్వం మెడ మీద కత్తి పెట్టినా మాట్లాడుతం, పోట్లాడుతం, నేలకొరుగుతం చూడు చూడు మల్లన్న, చూడవోయి మల్లన్న ఎగురెగురు మల్లన్న, ఎగురవోయి ఎల్లన్న కాడి దించొద్దు, కన్ను మూయొద్దు అడవులనే కాదు, శిశిరాలనూ మోద్దాం

by Pratapreddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRtor

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

శ్రీమతి సింగిరెడ్డి శారదగారు డల్లాస్ లో TANTEX (telugu association of north texas)సాహిత్య కార్యక్రమాల కన్వీనరుగా పరిచయమయ్యారు.తొలి పరిచయభాషణ లోనే వారికి మావూరికి గల అవినాభావ సంబంధం గురించి తెలిసింది .ఆమె చిన్నతనాన ఎలగందుల బస్టాండులో వాళ్ల కోసం సిద్ధంగా ఉన్న సవారి కచ్చురం లో వాళ్ల అమ్మమ్మ గారి ఊరైన జవారి పేటకు పోయిన సంగతి గుర్తు తెచ్చుకుని మురిసి పొయ్యారు.ఆ వూరికి మాఖిల్లా ముందునుంచి వెనక్కు వెళ్లి మానేరు దాటి పోవాల్సి వచ్చేది.ఇప్పుడు వాగు పోయి మానేరు డ్యాం ఏర్పడ్డ తరువాత ఆ రాక పోకలన్నీ బంద్. వాగు గురించి రాయమన్న వారి అభ్యర్థన మేరకు ఆవేదన పొంగి అక్షరాల వాగు ప్రవహించింది. వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! గల గల పారేటి గంగమ్మ మానేరు జల జల జారేటి జాబిల్లి మానేరు ఒడ్లొరిసి పారేటి ఓదార్పు మానేరు వరిమళ్లు దడిపేటి వరలచ్మి మానేరు వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! యాసాడ గైనంటే యాదే లేక పాయె గన్నేర్వరం తొవ్వ గంగలగల్సి పాయె ఉరగాల్వ ఊసు ఉత్తదే ఐపాయె పెద్దకాల్వ సొగసు పేరుకే లేదాయె వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! వాగావలూళ్లన్ని వలసకేళ్లీ పాయె మిగిలిన ఊళ్లకు సుట్టు దిరుగుడాయె బండ్ల తొవ్వలు బాయె బస్టాండు కళవాయె పాత రోజులన్ని కలలోనే గనుడాయె వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! Vaadhoolasa 18/5/14

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3t7h9

Posted by Katta

Gubbala Srinivas కవిత

।। పాపం చెట్టు ।। ---------------------- ఒక చెట్టు మొలిచింది నేల తల్లిని క్షోభపెట్టి నిలువెత్తు వట వృక్షమై నిలిచి .. భూసారాన్ని పీల్చుకుని తన రక్తంలో కలుపుకుని వొంటినిండా మధుర ఫలాలను పండించి పేర్చుకుంది సువాసనలతో.. ఇంతలో అటుగా వచ్చాడు నారూ ,నీరూ పోయని వీరుడు రాళ్ళతో ఒక్కొక్క పండునీ నేల కూల్చాడు చెట్టుకి సరిహద్దులు గీసి.. కొమ్మలకు గాయాల్ని చేసి పోయాడు. పచ్చని ఆకుచీర కట్టినట్టు విరగబూసింది లక్షలాది ఆకులను కొందరు అటుగా వచ్చారు అవసరమో.. అనవసరమో .. కనికరం లేకుండా ఆకులన్నీ తెంచి కొమ్మలను మోడు చేసిపోయారు. గువ్వల గుంపు అటుగా పయనిస్తూ విడిది చేసాయి ,సేద తీరాయి ,ముచ్చట్లు చేసుకున్నాయి కానీ చెట్టు శాశ్వత నేస్తం కాదుకదా అందుకే పోతూపోతూ తమ వ్యర్ధాలతో పాడుచేసి ఎగిరిపోయాయి . భీకర తుఫానుగాలి వీచింది వేళ్ళు సైతం బయటికొచ్చేలా చిటారు కొమ్మలు నేలను తాకి మళ్ళీ పైకి లేస్తున్నాయి అయినా ఆ చెట్టుకు మరణం రాలేదు . ఓ దుర్మార్గుడు మళ్ళీ అటువైపుగా వచ్చాడు తన అవసరాన్ని.. వెంట తెచ్చుకున్న కత్తికి చెప్పాడు నిర్దాక్షణ్యంగా చెట్టుని నరికాడు వేళ్ళతో సహా పెకిలించాదు చివరికి నేల కూలింది ఆ చెట్టు (18-05-2014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jIzn8V

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ చుక్కలు @ చీకటి వెకువ ప్రేమ లెఖను రాసి౦ది అది చదువుదామనెమో సూర్యుడు పరుగెత్తుకుని వస్తున్నాడు చీకటి పడ్డ వాకిల్లన్ని ఎదురు చూస్తున్నయి దొసిట ని౦పుకుని చుక్కలన్ని౦టిని కుమ్మరి౦చమని తెల్లవారి ముగ్గుగా తెల్ల బడ్డ ఆకాశ౦ జారవిడిచిన ఆ చుక్కలన్ని౦టిని గీతల దారలతొ ముడి వెసి బ౦దీ చెసి ముగ్గులెస్తున్న ఆ ముని వేళ్ళకు వ౦దన౦. రాత్రి చలికి తట్టికోలేక భూదెవి చీకటి దుప్పటి కప్పుకు౦ది. ఆ దుప్పటికున్న చిల్లులే చుక్కలు. _ కొత్త అనిల్ కుమార్.

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p2uD33

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/ఏమైవు0టాడు .......................................... వీపుపై ఎక్కి0చుకొని మోకాళ్ళు కాయలు కాసినా ఆనందమిచ్చి. కడుపునొప్పంటే రేపు అద్దెకు ఇబ్బందని తెలిసి ఆఫిసొదిలొచ్చి. ప్రశ్నిస్తు0టే ఎదిగాడని ఆకాశంలా మెరిసి ,మేఘంలా కదిలిన చాతి. బడ్డీ కొట్టు దెగ్గర సిగరెట్ పొగల్లో కాలుతున్నప్పుడు ఏమై ఉ0టాడు....వీపును కడుపు స్థానంలో తెచ్చుకొని కొట్టుకొని ఉ0టాడా? బండిపై అమ్మాయిని ఎక్కి0చుకొని చక్కర్లు కొడుతున్నప్పుడు.... కడుపుని చీల్చుకొని ఇ0త మలినం నా కడుపులో ను0చి ఎలా పుట్టి0దని చూసుకొని ఉ0టాడా? తాగిన వాసన చూసిన్నప్పుడు పిడుగై రాలి ఉ0టాడా? ఏమైవు0టాడు ఆ తండ్రి. 18-05-2014

by Mothi Mohanarangafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S6na8d

Posted by Katta

Pranayraj Vangari కవితby Pranayraj Vangarifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fLVz0g

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

నగరం రోడ్ల మీద అడుగడుగునా అడ్డమొచ్చే గుళ్ళు దండం పెట్టబోయి బండొదిలేసి బొక్కబోర్లా పడ్డ వీరభక్తుడు గబుక్కున వెళ్ళి చెందిస్తే చెయ్యందుకోడు గురుడు టప టపా చెంపలేసుకుంటాడు వారేవా ఏమి భక్తి???

by సత్యవతి కొండవీటిfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDiMLy

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-12/ Dt. 18-5-2014 సొంత గొప్పలు మెప్పుకోసం ఎప్పుడూ వినిపించకు భావమివ్వని ఉత్త కవితలనెప్పుడూ వినిపించకు కసిని హృదిలో కుమ్మరించి మసిని మదిలో రంగరించి మొసలి లాగా కంట నీటిని ఎప్పుడూ కురిపించకు ఎదనుమీటగ చేర పిలిచినా రాగసుధలను పంచమన్నా నాదమివ్వని వీణ తీగల నెప్పుడూ సవరించకు శిధిల ఊహల జీవితాన రుధిర జ్యోతుల వెలుగులోన పెదవిపైన విషపు నవ్వుతో ఎప్పుడూ నటియించకు వింతలోకపు తీరు కల్ల అంతరాత్మయే నిజము "చల్లా" చింతలెన్నో ముసురుకున్నా ఎప్పుడూ విలపించకు

by Rambabu Challafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDbirQ

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఒక మార్పు Posted on: Sat 17 May 23:05:57.862856 2014 అంబరం ఆవలి పరిథుల పూల పరుపుల పైన నగ ఊహాంగనలకు గాఢ పరిష్వంగనలో ఊపిరి సలపకుండా గట్టిగా గుండెలోకి లాక్కెళ్లిన మధురానుభూతులతో తెల్లబడిన కవితలు! చిరిగిన జేబు కింద గుండెలో అగ్ని జ్వాలలకు కళ్ల బాయిలర్లలో నీళ్లినికి సూర్య గోళాల్లా అయిన కళ్లను చుట్టేసి వ్యధలతో ఎర్రబడిన కవితలు! తెల్లబడ్డా, ఎర్రబడ్డా... కవితలు, మనిషి మనసు లోలోపలి లోతైన ఆలోచనల పిరమిడ్లు అయితే అప్పటిలా కవిత కన్య కాదిప్పుడు శత్రువు గుండెలు చీల్చే... ప్రజల చేతిలోని పదునైన ఆయుధం! - డా|| దేవరాజు మహారాజు http://ift.tt/1j9M554

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j9M554

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ ....................... || శూన్యంలో నేను || ======================================= ఆకాశంలో తుర్రు పిట్టలు గుంపులు, గుంపులుగా ఎగిరిపోతున్నాయి నా చూపులు మాత్రం శూన్యం గానే మిగిలిపోతున్నాయి ఎర్రటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి పక్షులు అలసి గూటికి చేరుకుంటున్నాయి నేను మాత్రం గంజి కోసం ఇంకా చూస్తూనే ఉన్నాను ప్రేగులు శబ్దాలు చేస్తున్నాయి ఆకలి మంటతో.. వీధి చివరన గుడ్లగూబ వెకిలిగా అరుస్తోంది తీతువు పిట్ట రెక్కల చప్పుళ్ళతో రెక్కీ నిర్వహిస్తుంది గబ్బిలం గంపెడాశ తో అటూ -ఇటూ తిరుగుతుంది నేను మెతుకుల కోసం శూన్యంలోకి చూస్తూనే ఉన్నాను చీకటి చిత్రంగా తనవైపు రమ్మని కవ్విస్తుంది మచ్చలచందమామ పైనుండి వెక్కిరిస్తోంది అప్పుడప్పుడు మబ్బులు కప్పుకుంటు కనపడకుండా పోతుంది అప్పుడే అక్కడక్కడా వీధి కుక్కలు ఏడుస్తున్నాయి నా దేహం మాత్రం ఇంకా శోదిస్తోంది నైనాలు పెద్దవి చేస్తూ- ప్రకృతి ఆనవాళ్ళు మాత్రం భయ పెడుతున్నాయి తర తరాలుగా మారని దోపిడీ నర నరాలును పిండేస్తుంది జన్మ వృత్తాతంలో ఎన్నో మజిలీలు నీడలా వెంటాడుతున్నాయి ఆకలి తీరని కడుపులు పేగులు మడిచి డొక్కలో మోకాళ్ళు ముడుచుకుని ఆకలి తీర్చు కుంటున్నాయి ఎన్నో రాత్రులు కళ్ళముందు ఒంటరిగా వెళ్ళిపోతున్నాయి నేను మాత్రం పగలూ ... రాత్రి ... శూన్యాన్నే చూస్తున్నాను ఇప్పుడే కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి ------------------------------------------------- మే 18/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHhJI8

Posted by Katta

Rakshita Suma కవిత

రక్షిత సుమ || ఒక్క సమిధ వెలిగినా చాలు || ధైర్యం ఆరిపోతేనే పిరికితనం చీకటి ఆవరిస్తుంది. నమ్మకం చిగుర్లు రాకపోతేనే అశాంతి మోడుగా నిలబడుతుంది. పగలు పలకరించకపోతేనే రాత్రి పరిచయంలోకొస్తుంది. వేడంటూ జ్వలించకపోతేనే చల్లదనం రాజ్యమేలుతుంది. ఎంతటి అంధకార మధాంద చక్రవర్తివైనా ఓ గుడ్డి వెలుతురినైనా తరిమేయగల చిన్న చీకటి దీపం వెలిగించు చూద్దాం...? శబ్ధపు ప్రకంపనలేవీ లేకుంటేనే నిశ్శబ్ధానికి నెలవుంటుంది నీవెంత పీకల్ని నొక్కేయగల ఉక్కుపాదపు అధికారివైనా ఒక్క గుసగుసను చిద్రం చేసే నిశ్శబ్ధాన్ని తరంగంలా పుట్టించు చూద్దాం.... చేపకు జీవంలేనప్పుడే ప్రవాహం ఈడ్చుకుపోతుంది మనిషికి ఆశ శ్వాసగా లేనప్పుడే చీకటి గుహలు మింగేస్తుంటాయి.... ( నా కవిత్వానికి ధైర్యం చెపుతూ, సహృదయంతో కవిసంగమం వేదిక పై నా కవితలను వినిపించే అవకాశం కల్పించిన అందరికీ పేరుపేరునా నమస్సులు తెలియజేసుకుంటున్నాను.)

by Rakshita Sumafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gUwW37

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

చందమామ వెన్నెల్ని ఎందుకు వెదజల్లుతుందంటే ఆహ్లాదాన్ని మనకు పంచడానికి అనురాగాల్ని మొలిపించడానికి

by Chandrasekhar Sgdfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gUwVwi

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

మహానేత పీడితప్రజల ప్రియతమ నాయకుడు పుచ్చల పల్లి సుందరయ్య గారికి ,ఆటవెలది పద్యాలతో అక్షర నివాళి...............కన్నెగంటి వెంకటయ్య ..9885657582 .ఖమ్మం. 1 దళిత జనుల యెడల అలగాని పాడులో దమన నీతి చూసి తల్లడిల్లి దళిత సోదరులకు ధైర్యమై నిలిచిన సుందరయ్య నీకు వందనాలు 2 కరువు కాటకాలు కబళించు సమయాన అలమటించు జనుల ఆర్తి దీర్చ గంజి కేంద్రమెట్టి కన్నీళ్ళు తుడిచిన సుందరయ్య నీకు వందనాలు 3 సాయుధతెలగాణ సమరాన్ని నడిపించి సైకిలెక్కి చట్ట సభల కేగి కమ్యునిజపు జెండ కడదాక మోసిన సుందరయ్య నీకు వందనాలు 4 కులపు కూకటేళ్ళు కూలదోసినపుడే వర్గ రహితమైన స్వర్గ సీమ సమ సమాజమిచట సాధ్యమన్నావయ్య సుందరయ్య నీకు వందనాలు 5 సామ్య వాదరాజ్య సౌరభాలను పంచు విప్లవాల పూలు వెల్లివిరియ మానవత్వపు సిరి మల్లెల్ని నాటిన సుందరయ్య నీకు వందనాలు

by Kanneganti Venkatiahfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oCKKa6

Posted by Katta

Sriramoju Haragopal కవిత

పచ్చటిచెట్టు మీద ఊరపిచ్చుకల సభ వెచ్చ వెచ్చని ఆత్మీయతల ముచ్చట్లు నారుమడిలో తడులద్దుకున్న గింజల్లెక్క మొలకబోసిన కవితల్ని అలుకుచల్లినట్ల మాటలకలనేతలు మమతల సత్కారాలు పచ్చటిచెట్టు మీద ఊరపిచ్చుకల సభ ప్రపంచంమీద వెలుగుజెండాలు పాతాలని మనుష్యుల మధ్య మానవీయత పంచాలని ఈ లోకాన్ని ఎంత అందంగా అలంకరించాలని పదం పదం ఇష్టపదమై అందరినోటికందాలని పచ్చటిచెట్టు మీద ఊరపిచ్చుకల సభ కొత్తగా చెరువు నిండుతున్న నీళ్ళు ఎన్ని రుచులతో, ఎన్ని రంగులతో తేటపడి అలుగుదుంకినపుడు ఎంతందం ఈ కొలను కోట్ల కవితల కాసారం కానీ ఇక్కడి చేరిన ప్రతి కవి ప్రజలమనో పద్మమై విరబూయనీ పచ్చటి తటాకంలో కవుల కలయికల కలువలు నిండనీ రాసినవన్నీ మనుషుల మనసులలోనివేగా రాసినవన్నీ మనుషులకోసమేగా రాసినవన్నీ రేపటి ప్రపంచానికి ఉదయతోరణాలేగా రానీ రానీ మరిన్ని మంచి మట్టిపిట్టలు సభకు

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyJJuV

Posted by Katta

Kapila Ramkumar కవిత

సాహితీ సీమలో అక్షర 'సేద్యగాడు'కొండ్రెడ్డి 13:40 - May 11, 2014 -22:23 మనిషి జీవన మూలధాతువై మనుగడ సాగిస్తున్న పల్లెపై ప్రాణాంతక పక్షేదో వాలింది పట్టణ సంస్కృతుల రెట్టలతో నాపల్లె స్వరూపాన్నే మార్చి కూలితల్లిని చేసింది నేలతల్లి చనుబాల సస్యానికి కాలం చెల్లినట్లుంది బేతాళ మాంత్రికులు నేతలై కూర్చుంటే ఇప్పుడు నేలరాలేది బడుగురైతు తలపాగా కాదు భరతమాత తిలకం అంటూ బలమైన అభివ్యక్తితో రైతు ఇతివృత్తంగా 'దుక్కిచూపు' లాంటి అద్భుత కావ్యాన్ని తెలుగు సాహిత్యానికందించిన అభ్యుదయ కవి, సాహితీ విమర్శకులు, సమీక్షకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. అభ్యుదయ హృదయంగా, సమసమాజమే ధ్యేయంగా, మార్క్సిజమే మార్గంగా, నీతి, నిజాయితీ, నిర్భీతే జీవితంగా, కవిత్వమే ఊపిరిగా జీవిస్తున్న సాహితీమూర్తి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. అక్షరాల్లో అగ్గిరవ్వలు విరజిమ్ముతూ.. అభ్యుదయ భావాల లావాలను వెదజల్లుతూ.. గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో సంచలన రచయితగా, కవిగా, విమర్శకునిగా వెలుగొందుతున్న కొండ్రెడ్డి 1944 డిసెంబర్ 12న ప్రశాశం జిల్లా బుద్ధిరెడ్డి పల్లెలో జన్మించారు. తల్లికోటమ్మ, తండ్రి సుబ్బారెడ్డి. కొండ్రెడ్డి ఎన్నో పుస్తకాలు రాశారు. అందులో 'మట్టితడి బంధాల్లో' 'అంకుర స్పర్శ', 'దుక్కిచూపు', 'ఆకాశమంత చూపు' లాంటి కవితా సంపుటాలతోపాటు 'సంస్పర్శ', 'ఆలోకనం' లాంటి సాహితీవిమర్శలు, సమీక్షలు, 'చిగిరింతలు', నానీలు, 'విలక్షణనేత్రం' లాంటి పద్య కావ్యాలు రాశారు. సమర్థుడైన సృజనకారుడు ఏప్రక్రియలోనైనా రాణించగలడని ఆయన చెప్పడమేగాక నిరూపించాడు. కొండ్రెడ్డి సాహితీ కృషికి గాను ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2007లో విష్ణుబొట్ల ఫౌండేషన్ అవార్డు, 2008లో 'ఆటా' అవార్డు, అవంత్స సోమసుందర్ లిటరరీ అవార్డు, రాజరాజేశ్వరి అవార్డు, రమ్యసాహితీ సమితి తదితర సాహితీ సంస్థల అవార్డులెన్నో అందుకున్నారు. ఈ కవికావ్యాలపై మద్రాస్, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసి ఎంఫిల్, పిహెచ్ డి పట్టాలు కూడా పొందారు. విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 70 ఏళ్ల వయసులోనూ నిరంతర సాహితీ అధ్యయనం, అక్షర సేద్యం చేస్తున్నారు. కొండ్రెడ్డి సమాజవాద మార్గానుయాయి. కట్టమంచి వారసుడు. ఆయన సాహిత్య విమర్శలోనూ ఆ లక్షణం కనిపిస్తుంది. వర్తమాన సాహిత్య విమర్శనారంగంలో అనేక సందర్భాలలో ధైర్యంగా మాట్లాడుతున్న విమర్శకుడు అంటూ ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి కొండ్రెడ్డికి కితాబిచ్చారు. http://ift.tt/1lyJJuJ

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyJJuJ

Posted by Katta

Balu Vakadani కవిత

కవిసంగమం సీరీస్-15 2014-05-17

by Balu Vakadanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j9gbFM

Posted by Katta

Rajender Kalluri కవిత

## స్నేహం ## అవసరాలకోసం మాటలు కలుపుతున్నాం కాని ఆ మాటల ప్రవాహమే దాచిన అవసరాన్ని బయటపెడుతుందన్ననిజాన్ని మర్చిపోతున్నాం కర్చెంతా అని ఆలోచించేవాడు స్నేహితుడు కాదు కర్చు చేసిన వాడే స్నేహితడు అన్న సిద్ధాంతం లేదు అడుగడుగునా ఆశించేవాడు, అవసరమెంతా అని అనుకునే వాడు అవ్వగలడా నీ మిత్రుడు ఏ స్నేహం ఎంత దురం ప్రయానిస్తుందో ఎవరికీ తెలిదు అలాంటి స్నేహం లో కర్చెంత , రాబడి ఎంతా అనే వ్యాపారపు లెక్కల్ని జోడించకండి చేసే స్నేహం లో కొలతలు , ప్రమానాలుండవ్ కేవలం వ్యాపారం లో తప్ప !! kAlluRi [ 18-05-2014 ]

by Rajender Kallurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mGOqpd

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

చిన్నారులతో దోబూచులాడే రంగుల నేస్తాలు సీతాకోకచిలుకలు పూల పొదరిల్లలో విహరించి పయనించే బాటసారులు ఆకాశాల రహస్యాల్ని భూమికి కొనితెచ్చే రాయబారులు పగటి వేళ పూలపై వాలిపోయే మిణుగు తారలు పరవశించి ప్రాణశక్తితో పరుగులు తీసే మల్లెలు మందారాలు పక్రుతి కనురెప్పల్లో దాచుకొ స్వప్నాలు

by ఉమిత్ కిరణ్ ముదిగొండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5UCK7

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lOyobP

Posted by Katta

Saipramod Jayanth కవిత

JAyanth

by Saipramod Jayanthfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TgxE5Q

Posted by Katta

Saipramod Jayanth కవిత

http://ift.tt/TgxGdW

by Saipramod Jayanthfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TgxGdW

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ || ఒక అనుభవం ................................... ఉన్నట్టుండి లోపలేదో కదలిక ఒక స్వరమేదో మళ్ళీ రాగాన్ని అందుకుంటుంది భావమేదో తెరలా పరుచుకుంటుంది పచ్చనికాంతి కళ్ళముందు తడిచిన పూల పరిమళం గాల్లోంచి వీచిన స్పర్శ ఉన్నట్టుండి సన్నని ప్రేమతుంపర ఎటుచూసినా మాటలు మాటలకందని రహస్యాల కదలిక లిపికి ఒదగని ప్రాణవంతమైన నిశ్శబ్దం జరజరపాకే అంతరంగం ; మిలమిల మెరిసే కళ్ళు ; లోపలి కదలిక విశేషం # *పాతవాచకం : సరిహద్దురేఖ : 1997

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lOyrnK

Posted by Katta

Sasi Bala కవిత

పవిత్రత ..........శశిబాల ---------------------------------- ప్రత్యూష కాలం లో భూపాల రాగం లా మనసుని తట్టి లేపేది ఆప్యాయత దీనికి ఎన్నెన్ని పేర్లో ......... మనసు మనసు కలుపుకొని .... మాటా మాటా కలుపుకొని .... ఎద నిర్మలంగా ... పరమ పవిత్రం గా సాగె ప్రేమలు....అదే అభిమానాలు ...ఆప్యాయతలు .. కళ్ళున్న గుడ్డి మనుషులకు అర్థం కావు అంతే మరి ...మనం ఏ దృష్టి తొ వుంటే అదే మనకు ఇతరులలో కనబడుతుంది ప్రతి మనిషి ..ఎదుటి మనిషిని విమర్శించే ముందు ముందుగా తనను తాను ప్రశ్నించుకోవాలి ఎందుకు ....అని .ఆ ప్రశ్నకు బదులుంటే ఇక ఏ ప్రశ్నలూ రావు యుక్త వయసులో వచ్చే ప్రేమ పొంగే పాల వంటిది కోరిక తీరగానే అణగారిపోతుంది వైఫల్యాలకు దారి తీస్తుంది కాని పరిణతి చెందిన ప్రేమలో ...స్వచ్చత వుంతుంది ...ధర్మం వుంటుంది అలా కానిది ప్రేమే కాదు వుదయకాలాన విరిసిన పుష్పాల పరిమళాల తాజాదనం తొ కలిసినది స్వచ్చమైన ప్రేమ నాకై నీవు నీకై నేను ..అనిపించేది ప్రేమ పచ్చటి ప్రకృతి పై చిలికిన మంచు పుష్పాల వలె కల్మషం అంటనిది ప్రేమ ఈ ప్రేమకు ఎవరు పేరు పెట్టినా అది వారి మనో భావాన్ని ప్రతిఫలిస్తుంది 18 MAY 14

by Sasi Balafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sFMBIZ

Posted by Katta

Srikanth Kantekar కవిత

ష్..! నిజంగానే అనిపిస్తుందెందుకో! ఏంటో ఈ జీవితమని!! కరుకుచూపులేవో తాకినప్పుడు గాలికి వణికిన చిగురాకులా.. అప్పుడప్పుడు అనిపించినా తప్పేమీ కాదేమో! పిడికెడు రాళ్లకు పెట్టుకున్న తాకట్టు జీవితాలకు పొడుచుకొచ్చే కోపాల విలువేందని?! ఉన్నదున్నట్టు ఈడ్చుకెళ్లడమో గుంజుకెళ్లడమో బడిలోనో, గుడిలోనో బోధించని ఒక విద్య అని..! గుడ్ల నీళ్లు గుడ్లలోనే దిగమింగుకుపోవాలి.. ష్..! తిట్లు పొరలిరాకూడని నిశ్శబ్ద క్షేత్రమిది!! షట్! అంత కాల్పనికం.. బూటకం! బతుకులకు, మెతుకు తలరాతలకు లింకు లేదు.. అక్షరాలను తవ్వింది చాలు.. వెళ్లి పనిచూస్కోండి ఎవడన్నా రాసుకున్న ఊహల్లో చీకటి తొవ్వలెవన్నా ఉంటే వెతుక్కోండి!

by Srikanth Kantekarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHviSq

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || అమృతమూర్తిని చూస్తున్నాను .... నీలో || రేకులు రాలి దుమ్ముకొట్టుకుపోయి అవనతనైన గులాబీని లా నేను సంరక్షణ లేని తోట లో కొన ఊపిరితో మరి కొద్ది క్షణాల్లో ప్రాణం కోల్పోబోతున్నవాడిలా .... నా కళ్ళలోంచి ఉండుండి జారుతూ .... ఒక్కొక్క రక్తం బొట్టు, నేను ఒక పగిలిన హృదయపు అవశేషాన్ని, ఒక ఒంటరి ఆవేదనను. నాకు వరమిస్తానికే దిగి వచ్చిన అమృతమూర్తివి లా ఏ రంగుహంగుల్లేని రెక్కల దేవత, స్వేచ్చా సంచారిణివి లా ఏ దివి నుంచో వచ్చి .... నీవు, పెళుసై పగిలిన నా హృదయాన్ని స్పర్శించేందుకు, గమనించేందుకు నాకు గుర్తులేని పసితనం మది పొరల్లో శిధిలమైన నా జ్ఞాపకాల ను మరీ అంత సమీపం లోకి వస్తావనుకోలేదు. నా సమశ్యల సెగ ఆ వేడి, ఆ బాధల అనుభూతి తగిలినట్లుంది. గుంటలు పడి ప్రాణం కోల్పోతున్న కళ్ళ లోకి చూసి ఆవిరైపోయిన కన్నీటి పగుళ్ళ ఎర్ర జీరలు రాలని రక్తాశృవుల చారలను .... తుడిచే సాహసం ప్రయత్నం చేసావు ఆ దివి దిగి వచ్చిన దేవతవనుకోను .... అమృతమూర్తి అమ్మవే అనుకుంటాను నా నుదిటి పై ఒక సున్నితమైన ముద్దును ఇచ్చావు చూడు వరంగా .... అప్పుడు క్యాన్సర్ పుండ్లుగా మారిన నా అంతర్గత గాయాలు ఆ క్షణం లో నే మానినట్లై తిరిగి ఏదో నూతన ప్రకాశం, ఒక నూతన చైతన్యం కొత్త అనుభూతులకు స్థానం ఏర్పడి .... వింత వెలుగులు నా కళ్ళలో 18MAY2014

by Chandrasekhar Vemulapallyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S5jPWY

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

రాతిరేల రోడ్డుపక్క రాజాల కూసుంటే రమ్మేసిన పోలీసోను ఈలేసి ఇటు రమ్మనె.. ఎందుకనో పిలిసిండు దొరని దిగాలుగ దరికి పోతె దబాయించి దరినున్న దుడ్డుకాస్త లాక్కపాయె.. చేసెడిదిలేక చేతులూపుకు చేరిన నా రూములోకి నాయెనకే నక్కిన నా దోమబిడ్డల ఓదార్చిన ఆలౌటును రేపు కొనిస్తనని.. నిదర అన్న పోదమంటె కునుకన్న రాదాయె కల్లల్లొ నీల్లు తప్ప కలల్లేవు గిలల్లేవు.. గుండెపైన నిదరోయిన నాదాని సూడలెగాని పక్క పక్కల పండిన పోరగాడి పంతులమ్మ యాదొచ్చె.. అసలె గయ్యాలి.. రేపు నా సంటోడ్ని ఎస్కూల్ల కూస్సోనియ్యకుంటే ఏం సెయ్యాలె.. నా కైతే సమజైతలే.. పగలంతా పక్కకేసిన పైకమంతా పోలీసోడు పీక్కపాయె.. ఇంటితాన ఎదురుసూసిన ఇల్లాలికి గసిన్ని పూలైనా తేకపాయె.. గా దేముడు గూడకా యా ఉన్నోళ్ళ గులామనుకుంట ఆల్లేమడిగితె అదిస్తుండు... నేనడక్కుందగనే ఇన్ని కట్టాలిచ్చిండు.. ఎవనితోని సెప్పుకోను, ఎవనితోని మొత్తుకోను.. పొద్దు పొడిచి ఊరంతా ఇంటిలంగ పడతంటే కట్టుకున్న దాని ఏడుపు నే ఇనలేను.. నా కడుపున పుట్టినోడి కన్నీటిని సూడలేను.. ఇక సూదలేని ఈ కల్లకు ఈ లోకంల పనిలేదు.. అందుకే మూస్తన్నా.. కన్ను మూస్తన్నా.. - సత్యం జి, 18-05-2014, 01:29

by Gaddamanugu Venkata Satyanarayana Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpLZHR

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

యశస్వి, వర్చస్వి గార్లతో ఓ సాహిత్య తపస్వి ( ;) తపస్వి అంటే ఎవరో అనుకునేరూ.. అది నేనే.. :) ) - సత్యం జి

by Gaddamanugu Venkata Satyanarayana Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t2yEXJ

Posted by Katta

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // గాయం నా గేయం // నీరు నింగి నేల గాలి నిప్పు.. పంచభూతాల సాక్షిగా అందరం కలిసి మెలిసి ఆ అనాగరికపు అడివిలో అనేక వృత్తులుగా నాగలికి మట్టికి తోడై మట్టికుండలో మెతుకులమై అందరమూ ఒకటే అయి ఒకే గుంపుగా ట్రైబల్ నృత్యాలు ఆటవిక సాంప్రదాయాల్లో నడయాడి కొద్ది కొద్దిగా ఉచ్చులుగా బిగుసుకున్న అన్ని అధికార బంధనాలు, పెద్దరికపు పోకడల సంకెలలు తెంచుకొని ఒకరికి ఒకరం ఆసరా అయి అందరం ఒకటిగా అయి శ్రమైక జీవనం సాగిస్తుండగా ఎక్కడి నుండి వచ్చారో కానీ ఆ దుర్మార్గులు ఈర్ష్య ,ద్వేషం,పగ,ప్రతీకారం అనే అగ్ని కీలలై స్త్రీ పురుష లింగ వివక్షల లో అణగారిన మహిళా జీవితం పై గొంతెత్తిన మానవిల మధ్య మానవత్వం మంట గలుపుతున్న మనిషికి మంచితనపు కొత్త తొడుగులు వేస్తున్న కవి పుంగవుల మధ్య .. ఒకరి దారిని ఒకరు గౌరవించుకోలేని వారిగా మార్చి వెక్కిరింతలు ఎకసెక్కాలు మంటలు రేపి .. మెదడున్న మనిషి అనుసరించే ధర్మాల మధ్య, సర్వ వ్యత్యాసాల దుమారాలు లేపి ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టి ,, విశ్వ ప్రేమికుడనుకున్న కవి తనను తానూ కోల్పోతూ ఉంటే, నువ్వేమో ... అధిక వర్గం చేసిన తీర్పును అభద్రతగా మార్చుకొని మెజారిటీ ప్రజల్ని నీకు నాకు ఇంకొకరికి కాని వారిగా భావించుకొని .... ఒక 'సిస్టర్' గా మొహం చినబుచ్చుకొని ఒక 'భాయి' అవమానంగా తలవంచుకొని ఎందుకో మనసు కష్ట పెట్టుకుంటుంటే.. కేవలం శ్రోతనైన నేను,,మనిషిని మనిషిలా ..నిల బెట్టి వారిని ఓదార్చను లేక స్వంత వారిపై గెలుపును ఆస్వాదించే కొందరు అల్ప సంతోషులకు పూర్తి మద్దతు తెలుపను లేక అందరం ఒక్కటేనని జీవునికి పరమాత్మ ఒకడే నని ఆస్తికునికి... చూసేదంతా సూన్యమని నాస్తికునికి తెలిసిన కానీ, ఇంకను అరమరికలు లేని మానవునిగా నిలబెట్టి బట్ట కట్టించే నాథుడు లేక... ఎవరికీ వారు గిరి గీసుకున్న, మెదడు గడ్డకట్టిన రోగులై "బావిలోని కప్పల్లా " బెక బెక మంటూ, ఎన్నాళ్ళు? నిజమే...తర తరాలుగా విజ్ఞ్యత మరచిన చోటల్లా హింసా ప్రతీకార జ్వాలలు రగులుతేనే ఉన్నాయి.. చరిత్ర మొత్తం రక్తం ఏరులై పారుతూ ఎక్కడో ఒక చోట "గాయం" చేస్తూనే ఉంది .. దానికే మనం మనసులుగా విడిపోయి .. క్షణ కాలం కోసం పుట్టిన మన ఇంటిలోనే అగదాలు తవ్వుకోవడం ఎందుకు? మనం మన సమ సమాజ నిర్మాణానికి పాటుపడుదాము .. వివక్ష జరిగిన చోట నిగ్గదీసి అడుగుదాము,పరిపాలన సజావుగా సాగేలా అందరం కాపు కాద్దాం.. రాబోవు మానవత్వ పరిమళాల వెలుగులకై పరితపిద్దాం సంకుచిత మనస్కుడవుతున్న మేధావి వర్గం మనసు మారి,వారు అందించే ఆసరా కోసం వేచి చూస్తూ ..... ఈ దేశం నీది నాది మరెవ్వరిదో కాదు మనందరిదని జై భారత్ అని ప్రపంచానికి చాటుదాం !!! (18/05/2014)

by Jaya Reddy Bodafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S4wl9f

Posted by Katta

Katta Srinivas కవితby Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpz8W4

Posted by Katta